Tuesday, 6 January 2026
పరీక్షా ఫలితం
పూర్వం కేకయదేశంలో వితస్తానదీ తీరాన ప్రజ్ఞామతి అనే రాజొకడుండే వాడు. ఆయన వద్ద జాగీరులు పొందిన వారిలో ధర్మపాలు డనే మహావీరు ద్రొకడుండే వాడు. ధర్మపాలుడు అకాలమరణం పొందటం చేత అతని కొడుకైన శూర పాలుడు తన పన్నెండవ ఏటనే జాగీరుకు వారసుడయాడు. శూరపాలుడు చిన్నవాడు కావటం చేతనూ, అతని ఆస్థిని చూసే వారె వరూ లేకపోవటం చేతనూ అతని జాగీరు నుంచి కొన్ని సంవత్సరాల పాటు రాజు గారికి కప్పం వెళ్ళలేదు.
ఏడెనిమిదేళ్ళుగా ధర్మపాలుడి జాగీరు నుంచి కప్పం చెల్లుబడి కావటంలేదని తెలియగానే రాజు శూరపాలుడికి కబురు చేశాడు. ఒక నెల గడువులోగా శూర పాలుడు రాజుగారి దర్శనం చేసుకొని పక్షంలో జాగీరు మరొకరి పరమవుతుందని
వార్త రాగానే శూరపాలుడు తన స్నేహితు డైన క్షేమవర్మ అనే వాళ్ల, ఇరవైమంది పరివారాన్ని వెంటపెట్టుకుని రాజధానికి బయలుదేరాడు.
శూరపాలుడు అనుభవించే జాగీరు సుక్షేత్రం. అందులో బంగారం పండటమే గాక, సమస్తమైన ప్రకృతి సంపదలూ కలిగి నటువంటిది. ఈ సంగతి తెలిసి రాజుగారి చిన్నకొడుకు ఒక దుర్మార్గపు ఆలోచన చేశాడు. శూరపాలుణ్ణి ఎలాగైనా దారిలోనే కడతేర్చినట్టయితే అతను వచ్చి రాజ దర్శనం చేసుకోలేడు. అతను తన ఆజ్ఞను ఉల్లంఘించా డనుకుని రాజుగారు అతని జాగీరును లాగేసుకుంటాడు. అప్పుడు రాజ కుమారుడు తండ్రిని లాలించి దాన్ని తానే కాజేయవచ్చు.
ఈ దుర్మార్గపు ఆలోచనను తన మిత్రు డైన మంత్రి కొడుక్కు కూడా చెప్పిఒప్పించి, అతన్ని, కొందరు సైనికులనూ వెంటబెట్టుకుని, రాజధానికి ఒక ఆమడ దూరంలో, శూరపాలుడు వచ్చే దారిలో, అరణ్యం మధ్య మాటువేసి ఉన్నాడు. సైనికులను చెట్ల చాటున దాచి, రాజు కొడుకూ, మంత్రి కొడుకూ కత్తులు ధరించి, గుర్రాలెక్కి దారికి అడ్డంగా నిలబడ్డారు.
గుర్రాలనూ, యోధులనూ అంతదూరానే చూసి క్షేమవర్మ అందులో ఏదో మోసం ఉన్నట్టు శంకించి, శూరపాలుణ్ణి, పరివా రాన్నీ వెనకనే ఉండమని హెచ్చరించి, తాను ఒక్కడే గుర్రాన్ని నడిపించుకుంటూ ముందుకు వచ్చాడు.
అతనే శూరపాలుడై ఉంటాడనుకుని రాజుకొడుకు అతని దారిని అటకాయించి, "కాస్త గుర్రం కట్టెయ్యి,” అన్నాడు.
"దారి అయ్యి, నేను వెళ్ళా లి,” అంటూ క్షేమవర్మ రాజకుమారుణ్ణి తోను కుని ముందుకు పోవ యత్నించాడు.
" అంత మదమా?" అంటూ రాజ కుమారు డతన్ని గుర్రం మీది నుంచి కిందికి ఒక్క తోపు తోసేశాడు.
మరుక్షణమే శూరపాలుడు అతివేగంతో తన గుర్రాన్ని పరిగెత్తించు కుంటూ వచ్చి, "నిరాయుధుడి పై చెయ్యి చేసుకుం టావా? సిగ్గు లేదూ?" అని రాజకుమారుణ్ణి అడిగాడు.
"ముందు నీ గతి నువు చూసుకో,” అంటూ రాజకుమారుడు శూరపాలుడి పైన కత్తి ఎత్తాడు. శూరపాలుడి కత్తి మెరుపు లాగా పైకివచ్చి రాజకుమారుడి కంఠాన్ని రెప్పపాటులో నరికేసింది. శూరపాలుడు అసాధారణ యోధుడన్న విషయం రాజ కుమారుడికి తెలియదు.
ఈ సంఘటన చూసి మంత్రికొడుకు కొయ్యబారి పోయాడు. చెట్లచాటున దాగిన సైనికులు కుక్కిన పేలలాగా అక్కడే ఉండిపోయారు.శూరపాలుడు తన మిత్రుడైన క్షేమ వర్మను లేవదీసి గుర్రం మీద ఎక్కించి, తన పరివారాన్ని కేకవేసి, తిన్నగా రాజ ధానికి వెళ్ళాడు. అతను రాజదర్శనం చేసుకుని, " తమ రాజధానికి ఒక ఆమడ దూరంలో బందిపోటులు విశృంఖలంగా తిరుగుతున్నారు. ఒక ధూర్తుడు నన్ను చంప యత్నించాడు, నా మిత్రుణ్ణి ఆకార బంగా గుర్రం మీది నుంచి తోసేశాడు. నేను వాడి తల నరికేసి చక్కగా బుద్ధి చెప్పాను," అని రాజుతో అన్నాడు.
"మంచి పని చేశావు ! అలాటి వాళ్ళ కదే శిక్ష!” అన్నాడు రాజు.
కాని అంతలోనే మంత్రి కొడుకు రాజ కుమారుడి శవాన్ని తెచ్చి రాజు ముందు పడేసి, "మహారాజా, ఎంత దారుణం జరిగిందో చూడండి. ఈ నీచుడే అరణ్యంలో అబ్బాయిగారి పై అకారణంగా కత్తి దూసి, ఆత్మరక్షణకు కూడా అవకాశ మివ్వకుండా శిరశ్ఛేదం చేసేశాడు." అన్నాడు.
తీయటానికి సిద్ధపడ్డాడు. అయితే రాజుగారి కొలువులో ఉన్నవారంతా తొందరపాటు రాజుకు భరించరానంత దుఃఖమూ, కోపమూ కలిగాయి. చనిపోయిన కొడుకంటే రాజుగారికి చాలా ప్రేమ. అందుచేత ఆయన కత్తి దూసి ఆ క్షణంలోనే శూరపాలుడి తలతగదనీ, శూరపాలుడేం చెప్పుకుంటాడో అది వినటం కనీస ధర్మమనీ చెబుతూ రాజుగారికి అడ్డు తగిలారు.
" నాకై నేను కయ్యానికి కాలు దువ్వ లేదు. మొదట నా పైన మీ కుమారుడే చెయ్యి చేసుకున్నాడు. అత నెవరో కూడా నాకు తెలియదు. మీ మంత్రి కుమారుడు పచ్చి అబద్ధం చెబుతున్నాడు. మీ దర్శనం కోసం వస్తున్నవాణ్ణి దారిలో కొట్లాటలు పెట్టుకోవటం వల్ల నాకేం ప్రయోజనం ఉంటుంది ?" అని శూరపాలుడు చెప్పాడు.
కాని క్రోధంతో వూగిపోతున్న రాజు చెవికి ఈ మాట లేమీ ఎక్కలేదు.
"నువే అబద్ధమాడుతున్నావో, మంత్రి కొడుకే అబద్ధ మాడుతున్నాడో మా కెలా తెలుస్తుంది? ఇది దేవుడే తేల్చాలి. మీ ఇద్దరూ ద్వంద్వ యుద్ధం చెయ్యండి. ఎవరు జయిస్తే వారిది నిజమని ఒప్పుకుంటాను,” అన్నాడు రాజు.
శూరపాలుడు గట్టిగా అరవై ఏళ్ళు నిండని పసివాడు. మంత్రికొడుకు ముఫై ఏళ్ళవాడు, దృఢకాయుడు. అతని చేతిలో శూరపాలుడు నిశ్చయంగా చచ్చిపోతాడనీ, తన కొడుకు చావుకు ప్రతిక్రియ ఈవిధంగా జరిగిపోతుందనీ రాజు ఆశించాడు. అయితే శూరపాలుడి వేగంలో మంత్రి కొడుక్కు సగం కూడా లేదు. ఇద్దరూ కత్తులు దూసి కలియబడిన కొద్ది క్షణాలలో మంత్రికొడుకు కూడా రాజు కొడుకును చేరుకున్నాడు.
