Tuesday, 6 January 2026
అన్నదమ్ములు
ధవళగిరి రాజ్యంలో చక్రధారి అనే వైద్యుడుండే వాడు. సరైన వైద్యశాలలు లేని ఆ రాజ్యంలో ఆయనకు చుట్టుప్రక్కల మంచి పేరుంది. పేదే ప్రజానీకానికి ఆయన చేసే సేవ అమూల్యమైనది. అత్యాశ లేకుండా తన ఖర్చులకు సరిపడ్డ ధనం మాత్రమే ఆశించే ఆయన ఆస్తి పది ఆవులు మాత్రం. అవే ఆయనకు జీవనోపాధినిచ్చేవి.చక్రధారికి నరేంద్రుడు, జయచంద్రుడు అనే కుమారులున్నారు. వారు బ్రహ్మర్షి అనే సర్వవిద్యా సంపన్నుడైన గురువువద్ద చిత్రలేఖనం, సంగీతం రాజవిద్యలు అభ్యసిస్తున్నారు.
ధవళగిరిని ధవళేంద్రుడు పాలిస్తుండేవాడు.ఆయనకు స్వార్థమే తప్ప ప్రజల గోడుపట్టదు. రాజ్యంలో సరైన ప్రజా సౌకర్యాలు లేవు కానీ అధిక పన్ను మాలు చేసి ప్రజలను కష్టపెట్టేవాడాయన.ఓ నా రాజభటులు పన్నుల వసూళ్లకు చక్రధారి దగ్గరకు వెళ్ళారు. పది ఆవులకుగానూ సంవత్సరానికి రెండు ఆవులను పన్నుగా చెల్లించాలన్నారు. ఇంకా ఇంటి పన్ను, వృత్తి పన్ను, సంతానం పన్ను అంటూ ఏవేవో లెక్కలు చెప్పారు. అంత డబ్బు తనవద్ద లేదని. చక్రధారి అంటే ఉన్న ఆవులను తోలుకునిపోతామన్నారు. ఆయన అడ్డుకున్నాడని దురుసుగా త్రోశారు.
చక్రధారి తల స్తంభానికి గుద్దుకుని బలమైన దెబ్బ తగలటంతో అక్కడికక్కడే మరణించాడు. రాజ భటులుకిమ్మనకుండా వెళ్ళిపోయారు. విషయం తెలిసి నరేంద్రుడు, జయచంద్రుడు వచ్చి, తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు.తండ్రి మరణం కుమారులను కృంగదీసింది. సరేంద్రుడు, "ప్రజాద్రోహియైన ధవళేంద్రుడిని హతమారుస్తాను" అంటూ ఆవేశంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అన్నను ఆపటానికి జయచంద్రుడు చేసిన ప్రయత్నం వృథా అయింది.జయచంద్రుడు తిరిగి బ్రహ్మర్షి ఆశ్రయానికి వెళ్ళాడు. అక్కడ ఆరు మాసాలపాటు వుండి తన విద్యలకు తుదిమెరుగులు దిద్దుకుని తనంతటివాడు లేడని గుర్తింపు పొందాడు.
ధవళేంద్రుడికి దివ్యప్రియ అనే కుమార్తె ఉంది. ఆమె అద్భుత సౌందర్యరాసి, తల్లిలేని ఆమెను ప్రాణంతో సమంగా పెంచాడు ధవళేంద్రుడు. రాకుమారికి చిత్రలేఖనం, సంగీతం అంటే ప్రాణం. కూతురు అభీష్టం మేరకు రాజు ప్రతి సంవత్సరం చిత్ర లేఖనం, సంగీతంతోపాటు విలు విద్య పోటీలు కూడా ఏర్పాటు చేసి, గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చేవాడు. ప్రతి సంవత్సరంలాగే ఆ యేడు కూడా పోటీలు ఏర్పాటు చేస్తూ రాజ్యమంతటా చాటింపు వేయించాడు.జయచంద్రుడు గురువు ఆశీస్సులు తీసుకుని పోటీలలో పాల్గొనటానికి రాజధానికి బయలుదేరాడు.
ఓ రోజంతా ప్రయాణంచేసి అర్ధరాత్రివేళకు నగరం పాలిమేరల్లోకి చేరుకున్నాడు. అప్పటికి బాగా అలిసి పోయిడేమో బాటకు ఎడమవైపున కొద్దిదూరంలో ఓ ఆలయం కనిపిస్తే అందులో ఆ రాత్రికి తల దాచుకుని, ఉదయం వెళ్ళవచ్చుననుకుని అటుగానడిచాడు. పాడుబడిన ఆ ఆలయ ప్రాంగణం లో అడుగిడగానే అతడికి లోపల నుండి మాటలు వినిపించాయి. అవేమిటో వినాలనుకుని చటుక్కున గోడవారగా ఓ మూల నక్కాడు జయచంద్రుడు.మాటలను బట్టి వారిలో ఒకడు పొరుగుదేశం గూఢచారియనీ, రెండోవాడు తన అన్న నరేంద్రుడనీ అతడికి అర్ధమయింది.
