Thursday 6 November 2014

||సర్కారు బడి||
ముని ఒక్కండు వనములో తపమాచరించుచు నుండె
ముద్దులొలుకుచు పసిబాలలచట ఆడుకొనుచు గోలచేయ
కోపగించుచు కన్నులెర్రజేసి బాలురకు శాపమొసగె

"బాల్యమును కోల్పోయి బరువులను మోయుచూ
స్వేచ్చాన్నదిలేక సుఖమన్నదీ లేక
బందిఖాణాలోనే బతుకునీడ్చెదరు
మాతృభాషను మరచి మాతృదేశము విడచి
తల్లిదండ్రులనొదలి దూరాన కొలువు చేసేరు
తల్లి ప్రేమయులేక తండ్రి లాలనలేక తల్లడిల్లేరు
మీచదువు మీతెలివి మతృభూమికి కొరగాక
పరదేశ పరపతిని పెంపొదింప చేయు"

అంతనాతని శాపము మునికాంతలాలకించి
పరుగుపరుగున వారచటికరుగుదెంచి
ఏమితెలియని పసిబాలలు వీరికీశాపమేల
ఏలీల తొలగింతువీశాపమనగ అంతముని
శాంతించి, శాపాన్ని వెనుకకు తీసుకోలేను

సర్కారు బడిలోన చదువుకుంటేచాలు
శాపంబు తొలగును పాపంబు పోవును

No comments:

Post a Comment