"మహారాజా, ఇంతటితోనైనా ఈ విష యాన్ని వదిలిపెట్టండి. మీ రన్న మాట ప్రకారం ఈ కుర్రవాడు నిరపరాధి అని తేలిపోయింది,” అన్నారు మంత్రులు.
కాని రాజుకు శూరపాలుడి పై కసి జాస్తి అయిందే గాని తగ్గలేదు. అతణ్ణి హత మార్చటానికి ఆయన మరొక ఎత్తు వేశాడు.
"నే నితన్ని క్షమిస్తాను. కాని ముందుగా అతను నేను చెప్పిన పని ఒకటిచేసుకురావాలి : ఇతను కుషాను చక్రవర్తి ఆస్థానానికి వెళ్ళి, అతని ఆస్థానంలో ముఖ్య అతిథిగా ఉన్న వ్యక్తిని చంపేసి, చక్రవర్తి కిరీటం తెచ్చి నా కివ్వాలి. ఈ పని చేసి నట్టయితే ఇతన్ని క్షమించటానికి నా కేమీ అభ్యంతరం లేదు," అన్నాడు రాజు, తన దురుద్దేశం అందరికీ తెలిసేలాగా.
మిగతా వారంతా నిర్ఘాంతపోయి చూస్తూం డగా శూరపాలుడు, " తమ సెలవైతే అలాగే చేస్తాను,” అంటూ సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు.
అతను క్షేమవర్మనూ, పరివారాన్నీ రాజ ధానిలోనే వదిలి, కుషాను రాజుండే నగ
రానికి ఒంటరిగా ప్రయాణమయాడు. అది చాలా దూర ప్రయాణమే గాక, దుర్ఘటమైన ప్రయాణం కూడానూ. చక్రవర్తి ఉండే నగరానికి పడమటగా ఉండే కొండలోయలో రాక్షసులున్నారు. శూరపాలుడు ఆ లోయల కుండా ప్రయాణం చేస్తూ రాక్షసుల రాజైన తామ్రాక్షుడనే వాడితో పోరాడి, తన లాఘ వంతో వాణి చంపి, వాడి చేతికి ఉన్న బంగారు దండకడియం తీసుకుని చక్రవర్తి నగరం చేరుకున్నాడు.
శూరపాలుడు వచ్చి చేరే సమయానికి కుషాన నగరం మహావైభవంగా ఉన్నది. ఎందుకంటే ఆ రోజే చక్రవర్తి కుమార్తెమండలి అనే దానికి పెళ్ళి చేస్తున్నారు. రాజసౌథంలో చక్రవర్తి బంధుమిత్ర పరి వారసమేతుడై కొలువు తీరి ఉన్నాడు. చక్ర వర్తికి ఒకపక్క ఆయన కుమార్తె, రెండవ పక్క ఆమెను పెళ్ళాడబోయే వాడూ కూర్చుని ఉన్నారు.
శూరపాలుడు తిన్నగా చక్రవర్తి ఎదటికి వెళ్ళి, వంగి నమస్కారం చేసి, " ఇది రాజాజ్ఞ," అంటూ చప్పున కత్తి దూసి, పెళ్ళి కొడుకు తల నరికేశాడు.
అతిథులు హాహాకారాలు చేశారు. చక్ర వర్తి నోట కొంత సేపు మాట రాలేదు. రాజ భవన మంతా గగ్గోలెత్తిపోయే ఆ క్షణంలో
మండలి ఒక్కతే మాత్రం తృప్తిగా ఒక్క నిట్టూర్పు విడిచింది. ఎందుకంటే ఆమెకు ఆ వరుణ్ణి పెళ్ళాడటం ఎంత మాత్రమూ ఇష్టం లేదు. వాడు పరమకిరాతకుడు, మాన వత్వం ఏ మాత్రమూ లేని కర్కోటకుడు.
"ఈ దుర్మార్గుణి పట్టుకోండి,” అని చక్రవర్తి చివరకు కేకపెట్టాడు.
"మహారాజా, మన్నించాలి. నేను మీకు కీడుకోరి వచ్చినవాణ్ణి కాను. మా రాజు గారి ఆజ్ఞ పాలిస్తున్నాను, అంతే! మీ కిరీటం కూడా ఇచ్చేశారంటే నేను వచ్చిన పని తీరిపోతుంది. నా దారిన నేను వెళ్ళి పోతాను. మీకు నా ముఖం మరి చూపిం చను," అన్నాడు శూరపాలుడు వినయంగా.
