ప్రియమైన డాడీ!
ఎన్నో ఏండ్ల నుండీ నీతో కాదు మీతో ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. ఐనా అవకాశం రాలేదు.ఇప్పటికీ నాకు బాగాగుర్తు....చిన్నప్పుడు నీతో ఎన్నో కబుర్లు చెప్పాలనీ,ఎన్నో ఊసులు ఆడాలనీ అనుకొనే దానను.నువ్వొస్తే ఎన్నో కబుర్లు నీతో చెప్పాలని కళ్లల్లో ఒత్తులు వేసుకొని రోజూ రాత్రి ఎదురు చూసేదానను. మీ ఒడిలో ఒక్కసారి నిద్రపోవాలని నీ బొజ్జను తలగడగా చేసుకోవలనీ అనుకొనేదానను.ఒక్కొక్కప్పుడు నిద్రముంచుకొచ్చేది.మీరు ఎప్పుడో అర్ధరాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చేవారు.నేనెప్పుడు చూసినా చిరాగ్గా అసహనంగా కనిపించేవారు.ఒక్కోసారి మమ్మీతో గొడవపడేవారు అప్పుడు నేను నెమ్మదిగా నాగదిలోకి వెళ్ళిపోయేదానను.ఉదయాన్నే నీగదికి వచ్చి నిన్ను లేపుదామంటే మమ్మీ కోప్పడేది.ప్లే స్కూల్లో ఆయా నన్నేమి చేసిందో నీకు చెప్పాలనుకొనేదానను.మమ్మీకి చెబితే నన్నే తిరిగి కొట్టేది.మూడేళ్ళకు నన్ను నర్సరీలో చేర్చారు.చింటూగాడి డాడీ ఎంతమంచివాడో హోంవర్కంతా తనే చేసేవాడు.మా టీచర్ తో రోజూ దెబ్బలు కాసేదానను.ఎక్కువ వర్క్ కదా.ఒక్కో టీచరూ వచ్చేది హోంవర్క్ ఇచ్చేసేది.అంతే మాకు పాఠాలు చెప్పడానికి మరెక్కడిది సమయం.ఉదయం మెను మేల్కొనేసరికి మీరు వాకింగ్ కి వెళ్ళిఫోయేవారు.ఏడింటికి స్కుల్ల్ బస్సు వచ్చేసేది.సాయంత్రం ఆడుకోవడానికి అవకాశం ఏది? మమ్మీ డైరీలో నేను సాయంత్రం చదవట్లేదని మాటీచర్ కి రిపోర్ట్ చేసింది.అందుకు మాటీచర్ మరికాస్తా ఎక్కువ హోంవర్క్ ఇచ్చేది.నాకు ఒకసారి డ్రాయింగ్ లొ ఫస్టు వచ్చింది.బహుమతి నీకు చూపిద్దామంటే ఆరోజు మమ్మీకి నీకు గొడవ.మూడురోజులు మాట్లాడుకోలేదు.చిరాగ్గా వుండేవారు.అప్పుడేమి చూపిస్తాను.నా అల్మరాలో దాచుకున్నాను.
6వ తరగతిలో నన్ను హాస్టల్ లొ చేర్పించారు.నా బాల్యం అక్కడితో బందిఖానా అయ్యింది.నా బాధ ఎవరితో చెప్పుకోనూ.మీరు ఎప్పుడో వారానికి ఒకసారి ఫొన్ చేసి నీ రాంక్ ఎందుకు తగ్గింది.నువ్వింకా బాగా చదవాలి.ఆ అమ్మాయి చూడు ఎలాచదువుతోందో.ఆ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకో అని తిడుతూ ఫోన్ పెట్టేసేవారు.మమ్మీకి నా అరోగ్య సమస్య గురించి చెబితే ఫరవాలేదు చిన్న విషయానికి ఫోన్ చేసేయాలా అని దెబ్బలాడేది.ఏలాగో ఒకలా టెంత్ 9.8 తో పాస్ అయ్యాను. మీతో తిట్లు తప్పవని తెలుసు. 24 గంటలూ దగ్గరుండి చదివిస్తాం నిద్ర రాకుండా మాత్రలు ఫ్రీగా ఇప్పిస్తాం.ఎటాచ్డ్ బాత్ రూం ఉన్న రీడింగ్ రూం మాప్రత్యేకత.ప్రతీ నలుగురుకీ ఒక సూపర్వైజర్.సాయంత్రం 6 నుండి తెల్లవారి 4 వరకూ స్టడీ హవర్,4.00-4.30 విరామం.4.30-5.00 యోగా,5.00-9.00ప్రత్యేక తరగతులు9.00-1.00రెగ్యులర్ తరగతులు.1.30 నుండి 6.00 వరకు IIT కోచింగ్. విజయవాడలో చేర్పించారు.B.Arch చదువుతానంటే IIT లాంగ్ టెర్మ్ లో చేర్పించారు.కంటి నిండా నిద్రపోయి ఎరుగను.
ఇట్లు
మీ ముద్దుల కుమార్తె
మృదుల

No comments:
Post a Comment