Thursday, 1 January 2026

📚 శ్రీకాకుళం జిల్లా – 30 మంది రచయితలు (సంక్షిప్త వివరాలు) వల్లూరు దాలినాయుడు (మురళి) తెలుగు భాష ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొగిరి (రాజాO మండలం) విజయనగరం జిల్లా... సిక్కోలు సాహితీ వనంలో తులసి మొక్కలు ఒకప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎందరో సాహితీవేత్తలు అమూల్యమైన కవితా రతనాలను గ్రంథాలను అందించారు. ఆ వారసత్వాన్ని ఈనాటి ఆధునిక కవులు కూడా కొనసాగిస్తున్నారు. అమూల్యమైన ఈ గ్రంథాలు సామాజికము, పౌరాణికము, ఆధ్యాత్మికము, వైద్యరంగము, నిఘంటువులు, కథా రచనలు జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు, నవలలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో కవితా ప్రక్రియలు ఆ మహానుభావుల కలం కదలికల నుండి ఆవిర్భవించి సాహితీ ప్రియుల మన్ననలను అందుకున్నాయి. సిక్కోలు వైభవం పేరుతో విడుదలవుతున్న ఈ పుస్తకంలో అటువంటి మహనీయులను గురించి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈనేటి తరానికి తెలియాలని ఓ చిన్న ప్రయత్నం ఇది... ఎందరో మహానుభావులు అందరినీ ఇందులో ప్రస్తావించ లేకపోవచ్చు ... అది కాకతాళీయమే కానీ బుద్ధిపూర్వకము కాదని విన్నవించుకుంటూ ఉన్నాను. మనకు అందుబాటులో ఉన్న కొద్దిమంది పేర్లను ఈ వ్యాసంలో అందిస్తున్నాము.. ఇంకెవరినైనా మరిచినట్లయితే మాకు తెలిపితే తదుపరి ముద్రణలో వారిని ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరుగుతుందని వినయపూర్వక మనవిచేస్తున్నాను.. 1.గిడుగు రామమూర్తి పంతులు: గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము. 2.చాగంటి సోమయాజులు (1915, జనవరి 15 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. చాసోగా అందరికీ సుపరిచితుడు. ఆయన మానవతావాదిగా ప్రారంభమై, మార్క్సిస్టుగా మారి, కథల్లో ప్రగతిశీల విలువలు, పీడిత ప్రజల బాధలు, సమస్యలు గురించి విస్తృతంగా రచనలు చేశాడు.ఈయన మొట్ట మొదటి రచన చిన్నాజీ 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసిన చాలా కథలు హిందీ, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళం, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది. 3.గెడ్డాపు సత్యం :ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త.ఈయన శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, కాకరపల్లి గ్రామంలో 1936, ఫిబ్రవరి 3న లక్ష్మమ్మ, ఎర్రంనాయుడు దంపతులకు జన్మించారు. శ్రీకాకుళంలోని డిగ్రీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు.వీరు త్రిలిఙ్గపత్రిక, మిసిమి తదితర మాసపత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆకాశవాణిలో కవితా స్రవంతి కార్యక్రమంలో స్వీయ కవితలు వినిపించారు. వర్ణనరత్నాకరం అనే పద్య సంకలనాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు.మృత్యుంజయుడు జైత్రయాత్ర,శివకేశవమ్,ప్రసన్నధర్మము,కవితా వైజయంతి,శ్రీ వేణుగోపబాల శతకము,త్రికుటేశ్వర సుప్రభాతం మొదలైనవి. జనవరి 8, 2015న మరణించారు ________________________________________ 4. పింగళి నాగేంద్రరావు (1901-1971) : ఆజన్మ బ్రహ్మచారి. సినిమా సంభాషణలలో కొత్త హాస్య పదాలు సినిమాలలో కొత్త పాత్రలు సృష్టించి మరెన్నో ప్రయోగాలు చేసి సినీ సాహి త్య స్వరూపాన్ని మార్చివేసిన సినీ సరస్వతీ పుత్రుడు. జానపదమైనా, పౌరాణికమైనా, సాంఘికమైనా జానపదులు సైతం మెచ్చే సరళభాషను ఉపయోగించిన సినీ ఆదికవి. ‘అయ్యో పాపం పసివాడు' పాతాళభైరవి, ‘ఆడు వారి మాటలకు అర్థాలే వేరయా' మిస్సమ్మ ఇందుకు ఉదాహరణలు. పాతాళభైరవి, మా యాబజారు వంటి చిత్రాలలో వినోదం వర్షింప జేసిన ఈయన కలం 'వింధ్యరాణి', 'మహామం త్రితిమ్మరుసు', 'చాణక్య చంద్రగుప్త'లలో ఠీవిగా పరుగిడింది. 5. అడివి బాపిరాజు (1895-1952) ఒక భారతీయ బహుభాషావేత్త , అతను తెలుగు భాషలో నవలా రచయిత, నాటక రచయిత , చిత్రకారుడు, కళా దర్శకుడు మరియు తెలుగు నాటకరంగం మరియు సినిమాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందిన వలసవాద వ్యతిరేక జాతీయవాది . అతను గోన గన్నా రెడ్డి , నారాయణ రావు , మరియు హిమబిందు వంటి సాహిత్య రచనలకు ప్రసిద్ధి చెందాడు . 6. దీర్ఘాసి విజైభాస్కర్: డా. దీర్ఘాసి విజయభాస్కర్ నాటక రచయితగా, కవిగా, కథకుడిగా, అనువాద రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటకరంగానికి సంబంధించిన పరిశోధనలో మంచి పేరు సంపాదించిన రచయిత. విజయభాస్కర్ శ్రీకాకుళం జిల్లా అంపోలులో 1958 జులై 31న జన్మించాడు. తండ్రి పేరు సూర్యనారాయణ, తల్లి పేరు వరాలమ్మ. అంపోలు గ్రామంలో ప్రాధమికవిద్య, శ్రీ కూర్మం లో హైస్కూల్ విద్యని అభ్యసించి, ఇంటర్మీడియట్, డిగ్రీ శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజీలో ఎం,ఎ ఇంగ్లిష్ లిటరేచర్ ఆంధ్రా యూనివర్సిటిలో చదివారు. డిగ్రీలోనే మొట్టమొదటి నాటిక "తూర్పు తెల్లారింది" రచించారు 7. డా.చిలుకూరి నారాయణరావు (ఆగష్టు 9, 1889 - జూన్ 22, 1951) భాషావేత్త,చరిత్రకారుడు,సంస్కృతాంధ్రపండితుడు.ఈయన విశాఖపట్నం జిల్లా, పొందూరు సమీపంలోని ఆనందపురంలో 1889, ఆగష్టు 9 నజన్మించాడు.తండ్రిభీమాచారి.తల్లిలక్ష్మమ్మ.మాతృభాష కన్నడం. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి ఉంది. 8. Malladi Venkata KrishnaSharma మల్లాది వేంకట కృష్ణశర్మగారు 1907లో శ్రీకాకుళంలో జన్మించారు.. సుప్రసిద్ధ నాటకాలు, నాటికలూ చాలా రాసి, సినిమాల్లోకి ప్రవేశించారు. తొలి చిత్రం- అంజలి పిక్చర్స్ నిర్మించిన 'పరదేశి' (1953). మల్లాది వెంకట కృష్ణశర్మగారి సినిమా రంగప్రవేశం. ఆయన రాసిన హాస్య నాటకాలు ఎన్నో దొంగాటకం, డొంకలో షరాబు, గ్రీన్రూమ్, కిర్రు గానుగ వంటి నాటికలు బాగా ప్రదర్శితమయ్యేవి. ఐతే, ఆయన పూర్తిపేరు మల్లాది విశ్వనాథశర్మ. 'కవిరాజు' బిరుదు. ఆ బిరుదునే పేరుగా వాడుకున్నారాయన. 1936లో సినిమా రంగంలో ప్రవేశించి, 'భక్త మార్కండేయ (1938)', 'మాలతీ మధనం' (1940), 'పంతులమ్మ' (1943) 'సౌదామిని' (1951) మొదలైన చిత్రాలకు రచన చేశారు. భరణివారు తీసిన 'చక్రపాణి'కి కథకుడు ఆయనే. 9. అట్టాడ అప్పలనాయుడు: ప్రముఖ తెలుగు కథా రచయిత.ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలారచయిత. విజయనగరం జిల్లా, కొమరాడ మండలం గుమడ గ్రామంలో 1953వ సంవత్సరం ఆగష్టు 23వ తేదీన జన్మించాడు.[1] కోటిపాం జిల్లాపరిషత్ హైస్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితుడయ్యాడు. జననాట్యమండలిలో పనిచేశాడు. ఇతడు 100కి పైగా కథలు, నాలుగు నవలలు, కొన్ని నాటికలు వ్రాశాడు. ఇతని రచనలు సృజన, అరుణతార, అంకితం, ప్రజాసాహితి, ఇండియాటుడే, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, పుస్తకం, యువత మందస, విపుల, ఆహ్వానం, వార్త, నూతన, ప్రజాశక్తి, ఆంధ్రమాలిక, సుప్రభాతం, నవ్య, రచన, జముకు, నాగావళి, చినుకు, స్వాతి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు సమగ్రంగా అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం అనే పేరుతో మూడు సంపుటాలలో వెలువడింది. 10. భావశ్రీ శ్రీకాకుళానికి చెందిన ఈయన జిల్లా సాంస్కృతిక కౌన్సిల్కు రెండుసార్లు సభ్యునిగా, మూడుసార్లు అధికార భాషా సంఘ సభ్యునిగా వ్యవహరించారు. పద్యం, గద్యం, నాటిక, నాటకం, సమీక్ష, సంగీత రూపకం, గజల్స్, గేయాలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, ఏకపాత్రలు, పల్లెసుద్దులు, గిరిజన గీతాలు, అనువాదాలు, హరికథలు, బుర్రకథలు.. ఇలా అనేక సాహితీ ప్రక్రియలలో 120కు పైగా గ్రంథాలు రాసిన సాహితీయోధుడాయన. 11. రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922 జూలై 30(22)న శ్రీకాకుళంలో జన్మించాడు. ఈయన స్వస్థలము అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామము. ఈయన తండ్రి -న్యాయవాది , తల్లి- సాహితీకారిణి. తన తాత గారైన (his maternal grandfather) శ్రీరామమూర్తి ఇంట్లో పుట్టి పెరిగారు .లా కోర్సు పూర్తి అయ్యాక తాత దగ్గరే న్యాయశాస్త్రము లో బేసిక్ విదివిధానాలు నేర్చుకున్నారు . ఇక్కడే తాత దగ్గరే ఉండి కొన్నాళ్లు' లా 'ప్రాక్టిష్ చేసారు . రాచకొండ విశ్వనాధశాస్త్రి వృత్తి రీత్యా న్యాయవాది. అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి గల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు. 12. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి ... కవి , పండితుడు ,సంస్కర్త , గాంధేయవాది , స్వాతంత్ర సమరయోధుడు . జన్మ స్థలము : సింగుపురము .. శ్రీకాకులం మండళం లో పుట్టినతేదీ : 29-04-1876 ,మరణము : 26-09-1947 , రచనలు :ఆంధ్ర వేదములు ,అనుభూతిప్రకాశము ,అస్పృశ్యత ,వివాహతత్వము,కొండవీటి విజయము ,యక్షగాన తత్వము , భగవద్గీతా తత్వము ,సాహిత్యసర్వస్వము , ... మున్నగునవి , కందుకూరి వీరేశలింగం విధవలకు పెళ్లిళ్లు చేస్తే దీన్ని మరింతగా సంస్కరించారు జిల్లాకు చెందిన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి. చిన్నవయస్సులో పెళ్లయి గర్భాదానం జరగకుండా విధవ అయిన కన్యలకు వివాహం జరిపించి ఆదర్శంగా నిలిచారు. జీలకర్ర, బెల్లం పెట్టి తాళి కట్టినంత మాత్రాన వివాహం జరిగినట్టు కాదని, గర్భాదానం అయితేనే వివాహం అయినట్టు అని ఆయన వాదించారు. ఈ పద్ధతి మొదటిగా ఆయన తన ఇంట్లో పాటించడంతో ఆయన్ను ఆనాడు సంఘం నుంచి వెలివేసినా మొక్కవోని ధైర్యంతో సవాల్ స్వీకరించి వివాహతత్వం అనే గ్రంథాన్ని రచించి చరిత్రలో చిరస్మరణీయుడయ్యారు. ఆయన కృషికి పాండిత్యానికి మెచ్చి ఇంటాక్ సంస్థ నాగావళి మూడో వంతెనపై విగ్రహాన్ని ప్రతిష్టించింది(06/07/2009) . అంతటి మహానీయులు ఉండడం జిల్లాకు గర్వకారణం. 13.రోణంకి అప్పలస్వామి: అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోణంకి అప్పలస్వామి . అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులూ అయిన రోణంకి అప్పలస్వామి గారి శతజయంతి ఈ సెప్టెంబరు 15న జరుగనుంది. ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్, గ్రీక, హిబ్రూ, ఇటాలియన్ మొదలైన ఆరు యురోపియన్ భాషలలో నిష్ణాతులు. శ్రీశ్రీ, ఆరుద్రలకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చినవారు. అల్లసానిపెద్దన, భట్టుమూర్తి, క్షేత్రయ్య మొదలు శ్రీశ్రీ, నారాయణబాబు, చావలి బంగారమ్మ, చాసో మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు. అప్పలస్వామిగారు శ్రీకాకుళంజిల్లా టెక్కలి సమీపంలోని ఇజ్జవరం అనే గ్రామంలో 1909 సెప్టెంబరు 15న జన్మించారు. తండ్రి రోణంకి నారాయణ్ , తల్లి - రోణంకి చిట్టెమ్మ . తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, విజయనగరం, కాశీ హిందూ విశ్వవిద్యాల యాల్లో చదువుకుని ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు ఉద్యోగం చేసి - ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యా రు. మరొక రెండేళ్ళు - ఆంధ్ర విశ్వవిద్యాల యంలో ఎమెరిషస్ ప్రొఫెసర్గా పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు. 1987 మార్చిలో మరణించారు. 14. భాస్కరభట్ల రమికుమార్ ఓ సాధారణ కుటుంబం లోనుంచి వచ్చి పాత్రికేయుడుగా జీవితమ్లో తొలి ఆడుగులను వేసిన ఈ కుర్రాడు శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన వాడే . తన సినీగీతాలతో ప్రస్తుతం ఆంధ్రదేశాన్నింతటినీ ఉర్రూతలూగిస్తున్నారు . దాదాపు 300 పైగా సినీగీతాలు రాసి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు . రవి కుమార్ సినిమా పాటల రచయిత . " పెల్లెన్దుకే రమణమ్మ " , " ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే " , " బొమ్మను గీస్తే నీలా ఉందని భావుకతకు అద్దంపట్టినా " , "నచ్చావులే " ఇంకా ఎన్నో ఎన్నోన్నో ... 1995 లో హైదరాబాద్ వెళ్ళేరు . కొన్నాళ్ళు ఈనాడు , సితార లో విలేకరి గా పనిచేశారు . తర్వాత సినీ గేయ రచియిత గా పేరు వచ్చింది . సుమారు 300 పాటలు వ్రాసారు . 15. వల్లూరు దాలినాయుడు వల్లూరు దాలినాయుడు. (ఎంఏ, ఎం.ఎ.,ఎం.ఈడీ.,) ఉపాధ్యాయ శిక్షణ: విజయనగరం డైట్లో, ఉపాధ్యాయ వృత్తి: 1989 జూన్ నెల నుంచి విద్యావిషయాలు :బొద్దూరు ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకూ, గుళ్ళ సీతారాంపురం ఉన్నత పాఠశాలలో నుంచి 10వ తరగతి వరకు,రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, గరివిడి ఎస్. డి.ఎస్. కళాశాలలో B.A.డిగ్రీ.,గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ లో బి.ఎడి., ఆంద్రాయూనివర్సిటీ లో ఎం.ఎ.(తెలుగు),(రాజనీతిశాస్త్రం) ఎం.ఎడి. చదువుకున్నారు. దాలినాయుడు రచించిన కథల పుస్తకాలు తెలివైన మనిషి, అన్నదమ్ములు, పేదరాశి పెద్దమ్మ, అమ్మమాట, పిచ్చుక, నక్కతెలివి, బంగారు,గుమ్మడికాయ ,నక్కపోతు అప్పు,పందెం మోజు తీరింది. చిన్నవాడి ఉపాయం, నుట్టడి కథ, డమ్మిడి, బంగారు, మోసగారి నక్క, పొన్గడాల చెట్టు, బాలనాగమ్మ కథలు వంటి పుస్తకాలు ప్రస్తుతం ప్రతి పాఠశాలలోనూ చిన్నారులను ఆకర్షిస్తున్నాయి. దాలినాయుడు రచించిన కథలను న్యూఢిల్లీకి చెందిన చీఫ్ పెదగాజీ కన్సెల్టెంట్ వినయ్ పట్నాయక్ అభినందించడం గమనార్హం.. .స్పూర్తి ప్రధాతలు: విద్యావేత్తలు గిజాబాయి, కృష్ణకుమార్, డా.విక్టర్. 16. గార రంగనాథం పేరు: గార రంగనాథం పుట్టిన ఊరు: గార మండలం, శ్రీకాకుళం జిల్లా రచనా రంగం: కవిత్వం, వ్యాసాలు ప్రత్యేకత: • గ్రామీణ జీవితం, రైతు సమస్యలు, ప్రజల బాధలను ప్రతిబింబించిన రచనలు • సరళమైన భాషలో గాఢమైన భావాలు సాహిత్య సేవ: ప్రాంతీయ కవిత్వానికి గుర్తింపు తీసుకొచ్చిన రచయిత. రాజాం రచయితల సంఘం అద్యక్షులు. కాలం కత్తిమొన మీద కవితా సంపుటి, రాయరత్న మంజూష, చారిత్రిక అన్వేషణ మొదలైన గ్రంధాలను రచించారు. ________________________________________ 17. వావిలపల్లి జగన్నాథ నాయుడు పూర్తి పేరు: వావిలపల్లి జగన్నాథ నాయుడు పుట్టిన ప్రాంతం: మందరాడ గ్రామం ,శ్రీకాకుళం జిల్లా రచనా రంగం: కవిత్వం, సాహిత్య వ్యాసాలు ప్రత్యేకత: • సంప్రదాయ భావాలు + ఆధునిక దృక్పథం • తెలుగు భాషా పరిరక్షణపై రచనలు గుర్తింపు: ప్రాంతీయ సాహిత్య వేదికల్లో గౌరవనీయ రచయిత ________________________________________ 18.తాపీ ధర్మారావు నాయుడు (Tapi Dharma Rao Naidu) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు . జీవిత చరిత్ర ధర్మారావు 1887 సం.లో సెప్టెంబరు 19న బెర్హంపూరు లో జన్మించాడు. ఇతను 1973 మే 8న మరణించాడు. రచనలు ఆంధ్రులకొక మనవి, దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936, పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960, ఇనుపకచ్చడాలు, సాహిత్య మొర్మొరాలు, రాలూ రప్పలూ, మబ్బు తెరలు, పాతపాళీ, కొత్తపాళీ 19. అడవి బాపిరాజు (Adavi Bapiraju) పుట్టిన తేదీ: 23 సెప్టెంబర్ 1895 మరణం: 8 సెప్టెంబర్ 1952 పుట్టిన ఊరు: భామిని మండలం, శ్రీకాకుళం జిల్లా వృత్తి: కథకుడు, కవి, చిత్రకారుడు ప్రసిద్ధ రచనలు: నారాయణ భట్టు, కథలు, వ్యాసాలు 20. కట్టమంచి రామలింగారెడ్డి (Kattamanchi Ramalinga Reddy) పుట్టిన తేదీ: 1880 మరణం: 1959 పుట్టిన ప్రాంతం: శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతం వృత్తి: వ్యాసకర్త, విద్యావేత్త రచనలు: సాహిత్య విమర్శలు, తత్వ వ్యాసాలు 🖼 21. మాకినేని బసవ పున్నయ్య (Makkineni Basava Punnaiah) పుట్టిన తేదీ: 1912 మరణం: 1999 పుట్టిన ప్రాంతం: శ్రీకాకుళం జిల్లా వృత్తి: కథకుడు, సంఘ సంస్కర్త రచనల ప్రత్యేకత: సామాజిక అసమానతలపై కథలు ________________________________________ 22. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (Yarlagadda Lakshmi Prasad) పుట్టిన ప్రాంతం: శ్రీకాకుళం జిల్లా వృత్తి: కవి, కథారచయిత ప్రత్యేకత: గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించే రచనలు 23.బొంగు సూర్యనారాయణ టెక్కలి మండలం పిఠాపురం • సుప్రభాత సహిత సూర్యశతకం , • శ్రీరామక్రిష్ణ యుద్ధం , • నవ్యాంధ్ర సుమతీ శతకం , • రావివలస ఎండల్ మల్లిఖార్జున స్వామివారి క్షేత్ర మహత్యం , • లీలావతార గాధ , • వెంకటేశ్వర శతకం , • శివక్షేత్ర మహర్యం , వంటి పద్యకావ్యాలు పుస్తక రూపం లో విడుదలై ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి . 24.గంటేడ గౌరు నాయుడు తల్లిపేరు: సోములమ్మ తండ్రి పేరు: గంటేడ సత్యంనాయుడు రచనలు :అవతలి ఒడ్డు,ఆసరసాల,ఇది చేదు కథ కాదు,ఏటిపాట,ఒక రాత్రి రెండు స్వప్నాలు,కాటు, కొండమల్లె,గెంజిమెతుకులు,చొక్కాగుడ్డ కోసం,జీవసూత్రం,తిరుగుడు గుమ్మి,దేవుడూ వర్ధిల్లు,నరాలు తెగుతున్న నేల,నాణెంకిందచీమ,నీటిముల్లు… 25.టంకాల సత్యనారాయణ తెలుగు పద్య కవి. కవితా విశారద బిరుదు పొందినవాడు. టంకాల సత్యనారాయణ అన్నపూర్ణ, అప్పన్న దంపతులకు 1908వ సంవత్సరం, జూన్ 30వ తేదీన జన్మించాడు. వైశ్య కులస్థుడు. దేవకుల గోత్రజుడు. శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన నివగం గ్రామం ఇతని స్వస్థలం. 26.త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి ప్రముఖ సంస్కృతాంధ్ర కవి. ఇతడు తెలగా వంశీయుడు. తల్లి: నారాయణమ్మ. తండ్రి: త్రిపురాన తమ్మయ్యదొర. ఇతని జన్మస్థానము: శ్రీకాకుళం తాలూకాలోని సిద్ధాంతము. జననము: 1889 అక్టోబరు 31 తేది. నిర్యాణము: 1945. 1. నిర్వచన కుమారసంభవము (6 ఆశ్వాసములు. 1913 ముద్రి.) 2. రఘూదయము (4 ఆశ్వా. 1924 ముద్రి.) 3. రతి విలాపము (ద్విపద కావ్యము 1926 ముద్రి.) 4. మొయిలు రాయబారము (కాళిదాసుని మేఘ సందేశమునకు స్వతంత్ర దేశీయ గేయానువాదము. 1940 ముద్రి.) 27.పురుషోత్తం చౌదరి (సెప్టెంబరు 5, 1803 - ఆగష్టు 23, 1890) తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు.. శ్రీకాకుళం జిల్లా తెంబూరు (పాతపట్నం) శివారు మదనాపురం (తెంబూరు (పాతపట్నం) లో 1803, సెప్టెంబరు 5 న బెంగాళీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుభద్రాదేవి, కూర్మానాథ చౌదరి దంపతులకు జన్మించారు. 28.మాడుగుల వేంకట సూర్య ప్రసాదరాయ కవి శతావధాని, కవి, బహుగ్రంథకర్త. అంతే కాక వైద్యశాస్త్ర, జ్యోతిష శాస్త్ర, మంత్రశాస్త్రాలలో ప్రవీణుడుఇతడు ఒక జమీందారీ కుటుంబంలో 1912, జూలై 31న జన్మించాడు. వీరభద్రసీతారామరాయకవి, సన్యాసాంబ ఇతని తల్లిదండ్రులు. శ్రీకాకుళం జిల్లా, బొంతల కోడూరు ఇతని జన్మస్థానం. సుబ్బారావు పాణిగ్రాహి విప్లవ ప్రజాకవి. ఇతడు 1934, సెప్టెంబర్ 8న శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం బారువాలో ఒక పూజారి కుటుంబంలో జన్మించాడు రచనలు నాటికలు రచనలు : కుంకుమరేఖ,రిక్షావాలా,ఎండమావులు,కాలచక్రం,విముక్తి . 29.సోమంచి వాసుదేవరావు ( 1902 నవంబరు 16 - 1965 సెప్టెంబరు 27) ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం నకు చెందిన కవి. తల్లిదండ్రులు సోమంచి కోదండరామయ్య, సూరమ్మ దంపతులకు సనాతన వైదీక బ్రాహ్మణ కుటుంబంలో వాసుదేవరావు జన్మించారు. శ్రీ శివస్తుతి నవగ్రహ స్తోత్రములు, శ్రీ వెంకటేశ్వరస్తవము, శ్రీ కిష్కింధకాండము, కర్ణుడు-గాంధారీ నిర్వేదనము 30.మజ్జి భారతి : శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం డోలపేట వీరి నివాసం తల్లిదండ్రులు: మజ్జి చంద్రినాయుడు,లోలాక్షి. రచనలు: నాన్నమ్మ కతలు, కాలం ఘణీభవించింది,ప్రతిచర్య,కనిపించనితెర మొదలైన రచనలు చేశారు. పిల్లా తిరుపతిరావు నివాసం రాజాం. వ్యాస కర్త. అనేక పత్రికలలో సమకాలీన సమస్యలపైన, అంశాలపై వ్యాసాలు రాశారు. పచ్చడం అనే వ్యాస సంపుటి ఈయన రచన .

Sunday, 21 December 2025

#మతి మరుపు# కాళీపట్టణపు రాజకుమారుడు చంద్ర భానుడు తన తండ్రితో గాని, అన్నలతో గాని చెప్పకుండా దేశయాత్రకు బయలు దేరాడు. అతను ఒక మహారణ్యం ప్రవే శించి, దానిలో నుంచి బయటికి వచ్చే మార్గం తెలియక, రోజల్లా ప్రయాణించి, చీకటిపడ్డాక ఒక ఇల్లు చేరుకున్నాడు. ఆ ఇంట ఒక ముసలిదీ, ఒక పడుచుపిల్లా మాత్రమే వున్నారు. మగదిక్కు లేకుండా ఆ నిర్జనవనంలో వాళ్ళిద్దరూ ఎలా ఉంటు న్నారో చంద్రభానుడికి అర్ధం కాలేదు. "అందరికీ దిక్కు ఆ భగవంతుడే ఉన్నాడు. నేను కదలలేని స్థితిలో ఉన్నాను. నా కూతురు చంద్రిక నాకే లోటూ రాకుండా చూస్తున్నది,” అన్నది ముసలిది. చంద్రిక వంట చేసి అతనికి దివ్యమైన భోజనం పెట్టింది. ఆ భోజనం చూసి అతను ఆశ్చర్యపడ్డాడు. చంద్రికను చూస్తే అతనికి మరింత ఆశ్చర్య మయింది. ఆ పిల్ల ఆ ముసలిదాని కూతురంటే నమ్మశక్యంగా లేదు. ఇద్దరికీ ఎలాంటి పోలికలూ లేవు. అంతేగాక చంద్రిక మసిపాతలో కట్టిన మాణిక్యం లాగున్నది. ఆ రాత్రి అతను ముసలిదాని ఇంటనే పడుకున్నాడు. కాని అతనికి సరిగా నిద్ర పట్టలేదు. పట్టిన నిద్రలోనే అతని కొక పీడ కల వచ్చింది. ఆ కలలో తా నొక కుక్క అయినట్టూ, తనను ఒక చోట కట్టి ఉంచి నట్టూ, తాను మాట్లాడబోయి మూలిగినట్టూ అతను కలగన్నాడు. అంతలోనే అతనికి నిద్రాభంగ మయింది. అతను కళ్ళుతెరిచి చూసేసరికి తాను పడుకున్న చోట ఉండ టానికి బదులు గోడవార కూర్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా చంద్రిక నిలబడి ఉన్నది. " వ్యవధి లేదు. తూర్పు తెల్లవారేసరి కల్లా ముసలిది మళ్ళీ తిరిగి వస్తుంది.ఈ లోపల నేను విన్ను అడివి దాటిస్తాను,” అన్నది చంద్రిక అతన్ని తొందర చేస్తూ. చంద్రభానుడు ప్రశ్నలు వేసి కాల యాపన చెయ్యక, చంద్రిక వెంట బయలు దేరాడు. దారిలో చంద్రిక అతనికి ఆ ముసలిదాన్ని గురించిన రహస్యమంతా చెప్పేసింది. ఆ ముసలిది ఒక మంత్రగత్తె. కేశవ పురం రాజుగారి దివాణంలో మంత్రసానిగా ప్రవేశించి, ఆ రాజుభార్య రెండవసారి ఆడపిల్లను కన్నప్పుడు ఆ బిడ్డను మార్చేసి, ఆ స్థానంలో తన బిడ్డను పెట్టేసింది. ఆ రాణి కన్నబిడ్డ చంద్రిక. ముసలిది ప్రతి రాత్రీ ఎటో వెళ్లి, తెల్ల వారుతూండగా తిరిగి వస్తుంది, ఇంటికి కావలిసిన వస్తువులన్నీ తెస్తుంది. పగలు నిద్ర లేచినది మొదలు రాత్రి పడుకోబోయే దాకా ఇంటి చాకిరి 'అంతా చంద్రికే చెయ్యాలి. చంద్రికకు ముసలిది కొన్ని మంత్రాలూ, తంత్రాలూ నేర్పింది. కాని ముసలిదానికి తెలియకుండా చంద్రిక చాలా విషయాలు నేర్చుకున్నది. "రాత్రి నువు నిద్రపోగానే ముసలిది నిన్ను కుక్కను చేసి కట్టేసి మరీ బయలు దేరింది. నిన్ను బహుశా కుక్కగానే ఉప -యోగించుకుందామని ఆవిడ ఉద్దేశమేమో. నేను నిన్ను మనిషిగా మార్చేశాను. ముస అది వచ్చి నిన్ను గురించి అడిగితే నా కేమీ తెలియదంటాను. నేను నిన్ను మనిషిని చెయ్యగలనని ఆవిడకు తెలీదు. కుక్కగానే తప్పించుకు పోయావనుకుంటుంది. ఈ అర ణ్యం దాటి బయటపడితే నీకు ముసలిదాని పీడ ఉండదు,” అని చంద్రిక చంద్రభాను డితో చెప్పింది. తాను కల అనుకున్నది వాస్త వంగానే జరిగినట్టు అతను తెలుసుకున్నాడు. " నాతోపాటు నువు కూడా ముసలిదాని నుంచి తప్పించుకు పోరాదా?” అని అతను చంద్రికను అడిగాడు."తప్పించుకుని ఎక్కడికిపోను ? మాది దూరదేశం. నే నక్కడికి ఒంటరిగా పోలేను. వెళ్ళినా, నేనే తమ అసలు కూతురినవి నా తల్లిదండ్రులు నమ్మరు. నేను పుట్టిన మరుక్షణం నుంచి నాకి ముసలిదే తల్లిగా ఉంటున్నది. నన్ను బాగానే చూసుకుం టుంది. ఆలాటప్పుడు నే నావిడను వదిలి ఎక్కడికో పోవటంలో అర్థమేమిటి?” అని చంద్రిక అడిగింది. "నీ యౌవనమూ, సౌందర్యమూ అడవి గాసిన వెన్నెల అయిపోవటం లేదా? ఈ జీవితం నీ కెలా సుఖంగా ఉంటుంది? మా దేశం వచ్చేసి, నన్ను పెళ్ళాడు. నీకు జీవితం హాయిగా గడిచిపోతుంది,” అన్నాడు. చంద్రభానుడు. "అంతకాలం అరణ్యంలో బతికి ఇప్పుడు రాణివాసంలో ఉండగలనా? నన్ను పెళ్ళాడి నువు సుఖపడవేమో!" అన్నది చంద్రిక. "నిన్ను పెళ్ళాడకపోతే నేను అసలు పెళ్ళే చేసుకొను," అని చంద్రభానుడు శపథం చేశాడు. "సరే, అయితే నీవెంట వస్తాను. కాని నా భారమంతా నువే వహించాలి, గుర్తుంచుకో,” అన్నది చంద్రిక. ఛీటృఆ అందుకు చంద్రభానుడు ఒప్పుకున్నాడు. ఇంకా కొంత రాత్రి ఉండగానే ఇద్దరూ ఆరణ్యం దాటారు. వారు అనేక దేశాలు గడిచి, చాలారోజులు ప్రయాణంచేసి, కాళీ పట్టణం సమీపానికి చేరుకున్నారు. చంద్ర భానుడు చంద్రికను ఒక చెట్టు కింద ఉండ మని, "నా కాబోయే భార్య నగరంలోకి నడిచి రావటం నా కెంతమాత్రమూ ఇష్టం లేదు. నేను రాజభవనానికి వెళ్ళి నీ కోసం పల్లకీ, మంగళవాద్యాలూ, దాస దాసీలూ, కానుకలూ వెంటబెట్టుకుని వచ్చి, ఊరే గింపుతో మా ఇంటికి తీసుకు పోతాను," అని చెప్పాడు." నువు ఒక్కడివే ఇంటికి పోతే నన్ను మరిచిపోతావేమో. నాకు కాలినడకన రాజ భవనానికి రావటాని కేమీ అభ్యంతరం లేదు. ఊరేగింపూ అవీ కూడా దేనికి?” అన్నది చంద్రిక. " భారమంతా నామీద వేశావు. నాయిష్ట ప్రకారం జరగనీ," అంటూ చంద్రభానుడు అతి వేగంగా రాజభవనానికి వెళ్ళాడు. అతన్ని ఆకస్మికంగా చూసి అందరూ ఆశ్చ ర్యపడ్డారు. వాళ్ళు వేసే ప్రశ్నలేవీ విని పెంచుకోకుండా, "అన్ని సంగతులూ తర వాత నింపాదిగా చెబుతాను, ముందు ఒక పల్లకీ, నౌకర్లూ, మంగళవాద్యాలూ, కాను కలూ సిద్ధం చేయించండి,” అని ఆజ్ఞా పించాడు చంద్రభానుడు. దైవికంగా ఆరోజే చంద్రభానుడి అన్నకు వివాహం జరుగుతున్నది. అందుచేత రాజ భవనం చాలా సందడిగా ఉన్నది. అంతః పురంలోవాళ్ళు అతనికి పెళ్ళికూతురినీ, ఆమె చెల్లెలినీ చూపారు. కాని అతని మన సంతా చెట్టు కింద వేచివున్న చంద్రిక పైనే ఉన్నది. అతనికి కాలు నిలవటంలేదు. "వచ్చి క్షణం కాలేదు, మళ్ళీ ప్రయాణ సన్నాహంలో ఉన్నట్టున్నా వేమిటి? భోజనం సిద్ధంగా ఉన్నది, భోజనంచెయ్యి,” అని అతని తల్లి అన్నది. "ఇప్పుడు వ్యవధిలేదు. మళ్ళీ వచ్చి చేస్తాను," అన్నాడు చంద్రభానుడు. "భోజనం చెయ్యటానికి వ్యవధి లేకపోతే ఈ పండయినా తీసుకోండి," అంటూ పెళ్ళి కూతురి చెల్లెలు అతని చేతికొక పండిచ్చింది. దాన్ని తీసుకున్న మరుక్షణం చంద్రభాను డికి గతమంతా మరుపుకు వచ్చింది. అతను చంద్రికను పూర్తిగా మరిచిపోయి, తనకు పండిచ్చిన పిల్ల కేసి చూశాడు. ఆమె పేరు చంద్రకళ. తన అన్నను చేసుకోబోతున్న పిల్లకు చెల్లెలు. వాళ్ళు కేశవపురం రాజు గారి కుమార్తెలు.చంద్రకళ చంద్రభానుడి కళ్ళకు అద్భుత సౌందర్యవతిగా కనబడింది. తన అన్నతో బాటు తాను కూడా చంద్రకళను పెళ్ళాడితే బాగుండునని అతనికి తోచింది. అతను చంద్రకళను తదేకంగా చూస్తూ ఉండటం కనిపెట్టి, అతని తల్లి, "మీ ఇద్ద రికీ పెళ్ళయితే చాలా ముచ్చటగా వుంటుంది, బాబూ. అందుకే నిన్ను దేవుడు ఈ సమయానికి ఇంటికి పంపాడు!" అన్నది. చంద్రభాను డీ మాటకు సంతోషంగా మందహాసం చేశాడు. చంద్రకళ సిగ్గుతో తలవంచుకున్నది. ఇంతలో ఎవరో వచ్చి, "మహారాజా, మీరు కోరిన ప్రకారం పల్లకీ, భజంత్రీలూ, నౌకర్లూ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏం సెలవు?" అని అడిగారు. "నేను కోరానా ? నాకు పల్లకీలూ, భజంత్రీలూ దేనికి? ఎవరో పొరపాటు పడ్డారు,” అన్నాడు చంద్రభానుడు. అక్కడ చంద్రిక చంద్రభానుడి కోసం గంటలతరబడి ఎదురుచూసి, తాను భయపడినంతా అయిందనీ, అతను తనను మరిచాడనీ అనుకున్నది. ఆమె ఆక్కడి నుంచి బయలుదేరి రాజభవనం వేపు నడుస్తూ వెళ్ళింది. రాజభవనానికి సమీ పంలో ఒక విశాలమైన మైదానం ఉన్నది. దాని చివర ఒకేఒక పూరిపాక ఉన్నది. చంద్రిక ఆ పాకలోకి ప్రవేశించి, అక్కడ ఉండే ముసలిదానితో, " అవ్వా, నన్నిక్కడ కొంతకాలం ఉండనిస్తావా? నీకు కావలిసిన పనులన్నీ చేసిపెడతాను,” అన్నది. అవ్వ సరే నన్నది. " అవ్వా, ఈ ఇంటిని కొంచెం అందంగా చెయ్యనిస్తావా?" అని చంద్రిక అడిగింది. " నా దగ్గిర చిల్లిగవ్వ లేదు. నీకు చాత నైతే చెయ్యి, తల్లీ," అన్నది అవ్వ. చంద్రిక బయటికి వెళ్ళి ఒక బుట్ట నిండా ఇసుక తెచ్చి ఇంటి లోపలా బయటా గోడలకుచల్లింది. వెంటనే ఆ పాకగోడలు బంగారు గోడల్లాగా అయిపోయాయి. అదే విధంగా చంద్రిక ఇంటి లోపలి నేల అంతా పాల గచ్చు లాగా చేసేసింది. పై కప్ప మీద గుండ్రని బంగారు గుమ్మటం వెలిసింది. తన అల్లు అలా మారిపోవటం చూసి అవ్వకు దడ పుట్టుకొచ్చింది. చంద్రిక ఏ దయ్యమో, భూతమో అనుకుని, ఆమె ఇంటిని వదిలేసి ఎటో పారిపోయింది. మర్నాడే రాజకుమారుల జంట వివా హాలు, పధూవరుల చేత ముందుగా దేవీ పూజ చేయించవలసి ఉండటం చేత, ఇద్దరు పెళ్ళికొడుకులనూ, ఇద్దరు పెళ్ళి కూతుళ్ళనూ ఒక రధంలో కూర్చోబెట్టి, పురోహితుడు మొదలైనవారు నగరం వెలు పల ఉండే ఆలయానికి బయలుదేరారు. రథం చంద్రిక ఉండే ఇంటి ముందుకు వచ్చేసరికల్లా దాని ఇరుసు విరిగింది. వెంటనే కొత్తణరుసు తెప్పించారు. కాని అమర్చిన మరుక్షణం అది కూడా విరిగింది. ఈ లోపల, పరివారంలో ఉన్నవా డొకడు పక్కనే ఉన్న బంగారపుటింటిని చూసి అది అంతకు ముందు అక్కడ లేకపోవటం తెలిసి, అందులో ఎవరున్నారో చూదామని లోపలికి వెళ్ళాడు. చంద్రిక కనిపించి, "ఎవరు మీరు? వీధిలో ఏమిటాహడావుడి?" అని అడిగింది. "రాజకుమారుళ్ళు తమ వధువులతో దేవీ పూజకు పోతూంటే దారిలో రథం ఇరుసు విరిగింది. కొత్తకారుసు వేస్తే అది కూడా విరిగింది. ఏం మాయో తెలియటం లేదు,” అన్నాడు పరివారకుడు. "అంతేనా? ఈ అనపచువ్వ ఇరుసుగా అమర్చమను,” అంటూ చంద్రిక ఒక ఇనప చువ్వను అతని కిచ్చింది. అతను క్షణంపాటు నిర్ఘాంతపోయి, ఆ చువ్వను తీసుకుపోయి రథం మరమ్మతు చేసేవాడి కిచ్చాడు. వాడు దాన్ని ఇరుసుగాఅమర్చాడు. అది విరగకుండా నిలిచింది. "ఇక బయలుదేరండి,” అని పురోహితుడు తొందర చేశాడు. కాని ఆయన మాట పూర్తికాక ముందే, రథపు చట్రం పెళపెళా విరిగింది. అందరూ కంగారెత్తారు. ఇంకొక చట్రం తెప్పించి అమర్చారు. అది కూడా విరిగింది. అనవచువ్వ తెచ్చిన పరివారకుడే మళ్ళీ చంద్రిక వద్దకు వెళ్ళి, " అమ్మా, మాకు మళ్ళీ చిక్కు వచ్చిపడింది. రథంచట్రం కాస్తా విరిగింది. కొత్తది వేసినా విరిగింది. దాని కేమన్నా ఉపాయం చెప్పగలవా?" అని అడిగాడు. "దానికేముంది? ఇంటి తలుపొకటి ఇస్తాను: దాన్ని చట్రంగా అమర్చితే విర గదు," అన్నది చంద్రిక, పరివారకుడు బంగారుతలుపు నొకదాన్ని తీసుకునివెళ్ళి రధానికి చట్రంగా అమర్చ మన్నాడు. అది విరగలేదు. ఇక ఫరవాలే దనుకుని సారధి రథం ఎక్కి కూర్చుని గుర్రాలను అదిలించాడు. కాని అవి కదల లేకపోయాయి. అప్పటికే రధానికి నాలుగు గుర్రా లున్నాయి. మరి నాలిగింటిని తెచ్చి రథానికి పూన్చారు. కాని ఎనిమిదిగుర్రాలూ లాగినా రథం కదలలేదు. పరివారకుడు మళ్ళీ చంద్రిక వద్దకు వెళ్ళి ఉపాయం అడిగాడు. "ఆ గుర్రాలను విప్పి, రథానికి మా దొడ్లో ఉన్న ఆవుదూడను కట్టండి, రథం కదులు తుంది," అన్నది చంద్రిక. అప్పటికే వ్యవహారం అపహాస్యం కింద తయారయింది. రథానికి రథం రూపేలేదు. దానికి దూడను కట్టితే ఎలా ఉండాలో అలా ఉంటుంది. కాని పని జరగాలి గనక గుర్రాలను విప్పి, దూడను కట్టారు. వెంటనే రధం కదిలి, శరవేగంతో నడవసాగింది. ఆ దూడ సారధి చెప్పినట్టు నడవక దాని ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతూ ఊరంతాకలయ తిరగసాగింది. చిట్టచివరకు ఆ దూడ బంగారపు ఇంటి ముందే ఆగింది. చంద్రభానుడికి చాలా కోపం వచ్చింది. అతను ఆ ఇంటో ఉన్న మనిషిని తీవ్రంగా దండించే ఉద్దేశంతో రథం దిగి చరచరా లోపలికి వచ్చాడు. కాని చంద్రిక కనిపించ గానే అతనికి గతమంతా జ్ఞాపకం వచ్చింది. "మీకోసం చెట్టు కింద చాలాసేపు వేచాను. మీరు రారనుకుని, నిరాశ చేసు కుని, ఈ ఇంటో మకాం పెట్టుకున్నాను. మీ వివాహమని విన్నాను. దానికేవో అంత రాయాలు కలిగితే నా శక్తి కొద్దీ సహాయ పడ్డాను,” అన్నది చంద్రిక. చంద్రభాను డామెకు క్షమాపణ చెప్పు కుని, "నేను నిన్నెలా మరిచిపోయినాను? ఏం జరిగి ఉంటుంది ?” అన్నాడు. "మరేమీ లేదు. మీరు పెళ్ళాడబోయే పిల్ల ఆ మంత్రగత్తె కూతురే. దానికి కూడా తల్లి కున్న శక్తులు కొద్దిగా ఉన్నాయి. అది మీ స్మృతిని చెడగొట్టి ఉంటుంది," అన్నది చంద్రిక. "నేను నిన్నే పెళ్ళాడతాను. నా వెంట వచ్చెయ్యి,” అంటూ చంద్రభానుడు ఆమెను చెయ్యి పట్టుకుని బయటికి తీసు కొచ్చాడు. అతను చంద్రకళతో, "నువు పాపిష్టి దానివి. నీ మూలంగానే రధాని కిన్ని తిప్పలు వచ్చాయి. ఈ అపశకునం అయాక నేను నిన్ను పెళ్ళాడలేను," అని చెప్పాడు. అతను మరొక రథం తెప్పించి, దానిలో చంద్రికతోబాటు ఎక్కి, తన అన్ననూ, అతని వధువునూ కూడా అందులో నే ఎక్కించుకుని, తిన్నగా దేవిఆలయానికి వెళ్ళాడు. దారిలో ఎలాటి విఘ్నాలూ జరగ లేదు. సంగతంతా విన్నాక చంద్రభానుడి తండ్రి చంద్రికను తన కోడలుగా ఆమో దించాడు. వారిద్దరికీ ఎంతో వైభవంగా పెళ్ళి జరిగిపోయింది.

Friday, 19 December 2025

//ఇలయ రాజా// నే తొలొసారిగా కలగని 'సంతోషం' పెట్టావు తెలుసా మనసా అంటూ 'క్రిమినల్ ' వైనావు ఏవ్వరు ఏమన్నా అంటూ 'జయం' పలికావు చెలియ చెలియ అంటూ 'కుషీ' చేసావు సందెపొద్దులకాడా సంపంగి నవ్వడమే నీ 'అభిలాష ' లలితప్రియ కమలం 'రుద్రవీణ 'పై పలికించావు పచ్చని చిలుకలు తోడుండే 'భారతీయుడు 'వైనావూ ఆమనీ పాడవే కోయిలా అని 'గీతాంజలి ' చేసావు ఏదో ఒకరాగం పలికే 'రాజా' వైనావు ఈ వేళలో నీవు 'గులాబీ' పూయించావు కళ్ళళ్ళోకి కళ్ళు పెట్టి చూడవెందుకు 'నువ్వేకావాలంటే ఇప్పటికింకా నీ వయసు నిండా పదహారే 'పోకిరీ'19/12/14

Tuesday, 9 December 2025

రాజు మెదడు ఒకప్పుడు దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆటవిక జీవితం గడు పుతూ నాగరికత అన్నది లేకుండా జీవిం చారు. అయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజు ఏర్పడి జీవితం క్రమబద్ద మవుతూ వచ్చింది. ఆ కాలంలో దండాపథ మనే ప్రాంతంలో జీవితం అరాజకంగానే ఉంటూ వచ్చింది. బలవంతులు బలహీనులను యధేచ్ఛగా పీడిస్తూ వచ్చారు. ఆ కారణంగా సామాన్య ప్రజలు ఏ పనీ సక్రమంగా కొనసాగించలేక పోయారు. ఎందుకంటే శ్రమ ఫలితం వారికి దక్కిన దాకా నమ్మకం లేదు. దండాపథంలో సుమిత్రు డనే ఒక బుద్ధి శాలి ఉండే వాడు. తన దేశపు ప్రజల జీవితం దుస్థితిలో ఉండటం అతన్ని ఎంతో బాధించింది. దేశంలోని దుర్మార్గులతో అతను ఎంతగానో చెప్పి చూశాడు, కాని వారు వారి పద్ధతులను మార్చుకో లేదు. చివరకు సుమిత్రుడు ప్రాణం విసిగి అరణ్యానికి వెళ్ళి పోయాడు. అరణ్యంలో సుమిత్రుడి కొక యోగి కనిపించాడు. ఆయన ఆరణ్యంలోనే ఆశ్రమం నిర్మించుకుని యోగం అభ్య సిస్తున్నాడు. సుమిత్రుడా యోగి పరిచయం చేసు కుని, దేశంలో అరాజకం పోయి బాగుపడా లంటే ఎం చేయాలి అని ఆడిగాడు. "ధైర్య బల పరాక్రమాలూ, వ్యక్తి త్వమూ గల వా ఎన్నుకుని రాజుగా ఏర్పాటు చేసుకుని, జ్ఞానమూ, వివేకమూ, ధర్మబుద్ధి గల మంత్రిని నియమించినట్ట యితే మీ దేశం బాగుపడుతుంది,” అని యోగి చెప్పాడు. సుమిత్రుడు తన దేశానికి తిరిగి వెళ్ళి దేశంలోని బలాఢ్యు లందరిలోకి బలాఢ్యుడైన ధీరసింహు డనే వాణ్ణి కలుసుకుని, "నీవు రాజుగా ఉండి, సైనిక బలాన్నీ, ధనకోశాన్ని ఏర్పాటు చేసుకుని, దేశంలోని ప్రతి ఒక్కరినీ శాసిస్తూ పరిపాలన సాగించి నట్టయితే మన దేశం బాగుపడుతుంది," అని చెప్పాడు. ధీరసింహు డిందుకు సంతోషంగా సమ్మ తించాడు. తమకు రక్షకుడుగా ఒక రాజు ఉంటాడని విని ప్రజలు కూడా సంతోషిం చారు. ధీరసింహుడికి రాజ్యాభిషేకం జరి గింది. తన ఆశ్రమం నుంచి యోగి వచ్చి స్వయంగానే రాజ్యాభిషేకం జరిపించాడు. ఆయన వెళ్ళిపోతూ, "బుద్ధిమంతుడైన మంత్రిని ఏర్పాటు చేసుకుని, అతని సలహా ప్రకారం రాజ్యపాలన చెయ్యి,” అని ధీర సింహుడికి సలహా ఇచ్చాడు. అయితే ధీరసింహు డా సలహాను లక్ష్య పెట్టలేదు. " నేను రాజు నైనప్పుడు నాకు మళ్ళీ ఒకరు సలహా ఇవ్వటమేమిటి? పరిపాలన విషయాల్లో మంత్రి చెప్పినట్టు వింటే రాజు మంత్రికి లోకువేగడా," అను కుని అతను మంత్రి లేకుండానే రాజ్య పాలన సాగించాడు. పూర్వం విశృంఖలంగా తిరిగిన బలాఢ్యు లందరూ ఇప్పుడు రాజు వద్ద కొలువు చేస్తూ, వెనకటిలాగే చిత్తం వచ్చినట్టు ప్రజలను పీడిస్తూ, రాజును మాత్రం సంతోష పెట్టుతూ వచ్చారు. ప్రజలు రాజాజ్ఞకు కట్టుబడి కూడా ప్రయోజనం లేకపోయింది. సుమిత్రు డీ పరిస్థితి చూసి మరొకసారి యోగి వద్దకు వెళ్ళి పరిస్థితి అంతా చెప్పాడు. అంతా విని యోగి, "మీ రాజును నేను బాగు చేస్తాను. ఒక వారం రోజులకు నేను స్వయంగా వచ్చి మీ రాజును కలుసు కుంటాను. ముందుగా మీరు ఈ పుష్పాన్ని తీసుకుపోయి, నా కానుకగా రాజు కివ్వండి. దీన్ని రాజు తప్ప మరెవరూ ఆఘ్రాణించ రాదు, అది అపచార మవుతుంది,” అంటూసుమిత్రుడి కొక పుష్పాన్ని ఆకులో మడిచి కట్టి ఇచ్చాడు. ఆకు మడతలో నుంచి కూడా దాని సువాసన తెలియవస్తున్నది. సుమిత్రు డా పుష్పాన్ని తీసుకుపోయి రాజుకిస్తూ, దాన్ని యోగి కానుకగా పంపా డసీ, ఒక వారం గడిచాక ఆయన వచ్చి రాజ దర్శనం చేసుకుంటా డనీ చెప్పాడు. రాజు అలాటి పుష్పాన్ని ఎన్నడూ చూడ లేదు. దాని సువాసన కూడా కొత్తగానే ఉన్నది. అందుచేత అతను దాన్ని పదేపదే వాసన చూశాడు. మర్నాటి కల్లా రాజుకు తల పోటు ప్రారంభమై, ఆరోజు కారోజు పెరిగి పోయింది. ఎన్ని చికిత్సలు చేసి కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది. రాజు మంచాన పడి యమయాతన అనుభ. వించసాగాడు. అన్న ప్రకారం యోగి వారం రోజులకు వచ్చి రాజును చూశాడు. రాజుకు ఏర్పడిన తల నొప్పి గురించి విని ఆయన, "రాజా, నీకు తల పోటు వచ్చిందంటే రాకేం చేస్తుంది? రాజ్య పాలన అంటే మాటలా? ఈ తల పోటు ఇంకా ముందే వచ్చి ఉండ వలిసింది. నీ మెదడు బలమైనది కనక ఇంత కాలం రాలేదు. ఇకనైనా బుద్ధి మంతుణ్ణి మంత్రిగా పెట్టుకుని, ఆలోచించే పని అతనికి పదిలేసి, అతని ఆలోచన ప్రకారం నీవు రాజ్యపాలన సాగించు,” అని సలహాయిచ్చాడు. అంత బాధలోనూ ధీరసింహు డీ మాటకు ముఖం చిట్లించుకుని, "ఒకడి సలహాతో నేను రాజ్యం చెయ్యట మేమిటి? అలా జరగటానికి వీలులేదు,” అన్నాడు. యోగి నవ్వి, " మరొకరి బుద్ధికి నిన్ను కట్టుపడి ఉండమని నేనంటానా? తెలివి తేటలు గల వాణ్ణిగా చూసి నీ బుద్ధినే అతడికి అరువిచ్చి, అందరి చేతా పని చేయించు కున్నట్టే అతని చేత కూడా పని చేయించుకో. అలా చేసినట్టయితే నీ కెన్నడూ ఇలాటి తల పోటు రాదు,” అన్నాడు. "నా బుద్ధిని మరొకడికి అరువివ్వటం ఎలా సాధ్యం?" అని రాజు అడిగాడు. "ఆ ప్రక్రియ నేను చేస్తాను. నీ దృష్టిలో బుద్ధిశాలి ఎవరో చెప్పినట్టయితే నీ మెదడు లోని ఆలోచనా శక్తి కొంత అతడికి పంపకం చేస్తాను,” అన్నాడు యోగి. రాజు సుమిత్రుడి పేరు చెప్పాడు. రాజు గారి బుద్ధిని స్వీకరించి, ఆలోచనలు చెయ్య టానికి సుమిత్రుడు కూడా సమ్మతించాడు. యోగి తన శక్తి చేత రాజుకు యోగ నిద్ర కలిగించాడు. ఆయన సుమిత్రుడితో, "నే నిచ్చిన పుష్పం వాసన చూడటం చేతనే రాజు & శిరోవేదన కలిగింది. ఆయన ఈ నిద్ర నుంచి మేలుకునే సరికి అది పోతుంది. ఇకమీద నీవు మంత్రిగా ఉండి రాజు చేత ధర్మప్రకారం రాజ్యపాలన చేయించు,” అని చెప్పాడు. రాజు నిద్ర నుంచి లేస్తూనే తన తల పోటు పోయిందని తెలుసుకున్నాడు. "ఇప్పుడు నాకు చాలా సుఖంగా ఉన్నది,” అన్నాడాయన యోగితో. " అవును. రాజ్య సంబంధమైన ఆలో చనలు చేసి చేసి నీ మెదడు వాచిపోయింది. అందులో కొంత భాగం సుమిత్రుడికి చెందే టట్టు చేశాను. ఇక నుంచి నీకు పరిపాలన గురించి ఆలోచించే శ్రమ ఏమివుండదు. ఆ బాధ అంతా సుమిత్రుడే పడతాడు,” అన్నాడు యోగి. ధీరసింహుడు సుమిత్రుణ్ణి మంత్రిగా నియమించి, అతని సలహాల ననుసరించి రాజ్యపాలన సాగించాడు. బుద్ధిలో మంత్రి రాజుతో సమానుడు గనక రాజుగారి కొలువులో ఉండే అధికారు లందరికీ పైవా డయాడు. అందుచేత పదవులలో ఉన్న దుష్టు లందరి ఆటా కట్టింది. ప్రజలు సుఖ పడి పోయారు.
కరువు కాటకాలు ఒకసారి పాపన్న నివసించే దేశంలో పెద్ద కరువు ఏర్పడింది. వానలు కురవలేదు. పంటలు పండలేదు. కరువు నివారణ కోసమై రాజుగారు బావులను మరింత లోతుగా తవ్వించాడు. అందువల్ల లాభం లేకపోయింది. బొక్కసంలో ధనం ఉన్న మేరకు దూరదేశాల నుంచి ఆహార ధాన్యాలు తెప్పించి ప్రజలకు పంచి పెట్టం చాడు. బొక్కసం కూడా ఖాళీ అయింది. ఈ సమయంలో ఒక నాటి తెల్లవారు జామున పాపన్న కొక చిత్రమైన కల వచ్చింది. అందులో పాపన్నకు రాజుగారు కనిపించి, తూర్పుగా కనబడే కొండలను చూపిస్తూ, ఆ కొండలలో ఎక్కడో ధన రాసులున్నాయని మా కులదేవత చెప్పింది. ఆ ధనం గురించి తెలుసుకు రమ్మని భటు లను పంపితే ఒక్కరూ తిరిగి రాలేదు. ప్రజలు మాడి చస్తూంటే ఏమీ చెయ్య లేకుండా చూస్తూ కూర్చోవటం బాధగా ఉన్నది. ఆ ధనం సంగతి తెలుసుకుని వచ్చే వారెవరూ కనిపించరు. కాస్త నీవా పని చేస్తావా?" అని అడిగాడు. "అంతకంటేనా, ప్రభూ. అప్పుడే బయలుదేరుతాను,” అని పాపన్న అంటుం డగా పాపన్నకు మెలకువ వచ్చింది. తనకు వచ్చిన కలను తలుచుకుని పాపన్న చాలా ఆశ్చర్యపడ్డాడు. అది ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉన్నది. పాపన్న రాజు వద్దకు వెళ్ళి స్వప్న వృత్తాంతం చెబుదా మనుకున్నాడు గాని, కల వాస్తవమో, కాదో ముందుగా తెల్చుకోవటం మంచిదని అత నికి అనిపించింది. అందుచేత పాపన్న ఎవరికీ చెప్పకుండా అంటి నుంచి బయలుదేరి తూర్పుగా ప్రయాణమయాడు. అతను తూర్పు కొండల ఇవతల అరణ్యప్రదేశం కుండా పోయేటప్పుడు అక్కడ గ్రామాలలో నివసించే వారు, ఆ కొండలలోకి ఎవరూ వెళ్ళరనీ, వెళ్ళిన వారెవరూ తిరిగిరారనీ, ఒకప్పుడు కొందరు రాజభటులు అటుగా వెళ్ళి మరి తిరిగి రాలేదనీ చెప్పారు. ఈ మాటలు విన్న మీదట పాపన్నకు తన కలలో కొంత నిజం ఉన్న తోచి, ముందుకు వెళ్ళాలనే నిశ్చయం మరింత దృఢమయింది. ముందుకు పోతున్న కొద్దీ అరణ్యం కీకా రణ్యమయింది. అటువంటి ప్రాంతంలో నడుస్తూండగా, హఠాత్తుగా ఒక మనిషి పాపన్న దారిలో అడ్డంగా ప్రత్యక్షమై, " మీరా, పాపన్నగారూ? ఇంకెవరో ఆను కున్నాను. ఏమిటిలా అరణ్యంలోకి వస్తు న్నారు ?" అని అడిగాడు. పాపన్న ఆ మనిషిని గుర్తు పట్టాడు. ఆ మనిషి ఒక దొంగ లోగడ పాపన్న ద్వారా చికిత్సపొంది, రక్షించబడిన వాడు. పాపన్న అతనితో తన కల గురించి చెప్పి, "జనం తిండికి అల్లాడిపోతున్నారు. కొండల్లో ఆ ధనం ఎక్కడ ఉన్నది వెతక టానికి నువు సహాయం చేస్తావా?" అని అడిగాడు. " అది సాధ్యమయే పని కాదే! ఇది భయంకరమైన ప్రదేశం. ఇక్కడి కెవరూ రాకూడదు. నా పైన దయ వుంచి మీరు తిరిగి వెళ్ళండి." అన్నాడా దొంగ. " ఒక వంక ప్రజలు తిండిలేక కటకట పడుతూంటే, ఇక్కడ ధనం ఉన్నదని తెలిసి ఎలా వెనక్కుపోను?" అని పాపన్న అడిగాడు. "బాబూ, అలాటి దయాదాక్షిణ్యాల కక్కడ చోటులేదు. మీరు దయచేసి వెళ్ళి పాండి," అన్నాడు దొంగ. ఇంతలో మరొక మనిషి ఎటునుంచో వచ్చి, " ఎవడు వీడు? అక్కడికేం పని మీద వచ్చాడు? చేతులూ, కాళ్ళూ కట్టి ఈడ్చుకుపోక నిలబడి వీడితో మాట్లాడుతున్నావేమిటి?" అని దొంగతో అన్నాడు. వాడు కూడా దొంగల ముఠాకు చెందినవాడే. వాడితో మొదటి దొంగ రహస్యంగా పాపన్న గురించి చెప్పి, "ఏం చేద్దాం?" అని సలహా అడిగాడు. "మన నాయకుడి దగ్గిరికి తీసుకు పోదాం,” అన్నాడు రెండో దొంగ. ఇద్దరూ కలిసి పాపన్నను దొంగల నాయ కుడి వద్దకు తీసుకుపోయారు. మొదటి దొంగ తమ నాయకుడి చెవిలో రహస్యంగా, పాపన్న ఒకప్పుడు తనకు చేసిన ఉపకారం గురించి చెప్పాడు. అంతా విని దొంగల నాయకుడు పాప న్నతో, "మా ప్రాంతానికి వచ్చినవాళ్ళను ప్రాణాలతో పోనిచ్చే అలవాటు మాకులేదు. అయినా నీవు మాకు ఉపకారం చేసి ఉన్న వాడివి కనక నిన్ను నిరపాయంగా తిరిగి వెళ్ళిపోనిస్తాను. సరేనా?” అన్నాడు. "మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కాని నాకు ఒక్క ఉపకారం చేయించండి. ఈ కొండలలో ఉండే ధనరానులు నాకు చూపించినట్టయితే నేను తిరిగివెళ్ళి వాటి వివరాలు రాజుగారితో చెప్పి, ఆ తరవాత జరగవలిసిన ఏర్పాట్లు చేయిస్తాను." అన్నాడు పాపన్న. "ఇంకా నయం! ఇంతవరకు నీవు చూసినది ఎవరికీ చెప్పనని మా కాళికామ్మ వారి ఎదట ప్రమాణం చేస్తేనే నిన్ను ప్రాణాలతో తిరిగిపోనిచ్చేది." అన్నాడు దొంగల నాయకుడు. " నాకు చూపటం ఇష్టంలేకపోతే ఇక్కడ ఉండే ధనాన్ని మీరే తిన్నగా రాజుగారి వద్దకు పంపండి,” అన్నాడు పాపన్న. దొంగల నాయకుడు మండిపడి, "మా కష్టార్జితాన్ని మేము ఎవరికీ ఇవ్వము. మా సంగతి ఎవరికీ చెప్పనని కాళిక ముందు ప్రమాణం చెయ్యకపోతే నిన్ను కాళికకు బలి ఇచ్చేస్తాము,” అన్నాడు." నే నలాటి ప్రమాణం చెయ్యలేను." అన్నాడు పాపన్న. మరుక్షణమే దొంగలు పాపన్నను చెరొక రెక్కా పట్టుకుని కాళికావిగ్రహం వద్దకు తీసుకుపోయారు. ఆది రెండు నిలువుల ఎత్తుగల భయంకరమైన విగ్రహం. "ఇప్పుడైనా కాళిక ముందు ప్రమాణం చెయ్యి, ప్రాణాలతో బయట పడతావు," అన్నాడు దొంగల నాయకుడు. "నే నిక్కడికి డబ్బుకోసం వచ్చాను, మీ రహస్యాన్ని కాపాడటానికి కాదు," అన్నాడు పాపన్న దృఢంగా, పాపన్న తల తెగయ్యటానికి దొంగల నాయకుడు కత్తి ఎత్తాడు. ఆ క్షణంలోనే కాళికావిగ్రహం, ఎవరో తోసెనట్టుగా, మొద లంటా విరుచుకుని, పక్కకు ఒరిగి, దొంగల నాయకుడి పైన పడింది. దొంగల నాయ కుడు దాని కిందపడి ఒక్క మూలుగుతో ప్రాణాలు వదిలాడు. " చూశారా ? నన్ను దేవే ఇలా పంపింది. మీ కింక మీ నాయకుడితో పనిలేదని చెప్ప టానికి అతణ్ణి బలి పుచ్చుకున్నది. ప్రజలు కరుపుబాధ నుండి బయటపడటానికి మీ ధనం అవసరం, ఈ మాట కలలో దేవి చెప్పిన మీదటనే నే నిలా వచ్చాను. నా వెంట రండి. రాజుగారు మిమ్మల్ని శిక్షించ కుండా నేను చూస్తాను.. మీరంతా మామూలు ప్రజలతో కలిసి జీవించటం ప్రారంభిస్తే దేవి సంతోషిస్తుంది,” అని పాపన్న దొంగలకు నచ్చ చెప్పాడు. పాపన్న ధైర్యం కళ్ళారా చూసిన దొంగ లకు అతని మాటలలో సులువుగా గురి కుదిరింది. వాళ్ళు తమ ధన మంతా మోను కుని రాజుగారి వద్దకు పాపన్న వెంట వెళ్ళారు. రాజుగారు దొంగలందరినీ క్షమించి, వాళ్ళకు జీవనోపాధులు ఏర్పాటు చేసి, వారి ధనంతో కరువు నివారణ యత్నాలు చేశాడు.
వృద్ధభిక్షుకుడు పాపన్న ఉండే దేశంలో ఒకసారి యుద్ధ పరిస్థితి వచ్చింది. పొరుగు దేశపు రాజు ఈ దేశంలోని కొన్ని భాగాలు తన రాజ్యా నికే చెందాలని తగాదా తెచ్చి, ఆ తగాదాను అంతకంతకూ పెంచి, చివరకు ఈ దేశం పై దురాక్రమణకు పూనుకున్నాడు. ఆయన సేనలు ఈ దేశంలోకి చొరబడి, కొన్ని గ్రామాలనూ, నగరాలనూ ఆక్రమించు కుని, చివరకు ఒక కోట వద్ద నిలవరించ బడ్డాయి. అవి ఆ కోటను ముట్టడించి, నెలల తరబడి యుద్ధం సాగించి కూడా దాన్ని లోబరుచుకోలేక పోయాయి. యుద్ధ కారణంగా దేశంలోని ప్రతి గ్రామం లోనూ గ్రామాధికారికి ప్రత్యేకమైన పనులు ఏర్పడ్డాయి. ఈ పనులు నిర్వర్తిం చటంలో పాపన్న తమ ఊరి గ్రామాధికారికి ఎంతో తోడ్పడ్డాడు. గ్రామాధికారి కొంత యుద్ధనిథి పోగుచేశాడు, సేనలో చేరటానికి ఆ డబ్బునూ, యువకులనూ వెంటబెట్టు కుని పాపన్న రాజధానికి వెళ్ళాడు. కొందరు యువకులను సంపాదించాడు. అక్కడి పని పూర్తిచేసుకుని పాపన్న తిరుగుముఖమై వస్తూ చీకటిపడే వేళకు ఒక గ్రామసావడి చేరుకున్నాడు. అక్కడ అతనికి అనేకమంది బిచ్చగాళ్ళ లాటి వాళ్ళు ఒక గుంపుగా చేరి కనబడ్డారు. అంతమంది బిచ్చగాళ్ళు అక్కడ పోగవటా నికి కారణ మేమిటని పాపన్న అడగగా, బిచ్చగాళ్ళనూ, గాలికి తిరిగేవాళ్ళనూ పట్టు కుని రాజధానికి పంపమని రాజాజ్ఞ అయి నట్టు తెలిసింది. శత్రువుల వేగులవాళ్ళూ, గూఢచారులూ మారువేషాలతో దేశమం తటా తిరుగుతున్నట్టు రాజధానికి తెలియ వచ్చిందట. ఈ బిచ్చగాళ్ళంతా ఆ ప్రాంతా లలో పట్టుబడినవాళ్ళు. వాళ్ళలో కొందరు పాపన్నను గుర్తించి, సంతోషం చెంది,"పాపన్నగారూ, మమ్మల్ని అకారణంగా భటులు పట్టుకున్నారు. మీరైనా కాస్త మమ్మల్ని విడిపించి పుణ్యం కట్టుకోండి.” అని వేడుకున్నారు. "అంతలో మీకు వచ్చిన నష్టమేమిటి? రాజాజ్ఞ అమలు జరగనివ్వండి. మీకు కావలిసిన తిండి కేమీ లోపం రాదు. ఈ జరుగుతున్న యుద్ధం ముగిసేదాకా కాస్త ఓర్చుకోండి. ఆ తరవాత ఎప్పటిలాగే మీరు యథేచ్ఛగా తిరగవచ్చు," అన్నాడు పాపన్న ఆ బిచ్చగాళ్ళతో. బిచ్చగాళ్ళలో ఒక వృద్ధుడు తెలిసిన వాళ్ళ నుంచి పాపన్న గురించి వివరాలు తెలుసుకుని, సైగ చేసి పాపన్నను దగ్గిరికి పిలిచి, రహస్యంగా, " అయ్యా, నాకు తమ వల్ల ఒక ఉపకారం కావాలి. ఈ ఊరి కోట వెలుపల తూర్పున ఒక కాళికాలయం ఉన్నది. అక్కడ నా కొడుకు ఒంటికంటి వెంక డనేవాడు ఉన్నాడు. నే నిలా చిక్కు కున్నానని వాడితో చెప్పి, నే నిచ్చే పొట్లాన్ని వాడికి అందించాలి. నే నిక ఎక్కువ కాలం బతకను. ఈ పొట్లంలో నే నొక కొత్త మంత్రం రాసి ఉంచాను. దాన్ని వాడికి మీరు చేర్చగలిగితే నా పని తీరిపోతుంది. ఈ సహాయం చేయగలవాళ్ళు నా కిప్పు డెవరూ లేరు,” అన్నాడు. " ఆ పొట్లాన్ని నా కిస్తే నేను నీ కొడుక్కు చేర్చుతాను," అన్నాడు పాపన్న. ముసలి బిచ్చగాడు ఆ చీకట్లో పాపన్న చేతిలో ఒక పొట్లం ఉంచాడు. ఒక పాత గుడ్డలో కట్టిన ఆ పొట్లం అరిచేతి అంత వెడల్పుగాసూ, పలచగానూ ఉన్నది. మర్నాడు పాపన్న కాళికాలయాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, అక్కడ ఒక యువ కుణ్ణి చూశాడు. వాడు ఒంటికంటివాడు. పాపన్న వాణ్ణి, "నీ పేరేనా వెంకడు?" అని అడిగి, వా డవునన్న మీదట, "నీ తండ్రి దీన్ని నీ కివ్వమన్నాడు,” అంటూ పాట్లంవాడి చేతిలో పెట్టి, "నీ తండ్రిని అధికా రులు పట్టుకుపోయారు,” అని చెప్పి దేవి దర్శనం చేసుకునేటందుకు ఆలయం లోపలికి వెళ్ళాడు. ఆ దేవాలయంలో నలుగురే ఉంటారు. ఒకడు అర్చకుడూ, రెండోవాడు దేవాలయం నౌకరూ, మూడోవాడు వెంకడూ, నాలుగో వాడు వెంకడి సహచరుడూనూ, వెంకడు పొట్లం విప్పి, తన సహచరుడు తెచ్చిన గుడ్డపీలికను నీటితో తడిపే సరికి సాంకేతిక లిపిలో రాసి ఉన్నది ఏదో బయట పడింది. అందులో కొన్ని గీత లేవో ఉన్నాయి. ఆది గాక కొంత రాత కూడా ఉన్నది. ఆ రాతలో పాపన్నకు సంబంధించిన విషయా లిలా ఉన్నాయి: "అది తెచ్చేవాడే పరోపకారి పాపన్న. రాజుకు స్నేహపాత్రుడు. ఇతన్ని చెరలో పెట్టించు.” పాపన్న దేవాలయం నుంచి వెళ్ళిపో తున్నప్పుడు ఒంటికన్ను వెంకడు అతన్ని సమీపించి, " మీరు మా ఆతిథ్యం స్వీకరిం చాలి, పాపన్నగారూ, అమూల్యమైన సమా చారం తెచ్చినందుకు మీకు మా రాజుగారు గొప్ప బహుమానం ఇస్తారు. ఇవాళ రాత్రే మన ప్రయాణం,” అన్నాడు. అత నా మాట అంటూండగానే అతని సహచరుడూ, అర్చకుడూ వచ్చి పాపన్న చెరొక రెక్కా పట్టుకున్నారు. "ఏమిటీ దౌర్జన్యం? నువ్వెవరు? ఆ బిచ్చగాడి కొడుకువు కావా?” అని పాపన్న అంటూండగా దేవాలయం నౌకరు పెద్ద తాడొకటి పట్టుకొచ్చాడు. " అదంతా ఒక నాటకం. మీరు మాకు ఉపకారమే చేశారు గాని, మిమ్మల్ని బంధించక తప్పదు. మిమ్మల్ని విడిపించు కోవటానికి మీ రాజు మాకు అర్థరాజ్య మిస్తాడో, రాజ్యమంతా అస్తాడో చూడాలి,” అన్నాడు ఒంటి కన్నువాడు. "అదా సంగతి? మీరు పూర్తిగా పొర బడ్డారు. నేను మీ రనుకున్నంత ముఖ్యుణ్ణికాను. నన్ను మీరు చంపినా మా రాజుగారు లెక్కచెయ్యరు. యుద్ధంలో చచ్చేవాళ్ళతో కాని అందువల్ల మీ కింత పాపం తప్ప బాటే నేనూనూ. కావలిస్తే నన్ను చంపండి. మరేమీ దక్కదు," అన్నాడు పాపన్న. వాళ్ళు అతని చేతులు కలిపి కట్టి ఒక కొట్టులోకి నెట్టి తలుపులు మూసేశారు. గుడి ఉండే ప్రాంతం నిర్జనమైనది, తాను కేకలు పెట్టినా పలికే దిక్కుండదని పాపన్న గ్రహించాడు. గుడిలో వాళ్ళంతా శత్రు వులూ, శత్రువుల మనుషులూనూ, ముసలి బిచ్చగాడు కూడా గూఢచారే. వాడు రాజ ధానికి సంబంధించిన రహస్య మార్గాలు మొదలైనవన్నీ చిత్రించి తన కొడుక్కు అందజేశాడు. ముసలివాడు పట్టుబడ్డాడు. గాని ఒంటి కన్ను వాడు స్వేచ్ఛగానే ఉన్నాడు. వాడా రహస్యాలను శత్రు రాజుకు చేర్చుతాడు. పాపన్న అసాధారణ బలాఢ్యుడు. కావటం చేత తన చేతికి కట్టిన తాళ్ళు వదిలించుకుని జరగగల దాని కెదురు చూస్తూ కొట్టులో ఉన్నాడు. ఆ రాత్రి ఒంటి కన్నువాడు యోధుడి వేషంలో, తన అను చరుడితో సహా వచ్చి, కొట్టు తలుపు తెరి పించి, పాపన్నను బయటికి రమ్మని, "ఇక మనం మా రాజుగారి దగ్గిరికి బయలుదేరు తున్నాం. పెద్దమనిషిలా మా వెంటరావాలి. దారిలో నువ్వేదైనా కోతి పని చేశావో మా కత్తులు రుచి చూస్తావు? వాటి రుచి నీకు తెలుసా?" అన్నాడు. " నాకు తెలీదు. అసలు మీ చేతిలో కత్తు లుండటమే తప్పు," అంటూ పాపన్న ఒంటి కంటి వాడి చేతి మీద బలంగా ఒక్కటి పెట్టాడు. ఆ దెబ్బతో వాడి చేతి కత్తి కింద పడింది, చెయ్యి నీలుక్కుపోయి చచ్చే బాధ పెట్టింది. అది చూసి వాడి అను చరుడు పాపన్న పైకి తన కత్తి ఎత్తాడు. పాపన్న వాడి చేతి మీద కూడా బలంగాకొట్టి, కత్తి కింద పడేయించాడు. తరవాత అతను రెండు కత్తులూ తీసి దూరంగా విసిరి పారేశాడు. ఇంతలో అర్చకుడూ, నౌకరూ బలమైన తాళ్ళు తెచ్చారు. పాపన్న ఒంటికన్ను వాణ్ణి, వాడి అనుచరుణ్ణి చచ్చేటట్టు తన్ని, అర్చకుడు తెచ్చిన తాడు లాక్కుని, వాళ్ళిద్ద రినీ పెడరెక్కలు విరిచి కట్టి, భయంతో కంపించిపోతున్న అర్చకుణ్ణి, గుడి నౌక రునూ కూడా అలాగే కట్టి, నలుగురినీ గది లోకి తోసి, తలుపు బిగించాడు. తరవాత అతను గ్రామాధికారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి, తనకు నలుగురు గూఢచారులు చిక్కారనీ, వాళ్ళను పట్టుకుపోవటానికి భటులు కావాలనీ చెప్పాడు. భటులు వచ్చి నలుగురినీ వశపరచు కున్నారు, ముసలి బిచ్చగాడు పంపిన సంకేత సందేశాన్నీ, ఇతర వస్తువులనూ స్వాధీనం చేసుకున్నారు. పాపన్న వాళ్ళ వెంట రాజధానికి వెళ్ళి, రాజుగారికి జరిగిన దంతా సవిస్తరంగా చెప్పాడు. రాజుగారు ఖైదీ బిచ్చగాళ్ళలో నుంచి ముసలి బిచ్చగాణ్ణి ఏరి, విచారించగా, వాడు శత్రురాజు పినతండ్రి అనీ, ఒంటి కన్ను వాడు ఆయన కొడుకే ననీ బయట పడింది. తరవాత రాజుగారు శత్రురాజుకు, "మీ పిన తండ్రీ, ఆయన కొడుకూ మాకు బందీలుగా చిక్కారు. మీ సేనలు వెంటనే మా రాజ్యం వదిలి పోవాలి. యుద్ధ నష్టం కింద మీరు లక్షవరహాలు చెల్లించాలి. లేని పక్షంలో మీ పినతండ్రి తలా, ఆయన కొడుకు తలా తీయించి, మీతో యుద్ధం కొనసాగిస్తాం," అని కబురు చేశాడు. తన వాళ్ళను విడిపించుకో గలందులకు శత్రురాజు షరతు లన్నిటికీ ఒప్పుకున్నాడు. దేశానికి యుద్ధభయం తీరిపోయింది. ఇతర యోధులతో బాటు పాపన్నకు కూడా రాజు గారు మంచి సన్మానం చేశాడు.
