Tuesday 4 November 2014

//వృద్ధాశ్రమం//
నేను పేదరాలిననీ ఎవరన్నారూ???
నా బిడ్డడు అమెరికాలో లచ్చలెన్నో
కూడబెట్టి లచ్చనంగ ఇల్లుగట్టి
లచ్చిమంటి కోడలితో చల్లగా ఉండబట్టి
నాకిక్కడ గంజికేమో కరువన్నది లేకుండా
కాసులేమొ పంపుతుండు చూసుకోమన్నాడు

పనిమనిసికి లక్షెందుకు మీఅమ్మని తెమ్మని
కోడలేమొ పోరుబెడితే పాసుపోర్ట్ చేసిండు
అమెరికా చూపిస్తననీ అక్కడకూ తీసుకెల్లి
అంటులన్ని తోమించి,గుడ్డలన్ని ఉతికించి
వంటనాతొ చేయించి, పనిమనిసిని మానిపిస్తె
నెలకు రెండు లచ్చలు నాకొడుకుకు మిగిలాయని
నాకొడుకే బాగుపడితే అంతకన్న నాకేమని
ఇంకేటీ కావాలని సంబరపడిపోయాను

అంతలోనె అంతులేని రోగమేదొ వచ్చిందని
టెస్టులేవొ చేసినారు లచ్చలౌతయన్నారు
ఏపనికీ పనికి రాక దీనిపనీ మాకేటని
దిక్కులేని దానిమల్లె ఇక్కడ వదిలేసారు.
వృద్ధులను కదిలిస్తే అంతులేని గాదలెన్నో
4/11/14

No comments:

Post a Comment