Thursday 6 November 2014

//శ్రీ కూర్మం//
క్షేత్ర దర్శనం
 శ్రీమహా విష్ణువు తొలి అవతారం కూర్మావతారం.ఈ అవతారంలో లో పూజలందుకుంటున్న క్షేత్రం భారతదేశంలోకెల్లా శ్రీ కూర్మం ఒక్కటే కావడం విశేషం. "పూర్వం లేనిదే కూర్మాం వెళ్ళినా రాదు" అన్నది నానుడి.శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఒడ్డున ఈ పురాతన ఆలయం ఉంది. అంతే కాకుండా శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే శ్రీ కూర్మవతారము విష్ణ్వంశ దశావతారాల్లో ఒకటయిన ఈ దేవాలయం మొదట శివక్షేత్రంగా వెలసి ఉన్నా శ్రీరామానునాజాచార్యులు వారివలన ఇది వైష్ణవక్షేత్రంగాను, దివ్యప్రదేశం గాను మలచారని చెబుతున్నారు. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ శ్రీ కూర్మం విశిష్టతలు 

శ్రీ కూర్మంలో శిల్పళా శైలి ఎంతో విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వా మి పడమటి ముఖముగా ఉంటారు. మరొక విశేషం ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఉన్నా యి. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి.

స్థలపురాణం...
దక్షిణ సముద్ర తీరాన శ్వేతపురమనే పట్ట ణాన్ని శ్వేతచక్రవర్తి పరిపాలించేవాడు. ఆయనకు విష్ణుప్రియ అనే భార్య ఉండేది. ఆమె మహా విష్ణు భక్తురాలు. ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా ఆమె భర్త అయిన శ్వేతమహారాజు కామమోహితుడై ఆమె వద్దకు వచ్చాడు. అప్పుడు విష్ణుప్రియ భర్తను సాదరంగా ఆహ్వానించి, కూర్చుండ బెట్టి, పూజా మందిరానికి పోయి విష్ణువును ధ్యానించి, స్వామీ! అటు నా భర్తను కాదన లేను, ఇటు నీ వ్రతాన్ని భంగపడనివ్వలేను. నువ్వే నన్ను రక్షించమని పరిపరి విధాల వేడు కొంది. స్వామీ! కూర్మరూపమున భూమిని ధరించలేదా? అట్లే నన్ను ఆదుకోమని ప్రార్థిం చింది. శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి, అక్కడనే గంగను ఉద్భవింపజేసెను. ఆ గంగ మహా ఉధృతంగా రాజు వైపు రాగా మహారాజు భయంతో పరుగిడి ఒక పర్వతం మీదకు చేరి తమ మంత్రిని విషయం అడుగగా, అతను రాజుకు విషయమంతా వివరించాడు.
-అప్పుడు రాజు పశ్చాతాపంతో మరణమే తన పాపానికి ప్రాయశ్ఛిత్తమని తలచి, శ్రీమహా విష్ణువును ధ్యానించాడు. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, రాజును విషయమడుగగా, రా జు తన బాధను వివరించాడు. అప్పుడు నార దుడు రాజుకు శ్రీకూర్మ మంత్రాన్ని ఉపదే శించి దీక్షతో ధ్యానించమని చెప్పాడు. ఈ గం గా ప్రవాహం వంశధార అను పేరుతో సాగ రంలో లీనమవుతుందని, ఇది సాగరసంగమ ప్రదేశమని చెప్పాడు. రాజు వంశధారలో స్నా నమాచరించి, అక్కడే వెలసి ఉన్న జ్ఞానేశ్వరు ని, సోమేశ్వరుని పూజించి, ఘోర తపస్సు చేసినా, మహానిష్ణువు కరుణించలేదు. అప్పు డు నారదుడు కూడా స్వామిని ప్రార్థించి రాజు కు దర్శనమివ్వవలసిందిగా కోరగా శ్రీమహావి ష్ణువు, కూర్మావతారంలో చక్రతీర్థగుండం నుండి వెలువడి, శ్వేతమహారాజుకు దర్శనమి చ్చాడు.

స్వామి నాలుగు చేతులతో, శంఖం, చక్రం, గద, పద్మములు ధరించి ఉన్నాడు. రాజు స్వామిని వేడి అక్కడ కొలువై ఉండుమని ప్రార్ధించగా శ్రీమహావిష్ణువు కొలు వై ఉండేందుకు తనకు తగిన మంచి స్థాన మునకై రాజు, నారదునితో కలసి ఒక వట వృక్షం వద్దకు వచ్చి, ఆవృక్షముపై చక్ర ప్ర యోగం చేశాడు. అక్కడ క్షీర సమానమైన జలం ఉద్భవించింది. ఈ గుండమునే కూర్మ గుండము లేక శ్వేత గుండము అంటారు. చక్రము వెళ్ళిన మార్గము నుండి శ్రీమహా లక్ష్మి ప్రత్యక్షమై, స్వామివారి వామభాగము నందు వసించెను. అంత శ్రీకూర్మనాధుడు లక్ష్మీ సమేతుడై అక్కడనే నిత్యనివాసమేర్పరు చుకొన్నాడు.
-శ్రీకూర్మక్షేత్రానికి వంశధారా నదీ తీరంలో శ్రీకూర్మశైలమను పర్వతం ఉంది. ఇది శ్రీకూర్మనాథుని విరాడ్రూపమని నమ్మకం. క్షేత్రమునకు దక్షిణాన ప్రేతశిల అను పర్వతముంది. ఇక్కడ కౌటిల్యతీర్థముంది. ఈ తీర్థములో స్నానమాచరించి, ప్రేతశిల యందున్న విష్ణుపాదాలపై పిండప్రదానము చేసి కౌటిల్య తీర్థములో పితృతర్పణము చేసిన గయలో శ్రాద్ధము వలన కలుగు ఫలమే లభిస్తుంది. శ్రీకూర్మనాథుని కొలుచుట ఒక ఆచారంగా వస్తున్నది.
                                     

No comments:

Post a Comment