Wednesday 19 November 2014

ఉ.శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం
గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు
ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!1
ఉ.రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద
శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో
ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!2
చ.అగణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ
విగతసమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ
ద్గగనధునీమరంద పదకంజవిశేష మణిప్రభా ధగ
ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!3
ఉ.రంగదరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ స
త్సంగ ధరాత్మజాహృదయసారసభృంగ నిశాచరాబ్జమా
తంగ శుభాంగ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!4
ఉ.శ్రీద సనందనాది మునిసేవితపాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూతపరిపాలవినోద విషాదవల్లికా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!5
ఉ.ఆర్యులకెల్ల మ్రొక్కి వినతాంగుఁడనై రఘునాథభట్టరా
చార్యుల కంజలెత్తి కవిసత్తములన్‌ వినుతించి కార్యసౌ
కర్యమెలర్పనొక్క శతకంబొనఁగూర్చి రచింతునేఁడు తా
త్పర్యమునన్‌ గ్రహింపుమిది దాశరథీ! కరుణాపయోనిధీ!6
చ.మసకొని రేఁగుబండ్లకును మౌక్తికముల్‌ వెలబోసినట్లు దు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా
రసనకుఁ బూతవృత్తిసుకరంబుగఁ జేకురునట్లు వాక్సుధా
రసములు చిల్కఁ బద్యముఖరంగమునందు నటింపవయ్య సం
తసమును జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!7
ఉ.శ్రీరమణీయహార యతసీకుసుమాభశరీర భక్తమం
దార వికారదూర పరతత్త్వవిహార త్రిలోకచేతనో
ద్ధార దురంతపాతకవితానవిదూర ఖరాదిదైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!8
చ.దురితలతాలవిత్ర ఖరదూషణకాననవీతిహోత్ర భూ
భరణకళావిచిత్ర భవబంధవిమోచనసూత్ర చారువి
స్ఫురదరవిందనేత్ర ఘనపుణ్యచరిత్ర వినీలభూరికం
ధరసమగాత్ర భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
9చ.కనకవిశాలచేల భవకాననశాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుతసద్గుణకాండ కాండసం
జనిత పరాక్రమ క్రమవిశారద శారద కందకుంద చం
దనఘనసార సారయశ దాశరథీ! కరుణాపయోనిధీ!10
ఉ.శ్రీరఘువంశ తోయధికి శీతమయూఖుఁడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్‌ వికసితోత్పల చంపకవృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనములఁ బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!11చ.గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది ముష్కరుల్‌
సరసులమాడ్కి సంతసిల జాలుదురోటు శశాంకచంద్రికాం
కురముల కిందుకాంతమణికోటి స్రవించినభంగి వింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ! కరుణాపయోనిధీ!12చ.తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరుగుచువంకయైన మలినాకృతిఁబాఱినఁ దన్మహత్త్వముం
దరమె గణింపనెవ్వరికి దాశరథీ! కరుణాపయోనిధీ!13ఉ.దారుణపాతకాబ్ధికి సదాబడబాగ్ని భవాకులార్తి వి
స్తార దవానలార్చికి సుధారసవృష్టి దురంతదుర్మతా
చార భయంకరాటవికిఁ జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!14చ.హరునకు నవ్విభీషణున కద్రిజకుం దిరుమంత్రరాజమై
కరికి నహల్యకున్‌ ద్రుపదకన్యకు నార్తిహరించు చుట్టమై
పరగినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిఁక దాశరథీ! కరుణాపయోనిధీ!15ఉ.ముప్పునఁ గాలకింకరులు ముంగిటవచ్చినవేళ రోగముల్‌
గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండినవేళ బాంధవుల్‌
గప్పిన వేళ మీ స్మరణ గల్గునొ గల్గదొ నాఁటి కిప్పుడే
తప్పక చేతు మీభజన దాశరథీ! కరుణాపయోనిధీ!16చ."పరమదయానిధే పతిత పావననామ హరే"యటంచు సు
స్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమున దాల్తు మీరటకు జేరకుఁడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునఁట దాశరథీ! కరుణాపయోనిధీ!17చ.అజునకుదండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు స
ద్ద్విజమునికోటికెల్లఁ గులదేవతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యు బరిపూర్ణుఁడవై వెలుగొందు పక్షిరా
డ్ధ్వజ మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!18ఉ."పండిత రక్షకుం డఖిల పాపవిమోచనుఁ డబ్జసంభవా
ఖండలపూజితుండు దశ కంఠవిలుంఠన చండకాండ కో
దండకళాప్రవీణుఁ"డను తావక కీర్తివధూటికిత్తు బూ
దండలుగాఁగ నా కవిత దాశరథీ! కరుణాపయోనిధీ!19ఉ.శ్రీరమ సీతగాఁగ నిజసేవకబృందము వీరవైష్ణవా
చారజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాఁగ వసించు చేతనో
ద్ధారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ! కరుణాపయోనిధీ!20
చ.సిరులిడ సీత పీడలెగజిమ్ముటకున్‌ హనుమంతుఁ డార్తి సో
దరుఁడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్‌
గరుణఁ దరిల్ప మానవులఁ గావఁగఁ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!31చ.హలి కులిశాంకుశ ధ్వజ శరాసన శంఖ రథాంగ కల్పకో
జ్జ్వల జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలవునఁజేర్చి కావగఁదె దాశరథీ! కరుణాపయోనిధీ!32చ.జలనిధిలోనదూఱి కులశైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటి రక్కసుని యంగము గీటి బలీంద్రునిన్‌ రసా
తలమునమాటి పార్థివకదంబముగూర్చిన మేటి రామనా
తలఁపుననాటి రాఁగదవె దాశరథీ! కరుణాపయోనిధీ!33ఉ.భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో
దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్‌
రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా
డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే
దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!34ఉ.అవనిజ కన్నుదోయితొగలందు వెలింగెడు సోమ జానకీ
కువలయనేత్ర గబ్బిచనుఁగొండలనుండు ఘనంబ మైథిలీ
నవనవయౌవనంబను వనంబునకున్‌ మదదంతి వీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ! కరుణాపయోనిధీ!35చ.ఖరకరవంశజా విను మఖండిత భూతపిశాచ ఢాకినీ
జ్వరపరితాప సర్వభయవారకమైన భవత్పదాబ్జవి
స్ఫురదురువజ్రపంజరముఁ జొచ్చితి నీయెడ దీనమానవో
ద్ధరబిరుదాంక యేమఱకు దాశరథీ! కరుణాపయోనిధీ!36ఉ.జుఱ్ఱెద మీకథామృతము జుఱ్ఱెద మీపదకంజతోయమున్‌
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే
జుఱ్ఱెద జుఱ్ఱజుఱ్ఱఁగ రుచుల్‌ గనువారిపదంబుఁ గూర్పవే
తఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!37ఉ.ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్‌ దరిద్రతా
కారపిశాచసంహరణకార్యవినోది వికుంఠమందిర
ద్వార కవాటభేది నిజదాసజనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!38ఉ.విన్నపమాలకించు రఘువీర! నహిప్రతిలోకమందు నా
కన్నదురాత్ముఁడు బరమకారుణికోత్తమ! వేల్పులందు నీ
కన్న మహాత్ముఁడుం బతిత కల్మషదూరుఁడు లేఁడునాకు వి
ద్వన్నుత నీవె నాకు గతి దాశరథీ! కరుణాపయోనిధీ!39ఉ.పెంపనుఁ దల్లివై కలుషబృందసమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై మెయువసించు దశేంద్రియరోగముల్‌ నివా
రింపను వెజ్జువై కృప గుఱించి పరంబు దిరంబుగాఁగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!40
ఉ.కుక్షినజాండ పంక్తులొనఁగూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవు గావలదె పాపము లెన్ని యొనర్చినన్‌ జగ
ద్రక్షక కర్త వీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!41ఉ.గద్దరి యోగిహృత్కమల గంధరసానుభవంబుఁజెందు పె
న్నిద్దపు గండుఁదేఁటి ధరణీసుత కౌఁగిలిపంజరంబునన్‌
ముద్దులు గుల్కు రాచిలక ముక్తినిధానమ రామ రాఁగదే
తద్దయు నేఁడు నాకడకు దాశరథీ! కరుణాపయోనిధీ!42చ.కలియుగ మర్త్యకోటి నినుఁ గన్గొనరాని విధంబొ భక్తవ
త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధిఁగ్రుంకుచో
బిలిచినఁ బల్కవింతమఱపే నరులిట్లనరాదుగాక నీ
తలఁపునలేదే సీత చెఱ దాశరథీ! కరుణాపయోనిధీ!43చ.జనవర! మీ కథాళి విన సైఁపక కర్ణములందు ఘంటికా
నినద వినోదముల్‌ సలుపు నీచునకున్‌ వరమిచ్చినావు ని
న్ననయమునమ్మి కొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనం
దననుత! మాకొసంగుమయ దాశరథీ! కరుణాపయోనిధీ!44ఉ.పాపము లొందువేళ రణపన్నగభూత భయజ్వరాదులం
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిం
బ్రాపుగ నీవుఁ దమ్ముఁడిరు ప్రక్కియలంజని తద్విపత్తిసం
తాపముమాన్పి కాతువఁట దాశరథీ! కరుణాపయోనిధీ!45చ.అగణితజన్మకర్మదురితాంబుధిలోఁ బహుదుఃఖవీచికల్‌
దెగిపడ నీఁదలేక జగతీధవ నీ పదభక్తినావచేఁ
దగిలి తరింపగోరితిఁ బదంపడి నాదు భయంబుమాన్పవే
తగదని చిత్తమందిడక దాశరథీ! కరుణాపయోనిధీ!46ఉ.నేనొనరించు పాపము లనేకములైనను నాదుజిహ్వకుం
బానకమయ్యె మీపరమ పావననామము దొంటి చిల్క "రా
మా! ననుఁగావు"మన్న తుది మాటకు సద్గతిఁజెందెఁ గావునన్‌
దాని ధరింపఁగోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!47చ.పరధనముల్‌ హరించి పరభామలనంటి పరాన్నమబ్బినన్‌
మురిపముకాని మీఁదనగు మోసమెఱుంగదు మానసంబు దు
స్తరమిది కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్మునే
తఱిదరిఁజేర్చి కాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!48ఉ.చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్‌
చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ
చేసితినేరముల్‌ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్య యయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!49చ.పరుల ధనంబుఁజూచి పర భామల జూచి హరింపగోరు మ
ద్గురుతరమానసంబనెడు దొంగనుబట్టి నిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునఁ గట్టివేయఁగదె దాశరథీ! కరుణాపయోనిధీ!50

No comments:

Post a Comment