ముగ్గురు సుందరులు పేదరాశి పెద్దమ్మ కు ఏడుగురు కుమారులుండేవారు. పెద్దమ్మ వృద్ధురాలు ఐనందున వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది. అందు చేత వాళ్ళుపట్టణం వెళ్ళి పని చేసుకుందా మని బయలుదేర నిశ్చ యించు కున్నారు. పెద్దవా ళ్ళందరూ చిన్నోడిని తమవెంట రావద్దన్నారు. వాళ్ళు తమ మూటా ముల్లే సర్దుకుని ఒక రాజుగారి వద్దకు వెళ్ళారు. వాళ్ళు అక్కడికి చేరేసరికి చిన్నోడు కూడా అక్కడికి చేరనే చేరాడు. రాజుగారు వాళ్ళ మొర విని, "ప్రస్తు తానికి మీ కిచ్చేటందుకు పని ఏమీ లేదు. అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు గసక వంట ఇంటికి కావలిసిన నీరూ, వంటచెరుకూ చేర వేస్తూ ఉండండి.” అన్నాడు. వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు. కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవా ళ్ళిద్దరినీ పిలిచి,"మీ ఇద్దరి కన్నా చిన్నోడు రెట్టింపు నీరు తెస్తున్నాడుట, రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడుట, మీ రింత మంద కొడిగా ఉన్నారేం?" అని అడిగాడు. రాజుగారి భార్య కొద్ది కాలం కిందటనే పోయింది. ఆయన తిరిగి ఇంకా పెళ్ళాడ లేదు. అది పెద్దవా ళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళు చిన్నోడు పీడ వదిలించుకుందా మని రాజుగారితో, "మా చిన్నోడు చాలా సమర్హుడు. వాడు ఎన్నో సాహసకార్యాలు చేశాడు. వాణ్ణి పంపారంటే మీకు వారం లోపల జగదేకసుందరిని తెచ్చి భార్యగా చెయ్యగలడు." అన్నారు. సౌందర్యవతి అయిన భార్యను పెళ్ళాడాలని రాజు గారికి ఆశ పుట్టింది. ఆయన చిన్నోడు ను పిలిచి, "ఒరే, నీ శక్తి తెలియక నీ చేతనీళ్ళూ, కట్టెలూ మోయించాను. ఇక నువ్వా పని మాని, నేను పెళ్ళాడటానికి ఒక జగదేక సుందరిని తెచ్చి పెట్టు. నీకు వారం రోజులు గడు విస్తున్నాను," అన్నాడు. "అంత పని నా వల్ల అవుతుందా మహా రాజా ? నాకు శక్తి ఉందని నే నెప్పుడూ చెప్పుకో లేదే ?" అన్నాడు నాగులు. "వారం రోజుల్లో జగదేక సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోట గుమ్మానికి కట్టిస్తాను. ఏమనుకున్నావో!" అని రాజుగారు చిన్నోడు ని భయపెట్టాడు. ఇక చిన్నోడు కు బయలుదేరక తప్ప లేదు. రాజుగారి వంటలక్క చిన్నోడు కు మంచి మంచి ఆహారపదార్థాలు మూటగట్టి ఇచ్చింది. వాడు అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది. అందుచేత వాడు ఒక చెట్టు కింద కూర్చుని ఆహారం మూట విప్పసాగాడు. అంతలోనే ఒక ముసలిది వా డున్న చోటికి వచ్చి, "ఆ మూట లో ఏమిటి, నాయనా?" అని అడిగింది. "మా పెద్దమ్మ లా ఉన్నావు నువ్వు రా భోజనం, కావలిస్తే నువు కూడా ఇంత తిను," అన్నాడు చిన్నోడు . ఇద్దరూ కడుపునిండా తిన్నాక, ముసలిది చిన్నోడు తో, "నీ రుణం ఉంచుకోనులే, బాబూ. ఏం పని మీద పోతున్నావు? ఎక్కడ దాకా ప్రయాణం?" అని అన్నది. చిన్నోడు తాను బయలుదేరిన పని గురించి, రాజు గారి బెదిరింపు గురించి ముసలిదానికి చెప్పాడు. "నీకు జగదేకసుందరి కావాలం టే, ఈ దిక్కుగా పోతే మాయావు లుండే కోట వస్తుంది. అక్కడ జగదేక సుందరులు దొరుకుతారు. ఈ శంఖం ఊదావంటే నిన్ను మాయావు లేమీ చెయ్యరు సరేకదా, వాళ్ళు నువు చెప్పినట్టు వింటారు,” అని ముసలిది చిన్నోడు కొక శంఖం ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయింది.చాలా సేపు శ్రమపడిన మీదట చిన్నోడు కు ఆ శంఖాన్ని ఊదటం చాతనయింది. అది మోగిన మరుక్షణం అతని చుట్టూ భూతాలు ప్రత్యక్షమై "ఏం కావాలి, దొరా? ఏం సెలవు?" అని కేకలు పెట్టారు. " నా కొక జగదేకసుందరిని తెచ్చిపెట్ట గలరా?” అన్నాడు చిన్నోడు , లోలోపల వాళ్ళను చూసి భయపడుతూనే. "జగదేకసుందరులను తాకే శక్తి మాకు లేదు గాని, వాళ్ళుండే చోటికి నిన్ను చేర్చుతాం," అని భూతాలు చిన్నోడు ను ఒక కోట వద్దకు ఎత్తుకుపోయి దించారు. కోట నిర్జనంగా ఉన్నది. చిన్నోడు లోపలికి వెళ్ళేసరికి అక్కడ ముగ్గురు రాజకుమా ర్తెలు అతని కళ్ళ పడ్డారు. చిన్నోడు ను చూస్తూనే వాళ్ళు భయపడిపోయి, కంగా రుగా అటూ ఇటూ పరిగెత్తి, అంతలోనే అదృశ్యమైపోయారు. చిన్నోడు కోట అంతా తెగ వెతికాడు, కాని వాళ్ళ జాడ ఏమీ తెలియలేదు. వాళ్ళు అలా కంగారుపడి పరిగెత్తకపోయి నట్టయితే వారిలో ఏ ఒకతెనైనా బతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారి కిచ్చి, తన తలను రక్షించుకుని ఉండేవాడు. ఇక తాను వట్టి చేతులతో తిరిగిపోక తప్పదు, రాజుగారు తన తల తీయించటం అంతకన్నా తప్పదు.చిన్నోడు ఇలా అనుకుంటూండగా సుంద రులు కనిపించిన చోట ఒక గూట్లో వాడికి మూడు నిమ్మ పళ్ళు కనబడ్డాయి. ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చునని చిన్నోడు వాటిని తన సంచీలో వేసుకుని ఇంటిదారి పట్టాడు. కొంత దూరం వెళ్ళేసరికి చిన్నోడి కి అపరిమితమైన దాహం పట్టుకున్నది. ఎండ మండిపోతున్నది. కనుచూపు మేరలో ఎక్కడా తడినేల అన్నది కూడా లేదు. అందుచేత వాడు సంచీలో నుంచి ఒక నిమ్మ కాయ తీసి కోశాడు. అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించి, "దాహం ! చచ్చిపోతున్నాను!" అన్నది. ఆ సుందరిని ఎలాగైనా బతికించి రాజు గారికి ఇస్తే తన తల కాచుకోవచ్చు నను కుని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా చెడ వెతికాడు. ఎక్కడా ఒక్క చుక్క నీరు లేదు. వాడు వగర్చు కుంటూ తిరిగి వచ్చేసరికి, నిమ్మకాయలో దాగిన సుందరి చచ్చేపోయింది. చిన్నోడు పుట్టెడు విచారంతో ముందుకు సాగాడు. మరి కొంత దూరం వెళ్ళేసరికి వాడికి మళ్ళీ దుర్భరంగా దాహం వేసింది. వాడు సంచీలో నుంచి మరొక విమ్మ కాయ తీసి కోశాడు. అందులో ఇంకా అంద మైన సుందరి తల కనిపించి, "దాహం! చచ్చిపోతున్నాను,” అన్నది. చిన్నోడు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కులకూ చెడపరిగెత్తాడు. కాని వాడి శ్రమ ఫలించ లేదు. ఎక్కడా నీరు దొరకలేదు. నిమ్మ కాయలో కనిపించిన సుందరి ప్రాణాలు విడిచింది. చిన్నోడు కిప్పుడు ఒక ఆశ పుట్టింది. మూడో నిమ్మకాయలో మరొక జగదేక సుందరి ఉండి ఉంటుంది. ఆ నిమ్మ కాయను కొయ్యకుండా తాను రాజభవనంచేరే పక్షంలో ఆమె ప్రాణాలూ, తన తలా కూడా దక్కుతాయి. తాను అవివేకంగా నిమ్మ కాయలు కోసి ఇద్దరు సుందరులను చావనిచ్చాడు. ఈసారి అలాటి పొరపాటు చెయ్యగూడదు. కాని రాజభవనం చేరే లోపుగా చిన్నోడు కు దాహంతో నాలుక ఈడ్చుకుపో సాగింది. నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాలలో తన ప్రాణాలు పోయేటట్టు కని పించాయి. వాడు పళ్ళబిగువున నడిచి, రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుచూపు మేరలో ఉండే చోటికి చేరి, దాహం భరించలేక, మూడో నిమ్మకాయ చచ్చిపోతున్నాను!" అన్నది. తీసి కోశాడు, అందులో అందరి కన్న అంద మైన ముందరి తల కనిపించి, "దాహం! వెంటనే నాగులు లేని శక్తి తెచ్చుకుని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్ళి, కొలను చేరుకుని, సుందరి చేత నీరు తాగించి, తాను కూడా తాగాడు. కొలనులోని నీరు తాగుతూనే జగదేకసుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది. "అమ్మయ్య బతికాను ! నువ్వీ చెట్టు మీదికి ఎక్కి, ఆకు గుబురు మధ్య దాక్కో. నేను వెళ్ళి రాజుగారిని పిలుచుకువస్తాను,” అని చిన్నోడు రాజభవనానికి వెళ్ళాడు.ఇంతలోపల రాజుగారి వంటలక్క నీటి కోసం కొలనుకు వచ్చి, అందులో బిందె ముంచబోతూ, చెట్టు మీద ఉన్న జగదేక సుందరి ముఖం నీటిలో చూసి, "అమ్మ బాబోయ్ ! నే నింత అందంగా ఉన్నానా? అయితే నా కీ వంటలక్క పని చేసే కర్మే మిటి?" అని బిందె అక్కడే విసిరికొట్టి, వెనక్కు తిరిగేసరికి చెట్టు కొమ్మల మధ్య ఉన్న జగదేకసుందరి కనిపించింది. వంటలక్కకు ఆమెను చూడగానే మండిపోయింది. ఆమె జగదేక సుందరిని కిందికి ఈడ్చి, ఆమె దుస్తులు తాను ధరించి, జగదేక సుందరిని మడుగులోకి తోసేసి, తానే చెట్టుకొమ్మలలో ఎక్కి కూర్చున్నది. కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి చూచునుగదా, ఆ మనిషి జగదేకసుందరి కాకపోకా మామూలు సుందరి కూడా కాదు. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చి పెట్టించాడు. వంటలక్కనూ, చిన్నోడు నూ కూడా చెరలో ఇది జరిగిన మర్నాడే రాజుగారి నౌకర్లకు కొలనులో ఒక తెల్లని చేప దొరికింది. దాన్ని వంటణంటి దాసీలు కోసే సరికి ఒక చిన్న స్త్రీ బయటికి వచ్చి, వాళ్ళు చూస్తూండగానే మామూలు మనిషి అయింది. దాసీలు వెళ్ళి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు. రాజుగారు పరిగెత్తు కుంటూ వచ్చి, జగదేకసుందరిని చూసి అమితమైన ఆశ్చర్యమూ, ఆనందమూ పొంది, ఆమె ద్వారా జరిగినదంతా తెలుసు కున్నాడు. ఆయన వెంటనే చిన్నోడు ను చెర విడిపించి, వాడికి తన అంగరక్షకుడుగా ఉద్యోగమిచ్చి, జగదేక సుందరిని వైభవంగా పెళ్ళాడాడు. వంటలక్క తాను చేసిన నేరం ఒప్పుకున్నది. ఆమెను దేశం నుంచి తరిమే శాడు. చిన్నోడు అన్నలందరూ ఇంకా నీరూ, కట్టెలూ చేరవేస్తూనే ఉన్నారు.

Monday, 8 December 2025

రెండు రహస్యాలు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు దేశమంతటా పాదయాత్రలు చేస్తూ భగవంతుని సారాంశాన్ని వ్యాపింపచేస్తున్న రోజులవి. అలా ఓ రోజు అటవీ ప్రాంతం గుండా కాశీనగరానికి తన భక్త బృందంతో యాత్రసాగిస్తూ ఉండగా, చీకటిపడే సమయం కావొచ్చింది. దూరంగా మినుకు మినుకుమంటూ దీపపు కాంతులతో ఓ ఊరు కానరావడంతో ఆ పూటకు అక్కడికి చేరి కాస్త విశ్రమించి మరునాడు పయనం సాగించవచ్చని శంకరాచార్యుల వారు శిష్యులకు ఆనతీయడంతో వారంతా ఊరి వైపు పయనం సాగిం చారు. ఊరు సమీపించగానే ఆది శంకరాచార్యులవారు విచ్చేస్తున్నారని తెలిసిన జనులు తండోపతండాలుగా చేరి భజనలతో, దీపాలతో, పుష్పాలతో ఎదురేగి వచ్చి వారందరినీ ఊరిలో ఆశ్రమానికి కొనిపోయారు. కావలసిన పాలు పండ్లు భోజభక్ష్యాదులు అమర్చి ఆ రాత్రి వారిని సేవించారు. మర్నాడు ఊరిలోని ప్రతి గడపను దర్శించారు, ఇంటింటో గోమాత దర్శనమిచ్చింది. ప్రతి ఇంటి వాకిటా తులసి వనాలు దర్శనమిచ్చాయి. పూజా మందిరాలలో వేదాలు వల్లింపబడుతున్నాయి. ఆ ఊరిని చూసేసరికి సమస్త దేవతలూ అక్కడే కొలువుతీరి ఉన్నట్లుగ్గా అనిపించింది. జనులందరినీ దీవిస్తూ జగద్గురువు తన శిష్యులతో తిరిగి పయనమై అందరివద్దా వీడ్కోలు తీసుకున్నారు. ఊరికి కాస్త దూరంగా నడిచివచ్చాక శంకరాఛార్యుల వారు కాస్సేపు ఆగి ఆ ఊరి వైపు చూశారు. శిష్యగణం అంతా చూస్తుండగా ఊరిని దీవిస్తూ, 'ఈ ఊరిలో ప్రతి గడపా నలుదిశలా చెదిరిపోవు గాక,' అని ఆశీర్వదించి నడక ప్రారంభించారు. స్వామి నోటి వెంట వచ్చిన ఆ వాక్కు విని శిష్యగణం ఆశ్చర్యపోయింది. జగద్గురువు ఎదుట నోరు మెదిపే ధైర్యం చాలక ఆలోచనలో పడ్డారు. మరలా దట్టమైన కీకారణ్యం గుండా కాశీనగరం వైపు నడక సాగిస్తుండగా కొద్ది సేపటికి సాయం సమయం అయింది, దూరంగా మళ్లీ కొన్ని దీపపు కాంతులతో మరో ఊరు గోచరించింది. శంకరాచార్యులవారు ఈసారి ఆ ఊరి వైపు నడవమని ఆదేశించగా అంతా అటు పయనించి ఊరు చేరారు. ఓ రాగి వృక్షం కింద పెద్ద అరుగు కనిపించేసరికి అక్కడ జగద్గురువు తన శిష్యులతో కలిసి ఆసీనులయ్యారు. కాని అక్కడి జనులలో సాత్వికత మచ్చుకైనా కానరావడం లేదు. ఆదిశంకరాచార్యుల వారే అక్కడ వచ్చి నిలిచినా ఎవరికీ పట్టనట్లుగా చూసిపోతున్నారు. కొందరు జనులైతే మద్యం మత్తులో మునిగి జోగుతూ వీరిని చూసి పరిహాసం చేసి పోతున్నారు. అక్కడ సేవించడానికి మంచినీరు కూడా దొరకలేదు. సుఖాలలో, మత్తుతో తులతూగుతున్న ఆ ఊరిని చూసి శిష్యగణం కోపంతో ఊగిపోతున్నా వారిని శాంతింపజేస్తూ జగద్గురువు ఆ రాత్రి అక్కడే గడీపి మరునాడు పయనం సాగించారు. ఊరికి కాస్త దూరంగా వచ్చి శంకరాచార్యుల వారు ఊరి వైపు చూస్తూ ఆగారు. శిష్యులంతా ఊరిని శపించమన్నట్లు కళ్లెర్రజేసి చూస్తున్నారు. కాని స్వామి వారు ఆ ఊరిని దీవిస్తూ, “ఈ ఊరు కలకాలం ఇచ్చోటనే ఐకమత్యంతో కలిసి ఉండుగాక, ' అని దీవించి ముందుగు సాగారు. శిష్యగణం మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆతిథ్యం దొరికిన చోటుని చెదిరిపొమ్మన్నారు. అవమానం జరిగిన చోట అందరినీ కలిసి ఉండమని దీవించారు. స్వామి ఆంతర్యం ఏమై ఉంటుంది? శిష్యులను తొలిచి వేస్తున్న సందేహాన్ని గమనించిన జగద్గురువు వారితో “మీరంతా నా దీవెనలలో అంతరార్థం తెలియక సతమతమవుతున్నారు కదూ,' అని అడిగ్లారు. అప్పుడు అందరూ ముక్షకంఠంతో 'అవును స్వామీ,, దయచేసి వాటి అంతరార్థం తెలియజేసి మా సందేహాన్ని నివృత్తి చేయగలరు', అంటూ ప్రాధేయపడ్డారు. శంకరాచార్యులవారు ఆ అడవిలో ఓ చల్లని వృక్షం కింద అందరినీ కూర్చుండ బెట్టి తానూ ఆశీనులై వివరిస్తూ, 'నాయనలారా, మనకు ఆతిథ్యం లభించిన మొదటి ఊరు అణువణువు భక్తి పారవశ్యంతో నిండి ప్రతి మనిషీ పావనుడై ఉన్సాడు. వారంతా వేదాలు, పురాణాలు అవపోసన పట్టిన మహాజ్ఞానులు. ఇటువంటి ఊరును చెదిరిపోవుగాక అంటే నా మనోభీష్టం అది కాదు. వారంతా నలువైపులా వ్యాప్తి చెందితే వారు ఏ మూల చేరినా అక్కడ భక్తి, సంస్కృతి విరాజిల్లుతుందని అర్ధం. వారు పాదాలు మోపిన ప్రతిచోట ఎంతో ఆదర్శవంతమైన సమాజం వేళ్లూనుకుంటుంది. అలా వారు ఇక్కడే ఉండిపోతే సామాన్యులు జ్ఞానులయ్యేదెలా.. అందుకే వారిని నలుదిశలా విస్తరించేలా ఆశీర్వదించాను. మనకు అవమానం జరిగిన రెండవ ఊరుని కలిసి ఉండమని ఎందుకు దీవించానంటే ఈ ఊరిలో ప్రతి వ్యక్తీ తమోగుణంతో పెరిగి ఉన్నారు. మద్యపాన సేవనంతో మానవీయతను మరిచిపోయి నడుచుకుంటున్నారు. ఆ జనం ఏ చోటుకు చేరినా అఆ ప్రభావం మిగతా సమాజంపై పడి భ్రస్టుపడుతుంది. అందుకే వారిని అక్కడే కలిసి ఉండమంటూ.. పునరపి మరణం పునరపి జననంతో చివరికి ఆ జీవన వైవిధ్యమే ఓ నరకప్రాయమని తెలుసుకునేలా దీవించాను, ఈ రహస్యం సామాన్యులకి అంతుపట్టనిది. అర్ధమయిందా... నాయనా....ఇక పదండి' అంటూ జగద్గురువు ముందుకు సాగారు. తమ సందేహాలను నివృత్తి గావించుకున్న శిష్యులందరి మొహాల్లో వెలుగునిండుకుంది. తన సంకల్చబలంతో ఈ నేలను పునీతం చేసిన ఆదిశంకరులు భగవంతుడు కాక ఇంకెవరు అనుకుంటూ భక్తి పారవశ్యంతో కాశీక్షేత్రం వైపు పాదయాత్ర కొనసాగించారు.