ఈ మాటలకు చక్రవర్తి శాంతించక పోగా మరింత మతిపోయిన వాడల్లే అయి పోయి, " ఈ వెర్రివాణ్ణి వెంటనే తీసుకు పోయి చీకటికొట్టులో వేసి, ఆకలిదప్పులతో చావ నివ్వండి!" అని రంకెలు పెట్టాడు.
"నన్ను సామాన్యుడి కింద కట్టెయ్య, కండి. నేను తామ్రాక్షుడనే రాక్షసరాజును చంపిన వాణ్ణి. అదుగో అతని శవం నుంచి నేను తీసుకొచ్చిన దండకడియం!" అన్నాడు శూరపాలుడు. అది కూడా చక్ర వర్తి వినిపించుకోలేదు.చక్రవర్తి అజ్ఞప్రకారం ఆయన భృత్యులు శూరపాలుణ్ణి చుట్టుముట్టి పట్టు కుని, తీసుకుపోయి చీకటికొట్టులో పడేసి తాళం పెట్టేశారు.
ఆ రోజూ, మర్నాడు పగలూ గడిచింది. శూరపాలుడు తిండీ, నీరూ కూడా లేకుండా గాఢాంధకారంలో కటిక నేలపై పడుకుని, "ఇక నాకు ఈ లోకంతో రుణం తీరిపోయి నట్టే. తన కొడుకును చంపినందుకు ప్రజ్ఞా మతి మహారాజు నా పైన బాగానే పగ తీర్చు కున్నాడు,” అనుకున్నాడు.
అయితే ఉన్నట్టుండి ఆ అంధకారంలో ఆశారేఖ లాగా వెలుగు ప్రవేశించింది. ఎవరో
దీపం పట్టుకుని అతనున్న చీకటికొట్టులోకి వచ్చారు. ఆ దీపం వెలుగులో శూర పాలుడు చక్రవర్తి కుమార్తెను, మండలిని గుర్తించాడు.
" నీకు భోజనమూ, నీరూ తెచ్చాను, తీసుకో. కారాగృహాధికారికి లంచం పెట్టి మన పక్షం చేసుకున్నాను. అతన్ని నమ్మ వచ్చు,” అన్నది మండలి శూరపాలుడితో.
అది మొదలు మండలి ప్రతిరాత్రీ అత నికి భోజనమూ, నీరూ తెచ్చి పెడుతూ వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకునే వారు. తనను ఒక కిరాతకుడికి భార్య కాకుండా కాపాడినందుకు చక్రవర్తి కూతురు కృత జ్ఞత తెలుపుకున్నది; చీకటికొట్టులో తిండికి, దప్పికీ మాడి చాపకుండా కాపాడు తున్నందుకు శూరపాలుడు కృతజ్ఞత తెలుపుకున్నాడు. కాని చీకటికొట్టులో నుంచి బయటికి పోయే మార్గమేదో అతనికీ తెలియ లేదు, ఆమెకూ తెలియలేదు.
ఒక నెల రోజులు గడవనిచ్చి కారా గృహాధికారి చక్రవర్తి వద్దకు వెళ్ళి, "మహా ప్రభూ, వెర్రివాడు మరణించాడు,” అని విన్నవించాడు.
"పీడ వదిలిపోయింది.” అన్నాడు చక్రవర్తి సంతోషంగా.ఇది జరిగిన కొద్దిరోజులకే చక్రవర్తికి పెద్ద ప్రమాదం వచ్చిపడింది. శూరపాలుడి చేతిలో చచ్చిన తామ్రాక్షుడి తమ్ముడు ధూమ్రాక్షుడనే రాక్షసుడు చక్రవర్తి పైకి వస్తున్నట్టు తెలిసింది.
చక్రపర్తి కంగారు పడిపోయాడు. రాక్షసులతో కయ్యం పెట్టుకుంటే అది ఎక్కడికి దారి తీసేదీ తెలియదు.
"తామ్రాక్షుణ్ణి చంపిన కుర్రవాడే ఉంటే ఈ ధూమ్రాక్షుడి సంగతి తేల్చును,” అన్నది మండలి తండ్రితో.
" నిజమే, కాని వాడు చీకటికొట్టులో తిండికి మాడి మాడి చచ్చాడు గద!" అన్నాడు చక్రవర్తి.
