Tuesday, 2 December 2025

కోపం తెచ్చే అనర్ధం రంగమ్మ పరమ కోపిష్టి అవిడ కోపానికి ఆగలేక ఎన్వరూ కూడా ఇంట్లో పనిచేయలేక పోయేవారు నెలకు నలుగురు వంట మనుషులు మారేవాడు. కొంతకాలానికి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు చేరాడు మాదయ్య తెలివైనవాడు. వంటలుకన్నా వాడి మాటలు గమ్మత్తుగా ఉండేవి. ఒకనాడు వాడు కాఫీ కోవాలో పోసి టేబుల్ మీదపెట్టి వెళ్ళిపోయాడు రంగమ్మ కాఫీ తాగేముందు దాని మీద మూత తీసివేసి, చాలాసేపు పేపరు చదువుతూ కొద్దికొద్దిగా కాఫీ పుచ్చుకుంటోంది. ఇంతలో ఒక ఈగ వచ్చి కాఫీలో పడి చచ్చింది. ఆ కాఫీ పారబోయించి వేరే కాఫీ తెప్పించుకోవలసి వచ్చింది రంగమ్మకు అయితే తన అజాగ్రత్తవల్ల కాఫీలో ఈగ పడిందని అనిపించుకోవడం రంగమ్మకు సుతారమూ ఇష్టంలేదు. అందువల్ల ఆ నెపం వంటవాడి మీద వెయ్యాలని నిక్రయించుకుందామె. వెంటనే మారయ్యని పిలిచి 'ఏమోయ్! ఇంత అజాగ్రత్త అయితే ఎలా? కాపీ కోపాలో ఈగపడింది. అంది కోపంగా దానికి వెంటనే మారయ్య తడుముకోకుండా "అమ్మా! కాఫీలో ఈర పడకపోతే ఏనుగు పడుతుందా?" అన్నాడు. "ఏనుగు పడదని నాకు తెలుసుకొని ఈగపడేలాగు పాలమీద మూత లేకుండా వుంచి, ఇంకా పెంకిమాటలు మాట్లాడతావేం" అని చాలా కోపంగా అడిగింది. రంగమ్మ."అమ్మా! ఇందులో నా తప్పేమీ లేదు. మీ పాలు మంచివికావు, అందువల్ల ఇంత అవస్థ వచ్చి పడింది' అని చమత్కరించాడు. దానికి రంగమ్మ నొచ్చుకుంటూ "పని బాగా చేయమంటే కథలు చెబుతా వేమిటి? మర్యాదగా తప్ప ఒప్పుకో.." అంది. ఆ మాటలకు మారయ్య "అమ్మా నీ దగ్గర పనిచేయడం నావల్ల కాదు.. అంటూ: అక్కడి నుంచి వెళ్ళిపోయాడు." రంగమ్మకు నోటమాట రాలేదు. తానొకటి తలిస్తే ఒకటి జరిగింది. ఉన్నట్టుండి. పనివాడే మానేసేసరికి ఇబ్బంది పడిందామె. అయితే ఆ తర్వాత రంగన్ను, గురించి తెలిసిన వారెవ్వరూ ఆమె దగ్గర పనిచేయడానికి రాలేదు. ఒకనాడు రంగమ్మకు జబ్బు చేసింది. మాట సహాయానికిగాని, వంట చేయడానికి గాని ఎవ్వరూ లేకపోవడంతో, అలాగే నీరసంతో వెళ్ళి సాయ్యిమీద కాఫీ పెట్టుకోబోయి పొయ్యిమీదపడి కాలిపోయి మరణించింది. తన కోపమే తన శతువనడానికి ఇదొక ఉదాహరణ..

No comments:

Post a Comment