బ్రహ్మచారి నర్మదానదీ ప్రాంతాన గల ఎత్తయిన కొండలమధ్య లోతైన లోయ ఒకటి ఉండేది. ఆ లోయలో చిన్న ఊరు ఉండేవి. ఆ ఊరిలో నివసించేవారికి బయటి ప్రపంచంతో ఏమీ సంబంధంలేదు. బయట ప్రపంచానికి సూర్యోదయమయినాక మూడు గంటలదాకా ఈ లోయలో సూర్యకాంతి కనిపిం చేదికాదు. అలాగే సూర్యాస్తమయంకూడా రెండు మూడు గంటలు ముందుగానే జరిగిపోయేది. సెలయేళ్ళతోనూ, చక్కని పూలచెట్లతోనూ, పళ్లచెట్లతోనూ ఈ లోయ భూలోక స్వర్గంలాగా ఉండేది. వర్ధనుడు ఈ లోయలోనే పుట్టి పెరి గాడు. అతని తండ్రికి ఏలోటూ లేదు. ఆ తండ్రికి వర్ధనుడు ఒక్కడే కొడుకు. వాడు అయిదారేళ్ళ కుర్రవాడై ఉండగా ఒక నాడు తండ్రి వెంబడి లోయలోనుంచి ఒక కొండమీదికి ఎక్కాడు. వారు శిఖరాన్ని చేరు కున్నాక వర్ధనుడికి కొండ అవతల వేపున ఆకాశం తగిలేదాకా మైదానా లుండటం కనబడింది. వాడు ఆ మైదానా లను చూసి తన లోయకేసి చూస్తే ఎంతో చిన్నది అనిపించింది. " నాన్నా, ప్రపంచం ఇంత పెద్దదా?” అని వాడు తండ్రిని ఆశ్చ ర్యంగా అడిగాడు. తండ్రి నవ్వి, "నాయనా, ప్రపంచమంతా నీకు అప్పుడే కనబడిందనుకున్నావా? అది అంతులేనిది. అందులో మహానగరా లున్నాయి, మహానదులున్నాయి, మహా సముద్రాలున్నాయి!” అన్నాడు. వర్ధనుడు తండ్రినడిగి ఆనగరాలను గురించి, అక్కడి జీవింతం గురించి, సము ద్రం గురించీ, అందులో ప్రయాణించే నౌకలను గురించి వివరంగా తెలుసు కున్నాడు. వివరాలు తెలుసుకుంటున్నకొద్దీ వాడికి ఈ విశాల ప్రపంచమంతా తిరగాలని, వింతలన్నిటినీ చూసి ఆనందించాలనీ గాఢ మైన కోరిక కలిగింది. తండ్రి వర్ణించిన ప్రపంచపు వింతలను గురించి అస్తమా నమూ కలవరిస్తూ కాలం గడిపాడు. వర్ధనుడు. పదహారేళ్లవాడయాడు. ప్రపంచ పర్యటన చేయాలనే కోరిక వాడిలో ఎప్పటికన్నా ఇంకా తీవ్రంగా ఉన్నది. ఈ సమయంలో వాడుండే లోయలోకి ఒక పెద్దమనిషి వచ్చాడు. వర్ధనుడు ఆ పెద్ద మనిషితో స్నేహంచేసి, ఆయనద్వారా ప్రపం చపు వింతలు మళ్లీ తెలుసుకుని, పట్టరాని ఉద్రేకంతో, " నేను నా జీవితమంతా ఇక్కడే గడిపాను. ఇంత విశాల ప్రపం చాన్ని ఎప్పుడు చూద్దామా అని నా ప్రాణం కొట్టుకుపోతున్నది," అన్నాడు.. "ఈ మహాపట్టణాలన్నీ తిరిగి, సము ద్రాలు దాటితే నీకు ఎక్కువ ఆనందం కలుగుతుందనుకున్నావా? నీకు ప్రపం చంలో ఉండే వింతలే తెలిశాయిగాని అక్కడి బాధలను గురించి కొంచెంకూడా తెలిసినట్టులేదు. నేను ప్రపంచం చాలా చూశాను. మీ లోయలాంటి సుఖమయమైన ప్రదేశం నాకెక్కడా కనిపించలేదు. మహా రాజుల ఇళ్లలోకూడా ఈ శాంతి సౌఖ్యాలు దొరకవు. అందుచేత నీకు కావలిసింది ఆనందమే అయితే నువ్వీలోయను విడిచి ఎక్కడికీ పోకు," అన్నాడు పెద్దమనిషి. " ఇంత విశాల ప్రపంచం ఉండి ఈ లోయలోనే జీవితమంతా గడపటం జీవిం చట మనిపించుకుంటుందా?” అన్నాడు వర్ధనుడు. "వెర్రివాడా, ప్రపంచమంతా నువు ఎలాగూ చుట్టిరాలేవు. ఒక్క ప్రపంచం ఇంకా విశాలమైనది. తల ఎత్తి ఆ నక్షత్రా గురించే ఎందుకు విచారిస్తున్నావు? సృష్టి లను చూడు. మన ప్రపంచంకంటె అనేక కోట్ల రెట్లు పెద్దవి అయిన బ్రహ్మాండాలు సృష్టిలో ఉన్నాయి. వాటిలో ఎన్ని వింత లున్నాయో, ఎవరికీ తెలియదు. ఆ బ్రహ్మాం డాలు మన కళ్ల ఎదుటే ఉన్నప్పటికీ వాటిని చేరుకోలేంగద!" అన్నాడు పెద్ద మనిషి. ఈ మాటలమూలంగా వర్ధనుడి అభిప్రాయం మారిపోయింది. అందుచేత తన తల్లిదండ్రులు చనిపోయినాకకూడా ఆ లోయ విడిచి ఎక్కడికీ పోక, ఇంటనే ఉండి తనకున్న ఆస్థిని చూసుకోసాగాడు.వర్ధనుడుని అందరూ ఎరుగుదురు, అతను అందరిని ఎరుగును. కాని అతను ఎవరితోనూ అంత కలుపుగోలుగా ఉండక, ఎప్పుడూ ఇంకొక ప్రపంచంలో ఉన్నవాడి కనబడటంచేత, వారంతా దూర దూరంగా ఉండేవాళ్లు. అతనికి వివాహ వయస్సు వచ్చింది. పెళ్ళాడాలంటే ఆ లోయలోనే కొందరు కన్యలున్నారు. కాని వారిలో ఒక్కరూ అతనికి నచ్చలేదు, అతను పెళ్లి తలపెట్టనూలేదు. ఇంతలో ఒక సంఘటన జరిగింది. లోయ చివర నివసించే ధనుంజయుడు అనే ఆయన తన ఇంటిని పడగొట్టించి ఇంకా పెద్ద ఇల్లు కట్టించ సంకల్పించి, ఒక నెలపాటు వర్ధనుడి ఆతిథ్యం కోరాడు. ఎందుకంటే వర్ధనుడి ఇల్లు విశాలమైనది. అందులో అతనూ, ఇద్దరు నౌకర్లూ మాత్రం వున్నారు. వర్ధనుడు ధనుంజయున్ని తన ఇంట ఉండమన్నాడు. ధనుంజయుడు తన కుమార్తె అయిన కాత్యాయిని తోసహా వర్ధనుడు ఇంటికి వచ్చేశాడు. వర్ధనుడు కాత్యాయినిని అంత బాగా ఎరగడు. ఆమె అందగత్తె అనీ, ఎంతోమంది. పెళ్లాడతానని వస్తే నిరాకరించిందనీ అతను విని ఉన్నాడు. ఇప్పుడామె తనకు సమీ పంగా వచ్చేసరికి ఆమెలో ఉన్న ఆకర్షణ వర్ధనుడికి పూర్తిగా తెలిసివచ్చింది. ఆమె అందమే గాక, మాటతీరూ, పనులు చేసే పద్ధతీ కూడా అతనికి ఇంపుగా కని పించాయి. ఇంతకాలానికి తాను పెళ్ళాడ దగిన కన్య కనపడిందిగదా అని అతను సంతోషించాడు. అయినా వర్ధనుడు తొందరపడక ఆమెపై తనకు కలిగిన సదభిప్రాయం కాలంతో పాటు మారిపోతుందేమోనని చూశాడు. రోజులు గడుస్తున్నకొద్దీ కాత్యాయిని అతన్ని మరింతగా ఆకర్షించిందేగాని, ఆమెలో ఆతనికి ఎలాట వెలితి కనిపించలేదు. అతను అనుమానాలన్నిటినీ కట్టిబెట్టి ధనుంజయుడితో ఒకనాడు, "అయ్యా, మీకూ, మీ అమ్మాయికీ సమ్మతమయే పక్షంలో నేనామెను వివాహమాడతాను,” అన్నాడు. ధనుంజయుడు కాత్యాయినితో ఈ సంగతి చెప్పేసరికి, ఆమె తనకు అభ్యం తరం లేదన్నది. ఇది జరిగిన కొద్దిరోజులకు ఒక సాయం కాలం వారిద్దరూ ఒక కొండదారి వెంబడి ఏదో మాట్లాడుకుంటూ నడుస్తూఉండగా ఒకచోట మంచి సువాసన పుష్పాలు కని పెంచాయి. మందాకిని వెంటనే వెళ్లి వాటిని కోసి కొన్ని తలలో పెట్టుకుని, మరికొన్ని చేత పట్టుకుని వర్ధనుడి వద్దకు వచ్చింది. "పూలు చెట్టున ఉండగా చూస్తుంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది, కాదూ?" అన్నాడు వర్ధనుడు. " నాకు అలాకాదు. చెట్టున అందమైన పూలు కనిపిస్తేచాలు నా ప్రాణం వాటికోసం కొట్టుకుపోతుంది. వాటిని కోసినదాకా నా ఆరాటం తగ్గదు," అన్నది కాత్యాయిని. మర్నాడు ఉదయం కాత్యాయిని కని పెంచగానే వర్ధనుడు, "నీతో ఒక్క విషయం చెప్పాలని నేను రాత్రి అను కున్నాను. మనమిద్దరమూ ఎంతో స్నేహంగా ఉంటున్నాం. ఈ స్నేహం మనకు ఆనందం కలిగిస్తున్నది. మనం పెళ్లాడినఁతమాత్రం చేత ఈ ఆనందం హెచ్చుతుందని నాకు తోచదు. నీ ఉద్దేశం ఏమిటి?” అని అడిగాడు. వెంటనే కాత్యాయిని అతని అభిప్రాయం మారినట్టు తెలుసుకుని, "నన్ను పెళ్ళాడ మని నేను మిమ్మల్ని ఒత్తిడిచెయ్యబోవటం లేదు. పెళ్ళి ప్రస్తావన ఎత్తినది మీరేగాని నేనుకాదు. అయినదేదో అయింది. ఇక ఈ విషయం ఎత్తకండి," అన్నది. ఆమెకు తనపై కోపం వచ్చిందని వర్ధనుడు తెలుసుకున్నాడు. కాని ఆ కోపం ఎలా పోగొట్టాలో అతనికి అర్ధంకాలేదు.కాత్యాయిని తన తండ్రితో, " నాన్నా, నేను బాగా ఆలోచించుకుని, వర్ధనుణ్ణి పెళ్లాడ రాదని నిశ్చయించుకున్నాను. నువుమా పెళ్లివిషయం ఇక తీసుకురాకు" అన్నది. తరవాత కొద్దిరోజులకే ధనుంజయుడి కొత్త ఇల్లు తయారయింది. తండ్రి కూతుళ్లు వెళ్లి పొయారు. కాలక్రమాన కాత్యాయిని ఎవరినో పెళ్లాడి వెళ్ళిపోయింది. వర్ధనుడు జీవి తాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు.
###ఆనందం### ఒక ఊళ్ళో ఒక గృహస్థుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు. తండ్రి ఖజా నాలో రాతగాడుగా ఉండి. ఏ కొరతా లేకుండా కొడుకులను పోషిస్తూ వచ్చాడు. ఆయన పెద్దవాడయిపోయి, ఆరోగ్యం చెడిపోయినందున ఖజానా. ఉద్యోగం మానుకుని, ఇంటిలో విశ్రాంతి తీసుకో సాగాడు. . తండ్రి బాగానే సంపాదించాడు గాని, కొడుకులు తిని తిరగటం తప్ప ఏ ఉద్యోగం లోనూ ప్రవేశించలేదు. అది చూసి తండ్రి, ముగ్గురు కొడుకులనూ పిలిచి, "ఇన్నాళ్లూ నేను మిమ్మల్ని పోషించాను. ఇప్పుడు నేను మూల పడ్డాను. మీకు వయసు వచ్చింది. ఇక మీరే నన్ను పోషించాలి. మీకు తలా ఒక నూరు రూపాయలూ ఇస్తాను. వాటిని తీసుకుని మీరు ఎటైనా వెళ్ళండి, ఏమైనా చెయ్యండి. ఒక సంవ త్సరానికి మీరు నాకు సంతోషం కలిగించే పనులు చేసి, తిరిగి రండి." అన్నాడు. ఐశ్వర్యం కన్న మనిషిని సంతోష పెట్టేది మరే ముంటుందనుకుని, పెద్ద వాడు నగరానికి వెళ్ళి. ఒక గొప్ప ధని కుడి వద్ద పనికి కుదిరి, విశ్రాంతి వేళల్లో బరువులు మొయ్యటం దగ్గిర నుంచి ఏ పని అయినా సంకోచించకుండా చేశాడు. సంవత్సరం పూర్తి అయేసరికి అతడి వద్ద పదివేలు పోగయాయి. అతను దానితో ఒక మంచి రత్నాన్నికొని, ఇంటికి తిరిగి వచ్చి, దాన్ని తన తండ్రికి ఇచ్చాడు. "అయ్యో, నాయనా ! ధనమే ప్రధాన మని అడ్డమైన చాకిరీ చేసి ఎలా అయి పోయావు ! నిన్ను చూస్తే నాకు దుఃఖం కలుగుతున్నది రా." అన్నాడు తండ్రి. రెండోవాడు ఒక సిద్ధవైద్యుడి దగ్గిర శిష్యుడుగా చేరి, ఆయనకు ఎంతో శ్రద్ధాసక్తులతో శుశ్రూషలు చేసి మెప్పించి, ముసలితనాన్నీ, ముసలితనంలో కలిగే జాడ్యాలనూ పోగొట్టే ఒక గొప్ప ఔష ధాన్ని సంపాదించి, ఇంటికి తిరిగి వచ్చి, ఆ ఔషధాన్ని ఎంతో సంతోషంగా తండ్రికి ఇచ్చాడు. “నాకు ఈ ఔషధం ఎందుకు, నాయనా? నేను సమస్త సుఖాలూ అను భవించాను. కృత్రిమంగా తెచ్చిపెట్టు కునే యౌవనం నాకు సంతోషం కలిగిం చదు. ఇది చూసి నేను సంతోషిస్తానని నువు అనుకున్నందుకు నాకు విచారమే కలుగుతున్నది.'' అన్నాడు తండ్రి. మూడోవాడు ఒక వృద్ధుడైన గురువు దగ్గిరికి పోయి, ''తండ్రి సంతోషించా లంటే కొడుకు ఏం చెయ్యాలి?" అని అడిగాడు. “నీకు అభిమానం గల విద్య ఏమిటి?" అని గురువు ఎదురు అడిగాడు. “నాకు సంగీత మంటే చాలా ఇష్టం." అన్నాడు కుర్రవాడు. "అయితే సంగీతం నేర్చుకో. అందులో ప్రవీణుడివి అయావంటే నీ తండ్రి సంతో షిస్తాడు." అన్నాడు గురువు. మూడోవాడు ఒక సంగీత విద్వాంసుడి దగ్గిరికి పోయి, తన దగ్గిర ఉన్న డబ్బంతా ఇచ్చేసి. ఆయన వద్ద సంగీతం నేర్చు కుంటూ అహెూరాత్రులు సాధన చేశాడు. ఒక్క ఏడాదిలో వాడు గొప్ప సంగీత విద్వాంసుడై, దేవాలయంలో పాడసా గాడు. అతని పాట విన్న రసికులు తన్మ యులై రాజుగారికి అతని సంగతి చెప్పారు. రాజుగారు అతన్ని ఆహ్వానించి, ఆస్థానంలో పాడించి, మెచ్చుకుని, అతన్ని ఆస్థాన విద్వాంసుడుగా నియమించాడు. తండ్రిని చూసి రావటానికి మూడో వాడు రాజుగారి అనుమతి పొంది, రాజు గారిచ్చిన కానుకలన్నీ తీసుకుని ఇంటికి వచ్చాడు. తండ్రి ఆ కొడుకును చూసి సంతోషించి, "ఇదే తండ్రికి నిజమైన సంతోషం. కొడుకు 'కీర్తిమంతుడు కావ టంతో తండ్రి ధన్యుడవుతాడు.'' అన్నాడు.
@@@@అన్నదమ్ములు@@@@ అనగా అనగా వొకపూర్లో మురళి,రవి అను యిద్దరు అన్నదమ్ము లుండేవాళ్లు. మురళి పెద్దవాడు; తెలివిగలవాడు. రవి చిన్న వాడు; అమాయకుడు. మురళి భార్య భాగ్య వంతులబిడ్డ. అందుచేత గర్వంగా వుండేది. రవి భార్య బీదయింటి పిల్ల. అందుచేత కొంచెం అణకువగా వుండేది. మురళి తన తెలివితేటలన్నీ తమ్ముడిమీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతలనాటి చిన్న పాతయిల్లూ, నాలుగెకరాల మెట్టచేను మాత్రం అతనికి యిచ్చాడు. పెద్దమేడ మిగతా ఆస్తీ అంతా | తను ఉం చుకున్నా డు. పాపం, రవి దాంతోనే తృప్తి పడి కష్టపడి చేను దున్నుకుంటూ, వచ్చిం దాంట్లో తను కొంత తిని, మిగతాది ధర్మంచేస్తూ వుండేవాడు. ఇలా వుండగా వొకనాటి రాత్రి ఎవరో సన్యాసి, రామయ్య యింటి కొచ్చి తలుపుతట్టాడు. మురళి వచ్చి కిటికీ తెరిచి " ఎవరు నువ్వు? ఎందుకీ అర్ధరాత్రప్పుడు తలుపు తడ్తావు?” అని గద్దించాడు. అప్పుడు సన్యాసి “బాబూ, నేను సన్యాసిని. రామేశ్వ రం పోతూ యిటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండిపెట్టి పడుకోనివ్వండి. ఉద యాన్నే వెళ్లిపోతాను " అన్నాడు. “ఏంటి, మాయింట్లో వల్లగాదు ఎదురుగానే పో, పో. అదుగో, అ వున్నాడు షాహుకారు. వాడి దగ్గిరికి పో. దోవన యేసన్యాసిపోతున్నా పిలిచి అన్నం పెడతాడు." అన్నాడు. మురళి.. యోగి పోయి రవి తలుపు తట్టాడు. రవివచ్చి తలుపుతెరిచిసన్యాసిని యింట్లోకి తీసుకుపోయి, భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత రవి ఆయనకి పక్కవేసి అతను నిద్రపోయిందాకా విసుర్తూ కూచున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉద యాన లేచి వెళ్లేటప్పుడు రవి నీ అతని భార్యనూ పిలిచి "మీకు మూడు వరాలిస్తాను. కోరుకోండి” అన్నాడు. రవి "స్వామీ, నాకు, నలుగురు ఇంటికివస్తే, ఉండటానికి పెద్ద యిల్లూ, బీదలకు ఎంత ధర్మంచేయటానికైనా చాలిన డబ్బూ యివ్వండి. అదిచాలు” అన్నాడు. రవి పెళ్లాం “స్వామీ, నాకేమీ వద్దు; యితరులకు లేదనకుండా ధర్మం చెయ్యటానికి నాకు బుద్ధి పుట్టించు” అని రెండో వరం అడిగింది. మూడో వరంగా, సోమయ్య “స్వామీ, మాకు యెప్పుడూ యితరులకు మేలు చెయ్యాలనే బుద్ధి పుండేట్టుగా వర మివ్వండి” అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయాన మురళి లేచి చూసేసరికి అతని యింటి ముందు పెద్ద | మేడవుంది. మురళి దబదబ పెళ్లాన్ని పిలుచుకుని మేడ దగ్గిరకి పరుగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడూ తమ్ముడి భార్యా వున్నారు. మురళి “యిది ఎలా వచ్చిం” దని తమ్ముణ్ణి అడిగాడు. రవి రాత్రి జరిగిందంతా చెప్పాడు. పూసగుచ్చినట్లు ఇక మురళి పెళ్లానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కి పోయి సన్యాసిని పట్టుకు రమ్మని బలవంతపెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హా మీ కూ డా ఇచ్చింది. మురళి గుర్రం వేసుకుని వెళ్లాడు. కొంతదూరం పోయేవరకు సన్యాసి కని పించాడు. మురళి రొప్పుతూ, రోజుతూ "స్వామీజీ! రాత్రి మావల్ల చాలా నేరంజరిగింది, ఈమాటు మా యింటికి రండి. మిమ్మల్ని రాజులాగా చూస్తాము. నా భార్యకూడా మిమ్మల్నితీసుకురమ్మన్నది" అని బ్రతిమాలాడు. "బాబూ ! ఏదో నాదోవను నేను తీర్థ యాత్రలకు పోతున్నాను; నేను రాలేను” అన్నాడు సన్యాసి. “అలాగైతే ఎట్లా స్వామీ ! నా భార్య ఊరుకోదు. మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చిన మూడు పరాలైనా ఇచ్చి వెళ్లండి.” అన్నాడు మురై. సన్యాసి మురళి వదలడని అను కొని- "సరేలే నీకూ నువ్వుకోరుకున్న మూడు కోరికలు సిద్ధిస్తయి” అన్నాడు. మురళి పట్టరాని సంతోషంతో, గుర్రాన్ని మరీ వేగంగా పరుగెత్తిస్తూ ఇంటి వేపుకు బయలుదేరాడు, గుర్రం నోటివెంట నురుగులు కక్కుతూ, భూమిమీద కాళ్లు ఆనకుండా దౌడుతీస్తున్నది. యింతలో మురళి కి వొక దుర్బుద్ధి పుట్టింది. "గుఱ్ఱం ఇంత త్వరగా పరుగెత్తు తున్నదే వొక వేళ చచ్చిపోతే ఎట్లాగా ?” అనుకున్నాడు. అనుకోవటంతోటే, గుఱ్ఱం థామ్మని క్రిందపడి చచ్చింది. అతనికి మురళి గుఱ్ఱంతోపాటు కిందపడ్డాడు. పడి, లేచి దుమ్ము దులుపుకుని చచ్చిన గుఱ్ఱాన్ని చూసి విచారపడ్డాడు. గుఱ్ఱాన్ని వొదిలిపెట్టి వెళ్లడానికి బుద్ధి పుట్టలేదు. ఐనా ఏమిచేస్తాడు, వెళ్లకతప్పదు. “గుఱ్ఱం చావనేచచ్చింది. ఈ జీను వొదిలి పెట్టటం ఎందుకా” అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్లాం మాటలువిని యింత దూరం వచ్చినందుకు అతను విసుక్కు న్నాడు. వినుక్కుని "పాపమని, నన్ను యోగికోసం పంపి తను హాయిగా యింటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం!" అని అను కున్నాడు. ఇతను అనుకోవటమేమిటి, ఆ జీను మాయమవటమేమిటీ వొక్కసారే జరిగినై.మురళి మూడింట్లో రెండు వరాలు యిలా వూరికే పోగొట్టుకుని కాళ్ళీడ్చు కుంటూ యింటికివచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చునివున్నది. ఆమె నెత్తిమీద జీను. ఆమె రామయ్యని చూడగానే మండి పడుతూ, 'ఏమిటిదీ? ఎట్లావచ్చింది నీ జీను నా నెత్తిమీదికి ?' అని అడిగింది. రామయ్య కప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. " ఇదుగో, జరిగిన పొరబాటేదో జరిగిపోయింది. నువ్వు వోర్పుగా జీను మోస్తూవుండు. మనదగ్గిర యింకోవరం మిగిలి వున్నది. దీంతో మనం యేదైనా మంచివరం కోరుకుని | ధనవంతులమయి హాయిగా వుందాం." అన్నాడు. ఈ మాటలు వినేవరకు అతని పెళ్ళాం మండిపడింది. " నువ్వూ నీ డబ్బూ పోయి గంగలో పడండి తర్వాత. ముందు నా నెత్తిమీది జీను దించు. లేకపోతే బాగుండదు చెప్తున్నాను" అన్నది. పాపం మురళి పెళ్ళానికి భయపడి "జీను వూడిపోవాలి" అని కోరుకున్నాడు. జీను వూడి క్రిందపడ్డది. చూశారా ! రామయ్య చుర్భుద్ధితో యింత కష్టపడి తెచ్చుకున్న మూడు వరాలు యిట్లా మట్టిలో కలిసిపోయినై.
