Monday 19 February 2018

*పద్య రచనందు చేయకూడని దోషములు..,*

పద్యరచన యందు సహజముగా  వచ్చు  దోషాలు 10 గుర్తించారు.మన పూర్వులు.,అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి

*1--గణ భంగము:*

 గురువు వ్రాయ వలసిన స్థానంలో లఘువు వ్రాసినా.. లఘువు బదులు గురువు వ్రాసినా ఈ గణ భంగమనే దోషం వస్తుంది.

*2--యతి భంగము:*

యతి స్థానము నందు యతి అక్షరం లేకపొయినా..యతికి   యతిమైత్రి సరిపోక పోయిన..యతి స్థానం మారినా.... అది యతి భంగముగా గుర్తించ వలెను.

*3--సంశయము:*

 పద్య పాదాలలో అర్ధం సరిగ్గా చెప్పలేకపొయినా.. అర్ధం లో సంశయమున్నా.. సంశయ దోషము అంటారు

 *4--విసంధి:*

సంధి చేయవలసిన చోట.. సంధి చేయకపోతే అది విసంధి దోషము అవుతుంది..తప్పనిసరిగా సంది చేయవలెను

*5--పునరుక్తము:*

ఒక శబ్దాన్ని మరల మరల ప్రయోగించడం, ఒకే అర్ధం వచ్చే విధముగా ప్రయోగించకూడదు.

 *6--అపశబ్దము:*

వ్యాకరణం తో సంభందము లేకుండా...కుసంధులు, దుస్సంధి వైరి సమాసాలు  ఉపయోగించరాదు.

 *7. వ్యర్ధము:*

అనుగుణముగా లేని కూడని మాటలు వాడిన.. "వ్యర్ధము" అనే దోషము కలుగుతుంది.

 *8-- అపక్రమము:*

వరుస తప్పడమే అపక్రమము.
ఉదా:  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అంటూ.. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి అన రాదు...సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతీ దేవి అని అనాలి.

*9-- అపార్ధము:*

సరి అయిన అర్ధము లేకుండా.. ప్రాస కోసమో.. యతి కోసమో శూన్య  పదాలు వాడ రాదు  వాడిన ఎడల  అపార్ధ దోషమంటారు.

*10. విరోధము:* .

ప్రకృతి   విరుద్ధం గా వర్ణించ రాదు. ఉదా:  విజయవాడ కనక దుర్గమ్మ పాదాల చెంత గోదావరి నదిలో స్నానమాచరించి అనరాదు..(అక్కడ ప్రవహించేది కృష్ణమ్మ తల్లి కదా)

నిషిద్ధ గణము వాడుట:  కంద పద్యం లో.. జగణం బేసి గణము గా వాడ రాదు కదా,,,6 వగణము తప్పనిసరిగా జగణము,,లేద నలము వ్రాయలికదా,,ఆవిధంగా వాడకుంటే అది నిషిద్ద గణం అవుతుంది.

*పదచ్చేద భంగము:* ద్విపద, మంజరీ ద్విపద లలో ఏ పాదమునకు ఆపాదము విడి విడివిడిగా వ్రాయలి రెండు పాదములు కలుప రాదు.

No comments:

Post a Comment