Monday 19 February 2018

"పిసినారి ముసలివాడు"
ఊరివెలుపల పాడు కోనేరు చెంత
మనుజులెవ్వరు మసలని మారుమూల
గుట్టచాటున లోతైన గోయి త్రవ్వి
పసిడి దాచెను పిసినారి ముసలి యొకడు

ప్రతి దినంబును అచ్చటికేగుదెంచి
మురిసిపడుచుండె బంగారు ముద్ద జూసి
పొదల మాటున ఇదియెల్ల పొంచి జూసి
దొంగ యొక్కడు సర్వంబు దోచుకొనియె

మరుదినంబున ముసలివాడరుగుదెంచి
గోయి త్రవ్వంగ బంగారు మాయమయ్యె
నెత్తి నోరును లబలబా మొత్తుకొనుచు
గొల్లుమనియేడ్చి యతడు గగ్గోలు పెట్టె

అంత యాతని అరుపులు ఆలకించి
పరుగుపరుగున పొరుగువారరుగుదెంచి
ఏల ఏడ్చెద వీలీల నేలపొరలి
అనుచు ప్రశ్నింప ఈరీతి పనవె యతడు

ఏమి చెప్పుదు ముప్పది యేండ్లనుండి
కూడబెట్టిన ధనమెల్ల గోతిలోన
దాచి యుంచితి ఎవ్వడో తస్కరుండు
గోతిలోపలి ధనమెల్ల దోచుకొనియె

ప్రతి దినంబును ఇచ్చటికరుగుదెంచి
కాంచనంబును కాంక్షమై కంచు చుందు
ఏమి చేయుదు అక్కటా ఇంకమీద
అనుచు ఈరీతి పల్కుచు వగచి ఏడ్చె

ఇప్పుడైననుమించిన దేమి కలదు
గోయికలచోట ఒక పెద్ద బండపాతి
పసిడిగలదని భావించి ప్రతి దినంబు
కాంచుచుండుము నిత్యంబు కాంక్ష తీర

(ఎప్పుడో 5 వ తరగతి లో చదివిన "పిసినారి ముసలివాడు" పాఠం లోది. కవి ఎవరో తెలియదు)

సంధులు:
I.సంస్కృత సంధులు,II.తెలుగు సంధులు.

సంస్కృత సంధులు:

1. సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి

3. వృద్ధి సంధి

4. యణాదేశ సంధి

5. జశ్త్వ సంధి

6. శ్చుత్వ సంధి

7. అనునాసిక సంధి

8. విసర్గ సంధి

9. పరసవర్ణ సంధి

10. పరరూప సంధి

తెలుగు సంధులు:

1. ఉత్వ సంధి

2. ఇత్వ సంధి

3. అత్వ సంధి

4. యడాగమ సంధి

5. టుగాగమ సంధి

6. రుగాగమ సంధి

7. దుగాగమ సంధి

8. నుగాగమ సంధి

9. ద్విరుక్తటకార సంధి

10. సరళాదేశ సంధి

11. గ, స, డ, ద, వా దేశ సంధి

12. ఆమ్రేడిత సంధి

13. పుంప్వాదేశ సంధి

14. త్రిక సంధి

15. పడ్వాది సంధి

16. ప్రాతాది సంధి

17. లు, ల, నల సంధి

సంధులకు సంబంధించి ఒక పదాన్నిచ్చి దాన్ని సరిగా విడదీయమని అడుగుతారు. లేదా విభజించిన రూపాన్నిచ్చి సరిగా కలుపమని అడుగుతారు. సంధి సూత్రాలు రాయాల్సిన అవసరం లేకపోయినా అవగాహన కోసం సూత్రాలు తెలుసుకోవడం మంచిది.
సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
అ-ఇ-ఉ-ఋలకు అవే అచ్చులు పరమైనా వాటి దీర్ఘాలు ఏకాదేశమవడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు.
ఉదా:
రామ + ఆజ్ఞ = రామాజ్ఞ
మహి + ఈశుడు = మహీశుడు
గురు + ఉపదేశం = గురూపదేశం
పితృ + ఋణం = పితౄణం
2. గుణ సంధి: అకారానికి ఇ-ఉ-ఋలు పరమైతే క్రమంగా ఏ-ఓ-అర్‌లు ఏకాదేశ మవడాన్ని గుణసంధి అంటారు.
ఉదా: సూర్య + ఉదయం = సూర్యోదయం
మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు
ఇతర + ఇతర = ఇతరేతర
రాజ + ఋషి = రాజర్షి
3. వృద్ధి సంధి: అకారానికి ఏ, ఐలు పరమైతే ఐకారాన్ని; ఓ, ఔలు పరమైతే ఔకారాన్ని; ఋ, ౠలు పరమైతే ఆర్ ఏకాదేశమవడాన్ని వృద్ధి సంధి అంటారు. ఐ, ఔలను వృద్ధులు అంటారు.
ఉదా:
భువన + ఏక = భువనైక
అఖండ + ఐశ్వర్యం = అఖండైశ్వర్యం
పాప + ఓఘం = పాపౌఘం
పరమ + ఔషధం = పరమౌషధం
ఋణ + ఋణం = ఋణార్ణం
4. యణాదేశ సంధి: ఇ-ఉ-ఋలకు అసవర్ణా చ్చులు పరమైతే క్రమంగా య-వ-రలు ఆదేశమవడాన్ని యణాదేశ సంధి అంటారు. ‘‘ఇకోయణచిః’’ : ఇక్కులకు (ఇ-ఉ-ఋ) యణ్ణులు (య-వ-ర) పరమవుతున్నందు వల్ల ఇది యణాదేశ సంధి.
ఉదా:
జయంతి + ఉత్సవం = జయంత్యుత్సవం
హిందూ + ఆర్యులు = హింద్వార్యులు
పితృ + ఆర్జితం = పిత్రార్జితం
5. జశ్త్వ సంధి: క-చ-ట-త-పలకు అచ్చులు కానీ, హ-య-వ-ర-లు కానీ, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ, పరమైతే గ, జ, డ, ద, బలు ఆదేశమవడాన్ని జశ్త్వసంధి అంటారు.
ఉదా:
తత్ + అరణ్య భూములు = తదరణ్య భూములు
అచ్ + అంతం = అజంతం
వాక్ + ఈశుడు = వాగీశుడు
కకుప్ + అంతం = కకుబంతం
సత్ + భావం = సద్భావం
6. శ్చుత్వ సంధి: సకారత వర్గాలకు శకారచ వర్గాలు పరమైనప్పుడు శకారచ వర్గాలే ఆదేశమవడాన్ని శ్చుత్వ సంధి అంటారు.
(సకార-త థ ద ధ న) (త వర్గం)
(శకార - చ ఛ జ ఝ ఞ) (చవర్గం)
తపస్ + శమము = తపశ్శమము (స్(స)+శ= శ్శ)
సత్+చరిత్ర=సచ్ఛరిత్ర(త్ (త) - చ= చ్ఛ)
సత్+జనుడు= సజ్జనుడు (త్ (త)+జ= జ్జ)
విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి (త్ (త)+ శ=చ్ఛ)
7. అనునాసిక సంధి: వర్గ ప్రథమాక్షరాలకు (క-చ-ట-త-ప)‘న, మ’ అనునాసికాలు పర మైనప్పుడు ఆయా వర్గానునాసికాలు వికల్పంగా రావడాన్ని అనునాసిక సంధి అంటారు. మయాది ప్రత్యయాలకు నిత్యముగా వస్తాయి.
ఉదా:
వాక్ + మయం = వాఙ్మయం (క-ఙ=నిత్యం)
జగత్ + నాటకం = జగన్నాటకం = జగద్నాటకం (వికల్పం)
(అనునాసికం రానప్పుడు వర్గ తృతీయాక్షరం) (త-ద-వికల్పం)
మృట్ + మయం = మృణ్మయం, మృడ్మయం (టకు అనునాసికం రానప్పుడు డకారం వికల్పం)
8. విసర్గ సంధి: అకారం పూర్వముందున్న విసర్గకు వర్గ తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు అ-హ-య-వ-ర-లలు పరమైనప్పుడు విసర్గ - ఓకారంగా మారుతుంది. (వర్గ తృతీయాక్షరాలు- గ, జ, డ, బ, లు వర్గ చతుర్థాక్షరాలు (ఘ, ఝ, ఢ, ధ, భ, లు)
వర్గ పంచమాక్షరాలు: ఙ- ఞ- ణ- న-మ్ (అనునాసికాలు) హ-య-వ-ర-లలు పరమైనప్పుడు మాత్రమే విసర్గ ఓకారంగా మారుతుంది. కొన్నిసార్లు రేఫ వస్తుంది.
ఉదా:
అయః + మయం = అయోమయం (యః + మ = ఓ)
ఇతః + అధికం = ఇతోధికం (తః+అ = ఓ)
చతుః + ఆత్మ = చతురాత్మ (తుః + ఆ = ‘ర’ కారం వచ్చింది)
తపః ఫలము = తపఃఫలం (ఫ కారం వర్గ ద్వితీయాక్షరమైనందు వల్ల విసర్గలో మార్పు లేదు).
9. పర సవర్ణ సంధి: పదాంతం ముందున్న ‘త’ కారానికి లకారం పరమైనప్పుడు ‘ల’ కారమే ఆదేశంగా రావడాన్ని పర సవర్ణ సంధి అంటారు. (త్ - తకారానికి లకారం వస్తే ‘ల్ల’ కారం వస్తుంది)
ఉదా:
భగవత్ + లీల = భగవల్లీల (త్ + ల = ల్ల)
ఉత్ + లేఖనం = ఉల్లేఖనం (త్+లే = ల్లే)
విద్యుత్ + లత = విద్యుల్లత (త్ + ల = ల్ల)
సుహృత్ + లాభం = సుహృల్లాభం (త్ + లా = ల్లా)
10. పరరూప సంధి: హల్లుల్లోని అకారానికి అకారం పరమైతే రెండో పదంలోని మొదటి అచ్చు ఏకాదేశమవుతుంది. దీన్ని పరరూపసంధి అంటారు.
ఉదా:
సార + అంగము = సారంగము
(ర్ + అ = రకారంలోని అకారానికి ‘అ’ కారం పరమై రకారానికి దీర్ఘం వచ్చింది)
సీమ + అంతము = సీమంతము
(మ్ + అకారానికి అకారం పరమై అకార దీర్ఘం వచ్చింది)

తెలుగు సంధులు
1. ఉత్వ సంధి: ఉత్తునకచ్చుపరమైనప్పుడు సంధి నిత్యముగా వస్తుంది (హ్రస్వమైన ఉకారానికి మాత్రమే ఇది వర్తిస్తుంది)
ఉదా: రాముడు + అతడు = రాముడతడు (డు లోని ఉ కారానికి అకారం పరమై అకారం నిత్యంగా వచ్చింది)
ప్రథ‌మేత‌ర‌ విభక్తి శత్రర్థక చువర్ణంబులందున్న ఉకారానికి సంధి వైకల్పికం అవుతుంది.
ప్రథమా విభక్తి కాకుండా ఇతర విభక్తుల్లో శత్రర్థకమైన ‘చున్’ ప్రత్యయంలోని ఉకారానికి సంధి వైకల్పికమని అర్థం.
వైకల్పికమంటే ఒకసారి సంధి జరిగిన రూపం, మరోసారి సంధి జరగని రూపం సిద్ధిస్తుంది.
ఉదా:
నన్నున్ + అడిగె = నన్నెడిగె (సంధి జరిగిన రూపం)
నన్నునడిగె (సంధి జరగని రూపం)
2. ఇత్వ సంధి: ఇత్తునకు సంధి వైకల్పికం. ఏమ్యాదుల్లో ఇత్తునకు సంధి వైకల్పికం (ఏమి, మరి, అది, అవి, ఇది, ఇవి, కాన్) మొదలైనవి ఏమ్యాదులు.
ఉదా:
ఏమి + అంటివి:
ఏమంటివి, ఏమియంటివి
(సంధి జరిగిన) (సంధి జరుగని)
మధ్యమ పురుష క్రియలందిత్తునకు సంధి నిత్యం.
ఉదా: చూచితిరి + ఇపుడు = చూచితిరిప్పుడు
క్త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు.
భూతకాలిక అసమాపక క్రియ క్త్వార్థంబు
ఉదా: వచ్చి + ఇచ్చి = వచ్చియిచ్చి (సంధి లేనందువల్ల యడాగమ రూపం)
3. అత్వ సంధి: అత్తునకు సంధి బహుళం. బహుళమంటే నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్యవిధం అనే నాలుగు కార్యాలు ఉంటాయి.
నిత్యంగా జరిగేవి
ఉదా:
రామ + అయ్య = రామయ్య (నిత్యం)
సంధి జరగని నిషేధ రూపం
ఉదా:
దూత + ఇతడు = దూతయితడు (యడాగమ రూపం)
వైకల్పికంగా జరగడం: సంధి జరిగిన రూపం, సంధి జరగని యడాగమ రూపం రెండూ వస్తాయి.
ఉదా:
మేన + అల్లుడు = మేనల్లుడు (సంధి జరిగిన రూపం)
మేనయల్లుడు (సంధి జరుగని యడాగమ రూపం)
అన్యవిధం: సూత్రంలో సూచించని విధంగా కొన్ని హల్లులు వచ్చి చేరతాయి.
ఉదా:
తామర + ఆకు = తామరపాకు
పుగాగమం అన్య విధంగా వచ్చి చేరింది.
4. యడాగమ సంధి: సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు. సంధి జరిగే అవకాశం లేనప్పుడు పర స్వరానికి ముందు ‘య్’ కారం ఆగమంగా వచ్చి చేరుతుంది.
ఉదా:
వెల + (య్) ఆలు = వెలయాలు
మా + (య్) అమ్మ = మాయమ్మ
5. టుగాగమ సంధి: కర్మధాయంలో ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు టుగాగమంబగుతుంది.
వివరణ: నామవాచక, విశేషణాలకు సంబంధించిన సమాసం కర్మధారయ సమాసం. ఇందులో పరస్వరానికి ముందు ‘ట్’ కారం ఆగమంగా వస్తుంది.
ఉదా:
కఱకు+ (ట్) అమ్ము = కఱకుటమ్ము
కర్మధారయమున పేర్వాది శబ్దాలకు అచ్చు పరమైనప్పుడు టుగాగమంబువిభాషనగు.
పేర్వాదులు: పేరు, పొదరు, చిగురు, తలిరు.
ఉదా: పేరు + ఉరము = పేరుటురము (టుగాగగం రానప్పుడు)
6. రుగాగమ సంధి: కర్మధారయంబున ‘పేరాది’ శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు రుగాగమంబగు.
పేరాది శబ్దాలు: పేద, బీద, ముగ్ధ, కొమ, జవ, మనుమ, ఐదవ మొదలైనవి.
ఉదా:
పేద (ర్) + ఆలు = పేదరాలు
పరస్వరానికి ముందు ‘ర్’ కారం చేరి పేదరాలు రూపం వచ్చింది.
మనుమ(ర్) + ఆలు = మనుమరాలు
కర్మధారయంబున తత్సమ పదాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు అత్వంబునకు ఉత్వంబు రుగాగమవుతుంది.
(తత్సమ శబ్దాలు: ధీర, గుణవంత, ధనవంత, సంపన్న, గంభీర, ధైర్యవంత మొదలైనవి)
ఉదా:
ధీర + ఆలు = ధీరు+ ర్ + ఆలు = ధీరురాలు
గుణవంత + ఆలు = గుణవంతు + ర్ +ఆలు= గుణవంతురాలు
7. దుగాగమ సంధి: నీ- నా- తన శబ్దాలకు ఉత్తర పదంబు పరమైనప్పుడు దుగాగమంబు విభాషనగు.
ఉదా:
నా + (దు) విభుడు = నాదువిభుడు (సంధి జరిగిన రూపం)
నా విభుడు (సంధి జరగని రూపం)
తన + (దు) కోపం = తనదు కోపం ( సంధి జరిగిన రూపం)
తన కోపం (సంధి జరగని రూపం)
8. నుగాగమ సంధి: ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చుపరమైనప్పుడు నుగామమంబగు.
తద్ధర్మార్థకాలు: భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో జరిగే క్రియలు. హ్రస్వమైన ఉకారం చివర ఉన్న తద్ధర్మార్థక క్రియలకు అచ్చుపరమైతే నుగాగమం వస్తుందని సూత్రార్థం.
ఉదా:
చేయు + (న్) ఎడ = చేయునెడ
వ్రాయు + (న్) అది = వ్రాయునది
షష్ఠీ తత్పురుష సమాస మందలి ఉకార, ఋకారంబులకు అచ్చుపరమైనప్పుడు నుగాగమంబగు.
ఉదా:
రాజు + (న్) ఆనతి = రాజునానతి
చెరువు + (న్) ఉదకం = చెరువునుదకం
9. ద్విరుక్తటకార సంధి: కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ‘ఱ, డ’లకు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్తటకారం ఆదేశమవుతుంది.
ఉదా:
కు (ఱు) (ట్ట్)+ ఉసురు = కుట్టుసురు
చిఱు + (ట్ట్) ఎలుక = చిట్టెలుక
కడు + (ట్ట్) ఎదురు = కట్టెదురు
నడు + (ట్ట్) ఇల్లు = నట్టిల్లు
నిడు + ఊర్పు = నిట్టూర్పు
వివరణ: ద్విరుక్తటకారమంటే ద్విత్వటకారమని అర్థం. ద్విత్వటకారం ఆదేశంగా వచ్చి ఈ రూపాలు వచ్చాయి.
10. సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు సరళములగు.
ఉదా: పూచెను + కలువలు, పూచెను గలువలు: పరుషమైన కకారం సరళంగా (గ) మారింది.
ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషణలు విభాషనగు. పూచెను + గలువలు - పూచెంగలువలు; పూచెన్గలువలు: పూచెనుగలువలు, పూచెగలువలు అనే నాలుగు రూపాలు వస్తాయి. సమాసములందు స్వత్వ సంశ్లేషణ రూపాలుండవు. అర సున్నా రూపం మరో సూత్రంతో నిషేధానికి గురైంది. ‘పూచెంగలువలు’ అనే ఒక్క రూపం మాత్రమే మిగులుతుంది.
11. గ, స, డ, ద, వా దేశ సంధి:
1. ప్రథమం మీది పరుషాలకు గ, స, డ, ద, వలు బహుళముగానగు. ప్రథమావిభక్తిలో ఉన్న పదాలకు పరమైన పదాల్లో ఉన్న పరుషాలకు (కచటతపలకు క్రమంగా గ, స, డ, వలు) బహుళంగా వస్తాయి.
ఉదా:
వాడు + కొట్టె = వాడు గొట్టె
అపుడు + చనియె = అపుడుసనియె
2. ద్వంద్వ సమాసాల్లో పదాలపై పరుషాలకు గ, స, డ, ద, వలు ప్రాయికంగా వస్తాయి.
ఉదా: తల్లి + తండ్రి = తల్లిదండ్రులు
3. తెనుగుల మీది సాంస్కృతిక పరుషాలకు గ, స, డ, ద, వలు రావు. తెలుగు పదాలకు పరంగా వచ్చిన తత్సమ పదాల్లోని పరుషాలకు గ, స, డ, ద, వలు రావు.
ఉదా:
వాడు + కంసారి = వాడు కంసారి
వీడు + చక్రపాణి = వీడు చక్రపాణి
(ఈ ఉదాహరణలో క, చ అనే పరుషాలకు గ,స,లు రాలేదు)
12. ఆమ్రేడిత సంధి:
1. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగానగు. ద్విరుక్తం పదరూపం ఆమ్రేడితం. ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్ఛరించినప్పుడు రెండోసారి ఉచ్ఛరించినదాన్ని ఆమ్రేడితమంటారు.
ఉదా:
ఔర + ఔర (ఆమ్రేడితం) ఔరౌర
ఆహా + ఆహా = ఆహాహా
2. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా అదంతంబగు ద్విరుక్తటకారంబగు (కడాదులు: కడ, చివర, తుద, మొదలు, తెరువు, నడుమ మొదలైనవి)
ఉదా:
క(డ)ట్ట + కడ = కట్టకడ
చివ(ట్ట)ర + చివర = చిట్టచివర
కడాదుల్లో తొలి అచ్చు తర్వాత వర్ణాలన్నింటికీ లోపం వచ్చి వాటి స్థానంలో అదంతమైన ద్విత్వట్టకారం వచ్చింది.
3. అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగా గ్రాహ్యములు.
ఉదా:
అందుకు + అదుకు = అందదుకు
చెర + చెర = చెచ్చెర లాంటి రూపాలు యథావిథిగా గ్రహించవచ్చని చిన్నయ సూరి అభిప్రాయం.
13. పుంప్వాదేశ సంధి: కర్మధారయమందలి ము వర్ణానికి ‘పుంపు’లగు ము వర్ణానికి ‘పువర్ణం’ బిందు పూర్వక పువర్ణం (ంపు) రెండు రూపాలు వస్తాయి.
ఉదా:
సరసము + మాట = 1. సరసపు మాట 2. సరసంపు మాట
విరసము + వచనం = 1. విరసపు వచనం 2. విరసంపు వచనం
14. త్రిక సంధి:
1. ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను త్రికములు అంటారు. ఉదా: ఆ + కన్య
2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఉదా: ఆ + క్కన్య
3. ద్విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు ఆచ్ఛికంబగు దీర్ఘం హ్రస్వం అవుతుంది.
ఉదా: ఆ + క్కన్య = అక్కన్య మూడు సూత్రాలతో - అక్కన్య రూపం వస్తుంది.
  శ్లేషాలంకారము

లక్షణం: నానార్థ సంశ్రయః శ్లేషః వర్ణ్యా వర్ణ్యోభయాశ్రితః
వివరణ: రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలను ఆశ్రయించుకుని ఉండటాన్ని శ్లేష (కౌగిలి) అలంకారం అందురు.

ఒకే వాక్యానికి అనేక అర్థాలు ఉంటే దాన్ని శ్లేషాలంకారం అంటారు. సాధారణంగా ఇది వ్యంగ్యానికి, కఱ్ఱ విరగకుండా పామును చంపడానికి వాడుతూ ఉంటారు. కానీ, దీనిని సదుద్దేశంతో, స్తుతి చేయడానికి వాడిన సందర్భాలు మన సాహిత్యంలో కోకొల్లలు.

"మీరు మా కుమారులు",
"మీరు మాకు మారులు"
చిత్రాంగి అన్నది, సారంగధరుని తో. దీన్ని కూడా శ్లేషాలంకారానికి ఉదాహరణగా వాడతారు.

త్యాగరాజ స్వామి "మారు బల్క కున్నావేమిరా, మా మనోరమణ" (మా= లక్ష్మి, మా= మాకు) అన్న దగ్గరా శ్లేష వాడారేమో అనిపిస్తుంది.
శారద
2సాగర సంగమం సినిమా లో "పార్వతీపరమేశ్వరౌ" అన్న పదాన్ని బాలు "పార్వతీప - రమేశ్వరౌ" అని విడకొడితే ఏదో పైత్యం తోనో tune కోసమో విడగొట్టారని అనుకున్న. శ్లేష ఉందని ఇప్పుడు తెలిసింది.
3.పతివ్రతకు పరపతితో పనేముందో?

వి:- పరపతి అనే పదాన్ని రెండు అర్థాలలో వాడవచ్చును. ఒకటి - పరుల పతి అని, రెండు -ప్రతిష్ట అని. పతివ్రతకు పరుల పతి మీదకు మనసు పోకూడదని ఒక అర్థమైతే, పతివ్రతకు పేరుప్రతిష్టల మీద కాక పతి మీద దృష్టి ఉండాలని మఱొక అర్థం.
4.
ఉదా:- (రఘువంశం, రచన: కాళిదాసు)
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

వి:- ఈ వాక్యానికి అర్థం "జగత్తునకు తండ్రులు (తలిదండ్రులు) అయిన పార్వతీ-పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను" అని. కానీ, పార్వతీపరమేశ్వరౌ అనే సంధిని మఱొక విధంగా విడదీయవచ్చును - పార్వతీప (పార్వతీ దేవి పతి), రమేశః (రమాదేవికి ప్రభువు) అంటే "జగత్తునకు తండ్రులైన శివకేశవులకు నమస్కారములు" అనే అర్థంతో కూడా చదువవచ్చును.

లక్షణం: నానార్థ సంశ్రయః శ్లేషః వర్ణ్యా వర్ణ్యోభయాశ్రితః
వివరణ: రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలను ఆశ్రయించుకుని ఉండటాన్ని శ్లేష (కౌగిలి) అలంకారం అందురు.

ఒకే వాక్యానికి అనేక అర్థాలు ఉంటే దాన్ని శ్లేషాలంకారం అంటారు. సాధారణంగా ఇది వ్యంగ్యానికి, కఱ్ఱ విరగకుండా పామును చంపడానికి వాడుతూ ఉంటారు. కానీ, దీనిని సదుద్దేశంతో, స్తుతి చేయడానికి వాడిన సందర్భాలు మన సాహిత్యంలో కోకొల్లలు.

"మీరు మా కుమారులు",
"మీరు మాకు మారులు"
చిత్రాంగి అన్నది, సారంగధరుని తో. దీన్ని కూడా శ్లేషాలంకారానికి ఉదాహరణగా వాడతారు.

త్యాగరాజ స్వామి "మారు బల్క కున్నావేమిరా, మా మనోరమణ" (మా= లక్ష్మి, మా= మాకు) అన్న దగ్గరా శ్లేష వాడారేమో అనిపిస్తుంది.
శారద
2సాగర సంగమం సినిమా లో "పార్వతీపరమేశ్వరౌ" అన్న పదాన్ని బాలు "పార్వతీప - రమేశ్వరౌ" అని విడకొడితే ఏదో పైత్యం తోనో tune కోసమో విడగొట్టారని అనుకున్న. శ్లేష ఉందని ఇప్పుడు తెలిసింది.
3.పతివ్రతకు పరపతితో పనేముందో?

వి:- పరపతి అనే పదాన్ని రెండు అర్థాలలో వాడవచ్చును. ఒకటి - పరుల పతి అని, రెండు -ప్రతిష్ట అని. పతివ్రతకు పరుల పతి మీదకు మనసు పోకూడదని ఒక అర్థమైతే, పతివ్రతకు పేరుప్రతిష్టల మీద కాక పతి మీద దృష్టి ఉండాలని మఱొక అర్థం.
4.
ఉదా:- (రఘువంశం, రచన: కాళిదాసు)
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

వి:- ఈ వాక్యానికి అర్థం "జగత్తునకు తండ్రులు (తలిదండ్రులు) అయిన పార్వతీ-పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను" అని. కానీ, పార్వతీపరమేశ్వరౌ అనే సంధిని మఱొక విధంగా విడదీయవచ్చును - పార్వతీప (పార్వతీ దేవి పతి), రమేశః (రమాదేవికి ప్రభువు) అంటే "జగత్తునకు తండ్రులైన శివకేశవులకు నమస్కారములు" అనే అర్థంతో కూడా చదువవచ్చును.
ఛందస్సు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
మహాక్కర
మధ్యాక్కఱ
మధురాక్కర
అంతరాక్కర
అల్పాక్కర
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము మరియు సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడా ఉంది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.

విషయ సూచిక

వేద ఛందస్సు

వేదాలలో ముఖ్యంగా అనుష్టుప్ (8 అక్షరములు), బృహతి (9), పంక్తి (10), త్రిష్టుప్ (11), జగతి (12) అనబడు ఛందములను ఉపయోగించారు. మిక్కిలి ప్రఖ్యాతి గడించిన ఛందస్సు త్రిపద గాయత్రీ ఛందస్సు. అది తత్సవితుర్వరేణియం భర్గోదేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్. కొందరు మొదటి పాదములో వరేణ్యం అంటారు. అప్పుడు గాయత్రి ఛందస్సుకు 23 అక్షరాలే. ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకత.

ఛందస్సు వేదాంగమైనప్పటికీ, వేద ఛందస్సును వివరించే గ్రంథాలేవీ ప్రస్తుతము లభ్యము కావట్లేదు. ఛందో శాస్త్రముపై ప్రస్తుతం లభ్యమవుతున్న అత్యంత పురాతనమైన గ్రంథము ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన పింగళుడు రచించిన ఛందస్ శాస్త్ర. ఇది వేద సంస్కృతము మరియు పురాణ సంస్కృతముల సంధికాలమునకు చెందినది. హిందూ పౌరాణికంలో ఈశ్వరుడు పార్వతికి ఛందస్సును బోధిస్తుండగా దానిని విని పింగళాచార్యుడు ఛందస్సు శాస్త్రమును వ్రాసినాడని అంటారు. పింగళుడు ఇప్పటి కర్ణాటక దేశ వాసుడని ప్రతీతి.

ఆ తరువాత మధ్యయుగపు తొలినాళ్లలోని ఛందస్ శాస్త్రపై ఆధారితమైన అగ్ని పురాణము, భారతీయ నాట్య శాస్త్రంలోని 15వ అధ్యాయము మరియు బృహత్‌సంహిత యొక్క 104 అధ్యాయములు ఛందస్సుపై లభ్యమవుతున్న వనరులు. 14వ శతాబ్దములో కేదారభట్టు రాసిన వ్రిత్తరత్నాకర ఛందస్సుపై ప్రసిద్ధి చెందిన గ్రంథమైనప్పటికీ వేద ఛందస్సును చర్చించదు.



తెలుగు ఛందస్సు

పాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపుంది చందస్సు అనబడును. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని సినిమా పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు.

గురువులు, లఘువులు

ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు మరియు లఘువు. గురువుని U తోటీ, లఘువుని | తోటీ సూచిస్తారు

గురువు, లఘువు, విభజించడము

ఈ గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందు మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలూ ఒక్కొక్కటీ ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అ ఒక లిప్త కాలము ఆ తరువాతి మ్మ అక్షరము రెండు లిప్తల కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అందురు.

కొన్ని నియమాలు

దీర్ఘాలన్నీ గురువులు, ఉదాహరణకు ఆట = U I
"ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)
ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )
సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)
ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు)




గణాలు-రకాలు .

అక్షరాల గుంపును గణము అని అంటారు.ఇవి నాలుగు రకాలు 1. ఏకాక్షర గణాలు .2. రెండక్షరాల గణాలు 3. మూడక్షరాల గణాలు 4.నాలుగాక్షరాల గణాలు.

ఏకాక్షర గణాలు

ఒకే అక్షరం గణం గా ఏర్పడుతుంది.అది గురువు లేదా లఘువు కావచ్చు.

U l

ఉదా: శ్రీ ల


రెండక్షరాల గణాలు

రెండు అక్షరాలు కలిసి గణం గా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1. లలము 2. లగము ( వ గణం ) 3. గలము ( హ గణం ) 4.గగము.

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ లేదా వ IU ఉదా: రమా
గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్
మూడక్షరాల గణాలు
ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు
అన్ని గణాలు:

ఆది గురువు భ గణము UII
మధ్య గురువు జ గణము IUI
అంత్య గురువు స గణము IIU
సర్వ లఘువులు న గణము III
ఆది లఘువు య గణము IUU
మధ్య లఘువు ర గణము UIU
అంత్య లఘువు త గణము UUI
సర్వ గురువులు మ గణము UUU
ఇవి మూడక్షరముల గణములు



ఉపగణాలు
ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు
సూర్య గణములు
న = న = III
హ = గల = UI
ఇంద్ర గణములు
నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI
చంద్ర గణములు
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = ౹౹౹౹
ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి మరియు ప్రాస నియము ఉంటాయి.

ఉత్పల మాల

భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ
స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్.

లక్షణములు

పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20
ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ
యతి : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము
ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.
గణవిభజన

ఉత్పలమాల వృత్త పాదము నందు గణవిభజన

U I I U I U I I I U I I U I I U I U I U
పుణ్యుడు రామచం ద్రుడట పోయిము దంబున గాంచెదం డకా
ఉదాహరణలు

పోతన తెలుగు భాగవతంలో 475 ఉత్పలమాల వృత్త పద్యాలను వాడారు. వాటిలో రెండింటిని ఉదాహరణగా ఇక్కడ.

ఉదాహరణ 1:
పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా
రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.

ఉదాహరణ 2
ఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా
మోహలతా నిహద్దపదమున్ విడిపించుకొనంగ లేక సం
దేహముబోదు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ
గ్రాహదురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమైన్.

తిక్కన చెప్పిన ప్రసిద్ధమైన పద్యం సారపు ధర్మమున్ విమల సత్యము ఉత్పలమాలకు మరొక ఉదాహరణ
ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి మరియు ప్రాస నియము ఉంటాయి.






చంపకమాల

నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్.


లక్షణములు

పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21
ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
యతి : ప్రతిపాదంలోనూ 11 వ అక్షరము
ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
గణ విభజన
చంపకమాల వృత్త పాదము యొక్క గణ విభజన

I I I I U I U I I I U I I U I I U I U I U
పదము లబట్టి నందల కుబా టొ కయింత యులేక శూరతన్
ఉదాహరణ సవరించు
పోతన తెలుగు భాగవతంలో 486 చంపకమాల వృత్త పద్యాలను వాడారు.

పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్

మదగజవల్లభుండు మతిమంతుడు దంతయు గాంత ఘట్టనం

జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్

వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్.




శార్దూలం

సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్

లక్షణములు

శార్థూలం వృత్తమునందు గణములు

U U U I I U I U I I I U U U I U U I U
తా టం కా చ ల నం భు తో, భు జ న ట ద్ద మ్మి ల్ల బం డం బు తో
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19
ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గ
యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము
ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణలు

తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బండంబుతో,
శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా
లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో
గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్,

భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్
హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని
స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.


మత్తేభము

నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా

లక్షణములు

మత్తేభము వృత్తమునందు గణములు

I I U U I I U I U I I I U U U I U U I U
సి రి కిం జె ప్ప డు శం ఖ చ క్ర యు గ ముం జే దో యి సం ధిం ప డే
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య = 20
ప్రతిపాదంలోని గణాలు: స, భ, ర, న, మ, య, వ
యతి : ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము
ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణలు

సవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా
నవలీలం దునుమాడె రాము డదయుండై బాలుడై కుంతల
చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకన్ దాటకన్.

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
ఉపసర్గాః-1

ఈ పదాలను గమనించండి–

1. వాదం, వివాదం, సంవాదం, ప్రతివాదం,అపవాదం, అభివాదం

2. వచనం, నిర్వచనం, ప్రవచనం,ప్రతివచనం, అనువచనం

3. యోగం, సంయోగం, వియోగం,ప్రయోగం, అభియోగం,

4. విచారం, ప్రచారం, సంచారం, ఉపచారం,ఆచారం, అపచారం, అభిచారం.

5. ఉత్పత్తి, ఆపత్తి, ప్రపత్తి, ప్రతిపత్తి,ఉపపత్తి, సంపత్తి, నిష్పత్తి

మనం గమనిస్తే ఈ పదాలలో ఒక ప్రారంభిక పదాంశం మాత్రం మారుతున్నది. (ఉదా– 4వ దానిలో- మొదట్లో ఉన్న ‘వి’, ‘ప్ర’, ‘సం’ మాత్రం మారినవి. చివర మాత్రం ‘చారం, చారం’ అని వస్తున్నది.) తరువాత పదాంశం అట్లగే ఉంటున్నది. మారిన అంశం వల్ల పదం అర్థంలో రకరకాలుగా మార్పు వస్తున్నది. ఔనా? అంటే ‘విచారం’ వేరు, ‘ప్రచారం’ వేరు. ‘చారం’ ఒకటే అయినా ‘వి’, ‘ప్ర’ వల్ల అర్థంలో మార్పు ఉన్నది.

ఇట్ల ఒక పదానికి ముందు వచ్చి చేరే పదాంశాన్ని ‘ఉపసర్గ’ అంటారు. ఉపసర్గలు మొత్తం 20, లేదా 22. అవి– ప్ర, పరా, అప,సమ్‌, అను, అవ, నిస్‌, నిర్‌, దుస్‌, దుర్‌, వి, ఆ (ఆఙ్‌), ని, అధి, అపి, అతి, సు, ఉత్/ఉద్‌, అభి,ప్రతి, పరి, ఉప। ( కొందరు నిస్/నిర్, దుస్/దుర్ ని రెండు ఉపసర్గలుగా కాక ఒకటిగానే చెప్తారు.)

అయితే తెలుగులో మనం ఉపసర్గలను విడిగా చూడము. తెలుగువారు సంస్కృతం నుండి పదాలను తీసుకునేటప్పుడు వాటిని ఉపసర్గ సహితంగా తీసేసుకొన్నారు. కనుక ఈ 22 ఉపసర్గలు వారికి ప్రత్యేకించి వేరే పదాంశాలన్న సంగతి తెలిసే అవకాశం లేదు. కొంత అభ్యాసం చేసి, ఒక పదంలో వాటిని విడిగా తెలుసుకుని, మిగిలిన పదం మూలధాతువు అని గ్రహించాలి.

ఉపసర్గలు చేరినప్పుడు ధాతువును ‘సోపసర్గక ధాతువు’ అనవచ్చు. ఒకసారి ఉపసర్గ చేరాక ఇంక అర్థంలో మార్పు వచ్చింది కనుక ఆ ధాతువును ప్రత్యేకంగానే చూడాలి. ఉపసర్గ లేనిది సామాన్యధాతువు లేదా మౌలికధాతువు, లేదా కేవలధాతువు.

కొన్ని సోపసర్గకధాతువులు క్రియాపదాలను మాత్రమే తయారు చేస్తాయి. కొన్ని నామపదాలను మాత్రమే చేస్తాయి. (పైన మనం చూసినవన్నీ నామపదాలే. క్రియాపదాలు మున్ముందు చూస్తాము.)

సంస్కృతపాఠమాల 4.2

ఉపసర్గాః -2

అయితే అన్నిసార్లూ మాత్రం ప్రారంభంలో చేరిన ఉపసర్గ వల్ల పదం అర్థంలో మార్పు ఉండదు. ఒక్కొక్కసారి ఏ అర్థం మూలధాతువుదో అదే అర్థం సోపసర్గక ధాతువుదీ అవుతుంది.

ఉదా– రక్షణ, సంరక్షణం, పరిరక్షణం ; శుభ్రం,పరిశుభ్రం ; దీప్తి, ప్రదీప్తి, సందీప్తి ; లుప్తం,విలుప్తం ;

అన్నింటి అర్థం రక్షణమనే. ఉపసర్గల సంయోగం కలిగిన ధాతువులలో మూడు రకాల చర్యలు కనిపిస్తాయి–

1. ధాతువు అర్థం పూర్తిగా మారుతుంది. ఉదా– లయం, ప్రలయం, విలయం, ఆలయం,

ప్రసిద్ధ ఉదా– విహారం, ఆహారం, సంహారం,ఉపహారం, పరిహారం, ప్రహారం, నీహారం– వీటిలో దాదాపుగా ఒక పదానికి ఇంకొక పదానికి పొంతన లేదు.

2. ఏమీ జరగకుండా అదే అర్థం ఉండిపోతుంది. ఉదా– యానం, ప్రయాణం ; దానం, ప్రదానం ; లక్షణం, విలక్షణం.

3. ఏదో విశేషార్థం వస్తుంది. ఉదా– గ్రహం,విగ్రహం ఆగ్రహం పరిగ్రహం సంగ్రహం అవగ్రహం ఉపగ్రహం ప్రగ్రహం (పగ్గము) నిగ్రహం ప్రతిగ్రహం– వీటన్నింటిలో ‘పట్టుకోవటం’ అనే అర్థం ఏదో విధంగా నిలిచి ఉంది. కేవలం ఆ అర్థానికి ఏదో ఒక విశేషత్వం చేరింది.

ఒక ధాతువుకు ముందు ఒకటికన్నా ఎక్కువ ఉపసర్గలు కూడా ఉండవచ్చు. ఉదా– అవమానం (అవ-మానం, 1), వ్యవధానం (వి-అవ-ధానం, 2) ; దుర్వ్యవహారం (దుర్-వి-అవ-హారం, 3). సంస్కృతంలో ధాతువుకు ఉపసర్గ చేరినదని చూపించే విధానం ఒక చిన్న అడ్డగీత పెట్టటం. ఉదా–

హస్– అప-హస్, పరి-హస్, ఉప-హస్, అవ-హస్, ప్ర-హస్, వి-హస్

వహ్– ప్ర-వహ్, సం-వహ్, నిర్-వహ్, వి-వహ్, ఆ-వహ్, ఉద్-వహ్, పరి-వహ్, ఉప-వహ్

వ్యవహారానికై ఉపసర్గల అర్థాలు ఇట్లా చెప్పుకోవచ్చు–

ప్ర, - ముందు, గొప్ప

పరా, - విరుద్ధం,

అప, - చెడు, తప్పు

సమ్‌, - కలుపుకుని

అను, - వంటి, వెంట, వెనక

అవ, - కింది, అధమ, నుండి

నిస్‌, నిర్‌, - లేని, పోయిన

దుస్‌, దుర్‌, - చెడు, కష్టమైన

వి, - విశేషం, విభాగం

ఆ, - మొత్తం, అంతా

ని, - అందు, కింద

అధి, - పైన, పెద్ద

అపి, - కూడా

అతి, - దాటి, మించి

సు, - మంచి

ఉత్/ఉద్‌, - పైకి, ఎత్తు

అభి, - దగ్గర, వద్ద

ప్రతి, - తిరిగి, మళ్ళీ

పరి, - అన్నివైపులా

ఉప – వద్ద, దగ్గర

సంస్కృతపాఠమాల 4.3

చతుర్థగణధాతవః

ఈ క్రియాపదాలను గమనించండి–

     నశ్ – నశ్యతి – నశ్-య-తి

     పుష్ – పుష్యతి – పుష్-య-తి

పురుషప్రత్యయాలు జోడించినప్పుడు కలిగే మార్పులను బట్టి, సంస్కృతధాతువులు పదిగణాలలోకి విభజించారని చెప్పుకున్నాము కదా- ఆ గణాలలో నుండి చతుర్థ గణమైన దివాదిగణాన్ని ఇప్పుడు చూద్దాం. దివాది అంటే దివ్-ధాతువు ఆదిగా గల గణం. ఆ గణంలో ధాతువులు అన్నీ ఒకతీరైన రూపాలను కలిగి ఉంటాయి
*షట్ప్రత్యయములు*
🖋ప్రత్యయమనగా ప్రమాణం.
🖋పద్య గణోత్పత్తికి ప్రమాణమే ప్రత్యయము.
🖋ప్రత్యయములు 6 విధములు.
      📜ప్రస్తారము
       Ul అష్టలబ్ది
       ⌨ఉద్దిష్టము
       🔢వృత్తసంఖ్య
      🔲అధ్వభాగము
      📶లఘక్రియ

          *ప్రస్తారము*
క.చాలుగను సర్వగురువిడి
     లాలితముగ గురువు క్రింద ▪లఘువు వలపటన్
ఓలి సమంబులు దాపలి
వ్రాలకు గురువులను నిల్ప ప్రస్తారమగున్.

ఇచ్చిన ఛందస్సు నుండి ఎన్ని వృత్తాలు పుట్టాయి, వాటి గణములు చెప్పువిధం.
*ఉదా.*5 వ చందము యొక్క ప్రస్తారము....
2 4 8 16 32....32 వృత్తాలు ఉంటాయి.

1 .  U U U U U
2.   I  U U U U
3.   U I U U U
4.    I  I U U U
5.    U U I U U
6.     I U I U U
7.     U I I U U
8.     I  I  I U U
9.    U U U I U
10.   I U U I U
11.   U I U I U
12.    I  I U I U
13.    U U I I U
14.    I  U I I U
15.    U  I I I U
16.    I  I  I  I U
17.     U U U  I
18.    I U U U I
19.     U I U U I
20.     I  I U U I
21.     U U I U I
22.     I U I U I
23.     U I I U I
24.      I I I U  I
25.     U U U I I
26.     I U U I  I
27.     U I U I  I
28.     I I U  I  I
29.     U U I I  I
30.      I U I  I I
31.     U I  I I  I
32.     I  I  I  I  I

1/1, 2/2, 4/4, 8/8, 16/16.

*2.అష్టలబ్ధి*
ఇచ్చిన ఛందమున ఇన్నవ వృత్తమునకు ఏ ఏ గణాలు వస్తాయో చెప్పు విధం.
  *ఉదా.* 6వ ఛందములోని 10వ వృత్తము నకు వచ్చే గణాలు.
6వ ఛందములో 6 అక్షరాలు ఉంటాయి.
   1.  2| 10 ........I
           -------
    2.   2 | 5.........U
            + 1
             ------
           2 | 6
             ------
     3.       3.......U
             +1
             ------
            2| 4
            ------
      4.     2 | 2.....I
                ------
      5.         1.....U
                 +1
                 ------
                 2| 2
                   -------
      6.            1....U
*3.ఉద్దిష్టము*
ఈ గణములు గల వృత్తము ఏ ఛందములోనిది? ఎన్నవ వృత్తము? అని తెలుసుకొనుట.
....ఇచ్చిన వృత్తము నందలి గురులఘువులను వరుసగా వ్రాసుకొని వాటి క్రింద 1,2,4,8,16,32.... వేసుకుని అందు లఘువుల క్రింది సంఖ్యలను కూడి 1 కలపాలి. అప్పుడు అది ఎన్నవ వృత్తమో తెలుస్తుంది.
*ఉదా.*
     I   U   U    I    U    U
     1   2   4    8  16  32
1+8=9+1= 10 అది పదవ వృత్తము.
 *4.వృత్తసంఖ్య*
ఎన్నవ ఛందమున ఎన్ని వృత్తములు పుట్టినవో తెలుసుకొనుట.
*ఉదా*
     8 వ ఛందమున ఎన్ని వృత్తములు పుట్టినవి ?
     1... 2
      2....4
      3...8
      4...16
      5...32
      6....64
       7...128
       8...256 వృత్తములు పుట్టినవి.
 *5.అధ్వభాగము*
ఇచ్చిన ఛందమున అడిగిన వృత్తమును వ్రాయడానికి కావలసిన ప్రస్తారము నకు ఎంత స్థలం కవలెనో తెలుసుకొనుట.
*ఉదా*
5వ ఛందమున 11వృత్తం ను వ్రాయడానికి  ఎంత స్థలం కావలెను?
  5x2 - 1= 9  అం. వెడల్పు.
  11x2-1=21 అం. పొడవు.
*6.లఘక్రియ*
 1
2  3   5  9  17
4  7  13 25 6 11 21 10 19 18
8 15 29 14 27 26 12 23 22 20
16 31 30 28 24
32
1వ వరుస. సర్వ లఘువు
2వ వరుస. 1లఘు వృత్తముల నెం.
3వ వరుస. 2లఘువులు గల వృత్తముల నెం.
4వ వరుస. 2గురువు ల వృత్తముల నెం.లు
5వ వరుస. 1గురువు గల వృత్తముల నెం.లు.
6వ వరుస. సర్వ గురు వృత్తముల నెంబర్లు.
[31/01, 7:13 PM] వల్లూరు మురళీ: *విద్యున్మాలా* పద్య లక్షణములు

ఈ పద్య ఛందస్సుకే *విద్యుల్లేఖా* అనే ఇతర నామము కూడా కలదు.
# వృత్తం రకానికి చెందినది
# అనుష్టుప్పు ఛందమునకు చెందిన 1 వ వృత్తము.
# 8 అక్షరములు ఉండును.
# 16 మాత్రలు ఉండును.
# మాత్రా శ్రేణి: U U U - U U U - U U
# చతుర్మాత్రా శ్రేణి: U U - U U - U U - U U
# షణ్మాత్రా శ్రేణి: U U U - U U U - U U
# 4 పాదములు ఉండును.
# ప్రాస నియమం కలదు
# ప్రతి పాదమునందు 5 వ అక్షరము యతి స్థానము
# ప్రతి పాదమునందు మ , మ , గా(గగ) గణములుండును.
*ఉదాహరణలు:*
మాద్యద్భక్తిన్‌ మాగాయుక్తిన్‌
విద్యున్మాలా వృత్తం బొప్పన్‌
చైద్యధ్వంసిన్‌ సంబోధింపన్‌
సద్యశ్శ్రేయోజాతంబయ్యెన్‌.
వల్లూరు మురళీ: *అనుష్టుప్పు (8)*

చిత్రపదము పద్య లక్షణములు

# వృత్తం రకానికి చెందినది
# అనుష్టుప్పు ఛందమునకు చెందిన 55 వ వృత్తము.
# 8 అక్షరములు ఉండును.
# 12 మాత్రలు ఉండును.
# మాత్రా శ్రేణి: U I I - U I I - U U
# చతుర్మాత్రా శ్రేణి: U I I - U I I - U U
# షణ్మాత్రా శ్రేణి: U I I U - I I U U
# మిశ్రగతి శ్రేణి (3-4) : U I - I U I - I U - U
# 4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
# ప్రతి పాదమునందు భ , భ , గా(గగ) గణములుండును.
*ఉదాహరణలు:*
1.వారక భాగురుయుగ్మం
బారఁగఁ జిత్రపదాఖ్యం
జేరిన వేడ్కఁ గవీంద్రుల్‌
గోరి నుతింతురు శౌరిన్‌.

2.కూడియు మున్నుగఁదోచిన్
వాఁడిశరంబున దూయున్
బోడి నియతునయందున
లేడియకంపడకుండున్
[31/01, 7:19 PM] వల్లూరు మురళీ: *భామినీ షట్పద* పద్య లక్షణములు

*జాతి(షట్పదలు) రకానికి చెందినది
8 నుండి 23 అక్షరములు ఉండును.
6 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
మూడవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
ఆరవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
గణ లక్షణాలు :
ఒకటవ పాదమునందు ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు గణములుండును.
రెండవ పాదమునందు ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు గణములుండును.
మూడవ పాదమునందు ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
నాలుగవ పాదమునందు ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు గణములుండును.
ఇదవ పాదమునందు ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు గణములుండును.
ఆరవ పాదమునందు ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 3 మాత్రలు , ఒక 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
*ఉదాహరణలు:*
చెలియ బంగరు చెలిమి బంగరు
వలపు బంగారమని చెబితివి
చెలిని చూడవు కాదు సరి యిది చిలిపి కృష్ణయ్యా
కలత నిద్దురలోన కంటిని
కలువ కన్నుల వాని కలలో
నులికి పడి లేచితిని నేనిట చిలిపి కృష్ణయ్యా
వెలిగె నాకాశమున తారలు
వెలిగె నాకాశమున చంద్రుడు
వెలుగు నవ్వుల రూపు చూపర చిలిపి కృష్ణయ్యా
పలుకు వజ్రపు తునకలా హరి
పిలిచి యలసితి పిలుపు వినదా
చిలుకరించగ సుధల వడి రా చిలిపి కృష్ణయ్యా
తలచు కోగనె తనివి గూర్చెడి
పలుకు జెలియవు పలుకు పడతివి
వెలుగు నిచ్చెడి వెలదివీవవి కేలు మోడ్చంగా
అలుక బూనిన యటుల ఆటలు !
పలుకు లీనని పచ్చి కోతలు !
నిలువ గలవటె తల్లి కూతురలిగీ కూర్చొనినన్ !
తేట మాటల తీయతీయగ
పాట తోడను ప్రస్తుతించగ
మాట లీయక యున్న నిజముగ బోటి నిలిచేనా !
ఏటి కమ్మరొ యిట్టి మాటలు
చీటి మాటికి చిలిపి ఆటలు
కోటివీణలు మ్రోగినట్టుల పాట రానీకన్ !
గుమ్మడేడే గోపదేవీ
గుమ్మడేడే కన్నతల్లీ
గుమ్మడిని పొడచూపగదవే -అమ్మ గోపెమ్మా
గుమ్మడేడే గోపదేవీ
గుమ్మడేడే కన్నతల్లీ
గుమ్మడిని పొడచూపగదవే -అమ్మ గోపెమ్మా
*ద్వాదశ జ్యోతిర్లింగాలు*
ఈ మహాశివరాత్రి పర్వదిన శుభసందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో

భక్తులు శివున్ని మూర్తి రూపములో మరియు లింగరూపములోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని శైవుల నమ్మకం.అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నది.
నీ పుట్టుకే నీకు తెలియనివాడివి, నా పుట్టుకకు నీవు కారకుడివా..!? కానేకావు. నాకు నేను స్వయంగా అవతరించాను. నాపై నీ ఆధిపత్యం చెల్లదు. నేనే నీక న్నా అత్యధికుడిని అంటూ బ్రహ్మ వాదులాడసాగాడు.

విష్ణువు ఎన్నివిధాల నచ్చజెప్ప ప్రయత్నించినప్పటికీ బ్రహ్మ వినకుండా నేనే అధినాథుడను ఈ విశ్వానికి నేనే అధినాథుడను అంటూ పెడబొబ్బలు పెట్టసాగాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఫెళఫెళమంటూ విశ్వమంతా కంపించిపోయింది. ఆ ఆర్భాటాలకి హేతువేమిటో తెలియక బ్రహ్మ విష్ణువులు విస్మయం చెందుతూ అటూ ఇటూ చూడసాగారు.

లింగోద్భవం:



ఆ సమయంలో ఓంకారనాదం ప్రతిధ్వనిస్తుండగా... జ్వాలా స్తంభం ఒకటి వారిరువురి మధ్య ఆవిర్భవించింది. సహస్రాధిక యోజనాల పొడ వుగా ఉద్భవించింది ఆ స్తంభం. అగ్నిజ్వాలలు విరజి మ్ముతున్న ఆ జ్యోతిర్లింగం ఆది మూలమెక్కడో, తుది యేదో ఎక్కడున్నదో కూడా వారికి అర్థం కాలేదు. ఆ జ్వాలా స్తంభం యొక్క ఆద్యంతాలు తెలుసుకోగలిగిన వాడే తమలో అధికుడని వారిరువురూ నిశ్చయించుకు న్నారు.

ఆ నిర్ణయానుసారం బ్రహ్మ హంసరూపం దా ల్చి జ్యోతిర్లంగం తుది భాగాన్ని కనుక్కోవడానికి పైకెగి రి వెళ్లాడు. విష్ణువు ఆ లింగం అడుగు భాగాన్ని కను క్కోవడానికి యజ్ఞ వరాహరూపం ధరించి లింగం ప్రక్క నుంచి భూమిని తొలుచుకుంటూ అడుగు భాగానికి ప్రయాణం ఆరంభించాడు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు.

ఆ జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని కను క్కోవడం తనకు సాధ్యం కాదని గ్రహించి వెనుదిరిగి యథాస్థానానికి వచ్చి బ్రహ్మకోసం నిరీక్షించసాగాడు. బ్రహ్మ పైకి ఎన్ని యోజనాలు ప్రయాణించినా ఆ లిం గం తుది భాగాన్ని కనుక్కోలేక నిరాశ చెందాడు. ఆ స మయంలో విష్ణువు దేవాదిదేవా..! ఆద్యంతాలు లేని ఈ జ్వాలా లింగాన్ని అభిషేకించడం, అర్చించడం మాకు సాధ్యం కాదు. కావున, నీవు ఈ జ్వాలా స్వరూపాన్ని ఉప
సంహరించుకొని, మా పూజలందుకోవడానికి అర్హమైన రూపంతో అవ తరించు అని ప్రార్థించాడు.

విష్ణువు ఆ ప్రార్థనతో శాంతించిన పరబ్రహ్మ తన జ్వాలా స్తంభరూపాన్ని ఉపసంహరించుకున్నాడు.

మరుక్షణమే ఆ ప్రదేశం లో మొట్టమొదటి శివలింగం అవతరించింది. లింగో ద్భవం జరిగిన ఆ సమయమే 'మహాశివరాత్రి' పర్వది నం అయింది. శివలింగరూపంలో అవతరించిన పర మేశ్వరుణ్ణి పవిత్ర జలంతో అభిషేకించి..శివనామస్మ రణతో పంచాక్షరీ మహామంత్రంతో అర్చించారు బ్ర హ్మ, విష్ణువులు. వారి భక్తి ప్రపత్తులకు సంతోషిం చి ఆదిదేవుడు ఆ లింగాకార మధ్యభాగంలో ప్రత్యక్ష మై దర్శనమిచ్చి వారిని ఆశీర్వదించి అనుగ్రహించాడు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు:

లింగమనగా... 'లీయతేగమ్యతే ఇతి లింగః'...
'లిం' లీయతి, 'గం' గమయతి... అనగా ఈ
జగత్తు దేనియందు సంచరించి, దేనియందు
లయం చెందుతుందో అదే 'లింగము' అని అర్థం.
ఆద్యంతాలు లేనిదే లింగము. లింగతత్త్వమే ఆత్మ. కనుక ప్రతి దేహంలో ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగస్వరూపుడే శివుడు.

అగమ్యము, అగోచరమైన దివ్య తత్త్వమును మానవులు గ్రహిచటానికి నిదర్శనముగా లింగము ఉద్భవించుచున్నది.

లింగము అనంత నిరాకార పరబ్రహ్మమునకు చిహ్నం. ఈ సత్యాన్ని చాటడానికి ఆ పరబ్రహ్మ తొలుత లింగరూపుడై ఉద్భవించి బ్రహ్మ, విష్ణువులకు దర్శనమిచ్చాడు. అనంతరం లింగాకారుడై ముల్లోకాలలోనూ వెలసి నిత్యాభిషేక అర్చనలు అందుకుంటున్నాడు. భక్తులు, సర్వజీవుల హృదయాలలో ఆత్మరూపుడై నివశించే శివుడు ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ తనని పూజించడానికి వీలుగా కోటానుకోట్ల శివలింగాలై వెలసి ఉన్నాడు. ఇట్టి అనేకానేక శివలింగాలలో దాదాపుగా అన్ని ప్రతిష్ఠించినవి కాగా... కొన్ని మాత్రమే ఆ శివుడు తనకుతానుగా స్వయంగా లింగరూపుడై వెలిసినవి. వాటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవే ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర 'లింగపురాణం'లో వ్యాసమహర్షి వివరించాడు.

అవి

1. రామనాథస్వామి లింగము - రామేశ్వరము,

2. మల్లికార్జున లింగము - శ్రీశైలము,

3. భీమశంకర లింగము -
భీమా శంకరం,

4. ఘృష్టీశ్వర లింగం - ఘృష్ణేశ్వరం,

5. త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం,

6. సోమనాథ లింగము - సోమనాథ్,7.నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక),8. ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు -ఓంకారక్షేత్రం,

9.మహాకాళ లింగం - ఉజ్జయని,

10. వైధ్యనాథ లింగం -
చితా భూమి (దేవఘర్),11. విశ్వేశ్వర లింగం - వారణాశి,

12 కేదారేశ్వర - కేదారనాథ్.

1 . గుజరాత్‌లో శ్రీ సోమనాథేశ్వరుడు

గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే

ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.

2. శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు

మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు. భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షన్ముఖుడికి ప్రతీచోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లిపోయి కార్తీకుడిగా వెలిశాడు. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం శ్రీశైల శిఖరంలో తప్పస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లిఖార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన అయిదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందాలహరి రాసారని ప్రతీతి.

3. శ్రీ మహా కాళేశ్వరుడు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయం ఉంది. క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు.

4 . శ్రీ ఓంకారేశ్వరుడు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం.

5 . శ్రీవైద్యనాథేశ్వరుడు

జార్ఖండ్‌ రాష్ట్రంలో జేసిడీ కూడలి దగ్గర శ్రీవైద్యనాథేశ్వరాలయం ఉంది. పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కట్నీపూర్‌ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం మవుతుండడం వల్ల శ్రీవైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి.

6 . శ్రీభీమేశ్వరుడు

మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్‌లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం అర్థనాథేశ్వర రూపంలో భక్తులు కోర్కెలు తీర్చేదిగా ప్రతీతి. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత. శివుని రౌద్రరూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం.

7 . శ్రీరామేశ్వరుడు

తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది. పురాణగాథ ప్రకారం రావణవధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్త సమయం దాటిపోతుండడంతో సీతాదేవి సముద్రతీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నూతుల్లో నీటితో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం.

8 . శ్రీనాగనాథేశ్వరుడు

మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినపుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్నకాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి.

9 . శ్రీవిశ్వనాథేశ్వరుడు
శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం వారణాసిగా జగత్‌ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాలవారు, హైందవులు అనేకమంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్ష్మి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి.

10 . శ్రీత్రయంబకేశ్వరుడు

మహారాష్ట్రలోని నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

11 . శ్రీ కేధారేశ్వరుడు

ఉత్తరాంచల్‌ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. హిమాలయశిఖరం మందాకిని నదీతీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూపుర ఆకారంలో ఉందీ జ్యోతిర్లింగం. గౌరీకుండ్ నుంచి 14కిలోమీటర్ల దూరం గుర్రాలుపై గానీ, డోలీలో గానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి నవంబరు నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికీ పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆదిదంపతుల కళ్యాణసమయంలో హోమగుండం, నేటికీ దర్శించవచ్చు. హరిద్వార్‌ నుంచి గౌరీకుండ్‌ వరకు బస్సు మార్గం ఉంది.

12. శ్రీ ఘృష్ణేశ్వరుడు

మహారాష్ట్ర ఔరంగబాద్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.


ఓం నమఃశివాయ పంచాక్షరీ మంత్రాన్ని ఈ మహా శివరాత్రి రోజు స్మరిస్తే విశేషించి శుభఫలితాలు పొందుతారు.
ఓం నమఃశివాయ అనే ఐదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రపడుతుంది.
ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది.

న ౼భూమికి సంబంధించిన భాగాలను,
మ ౼నీటికి సంబంధించిన భాగాలను,
శి ౼అగ్నికి సంబంధించిన భాగాలను,
వ ౼గాలికి సంబంధించిన భాగాలను,
య౼ ఆకాశానికి సంబంధించిన భాగాలను శుద్ధి చేస్తాయి.

మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంత వరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు.అందువలన ఈ పర్వదినమున ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తే,

మానసిక ప్రశాంతత ,మానసిక స్థిరత్వం ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని మన పెద్దలు ,గురువులు తెలిపారు.

హర హర మహాదేవ శంభోశంకర ఓమ్ నమశ్శివాయ స్వస్తి శుభం భూయత్.
పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు-  04 వ పద్య  ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు
ఈ ఉత్పలమాల పద్యంలో “ణ”అను అక్షరాన్ని పలుమార్లు ప్రయోగిస్తూ దానిని శివుని తాండవానికి కవి ముడి పెట్టాడు.
ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ
ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖవిక్రమ జృంభణ సంచలన్నభో
ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన
ణ్ణ ణ్మృణ తాండవాటన "ణ"కారనుత బసవేశ పాహిమాం!
ప్రతిపదార్థం
ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ
ణ్ణ ణ్మృణ= ణ, ణ్మృణ అను శబ్దములతో
నృత్= ఆడుచూ
త్వదీయ= నీసంబంధమైన
సుఖ= సుఖమయిన(పవిత్రమయిన అని ఇంకొక అర్థం)
విక్రమ = పరాక్రమముతో
జృంభణ= అతిశయించుచూ
 సంచలత్= కదులుచున్న(వణుకుచున్న)
నభః=ఆకాశము
ఉణ్ణ ణ్మృణ= ఉణ్ణణ,  మృణ  అను శబ్దములు చేయుచూ
 దిక్= దిక్కులందు
క్వణత్= మ్రోగుచున్న(ప్రతిధ్వనించుచున్న
 మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ = మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ మొదలగు
స్వనత్ = మ్రోగెడు
ణణ్మృణబసవేశ =ణణ్మృణ అను అక్షరముల సాన్నిహిత్యము కలిగిన   ఓ బసవేశ్వరుడా !
తాండవ= తాండవనృత్యములో
అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !
ణ"కారనుతా =ణ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !
మాం = నన్ను
పాహి= రక్షించు
తాత్పర్యము
ఓ బసవేశ్వరా ! ఓ శివా ! “ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణణ్ణ ణ్మృణ ణ, ణ్మృణ అను శబ్దములు
నువ్వు తాండవ నృత్యము చేయునప్పుడు పుడుతున్నాయి..మురళి
నీ సంబంధమైన పవిత్రమయిన తాండవ  పరాక్రమముతో అతిశయిస్తూ  ఆకాశము కదులుచున్నది(వణుకుచున్నది)
ఉణ్ణణ,  మృణ  అను శబ్దాలు దిక్కులందు  ప్రతిధ్వనించుచున్నవి.
 మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ మొదలగు అక్షర శబ్దములు దిక్కులందు  మారుమ్రోగుతున్నాయి. ణణ్మృణ అను అక్షరముల సాన్నిహిత్యము కలిగిన   ఓ బసవేశ్వరుడా ! తాండవనృత్యములో  అటునిటు తిరుగువాడా!ఓ పరమశివా !
ణ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా ! నన్ను రక్షించు.
పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు-    పద్య  ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు:

ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢంమృణఢంమృణ ఢంఢణోద్ధణం
ధణనటన త్వదీయడమరూత్థమదార్భట ఢంకృతి ప్రజృం
భణ త్రుటితాభ్రతార గణరాజ దినేశముఖగ్రహప్రఘర్
క్షణగుణతాండవాటన"ఢ"కారనుతా! బసవేశ పాహిమాం!
ప్రతిపదార్థం
బసవేశ = ఓ బసవేశ్వరుడా !
ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢంమృణఢంమృణ ఢంఢణోద్ధణం
ధణ= ఢణ, ఢణ, ఉద్ధణ మొదలయిన చప్పుళ్ళతో
నటన = నాట్యము చేయు
త్వదీయ= నీ సంబంధమైన
డమరు= డమరుకము నుండి( చర్మవాద్యం)
ఉత్థ= పుట్టిన
మద= సంతోషపు
ఆర్భట = కేకలతో
ఢంకృతి=డోలుచప్పుళ్ళతో
ప్రజృంభణ =బాగా అతిశయించుచూ
త్రుటిత= తెగిన
అభ్ర=ఆకాశములోని
తారగణ= నక్షత్ర సమూహముల
రాజ = చంద్రుడు
దినేశ= దిన+ఈశ=సూర్యుడు
ముఖగ్రహ= మొదలుకొని మిగతా గ్రహముల
ప్రఘర్షణ = రాపిడి కలిగిన
గుణ= శ్రేష్ఠమయిన
తాండవ= తాండవనృత్యములో
అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !
ఢ"కారనుతా=ఢ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !
మాం = నన్ను
పాహి= రక్షించు
తాత్పర్యము
ఓ బసవేశ్వరుడా !ఓ పరమశివా ! ఢణ, ఢణ, ఉద్ధణ మొదలయిన చప్పుళ్ళతో నువ్వు తాండవం చేయుచున్న సమయములో, నీడమరుకము నుండి  పుట్టిన  ధ్వనుల తీవ్ర వేగానికి  ఆకాశములోని నక్షత్రాలు తెగిపోయాయి., చంద్రుడు, సూర్యుడు  మొదలయిన గ్రహాలు కదిలిపోయి అటు ఇటు ఊగుతూ ఒకదానికొకటి రాసుకొంటున్నాయి. ఇంతటి భయంకరమైన ధ్వనులు కలిగిన తాండవ నృత్యము చేయువాడా ! ఢ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా !పరమశివా ! నన్ను రక్షించు.
పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు-  02 వ పద్య  ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు

డమరుగజాత డండడమృడండమృడండ మృడండ మృండ
మృం
డమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం
డమృణ మృడండడంకృతివిడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ
త్ర్పమథన తాండవాటన "డ"కారనుతా బసవేశ పాహిమాం!
ప్రతిపదార్థం
బసవేశ = ఓ బసవేశ్వరుడా !
డమరుగ= నీ చర్మవాద్య విశేషమునుండి
జాత =పుట్టిన
డండడ= డండడ అను చప్పుళ్ళతో
మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం
డమృణ మృడండడం =మృడ (శివ)ధ్వనిని వెలార్చెడి మృడండ ....మృండమృణ మొదలయిన శబ్దములు
(అన్ని డ కార ధ్వనులు కావటం విశేషం)
కృతి=చేయుటను
విడంబిత=అనుకరించు
ఘూర్ణిత =తిరుగుడుపడినది
విస్ఫురత్=ప్రకాశించే, తళతళమని మెరిసే
జగత్= లోకమును
ప్రమథన =చిలుకు
తాండవ= నాట్యమునందు
అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !
డ"కారనుతా= డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !
మాం = నన్ను
పాహి= రక్షించు
తాత్పర్యము
ఓ బసవేశ్వరుడా ! నువ్వు తాండవ నృత్యము చేసే సమయంలో   నీ  డమరుకము నుండి డండడ,మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడండమృం డమృం మొదలగు ధ్వనులు పుడుతున్నాయి.ఆ ధ్వనులతో పుట్టిన డమరుక కాంతులలో  లోకాలు  తిరుగపడుతున్నాయి.. అటువంటి అద్భుతమైన  డమరుక ధ్వనులు కలిగిన  లోకాలను చిలుకు  తాండవ నాట్యమునందు సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !నన్నురక్షించు
విశేషాలు
శివుని చేతిలో నుండునది డమరుకము.
 ఆడమరుకమును వాయించుటకు మధ్యలో ఒక కొయ్యముక్క కడతారు.
 దానిని మణి అంటారు.
 డమరుకమును కదలించినపుడు మణి డమరుకమునకు అటు ఇటు  తగిలి డమరుకమును మ్రోగిస్తుంది.
ఆ డమరుక మణుల కాంతులను పాల్కురికి ఈ పద్యంలో  వర్ణించాడు.
డమరుకము :
శబ్ద గుణకము ఆకాశము. ఆకాశమునందు శబ్దము యొక్క ప్రకంపనలు ప్రయాణించును. మనము మంత్ర జపము చేసినపుడు కాని, వినినపుడు కాని స్పందనలు / తరంగాలు ఏర్పడి. అవి శివ ఢమరుక ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును. మంత్ర పురశ్చరణ చేయుట వలన యోగికి ఆనందము కలిగి తాండవము చేయును. దీనికి గుర్తుగానే శివుడు  డమరుకను ధరించునని పెద్దలు చెబుతారు.
పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు-
ప్రతిపదార్థ
విశేషాలు:

టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట

1) టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో
త్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటో
ద్భట పటుతాండవాటన, "ట"కారనుతా! బసవేశ పాహిమాం!
2) పదవిభజన
టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట, ఉన్ముఖ టంకృతి, స్ఫుట+ఉత్కట
పటహ+ఆది, నిస్వన ,వియత్తల, దిక్తట, తాటిత+ఆర్భట+ఉద్భట,  పటుతాండవ+ అటన, "ట"కారనుతా! బసవేశ ,పాహిమాం!
3) పద సమన్వయము
బసవేశ, టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట, ఉన్ముఖ టంకృతి, స్ఫుట+ఉత్కట
పటహ+ఆది, నిస్వన ,వియత్తల, దిక్తట, తాటిత+ఆర్భట+ఉద్భట,  పటుతాండవ+ అటన, "ట"కారనుతా! పాహిమాం
4) ప్రతి పదార్థము
బసవేశ = ఓ బసవేశ్వరుడా !
టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట,= టకటక అను చప్పుళ్లతో
ఉన్ముఖ = ఉత్+ముఖ= పైకి విస్తరిస్తున్న
టంకృతి= ఆశ్చర్యముగొలుపు వింటినారియొక్కధ్వనుల వంటి ధ్వనులు  కలిగిన
స్ఫుట= స్పష్టమైన.
ఉత్కట= భయంకరమైన
పటహ=తప్పెట
ఆది= మొదలైన
నిస్వన = ధ్వనులతో
వియత్తల=ఆకాశము
దిక్తట=దిక్+తట= దిక్కుల ప్రదేశములను తాకిన
తాటిత= కొట్టబడిన
ఆర్భట=కేకలతో
ఉద్భట=అధికమైన
పటు తాండవ= నేర్పుకలిగిన నాట్యములో
అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !
ట"కారనుతా= టకారము అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !
మాం = నన్ను
పాహి= రక్షించు
5) తాత్పర్యము
ఓ బసవేశ్వరుడా ! నీ శివతాండవము  టకటక అను చప్పుళ్లతో  పై పైకి విస్తరిస్తున్న వింటినారియొక్కధ్వనుల వంటి ధ్వనులు  కలిగినది. స్పష్టమైనది. భయంకరమైనది.తప్పెట  మొదలైన వాటి ధ్వనులతో ఆకాశము మరియు దిక్కుల  అంచులను తాకుచున్నది.అనేక కేకలు కలిగినది.అధికమైనది.  నేర్పుకలిగిన నాట్యములోతిరుగువాడా! టకారము అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా ! నన్ను రక్షించు.
విశేషాలు
6) బసవేశ్వరుడు
కుల రహిత సమాజాన్ని 12వ శతాబ్దంలో ప్రబోధించి ఆచరించి చూపించినవాడు బసవేశ్వరుడు. పాల్కురికి సోమనాథుడు ఈ బసవేశ్వరుడ్ని రెండవ శంకరుడన్నాడు. ఆయననే  ఈ పద్యంలో  సంబోధిస్తున్నాడు.
7) టంటంట టంటంట టటంట టంటం
కాళిదాసు పేరు మీదుగా ఈ ట కార సమస్య  సంస్కృత సాహిత్యంలో  ప్రసిద్ధం.
ఒక రోజు భోజరాజు టంటంట టంటంట టటంట టటంట టంటం " అని సమస్య పూరించమన్నాడు.. వెంటనే కాళిదాసు ఇలా చెప్పాడు.
'రాజ్యాభిషేకే మద విహ్వాలయా:
హస్తాత్ చ్యుత: హేమ ఘటః యువత్యాః
సోపాన మార్గేషు కరోతి శబ్దం
టంటంట టంటంట టటంట టంటం"
(రాజుగారికి పరిచారికలు స్నాన ఘట్టం లో స్నానం చేయిస్తున్నారు. వారిలో ఒక పరిచారిక రాజుగారి సౌందర్యం చూసి మై మరిచి పోయింది. ఆమె చేతి లోని బంగారు చెంబు జారి పోయి స్నానఘట్టం మెట్ల మీదు గా దొర్లుతూ 'టంటంట టంటంట టటంట టంటం' అని మోత చేసింది. )
8) శివతాండవం
పార్వతీ పరమేశ్వరులు  ఇద్దరూ కలిసి కైలాస పర్వతంపై ఆనంద నాట్యం చేస్తారట.  పార్వతి చేసే నాట్యాన్ని ‘లాస్యం’   అంటారు.  శివుడి నాట్యానికి ‘తాండవం’ అని పేరు. 9.జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే/గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం/చకార చండతాండవం తనోతు నః శివః శివమ్
కదులుతున్న తన జటలు అనే అరణ్యంలో సురగంగ యొక్క చిత్తడి(మిక్కిలి తడి) కలవాడు
తన మెడలో వేలాడుతూ కదులుతున్న సర్పముల వరుసలు కలవాడు
డమ డమ ధ్వనులను వెలువరిస్తున్న డమరుకము కలవాడు
భయంకరమైన తాండవము చేయుచున్నవాడు అయిన పరమ శివుడు మనందరికి శుభాన్ని కలుగ చేయుగాక!
10 ఈ శివతాండవాన్ని పాల్కురికి సోమన టకారముతో మనకి సాక్షాత్కరింపచేసాడు. 
*పద్య రచనందు చేయకూడని దోషములు..,*

పద్యరచన యందు సహజముగా  వచ్చు  దోషాలు 10 గుర్తించారు.మన పూర్వులు.,అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి

*1--గణ భంగము:*

 గురువు వ్రాయ వలసిన స్థానంలో లఘువు వ్రాసినా.. లఘువు బదులు గురువు వ్రాసినా ఈ గణ భంగమనే దోషం వస్తుంది.

*2--యతి భంగము:*

యతి స్థానము నందు యతి అక్షరం లేకపొయినా..యతికి   యతిమైత్రి సరిపోక పోయిన..యతి స్థానం మారినా.... అది యతి భంగముగా గుర్తించ వలెను.

*3--సంశయము:*

 పద్య పాదాలలో అర్ధం సరిగ్గా చెప్పలేకపొయినా.. అర్ధం లో సంశయమున్నా.. సంశయ దోషము అంటారు

 *4--విసంధి:*

సంధి చేయవలసిన చోట.. సంధి చేయకపోతే అది విసంధి దోషము అవుతుంది..తప్పనిసరిగా సంది చేయవలెను

*5--పునరుక్తము:*

ఒక శబ్దాన్ని మరల మరల ప్రయోగించడం, ఒకే అర్ధం వచ్చే విధముగా ప్రయోగించకూడదు.

 *6--అపశబ్దము:*

వ్యాకరణం తో సంభందము లేకుండా...కుసంధులు, దుస్సంధి వైరి సమాసాలు  ఉపయోగించరాదు.

 *7. వ్యర్ధము:*

అనుగుణముగా లేని కూడని మాటలు వాడిన.. "వ్యర్ధము" అనే దోషము కలుగుతుంది.

 *8-- అపక్రమము:*

వరుస తప్పడమే అపక్రమము.
ఉదా:  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అంటూ.. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి అన రాదు...సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతీ దేవి అని అనాలి.

*9-- అపార్ధము:*

సరి అయిన అర్ధము లేకుండా.. ప్రాస కోసమో.. యతి కోసమో శూన్య  పదాలు వాడ రాదు  వాడిన ఎడల  అపార్ధ దోషమంటారు.

*10. విరోధము:* .

ప్రకృతి   విరుద్ధం గా వర్ణించ రాదు. ఉదా:  విజయవాడ కనక దుర్గమ్మ పాదాల చెంత గోదావరి నదిలో స్నానమాచరించి అనరాదు..(అక్కడ ప్రవహించేది కృష్ణమ్మ తల్లి కదా)

నిషిద్ధ గణము వాడుట:  కంద పద్యం లో.. జగణం బేసి గణము గా వాడ రాదు కదా,,,6 వగణము తప్పనిసరిగా జగణము,,లేద నలము వ్రాయలికదా,,ఆవిధంగా వాడకుంటే అది నిషిద్ద గణం అవుతుంది.

*పదచ్చేద భంగము:* ద్విపద, మంజరీ ద్విపద లలో ఏ పాదమునకు ఆపాదము విడి విడివిడిగా వ్రాయలి రెండు పాదములు కలుప రాదు.
యతి,,,,,,,,,ప్రాస,,,,,,,,,,,,ప్రాసయతి ,,,,,,,,,

యతి,,,,,,

పద్య పాదం లోని మొదటి అక్షరానికి యతి అని పేరు.ఈ యతి ప్రతి పద్యానికి దాని స్వభావాన్ని బట్టి ప్రతి పాదానికి ఏర్పాటు చేయటం జరుగుతుంది. 

"చరణ చరణమున కాద్య
క్షరములు వళులయ్యె,నవియెక్రమ్మఱఁదత్త
చ్చరణములలోనఁ జెప్పిన
యిరవులఁ బొందింపవలయు నెల్ల కృతులలోన్"

ప్రతి పాదములోని మొదటి అక్షరం వళులని అవి తిరిగి ఆయాపాదాలలో నియమిత స్థానంలో నిలపాలనీ భావం,అయితే యతి అనే పదానికిఇంకా చాలా పేర్లు ఛంధశ్శాస్త్రం లో పెద్దలచే చూచించ బడ్డాయి,,
1,విరతి
2.విశ్రాంతి
3.విశ్రామ,
4.విశ్రమము                                       
5.శ్రాంతి,,
6.విరమణ,
7.విరమ,
8.విరామ,
9.వళి...ఇవన్ని యతి కి పర్యాయ పదాలుగా ఛంధశ్శాస్త్రంలో తెలుప బడింది.మనం వాడుకలో "యతి" పదాన్నే ఏక్కువగా ఉపయోగిస్తాము.యతి ఎన్ని రకాలు వాటికీ ఏపేర్లు కలవు వాటి స్వభావం ఏమిటి .,,,ఎ అక్షరానికి ఏ అక్షరంతో యతి కుదురుతుంది అనే విషయాలు తెలుసు కుందాము.

అయితే ఇప్పుడు మనం అభ్యసించబోయే యతి సంబంధిత  అంశము కొంచం కష్టతరమైనది,,,ఇది చాలా రకాలుగా ఉన్నది. ప్రతి పద్య పాదములోని మొదటి అక్షరం యతి అయినప్పుడు దానికి సరిపడు విధముగా నియమిత స్థానములో అదే అక్షరం గాని దాని మిత్రాక్షరం గాని నిలపటాన్నే యతి వేయటం,,యతిమైత్రి.,యతి చెల్లటం అంటాము.  ఇవి చాలా రకాలుగా ఉన్నాయి,,,అచ్చుల ద్వార,,,,హల్లుల ద్వార,,వర్గాక్షరముల ద్వార,,,సంధుల ద్వార సమాసముల ద్వార ..,కొన్ని ప్రత్యేకమైన అక్షరముల ద్వార,,,,ప్రత్యేక పదముల ద్వార,,,,,
అలాగే  అచ్చులు హల్లుల ద్వార.,,,విభక్తుల ద్వార మరియు అనునాసికాక్షరములద్వార..,,ఇలా వివిధ రకములుగా ,,యతి మైత్రి చెల్లించ వచ్చు,,,ఈ పూర్తి సమాచారాన్ని అందించే ఈ అధ్యాయము క్షుణ్ణంగా  మనం అభ్యసించినచో పద్య రచన చాలా సులభతరంగా ఉంటుంది ఎక్కువగా కష్టపడ కుండానే యతిమైత్రి చేయ వచ్చు అర్ధవంతమైన పద్య రచన చేయ వచ్చు శ్రద్ధగా నేర్చు కొన మనవి,,

ఈ యతి భేదాలు క్రింది విధంగా ఉన్నాయి
1..స్వరయతులు,,,,,,,,7
2...వ్యంజన యతులు,,,22
3.ఉభయ వళులు.,13..
పైన ఉదహరించిన 42 విధములుగా పద్య రచనలో యతి మైత్రి కుదురు తుందని,  మన వ్యాకరణ గ్రంధ కర్తలు శలవిచ్చినారు,