$$$అద్భుత గ్రంధం$$$ వివేకవర్ధనుడు ఆపూర్వ మేధావి. మంత్ర తంత్రాలవల్ల అనేక ఘనకార్యాలను సాధించ గలిగినవాడు. ఏ చికిత్సకూ కుదరని ఎన్నో దీర్ఘ వ్యాధుల్ని అతడు తన ఆమోఘ శక్తివ్వారా యిట్టే కుదర్చగలిగేవాడు. శక్తినీ సామర్థ్యాన్ని ప్రజల మేలుకోసమే వినియోగించిన రాజులలో సర్వజ్ఞపాలుడే మొదటివాడు. ఆ అతనికీర్తి దేశదేశాలా వ్యాపించి, ఖండ ఖండాంతరాలకూ అల్లుకుపోయింది. కాలంనాటి వైద్య, వేదాంత, ఖగోళ శాస్త్రా లకు అంతుదొరకని ప్రతి చికుసమస్యకూ వివేకవర్ధనుడు కనురెప్పపాటులో పరిష్టార మార్గం చూపగలిగేవాడు. ఇంత గొప్ప విజ్ఞానాన్ని, కేవల మానవ మాత్రుడు పొందగలగడం సాధ్యమేనా? -ఈ అనుమానం యితర రాజులకూ, చిన్నా పెద్దా పండితులకూ కలిగింది. రాజు పట్టి తెలివితక్కువవాడనికూడా వాళ్లకు దురభిప్రాయం వుండేది. అందువల్లనే అంతా స్వయంగా పరీక్షించి తెలుసుకోవా లని వివేకవర్ధనుడి వద్దకు వచ్చారు. వివేకవర్ధనుడు అందరనూ ఉచితరీతిని సత్కరించాడు. దర్బారు ఏర్పాటు చేశాడు. ఆయాదేశపు రాజులూ, పండితులూ సభను అలంకరించారు. ఉచితానుచిత ప్రశ్నలలో వివేకవర్ధనుడు అగ్ని పరీక్షకు గురిచేశారు. ఏ కోపమూ తాపమూ లేకుండా వివేకవర్ధనుడు అందరనూ తగిన నిదర్శ నాలతో సంతృప్తిపరిచాడు. సభ నిశ్శబ్ధంగా వుంది. అంతా అను మానరహితులైనట్టే కనబడ్డారు. వివేకవర్ధనుడు సింహాసనంమీదినుంచిలేచి అందరి వంకా చిరునవ్వు నవ్వుతూ చూచాడు. సభలో ఒకమూల చిన్న అలికిడి పెద్ద కలకలంగా మారింది. 'నేనా - నువ్వా' అనుకుంటూ బారుగడ్డం పెరిగిన పండితుడూ, పొడుగాటిమీసం పెంచిన ఒకరాజూ లేచి నిలబడ్డారు. వివేకవర్ధనుడు వారిద్దరివంకా పరీక్షగా చూసి తల పంకించాడు. "ఏ జీవినైనా చంపి బ్రతికించగలరా" అన్నారు పండితుడూ, రాజూ, "ఓ!" అన్నాడు తొలుకకుండా వివేకవర్ధనుడు, తరవాత — ప్రశ్నించిన ఆ యిద్దరి వంకా చూస్తూ "మీలో ఎవరు ఆ పరీక్షకు సాధనంగా వస్తారు?" అని అడిగాడు. రాజూ పండితుడూ ఒకరి మొహాలు ఒకరు చూచుకొని, అందరివంకా చూసి, తెల్లబోయి, కుర్చీలలో కూలబడ్డారు. వివేకవర్ధనుడు నవ్వుకున్నాడు. "మాన వుల్లోనే కాక, పశు పక్ష్యాదుల్లోకూడా జీవం ఉన్నదనుకుంటాను!" అంటూ చిలిపిగా సభాసదులవంక చూశాడు... సభంతా ఏకకంఠంతో "అవును! అవును!" అన్నది. వివేకవర్ధనుడు వెనకి తిరిగిచూశాడు. "చిత్తు! ఏమి సెలవు!” అంటూ సేవకుడు ముందుకువచ్చాడు. "మన తోటలో పెరుగుతూవున్న కోడి పుంజులలో ఒకదానిని పట్టుకురా” అని అజ్ఞాపించాడు, వివేకవర్ధనుడు, ఐదునిమిషాలూ ఐదుయుగాల్లా తోచింది. సభలోని రాజాలకూ, పండితులకూ, " ఈ దెబ్బతో ఈయనగారి సరుకు బయట పడుతుంది!" అని ఒకరాజు పక్కన కూర్చున్న మరోరాజు చెవిలో వూదాడు. " ఈ పరీక్షతో వివేకవర్ధనుడ్ల్ వస తేలి పోతుందిలే!" అని నసిగాడు ఒక పండితుడు పక్కనవున్న మరొక పండితుడితో. కోడిపుంజుతో సేవకుడు దర్బారు ప్రవే శించాడు. వివేకవర్ధనుడు కత్తితీసుకుని పుంజుతలను పరపర కోశాడు. తరవాత ఒకచేత్తో తలనూ ఒకచేత్తో మొండాన్ని, పట్టుకుని అందరికి చూపుతూ " కోడిపుంజుమరణించినట్టేనా?" అని ప్రశ్నించాడు. "చచ్చినట్టే' అన్నారు రాజులు. "జీవ రహితమైనట్టే" అన్నారు పండితులు, రాజాజ్ఞప్రకారం సేవకుడు కోడిపుంజు మొండాన్ని తలనూ సభాస్థలానికి ఆవైపునా యీవైపునా పుంచాడు. వివేకవర్ధనుడు జీవంలేని ఆ కోడిపుంజు మొండాన్ని వుద్దే శించి " నువ్వు పోయి నీతలను ఎప్పటిలా తగిలించుకో" అన్నాడు. ఆశ్చర్యం! కోడిపుంజు మొండెం సభా స్థలికి అడ్డంగా నడుస్తూపోయి ఆ తలడగ్గిర మెడ వంచింది. తల మొండెంతో కలిసి పోయింది. మరు నిమిషానికి లేచినిలబడి, రెక్షలుకొట్టుకుంటూ 'కొక్షా రోకో' అని అరుస్తూ దర్బారునుంచి బయటకు పరిగెత్తింది. భయాశ్చర్యాలతో సభలోని రాజులూ, పండితులూ వుక్కిరిబిక్కిరయ్యారు. ఒక్కమారుగా లేచి, తలలువంచి వివేకవర్ధనుడి గొప్పతనానికి జేజేలు పలికారు. "అన్ని అద్భుత విద్యల్ని ఎలా నేర్చారు ప్రభూ?" అని అడిగారు అంతా. "తెలుసుకొంటారా?" అన్నాడు రాజు. " తెలుసుకోవడమే కాదు, సాధించితీరా అనికూడా వున్నది" అన్నారు కొందరు. "అయితే వినండి!” అంటూ ప్రారం భించాడు వివేకవర్ధనుడు : "నాకు చిన్ననాటనే అద్భుత కార్యాలు చేయాలనీ, అపరశక్తుల్ని పొందాలనీ బల మైన కోరిక వుండేది. అందుకు సాహసం అవసరమని గ్రహించాను. ఈ ప్రపంచంలో అసాధ్యమైన ప్రతిదానినీ, సుసాధ్యంచేసే మార్గాలన్నీ ఒక గ్రంధంలో రాయబడి ఉన్నవని ఒక వృద్ధుడు నాతో చెప్పాడు. ఆ గ్రంధం ఇంద్రజాలిక పర్వతాల్లోని ఒకా నొక గుహలో వున్నదనికూడా చెప్పాడు. అనేక కష్టాలకూ, ఎంతో శ్రమకు ఓర్చి ఒకనాడు ఆ గుహ చేరాను. గాలీ, వెలుగూలేని ఆ గుహలో గుండె చిక్కబట్టుకుని కొంతదూరం పోగా, హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు నాకంటబడింది. నాశ్రమ తీరిం దనీ, ఆశలు ఫలించినవనీ నాకెంతో వుత్సాహం కలిగింది. తడబడుతూ ఆ వెలు గును సమీపించాను. ఆ వెలుగు ఒక నలుచదరపు గాజుపెట్టె లోనుంచి వస్తున్నట్టు మొదట్లో నాకు తోచింది. కాని బాగా పరీక్షించి చూడగా దానికి కారణం, ఆ గాజుపెట్టె మధ్యన వున్న ఒక పెద్ద గ్రంధమని గ్రహించాను. ఆతృతతో ఆ పెట్టెపై చేయివేశాను. అదే సమయంలో నాకు ఎదురుగా కొంచెందూరంలో నల్లని వికృతాకారం కారుమేఘంలా కదలటం చూచాను. మరు క్షణంలో వికృతమైన ధ్వని వినిపించింది. " ఏయ్! ఎవడవు నువ్వు? బయటికి పో!" అన్న భయంకర శబ్దం నన్ను హడలకొట్టింది. నేను భయాన్ని అణిచిపెట్టి "ఈ గాజుపెట్టెలోని ఆ గ్రంధం తీసుకో కుండా బయటికి పోను" అన్నాను. " అలానా ! అహ్హహ్హహ్హ !!" అన్న భయం కర గర్జనతోపాటు ఉరుములూ, మెరు పులూ, కడవపోతగా వానా ప్రారంభమయినై. భయంతో నేను వణికిపోయాను. దుష్ట శక్తులనుంచి రక్షణ చేసుకునేందుకు, చిన్ననాడు ఒక సిద్ధుడిద్వారా తెలుసుకున్న మంత్రాన్ని పెద్దగా ఉచ్చరింపసాగాను. పదినిమిషాల్లో వాన వెలిసింది. ఉరు ములూ, మెరుపులూ తొలిగిపోయినై. ఆ క్షణంలో కలిగిన సాహసంతో, గాజు పెట్టెను బలంగా గ్రుద్దేసరికి పెట్టె ముక్కలై పోయింది. ఆ దివ్యగ్రంధాన్ని రెండు చేతుల తోనూ హృదయానికి హత్తుకుని, గుహవెలు పలికి పరుగు పెట్టాను. నన్ను వెన్నాడుతూ, ఆ వికృతాకారం భయంకరంగా శపించసాగింది. " నువ్వునానుంచి తప్పుకోలేవు. నీకు పగలు విశ్రాంతి, రాత్రి నిద్రా లేకుండా చేస్తా. జాగ్రత్త!" అన్నది. అలానే జరిగింది.. నాలుగు దీర్ఘవత్స రాలు ఆ గ్రంధం నేను పఠించాను. ఎన్నెన్నో అద్భుత శక్తులను దానిద్వారా పాండగలిగాను, కాని నేను అందుకుగాను చెల్లించిన మూల్యం అపారం, నా ఆరోగ్యం, మనశ్శాంతి నశి, చింది. పగలూ, రాత్రి కూడా భయంకరమైన సరకంగా తయా రైంది. ఆఖరికి ఆ అద్భుత గ్రంథాన్ని సొంతంగా పఠించకుండానే, ఆ గుహలో ఎప్పటిచోటున ఉంచేసివచ్చాను. అయినా నాకు మనశ్శాంతి కలగకుండా అ భూతాత్మ నన్ను వెన్నాడుతూనే వుంది. శపిస్తూనే వుంది. నాకేమీ దారితోచలేదు. ఒకనాడు అడిగాను : "నీ గ్రంధం నీ గుహలోనే వుంచానుగదా! ఇంకా ఎందుకు సన్నిలా బాధిస్తావూ?" అని. ఆ వికృతా కారం మరింత వికృతంగా మారి బొబ్బ రించింది: " ఆ గ్రంథం చదివి నువ్వు అనేకమైన ఆపూర్వశక్తులు పొందావు. వాటిద్వారా లోకానికి నీనుంచి కీడుకలగవచ్చు.” "పరుల మేలుకే ఆ శక్తిని వినియో గిస్తాను. ప్రమాణుపూర్తిగా చెబుతున్నాను. నమ్ము!" అన్నాను. " సరే! అమాట నువ్వు నిలుపుకొన్నంతవరకూ నీజోలికి రాను" అంటూ ఆ భయంకర రూపం నన్ను వదిలిపోయింది. ఇదీ కథ.” దర్బారంతా గుసగుసలు ఆవరించినై. 'పరుల మేలుకోసమని మనం కోరి కీడెందుకు తెచ్చుకోవాలి! మనకు ఆ గ్రంధం అవస రమే లే దనుకున్నారు పండితులు. 'పర రాజ్యాలని జయించేటందుకూ, ప్రజల్ని శిక్టురుమనకుండా అణచివుంచేందుకూ పనికిరాని ఈగ్రంధం మనకేమి ఉపయోగ' మనుకున్నారు రాజులు.
&&&అతిజాగ్రత్త&&& బొద్దూరు గ్రామంలో సత్యం అనే అతిజాగ్రత్త మనిష ఉండేవాడు. గ్రామంలో అందరూ అతన్ని పిసినారి అంటూంటారు. అతడికి చిన్న తనంలోనే తల్లి. తండ్రి చనిపోగా, నాయనమ్మ పెంచి పెద్దచేసింది. కొద్దో గొప్పో ఆస్తితోపాటు, అతడికి మంచి ఉద్యోగం కూడా వున్నది. సత్యం పొరుగు గ్రామంలోవున్న విమల అనే అమ్మాయిని వివాహం ఆడాడు. అతడికి, ఆమె అంటే ప్రాణంతో సమానం. విమలకు కూడా భర్త అంటే ప్రాణమే కానీ, అతడు చూపే అతిజాగ్రత్త మాత్రం, తగని చిరాకు కలిగించేది. రాత్రివేళల్లో సత్యం, ఇంటికి లోపలి గడియలు, ఒకటికి పదిసార్లు వేస్తూండేవాడు. కూరలవాళ్ళకూ, అంగడి వాళ్ళకూ చిల్లర డబ్బులు, మరిమరీ లెక్క పెట్టి ఇవ్వడం లాంటి జాగ్రత్తలతో పాటు, అతడికి మరొక అలవాటు కూడా వుండేది. అదేమంటే- అతడి దృష్టిలో నిరుపయోగమైన వస్తువంటూ ఏదీలేదు. ఖాళీ అగ్గిపెట్టెలు, సబ్బుడెక్కులు, వెచ్చాల తాలూకు పొట్లాలదారాలు, కొబ్బరిపీచు, పాతకాగితాలు, మొదలైన వన్నీ సత్యం జాగ్రత్తగా దాస్తూంటాడు. ఎప్పటినుంచో అలా నిలవచేసిన అనవసర వస్తువులు, అతడి ఇంట్లో కుప్పలు తెప్పలుగా పడివుండేవి. కాపరానికి వస్తూనే, ఇంటి వైనం చూసి చిరాకుపడిన విమల, నడుం బిగించి చెత్తంతా పోగుచేసి, వీధిలో పారవేయ బోయింది. అయితే, అప్పుడే బజారు నుంచి వస్తున్న సత్యం కొంపలంటు కున్నట్టు కేకవేసి, "అవన్నీ ఇంట్లో ఒక పక్క పడివుంటాయి. వాటి జోలికి వెళ్ళకు. ఇంతకాలం నేను పనిమాలాదాస్తూ వచ్చింది. పారవేయడానిక్కాదు!" అన్నాడు. విమల ఆశ్చర్యంగా, "మరెందుకండీ, ఈ చెత్తంతా?" అన్నది. సత్యం, భార్యకేసి పిచ్చిదాన్ని చూసినట్టు చూసి. "ఎందుకేమిటి? ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు. ఈ పరమసత్యాన్ని, మా నాయనమ్మ నాకు నూరి పోసింది. ఆమె అఖరికి పూచికపుల్ల అయినా గాల్లో కొట్టుకు పోతూంటే చూసి విలవిల్లాడేది. ప్రతి వస్తువుకూ, దాని ప్రయోజనమంటూ ఒక కటుంటుంది. ఎప్పుడు దేని అవసరం కలుగు "తుందో చెప్పలేం గదా!" అన్నాడు. విమల భర్త కేసి కొరకొర చూస్తూ, ''ఈ చెత్తతో, మనకేం అవసరం కలుగు తుందో కాస్త చెప్పండి." అన్నది. "అలా అడుగు, బావున్నది. సరే. చెప్పేది జాగ్రత్తగా విను. మనం అంగట్లో సరుకులు కొన్నప్పుడు. యీ అట్టపెట్టె లకు, కాగితాలకు, డబ్బాలకు, దారాలకు కలిపే డబ్బు చెల్లిస్తూంటాం, తెలుసా? అలాంటప్పుడు, వీటిని పారేయడం అంటే. మన డబ్బుకు మనమే చిచ్చు పెట్టినట్టు!" అని సత్యం, భార్యకు ఏఏ సందర్భా లలో వాటిని ఉపయోగించుకోవచ్చో, ఒక అర్ధగంట సేపు వివరించాడు. అయితే, నెలలు గడుస్తున్నా. వాటిని ఉపయోగించుకునే సందర్భం. ఆ భార్యా భర్తలకు కలగలేదు. పైగా, రోజు రోజుకూ ఇంట్లో చెత్తాచెదారం విపరీతంగా పెరగ సాగింది. ఒకసారి విమల స్నేహితురాలు, విమల కొత్తకాపరం ఎలా వుందో చూడడానికి వచ్చింది. ఆమె ఇల్లంతా చూశాక, “పెళ్ళి కాకముందు. ఇంటి శుభ్రత గురించి గొప్పగా కబుర్లు చెప్పేదానివి. మరిప్పుడు ఇంటిని యిలా అడవిలా వుంచావేమిటి?" అని అడిగింది. విమలకు చాలా బాధ కలిగింది. అయినా, ఆమె భర్త చాదస్తం స్నేహితురాలిముందు బయట పెట్టుకోలేక, "రోజూ శుభ్రం చేయాలనుకుంటూనే బద్దకిస్తు న్నాను." అంటూ మాట దాటవేసింది. ఆ రోజు, ఆమె భర్తతో, ఈ విషయం గురించి పెద్దగా గొడవ పెట్టుకున్నది. సత్యం కూడా బాగా కోపం తెచ్చుకుని, "ఇంతకాలం బుద్ధిలేకనే, అవన్నీ దాచా ననుకుంటున్నావా? అసలు అవన్నీ ఒక పక్కన పడివుంటే, నీకొచ్చిన నష్ట మేమిటి? ఏదో ఒక రోజు, వాటి ఉప యోగం తప్పక వస్తుంది. చూస్తూండు!'' అన్నాడు. విమలకు, రా మే శమనే తమ్ము డున్నాడు.. అతడు ఒకసారి అక్కను చూడడానికి వచ్చాడు; చాలా తెలివైన వాడు. విమల, భర్త చాదస్తం గురించి తమ్ముడి తో చెప్పి. ఆయన్ని మార్చే ఉపాయమేదైనా ఆలోచించమన్నది. రామేశానిక్కూడా, విమల ఇంట్లో పనికివచ్చే సామానుకన్న పనికిరానివే ఎక్కువగా కనిపించినై. అతడు బాగా ఆలోచించి, విమలకు ఒక ఉపాయం చెప్పాడు. విమల మొదట సంశయించినా, తమ్ముడి తెలివితేటల మీద మంచి నమ్మకం వుండడం చేత, ఒప్పుకున్నది. ఆ రాత్రి భోజనాలయాక, విమల రామేశానికి బయట పక్క వేసింది. విమలా మామూలుగా నే ఇంట్లో పడుకున్నారు. సత్యం తన అలవాటు ప్రకారం, తలుపులకు గడియ లన్నీ. చివరిసారిగా తనిఖీ చేసి వచ్చి పడుకున్నాడు. సరిగా అర్ధరాత్రివేళ, వంటగది వైపు నుంచి, ఏవో ధ్వనులు వినిపించడంతో, ఉలిక్కిపడి లేచి, విమలను కూడా లేపాడు. ఇంతలో నల్లటిముసుగు ధరించిన వాడొకడు, వాళ్ళ ముందుకు దూకి, అక్కడ ఒక మూలగా పడివున్న ఖాళీ సీసాను తీసుకుని, దాన్ని గోడకు కొట్టి పగలకొట్టి. వాడిగా వున్న భాగాన్ని వాళ్ళకు గురి పెట్టాడు.ఛ్ఛో భయంతో వణుకుతూ, తీసుకుని తాపీగా పెట్టెలు తెరిచి, డబ్బూ, అరవబోయేంతలో, మునుగువాడు, నగలూ, విలువైన బట్టలూ ఒక మూట చేతిలో వున్న కట్టాడు. వంటగదిలోకి పోయి, పాత్ర సీసాతో పొడుస్తాను. మర్యాదగా, ఆ గుంజ సామగ్రినంతా ఒక గోతానికెత్తాడు. దగ్గిరకు నడవండి," అన్నాడు కర్కశంగా. యతిరాజూ, విమలా నిలుపుగుడ్లతో వాణ్ణి చూడసాగారు. "అరిచారంటే, మునుగువాడి గొంతు భయంకరంగా ధ్వనించింది. అప్పటికే నిలువునా వణికి పోతున్న సత్యం, కిక్కురుమనకుండా గుంజదగ్గిరకు నడిచాడు. అతడి వెనకగా విమల నడిచింది. ముసుగువాడు అక్కడ మూల పడివున్న దారాలనూ, పురితాళ్లనూ తెచ్చి, సత్యంనూ, విమలనూ వాటితో గుంజకు కట్టివేశాడు. తర్వాత, వాడు మరొకసారి వాళ్ళను అరవొద్దని హెచ్చరించి, తాళంచెవులు పని పూర్తికాగానే వాడు, సత్యం ముందుకువచ్చి. ఈ రోజు దొంగతనానికి అనుకోకుండా బయలుదేరాను. అందు వల్లే, వెంట కత్తి, తాళ్ళూ తెచ్చుకోలేదు. అయినా, మీ ఇంట్లో నా పని సులువుగా తెమిలిపోయింది. అందరూ మీలాగే ఇంటి నిండా, ఇలా మాకు పనికొచ్చే వస్తువులు పోగుచేసి తయారుగా వుంచితే, మాకు కత్తులూ, తాళ్ళూ గట్రా ఇంటింటికీమోసుకువెళ్ళే మోతపని తప్పుతుంది." అన్నాడు. తర్వాత మునుగువాడు, ఇంటి నాలుగు గదులూ తిరిగి వచ్చి, "నేను ఏ ఇంట్లో దొంగతనం చేసినా, వెళ్ళేటప్పుడు. ఆ ఇంటిని తగలబెట్టడం ఆచారం. ఇప్పుడా పని చేయబోతున్నాను." అన్నాడు. సత్యం అతి ప్రయత్నం మీద గొంతు పెగుల్చుకుని, "ఇంట్లో వున్న డబ్బూ, విలువైన వస్తువులూ- అన్నీ తీసుకున్నావు గదా ? ఇంకా ఇల్లు తగల బెట్టడం కూడా ఎందుకు. అంత ఘోరం చెయ్యకు !'' అని బ్రతిమాలాడు. "నా అచారాన్ని మంటగలపాలని చూస్తున్నావా?'' అంటూ మునుగువాడు, సత్యం మీద ఖస్సుమంటూ లేచి, మూలమూలల వున్న ఖాళీ అట్టపెట్టెలూ. కాగితాలూ, కొబ్బరిపీచూ, డొక్కులూ తెచ్చి, చావిట్లో కుప్పగా పోయసాగాడు. సత్యం, విమలా ఏడుపు బిగబట్టు కున్నారు. ముసుగువాడు మూటలు రెండూ తీసు కుని, తను పోగుచేసిన చెత్త మీద అగ్గిపుల్ల గీసి పడవేసి, బయటికి వెళ్ళాడు. వెంటనే సత్యం పెద్దగా కేక పెట్టాడు. ఆ మరు క్షణం, రామేశం రొప్పుతూ లోపలికి వచ్చాడు. అతడి చేతిలో దొంగ ఎత్తుకు పోయిన మూటలు రెండూ వున్నవి.. రామేశం మూటలను కింద పడవేసి, వంటగదిలోకి పోయి నీళ్ళబిందెలు తెచ్చి.అప్పుడే రాజుకుంటున్న మంటను ఆర్పి, "దొంగ సన్ను చూసి, మూటలతో పెరటి గోడ దూకలేక, వాటిని వదిలి పారి పోయాడు." అని, సత్యం, విమలల కట్లు విప్పాడు. విమల కోపంగా భర్త కేసి చూస్తూ, "ఈ గొడవంతా, మీ కారణంగానే జరి గింది. ఎప్పుడో పనికి వస్తవంటూ, అడ్డ మైన చెత్తనూ ఇంట్లో జాగ్రత్తగా దాచారు. చూడండి. ఆఖరుకు అవి ఎలా పనికి వచ్చాయో ! తమ్ముడు సమయానికి లేక పోతే, మీరు దాచిన చెత్తతోపాటు ఇల్లూ, మనం నిలువునా కాలిపోయేవాళ్ళం." అన్నది. సత్యం ఎంతో పశ్చాత్తాపపడుతూ, "ఆ దొంగ, నా కళ్ళు తెరిపించాడు." అన్నాడు. "జరిగిందేదో జరిగిపోయింది ఇక ముందయినా నీ అతిజాగ్రత్త కాస్త తగ్గించుకో, బావా !" అని రామేశం సలహా యిచ్చాడు. ఆ మాట వింటూనే సత్యం, హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా. "అవును, జాగ్రత్త అంటే గుర్తుకొచ్చింది. రాత్రి పడుకోబోయేముందు గడియలన్నీ సరిగానే వేశాగదా! మరి, దొంగ ఇంట్లో కెలా వచ్చాడంటావు. విమలా?" అని భార్య నడిగాడు. విమల వెంటనే, " పోయిన దీపావళి పండగ రోజున, కాకరపువ్వొత్తులు కాల్చాక. కడ్డీలు పారేయకుండా ఎందు కైనా పనికొస్తాయని చూరులో దాచారు. దొంగ ఆ కడ్డీలను తలుపు సందుల్లో దూర్చి. గడియ తీశాడు. చూడండి, ఇక్కడ కడ్డీలు తలుపు దగ్గిర పడి వున్నవి." అంటూ వాటిని తెచ్చి భర్తకు చూపింది. ఇది జరిగాక, సత్యంలో అతి జాగ్రత్త బాగా తగ్గిపోయింది. తమ్ముడి సాయంతో, భర్త చాదస్తానికి తగిన చికిత్స చేయగలిగినందుకు, విమల చాలా సంతో షించింది.
???చీమ-చిలుక-పాయసం??? అనగా అనగా ఒక చీమా ఒక చిలకా ఉండే వారు. వాళ్లిద్దరికీ ఎంతో సావాసం. ఒకనాడు వాళ్ళి ద్దరికీ పాయసం వండుకు తినాలని బుద్ధిపుట్టింది. చీమ పోయి బియ్యపు సూకలూ, పంచదారా తెచ్చింది. చిలక పోయి కట్టెపుల్లలూ, చట్టీ, నిప్పూ తెచ్చింది. చీమ నిప్పు అంటించింది. చిలక పొయ్యిఊదింది. పాయసం తయారయింది. అయితే చీమకి మహ తొందర. అది గబగబా చట్టిఎక్కి పాయసం తిన బోయి అందులోపడి చచ్చి పోయింది. చిలకకూడా ఆత్రపడి పాయసంలో ముక్కుముంచింది. ఇంకేం ముక్కు చుర్రున కాలింది. అది మొర్రోమని ముకు విదిలించుకుంటూ రావిచెట్టుమీదికి కూచుంది. రావిచెట్టు చిలకనుచూసి కొంచెం గేలిగా "చిలకా, చిలకా ఏం విచారంగా ఉన్నావు?" అని అడిగింది. చిలకకు కొంచెం విసు గేసి "ఏమీలేదు. చీమా నేనూ పాయసం వండు కున్నాము. చీమపాయసం లోపడి చచ్చింది. నాకు ముకు కాలింది. ఇంత పోకిళ్లు పోతున్న నీ ఆకులు రాలిపోకూడదూ!" అంది. ఆమాట అనగానే రావి చెట్టు ఆకులు జలజలా రాలిపోయాయి. ఇంతలో ఒక ఏనిగ ఆ దారినిపోతూ చెట్టునుచూసి నవ్వువచ్చి “చెట్టూ, చెట్టూ! నీ ఆకులు రాలిపోయా యేం? ఎండాకాలం కాదుగా?" అన్నది."ఏమీ లేదు. చీమా చిలకా పాయసం వండు కున్నాయట. చీమ అం దులోపడి చచ్చిపోయింది; చిలకకి ముక్కు కాలింది: వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి. ఇంత నవ్వుగా ఉన్న నీకు తొండం ఊడిపోవాలి" అన్నది రావిచెట్టు. ఏనుగు తొండం పోయింది. పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూచుంది. చెరువుకు తొండంలేని ఏనుగుని చూసి నవ్వాగలేదు. "ఏం, ఏనుగా ఏనుగా ఇవ్వాళ నీళ్లు తాగటంలేదేం? తొండం ఎక్కడ పెట్టి వచ్చావు?" అంది. "ఎక్కడా పెట్టలేదు. చీమా చిలకా పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలోపడి చచ్చి పోయింది; చిలకకి ముక్కు కాలింది; చిలకని వెక్కి రించిన రావిచెట్టుకు ఆకులు రాలాయి; అదిచూసినవ్విన నాకు తొండం ఊడింది. వన్ను చూపి వెటకారం చేస్తున్న నీ నీళ్లుకూడా ఎండి పోవాలీ అన్నది ఏనుగు. అనగానే చెరువులోనీళ్లు ఎండిపోయాయి. ఇంతలో తోడికోడళ్లు ఇద్దరు చెరు వుకు నీళ్ళకు వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసే వరకు వాళ్ళకు వవ్వు వచ్చింది. "ఏం, చెరువూ చెరువూ! ఇలా ఎండిపోయా వేం?" అని అడిగారు. "ఏమీలేదు. చీమా చిలకా పాయసం వండు కున్నాయట. చీమ పాయ సంలోపడి చచ్చింది. చిల కకీ ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అదిచూసి నవ్విన ఏనుగుకు తొండం వూడింది. ఏనుగుని చూసి వెటకారంచేసిననాకు నీళ్లెండి పోయాయి. నన్ను చూసి పగలబడుతున్న మీ బిందెలు అలాగే అంటుకోవాలి.పోతే ఎంత బాగుణ్ణు:'' అన్నది చెరువు. అనగానే బిందెలు అం టుకు పోయాయి. ఇంతలో ఇంకొక మనిషి కావిడితో నీళ్ళకువచ్చి చెరువులో నీళ్లు లేకపోవటమూ, బిందెలు "ఏమీ లేదు. చీమా అంటుకు పోవటమూచూసి పాపం, అతను మంచిగానే "ఏమమ్మా! బిందెలు అట్లా అంటుకున్నా యెందుకూ?" తెలుసుకోవటానికి అని అడిగాడు. చిలకా పాయసం వండు కున్నాయట. చీమ పాయ సంలోపడి చచ్చింది. చిల కకి ముక్కు కాలింది. చిల కని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. రావిచెట్టునుచూసి నవ్విన ఏనుగుకి తొండం వూడింది. ఏనుగు నిచూసి వెటకారం చేసిన చెరువుకు నీళ్లెండి పోయాయి. చెరువునిచూసి పగలబడ్డ మాకు బిందెలు అంటుకుపోయాయి. ఇక మమ్మల్ని వోదార్చటానికి వచ్చిన నీకు కావిడి అం టుకు పోవాలి" అన్నారు, వాళ్లు కడుపు మంట పట్టలేక. అయితే ఈ మాట అనీ ఆమనిషి అనకముందే కావిడి కిందపారవేశాడు. కావిడి కిందపడటంతో టే వాళ్ల బుజాలమీది బిందెలు వూడిపోయినై, చెరువుకు నీళ్ళువచ్చినై. ఏనిగకు బాగయింది. తొండం వచ్చింది. చెట్టుకు ఆకులువచ్చినై. చిలక ముక్కు చీమ బతికింది. అందరూ ఆనందంతో ఆరోజు పాయసం జుర్రుకొని జుర్రుకొని తిన్నారు.
###వర్మ-శర్మ### ఒక గ్రామం మధ్య లో ప్రాచీన రామ మందిరం ఉండేది. విష్ణుశర్మ దానికి అర్చకుడు. ఆ వూళ్ళో ఒక ఆచారం ఉండేది. వూళ్ళో ఎవరైనా చచ్చిపోతే, మూడు రోజులపాటు అర్చనలు లేకుండా రామాలయాన్ని మూసి ఉంచేవారు. ఊరికి కొద్ది దూరంలో ఒక పట్నం వుండేది. అక్కడ సంత జరిగే రోజున ఊరివాళ్ళు అక్కడి నుంచి ఉప్పులూ, పప్పులూ తెచ్చుకునేవాళ్ళు. ఒక సంత రోజు విష్ణుశర్మ పట్నం వెళ్ళి, ఇంటికి కావలసిన సరుకులు కొని, బండికి ఎత్తి స్తూండగా, ఎదురుగా మేడలో ఉండే వర్మ పిలిచాడు. విష్ణుశర్మ వర్మని కలుసుకుని, విషయం తెలుసుకున్నాడు. క్రితం నెల వర్మగారి భార్యకు తీవ్రంగా జబ్బు చేసింది. ఆమెకు జబ్బు నిమ్మ ళిస్తే, వెయ్యి నూటపదహార్లు ఖర్చు చేసి రాముడికి వైభవంగా కల్యాణం చేయిస్తా నని మొక్కుకున్నాడు. వర్మగారి భార్యకు జబ్బు నయమైపోయింది. "ఎప్పుడు వద్దామనుకున్నా తీరకుండా ఉన్నది. నాకు లక్ష పనులు. రేపు సాయంత్రం నేనూ, నా భార్యా మీ ఊరు వస్తాం. అన్ని ఏర్పాట్లూ చేయించి ఉంచండి. ఎల్లుండి దేవుడికి కల్యాణం జరిపించి, పేదలకు అన్నదానం చేద్దాం," అన్నాడు వర్మ విష్ణుశర్మతో. ఆ మాట విని విష్ణుశర్మ ఉక్కిరి బిక్కిరి అయాడు. అతని హయాంలో అంత పెద్ద ఎత్తున దేవుడికి కల్యాణం చేయించిననవారు లేరు. "మహారాజుగా రండి. అన్ని ఏర్పాట్లూ చేసి ఉంచుతాను." అని వర్మగారికి చెప్పి, విష్ణుశర్మ ఆనందంలో తేలుతూ ఇల్లు చేరాడు.ఆయన బండిలో ఇల్లు చేరేసరికి చీకటి పడింది.. సామాను దించి, బండిని పంపేసి చూసేసరికి, అరుగు మీద ఎవరో పడుకుని ఉన్నట్టు లీలగా కనిపించింది. "ఎవరు వారు?'' అని ఆయన బండిలో ఇల్లు చేరేసరికి చీకటి పడింది.. సామాను దించి, బండిని పంపేసి చూసేసరికి, అరుగు మీద ఎవరో పడుకుని ఉన్నట్టు లీలగా కనిపించింది. "ఎవరు వారు?'' అని విష్ణుశర్మ గట్టిగానే అన్నాడు. జవాబు లేదు. విష్ణుశర్మ గొంతు విని, ఆయన భార్య శాంతమ్మ బయటికి వచ్చి, "ఈ ముద నష్టపు వెధవ ఇంకా వెళ్ళలేదూ? మీరు లోపలికి రండి," అన్నది భర్తతో. విష్ణుశర్మ లోపలికి వస్తూనే, ‘" ఎవడే వాడు?'' అని భార్యను అడిగాడు. ''ఎవడో పొగరుమోతు! సాయంత్రం అనగా వచ్చి, భోజనం పెట్టించమని ఒకటే పోరుపెట్టాడు. పెట్టనంటే, కదల నంటూ అరుగు మీద తిష్ఠవేశాడు. చూస్తే దొంగలా ఉన్నాడు. వాణ్ణి వెళ్ళగొట్టండి," అన్నది శాంతమ్మ. "భోజనం చేసినాక వాడి సంగతి చూద్దాంలే. ఈ రోజు మన పంట పండింది తెలుసా?'' అంటూ విష్ణుశర్మ పట్నంలో శెట్టిగారి మొక్కు విషయమంతా చెప్పి, "ఎలా లేదన్నా మనం అర్ధవెయ్యి న్నూట పదహార్లు మిగుల్చుకో వచ్చు. ఆయన మనిద్దరికీ బట్టలు పెట్టకపోరు." అన్నాడు. శాంతమ్మ తన భర్తకు భోజనం పెట్టింది.. విష్ణుశర్మ భోజనం ముగించి, పడుకునే ఆలోచనలో ఉండగా, ఆమె కిటికీలో నుంచి బయటి అరుగు మీదికి చూసి, " ఆ దౌర్భాగ్యు డింకా అరుగు విడిచి పోలేదు. వెళ్ళి వాణ్ణి పంపిం చెయ్యండి. లేకపోతే ఏ రాత్రివేళో పెరటి గోడ దూకి లోపలికి వస్తాడు,'' అని లబలబ లాడింది. విధిలేక విష్ణుశర్మ మూలనున్న కర్ర తీసు కుని, పెద్దగా చప్పుడు చేస్తూ వీధి తలుపు తెరిచాడు; తరవాత అరుగును కర్రతో గట్టిగా బాదుతూ, "ఎవడ్రా వాడూ? పొమ్మంటే కదలవేం?" అని అరిచాడు. కనిపించ లేదు. వెళ్ళి, ఏదో అనుమానం తగిలి, విష్ణుశర్మ దగ్గిరగా ఆ మనిషిని కదిపి చూశాడు. ఆ మనిషిలో చలనం లేదు: ''కొంప తీశాడేవ్! వీడు చచ్చినట్టు న్నాడు!" అని విష్ణుశర్మ కీచుగా అరిచాడు. "చస్తే చచ్చాడు ! పీడవిరగడయింది! లోపలికి రండి ! " అన్నది శాంతమ్మ. విష్ణుశర్మ లోపలికి వచ్చి, " ఏడిచావ్ ! పీడ చుట్టుకుంది ఇప్పుడు. వాడు చచ్చి నందుకు మూడురోజులపాటు గుడి మూసి ఉంచాలి. వర్మగారు ఎల్లుండి చేయించ బోయే కల్యాణం మాటేమిటి? ఆయనకు మళ్ళీ ఎప్పటికి వీలు చిక్కుతుందో ఏమో?'' అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం?" అన్నది శాంతమ్మ. "వీణ్ణి ఈ రాత్రికి రాత్రే వల్లకాట్లో పూడ్చి పెట్టెయ్యాలి. ఊరికి కొత్తవాడు గనక, రేపు ఎవరూ వీణ్ణి గురించి పట్టించుకోరు,'' అన్నాడు విష్ణుశర్మ . " ఈ మాట కాటికాపరికైనా తెలు స్తుందిగా?'' అన్నది శాంతమ్మ. "డబ్బు పారేస్తే వాడే నోరు మూసు కుంటాడు,'' అని, విష్ణుశర్మ ఎంతోకాలంగా పోగు చేసి పెట్టెలో దాచుకుంటున్న డబ్బు వంద రూపాయలు తీసి రొండిన కట్టుకుని, లోపల భయంగా ఉన్నా, మొండి ధైర్యంతో చీకట్లో పడి శ్మశానానికి వెళ్ళాడు. కాటికాపరి శ్మశానం దగ్గిరే గుడిసెలో ఉంటున్నాడు. విష్ణుశర్మ వాణ్ణి బయటికి పిలిచి, సంగతంతా చెప్పి, “ఈ విషయం మూడో కంటివాడికి తెలియగూడదు.'' అన్నాడు. విష్ణుశర్మ కోరినట్టు పని ముగించటానికి వంద రూపాయలు అడిగాడు కాటికాపరి. వాడితో బేరమాడి డెబ్బై అయిదు రూపాయలు తీసుకోవటానికి విష్ణుశర్మ వాణ్ణి ఒప్పించి, "నేను వెళ్ళి శవాన్ని తెస్తాను. ఈ లోగా నువు గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచు," అని చెప్పి ఇంటికి వచ్చాడు.శాంతమ్మ ఒక చాప ఇచ్చింది. విష్ణుశర్మ అరుగు మీది మనిషిని అందులో చుట్టి, నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. సగం దూరం వచ్చే సరికి విష్ణుశర్మ కి అలుపు వచ్చింది. వీధి ఆటూ ఇటూ చూసి, ఎవరూ లేరని తేల్చుకుని, విష్ణుశర్మ నెత్తి మీది బరువు ఒక అరుగుమీద దించి, రొప్పుతూ నిలబడ్డాడు. ఇంతలో విష్ణుశర్మ భుజంమీద చల్లగా చెయ్యి పడింది. విష్ణుశర్మ నిలువెల్లా వణికి, కెవ్వున అరవబోయి ఎలాగో నిగ్రహించు కున్నాడు. “ఓహో, విష్ణుశర్మ గారా? ఇంత అర్థరాత్రి వేళ చీకట్లో ఎక్కడికి ప్రయాణం?" అన్నాడు ఒక వ్యక్తి, విష్ణుశర్మ గుండు తడివి గుర్తుపట్టి. ఆ గొంతు వెంకయ్య అనే తాగు బోతుది. "నిద్రపట్టక అలా బయలుదేరాను," అన్నాడు విష్ణుశర్మ . " ఎందుకు అలా రొప్పుతున్నారూ? ఇదేమిటీ? చాప చుట్టలాగుందే? ఇందులో ఏదో వున్నట్టుందే?" అంటూ మొదలు పెట్టాడు వెంకయ్య. "అవునుగాని, నువ్వీ పూట కల్లుఅంగ డికి పోలేదల్లే ఉందే?" అన్నాడు విష్ణుశర్మ భయంతో చెమటలు కక్కుతూ, "కల్లు అంగడి కామయ్యకి పాతిక రూపాయలు బాకీ ఉన్నాను. బాకీ తీర్చి తేనేగాని కల్లు పొయ్యనన్నాడు." అన్నాడు వెంకయ్య. విష్ణుశర్మ చప్పున రొండి నుంచి పాతిక రూపాయలూ తీసి, ''ఇదుగో, పాతిక రూపాయలు. వెంటనే కల్లుపాక దగ్గిరికి వెళ్ళిరా, నాయనా!" అన్నాడు. వెంకయ్య బెడద తీరిపోయింది. విష్ణుశర్మ తేలికగా నిట్టూర్చి, చాపచుట్టనెత్తి కెత్తుకుని, శ్మశానం చేరుకున్నాడు. కాటి కాపరి గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచాడు. విష్ణుశర్మ దించబోతూండగా చాపచుట్ట దభాలున గోతిలో పడింది.“చచ్చాన్రోయ్ !'' అని గావుకేక పెట్టి, చాపచుట్టలో నుంచి మనిషి బయటికి వచ్చాడు. శాస్త్రి గుండె గుభేలుమన్నది. ''పిచ్చి శర్మ! బతికిన మనిషిని పూడ్చటానికి తెచ్చావా?'' అంటూ కాటి కాపరి విరగబడి నవ్వాడు. "ఇప్పుడెక్కడున్నానూ? నాది మొద్దు నిద్ర !'' అన్నాడు ఆ మనిషి. "ఎక్కడున్నావా? వల్లకాట్లో ! పద పద," అన్నాడు శర్మ ఆ మనిషి మీద విరుచుకు పడుతూ. ఆ మనిషి బిత్తరపోయి కాలిసత్తువ కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు. శర్మ కాటికాపరి దగ్గిర డబ్బు వాపసు పుచ్చుకోవాలని చూశాడు. కాటికాపరి జరిగినదంతా బయట పెట్టేస్తానన్నాడు. శవం లేదుగాని, రహస్యం ఉన్నది. అందుచేత శర్మ మారుమాటాడక ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపుగా శాంతమ్మ ఒక కునుకు తీసి, తనకు మొగుడు పట్టు చీర కొనిపెట్టినట్టు కల కన్నది. “ఎల్లుండి ఈపాటికి నీ కల నిజమవు తుందిలే!" అని శర్మ ఆమెకు ధైర్యం చెప్పాడు. కాని, మర్నాడు సాయంకాలా నికి వర్మగారు భార్యా సమేతంగా రాలేదు. ఆ మర్నాడు కూడా వాళ్ళ జాడలేదు. నాలుగు రోజులు వర్మగారికోసం ఎదురు చూసి, విష్ణుశర్మ శెట్టిగారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అప్పుడే వర్మ ఎక్కడినుంచో తిరిగి వచ్చాడు. రాత్రే 'మా నాయనమ్మకు ఒంట్లో బాగా లేదని కబురు వచ్చింది. ఊరు దూరమే. అయినా - బయలుదేరక తప్పలేదు. “రా రా! నీకు నేనే కబురు చేద్దా మనుకుంటున్నాను. నువు కనబడిన ఇప్పుడు ఆమెకు కులాసాగానే ఉన్నది. తీరా వెళ్ళాంగదా అని, నా మొక్కు ఆ పూరి దేవాలయంలోనే తీర్చేసు కున్నాను." అన్నాడు వర్మ. రాముడి కల్యాణం మాట ఎలా ఉన్నా విష్ణుశర్మ పెళ్ళి బాగా కుదిరింది !
@@@@స్వయంకృతా పరాధO@@@@ సింధునదీ తీరాన బ్రహ్మస్థలీ అనే గ్రామంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు నాలుగు వేదాలూ తెలుసును. ఈయన వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు. అతను వేదాధ్యయనంలో అంతులేని పరిశ్రమ చేసి దృఢధ్యముడు అనే పేరు సంపాదించుకున్నాడు. దృఢ ద్యముడి తిండికీ, బట్టకూ అయే ఖర్చులుభరించినవాడు తమోభేదకుడు అనే గృహస్థు. దృఢద్యముడు భిన్నతమసుడు అనే ఆయన ఇంట ఉంటూండేవాడు. ఈ విధంగా దృఢద్యముడు అమిత దీక్షతో అధ్యయనం చేసి, పదిఏళ్ళలో నాలుగు వేదాలూ అభ్యసించాడు. ఒకరోజు రాత్రి భిన్నతమసుడు దృఢ ద్యముడితో మాట్లాడుతూ, '' నాకు ఈ విశాలమైన ఇల్లేకాక, విస్తారమైన ఆవుల మందలూ, గేదెలమందలూ, పొలాలూ, బానిసలూ, స్త్రీజనమూ, రక్షకులూ కూడా ఉన్నారు. నేను ఏంతో పాండిత్యం సంపా దించిఉండి కూడా, జన్మతః కర్షకుణ్ణి కావటం చేత నా జ్ఞానాన్ని ఉపయోగపరచ లేక పోయాను. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చే సింది. మహర్షులు చెప్పినట్టు నా మిగతా జీవితాన్ని తీర్థయాత్రలలో గడపనిశ్చ యించాను. ముక్తి కోరినవాడు వారాణసి వద్ద అవిముక్తం సేవించాలి. నా కున్న దంతా నీ కిచ్చేస్తాను. తీసుకో." అన్నాడు దృఢద్యముడు అందుకు ఒప్పుకుని మర్నాడు తన గురువు వద్దా తమోభేద కుడి వద్దా సెలవు పుచ్చుకుని వచ్చి, అస్తిని దానంగా పుచ్చుకుంటానన్నాడు అయితే మర్నాడు భిన్నతమసుడు ఎంత సేపు ఎదురుచూసినా దృఢద్యముడు రాలేదు. మధ్యాన్నం కూడా అయేసరికి, భిన్నతమసుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్లి, అతను తమోభేదకుడి ఇంటి ముందు తారట్లాడుతూ ఉండటం చూశాడు. "నేనింకా తమోభేదకుడి వద్ద సెలవు పుచ్చుకో లేదు. ఇంట్లో అందరూ అ వుడిగా ఉన్నారు. కారణం తెలీదు.” అన్నాడు దృఢద్యముడు భిన్న తమసుడితో. భిన్నతముడు నవ్వి 'తమోభేదకుడి భార్య ప్రసవించ బోతున్నది. అందుకే అడావుడి. ఆమెకు ఆడపిల్ల పుట్టుతుంది. నువు ఆమెను పెళ్లాడతావు. ఆమె కులం చెడుతుంది." అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది విని దృఢధ్యముడికి కంగారు పుట్టింది. తమోభేదకుడికి నిజంగా ఆడపిల్లే పుట్టితే, భిన్నతమసుడు చెప్పిన మిగిలిన రెండు విషయాలుకూడా నిజ మవుతాయని అతనికి తోచింది. అతను ఇలా అను కుంటూండగానే తమోభేద కుడు, “ఛీ ! ప్రారబ్ధం ! '' అనుకుంటూ బయటికి వచ్చాడు. ఆయనకు ఆడపిల్లే పుట్టింది. భిన్నతమసుడు చెప్పిన విష యాలు అబద్ధం చేసి, తాను ఆ పాపిష్ఠి పిల్లను పెళ్ళాడ కుండా ఉండగలందు లకు, దృఢద్యముడు మర్నాడే బయలు దేరి, సింధూతీరాన్ని వదిలేసి. పదేళ్ళ పాటు నానాదేశాలు సంచారం చేసి చివరకు గంగాతీరానికి వచ్చాడు. ఒకనాడు అతను ఒక బ్రాహ్మణగ్రామం చేరి, ఒక ఇంటికి వెళ్ళి. అక్కడ కని పించిన వృద్ధురాలితో, '" అమ్మా, కాసిని మంచి నీరు ఇప్పించండి,'' అన్నాడు. ఆ వృద్ధురాలు, '' అమ్మా తమాలికా! ఒక పీటా, చెంబుతో నీళ్ళూ తీసుకురా, తల్లీ!" అని కేక పెట్టింది. లోపలి నుంచి ఒక పిల్ల వచ్చింది. ఆమె నల్ల దుస్తులు ధరించి, మెల్లకళ్ళతో ఒకేసారి అన్నిదిక్కులా చూస్తూ కుంటిగా నడుస్తూ, ఒక చేతిలో పీటా, ఇంకో చేతిలో నీళ్ళ చెంబూ పట్టుకుని వచ్చింది. “కూర్చో," అంటూ ఆమె పీట వెయ్య బోయి, చెంబును కింద వేసింది. ''అదేం పనే, అమ్మా? మళ్ళీ చెంబుతో నీరు పట్టుకురా." అన్నది వృద్ధురాలు. దృఢద్యముడు విశ్రాంతిగా కూర్చున్న మీదట ఆమె అతన్ని, ''ఏదేశం నుంచి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు? '' అని అడిగింది. "అన్ని దేశాల నుంచీ వస్తున్నానని చెప్పొచ్చు. ఏ బ్రాహ్మణ గ్రామంలో నన్నా స్థిరపడి, పిల్లలకు చదువు చెబుతూ జీవితం వెళ్ళబుచ్చుదా మనుకుం టున్నాను." అన్నాడు దృఢధ్యముడు. " అయితే నువు మరెక్కడికి పోనవ సరంలేదు. చదువులో పెట్టవలసిన వాళ్లు నా మనమలు ఇద్దరున్నారు. వాళ్ళకుబడింది. అందుచేత అతను తమాలికను పెళ్ళాడేశాడు. ఒక సంవత్సరం గడిచింది. ఒక రోజు తెల్లవారు ఝామున తమాలిక లేవటం చూసి దృఢ ద్య ముడు తమాలికను, ''మీ ఇంటి పెద్ద ఎవరు ? ఆ ముసలావిడ నీకు ఏమవుతుంది? నాదగ్గిర చదువు కునే కుర్రవాళ్ళెవరు?'' అని అడిగాడు. తమాలిక గట్టిగా నిట్టూర్చి, తన చరిత్ర ఇలా చెప్పింది : నువు కావాలి, నీకు వాళ్ళుకావాలి." అన్నది వృద్ధురాలు. దృఢద్యముడు సరేనని, ఆ గ్రామం లోనే ఉండిపోయి, రెండేళ్ళ పాటు ఆవిడ మనమలిద్దరికీ చదువు చెప్పాడు. ఇంతలో ముసలావిడకు ఒక ఆలోచన వచ్చింది. త మాలికకు పెళ్ళియాడు వచ్చింది; ఆమెను దృఢద్యముడికే ఇచ్చి చేస్తే సరిపోతుంది. దృఢద్యముడు కొంచెం ఆలోచించి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఎక్కడో పడమటి సముద్రతీరాన ఉన్న తమోభేద కుడి పాపిష్టి కూతురుతో పెళ్ళి తప్పించు. కోవటానికి ఇదే మంచి మార్గంగా కన "ఈ ముసలావిడ భర్త సంపన్నుడు, దానశీలుడు. వాళ్ళకు ఒక కూతు రుండేది. ఆమెను తండ్రి తన శిష్యుడికే ఇచ్చిచేశాడు. పెళ్ళికాక పూర్వం ఎంతో వినయంగా ఉండిన ఆ శిష్యుడు, అల్లు డయాక అత్తమామల పట్ల కర్కోట కుడుగా తయారయాడు. తరవాత అతను తన బావమరిదితో తగాదా పెట్టుకుని సింధుప్రాంతానికి వెళ్లిపోయాడు. అకడ అతను బ్రహ్మస్థలి అనే గ్రామంలో నివాసం ఏర్పాటుచేసుకుని వైదికకర్మలు జరిపిస్తూ వచ్చాడు. “కొంత కాలానికి అతనికి ఒక పాపిష్ఠి కూతురూ, యములవాళ్ళలాటి ఇద్దరు కవల కొడుకులూ పుట్టారు. నేనే ఆ కూతురును. నీ శిష్యులైన తొర్రిమూతి పిల్లలు నా తమ్ముళ్ళు. మాకు మా అమ్మా,నాన్నా బాగా తెలీదు. నదికి వరదలు వచ్చి సింధుదేశం జలమయమైనప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్న మమ్మల్ని మా అమ్మమ్మ దగ్గిరికి పంపేశారు.'” దృఢద్యముడి గుండెలో బాణం తగిలి నట్టయింది. భిన్నతమసుడి రెండో జోస్యం కూడా నిజమయింది. కనీసం మూడోదైనా అబద్ధం చేద్దామని, దృఢద్యముడు కాశీకి బయలుదేరాడు. పుణ్యతీర్ధాలు సేవించి, జీవితమంతా పుణ్యం సంపాధించటానికి అతను నిశ్చయించుకున్నాడు. పన్నెండేళ్ళ అనంతరం అతను కాశీ చేర వస్తూండగా ఒక మహాపాశుపతుడు పుర్రెలమాల ధరించి, తాగి తూలుతూ రావటం అతనికి కనిపించింది. అతని వెనకగా ఒక కాపాలిని తాను కూడా తప్ప తాగి, పాము లాగా మెలికలు తిరిగి నడుస్తున్నది. చింతనిప్పుల్లాగా ఉన్న ఆమె కళ్ళు మెల్ల కళ్ళు. "కాపాలి నీ. త్వ ర గా రా. అవి ముక్తంలో ధూపీకాలం మించిపోగూడదు. మహాశివుణ్ణి 'హం ! హం ! ' అని అర్చించి, మద్యం తాగాలి." అని పాశుపతుడు కాపాలినిని తొందర చేస్తున్నాడు. ఇంతలో ఆ స్త్రీ దృఢద్యముణ్ణి చూసి, తన భర్తగా గుర్తించి, కెవ్వున అరిచి, అతని కాళ్ళమీద పడిపోయింది. చుట్టూ జనం మూగారు. తమాలిక తన భర్తతో, "నీ వేదాధ్యయనం ఏమయింది? నిత్యాగ్నిహెూత్రం ఏమయింది ? పితృ తర్పణాలు ఏమయాయి? నన్ను విడిచి పెట్టేసి నేను చెడిపోవటానికి కారకుడి వయ్యావు ! '' అని నిందించింది. చుట్టూ చేరిన వారిలో బ్రాహ్మణులు దృఢద్యముణ్ణి ప్రశ్నించి, తమాలిక ఆరోపణలు నిజమని గ్రహించి, " నువు పాశుపతుడి వెంట ఉంటావా ? భర్త దగ్గిరికి వస్తావా?'' అని అడిగారు. ఆమె భర్త దగ్గిరికే పోతానన్నది. అప్పుడు బ్రాహ్మణులు దృఢద్య ముడితో, '' ఈమె పతనం కావటానికికారకుడివి నువే: ప్రాయశ్చిత్తాలు మేం చెబుతాం. నువు ఈమెను భార్యగా స్వీక రించవలసిందే,'' అన్నారు. దృఢద్యముడు అలాగేచేశాడు. బేతాళుడి కథ చెప్పి "రాజా, దృఢ ద్యముడికి కలిగిన అనుభవాలకు కారకు లెవరు ? విధినిర్ణయమా? దృఢద్యముడి ప్రవర్తనా? అతను భిన్నతమసుడి జోస్యం నమ్మినట్టా? నమ్మనట్టా ? ఈ సందేహా లకు సమాధానం తెలిసికూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది." అన్నాడు. దానికి విక్రమార్కుడు. " దృఢద్య ముడు భిన్నతమఇుడి జోస్యం నమ్మబట్టే అతను దానినుంచి తప్పించుకోవటానికి నానాయాతనలూ పడ్డాడు. నమ్మకం లేని వాడైతే ఆ జోస్యాన్ని నిర్లక్ష్యం చేసి తన మానాన తాను జీవించి ఉండేవాడే. భిన్నతమసుడి జోస్యం విధినిర్ణయాన్ని చెప్పినదే గనక, విధినిర్ణయం అమలు జరిగిందనాలి. అయితే, విధినిర్ణయం పూర్తిగా దృఢ ద్యము డి నిర్ణయాల ద్వారానే అమలు జరిగింది. తమాలికను తాను పెళ్ళి చేసుకోకుండా ఉండాలంటే అతను పారిపోవటానికి బదులు ఆమెకు సాధ్యమైనంత దగ్గిరలో ఉండాలి. ఆమెను పెళ్ళాడిన ఏడాదికి అతను ఆమె పుట్టు పూర్వోత్తరాలు కనుకోవటం కూడా అతని పొరపాటే. వాటిని అతను ముందుగానే తెలుసుకుని ఉండవచ్చు. తెలుసుకున్న తరువాత అతను పారిపోవటం తప్పని తమాలిక పదిమంది ఎదటా నిరూపిం చింది. భర్త విడిచిన స్త్రీ పతితురాలు కాకేం జేస్తుంది ? చివరకు కూడా ఆమె అతనితోనే ఉండగోరిందంటే ఆమె పతితు రాలు కావటానికి కారణం ఆమె దుర్బుద్ధి కాదని స్పష్టం అవుతున్నది. అందుచేత దృఢద్యముడిది పూర్తిగా స్వయంకృతా పరాధమే!" అన్నాడు.
@@@@అపూర్వవస్తువు@@@@ పూర్వం విదర్భదేశాన్ని పాలించిన ఒక తనకు అపూర్వవస్తువు కానుక ఇచ్చిన వారికి ఏటా పదివేల బంగారు నాణాలు బహుమానం ఇచ్చేవాడు. ప్రవరుడు అనే మంత్రవైద్యుడు ఆ రాజ్యంలో ఉండేవాడు. ఆయన చాలా కాలం కృషి చేసి ఒక అద్భుత రసా యనం తయారు చేశాడు. దాన్ని తాగుతూ ఎవరు ఏ రూపం తలుచుకుంటే ఆ రూపం పొందుతారు. అయితే అలాటి వాళ్ళకు యథారూపం కావాలంటే ఆ రసాయ నానికి విరుగుడు వెయ్యాలి. ఆ విరుగుడు మందు తయారు చెయ్యటం వైద్యుడికి సాధ్యపడలేదు. అందుచేత ఆయన తన అద్భుత రసాయనాన్ని ఎవరిపైనా ప్రయో గించక, రాజుగారితో దాన్ని గురించి చెప్పి, ఒక సంవత్సరం రాజుగారి బహు మానం పొందటానికి ఆ రసాయనాన్ని ఒక గిన్నెలో పోసి తెచ్చి, రాజుగారికి చూపాడు. ఆయన రాజుతో ఆ రసాయన ప్రభావం చెప్పి, "దీనికి విరుగుడు తయారు చెయ్య టానికి ఒక్క వస్తువు దొరకలేదు. అందు చేత దీన్ని ఇంతవరకు ప్రయోగించలేదు. తమరు దీన్ని ఈ యేడు అపూర్వవస్తువుగా పరిగణించి నాకు బహుమానం ఇప్పించితే నేను ధన్యుణ్ణి అవుతాను." అన్నాడు. “దీన్ని పరీక్షించకుండా అపూర్వవస్తు పని ఎలా తెలుసుకోవటం ? నీ కొడుకు చేత తాగించి దీని ప్రభావం నిరూ పించు." అన్నాడు రాజు. వైద్యుడి కొడుకును తీసుకు రమ్మని ఆయన భటు డితో అన్నాడు. వైద్యుడు వద్దని ఎంత లబలబలాడినా, మందు ప్రభావం చూడా లన్న కుతూహలంతో రాజు వినిపించు కోలేదు.వైద్యుడి కొడుకు పన్నెండేళ్ళవాడు వచ్చాడు. రాజు వాడితో, "నీకు పక్షి అయి ఎగరాలని ఉన్నదా? జింక అయి పరి గెత్తాలని ఉన్నదా? ఏనుగు కావాలని ఉన్నదా ? ఏదో ఒకటి కోరుకుంటూ ఈ మందు తాగు," అన్నాడు. వైద్యుడు, " వద్దు, వద్దు, గిలగిలలాడాడు. 4. అంటూ "ఎందుకు చింతిస్తావు? విరుగుడు మందు కనిపెట్టి నీ కొడుకుకు యథా రూపం కలిగించు. నీకు మరొక బహు మానం మళ్ళీ ఇస్తాను," అన్నాడు రాజు. వైద్యుడి కొడుకు జింక రూపం తలుచు కుంటూ మందు తాగి, జింకగా మారి పోయాడు. వైద్యుడు వలవలా ఏడ్చాడు. "ఎందుకు ఏడుస్తావు ? బహుమానం తీసుకో. విరుగుడు మందు వెంటనే కని పెట్టు," అన్నాడు రాజు వైద్యుడితో. "దానికి కావలిసిన ఒక వస్తువు దుర్లభం," అన్నాడు వైద్యుడు. " ఏమిటా వస్తువు? " అన్నాడురాజు. "యాభైఏళ్ళు దాటి, రాజవంశంలో పుట్టినవాడి కుడి కన్ను కావాలి. అది దొరికితేనే గాని విరుగుడు మందు తయారు కాదు," అన్నాడు వైద్యుడు. "అంతే గద ? నా శత్రువైన కోసల రాజు యాభైఏళ్ళు మించినవాడే. నేను అతడి మీద దండెత్తిపోయి, అతణ్ణి చెర పట్టి, అతడి కుడి కన్ను పీకి ఇచ్చేస్తాను. -తొందరపడకు!" అన్నాడు రాజు.మంత్రవైద్యుడు దుఃఖిస్తూ, జింక అయిపోయిన తన కొడుకును తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుగారి సేవ కులు బహుమానాన్ని ఆయన ఇంటికి చేర్చారు. విదర్భరాజుకు కూడా పన్నెండేళ్ళ కొడుకు న్నాడు. అతనూ, వైద్యుడి కొడుకూ ఒకే గురువు దగ్గిర చదువుకుని. గాఢ స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఒక రోజు రాజు కొడుకు తన మిత్రుడి కోసం వైద్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు వైద్యుడు, "దిక్కుమాలిన ఈ మందుతో నేను వంశనాశనం తెచ్చి పెట్టుకున్నాను." అంటూ రాజ కుమారుడికి మందు చూపాడు. రాజుకొడుకు తాను కూడా జింక అయిపోయి తన మిత్రుడితో సమానం కావాలని తీవ్రమైన కోరిక కలిగి, అలాగే కోరుకుంటూ ఆ రసాయనం కాస్తా తాగాడు. వెంటనే అతనికి కూడా జింక రూపం వచ్చేసింది. అతనితో వచ్చిన సేవ కులు జింకను వెంటపెట్టుకుని వద్దకు తిరిగివెళ్ళారు. రాజు తన కొడుకు కూడా జింక అయిపోయే సరికి రాజుకు మిన్ను విరిగి మీద పడ్డట్ట యింది. ఆయన ప్రగల్భాలు పలికాడే గాని, కోసలరాజును జయించే శక్తి ఆయనకు లేదు. కోసలరాజును పట్టు కోవటం కాదు గదా, యుద్ధంలో ఎది రించే శక్తి కూడా విదర్భరాజుకు లేదు. వైద్యుడి కొడుకు జింకగా మారితే రాజుకు ఏమంత బాధ అనిపించలేదు గాని, తన కొడుకే అలా అయేసరికి, విరుగుడు మందు కోసం తాను తొందర పడవలిసి వచ్చింది. విదర్భ రాజు తనకు కూడా యాభై దాటాయి గనక. తన కుడి కన్ను వైద్యుడికి పీకి ఇచ్చాడు. విరుగుడు మందు తయారయింది. రాజు కొడుకూ, వైద్యుడి కొడుకూ తిరిగి మామూలు రూపు పొందారు. ప్రగల్భాలు పలికినందుకు రాజు మాత్రం ఒంటి కన్నువాడయాడు.
####కాంతం _ కనకయ్య#### కాంతం కనకయ్య భార్యా భర్తలు. కనకయ్య తిండి కోసం ఎంతయినా ఖర్చు పెడతాడు గాని, బట్టలకు ఖర్చు పెట్టడు. కాంతం ఇందుకు విరుద్ధం. వంటింట్లో ఏం తిన్నా నలుగురి ముందూ బాగా కనబడాలని ఆమె ఉద్దేశం. భర్త కొని పెట్టడు గనుక, ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి ఆరు చీరలు తెప్పించుకునేది. అనంతయ్య చిరిగిన బట్టలనే కుట్టుకుని వాడుకునేవాడు. కనకయ్య దగ్గిర ఉన్న బట్టలలో కెల్లా అతి పురాతనమైనది. ఒక గళ్ళ గావంచా. ఆ అభిమానం కొద్దీ, పేలికలైన ఆ గావంచాను వదులుకోలేదు అనం తయ్య. తన భర్త ఆ చిరుగుల గావంచా కట్టుకుని నలుగురి మధ్యా తిరుగుతూంటే కాంతం కు తల తీసేసినట్టుగా ఉండేది. రోజూ భార్యా భర్త లిద్దరూ ఆ గళ్ళ గావంచా గురించి తగవులాడుకునే వారు. ఒకనాడు కనకయ్య స్నానం చేసి, తన గావంచాను ఉతికి, గాలికి ఎగిరి పోతుందని దాన్ని ఇంట్లో ఆరవెయ్య టానికి తెచ్చాడు. అప్పుడే కాంతం వంటింట్లో నుంచి వచ్చి. మా అక్క వస్తానని కబురు చేసింది. నా పూసల సంచీ పూసలు కొన్ని ఊడిపోయాయి. పట్నం తీసుకుపోయి అల్లించుకురా. ఆ దిక్కుమాలిన గావంచా ఊరవతల పారెయ్యి. మా అక్క చూస్తే నవ్వు తుంది." అన్నది. కనకయ్య భార్య మాటలు వినిపిం చుకోకుండా గావంచాను దండెం మీద ఆరేస్తూ. "నీ పూసల సంచీ బాగుచేయిం చటమేనా నాకు పని ? ' అని అడిగాడు. కాంతం కు కోపం ముంచుకొచ్చి, గావంచాను లాక్కుని పెరట్లోకి విసిరివేసి,ఆ గావంచా ఇంట్లో ఆరవేస్తే ఇల్లంతా కుళ్ళు కంపు!'' అన్నది. కనకయ్య ఆ గావంచాను మళ్ళీ తడిపి, పిండి, వీధి కటకటాలలో ఆర వేశాడు. అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయటానికి వెళ్ళిపోయినాక, కాంతం ఆ గావంచాను తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది. ఎండవేళ దారివెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమెకు కనిపించాడు. ఆమె వాణ్ణి పిలిచి, ఆ గావంచా పట్టుకు పొమ్మన్నది. ఆ బిచ్చగాడు గావంచా కేసి చీదరించుకుంటూ చూసి, “ఈ కుళ్లుబట్ట నాకు దేనికి?'' అంటూ పోబోయాడు. బిచ్చగాడు ఒక రూపాయి పుచ్చుకుని ఆ గావంచా పట్టుకుపోయాడు. కనకయ్య ఆ సాయంత్రం ఇంటికి వస్తూండగా ఆ బిచ్చగాడు కనిపించాడు. వాడి భుజం మీద తన చిరుగుల గావంచా ఉన్నది. కనకయ్య ఆవేశంతో బిచ్చ గాడి పీకపట్టుకుని, దొంగపీనుగా! నిక్షేపంలాటి. నా గావంచా దొంగిలిస్తావా?" అన్నాడు. చాల్చాల్లేవయ్యా. ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది. " అని బిచ్చగాడు విసు రుగా తన దారినపోయాడు. కనకయ్య అంతకన్న విసురుగా తన ఇంటి కేసి నడిచాడు. గుడికి వెళుతూ కాంతం అతనికి దారిలోనే ఎదురయింది. " నా గావంచా బిచ్చగాడి కిచ్చావా?" అని కనకయ్య కాంతంను అడిగాడు. "బాబ్బాబు, ఒక రూపాయి ఇస్తాను గాని, దాన్ని పట్టుకుపో," అని కాంతం వాణ్ణి బతిమాలింది: ''అవును! అది విరగడ అయినందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను," అనేసి కాంతం వెళ్ళిపోయింది. కనకయ్య కోపంతో పళ్ళు పట పటకొరికాడు. ఎలాగైనా ఆ గావంచా తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకుని, కనకయ్య ఇంటికిపోయి, గోడకు తగిలించి ఉన్న పూసలసంచీ తీసుకుని, పొరుగింటి పుల్లమ్మతో, '' కాంతం వస్తే, పూసల సంచీ అల్లించటానికి పట్నం వెళ్ళానని చెప్పండి." అని చెప్పి బయలుదేరాడు. కనకయ్య న లుగురినీ వాకబు చెయ్యగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మర్రిచెట్టు కింద వుంటున్నాడని తెలిసింది. అతను అక్కడికి వెళ్ళేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు. వాడి గుడ్డిపెళ్ళాం చెట్టు మొదలుకు చేరగిలబడి కూర్చుని ఉన్నది. ఆమె పక్కన పాత అతుకుల సంచీ, దాని నిండా గుడ్డ పీలికలూ ఉన్నాయి. ఆమె చేతిలో ఒక చింత బరికె ఉన్నది. కనకయ్య దగ్గిరిగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలిమీద బరికెతో కొట్టి, " ఎవడివిరా నువ్వు ? గుడ్డి ముండను కదా అని ఏదన్నా పట్టుకు పోదామనుకున్నావా ?'' అన్నది. అనంతయ్య బాధతో మూలుగుతూ, "నీ మొగుడి కోసం వచ్చాను,” అన్నాడు. “అయితే చీకటి పడ్డాక రా ! '' అన్నది. గుడ్డిది. కనకయ్య వెళ్ళినట్టే వెళ్ళి, వెనక వైపుగా వచ్చి, అతి జాగ్రత్తగా మర్రిచెట్టు ఎక్కి కూర్చున్నాడు. చీకటిపడి బిచ్చగాడు వచ్చి, దరిద్రపు గావంచా దొరికిన వేళావిశేషం ఏమిటోగాని రోజూ దొరికే దానిలో ఈ పూట సగంకూడా దొరకలేదు." అంటూ వాడు కనకయ్య గావంచాని పేలికలున్న సంచీలో కుక్కేశాడు. కనకయ్య మనస్సు చివుక్కుమన్నది. తరవాత బిచ్చగాడు వంటచేసి, తానూ, తన భార్యా తిని, అర్థరాత్రి దాకా ఏవో పదాలు పాడుకుని, పడుకున్నారు. వాళ్లు మంచి నిద్రలో ఉన్నట్టు రూఢిచేసుకుని కనకయ్య చెట్టు దిగబోతూండగా, ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి, ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. "ఎక్కడదాద్దాం?” అన్నాడు ఒకడు, ఆ గుడ్డల సంచీలో దాద్దాం. చలి కాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్లు గుడ్డలు బయిటికి తీయరు,'' అన్నాడు రెండోవాడు. తరవాత దొంగలిద్దరూ చెట్టు కింది చీకట్లోకి వచ్చి, బిచ్చగాడి గుడ్డ పేలికల సంచీ తీసి, అందులో ఏదో దాచి, వెళ్ళి పోయారు. వాళ్ళు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి, " ఎవర్రా వాళ్ళూ ? '' అని అడిగి, సంచీని తడివి తీసుకుని తల కింద పెట్టుకుని, మళ్ళీ పడుకున్నది. దొంగలు భయపడినట్టు అటుగా ఎవరూ రాలేదు. బిచ్చగాళ్ళ సంచీలో తన గావంచాతో బాటు దొంగలు దాచినది కూడా ఉండటం చేత, కనకయ్యకు ఆ సంచీని తనది చేసుకోవాలనిపించింది.తెల్లవారగానే అతను చెట్టుదిగి, బిచ్చ గాడి దగ్గిరికి వచ్చి, "నీ దగ్గిర ఉన్న పాతబట్టల మూట ఇస్తావా? అలుకు గుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉన్నది." అన్నాడు. ఇయ్యను!" అన్నాడు బిచ్చగాడు కచ్చితంగా. "దానికి బదులుగా ఈ పూసలసంచి తీసుకో,'' అన్నాడు కనకయ్య. గుడ్డిది పూసలసంచీని తడిమి చూసి ముచ్చటపడి, “బట్టల మూట ఇచ్చెయ్యి, ఇచ్చెయ్యి!'' అన్నది మొగుడితో. గుడ్డివాడు ఇచ్చిన సంచీని చంకలో పెట్టుకుని కనకయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు. “రాత్రంతా ఎక్కడ ఉన్నావు? నా పూలసంచి ఏదీ ?" అని కాంతం కనకయ్యను చూడగానే అడిగింది. "నీ పూసలసంచి ఇచ్చి ఇది పుచ్చు కున్నాను," అంటూ కనకయ్య బిచ్చ గాళ్ళ సంచీ చూపాడు. "నీ మొహం తగలెయ్యా ! ఎంతపని చేశావు! చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచిలో వేశాను. అది కూడా అతుకు పెట్టించుకు రమ్మందా మనుకున్నాను. ఆ సంచీ ఇచ్చేసి మరిన్ని కుళ్ళు గుడ్డలు తెచ్చావా? '' అంటూ కాంతం మొగుడి చేతినుంచి సంచీని విసురుగా లాగేసి, వీధిలోకి గిరవాటు వేసింది. ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయట పడ్డాయి. వాటితోపాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది, ఆ కత్తి మీద రక్తం మరకలున్నాయి. దొంగలు ఆ రాత్రే ఎవరినో హత్యచేసి, కత్తిని ఆ సంచీలో దాచి వెళ్ళిపోయారు. వీధిలో జనం పోగయారు. త్వరలోనే రక్షకభటులు వచ్చి, ఆ కత్తినీ, కనకయ్య ను పట్టుకుపోయి ఖైదులో పెట్టారు. కనకయ్య తాను నిర్దోషినని రుజువు చేసుకోవటానికి బోలెడంత డబ్బు ఖర్చు ఆయి, తలప్రాణం తోకకు వచ్చింది.