మండలి తండ్రి కాళ్ళపై పడి ముందు గానే క్షమాపణ చెప్పుకుని, " అతను చావ లేదు. నే నతనికి రోజూ భోజనం పంపు తూనే ఉన్నాను. అతన్ని చెర విడిపించి నట్టయితే ఈ ధూమ్రాక్షుడితో పోట్లాడు తాడు," అన్నది.
చక్రవర్తికి ప్రాణం లేచి వచ్చింది. రాక్ష సులు విచిత్రమైన వాళ్ళు. తమలో ఏ ఒక డైనా మరొకడితో పోరి చచ్చిపోతే వారు పట్టించుకోరు. ఒక్క రాక్షసుడి పైకి సేనను పంపి చంపినట్టయితే లోయలో ఉండే
రాక్షసులంతా వచ్చిపడి రాజ్యాన్నీ, రాజ ధానినీ మట్టుపెట్టేస్తారు.
చక్రవర్తి తక్షణమే కారాగృహానికి మని షిని పంపి, శూరసాలుణ్ణి పిలిపించి, "నీ చేత చచ్చిన రాక్షసుడి తమ్ముడు మన పైకి వస్తు న్నాడు. నీవు వెళ్ళి వాడితో యుద్ధం చేసి జయిస్తివా, నీకు నా కిరీటమే కాదు, నా కూతుర్ని ఇచ్చి వివాహం కూడా చేస్తాను,” అన్నాడు.
"అందుకు నేను సిద్ధమే," అన్నాడు. శూరపాలుడు.
అతను వెళ్ళి ధూమ్రాక్షుడితో పోరా డాడు. వాడు తన గద ఎత్తి నెత్తి మీదపెట్టేలోపల శూరపాలుడు వాడి గుండెను తన కత్తితో చీల్చేసి చంపేశాడు.
శూరపాలుడు చక్రవర్తి వద్దకు తిరిగి వచ్చి, "మీ పని పూర్తి చేశాను, మీ రిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోండి," అన్నాడు.
"సరే నిన్ను ప్రాణాలతో వదిలేస్తు న్నాను, వెళ్ళి పో!" అన్నాడు చక్రవర్తి, రాక్షస భయం తీరిపోయిన బింకంలో,
"నాకు మీ కిరీటం ఇస్తా నన్నారు. మీ అమ్మాయినిచ్చి పెళ్ళిచేస్తా నన్నారు." అన్నాడు శూరపాలుడు.
"తక్షణం వెళ్ళిపోకపోతే నిన్ను మళ్ళీ చీకటికొట్టుకు పంపగలను జాగ్రత్త! ఒళ్ళు తెలిసి మాట్లాడు!" అన్నాడు చక్రవర్తి.
శూరపాలుడికి పట్టరాని క్రోధం వచ్చింది. అతను మెరుపులాగా కత్తి దూసి చక్రవర్తి తల నరికేశాడు.
రాజోద్యోగులు శూరపాలుళ్లు శిక్షించా అనుకున్నారు. కాని చక్రవర్తి చావగానే
ఆయన స్థానంలో చక్రవర్తిని అయిన మండలి, " అతను నిరపరాధి. పైపెచ్చు నాకు కాబోయే భర్త. మీరందరూ ఇతనికి విధేయులై ఉండాలి,” అన్నది.
శూరపాలుడు మండలిని వివాహం చేసు కుని రాజ్యాభిషేకం కూడా జరిపించు కున్నాడు. ఆ సమయంలో అందరు రాజు లతో బాటు కేకయదేశంలోని ప్రజ్ఞామతి కూడా వచ్చి కొత్త చక్రవర్తికి జోహార్లు అర్పించుకున్నాడు.
" ఏం మహారాజా, మీరు చెప్పిన రెండు పనులూ చేశాను. చక్రవర్తి కిరీటం ఇప్పుడు నా నెత్తినే ఉన్నది. ఏమంటారు?" అని శూరపాలుడు ప్రజ్ఞామతిని అడిగాడు.
ప్రజ్ఞామతి వణికిపోతూ అతని కాళ్ళపైన పడి, క్షమించమని ప్రాధేయపడ్డాడు.
"ఈసారికి క్షమిస్తున్నాను. ఇంక ఎప్పుడూ ఎవరికీ అనాలోచనగా పరీక్షలు పెట్టకండి." అన్నాడు శూరపాలుడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment