Thursday, 19 February 2026
అల్లుడు-కొడుకు
పెదరాయుడు అతిథి సత్కారానికి పెట్టింది పేరు. రామాపురంకి కొత్తగా ఎవరొచ్చినా, ఆయన ఇంట బస చేసి వెళ్ళాల్సిందే! ఆ విధంగా ఒకసారి ఆయన ఇంటికి సుదర్శనుడు అనే యువకుడు వచ్చాడు. అతనికి కవిత్వం చెప్పడం వచ్చు. సంగీతమూ తెలుసు. కళాకారుల నాదరించే విజయనగరంలో, తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని బయల్దేరాడు.
సుదర్శనుడు చెప్పింది విన్నాక, పెదరాయుడు, “ఆ నగరంలో నాకు తెలిసిన వాళ్ళిద్దరున్నారు. వారిలో అజయుడు నాకు తెలిసిన సీతారామయ్య గారి అల్లుడు. అతను మంచి కవి. ఉపకారగుణ మున్నవాడు. నగరంలో కొంత పలుకుబడి కూడా సంపాయించాడు. కవిగా నీకక్కడ స్థిరపడడానికి తప్పక సాయపడతాడు. రెండోవాడు విజయుడు, మా రెండో
అబ్బాయి. వాడు చెప్పుకోతగ్గ గాయకుడు. ఉపకారగుణంలోనూ, పలుకుబడిలోనూ వాడు కూడా విజయుడంతటివాడు. నువ్వు వాళ్ళను కలుసుకో. పని జరుగు తుంది,” అన్నాడు.
ఇందుకు సుదర్శనుడెంతో సంబరపడి, "భాగ్యనగరం చేరేలోగానే నా పని సుకర మైంది. మీ పేరు చెప్పుకుని అక్కడ స్థిర పడతాను," అన్నాడు.
దీనికి పెదరాయుడు వెంటనే అభ్యంతరం చెబుతూ, "అజయుడికీ, విజయుడికీ కూడా తమకు తామే సాటి అనుకునే గర్వమున్నది. నేను చెప్పగా వారి గొప్పతనాన్ని తెలుసుకున్న నిన్ను, వాళ్ళాదరించరు. నా పేరు చెప్పకుండా పూరుకున్నావంటే, వాళ్ళు నీకు అన్ని విధాలా సహకరిస్తారు. ఉపకారగుణమున్న వారికి, ఆమాత్రం గర్వం వుండడంతప్పుకాదు కాబట్టి, ఈ లోపానికి నేను కానీ, నువ్వు కానీ వాళ్ళను తప్పు పట్ట కూడదు," అన్నాడు.
సుదర్శనుడిందుకు సరేనని భాగ్య నగరం చేరుకోగానే, ముందుగా విజయుడింటికి వెళ్ళాడు. పెదరాయుడు చెప్పింది గుర్తుంచుకుని వాడు, విజయుడితో, "అయ్యా, ఉత్తమ కవిత్వాన్ని అంచనా వేయడంలోనూ, కవులకు ఉపాధి కల్పించడంలోనూ తమకు తమరే సాటి అని, ఎక్కడెక్కడో చెప్పుకుంటూంటే విని మిమ్మల్ని చూడవచ్చాను. నన్ను పరీక్షించి, ఇక్కడ స్థిరపడే అవకాశం నాకు కలిగించ వలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను," అన్నాడు స్వయంగా.
విజయుడు ఉబ్బిపోయి, "ముందుగా మా మామగారు పెదరాయుడుగారి మీద చక్కని పద్యం చెప్పు. దాన్ని బట్టి నీ సామర్థ్యాన్ని అంచనావేస్తాను," అన్నాడు.
పెదరాయుడుగారి వంశవృక్షం గురించీ, ఆయన సాధించిన ఘనకార్యాల
గురించీ అడిగి తెలుసుకున్నాక సుకా ముడు సీసపద్యానికి తేటగీతిని జత పరుస్తూ చక్కని పద్యాన్ని చదివాడు.
"ఆశువుగా ఇంత చక్కని పద్యాన్ని చెప్పగలిగిన కవికి వేరే పరీక్ష అవసరం లేదు. ఈ నగరంలో గోపాలుడనే భాగ్య వంతుడున్నాడు. ఆయన కళాప్రియుడు, నాకు మిత్రుడు. నిత్యం తననే అంటి పెట్టుకుని వుంటూ కవిత్వాన్ని వినిపించే సహచరుడి కోసం ఆయన అన్వేషి స్తున్నాడు. నేను యోగ్యుడని పంపిన వాడికాయన తప్పక తనవద్ద అవకాశం ఇస్తాడు," అన్నాడు.
విజయుడిచ్చిన ఉత్తరం తీసుకున్నాడు. సుదర్శనుడు. తర్వాత అజయుడింటికి వెళ్ళి, విజయుణ్ణి పొగిడినట్టే అతణ్ణి పొగిడాడు. అజయుడుబ్బిపోయి, "నా వద్ద నా తండ్రి సీతారామయ్యపై నా అన్న రాసిన సీసపద్యమొకటున్నది. దానికి చక్కని వరసకట్టి పాడగలిగితే, నీ సామర్థ్యాన్ని అంచనా వేయగలను." అన్నాడు. సుదర్శనుడు, విశాలుడిచ్చిన పద్యానికి వెంటనే వరసకట్టి పాడగానే, అజయుడు మురిసిపోయి, “నిస్సందేహంగా నువ్వు ప్రజ్ఞాశాలివి. ఈ నగరంలో గోపాలుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన కళా ప్రియుడు, నాకు మిత్రుడు. నిత్యం తననే అంటి పెట్టికుని సంగీతం వినిపించే సహచరుడి కోసం, ఆయన అన్వేషిస్తున్నాడు. నేను యోగ్యుడని చెప్పిన వాడికాయన తప్పక అవకాశం యిస్తాడు. ఆయన వద్ద చేరావంటే, నీకిక వసతికీ, భుక్తికీ, ఆదా యానికీ కూడా లోటుండదు." అంటూ వాడికొక లేఖ ఇచ్చాడు.
సుదర్శనుడు, గోపాలుణ్ణి కలుసు కున్నాడు. ఆయన వాడిచ్చిన లేఖలు చదివి, "అడ్డమైన వాళ్ళూ కవులమనీ, గాయకులమనీ చెప్పుకుంటూ నావద్దకు వచ్చి, పరమ చెత్తను సాహిత్యమనీ,
రణగొణ ధ్వనులను సంగీతమనీ నన్ను భ్రమపెట్టడానికి ప్రయత్నించారు. విని విని విసిగిపోయిన నేను, నాకు నమ్మకమైన మిత్రులు అర్హుడంటూ రాసిన లేఖలు తెచ్చినవారిని తప్ప, ఇతరులను దరిచేర నివ్వడంలేదు. ఇక నువ్వు నాకు కవిత్వాన్నీ, సంగీతాన్నీ వినిపించవచ్చు." అన్నాడు.
ఈవిధంగా లభించిన సదవకాశాన్ని సుకాముడు సద్వినియోగం చేసుకున్నాడు. కవిత్వంలోనూ, సంగీతంలోనూ కూడా వాడు, గోపాలుణ్ణి మెప్పించి, ఆయన హృదయంలో స్థానం సంపాయించు కున్నాడు.
తనకు బ్రతుకుతెరువేర్పడినందుకు ఎంతో సంతోషించి సుదర్శనుడు, ఆ సందర్భంగా తన శ్రేయోభిలాషులకు విందుభోజనం పెట్టాలనుకున్నాడు. అందుకోసం ముందుగా విజయుడింటికివెళ్ళి, "అయ్యా! మీ వల్ల నాకు ఉపాధి లభించింది. నేను ఏర్పాటు చేసే విందు భోజనానికి తమరు సకుటుంబంగా రావాలి. తమరు కాక, తమ ముఖ్య బంధువులు కొందర్ని కూడా పిలిస్తే, వారి ముందు నాకు చేసిన మేలు గురించి చెప్పుకుంటాను." అన్నాడు.
"నువ్వు ప్రజ్ఞాశాలిని కాబట్టి సాయ పడ్డాను. ఇందులో పదిమందికీ చెప్పుకునే దేముందీ?" అన్నాడు విజయుడు మొహమాటపడుతూ.
"అయ్యా! సమస్త జంతువుల్లోకీ మనిషిని మించిన కృతఘ్నుడుండడు. ఈ రోజు నేను మేలు చేసినందుకు, మిమ్మల్ని పొగుడుతున్నాను. ఇది తాత్కాలికం కావచ్చు. కొంతకాలం గడిచాక, నేను మీ
మేలును మరచిపోతాను. అంతా నా ప్రతిభవల్లే జరిగిందనుకుంటాను. అను కోని పరిస్థితుల్లో మిమ్మల్ని నిరసించినా నిరసించవచ్చు. అందుకే పొందిన ఉప కారానిక్కూడా ప్రచారముండాలి. నేనిప్పు దివ్వబోయే విందుకు తమరూ వస్తారు. తమ బంధువులూ వస్తారు. అందరి సమక్షంలో, మీరు చేసిన మేలును ప్రకటించానంటే—ఆ తర్వాత నేను ఎప్పుడైనా మీ పట్ల నిరసన భావం చూపితే, నలుగురూ నన్నే ఛీ అంటారు. విపరీతమైన గర్వం నన్ను మింగేయకుండా, నేను తీసుకుంటున్న జాగ్రత్త ఇది! కాదనకండి," అన్నాడు సుదర్శనుడు విజయుణ్ణి బ్రతి మాలుతున్న ధోరణిలో,
విజయుడు, సుదర్శనుడు మాటల కాశ్చర్యపడి, అతడి దూరాలోచననూ, మంచితనాన్నీ మెచ్చుకుని, ఒక కాగితం మీద తన మామ పెదరాయుడు పేరూ, విలాసం రాశాడు. దాని కింద తన బావమరిది ఉమాపతి పేరూ, విలాసం రాశాడు. ఆ కాగితాన్ని సుదర్శనుడు కందించి, "వీరిని నువ్వే కలుసుకుని కారణం చెప్పే స్వయంగా ఆహ్వానిస్తే బాగుం టుంది. నేను చెప్పడం బాగుండదు." అన్నాడు.
"నా అభిప్రాయమూ అదే!" అంటూ సుదర్శనుడు కాగితం చదివి, "అయ్యా! తమరితో కలిపి ఇప్పటికి మూడు కుటుంబాలయ్యాయి. నేను అయిదు కుటుంబాలను ఆహ్వానించాలనుకున్నాను.ఇంకా రెండు పేర్లు రాయండి." అంటూ బలవంత పెట్టాడు.
అప్పుడు విజయుడు కాగితం మీద తండ్రి పెదరాయుడు పేరూ, తమ్ముడు అజయుడి పేరూ విలాసాలతో సహా రాశాడు.
ఆ పేర్లు చూసి సుదర్శనుడిక్కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు. విజయుడు, పెదరాయుడు కొడుకే కాక, విడివిడిగా తాను కలుసుకున్న విజయుడు.
అజయుడు అన్నదమ్ములై కూర్చున్నారు!
అయితే సుదర్శనుడు, పెదరాయుడు కిచ్చిన మాట తప్పినట్టవుతుందని, పెదరాYఉడు తనకు తెలిసినట్టుగా అనకుండా, అక్కణ్ణించి మౌనంగా బయట పడ్డాడు.
తర్వాత అతడు, అజయ్ ని కలుసు కుని విజయ్ ని అడిగినట్టే అడిగాడు. సుదర్శనుడు, వాడికి తండ్రి పెదరాయుడు, అన్న విజయుల పేర్లూ, విలాసాలూ ఇచ్చాడు. సుదర్శనుడింకా బలవంత పెట్టగా అతడు, తన మామ సీతారామయ్య, బావమరిది ఉమాపతుల పేర్లిచ్చాడు.
అప్పుడు సుదర్శనుడు మరింతగా ఆశ్చర్యపోయాడు. అంటే విజయుడూ, అజయుడూ కూడా సీతారామయ్య అల్లుళ్ళేనన్నమాట! అలాంటప్పుడు, పెదరాయుడు వాళ్ళల్లో ఒకరిని సీతారామయ్య అల్లుడనీ, ఇంకొకరిని తన కొడుకనీ ఎందుకు చెప్పాడు? ఆయన ఇద్దర్నీ తన కొడుకులనవలసింది! అలా
''
అనడం ఇష్టం లేకపోతే, ఇద్దర్నీ సీతారామయ్య అల్లుళ్ళనవలసింది!
కాసేపాలోచించగా సుదర్శనుడికి జవాబు దొరికింది. కొడుకులిద్దరికీ గర్వం ఎక్కు వంటున్న పెదరాయుడులో, గర్వం పాలు మరింత ఎక్కువుంది. మోహనుడు తన కంటే భార్య తండ్రికి ప్రాముఖ్యత ఇస్తున్నాడన్న అక్కసుతో, ఆయన అతణ్ణి సీతారామయ్య అల్లుడంటున్నాడు!
వాడు విందుకు పెదరాయుడిను ఆహ్వానించడానికి రామాపురం వెళ్ళి నప్పుడు, ఆయనతో, "అయ్యా! అహం నన్ను కబళించకూడదని, ఇలా విందు తలపెట్టిన నేను, మీబోటి పెద్దల నుంచి ఎంతో నేర్చుకొనవలసి వుంది. మీరు మీ ఇద్దరి కొడుకులలో ఒకరిని, కేవలంసీతారామయ్య అల్లుడుగా చెబుతూండడం నాకు సబబుగా తోచలేదు." అన్నాడు.
దీనికి పెదరాయుడు నవ్వి, "నాకు నా ఇద్దరు కొడుకుల్లో ఎవరన్నా ద్వేషభావం లేదు. ఇద్దర్నీ నేను సమంగానే ప్రేమి స్తున్నాను. సుదర్శనుడు వరసకట్టమని నీకిచ్చిన పద్యాన్ని రాసింది. విజయుడేనని గ్రహించే వుంటావు. వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. మన సంప్రదాయం పెద్దలననుసరించి వుంటుంది. బుద్ధుడి ననుసరించే వాళ్ళు బౌద్ధులు. శివుడి సనుసరించే వాళ్ళు శైవులు. దేవుణ్ణి అనుసరించే వాణ్ణి భక్తుడంటాం. గురువుననుసరించేవాణ్ణి శిష్యుడంటాం. తండ్రిననుసరించేవాడు కొడుకైతే, మామ ననుసరించేవాడు అల్లుడు. విజయుడు ముందు నా కుమారుడు, ఆ తర్వాతే సీతారామయ్య అల్లుడయ్యాడు, విజయు డింట మామ కుటుంబానిది ప్రథమ స్థానం. తండ్రి కుటుంబానిది ద్వితీయస్థానం. కాబట్టి వాణ్ణి సీతారామయ్య అల్లుడనడమే న్యాయం! మనుషుల పేర్లు వారి వారి ప్రవర్తనలకు వ్యాఖ్యానాలని గుర్తుంచుకో! నువ్వు కూడా ఉత్తమ కవిత్వానికి మహాకవుల సంప్రదాయం పాటించడానికి బదులు, గోపాలుని ఆశ్ర యానికే ప్రాముఖ్యతనిచ్చావనుకో. అప్పుడు గోపాలునిఅంతరంగికుడుగానే మిగిలి పోతావు తప్ప, మహాకవివి అనిపించు కోలేవు." అన్నాడు.
పెదరాయుడు మహాజ్ఞాని అనీ, రాగద్వేషాలకు అతీతుడనీ, ఆయన ప్రతి మాటలోనూ ఎంతో ప్రయోజనం దాగి వుందనీ అప్పటికి తెలుసుకున్న సుకాముడు, "అయ్యా! మీ హెచ్చరికను గుర్తుంచుకుంటాను. ఆ విధంగా నా ప్రవర్తనను దిద్దుకుంటాను. గుడ్డిగా ఎవరినీ అనుసరించక, వ్యక్తిత్వం వున్నవాడిలా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాను," అని, ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు….Valluru Dalinaidu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment