Monday, 8 December 2025

@@@@అపూర్వవస్తువు@@@@ పూర్వం విదర్భదేశాన్ని పాలించిన ఒక తనకు అపూర్వవస్తువు కానుక ఇచ్చిన వారికి ఏటా పదివేల బంగారు నాణాలు బహుమానం ఇచ్చేవాడు. ప్రవరుడు అనే మంత్రవైద్యుడు ఆ రాజ్యంలో ఉండేవాడు. ఆయన చాలా కాలం కృషి చేసి ఒక అద్భుత రసా యనం తయారు చేశాడు. దాన్ని తాగుతూ ఎవరు ఏ రూపం తలుచుకుంటే ఆ రూపం పొందుతారు. అయితే అలాటి వాళ్ళకు యథారూపం కావాలంటే ఆ రసాయ నానికి విరుగుడు వెయ్యాలి. ఆ విరుగుడు మందు తయారు చెయ్యటం వైద్యుడికి సాధ్యపడలేదు. అందుచేత ఆయన తన అద్భుత రసాయనాన్ని ఎవరిపైనా ప్రయో గించక, రాజుగారితో దాన్ని గురించి చెప్పి, ఒక సంవత్సరం రాజుగారి బహు మానం పొందటానికి ఆ రసాయనాన్ని ఒక గిన్నెలో పోసి తెచ్చి, రాజుగారికి చూపాడు. ఆయన రాజుతో ఆ రసాయన ప్రభావం చెప్పి, "దీనికి విరుగుడు తయారు చెయ్య టానికి ఒక్క వస్తువు దొరకలేదు. అందు చేత దీన్ని ఇంతవరకు ప్రయోగించలేదు. తమరు దీన్ని ఈ యేడు అపూర్వవస్తువుగా పరిగణించి నాకు బహుమానం ఇప్పించితే నేను ధన్యుణ్ణి అవుతాను." అన్నాడు. “దీన్ని పరీక్షించకుండా అపూర్వవస్తు పని ఎలా తెలుసుకోవటం ? నీ కొడుకు చేత తాగించి దీని ప్రభావం నిరూ పించు." అన్నాడు రాజు. వైద్యుడి కొడుకును తీసుకు రమ్మని ఆయన భటు డితో అన్నాడు. వైద్యుడు వద్దని ఎంత లబలబలాడినా, మందు ప్రభావం చూడా లన్న కుతూహలంతో రాజు వినిపించు కోలేదు.వైద్యుడి కొడుకు పన్నెండేళ్ళవాడు వచ్చాడు. రాజు వాడితో, "నీకు పక్షి అయి ఎగరాలని ఉన్నదా? జింక అయి పరి గెత్తాలని ఉన్నదా? ఏనుగు కావాలని ఉన్నదా ? ఏదో ఒకటి కోరుకుంటూ ఈ మందు తాగు," అన్నాడు. వైద్యుడు, " వద్దు, వద్దు, గిలగిలలాడాడు. 4. అంటూ "ఎందుకు చింతిస్తావు? విరుగుడు మందు కనిపెట్టి నీ కొడుకుకు యథా రూపం కలిగించు. నీకు మరొక బహు మానం మళ్ళీ ఇస్తాను," అన్నాడు రాజు. వైద్యుడి కొడుకు జింక రూపం తలుచు కుంటూ మందు తాగి, జింకగా మారి పోయాడు. వైద్యుడు వలవలా ఏడ్చాడు. "ఎందుకు ఏడుస్తావు ? బహుమానం తీసుకో. విరుగుడు మందు వెంటనే కని పెట్టు," అన్నాడు రాజు వైద్యుడితో. "దానికి కావలిసిన ఒక వస్తువు దుర్లభం," అన్నాడు వైద్యుడు. " ఏమిటా వస్తువు? " అన్నాడురాజు. "యాభైఏళ్ళు దాటి, రాజవంశంలో పుట్టినవాడి కుడి కన్ను కావాలి. అది దొరికితేనే గాని విరుగుడు మందు తయారు కాదు," అన్నాడు వైద్యుడు. "అంతే గద ? నా శత్రువైన కోసల రాజు యాభైఏళ్ళు మించినవాడే. నేను అతడి మీద దండెత్తిపోయి, అతణ్ణి చెర పట్టి, అతడి కుడి కన్ను పీకి ఇచ్చేస్తాను. -తొందరపడకు!" అన్నాడు రాజు.మంత్రవైద్యుడు దుఃఖిస్తూ, జింక అయిపోయిన తన కొడుకును తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుగారి సేవ కులు బహుమానాన్ని ఆయన ఇంటికి చేర్చారు. విదర్భరాజుకు కూడా పన్నెండేళ్ళ కొడుకు న్నాడు. అతనూ, వైద్యుడి కొడుకూ ఒకే గురువు దగ్గిర చదువుకుని. గాఢ స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఒక రోజు రాజు కొడుకు తన మిత్రుడి కోసం వైద్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు వైద్యుడు, "దిక్కుమాలిన ఈ మందుతో నేను వంశనాశనం తెచ్చి పెట్టుకున్నాను." అంటూ రాజ కుమారుడికి మందు చూపాడు. రాజుకొడుకు తాను కూడా జింక అయిపోయి తన మిత్రుడితో సమానం కావాలని తీవ్రమైన కోరిక కలిగి, అలాగే కోరుకుంటూ ఆ రసాయనం కాస్తా తాగాడు. వెంటనే అతనికి కూడా జింక రూపం వచ్చేసింది. అతనితో వచ్చిన సేవ కులు జింకను వెంటపెట్టుకుని వద్దకు తిరిగివెళ్ళారు. రాజు తన కొడుకు కూడా జింక అయిపోయే సరికి రాజుకు మిన్ను విరిగి మీద పడ్డట్ట యింది. ఆయన ప్రగల్భాలు పలికాడే గాని, కోసలరాజును జయించే శక్తి ఆయనకు లేదు. కోసలరాజును పట్టు కోవటం కాదు గదా, యుద్ధంలో ఎది రించే శక్తి కూడా విదర్భరాజుకు లేదు. వైద్యుడి కొడుకు జింకగా మారితే రాజుకు ఏమంత బాధ అనిపించలేదు గాని, తన కొడుకే అలా అయేసరికి, విరుగుడు మందు కోసం తాను తొందర పడవలిసి వచ్చింది. విదర్భ రాజు తనకు కూడా యాభై దాటాయి గనక. తన కుడి కన్ను వైద్యుడికి పీకి ఇచ్చాడు. విరుగుడు మందు తయారయింది. రాజు కొడుకూ, వైద్యుడి కొడుకూ తిరిగి మామూలు రూపు పొందారు. ప్రగల్భాలు పలికినందుకు రాజు మాత్రం ఒంటి కన్నువాడయాడు.

No comments:

Post a Comment