Thursday 4 December 2014

//తిరగ బడితే పోయేదేమిలేదు//
అబల అని నవ్వు ఎప్పుడూ అనుకోకు
ఆబోతులు వెంటపడతాయి భయపడకు
కొమ్ములు విరిచి ముక్కుతాడు చేపట్టు
కోడెనాగులు బుసగొడతాయి జడిసిపోకు
పీకను ఒడిసి పట్టుకొని కోరలు పీకేయ్
పిచ్చికుక్కలు పళ్ళుయివరగరుస్తాయి
పారిపోకు
దుడ్డుకర్రపట్టుకొని మూతియిపళ్ళుయిరగ్గొట్టు
మానభంగం చేయబోతారు లొంగిపోకు
మగతనం కోసి వాడి చేతిలోపెట్టు
ప్రేమించమని వెంటబడతారు పొంగిపోకు
పరాశక్తివై విజృంభించు
అవసరమైతే ఒక చేత్తో బ్లేడు
మరోచేత్తో యాసిడ్ తీసుకో
చరిత్ర తిరగరాయు.ధరిత్రి నీదని ఋజువు చేయు

చిత్రకవిత-45 ఉపశమన తరంగాల కోసం
04/12/14 వల్లూరు మురళీ

Wednesday 3 December 2014

//నేడేమైనాయవి//
చిన్నారి పాపల చిరుచిరు నగవులు
పాలబుగ్గల పచ్చనిపసిడి నిగ్గులు
పసిడిమనసుల పాలతేటతరగలు
చిందులువేసి అల్లరి చేసే ఆటపాటలు
కల్లాకపటం ఎరుగని చల్లని చూపులు
తాతానాన్నమ్మలు చెప్పిన కమ్మనిగాధలు
అమ్మమ్మల అభిమానాలు అత్తల గారాలు
నీతులు చెప్పి సుద్దులు నేర్పే నాటి చదువులు
మధువులు ఊరే మాతృభాషలో నాటి బోధలు
నేడేమైనాయి...అవిఎక్కడున్నాయి.
పచ్చిక పరుపుపైన మచ్చిక అవుదామా
పచ్చని మెత్త పైన హత్తుకొనిఉందామా నులి
వెచ్చని నీ  ఒడి తలగడపై నా తలనిడనా
వెచ్చని ఎదదుప్పటిలో తలదాచుకుందామా
ముచ్చాలజల్లులే నీ నవ్వులలో కురవాలి
నెచ్చెలి అధరము చిందిన మధువుల నే గ్రోలాలి
వెచ్చని నీ బిడికౌగిలిలో నే కరిగిపోవాలి
చొచ్చని గాలికి సందిట సందులేకపోవాలి
ఉచ్చనీచముల విడిచి మనమొక్కటైపోవాలి
ముచ్చెమటలు పోసి నీ ఎదపై నే వాలాలి
ముచ్చటైన మనజంటను మదనుడే మెచ్చాలి