Monday, 12 January 2026

ఒక పాలకుడి కథ మొదటి భాగం: వాగ్దానాల వెల్లువ త్రిలింగ దేశం చాలా సువిశాలమైన దేశం. సహజ సంపదలతో, జీవనదులతో,సుదీర్ఘ సాగరతీరం, మత్యసంపద, ఖణిజ సంపద కలిగి సుభిక్షంగా ప్రజలు సుసంపన్నంగా జీవిస్తున్నారు. ఆ రాజ్యాన్ని గతంలో చాలామంది రాజులు పాలించారు. చివరగా జగన్నాధవర్మ ఆ దేశానికి రాజయ్యాడు. రాజ్యం లో ప్రజలకు ఏ లోటూ లేకుండా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. కానీ ఆ రాజ్యం లో చంద్రపాలుడు అనే వ్యక్తి సంపన్నుల్లో,రైతుల్లో, వ్యాపారుల్లో, ప్రభుత్వ అధికారుల్లో,సైన్యం లో తిరుగుబాటు తీసుకు వచ్చాడు. సంపన్నులకు "ఈ దేశ సంపద అంతా పేదవారికి పంచి పెడుతున్నాడు ఈ రాజు ఇలా అయితే అందరూ సంపన్నులు అయిపోతే మీకు పనిచేసేవారు, బానిసలూ ఉండరు. అనీ, రైతులతో "ఈ రాజు మీభూములను సంపన్నులకు కట్టబెట్టాలని చూస్తున్నాడు అనీ, పేదలందరికీ మీరు కడుతున్న పన్నులు ద్వరా వచ్చిన సంపద అంతా ఉచితంగా పంచిపెడుతున్నాడు. దానివలన మీ పొలాల్లో పనిచేయడానికి కూలీలు మీకు దొరకరు" అనీ, వ్యాపారులతో పేదవారి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడానికి విద్యాలయాలు ఊరూరా నిర్మిస్తున్నాడు ఈ రాజు. దీని వలన పేదలందరిలో చైతన్యం వస్తే వారు మీ వ్యాపార మెలుకువలూ మోసాలు తెలుసుకొని మిమ్మల్ని నిలదీస్తారు. రైతులు సరైన గిట్టుబాటు ధరను మీనుండి రాబడతారు. మీకు నష్టాలు వస్తాయి చూసుకోండి" అనీ, ప్రభుత్వోద్యోగులతో "నన్ను మీరు రాజు గా ఎన్నుకుంటే నేను మీ జీతాలను రెట్టింపు చేస్తాను,పని భారం తగ్గిస్తాను. మీరు చేసే అవినీతిని ప్రశ్నించను. మీ దోపిడికి అడ్డు చెప్పను" అని వాగ్ధానం చేశాడు. సైనికులకు జీతాలు పెంచుతానని,రాయతీలు కల్పిస్తానని, రాజధాని నగరం లో ఇల్లు నిర్మిస్తాననీ,సెలవులు మంజూరు చేస్తాననీ వాగ్ధానం చేశాడు. కొంతమంది అనుచరులను ఊరూరా నియమించి చంద్రపాలుని గురించి గొప్పగా ప్రచారం చేయించాడు. ఏ నోట విన్నా చంద్రపాలుడు గురించే... తన రహశ్య ఏజెంట్ల ద్వారా జగన్నాధవర్మ పై దుష్ప్రచారాన్ని ప్రజలకు చేరవేశాడు. ప్రజల్లో గొప్ప తిరుగుబాటు వచ్చింది. జగన్నాధవర్మ ను గద్దె దించేశారు ప్రజలు. చంద్రపాలుని తన రాజుగా పట్టాభిషిక్తున్ని చేశారు. కొత్తగా వచ్చిన 'చంద్రపాలుడూ పట్టాభిషేకం ముందు ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించాడు. "నేను భగవంతుని ప్రతినిధిని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు నన్ను భూమి మీదికి పంపించాడు, నేనే ఈ నదులను శృష్టించాను, పంచభూతాలు నా అధీనం లోనే ఉన్నాయి, నా పాలనలో కరువు,కాటకాలు ఉండవు, ఈతిబాధలు అసలే ఉండవు, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు,పొలం ఉండేటట్లు చూసుకుంటాను, పన్నులు తగ్గిస్తాను, రాజ్యాన్ని స్వర్గధామం చేస్తాను" అని ఊరూరా చాటింపు వేయించాడు. ప్రజలు ఆ మాటలు నమ్మి, అతనికి బ్రహ్మరథం పట్టారు. చంద్రపాలునికి కిరీటాన్ని అప్పగించారు. పట్టాభిషేకం రోజున చంద్రపాలుడు వీధుల్లో తిరుగుతూ, "ఈ మట్టి మీది, ఈ రాజ్యం మీది" అని ప్రసంగించాడు. రైతులు తమ నాగలిని పక్కన పెట్టి అతనికి నీరాజనాలు పట్టారు. కానీ, కిరీటం తల మీదకు రాగానే విజయవర్మ ఆలోచనలు మారిపోయాయి. అతనికి రాజ్యం మీద ప్రేమ కంటే, తన ఖజానా నింపుకోవడం మీదే ధ్యాస మళ్లింది. రెండూ భాగం: అభివృద్ధి పేరుతో దోపిడీ కొద్ది కాలం గడిచాక, విజయవర్మ తన కొలువులో ఉన్న మంత్రులతో రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ మంత్రులంతా అతని బంధువులే. "మన ఖజానా పెరగాలి, మన వారు సంపన్నులు కావాలి. దీనికి 'అభివృద్ధి' అనే ముసుగు వేయాలి" అని పథకం రచించారు. మరుసటి రోజు చాటింపు మొదలైంది: "రాజు గారు రాజధానిని విస్తరిస్తున్నారు! ప్రపంచం చూడని అద్భుతమైన మహలులు, దేవాలయాలు విలాసవంతమైన రధ మార్గాలు , విదేశీ వ్యాపారస్తుల కోసం విలాసవంతమైన అతిథి గృహాలు నిర్మిస్తారు. విదేశీ వ్యాపారుల కోశం గిడ్డంగులు నిర్మిస్తారు, వాటికి సరుకులు చేరవేసేందుకు విశాలమైన రహదారులు, సముద్ర నుండి నేరుగా రాజధానికి రావడం కోసం కాలువలు నిరిస్తున్నందున రైతుల నుండి భూములు సేకరిస్తున్నారు. గ్రామాలు ఖాలీ చేయాలి. వారికి తరువాత నగరం లో నివాసాలు ఏర్పాటు చేస్యారు. రాజధాని విస్తరణ కోసం భూములను సేకరిస్తున్నారు.దీని కోసం నగర సరిహద్దుల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ పరం కావాలి." అని చాటింపు వేశారు. రైతులు హడలిపోయారు. తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న మాగాణి భూములు, పచ్చని పంట పొలాలు పాలకుల కన్ను పడ్డాయి. "ప్రజా ప్రయోజనం కోసం భూమిని త్యాగం చేయండి" అని సైనికులు బలవంతంగా సంతకాలు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఒక రైతు ఎదురుతిరిగి, "అయ్యా, ఈ పొలం పోతే మా ఆకలి తీరేదెలా?" అని అడిగితే, "నీకు రాజధానిలో చిన్న గది ఇస్తాం, అక్కడ కూలి పని చేసుకో" అని వెటకారంగా జవాబిచ్చారు. మూడవ భాగం: పన్నుల భారం - స్వార్థపు కోటలు భూములు లాక్కున్నది చాలక, చంద్రపాలుడు సరికొత్త పన్నులు విధించాడు. నగరంలోకి వచ్చే ప్రతి వస్తువు మీద, కట్టెలు కొట్టుకునే వాడి మీద, చివరకు గాలి మీద కూడా పన్ను వేశారు. ప్రజల వద్ద ఎంత బంగారం ఉన్నదీ అని ఒక సర్వే చేపట్టాడు. ఆ బంగారం పై ఆస్తి పన్ను విధించాడు. పండిన పంట పై 50% పన్ను విధించాడు. చదువుకోవాలంటే "గురు దక్షిణ" అనె పన్నును ప్రభుత్వం వసూలు చేసింది. "రాజధానిని నిర్మిస్తున్నాం కదా, ఆ ఖర్చు మీరే భరించాలి" అని తీర్మానించారు. సామాన్యుడి నడ్డి విరిగింది. విదేశి ప్రయాణం కోసం పది విలాసవంతమైన విశాలమైన అతి భారీ నౌకలను ఈజిప్ట్ రోం నగరాలనుడి కొనుగోలు చేసి తెప్పించాడు. పేదవాడు ఆకలితో అలమటిస్తుంటే, రాజు గారు మాత్రం తన రాజమందిరంలో భారీ విందులు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విందులకు ఆహ్వానితులు కేవలం రాజు గారి బంధువులు, మిత్రులు మాత్రమే. భూములు లాక్కున్న చోట పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలు వెలిశాయి. అవి ఎవరివి? రాజు గారి బావమరిదివి. కొత్తగా నిర్మించిన 'అతిథి గృహాలు' ఎవరివి? రాజు గారి ఆప్తమిత్రుడివి. నాటి తాళపత్ర గ్రంథాలయాలు రాజు గారి సోదరుడి సొంతం. ప్రభుత్వ అధీనం లో ఉన్న విద్యా సంస్థ లను విదేశీ వ్యాపారులకు అమ్మివేశాడు. వారు "గురుదక్షిణ"ను భారీగా పెంచివేశారు. దానితో పేద, మధ్య తరగతి వారు చదువుకు దూరం అయ్యారు. వైద్యం తన బినామీలకు ధారాదత్తం చేశాడు. దానితో ఉచితంగా అందాల్సిన వైద్యం అందని ద్రాక్ష అయింది. రాజధాని నగరం విలాశవంతుల నిలయం అయింది.పేదవారికి అక్కడ చోటు లేకుండా అయిపోయింది ఆ నగరం లో ప్రవేశించాలంటే రాజ ముద్రిక ఉండాలి అది సంపన్నులకు, తన బంధువులకు స్నేహితులకు మాత్రమే స్వంతం. అభివృద్ధి అయితేజరిగింది.. కానీ అది ప్రజలది కాదు, పాలకులది. రాజధాని వెలుగుల్లో రైతన్న కన్నీరు ఎవరికీ కనిపించలేదు. ఒకప్పుడు రైతు తన భూమిని నమ్ముకొని స్వశక్తి పై ఆధారపడి తన బ్రతుకేదో తను బ్రతికే వాడు. ముందు ఉండే రాజులు రైతన్నకు ఏలోటూ లేకుండా చూసుకున్నారు.కానీ ఈ కొత్తరాజు వచ్చేక కష్టాలు కూడా తోడయ్యాయి.పంట పండే నేల మీద రాతి కట్టడాలు మొలిచాయి. అన్నం పెట్టే అన్నదాత, తన సొంత భూమిలో సంపన్నుల కోసం నిర్మిస్తున్న మహా సౌధాలకు రాళ్ళెత్తే కూలీలుగా మారవలసి వచ్చింది. నాల్గవ భాగం: చరిత్ర పునరావృతం ఒక రోజు ఒక వృద్ధ రైతు రాజసభకు వచ్చాడు. రాజు ఎదుట నిలబడి, "ప్రభూ! మీ అద్దాల మేడల్లో మా కన్నీళ్లు ప్రతిబింబించడం లేదా? విదేశీ వ్యాపారస్తుల కోసం మా పొలాలను బలి ఇచ్చారు. రేపు ఆకలి వేస్తే మా పిల్లలకు ఈ రాతి ముక్కలను తినిపించమంటారా? మమ్మల్ని ఓడించి రాజ్యాన్ని గెలవలేదు మీరు, మమ్మల్ని మోసం చేసి గెలిచారు" అని ఎలుగెత్తి చాటాడు. రాజు వికటాట్టహాసం చేశాడు. అతనికి రాజ్యాధికారం తలకెక్కింది.కళ్ళు నెత్తికి ఎక్కాయి. మదోన్మత్తుడు అయ్యాడు. ఎప్పుడూ తన బంధువులు, స్నేహితులతో విదేశీ యాణం. పరిపాలన మంత్రుల చేతిలో పెట్టాడు. మంత్రులు వారికి దొరికింది ప్రజలనుడి పన్నుల రూపం లో దోచుకుంటున్నారు. ప్రజలు వారి బాధలు చెప్పుకొనే అవకాశమే లేదు. రాజ్యం అవినీతి మయం అయిపోయింది. కానీ చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. పన్నుల భారంతో విసిగిపోయిన ప్రజలు, భూములు కోల్పోయిన రైతులు ఏకమయ్యారు. వాగ్దానాలు మరిచిన పాలకుడిని గద్దె దించడానికి సమయం ఆసన్నమైందని గ్రహించారు. యువకులు,రైతులూ ఏకం అయ్యారు. ఒక్కసారిగా నగరం పైకి దండెత్తారు. ఈ హఠాత్ సంఘటణను చంద్రసేనుడు ఊహించలేకపోయాడు. సైన్యం వెల్లువా వచ్చిన ప్రజావాహినిని ఏమీ చేయలేక పోయింది. ఎదురొచ్చిన సైనికులను మట్టుప్ర్ట్టారు ప్రజలు దానితో మిగిలిన సైకులు ప్రజలతో చేతులు కలిపారు రాజధానిలోని సంపన్నుల ఇళ్ళలోకి చొరబడి దొరికిన సొత్తును సామాన్యులు దోచుకున్నారు. నగరాన్ని తగలబెట్టారు. నగరం విడిచి పారిపోతున్న రాజును ఆ మంటల్లో వేసి కాల్చేశారు. రాజ బంధువులను బంధించారు. జగన్నాధవర్మకు మళ్ళీ పట్టం కట్టారు. ఇప్పుడు ప్రజలు ఏ ఈతిబాధలు లేకుండా సుభిక్షంగా జీవిస్తున్నారు.

No comments:

Post a Comment