Monday 19 February 2018

పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు-  04 వ పద్య  ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు
ఈ ఉత్పలమాల పద్యంలో “ణ”అను అక్షరాన్ని పలుమార్లు ప్రయోగిస్తూ దానిని శివుని తాండవానికి కవి ముడి పెట్టాడు.
ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ
ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖవిక్రమ జృంభణ సంచలన్నభో
ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన
ణ్ణ ణ్మృణ తాండవాటన "ణ"కారనుత బసవేశ పాహిమాం!
ప్రతిపదార్థం
ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ
ణ్ణ ణ్మృణ= ణ, ణ్మృణ అను శబ్దములతో
నృత్= ఆడుచూ
త్వదీయ= నీసంబంధమైన
సుఖ= సుఖమయిన(పవిత్రమయిన అని ఇంకొక అర్థం)
విక్రమ = పరాక్రమముతో
జృంభణ= అతిశయించుచూ
 సంచలత్= కదులుచున్న(వణుకుచున్న)
నభః=ఆకాశము
ఉణ్ణ ణ్మృణ= ఉణ్ణణ,  మృణ  అను శబ్దములు చేయుచూ
 దిక్= దిక్కులందు
క్వణత్= మ్రోగుచున్న(ప్రతిధ్వనించుచున్న
 మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ = మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ మొదలగు
స్వనత్ = మ్రోగెడు
ణణ్మృణబసవేశ =ణణ్మృణ అను అక్షరముల సాన్నిహిత్యము కలిగిన   ఓ బసవేశ్వరుడా !
తాండవ= తాండవనృత్యములో
అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !
ణ"కారనుతా =ణ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !
మాం = నన్ను
పాహి= రక్షించు
తాత్పర్యము
ఓ బసవేశ్వరా ! ఓ శివా ! “ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణణ్ణ ణ్మృణ ణ, ణ్మృణ అను శబ్దములు
నువ్వు తాండవ నృత్యము చేయునప్పుడు పుడుతున్నాయి..మురళి
నీ సంబంధమైన పవిత్రమయిన తాండవ  పరాక్రమముతో అతిశయిస్తూ  ఆకాశము కదులుచున్నది(వణుకుచున్నది)
ఉణ్ణణ,  మృణ  అను శబ్దాలు దిక్కులందు  ప్రతిధ్వనించుచున్నవి.
 మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ మొదలగు అక్షర శబ్దములు దిక్కులందు  మారుమ్రోగుతున్నాయి. ణణ్మృణ అను అక్షరముల సాన్నిహిత్యము కలిగిన   ఓ బసవేశ్వరుడా ! తాండవనృత్యములో  అటునిటు తిరుగువాడా!ఓ పరమశివా !
ణ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా ! నన్ను రక్షించు.

No comments:

Post a Comment