Thursday, 19 February 2026

అగ్నిపరీక్ష పురందర రాజకుమార్తె లావణ్య అందంలో దేవతాస్త్రీలకు సాటి రాగలది. తగిన వరుడు దొరికితే ఆమెకు వివాహం చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నాడు రాజు, పురందరదేశం ఆ కాలంలో మారుమూల దేశం. ఆ దేశం నుంచి మరే దేశానికి వెళ్ళాలన్నా అనేక రోజులపాటు అరణ్యాలలోనూ, కొండల మీదా ప్రయాణాలు చెయ్యాలి. లావణ్యకు తగిన వరుడు దొరకక పోవటానికి అదే ప్రధాన కారణం. లావణ్య కూడా వివాహం కోసమే ఎదురు చూస్తున్నది. ఆమెకు తన నిత్యజీవితంలో ఏమీ ఆనందం కనిపించలేదు. రాజభవ సంలో ఆమె చెలికత్తెలు ఆమెను వినోదింప జేయటానికి చెప్పిన కథలే మళ్ళీ మళ్ళీ చెబుతారు, ఆడిన ఆటలే మళ్ళీ మళ్ళీ ఆడ తారు. అందుచేత, ఆమెకు కాలం గడవ టమే కష్టంగా ఉన్నది. ఒకనాడు ఆమె రాజభవనంలో ఎవరికీ చెప్పకుండా, తమ నగరానికి ఉత్తరాన ఉన్న వనాలకు ఒంటరిగా బయలుదేరింది. ఆమె పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్ళి ఒక అత్యద్భుతమైన ఉద్యానవనంలో ప్రవే శించింది. ఎటు చూసినా అమిత అందంగా ఉన్న పొదలూ, వాటిలో అపూర్వమైన పుష్పాలూ కనిపించాయి. అలాటి పూలు గాని, చెట్లు గాని లావణ్య ఎన్నడూ చూడ లేదు. ఆ ప్రాంతం మనుషులు పెంచిన తోటగానూ లేదు, సహజంగా తయారైన వనంగానూ లేదు. అక్కడ ఎలాటి జన సంచారమూ ఉన్నట్టు కనిపించలేదు. ఆఖరుకు జంతువులూ, పక్షులూ కూడా ఆమెకు కనిపించలేదు.-- లావణ్య ఒక్కొక్క పాద వద్దకూ వెళ్లి, దానికి గల పూల అందమూ, సువాసనా అనుభవిస్తూ తిరగసాగింది. ఒక పొద మీదఆమెకు అన్నిటికన్నా అందమైన పూలు కనిపించాయి. వాటి సువాసన వర్ణనాతీ తంగా ఉన్నది. ఆమె ఒక పువ్వు కోసి తలలో పెట్టుకోబోయింది. "ఎవరా పూలు కోసేది ?" అని గర్జిస్తూ ఒక యువకుడు ఒక పాదచాటు నుంచి లావణ్య ఎదటికి వచ్చాడు. ఆమెను చూడ గానే అతనిలో విచిత్రమైన మార్పు వచ్చింది. ఏదో అనబోతూ అతను ఆమె కేసి కన్నార్ప కుండా చూడసాగాడు. " పూలు కొయ్యరాదని నాకు తెలియదు. అడగటానికైనా ఎవ రూ కనిపించలేదు. ఇక్కడ ఎవరూ లేరనే అనుకున్నాను." అన్నది లావణ్య. యువకుడు చిన్నగా నవ్వి, "అవునవును. ఇక్కడ ఎవరూ ఉండరు. నేను మాత్రం ఈ వనానికి కాపలా కాస్తూ ఇక్కడే ఉంటాను," అని, ఆమె ముందు కోసు కున్న పొద నుంచే మరికొన్ని పూలు కోసి ఆమె చేతిలో పెట్టాడు.. " పూలు కోయరాదన్నారుగా?" అన్నది లావణ్య. " నీ అంత అందగత్తెకు నియమాలు అవసరం లేదు." అన్నాడతను. "మీరెవరు?" అని లావణ్య మర్యా దగా అడిగింది. "నా పేరు సువ్రతుడు. ఈ గంధర్వ వనానికి పాలకుణ్ణి." అన్నాడుఆయువకుడు. "గంధర్వుడివా!" అంటూ లావణ్య కంగారుగా తన చేతిలో ఉన్న పూలను కింద వదిలేసింది. గంధర్వులంటే అందరికీ ఉన్నట్టే లావణ్యకు కూడా భయం ఉన్నది. వాళ్ళ స్నేహం మామూలు మానవులకు అచ్చి రాదు. వాళ్ళు అనేక విద్యలు నేర్చిన వాళ్ళు. అయితే, గంధర్వులు తమ దేశానికి అంత దగ్గిరలో ఉంటున్నట్టు లావణ్యకు తెలియదు. ఆమె కంగారు చూసి సువ్రతుడు, "భయపడకు, రాజకుమారీ. నేను ప్రస్తుతం గంధర్వులకు కింకరుడుగా ఉంటున్నప్పటికీ, జన్మత: నీలాటమానవుణ్ణి. మా తాత గారు ఇక్కడికి తూర్పుగా ఉన్న జయ సింధుదేశపు రాజు. నేను పసివాణ్ణిగా ఉండ గానే నా తల్లి తండ్రులు పోయారు. అప్పుడు నా మాతామహుడు నన్ను తన ఇంటికి తెచ్చి పెంచాడు. నేను కొంచెం పెరిగినాక మా తాత వెంట ఈ ప్రాంతాలకే వేటకు వచ్చాను. అప్పుడు నన్ను ఒక గంధర్వ రాణి పట్టుకుని తీసుకుపోయింది. నేను తనను ప్రేమించి తనకు భర్తగా ఉంటానని ఆమె ఆశ. నేను ఆమెను ప్రేమించలేను. అందుచేత పగటిపూట నన్ను ఈ వనానికి కాపలా ఉంచింది. రాత్రికాగానే నన్ను ఆమె తమ లోకానికి తీసుకుపోతూ ఉంటుంది. నాకు ఈ గంధర్వులన్నా, వీళ్ళ లోకమన్నా రోజు రోజుకూ అసహ్యం పుట్టుతున్నది. వీళ్ళ మాయనుంచి నన్ను ఎవరన్నా తప్పి స్తారా అని ఎంతో ఆశపడతాను. కాని నా ఆశ ఫలించదు. అది ఫలించే మార్గం అందుబాటులో కనపడదు!" అంటూ నిట్టూర్చాడు. అతను మాట్లాడుతున్నంతసేపూ అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిన లావణ్య, అతని స్థితికి ఎంతో జాలిపడుతూ, “ఏమిటా మార్గం?" అని అడిగింది. సువ్రతుడు లావణ్య కేసి అనుమానంగా చూస్తూ ఇలా చెప్పాడు: "ప్రతి పౌర్ణమినాటి రాత్రి గంధర్వరాణి తన పరివారంతో వచ్చి ఈ వనంలో విహా రాలు చేస్తుంది. నేను ఆమె వెంటనేఉంటాను. ఆ సమయంలో మనిషి జన్మ ఎత్తిన వారెవరైనా నన్ను కౌగలించుకుని వదిలి పెట్టకుండా పట్టుకోవాలి. గంధర్వ రాణి తన మాయలు ప్రయోగించి ఆమని షిని భయంకరమైన పరీక్షలకు గురిచేస్తుంది. వాటికి తట్టుకుని నన్ను ఆ మనిషి గట్టిగా పట్టుకోవాలి. అప్పడు గాని నేను గంధర్వుల బారినుంచి బయటపడను. నా కోసం ఇంత బాధపడే మనిషికి నేనంటే ఎంత ప్రేమ ఉండాలి! ఎంత సాహసం కావాలి! నన్ను ఎరిగినవాళ్ళే మానవప్రపంచంలో ఉన్నారా, లేదా అని నాకు అనుమానంగా ఉంది. అలాటప్పుడు నన్ను కాపాడేవాళ్ళు ఉంటా రనుకోవటం భ్రమేగదా ! " సువ్రతుడు ఇలా అని ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, " సూర్యుడు వాలి పోతున్నాడు. నువు ఎంత దూరం వెళ్ళాలో. చీకటి పడే వేళకు నువు ఇక్కడ ఉండటం క్షేమం కాదు!" అన్నాడు, " నీకు త్వరలోనే గంధర్వుల నుంచి విముక్తి కలుగుతుందనుకుంటాను. వస్తాను!" అని లావణ్య తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. పూర్ణిమ ఇంకా నాలుగు రోజులున్నది. ఈ నాలుగు రోజులూ లావణ్య సువ్రతుణ్ణి గురించి విడవకుండా ఆలోచించి, అతన్ని కాపాడటానికి, అవసరమైతే ఆ ప్రయత్నంలో ప్రాణాలు విడవటానికి దృఢంగా నిశ్చ యించుకున్నది. పూర్ణిమనాటి సాయంకాలం ఆమె గంధర్వ వనానికి ఒంటరిగా బయలుదేరి వచ్చింది. చీకటిలో ఎవరికీ కనిపించకుండా ఉండటానికి ఆమె నల్లని దుస్తులు ధరిం చింది. చీకటి పడకముందే ఆమె పొదలలో దాగి కూర్చుని. తన జుట్టువిప్పి ముఖానికి అడ్డం వేసుకున్నది. ఝాము రాత్రి గడిచినాక వనంలో ఆలి కిడి వినిపించింది. గంధర్వులు జంటలు జంటలుగా వనంలో షికార్లు చేస్తున్నారు. లావణ్య ప్రతి జంటా తన పక్కగా వెళ్ళి నప్పుడల్లా, వారిలో గంధర్వరాణిఉన్నదేమో అని శ్రద్ధగా పరిశీలిస్తున్నది. దాదాపు అర్ధ రాత్రి కావస్తూండగా సుప్ర తుడూ, మరొక స్త్రీ ఆమె దాగి ఉన్న ప్రాంతానికి వచ్చారు. సువ్రతుడి వెంట ఉన్న స్త్రీ గంధర్వరాణి అయి ఉంటుం దని లావణ్య సులువుగానే గ్రహించింది. ఆ జంట తనకు సమీపంగా రాగానే లావణ్య చప్పున లేచి వెళ్ళి సువ్రతుణ్ణి గట్టిగా కౌగ లించుకున్నది. గంధర్వరాణి ఒక్క క్షణంపాటు నివ్వెర పోయి, సువ్రతుడు తన చేతి నుంచి జారి పోతున్నాడని గ్రహించి, మాయలు ప్రయో గించింది. లావణ్య కౌగిట ఉన్న సువ్రతుడు అంతలో ఒక కొండచిలువగా మారాడు. దేనికైనా తెగించి ఉన్న లావణ్య ఆ కొండ చిలువను వదిలి పెట్టలేదు. ఇంతలో కొండచిలువ సింహంగా మారింది. లావణ్య గుండెలు ఆదిరి పోయాయి, కాని ఆమె ఆ సింహాన్ని గట్టిగా వాటేసుకున్నది. ఇంతలో సింహం ఎర్రగా కాలుతున్న గునపంగా మారింది. లావణ్య శరీరమంతా చుర్రున కాలి భరించరాని బాధ కలిగింది. కాని లావణ్య గునపాన్ని విడవలేదు. తరవాత ఏమి జరిగినదీ ఆమెకు తెలి యదు. ఆమెకు స్పృహ తెలిసేసరికి గంధర్వ వనంలో ఎవరూ లేరు. ఆమె కౌగిట సువ్రతు డున్నాడు. అమెతోపాటే అతనికి స్పృహ వచ్చింది. "నన్ను గంధర్వుల నుంచి కాపాడావు. నీ ఋణం ఎలా తీర్చుకో గలను? మనం మీ నగరానికి పోదాం పద. నిన్ను ఇంటికి చేర్చినదాకా నా సంగతి చూసుకోలేను." అన్నాడు సుప్రతుడు లావణ్యతో. రాజకుమార్తె కనపడక రాజభవనం ఆందోళనతో సతమతమవుతున్నది. లావణ్య జరిగినదంతా చెప్పగానే ఆమె తండ్రి, " నాయనా. నీ కోసం నా కుమార్తె అగ్ని పరీక్ష ఎదుర్కొన్నది. నీ కన్న ఆమెకు తగిన భర్త ఎవరుంటాడు ?" అని సువ్రతు డితో అని, వారిద్దరికీ పెళ్ళి చేసేకాడు.

No comments:

Post a Comment