Saturday 7 April 2018

నిర్వచన భారత గర్భ రామాయణము - 108


రావిపాటి లక్ష్మినారాయణ

చంపకమాల(...)లోకందద్వయము [...]లోతేటగీతి {...}లోఆటవెలది “...”లోఁ దెలుపబడి, యివి గర్భితమైన సీసము
సీ.        (అతి[కరుణాత్ముడా {పతి యనంతరసాన్వి
తప్రస్ఫుటాంగ}తా])త సుగుణకలి
([త తతబలా] ప్రభూ {పతితతారక సద్ధృ
తి ప్రాజ్ఞవీరసం)ధితరుచిర వి
(తత[వరదాయకా {యతుల నవ్యరమాయు
త ఖ్యాతియుక్తపా)]తకరహిత ల
([లితసుభగా] విభూ {కృతి సులేఖ సుధీవ
రశ్రేష్ఠబంధు}రా) రమ్యచరిత
గీ.         “నత[వరద రవిశశినయన పర పరమ
పురుష భక్తతోష భరితభువన” భా]స
హిత [సురమునిజనవినుత హతదితిరుహ
త్రిగుణమయ లసన్మతి వితతి శుభదా]త. (౧౨౫)
(సీసములో నాలుగుపాదముల యందును ౧౬వ అక్షరములగు తతిరలు సీసమునందు గురువులుతక్కిన కంద గీత చంపకమాలలందు లఘువులు. అనఁగా సీసమునందు అనంతరసాన్వితప్రస్ఫుటాంగసద్ధృతిప్రాజ్ఞ,నవ్యరమాయుతఖ్యాతియుక్తసుధీవరశ్రేష్ఠబంధు యని యొక్కొక్కదానిని సమాసముగఁ జదువవలెను. కందగీత,చంపకమాలలందు అనంతరసాన్వితప్రస్ఫుటాంగసద్ధృతిప్రాజ్ఞనవ్యరమాయుతఖ్యాతియుక్తసుధీవరశ్రేష్ఠబంధు యని వేఱువేఱుగా జదువవలెను.)
గర్భిత చంపకమాల-
అతికరుణాత్ముడా పతి యనంతరసాన్విత ప్రస్ఫుటాంగతా
త తతబలా ప్రభూ పతితతారక సద్ధృతి ప్రాజ్ఞవీర సం
తత వరదాయకా యతుల నవ్యరమాయుత ఖ్యాతియుక్త పా
లితసుభగా విభూ కృతి సులేఖ సుధీవరశ్రేష్ఠబంధురా!

గర్భిత కందద్వయము-
కరుణాత్ముడా పతి యనం
తరసాన్వితప్రస్ఫుటాంగతాత తతబలా
వరదాయకా యతుల న
వ్యరమాయుత ఖ్యాతియుక్త పాలితసుభగా.

వరద రవిశశినయన పర
పరమపురుష భక్తతోష భరితభువన భా
సురమునిజనవినుత హతది
తిరుహ త్రిగుణమయ లసన్మతి వితతి శుభదా.

గర్భిత తేటగీతి-
పతి యనంతరసాన్వితప్రస్ఫుటాంగ
పతితతారక సద్ధృతి ప్రాజ్ఞవీర
యతుల నవ్యరమాయుత ఖ్యాతియుక్త
కృతి సులేఖ సుధీవరశ్రేష్ఠబంధు.

గర్భిత ఆటవెలది-
నతవరద రవిశశినయన పర పరమ
పురుష భక్తతోష భరితభువన
హిత సురమునిజనవినుత హతదితిరుహ
త్రిగుణమయ లసన్మతి వితతి శుభ.
ఛందోవైవిధ్యంతో సమస్యాపూరణం ఎలా? 

సాధారణంగా సమస్య ఇచ్చినపుడు అది ఏ ఛందస్సులో ఉందో వెల్లడిగానే ఉంటుంది. ఉదాహరణకు శంకరాభరణం బ్లాగులో ఒక సమస్య
తల్లికి ముక్కు కోసి పినతల్లికి ముక్కెర పెట్ట మేలగున్
అని ఉన్నది. ఈ సమస్య ఉత్పలమాలలో ఒక పాదంగా వస్తుంది.  సంప్రదాయికంగా సమస్యాపాదాన్ని చివరిపాదంగా ఉంచి పూర్తిచేస్తారు. కాని అది అనుల్లంఘ్యనీయమైన నియమం యేమీ కాదు.  పద్యంలోని సందర్భాన్ని బట్టిసమస్యాపాదాన్ని ఏ పాదంగానైనా వాడుకో వచ్చును.
ఇచ్చిన సమస్య ఒక పూర్తిపాదంగా లేని సందర్బాల్లో తరచుగా పూరణం చేసే వారు ఫలాని ఛందస్సులోనే పూర్తిచేయాలని ఆశించలేము.  కవి ప్రతిభను బట్టిసమస్య ఇచ్చిన అవకాశాలను బట్టి కవిగారు తనకు నచ్చిన ఛందస్సులో ఇచ్చిన సమస్యను ఇరికించి పద్యం చెప్పవచ్చును.  కవి అలా స్వేఛ్చగా ఛందస్సును ఎన్నుకొనటాన్ని నిరోధిస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్యను ఇచ్చిన వారే ఫలాని ఛందస్సులో పూర్తిచేయండి అని అడుగుతూ‌ ఉంటారు.
ఏ ఛందస్సులో పూర్తిచేయాలో స్పష్టంగా ఉన్నప్పుడు మనం ఎలాగూ ఆ విషయంలో ఆలోచించటానికి ఏమీ లేదు. కాని మనకి ఛందస్సును ఎన్నుకునే స్వేఛ్ఛ ఉన్నప్పుడు తగిన ఛందస్సును ఎలా నిర్ణయించుకోవటం?  ఈ‌ విషయంలో నా అలోచనలను మీ‌ ముందు ఉంచాలనుకుంటున్నాను.
ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటేదత్తపదులవంటి ప్రక్రియలకు ఎలాగూ ఇబ్బందులు లేవు.  విడిగా ఇచ్చిన పదాలే కాబట్టి అవకాశాలు మెఱుగ్గానే ఉంటాయి. ఒక పద్యపాదమో లేదా పద్యపాదంలో కొంతభాగమో ఇచ్చినప్పుడు ఎలా మనం ఛందస్సును ఎన్నుకోవచ్చునో అన్నది ఇక్కడ చర్చనీయాంశం.

          
శంకరాభరణం బ్లాగులో ఇచ్చిన ఒక సమస్యను చూడండి.
పేరు లేనట్టివానికి వేయిపేర్లు.
ఇచ్చిన సమస్య "పేరు లేనట్టివానికి వేయిపేర్లు" అన్నదానికి గురులఘుక్రమం చూస్తే U I U U I U I I U I U I అనివస్తున్నది. మనం రకరకాలుగా దీన్ని గణ విభజన చేసుకోవచ్చును.   U I  -  U U I -  U I I  -  U I -  U I అని సూ-ఇం-ఇం-సూ-సూ గణాలుగా చేసి మనం తేటగీతి పాదంగా వాడుకోవచ్చును. ఇది మనం సులభంగానే గుర్తిస్తున్నాము.
ఆ సమస్యను ఇస్తూ శంకరయ్యగారు ఫలాని ఛందస్సులో పూరించండి అనలేదు. కాని అందరూ ఇది తేటగీతిపాదం అని వెంటనే కనిపెట్ట గలరు కదా. అందుచేత అందరూ తేటగీతులే వ్రాసి పంపించారు. ఈ విషయంలోప్రస్తుత వ్యాసకర్త చేసినది కూడా అదే.
ఇప్పుడు మనం ఈ సమస్యను తేటగీతి కాకుండా ఇతర ఛందస్సులలో ఎలా ఇరికించ వచ్చునో చూదాం.
మొద సీసపద్యంలో ఎలా ఇరికించవచ్చునో చూదాం. సీసపద్యంలో ప్రతిపాదానికి గణక్రమం ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ అనేది. అంటే వరుసగా ఆరు ఇంద్రగణాల తరువాత రెండు సూర్యగణాలు. ఇచ్చిన సమస్యని  వేరు రకంగా గణవిభజన చేసి చూదాం.  U I U -  U I U -  I I U I -  U I అని చేస్తే?  మనకు ఇప్పుడు ఇం-ఇం-ఇం-సూ అని వచ్చింది.  సీసపద్యపాదం గణక్రమంలో ఇది ఒదుగుతుందని సులభంగానే గుర్తించవచ్చును. ఇలా ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ లో ఎలా ఒదిగేదీ క్రీగీతతో సూచిస్తున్నాను చూడండి ఇలా ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ అని. కాని ఇలా చేసినప్పుడు మనకు ఈ‌ సమస్యతో యతివిషయంలో చిక్కు వస్తోంది. పేరులే-నట్టివా-నికివేయి-పేర్లు అని విడదీసి సీసంలో ఇరికించితే మనకు 'తో 'పేకు యతిమైత్రి కుదరటం‌ లేదు.
ఇంకొక విధంగా ప్రయత్నిద్దాము. మనకు ఇచ్చిన సమస్యకు చివరన సూర్యగణం వస్తున్నది కదాఅదనంగా ఒక లఘువును చేరి భ-గణంగానో అదనంగా ఒక గురువును చేర్చి ర-గణంగానో మార్చి దానిని ఇంద్రగణంగా తీర్చిదిద్దామనుకోండి.  అప్పుడు మనకు ఇం-ఇం-ఇం-సూ+(ల. లేదా గు.)  = ఇం-ఇం-ఇం-ఇం అని సిధ్ధిస్తున్నది. ఇది మనకు సదుపాయంగానే ఉంటుంది. చూడండి.  సీసం యొక్క పాదం ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ అని కదా మనం ఒకటి కంటే ఎక్కువరకాలుగా నాలుగు ఇంద్రగణాల వరుసను ఇరికించగలం. క్రీగీతలతో చూపుతున్నాను చూడండి.  ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ  లేదా ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ  లేదా ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ  అని మూడు రకాలుగా వ్రాయవచ్చును. మనకు ఇచ్చిన సమస్యను మార్చలేము కాబట్టి ఏరకంగా అమర్చితే యతిమైత్రి కుదుర్చుతూ వ్రాయవచ్చునో చూసుకొని పూరించవచ్చును.  ఈ‌ సమస్యను చూస్తే  పేరులే-నట్టివా-నికివేయు-పేర్లుXఅన్నప్పుడు పే-ని లకు యతికుదరదు కాబట్టి పాదాదినుండి సమస్యను ఉంచలేం.  పాదాది మొదటిగణం విడిచి ఇరికిస్తే మొదటిగణం ''కు  యతిమైత్రి కలిగి ఉండాలి ఇది పెద్ద చిక్కు కాదు. పాదాది రెండు గణాలు విడిచి వ్రాస్తే పాదాది గణం 'పే'తో యతిమైత్రి కలిగి ఉండాలి - ఇదీ చిక్కు కాదు.  అందుచేత ఈ విధంగా సీసపాదంలో ఇచ్చిన సమస్యను ఇరికించగలం!  అంటే మనం ఒక సీసపాదాన్ని సమస్యతో ఇచ్చిన సమస్యతో ఈ క్రిందివిధాలుగా తయారు చేయవచ్చును.
నప్పెడు పేరులే‌నట్టి వానికి వేయి   ।పేర్లు విశదముగ వెలుగుచుండె
విశదంబుగా నొక్క పేరులే నట్టి వా ।నికి వేయి పేర్లుగా నిగిడె యశము
సీసంలో‌ప్రాసయతులు చెల్లించవచ్చును కదా అన్న సదుపాయం గమనిస్తే నిజానికి ఇలాంటి పూరణ మరికొంత సుగమం అవుతుంది.
ఇప్పుడు మనం ఈ‌ సమస్యను మధ్యాక్కరలో ఏ విధంగా ఇరికించ వచ్చునో చూదాం.
మధ్యాక్కరలో ప్రతిపాదానికి గణవిభజన ఇం-ఇం-సూ-ఇం-ఇం-సూ అన్నవిధంగా ఉంటుంది. యతిస్థానం నాలుగవగణం అని కొందరి మతం. నన్నయగారు ఐదవగణం ప్రధమాక్షరం వాడారు యతిస్థానంగా. మహాప్రతిభావంతులు కాబట్టి విశ్వనాథవారు ఉభయస్థానాల్లోనూ విధిగా యతిమైత్రి పాటిస్తూ మరీ వ్రాసారు మధ్యాక్కరలను!
ప్రస్తుత సమస్య గురులఘుక్రమం U I U U I U I I U I U I  అన్నదాన్ని U I U -  U I U -  I I U I -  U I అని ఇం-ఇం-ఇం-సూ అన్నట్లుగా గణవిభజన చేయవచ్చును అని ఇప్పతికే‌ గమనించాం.  మధ్యాక్కరలో మూడు ఇంద్రగణాలు వరసగా వచ్చేందుకు అవకాశం లేనే లేదు.  సరేమరొక రకంగా U I  - U U I -  U I I  - U I - U I  అని గణవిభజన చేదాం. అదనంగా మరొక గురువునో లగువునో తగిలిద్దాం అప్పుడు U I  - U U I -  U I I  - U I - U I X అంటే సూ-ఇం-ఇం-సూ-ఇం అనివస్తుంది విభజనవీటులో మొదటి సూర్యగణాన్ని పైపాదానికి బదలాయించ వచ్చును సుబ్బరంగా. అంటే మనం ఇలా వ్రాయవచ్చునన్న మాట.
ఇంద్ర ఇంద్ర సూర్య ఇంద్ర ఇంద్ర పేరు లేనట్టి వానికి వేయి పేర్లుఇంద్ర సూర్య యతిస్థానం మనకు హాయిగా రెండు విధాలుగా ఉంది కాబట్టి వీలు చూసుకొని ఇక్కడ ఐదవ గణాదిని యతిమైత్రి చేయవచ్చును.  అది మన చేతిలో ఉన్నదే సమస్యకు ఆవలగా. కాబట్టి ఇబ్బంది లేదు.
ఉదాహరణకు తేటగీతి కాక రెండు ఛందస్సులలో ఈ‌సమస్యను ఎలా ఇరికించి పూర్తిచేయవచ్చునో సూచనప్రాయంగా వివరించాను.  ఇచ్చిన సమస్య యొక్క గురులఘుక్రమాన్ని బట్టి ఏ విధంగా తగిన ఛందస్సును ఎంపిక చేసుకోవాలో పూరణ చేసే వారు ఆలోచించుకోవాలి. ఇక ఇరికించటం అన్న ప్రక్రియ విషయంలో మనంఅనుకున్న పధ్ధతులు ఉపయోగిస్తాయి.

తాడిగడప శ్యామలరావు
శ్రీనాథుని పద్యం
పవిత్ర "మహాశివరాత్రి" పర్వదిన సందర్భంగా ఆ పరమశివుని ప్రసన్నదృక్కులు అందరిపైనా ప్రసరించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకునిపార్వతీపరమేశ్వరులు సాక్షాత్కరించిన ఒక సన్నివేశాన్ని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తమ "భీమఖండము" లో ఎంత హృద్యంగా వర్ణించాడో మీ అందరి దృష్టికి తేవాలని అనిపించింది.
ముందుగా పద్యాన్ని చిత్తగించండి.
చంద్రబింబాననచంద్రరేఖామౌళి
          
నీలకుంతలభారనీలగళుఁడు ధవళాయతేక్షణధవళాఖిలాంగుండు
          
మదనసంజీవనిమదనహరుఁడు నాగేంద్రనిభయాననాగకుండలధారి
          
భువనమోహనగాత్ర భువనకర్త 
గిరిరాజకన్యకగిరిరాజనిలయుండు
          
సర్వాంగసుందరిసర్వగురుఁడు గౌరిశ్రీ విశ్వనాథుండు కనకరత్న పాదుకలు మెట్టిచట్టలు పట్టుకొనుచు నందికేశుండు ముందట నడచిరాఁగ నరుగుదెంచుట యద్భుతమయ్యె మాకు.
        పద్యము సులభగ్రాహ్యంగానే ఉన్నప్పటికీతెలియనివారి కోసం కొద్దిగా వివరిస్తాను. పై సీసపద్యములోని నాలుగుపాదాల్లోనూ పార్వతినిపరమేశ్వరుణ్ణి ప్రతి పాదములో ప్రస్తుతించాడు శ్రీనాథుడు!
  • గౌరీదేవి చంద్రబింబము వంటి ముఖసౌందర్యము కలిగివున్నది. (ఆననము అంటే ముఖము)మరిశంకరుడేమో చంద్రరేఖను (నెలవంకను) తలపై ధరించివున్నాడు.
  • ఆమె నల్లని దట్టమైన కురులను కలిగివుంది. అతడు నల్లని కంఠం కలవాడు. (సంస్కృతములో నీల ' అనే పదానికినలుపు ' అనే అర్థం వుంది.) క్షీరసాగరమధన సమయములో బయల్వెడలిన హాలాహలాన్ని లోకరక్షణార్థమై పరమేశుడు స్వీకరించి తన కంఠాన నిలిపిన గాథ సుప్రసిద్ధం కదా!
  • ఆమె తెల్లని విశాలమైన కన్నులు కలిగివుంది. అతడు తెల్లని శరీరకాంతితో ప్రకాశిస్తున్నాడు. 
  • మరణించిన మన్మథుణ్ణి సైతం తిరిగి బ్రతికింపజేయగల సౌందర్యం ఆ తల్లిది. ఆయనేమో తన ఫాలాగ్నిలో మదనుణ్ణి భస్మం చేసినవాడు.
  • ఆమె ఏనుగు నడక వంటి మందగమనం కలిగివుంది. (నాగము ' అంటే ఏనుగు అనే అర్థం వుంది.) స్త్రీలను 'గజగమనలు ' అని వర్ణించడం కవులకు పరిపాటే! మరిశివుడేమో నాగాభరణుడు. సర్పములనే అలంకారములుగా ధరించినవాడు. 
  • సర్వలోకాలనూ సమ్మోహితం చేయగలిగిన సురుచిర శరీర సౌందర్యం సర్వమంగళది. ఆయనేమో సాక్షాత్తూ విశ్వనాథుడే! సర్వలోకాలకూ కర్త.
  • ఆమె గిరిజ. అనగా గిరులకే రాజైన హిమవంతుని ముద్దులపట్టి. ఇక ఆయన కైలాస పర్వతమునే తన నివాసంగా చేసుకున్నవాడు.
  • అన్ని అవయవములు పొందికగా అమరిన సర్వాంగసుందరి ఆమె. ఆయన సర్వులకూ గురువుజగద్గురువు.
        పైవిధంగా ఆ ఆదిదంపతులుతమ వాహనమైన నందీశ్వరుడు ముందు నడవగా అద్భుతమైన రీతిలో సాక్షాత్కరించారు.

        మహాదేవుని అర్ధనారీశ్వరతత్వం ప్రతిఫలించేలాశ్రీనాథ కవీంద్రుడు వారిద్దరినీ ఒకేవిధమైన విశేషణాలు వినియోగిస్తూ విలక్షణరీతిలో వర్ణించిన ఈ పద్యప్రసూనం సహృదయరంజకం.

        ఆస్వాదించే అభిరుచిఆసక్తి ఉండాలేగానిమన తెలుగు సాహిత్యములో ఇటువంటి రసగుళికలు ఎన్నో!...........
భవదీయుడు,
సత్యనారాయణ పిస్క.

చమత్కార పద్యాలు - 1

చమత్కార పద్యాలు - 1

తెనాలి రామకృష్ణుని పద్యం
నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తి వెలయు కరిభి ద్గిరిభి
త్కరి కరిభి ద్గిరిగిరిభి
త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై


నరసింహ = నరసింహ రాయల కుమారుడైన

కృష్ణరాయని = శ్రీ కృష్ణ దేవరాయల


కరము = మిక్కిలి


అరుదగు = విశేషమైన


కీర్తి = యశస్సు


కరి = గజాసురుని


భిత్ = ఓడించిన శివునిలాగా తెల్లనిదై,


గిరిభిత్ = పర్వతాలను ఓడించిన ఇంద్రుని


కరి = ఏనుగైన ఐరావతంలాగా తెల్లనిదై ,


కరిభిత్ = గజాసురుని ఓడించిన శివుని


గిరి = నివాస పర్వతమైన కైలాసంలాగా తెల్లనిదై,


గిరిభిత్=పర్వతాలను ఖండించిన వజ్రాయుధంలాగా తెల్లనిదై,


కరిభిత్=గజాసురుని ఓడించిన శివుని యొక్క


తురంగ=వాహనమైన నందీశ్వరునిలాగా తెల్లనిదై,


గిరిభిత్=పర్వతాలను ఓడించిన ఇంద్రుని యొక్క


తురంగ=వాహనమైన ఉచ్చైశ్రవం అనే గుర్రంలాగా తెల్లనిదై ,


ఒప్పె = విలసిల్లింది .

గమ్మత్తైన పద్యం

పూర్వం ఒక రామ భక్తుడు....  రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.

ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.
"విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.

గవీశపాత్రో నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః। 

లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాదిః  పరమేశ్వరో నః॥ 
ఆశ్చర్య పోయాడు చదవగానే.

అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్  అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి  విశేషణాలు. అర్ధం చూడండి...

గవీశపాత్రః ... గవాం ఈశః  గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే. 

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ. 

అనాదిః ... ఆది లేని వాడూ  ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,

అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.

చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.

ఇది మరో ఆశ్చర్యం.

అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....

పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.
ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః  అంటే పక్షి అని అర్ధం. వీనామ్  ఈశః  వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.

కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.  

లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.

అతడు మనలను కాపాడు గాక ....
గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో  విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని  దర్శించగలిగితే వాడు  శైవుడు.  ఇది మన భారతీయ కవితా వైభవము.


విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి
('అనంత్ మూగి' గారికి ధన్యవాదాలతో...)

చమత్కార పద్యం - 251

సీతా రావణ సంవాద ఝరి
 3 (-క +న)
ఈ శ్లోకంలో ‘క’ ను తీసి వేసి ఆ స్థానంలో ‘న’ ఉంచాలి

సీతే! శ్రీశ్చ వికాశితా ఖలు వధూ కామప్రియాంగస్య మే
దారిద్ర్యం పురి క ర్తితం గుణ గణైః కాలోచితప్రస్థితేః,
హా మాయాకర కామితాన్య లలనాలగ్నాంత రంగః ప్రియః
పాపాత్మన్! కలయే నసంగత మిదం సర్వం త్వదుక్తం వచః।।
ఉన్నది ఉన్నట్లుగా.....
రావణోక్తి:
సీతే = ఓ సీతా
వధూ కామ ప్రియాంగస్య = స్త్రీలకు మన్మథుని వలె సుందరుడనైన
మే = నాకు
శ్రీః = సంపద
వికాశితా = విప్పారినది
కాలోచిత ప్రస్థితేః = కాలాను గుణ్య ప్రయాణ సన్నాహము గల
మే = నా యొక్క
గుణగణైః = గుణ సమూహములతో
పురి = పట్టణమందు
దారిద్ర్యం కర్తితం = దరిద్రము నరికి వేయబడినది...అని రావణ కృత స్వస్తుతి!
అట్లే
ప్రియః = నీ ప్రియుడు
మాయాకర కామితాన్య లలనాలగ్నాంత రంగః = మాయావి పరకాంతలందు మనసు నిలుపు వాడు.... అని రామనింద
సీతా ప్రత్యుక్తి...
సర్వం త్వదుక్తం వచః = నీ పలుకంతయు
సంగతం నకలయే = సరియైనదిగా తలచను... అని సమాన్యార్థం
కలయే = క కారము లోపింపగా
నసంగతం = న కారముతో కూడినది అని సంకేతార్థము
క తీసి వేసి న ప్రతిక్షేపించగా
వధూనామ ప్రియాంగస్య = స్త్రీల కప్రియమగు శరీరము గల
మే = నా యొక్క
శ్రీః = సంపద
వినాశితా = నశింపజేయ బడినది!
నాలోచిత ప్రస్థితే = అనాలోచితముగా ప్రయాణము చేయు
మే = నా యొక్క
పురి = పట్టణమందు
దారిద్ర్యం నర్తితం = దరిద్రము నర్తించును
అని రావణ నిందగా మారింది
అట్లే
మాయానర నామితాన్య లలనాంత రంగః = లీలా మానుష విగ్రహుడు,పర స్త్రీలందు మనసు చేర్చని వాడు
ప్రియః = ప్రేమ పాత్రుడు... అని రామ స్తుతిగా పరిణమించింది.

(‘బంధకవిత్వం’ వాట్సప్ సమూహం నుండి శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

Friday 6 April 2018

శ్రీకాకుళం బాస...అందమైన యాస..
// బెమ్మరాచ్చసి//
ఒకరోజు తోటలొ పరింపళ్ళు ఏరుతున్న పెద్దమ్మ కూతుర్ని ఎలుగుబంటి ఎత్తుకుపొయింది.ఆ సంగతి ఆఊరి బారికోడు పెద్దమ్మతో సెప్పినాడు.పెద్దమ్మ తన పెద్దకొడుకులతో ఇలగిలగ అయ్యిందని...ఎల్లి మీసెల్లుల్ని ఇడిపించుకురమ్మని సెబితే "అమ్మో!!! మేమెల్లము.మమ్మల్ని సంపీదూ ఎలుగుబంటి" అని సెప్పి తప్పించుకున్నారు. సిన్నోడుతో సెబితే సరే అని సెప్పి పెడకన దోపిన బళ్ళెంతీసి దారుతీసి పట్టుకు బయలుదేరాడు.అలా ఎళుతుండగ సాకలిరేవు దగ్గర గాడిదలు మేస్తన్నాయి. మడియారి సూరయ్యనడిగి ఒక గాడిదను బాడుగకు తీసుకున్నాడు. దారిలో ఒక కుమ్మరోడు కుండలు కావిడిలొ ఏసుకొని ఎదురైనాడు. ఆడిని నీదగ్గర ఏటేటున్నాయి.అడిగినాడు. నాదగ్గర పిచ్చికలు,పమ్మిదలు,సిచ్చుబుడ్డీలు,పిడతలు,కుడతలు,గుగ్గిలం కుడతలు,సట్టిలు,మట్టులు,మూకుడ్లు,కలాయిలు,పెనాలు,దాకలు,అటికిలు,అంబలటికలు,కూటికుండలు,కుండలు,కడవలు,కూజాలు,గూనలు,బానలు,జాడీలు, అన్నీ ఉన్నాయి. నీకేటి కావాలో బేగి సెప్పు. నాకేటీ అక్కరనేదు కానీ మీయిల్లు కాలిపాతంది. నీకు తెలుసా... ఓరి నీ తస్సాదియ్య...ఇప్పుడా సెబుతావు... అని ఆ కుండలు అక్కడే వదిలేసి పరిగెత్తాడు. ఒక పెద్ద బాన,కుంపటి ఒకటి ఎంచుకొని గాడిదమీద కట్టేసాడు. గాడిదను తోలుకోని ఎలతన్నాడు. అలా ఎలుతుంటే ఒక మేదరోడు ఎదురైనాడు. మేదలన్నా!.... మేదరన్నా!...నీదగ్గిరేటున్నాయి?... నా దగ్గర జిబ్బిలు,బుట్టలు, గిలకలు,పెట్టిలు,సజ్జలు,మట్టులు,తట్టలు,గాడితట్టలు,కోలగూలు,కోలబుట్టలు,ఉల్లిపాయలబుట్టలు,ఉల్లిపాయల సజ్జలు,ఒడాల తడకలు, గత్తం పొడకలు, దాన్నెంపొడకలు,ఇతనాలపొడకలు, తడకలు, పచ్చబద్దల సేటలు, సేటలు, జంగిడ్లు, పట్లుకర్రలు, టిర్రిలు,ఊజులు, మానిలు,గుల్లలు,మూతిబుట్టిలు, ఈతసాపలు, తాటిసాపలు, ఇసనకర్రలు, తుంగసాపలు,కవ్వాలు, మునకాలకర్రలు, దుడ్డుగర్రలు,కత్తవ కర్రలు,కొరడాకర్రలు, ఉన్నాయన్నాడు. సరేగాని నీకీసంగత్తెలుసా? మీ పిక్కిరోడు నూతిలోన పడిపోండట. అంతే అవన్నీ అక్కడే పడేసి పరిగెత్తాడు. అందులో రెండుపెద్ద పచ్చబద్దల సేటలు, ఇసనకర్ర ఎంచుకొని గాడిదమీద కట్టేసాడు..కొంత దూరం ఎళ్లాక ఒక కమ్మరోడు సామాన్లు అమ్ముతూ ఎదురైతే వాడిని ఆపి నీదగ్గర ఏటేటి ఉన్నాయో సెప్పు అంటే...కత్తులు, చాకులు, సురకత్తులు, బళ్ళేలు,కటార్లు, కత్తిపీటలు, బొరిగిలు,కత్తవలు, గునపాలు, నక్కులు, సీలలు, కమ్ములు,కుంచం కట్లు,కుంచాలు, నక్కాకులు,తొడపలు, నాలు,మేకులు, మడతబందులు, గెడలు, అడ్డుగెడలు, పారలు, ఇంకా ఏటి కావాలన్నా ఉన్నాయి. అన్నాడు. సరేగానీ నీకో ఇసయం తెలుసా? మీఇంటిల దొంగలు పడ్డారట... అంతే...అవన్నీ అక్కడ పడేసి ఇంటికి పరిగెట్టాడు.అందులో ఒక పార,గునపాం(గడ్డపార), ఒకనక్కు తీసుకున్నాడు.. అలా కొంతదూరం వెళ్ళాక ఒక తాలు, పడుగులు అమ్మేవాడు కనిపిస్తే..."నీదగ్గర ఏటున్నాయి"? అడిగాడు. వాడి దగ్గర నులకతాలు,నులకుండలు, పురితాలు, పురికొసలు,సేదతాలు, కొబ్బరి తాలు, కన్నిలు, సిగిమోరలు, ఉట్టిలు, ఎత్తిడ్లు, వలలు, ఉయ్యాల తాలు, నొగతాలు,ముకుతాలు, మూతిబుట్టిలు,పడుగులు,పలుపులు...ఉన్నాయన్నాడు. సరేగాని నీకీ బోగట్టా తెలుసా...మీ ముసిల్దాయి జారిపడిపోయిందట.... అనేసరికి అవన్నీ అక్కడ పడేసి పరిగెత్తాడు. అందులో ఒక పెద్ద పడుగు తీసుకొన్నాడు.అవన్నీ గాడిదపై వేసుకొని తిన్నగా ఎలుగుబంటి ఒండకు ఎళ్ళాడు.
అక్క చిన్నోడిని పలకరించింది. "ఎలుగుబంటి చూసిందంటే నిన్ను అమాంతం మింగెస్తది. వెళ్ళి అటక పై దాగో"అన్నది."అయితే ఈటన్నిటినీ అటక పైకి తీసుకెలతాను" అంటే " అలాగె" అన్నది. ఒక కుంపటి లో నిప్పులేసి నక్కును అందులొ పెట్టి విసనకర్రతో విసురుతూ ఎర్రగా కాల్చాడు.ఇంతలో ఎలుగుబంటి వచ్చి అన్నం వడ్డించమన్నది. పెద్దమ్మ కూతురు అన్నం వడ్డిస్తే తింటూ నెయ్యి వెయ్యమంది. అటక పై వున్న నెయ్యిని కుంపటిలో వేసి అందులొ గాడిద ఉచ్చను వేసి కిందికి విసిరేసాడు చిన్నోడు. "మీదను ఎవులున్నారు "అని అంటె పిల్లులు అని సర్దిచెప్పింది అక్క. సరేలే అని ఆ ఉచ్చను అన్నంలోకలుపుకొని తింటూ "ఏమిటో ఈరోజు నెయ్యి చాలారుచిగా ఉందని కంచం నాకేసి మరీ తిన్నాడు. అటక పై మళ్ళీచప్పుడు. మీదికెళ్ళి పిల్లులని తరిమేస్తనుండు అంటే అవే పోతాయిలే అని సర్దిచెప్పింది వీడి అక్క. ఇంతలో మళ్ళీ చప్పుడు. "పిల్లి కాదు ఏదో ఉంది అటక పైన బుడ్డీ(దీపం) ముట్టించు చూస్తాను"అంది ఎలుగుబంటి. చిన్నోడు "నేను బెమ్మరాచ్చసుడ్ని నిన్ను మింగేస్తాను "అన్నాడు. అప్పుడు ఎలుగుబంటి"ఐతే నీ పల్లు(దంతాలు) చూపించు అంటే పార చూపించాడు.నీ గోలు చూపించు అంటే గునపం చూపించాడు.నీ చెవులు చూపించు అంటే చేటలు చూపించాడు. నీ కడుపేది అంటే బానను చూపించడు. నీ తోకేది అంటే పడుగు(పెద్ద లావుపాటి తాడు)ను కిందికి వదిలాడు. ఐతే నా అరుపు చూడని బబ్బబ్బ అని బబ్బర్లు కొట్టింది ఎలుగుబంటి. చిన్నోడు ఎర్రగా కాలిన ఇనపనక్కు(మొన కల్గిన ఇనుప కడ్డీ)ను గాడిద పై మోపాడు అంతే గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది.ఓరినాయనొ ఇంతపెద్ద బెమ్మరాచ్చసా అంటూ ఎలుగుబంటి భయపడిపొయి పరుగు లంకించుకుంది.చిన్నోడు అక్కను తీసుకొని ఇంటికి సుబ్బరంగా పారొచ్చినాడు.పెద్దమ్మ సంతసించింది.
LikeShow More Reactions
జానపదుల శ్రీక్రిష్ణ చరిత గానము!
-
కస్తూరి రంగ రంగ -నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ నిన్ను బాసి - యెట్లునే మరచుందురా
కంసుని సంహరింపా- సద్గురుడు అవతారమెత్తినపుడు
దేవకీ గర్భమునను-కృష్ణావవతారమై జన్మించెను
యేడు రాత్రులు చేర్చి -ఒక రాత్రి ఏక రాత్రింగ జేసెను
ఆదివారముపూటను-అష్టమీ దినమందుజన్మించెను
తలతోను జన్మమైతే- తనకుమబు-మోసంబు వచ్చుననుచు
ఎదురు కాళ్లను బుట్టెను , ఏడుగురు- దాసులను జంపెను
నెత్తురుతో ఉండి యపుడు - ఆ బాల కావు కావున ఏడ్చుచూ
నన్నేల ఎత్తుకొనవే -ఒ తల్లి దేవకీ వందనంబు
ఒల్లేల హీనంబుతో -ఈ రీతి ఉన్నాను కన్న తండ్రి.
నిన్నెట్లు యెత్తుకొందు-నీ వొక్క నిముషంబు తాళరన్న
గంగను ప్రార్థించెను -జలనిధుల -తానుప్పొంగెను
గంగ నదిలోనప్పుడు- దేవకీ జలకంబులాడెనపుడు
ఇకనైన ఎత్తుకొనవే - నాతల్లి దేవకీ వందనంబు
కాని బాలుని రీతిగా- నన్నిట్ల ఎడబాసి యుండతగునా
.
నీపుణ్యమాయె కొడుకా- ఇంకొక్క నిముషంబు తాళమంచు
కామధేనువు నప్పుడు -దేవకీ అడగి ప్రార్థించగాను
.
పాల వర్షము గురిసెను- అప్పుడా బాలుపై చల్లగాను
తడి వస్త్రములు విడిచెను-దేవకీ- పొడి వస్త్రములు కట్టెను
పొత్తిళ్ళ మీదనపుడు -బాలుండు చక్కగా పవలించెను
తన రెండు హస్తములతో -దేవకీ-తనయున్ని ఎత్తుకొనెను
.
అడ్డాలప వేసుక - ఆబాలు-నందచందము చూచెను
వసుదేవ పుత్రుడమ్మ- ఈ బిడ్డ- వైకుంఠ వాసుడమ్మ
.
నవనీత చోరుడమ్మ -ఈ బిడ్డ- నంద గోపాలుడమ్మ
శతపత్ర నేత్రుడమ్మ- ఈ బిడ్డ- శ్రీ రామ చంద్రుడమ్మ
.
శిరమున చింతామణి- నా తండ్రి- నా లుక నక్షత్రము
పండ్లను పరష వేది- భుజమున- శంఖు చక్రమ్ములు గలవు
వీపున వింజామర- నా తండ్రి బొడ్దున పారిజాతమ్ము
అరికాళ్ల పద్మములను - అన్నియూ అమరేను కన్న తండ్రి
.
నీ రూపు చక్కదనము- ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసె తండ్రి
అన్నెకారి కడ్పునా- ఓ అయ్య -ఏల జన్మిస్తివయ్య
మాయన్న కంసరాజు- ఇప్పుడు-వచ్చె -వేళాయెరా
నిన్ను నేనెత్తుకోని -ఏ త్రోవ -నేగుదురా కన్న తండ్రీ
.
ఆ చక్కదనము జూచి-దేవకీ -శోకింప సాగెనపుడు
తల్లి శోకము మాన్పగా -మాధవుడు- తంత్రమొగటి జేసెను
పెద్ద బొబ్బలు పెత్తుఛూ- మాధవుడు- గట్టిగా ఏడ్వ సాగె
శోకంబు చాలించియూ -దేవకీ -బాలున్ని- ఎత్తుకొనెను
.
నాయన్న ఊరుకోరా- నా తండ్రి- గోపాల పవళించరా
అల్లడుగొ బూచివాడు- నా తండ్రి వస్తాడు- పవళించరా
బూచులను మర్దించను - నళినాక్షి - బుద్ధిమంతుడను అమ్మా
.
బూచేమి చేయునమ్మ- నా తల్లి- బూచి నన్నెరుగునమ్మా
నీ పుణ్యమాయె కొడుకా- నీ వొక్క -నిముషంబు తాళుమనుచూ
.
అల్లడుగొ జోగి వాడు- నా తండ్రి -వస్తాడు పవళించరా
జోగి మందుల సంచులు- ఏ వేళ -నాచంక నుండగను
జోగేమి చేసునమ్మ- నా తల్లి- జోగి నన్నెరుగునమ్మా
.
నీ పుణ్యమాయె కొడుకా -నీవొక్క నిముషంబు తాళుమనుచు
అల్లదుగొ పాము వచ్చె- నా తండ్రి గోపాల- పవళించరా
పాముల రాజు అయిన- శేషుండు - పానుపై ఉండగాను
పామేమి జేసునమ్మ- నళినాక్షి- భయము నీకేలనమ్మ
.
నీల మేఘపు చాయలు- నీ మేను -నీలాల హారములను
సద్గురుండు వ్రాసినాడు- నీ రూపు నీ చక్కదనము
నిన్ను నేనెత్తుకోని - ఏ త్రోవ -పోదురా కన్న తండ్రి
.
నాకేమి భయము లేదే- నా తల్లి - నాకేమి కొదువ లేదే
మా మామ కంసరాజు- ఈ వేళ నన్ను- వెరిపించ వస్తే
మా మామ నా చేతను- మరణమై పోయేది- నిజము సుమ్మా
.
వచ్చె వేళాయెననుచు -నా తల్లి -వాసుదేవు పిలువనంపు
గోపెమ్మ బిడ్డనిపుడు- శీఘ్రముగా- తెచ్చి నీవుంచవమ్మా
.
అంతలో వసుదేవుడు - బాలున్ని -తలమీద ఎత్తుకొనెను
రేపల్లె వాడలోని - గోపెమ్మ- ఇంటకు వచ్చెనపుడు
.
గోపెమ్మ పుత్రినపుడు -వసుదేవు- భుజముపై ఎక్కించుకు
అతి త్వరముగా వచ్చెను-దేవకీ- హస్తములనుంచెనపుడు
.
దేవకికి తనయుడపుడు- పుట్టెనని -కంసునకు కబురాయెను
ఝల్లుమని గుండెలదర- కంసుండు- పీఠంబు దూకెనపుడు
.
జాతకంబులు జూచెను-గండంబు -తగిలెనని కంసరాజు
చన్ద్రాయుధము దూసుకా- శీఘ్రముగా- దేవకీ వద్దకొచ్చె
తెమ్మని సుతునడిగెను- దేవకీ అన్నది- అన్నతోను
మగవాడు కాదు అన్న- ఈ పిల్ల- ఆడపిల్ల నమ్మరా
.
ఉపవాసములు ,నోములు - ఈ పుత్రికను గంటినన్నా
పుత్రి దానము చేయరా- నాయన్న- పుణ్యవంతుడవవుదువన్న
.
దేవాది దేవులైన -బ్రహ్మ రుద్రాదులకు పూజ జేసి
పూజ ఫలముల చేతను- వారి క్రిప- వల్ల పుత్రికను గంటిని
నీ పుణ్యమాయెరన్నా-నీవు- పుత్రికను దయచేయుమన్న
నిర్దయాత్మకుడవగుచు -నీవిట్లు- చేయతగదురన్నా
.
ప్రేమతో చెల్లెలపుడు- చేయి పట్టి - బ్రతిమాలెను
గంగాది నదులయందు- పుత్రదానను -చేయుమనెను
.
కాదు కాదని కంసుడు- దేవకీ -పుత్రిని అడిగెనపుడు
అడ్డాలపై బాలను - పుచ్చుకుని- ఎగరేసి నరకబోయె
.
అంబరమునకు ఎగురగా- వేయునపుడా బాల కంసు జూచి
నన్నేల చంపెదవురా- నీ యబ్బ- రేపల్లె వాడలోను
పెరుగుతున్నాడు వినరా- కృష్ణావతారమై జన్మించెను
.
నిజముగా దోచెనపుడు- కంసుండు- యేతెన్చి పవళించెను
రేపల్లె వాడలోను- పెరుగుచున్నాడని దిగులొందెను
.
నీ యబ్బ నీ తాతరా- కంసుడా- కృష్ణుడు పుట్టెననుచూ
చల్లమ్ము వారలెల్ల- ఆ కబురు -చక్కగా చెప్పగాను
.
పూతనకు కబురాయెను- అప్పుడా-పూతన్ చనుదెంచెను
శ్రింగారముగా పూతన- స్థనములకు- విషధార పూసుకొనెను
రేపల్లె వాడలందు- కృష్ణుడు తిరుగుచున్న చోటకు
చనుదెంచి విషపు పాలు- ఇవ్వను- సమకట్టి ఇవ్వగాను
.
బాలురతొ బంతులాడ- పరుగెత్తి - వీధి నడుమను నిలిచెను
ప్రేమతో క్రిష్ణుని చూచి- పూతన -భూమిపై కొరిగిపడగా
.
గోపెమ్మ చూచి అపుడా -బంగారు- గిన్నెలో బువ్వ పెట్టి
ప్రొద్దున ఉగ్గు పోసి - క్రిష్ణున్ని ఎదలోన పండవేసె
.
అంతలో కంస హితుడు - బండిరు- పై ఎదురుగా వచ్చెను
పాదములు రెండు పిడుగు -లావలె- దడదడా విసిరెనపుడు
వృషభమై వచ్చి నిలువ- ఒక్కలాగున- చంపివేసెనపుడు
.
చల్లమ్ము వారలెల్ల- ఈ కబురు చల్లగా చెప్పిరపుడు
రేపల్లె వాడలోను -ఉన్నత్తి- గోపికలు గుంపుకూడి
మా ఇల్లకొచ్చెనమ్మ - క్రిష్ణుడు- మము రవ్వ జేసెనమ్మ
తాళలేమమ్మ మేము- మీ సుతుడు- తాలిమితొ ఉండడమ్మ
మగనివలె పనులు సేయ -నీ సుతుడు మా ఇండ్లలోకి వచ్చు
.
ఇకనైన బుధ్ది చెప్పి- ఇంతిరో- పదిలమ్ము సేయుమమ్మ
అనుచు గట్టిగాను -మనమంత- గోపెమ్మ కడకు బోయి
చెపుదామనుచు వారు- గోపెమ్మ- చెంతకేగెనపుడు
.
గోపాల కృష్ణుడపుడు - అచ్చటనె- పాలు త్రాగుచూనుండెను
ఇదియేమి ఆశ్చర్యమే -ఓ చెలియ- ఇది యేమి చోద్యమమ్మ
చనుపాలను ద్రాగునే - క్రిష్ణుడు దొంగతనములు జేసునె
.
ఇకనేమి జేసునొ- మనంబులు- పాతవమ్మున వస్తివమ్మా
అమ్మ నేనెరుగనమ్మ- నా త్రోవ నే బోవుచుండగాను
నను రవ్వ జేసిరమ్మ- నేనెంత భయపడి వస్తినమ్మా
.
కొబ్బరికుడకలనుచు -గొబ్బున పిలువ బోవ
కొబ్బరికుడకలనుచు -గోపికలు గుబ్బలను జూపినారు
పౌర్ణమీ రోజులందు- జలజాక్షు-లందరూ కూడుకొని
.
చీరలటు తీసివేసి- గోపికలు జలకమాడుచునుండగా
తీసి ఉంచిన చీరలు- క్రిష్ణుడు వేసె ఆ పొన్న మీద
వేఇస్యు వేణు నాదం- వూదుచూ ఉండెనా మాధవుడు
.
జలకమ్ము చాలించియు -గోపికలు మన చీరలేమాయెనె
నమ్మరాదమ్మ క్రిష్ణుని- ఇకను ఈ చిన్న గొల్ల వాని ఎపుడు
ఎంత పని జేసెనమ్మ- ఓ చెలియ- ఏమి ఆశ్చర్యమమ్మ
వెదుకుచు కొందరుండీ- నీళ్ళలో - మునిగియుండిరి కొందరు
చనుపాలను ద్రాగునే - క్రిష్ణుడు దొంగతనములు జేసునె
ఇకనేమి జేసునొ- మనంబులు- పాతవమ్మున వస్తివమ్మా
అమ్మ నేనెరుగనమ్మ- నా త్రోవ నే బోవుచుండగాను
నను రవ్వ జేసిరమ్మ- నేనెంత భయపడి వస్తినమ్మా
కొబ్బరికుడకలనుచు -గొబ్బున పిలువ బోవ
కొబ్బరికుడకలనుచు -గోపికలు గుబ్బలను జూపినారు
పౌర్ణమీ రోజులందు- జలజాక్షు-లందరూ కూడుకొని
చీరలటు తీసివేసి- గోపికలు జలకమాడుచునుండగా
తీసి ఉంచిన చీరలు- క్రిష్ణుడు వేసె ఆ పొన్న మీద
వేఇస్యు వేణు నాదం- వూదుచూ ఉండెనా మాధవుడు
జలకమ్ము చాలించియు -గోపికలు మన చీరలేమాయెనె
.
నమ్మరాదమ్మ క్రిష్ణుని- ఇకను ఈ చిన్న గొల్ల వాని ఎపుడు
ఎంత పని జేసెనమ్మ- ఓ చెలియ- ఏమి ఆశ్చర్యమమ్మ
వెదుకుచు కొందరుండీ- నీళ్ళలో - మునిగియుండిరి కొందరు
అప్పుడూ గోపికలలో ఒక ఇంతి తా జూచె శ్రీక్రిష్ణుని
రారే ఓ అమ్మలారా- ఈ పొన్న మీదున్న క్రిష్ణుని
ఇవ్వరా మా చీరలు - ఓ క్రిష్ణ ఇవ్వరా మా రవికలు
.
దండంబు పెట్టెదరా- క్రిష్ణయ్య - దయయుంచి దయచేయరా
అందరూ ఒక చేతితో - దండంబు పెత్తగా చూచి తాను
పొందుగా మీరందరూ- దండంబు రెండు చేతుల బెట్టరే
ఎంథ పని వచ్చెననుచూ- గోపికలు మానభంగము నొందిరి
వసుదేవ తనయునకును- దండంబు రెండు చేతుల బెట్టిరీ
పొందుగా వలువలన్నీ- క్రిష్ణుడు పేరు పేరున ఇచ్చెను
నాయత్త తిట్టునేమొ- యనుచు- ఒకరితో వగచిరపుడు
మాయాడు బిడ్డ ఇపుడు -కొట్టునొ- నా బావ దండించునో
నా మగడు నన్ను బ్రతుక- నివ్వడు- నేనేమి జేతునమ్మ
(ఇక్కడి వరకే నాకు దొరికింది ..