ధవళగిరికి పొరుగున విజయగిరి అనే దేశ ముంది. ఆ దేశపు రాజుతో నరేంద్రుడు చేతులు కలిపాడు. అతడి పథకం ప్రకారం ఓ వీణను తయారుచేయించి గూఢచారి ద్వారా పంపాడు విజయగిరి రాజు. ఆ వీణలో బొటనవ్రేలు పరిమాణంలో రెండు విషవు బాజాలు, ఎవరికీ అనుమానంగాని విధంగా అమర్చబడి ఉన్నాయి. సరేంద్రుడు సంగీతం పోటీలలో పాల్గొంటారు. వీణ వాయిస్తూ గురిచూసి ఓ మీటను నొక్కగానే బాణాలు కంటికి అందని వేగంతో ధవళేంద్రుడి శరీరణలోకి దూసుకెళ్తాయి. రాజు మరణించి, రాజ్యం అల్లకల్లోలమై, సైనికులు, అధికారులు అజాగ్రత్తగా వున్న ఆ సమయంలో విజయగిరి సైన్యం మెరుపుదాడిచేసి రాజ్యాన్ని ఆక్రమిస్తుంది. విజయగిరి రాజు ప్రతినిధిగా ధవళగిరికి సరేంద్రుడు రాజవుతాడు.ఆ మాటల ద్వారా జయచంద్రుడికి ఈ పథకం పూర్తిగా అర్థమయింది. అతడు మెల్లిగా అక్కడ నుండి తప్పుకుని అగకుండా వెంటనే నగరంలోకి వెళ్ళాడు. రాజును కలుసుకుని తన విన్నది చెప్పి హెచ్చరించాడు. రాజు వెంటనే నగరం చుట్టూ గట్టికాపలా ఏర్పాట్లు చేయించాడు.మర్నాడు రాజధాని నగరం అలంకరణలతో మెరిసిపోయింది. ప్రత్యేకంగా నిర్మించిన భవన ప్రాంగణంలో, ఘనంగా పోటీలు ప్రారంభమయ్యాయి. ధవళేంద్రుడు, చివ్య ప్రియ సింహాసనాలపై ప్రక్క ప్రక్కనే ఆసీసులై ఉండగా ముందుగా విలువిద్య పోటీలు ఏర్పాటయ్యాయి. ఐదు రోజులపాటు జరిగిన ఆ పోటీలలో జయచంద్రుడు విజేత అయ్యాడు.
తర్వాత చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఆ పోటీలలో జయచంద్రుడే ప్రధమ విజేత అయ్యాడు. జయచంద్రుడు వేసిన బొమ్మను చూసి దివ్యప్రియ పరవశించింది. అతడి ఠీవి, విలువిద్యా చిత్రలేఖవాకౌశల్యం రాకుమారిని ఆకర్షించాయి.సంగీతం పోటీలలో కూడా జయచంద్రడు పాల్గొంటున్నాడని తెలిసి దివ్యప్రియ మనను ఆనందంతో నిండిపోయింది. ఒకే వ్యక్తి వివిధ రకాల పోటీలలో పాల్గొనటం అదే మొదటిసారి అందువల్ల ఆమె దృష్టిలోనేకాక ధవళేంద్రుడి దృష్టిలోనూ జయచంద్రుడు ప్రత్యేక గుర్తింపు పొందాడు. అదీగాక అతడు అప్పటికే ఆయనకు నరేంద్రుడి రాజద్రోహి పథకాన్ని గురించి చెప్పి ఉన్నాడు.
సంగీతం పోటీలకు నరేంద్రుడు కూడా వచ్చాడు. అతడు తమ్ముని కౌగలించుకుని అభినందిస్తూ, "సంగీతంలో నీతో పోటీ పడాలనుంది" అన్నాడు.జయచంద్రుడు అన్న మాటలకు నవ్వాడు. అతడి కోరిక పై మొదట సరేంద్రుడికీ, జయచంద్రుడికీ పోటీ ఏర్పాటుచేసారు. ధవళేంద్రుడు, దివ్యప్రియ ప్రక్క ప్రక్కనే సుఖా సీనులయ్యాకకొద్దిదూరంలో వున్న వేదిక పైకి అన్నదమ్ములు చేరుకున్నారు. అప్పుడు జయచంద్రుడు ఏదో సైగ చేశాడు. అది చూస్తూనే వేదిక చుట్టూ వున్న రాజభటులు నరేంద్రుణ్ణి చుట్టుముట్టి బంధించారు. వీణను చేతిలోకి తీసుకుని జయచంద్రుడు అందులోని విషవు బాణాలను తీసివేశాడు. రాజభటులు సరేంద్రుడిని కారాగారంలో వేశారు.
ధవళేంద్రుడు, దివ్యప్రియ ఆసనాలు దిగి వచ్చి జయచంద్రుడిని అభినందించారు. దివ్యప్రియ మెల్లిగా జయచంద్రుడికి మాత్రమే వినిపించేలా, "ఓ వీరుడా! నిన్ను నేను ప్రేమిస్తున్నాను" అంది.తర్వాత జరిగిన సంగీతం పోటీలలో జయచంద్రుడే విజేత అయ్యాడు. అతడి సంగీతానికి అందరూ మంత్రముగ్ధులయ్యారు.ధవళేంద్రుడు, జయచంద్రుని ప్రతిభకు చలించి, "సర్వ విద్యా ప్రవీణుడివి. నాకు ప్రాణదాతవు. నీకు ఏం కావాలో కోరుకో! ఇస్తాను" అన్నాడు.
జయచంద్రుడు దివ్యప్రియను కోరాడు.. దివ్యప్రియ అంగీకరించటంతో ధవళేంద్రుడు వారి వివాహం వైభవంగా జరిపించి, జయచంద్రుడిని రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు.
రాజయిన మరుక్షణం జయచంద్రుడు కారాగారంలో వున్న సరేంద్రుడిని విముక్తి కావించి తన సలహాదారునిగా నియమించుకున్నాడు.కరాళుడింతవరకే కథను జెప్పి "ఓ సవిత్యుక మహారాజా! జయచంద్రుడి ప్రవర్తన నాకు అగమ్య గోచరంగా వుంది. ధవళేంద్రుడిని చంపి తను రాజుకావాలనుకున్న నరేంద్రుడి పథకాన్ని విఫలంచేసి కారాగారంలో వేయించాడు. ధవళేంద్రుడి ప్రాణాలు కాపాడి రాకుమారిని కోరి రాజ్యానికి రాజయ్యాడు. రాజైన మరుక్షణం రాజ ద్రోహియైన నరేంద్రుడిని విడుదల చేసి ఉన్నత పదవిని కట్టబెట్టాడు. రాజును చంపి సింహాసనం ఎక్కాలనుకున్న నరేంద్రుడి లాంటి రాజద్రోహికి, స్వార్థపరుడికి ఆ పదవిని ఎందుకు కట్టబెట్టాడు? అది తన అన్న అనే స్వార్థంతో ఆలోచనారహితంగా అతడు చేసిన మూర్ఖపుపనా? అయితే సర్వ విద్యా ప్రవీణుడైన జయచంద్రుడు స్వార్థాన్నెందుకు జయించలేక పోయాడు? తెలిసి కూడా నా ఈ సందేహాలకు సమాధానం చెప్పక పోయావో ఈ క్షణమే నీవు నా బానిసవు" అన్నాడు.
దీనికి సవిత్వుకుడిలా బదులిచ్చాడు. "ధవ కేంద్రుడు సమర్థుడైన రాజు కాడు. చక్రధారి మరణం, ధవళేంద్రుడెలాంటివాడో చెప్పకనే చెబుతాయి. నరేంద్రుడు ధవళేంద్రుడిని హతమార్చాలనుకున్నాడు ఆ ఆశయంతోనే తను రాజు కావటానికి పధకంవేశాడు. అన్న బుద్ధి ఎలాంటిదో చిన్నప్పట్నించీ తెలిసిన జయచంద్రుడు ఆ మాత్రం గ్రహించగలడు. నరేంద్రుడి పథకాన్ని విఫలం చేయడంద్వారా తన అన్నను హంతకుడు కాకుండా కాపాడాడు. అన్న కారాగారం పాలయితే మాట్లాడ కుండా ఊరుకొని ధవళేంద్రుడిని తాత్కాలికంగా తృప్తి పరచాడు. ఎలాంటి కష్టనష్టాలూ లేకుండా తనే ధవళగిరికి రాజు కాగలిగాడు. తను రాజు కాగానే పరేంద్రుణ్ణి తన అంతరంగిక సలహాదారునిగా నియమించుకున్నాడు. బ్రహ్మర్షి లాంటి మహాసు భావుడివద్ద శిష్యరికం చేసిన సర్వ విద్యా ప్రవీణుడు, ప్రజాక్షేమాభిలాషి అయిన నరేంద్రుడు ఆ పదవికి అన్ని విధాలా అర్హుడు. తన అన్నకాక మరెవ్వడు ఆ స్థానంలో ఉన్నా కూడా జయచంద్రుడు ఆ పనే చేసేవాడు. ఇందులో జయచంద్రుడి స్వార్థం, ఏ మాత్రం లేదు".
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment