Sunday 4 March 2018

పెద్దనార్యుడు సంస్కృతాంధ్రములయం దసమానసాహిత్యము గలవాడు. ఇత డొకనాడు కృష్ణదేవరాయల యాస్థానములో సకలకవీశ్వరులు నుండగా రాజు కోరికమీద నుభయభాషా పాండిత్యము వెల్లడి యగునట్లుగా నొక యుత్పలమాలిక నాశుకవిత్వముగా జెప్పి సభవారినందఱిని మెప్పించి కాలికి బిరుదందె వేసికొన్నవాడు. రాజు కవిగండపెండేరమును బసిడిపళ్లెరమున నునిచి, సంస్కృతాంధ్రములందు సమానముగా కవిత్వము చెప్పగలవారు దీనిని ధరింపనర్హులని పలికినప్పుడు పెద్దనార్యుడు లేచి యీక్రింది యుత్పలమాలికను జదువగా రాజు మెచ్చి తానే యాకవిగండపెండేరమును కవిపాదమున దొడిగెనట-

ఉ. పూతమెఱుంగులున్ బసరుపూపబెడంగులు చూపునట్టివా
కైతలు జగ్గునిగ్గు నెనగావలె గమ్మున గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురా:హొయల్ చెలియారజంపుని
ద్దాతరితీపులంబలెను దారసిలన్వలె లో దలంచినన్
బాతిగ బైకొనన్వలెను బైదలి కుత్తుకలోనిపల్లటీ
కూత లనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
జేతికొలంది గౌగిటను జేర్చిన గన్నియచిన్నిపొన్ని మే
ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టిచూచినన్
డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱదొండపండువలె వాచవిగావలె బంట నూదినన్ గాతల దమ్మిచూలిదొరకైవసపుంజవరాలి సిబ్బెపు
న్మే తెలియబ్బురంపుజిగినిబ్బరపుబ్బగుగబ్బిగుబ్బపొం
బూతలనున్న కాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం
గాతపు సన్నబంతి బయకారపు గన్నడగౌళపంతుకా
సాతత తానతానల పసం దివుటాడెడు గోటమీటు బల్
మ్రోతలునుం బలెన్ హరుపు మొల్లముగావలె నచ్చతెన్గు లీ
రీతిగ సంస్కృతం బుపచరించినపట్టున భారతీవధూ
టీ తపనీయ గర్భనికటీభవదానస పర్వసాహితీ
భౌతికనాటకప్రకరభారతభారత సమ్మతప్రభా
శీతనగాత్మజా గిరిశశేఖర శీతమయూఖ రేఖికా
పాతసుధాప్రపూర బహుభంగ ఘుమంఘుమ ఘుంఘుమార్భటీ
జాతకతాళయుగ్మ లయసంగతి మంచువిపంచికామృదం
గాతత తేహిత త్తహిత హాధిత దంధణు ధాణుదింధిమి
వ్రాత నయానుకూలపద వారకుహూద్వహ హరికింకిణీ
నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝూళఝళీమరంద సం
ఘాతవియద్ధునీ చకచకద్విక చోత్పల సారసంగ్రహా
యాతకుమారగంధవహ హారిసుగంధ విలాసయుక్తమై
చేతము చల్ల జేయవలె జిల్లున జల్లవలె న్మనోహర
ద్యోతక గోస్తనీఫల మధుద్రవ గోఘృత పాయసప్రసా
రాతి రసప్రసార రుచిరప్రతిమంబుగ సారెసారెకున్.
        నడిమంత్రపు సిరి
 అర్ధరాత్రి వేళ భోజరాజు తన శయనాగారం లో నిద్రిస్తున్నాడు.శయనాగారం క్రిందనే రాజుగారి కోశాగారం వుంది. ఒక దొంగ కావలి వాళ్ళ కన్ను గప్పి కోశాగారానికి కన్నం వేసి ప్రవేశించాడు. విలువైన మణులు,రత్నాలూ, మాణిక్యాలూ మూట గట్టి భుజాన వేసుకొని బయట పదాడమని అనుకుంటూవుండగా ఎందుకో ఆ దొంగకు పాప భీతి,వైరాగ్యం కలిగాయి నేను పరుల సొమ్ము దొంగిలించి తప్పు చేస్తున్నానేమో పై జన్మకు యిదంతా ఋణభారమే కదా!
యత్ వ్యంగా: కుష్టి న శ్చాంధాః పంగ వశ్చ,దరిద్రణ:
పూర్వోపార్జిత పాపస్య ఫలమ స్నంతి దేహినః
అర్థము:--లోకం లో అంగ వైకల్యం గలవారు,కుష్టు వ్యాధి తో బాధ పడే వారు,కుంటి వాళ్ళు,గ్రుడ్డి వాళ్ళు, దరిద్రులూ వీరందరూ ఎప్పుడో చేసిన పాప ఫలం అనుభావిస్తున్నావారే కదా!అనే ఆలోచన వచ్చి ఆ మూట లన్నీ అక్కడే పడవేసి వెళ్లి పోదామనుకుంటుండగా పై భాగం లో పడుకున్న భోజ రాజు కు నిద్రా భంగ మైంది. ఆయన లేచి కిటికీ లోనుంచి ధారా నగరాన్ని,భవనాల్నీవెన్నెల వెలుగులో చూస్తుంటే ఆయనకు గర్వం కలిగింది. యింత కంటే ఏమి జీవితానికి ఏమి కావాలి అని అప్రయత్నంగా ఒక శ్లోకం పైకే గట్టిగా చెప్పాడు.
చేతోహరా యువతయ,సుహృదోనుకూలా:
సద్భాంధ వా ప్రణయ గర్భ గిరశ్చ భ్రుత్యాః
వల్గంతి దంతి నివహా:తరళా తురంగాః
అర్థము:--(ఆహా! నాకేమి తక్కువ?)మనోహరమైన అందగత్తె లు,అనుకూలురైన మిత్రులు,సజ్జనులైన బంధువులు,యెంతో ప్రేమతో సేవించే సేవకులు,దూకుడు గల గజ సేనలు,ధాటీ అయిన గుర్రాలు వున్నాయి.
ఈ శ్లోకం కింద వున్న దొంగకు వినిపించి . వాడు వెంటనే నాలుగో పాదం అప్రయత్నముగా గట్టిగా యిలా పూర్తీ చేశాడు
"సమ్మీలనే నయనయో:నహి కించిదస్తి!" ఒక్కసారి కళ్ళు మూత పడగానే (చనిపోయిన తర్వాత)పైన చెప్పిన సౌభాగ్యాలేవీ వుండవు. యిలా గట్టిగా చెప్పగానే కావలి వాళ్లకు వాడు దొరికి పోయాడు. వాళ్ళు వాడిని రాజు గారి దగ్గరకు తీసుకొని వెళ్లారు. రాజు దొంగ చేయ బోయిన దొంగతనం గురించి పట్టించు కోకుండా అంత చక్కని సత్యం తో తన శ్లోకం పూర్తీ చేసి నందుకు తన బంగారు కడియాన్ని బహుమతి గా యిచ్చి యిక పై దొంగ తనాలు చేయకుండా బ్రతుకు అని మందలించి పంపేశాడు.
ఆ దొంగ ఆ కడియంను తీసుకొని తన నిరుపేద యైన స్నేహితుని యింటికి వెళ్ళాడు .
ఆ రాత్రిపూట నిద్రిస్తున్న స్నేహితుడిని లేపి, మిత్రమా! రాజుగారు ఈ కడియాన్ని నాకు బహూకరించారు. ఇది నాకంటే నీకే ఎక్కువ ఉపయోగం.నీవు తీసుకో. ఇది రాజుగారి స్వంత ఆభరణం చాలా విలువైనది. చౌకగా తెగనమ్మవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ మిత్రుడు మరునాడే ఆ కడియాన్ని ఒక బంగారు దుకాణము లో అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో ఖరీదైన బట్టలూ,ఆభరణాలూ కొనుక్కొని తిరుగసాగాడు. చుట్టుపక్కలవాళ్ళు
కూటికి గతిలేని వీడికి ఒక్కరోజులో యింత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అని ఆరా తీసి
సంగతి కనుక్కొని ఆ షావుకారుతో సహా రాజభటులకు అప్పగించారు. వాళ్ళు వారిద్దరినీ
రాజసభలో ప్రవేశ పెట్టారు. రాజుగారు ఆ కడియాన్ని గుర్తించి ఈ కడియం నీకెక్కడిదని
గద్దించి అడిగారు. అప్పుడు ఆ పేదవాడు రాజుకొక శ్లోకం చెప్పాడు.
భేకై: కోటర శాయిభి:,మృతమివ క్షా౦తర్గత౦ కఛ్ఛపై:
పాఠీనై: పృథు పంక పీఠ లుఠనాత్-అస్మిన్ ముహుర్మూర్చితం
తస్మిన్. శుష్క సరస్యకాల జలదే నాగత్య తచేష్టితం
యేనా కుంభ నిమగ్న వన్య కరిణాం యూధై: పయః పీయతే
రాజా! ఒక ఎండి పోయిన చెరువున్నది. అందులో నీరు లేక నేలబొరియల్లో పడుకున్న కప్పలున్నాయి. తాబేళ్లు భూమిలోకి వెళ్లి చచ్చిపోయినట్టు పడివున్నాయి. చేపలు నీరు చాలక ఆ ఎండిన బంకమట్టి పలకల మీద వెల్లకిలా పది తరుచు మూర్ఛ పోతున్నాయి.
అలాంటి ఎండిన సరస్సు లో అకాల౦ లో మేఘుడు వచ్చి కురిపించిన వర్షం వల్ల
పెద్ద అడవి ఏనుగులే మునిగి పోయి నీళ్లు తాగుతున్నాయి. (నిత్యదరిద్రుడనైన నాకు
అకస్మాత్తుగా సిరి లభించింది అని భావం)
రాజుకు అతని కవిత్వం నచ్చింది. ఆ కడియాన్ని తన స్నేహితుడిచ్చినాడని చెప్పకుండా నర్మగర్భితంగా చెప్పడం యింకా నచ్చింది. ఆ దొంగనే ఆ కడియాన్ని యిచ్చివుంటాడని ఊహించాడు. దాన్ని వీడు అమ్మి ఉంటాడని గ్రహించాడు.
అతనికి మరో లక్ష యిచ్చి పంపించాడు.
----------------
_*కాల గణనం*_
ఇది మన కాల గణనం.
ఇంత నిశిత కాల గణన
ఇతరులకు అసాధ్యం.
నానో సేకండ్స్ ని మన
వాళ్ళు ఎంతగా గుణించారో చూడండి
100 తృటికలు – 1వేధ
3 వేధలు – 1 లవము
3 లవములు – 1 నిమిషం
3 నిమిషాలు – 1 క్షణం
5 క్షణాలు – 1 కాష్ట
15 కాష్టలు – 1 లఘువు
15 లఘవులు -- నిశిక
6 నిశికలు – 1 ప్రహర
4 ప్రహరలు – 1 దినం
15 దినాలు -- 1 పక్షం
2 పక్షాలు – 1 మాసం
2 మాసాలు – 1 ఋతువు
3 ఋతువులు –1 ఆయనం
2 ఆయనాలు –1 సంవత్సరం
12 సంవత్సరాలు – 1 తప
100 సంవత్సరాలు – 1 శతకం
10 శతకాలు – 1 సహస్రకం
4 సహస్రకాలు – 1 యుగం
4 యుగాలు – 1 మన్వంతరం
100 మన్వంతరాలు—1 బ్రహ్మదినం.
*బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం?*
అనంతమైన ఈకాలమానంలో ఎన్నో
మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో
బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని
పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50
సంవత్సరాలు గడిచి 51 సంవత్సరంలో శ్వేత
వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో 27
మహాయుగాలు గతించాయి.
28వ మహాయుగంలో 4వది
అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది.
సహస్ర చతురుయుగ సమానమైన బ్రహ్మ దివసాన్ని 14
మన్వంతరాలుగా విభజించడం జరిగింది.
మనమిప్పుడు సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము. పూర్వం ఆరుగురు మనువులు, ఒక్కొక్కరు 76 1/2 చతురుయుగాల చొప్పున
459 చతురుయుగాల కాలం అంటే దాదాపు 3కోట్ల
30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.
కృతయుగం-17,28,000
త్రేతాయుగం- 12,96,000
ద్వాపరయుగం- 8,64,000
కలియుగం- 4,32,000
43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం.
మన లెక్కల ప్రకారం
360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం.
అటువంటి 12వేల దేవసంవత్సరాలు అనగా
43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట.
2వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం.
360 అహోరాత్రాలు ఒక సంవత్సరం క్రింద లెక్క. అనగా మనుష్యమానంలో
31,10,40,00,00,000 (311 లక్షల 4వేల కోట్లు)
సంవత్సరాలు.
ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు. దీని
ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు.
71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది. ఇటువంటి 14
మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు, మళ్ళీ 14 మన్వంతరాలు ఒక రాత్రి. 28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి
నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం.
2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ
దివారాత్రం. 7లక్షల 20వేల మహాయుగాలు ఒక బ్రహ్మ
సంవత్సరం.
ప్రస్తుతం 28వ మహాయుగంలోని 4వ
యుగమైన కలియుగంలో ప్రధమపాదంలో
5108 సంవత్సరాలు
మన్వంతరము:-
హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము
30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును.
ఒక బ్రహ్మ దినము లో 14
మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి.
ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో
ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71
మహాయుగములుగా విభజించబడినది.
*ఎన్నెన్ని సంవత్సరాలు*
దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు
360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి).
మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల.
మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య)
సంవత్సరము. ఇట్టి
12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము).
ఇది మనకు ఒక
చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
💎• కృత యుగము =
4,800 దివ్య సంవత్సరములు =
17,28,000 మానవ సంవత్సరములు
💎• త్రేతా యుగము =
3,600 దివ్య సంవత్సరములు =
12,96,000 మానవ సంవత్సరములు
💎• ద్వాపర యుగము =
2,400 దివ్య సంవత్సరములు =
8,64,000 మానవ సంవత్సరములు
💎 కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు =
4,32,000 మానవ సంవత్సరములు
💎 మొత్తము 12,000 దివ్య సంవత్సరములు =
43,20,000 మానవ సంవత్సరములు –
💎 ఒక దివ్య
యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య
యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు.
బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.
ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము.
అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

పిచ్చి కబుర్లు

అననగనగా ఒక వనము. ఆ వనంలో కాకి, పావురం, కొంగ స్నేహంగా ఉన్నాయి. ఒక రోజు ఆ మూడు ఒక పందెం కట్టుకున్నాయి. వనంలో అవి ఉన్న స్థలం నుంచీ దాదాపుగా ఓ కిలోమీటర్ దూరాన ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి చేరాలి. ఎవరు ముందుగా చేరితే వారు పందెంలో నెగ్గినట్లు... ఆ నెగ్గిన వాళ్లు ఏం చెప్పినా మిగతా వాళ్ళిద్దరూ అలా నడుచుకోవాలనే పందెం అది.

కాకి, పావురం, కొంగ నిర్ణీత స్థలం నుంచీ ఆకాశ మార్గాన ఎగురుతూ వచ్చాయి. కొంగ ఎంతగా రెక్కలు అదిలించినా కాకినీ, పావురాన్ని దాటలేక చాలా దూరం వెనక బడింది. "పావురం మిత్రమా. మనం అతి వేగంగా చాలాదూరం ఎగిరి వచ్చాం. కొంగ మనల్ని దాటి పోవడం అసంభవం... కాసేపు మనమిద్దరం ఆ చెట్టు కొమ్మల చాటున కూర్చుని కబుర్లు చెప్పుకుందాం" అంది కాకి. "సరే అది వచ్చేలోపు మనం గమ్యం చేరుకోలేమా" అంది పావురం. ఆ రెండు పక్షులు చెట్టు మీదకి పోయాయి. ఏవేవో కబుర్లూ, ఊసులు చెప్పుకోవడంలో మునిగిపోయాయి.

కొంగ నెమ్మదిగా ఎగురుకుంటూ కొలను గట్టున ఉన్న కొబ్బరి చెట్లను చేరుకుంది ప్రశాంతంగా. అది చూసిన పావురం, కాకి పిచ్చి కబుర్లు ఆపేసి గబగబా ఎగిరి వచ్చి ఆయాసపడుతూ కొంగ చెంత వాలిపోయాయి. "మమ్మల్ని ఓడించావు కొంగ గారు. మా పిచ్చి కబుర్లూ, ఊసులే కొంపలు ముంచాయి... ఏకాగ్రతగా వచ్చి విజయం సాధించావు... నీకు అభినందనలు... "

అన్నాయి పావురము, కాకి తలదించుకొని...

*చూశారా పిల్లలూ పిచ్చి కబుర్లు ఎంత నష్టం కలిగిస్తాయో...