Monday, 8 December 2025

###వర్మ-శర్మ### ఒక గ్రామం మధ్య లో ప్రాచీన రామ మందిరం ఉండేది. విష్ణుశర్మ దానికి అర్చకుడు. ఆ వూళ్ళో ఒక ఆచారం ఉండేది. వూళ్ళో ఎవరైనా చచ్చిపోతే, మూడు రోజులపాటు అర్చనలు లేకుండా రామాలయాన్ని మూసి ఉంచేవారు. ఊరికి కొద్ది దూరంలో ఒక పట్నం వుండేది. అక్కడ సంత జరిగే రోజున ఊరివాళ్ళు అక్కడి నుంచి ఉప్పులూ, పప్పులూ తెచ్చుకునేవాళ్ళు. ఒక సంత రోజు విష్ణుశర్మ పట్నం వెళ్ళి, ఇంటికి కావలసిన సరుకులు కొని, బండికి ఎత్తి స్తూండగా, ఎదురుగా మేడలో ఉండే వర్మ పిలిచాడు. విష్ణుశర్మ వర్మని కలుసుకుని, విషయం తెలుసుకున్నాడు. క్రితం నెల వర్మగారి భార్యకు తీవ్రంగా జబ్బు చేసింది. ఆమెకు జబ్బు నిమ్మ ళిస్తే, వెయ్యి నూటపదహార్లు ఖర్చు చేసి రాముడికి వైభవంగా కల్యాణం చేయిస్తా నని మొక్కుకున్నాడు. వర్మగారి భార్యకు జబ్బు నయమైపోయింది. "ఎప్పుడు వద్దామనుకున్నా తీరకుండా ఉన్నది. నాకు లక్ష పనులు. రేపు సాయంత్రం నేనూ, నా భార్యా మీ ఊరు వస్తాం. అన్ని ఏర్పాట్లూ చేయించి ఉంచండి. ఎల్లుండి దేవుడికి కల్యాణం జరిపించి, పేదలకు అన్నదానం చేద్దాం," అన్నాడు వర్మ విష్ణుశర్మతో. ఆ మాట విని విష్ణుశర్మ ఉక్కిరి బిక్కిరి అయాడు. అతని హయాంలో అంత పెద్ద ఎత్తున దేవుడికి కల్యాణం చేయించిననవారు లేరు. "మహారాజుగా రండి. అన్ని ఏర్పాట్లూ చేసి ఉంచుతాను." అని వర్మగారికి చెప్పి, విష్ణుశర్మ ఆనందంలో తేలుతూ ఇల్లు చేరాడు.ఆయన బండిలో ఇల్లు చేరేసరికి చీకటి పడింది.. సామాను దించి, బండిని పంపేసి చూసేసరికి, అరుగు మీద ఎవరో పడుకుని ఉన్నట్టు లీలగా కనిపించింది. "ఎవరు వారు?'' అని ఆయన బండిలో ఇల్లు చేరేసరికి చీకటి పడింది.. సామాను దించి, బండిని పంపేసి చూసేసరికి, అరుగు మీద ఎవరో పడుకుని ఉన్నట్టు లీలగా కనిపించింది. "ఎవరు వారు?'' అని విష్ణుశర్మ గట్టిగానే అన్నాడు. జవాబు లేదు. విష్ణుశర్మ గొంతు విని, ఆయన భార్య శాంతమ్మ బయటికి వచ్చి, "ఈ ముద నష్టపు వెధవ ఇంకా వెళ్ళలేదూ? మీరు లోపలికి రండి," అన్నది భర్తతో. విష్ణుశర్మ లోపలికి వస్తూనే, ‘" ఎవడే వాడు?'' అని భార్యను అడిగాడు. ''ఎవడో పొగరుమోతు! సాయంత్రం అనగా వచ్చి, భోజనం పెట్టించమని ఒకటే పోరుపెట్టాడు. పెట్టనంటే, కదల నంటూ అరుగు మీద తిష్ఠవేశాడు. చూస్తే దొంగలా ఉన్నాడు. వాణ్ణి వెళ్ళగొట్టండి," అన్నది శాంతమ్మ. "భోజనం చేసినాక వాడి సంగతి చూద్దాంలే. ఈ రోజు మన పంట పండింది తెలుసా?'' అంటూ విష్ణుశర్మ పట్నంలో శెట్టిగారి మొక్కు విషయమంతా చెప్పి, "ఎలా లేదన్నా మనం అర్ధవెయ్యి న్నూట పదహార్లు మిగుల్చుకో వచ్చు. ఆయన మనిద్దరికీ బట్టలు పెట్టకపోరు." అన్నాడు. శాంతమ్మ తన భర్తకు భోజనం పెట్టింది.. విష్ణుశర్మ భోజనం ముగించి, పడుకునే ఆలోచనలో ఉండగా, ఆమె కిటికీలో నుంచి బయటి అరుగు మీదికి చూసి, " ఆ దౌర్భాగ్యు డింకా అరుగు విడిచి పోలేదు. వెళ్ళి వాణ్ణి పంపిం చెయ్యండి. లేకపోతే ఏ రాత్రివేళో పెరటి గోడ దూకి లోపలికి వస్తాడు,'' అని లబలబ లాడింది. విధిలేక విష్ణుశర్మ మూలనున్న కర్ర తీసు కుని, పెద్దగా చప్పుడు చేస్తూ వీధి తలుపు తెరిచాడు; తరవాత అరుగును కర్రతో గట్టిగా బాదుతూ, "ఎవడ్రా వాడూ? పొమ్మంటే కదలవేం?" అని అరిచాడు. కనిపించ లేదు. వెళ్ళి, ఏదో అనుమానం తగిలి, విష్ణుశర్మ దగ్గిరగా ఆ మనిషిని కదిపి చూశాడు. ఆ మనిషిలో చలనం లేదు: ''కొంప తీశాడేవ్! వీడు చచ్చినట్టు న్నాడు!" అని విష్ణుశర్మ కీచుగా అరిచాడు. "చస్తే చచ్చాడు ! పీడవిరగడయింది! లోపలికి రండి ! " అన్నది శాంతమ్మ. విష్ణుశర్మ లోపలికి వచ్చి, " ఏడిచావ్ ! పీడ చుట్టుకుంది ఇప్పుడు. వాడు చచ్చి నందుకు మూడురోజులపాటు గుడి మూసి ఉంచాలి. వర్మగారు ఎల్లుండి చేయించ బోయే కల్యాణం మాటేమిటి? ఆయనకు మళ్ళీ ఎప్పటికి వీలు చిక్కుతుందో ఏమో?'' అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం?" అన్నది శాంతమ్మ. "వీణ్ణి ఈ రాత్రికి రాత్రే వల్లకాట్లో పూడ్చి పెట్టెయ్యాలి. ఊరికి కొత్తవాడు గనక, రేపు ఎవరూ వీణ్ణి గురించి పట్టించుకోరు,'' అన్నాడు విష్ణుశర్మ . " ఈ మాట కాటికాపరికైనా తెలు స్తుందిగా?'' అన్నది శాంతమ్మ. "డబ్బు పారేస్తే వాడే నోరు మూసు కుంటాడు,'' అని, విష్ణుశర్మ ఎంతోకాలంగా పోగు చేసి పెట్టెలో దాచుకుంటున్న డబ్బు వంద రూపాయలు తీసి రొండిన కట్టుకుని, లోపల భయంగా ఉన్నా, మొండి ధైర్యంతో చీకట్లో పడి శ్మశానానికి వెళ్ళాడు. కాటికాపరి శ్మశానం దగ్గిరే గుడిసెలో ఉంటున్నాడు. విష్ణుశర్మ వాణ్ణి బయటికి పిలిచి, సంగతంతా చెప్పి, “ఈ విషయం మూడో కంటివాడికి తెలియగూడదు.'' అన్నాడు. విష్ణుశర్మ కోరినట్టు పని ముగించటానికి వంద రూపాయలు అడిగాడు కాటికాపరి. వాడితో బేరమాడి డెబ్బై అయిదు రూపాయలు తీసుకోవటానికి విష్ణుశర్మ వాణ్ణి ఒప్పించి, "నేను వెళ్ళి శవాన్ని తెస్తాను. ఈ లోగా నువు గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచు," అని చెప్పి ఇంటికి వచ్చాడు.శాంతమ్మ ఒక చాప ఇచ్చింది. విష్ణుశర్మ అరుగు మీది మనిషిని అందులో చుట్టి, నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. సగం దూరం వచ్చే సరికి విష్ణుశర్మ కి అలుపు వచ్చింది. వీధి ఆటూ ఇటూ చూసి, ఎవరూ లేరని తేల్చుకుని, విష్ణుశర్మ నెత్తి మీది బరువు ఒక అరుగుమీద దించి, రొప్పుతూ నిలబడ్డాడు. ఇంతలో విష్ణుశర్మ భుజంమీద చల్లగా చెయ్యి పడింది. విష్ణుశర్మ నిలువెల్లా వణికి, కెవ్వున అరవబోయి ఎలాగో నిగ్రహించు కున్నాడు. “ఓహో, విష్ణుశర్మ గారా? ఇంత అర్థరాత్రి వేళ చీకట్లో ఎక్కడికి ప్రయాణం?" అన్నాడు ఒక వ్యక్తి, విష్ణుశర్మ గుండు తడివి గుర్తుపట్టి. ఆ గొంతు వెంకయ్య అనే తాగు బోతుది. "నిద్రపట్టక అలా బయలుదేరాను," అన్నాడు విష్ణుశర్మ . " ఎందుకు అలా రొప్పుతున్నారూ? ఇదేమిటీ? చాప చుట్టలాగుందే? ఇందులో ఏదో వున్నట్టుందే?" అంటూ మొదలు పెట్టాడు వెంకయ్య. "అవునుగాని, నువ్వీ పూట కల్లుఅంగ డికి పోలేదల్లే ఉందే?" అన్నాడు విష్ణుశర్మ భయంతో చెమటలు కక్కుతూ, "కల్లు అంగడి కామయ్యకి పాతిక రూపాయలు బాకీ ఉన్నాను. బాకీ తీర్చి తేనేగాని కల్లు పొయ్యనన్నాడు." అన్నాడు వెంకయ్య. విష్ణుశర్మ చప్పున రొండి నుంచి పాతిక రూపాయలూ తీసి, ''ఇదుగో, పాతిక రూపాయలు. వెంటనే కల్లుపాక దగ్గిరికి వెళ్ళిరా, నాయనా!" అన్నాడు. వెంకయ్య బెడద తీరిపోయింది. విష్ణుశర్మ తేలికగా నిట్టూర్చి, చాపచుట్టనెత్తి కెత్తుకుని, శ్మశానం చేరుకున్నాడు. కాటి కాపరి గొయ్యి తవ్వి సిద్ధంగా ఉంచాడు. విష్ణుశర్మ దించబోతూండగా చాపచుట్ట దభాలున గోతిలో పడింది.“చచ్చాన్రోయ్ !'' అని గావుకేక పెట్టి, చాపచుట్టలో నుంచి మనిషి బయటికి వచ్చాడు. శాస్త్రి గుండె గుభేలుమన్నది. ''పిచ్చి శర్మ! బతికిన మనిషిని పూడ్చటానికి తెచ్చావా?'' అంటూ కాటి కాపరి విరగబడి నవ్వాడు. "ఇప్పుడెక్కడున్నానూ? నాది మొద్దు నిద్ర !'' అన్నాడు ఆ మనిషి. "ఎక్కడున్నావా? వల్లకాట్లో ! పద పద," అన్నాడు శర్మ ఆ మనిషి మీద విరుచుకు పడుతూ. ఆ మనిషి బిత్తరపోయి కాలిసత్తువ కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు. శర్మ కాటికాపరి దగ్గిర డబ్బు వాపసు పుచ్చుకోవాలని చూశాడు. కాటికాపరి జరిగినదంతా బయట పెట్టేస్తానన్నాడు. శవం లేదుగాని, రహస్యం ఉన్నది. అందుచేత శర్మ మారుమాటాడక ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపుగా శాంతమ్మ ఒక కునుకు తీసి, తనకు మొగుడు పట్టు చీర కొనిపెట్టినట్టు కల కన్నది. “ఎల్లుండి ఈపాటికి నీ కల నిజమవు తుందిలే!" అని శర్మ ఆమెకు ధైర్యం చెప్పాడు. కాని, మర్నాడు సాయంకాలా నికి వర్మగారు భార్యా సమేతంగా రాలేదు. ఆ మర్నాడు కూడా వాళ్ళ జాడలేదు. నాలుగు రోజులు వర్మగారికోసం ఎదురు చూసి, విష్ణుశర్మ శెట్టిగారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అప్పుడే వర్మ ఎక్కడినుంచో తిరిగి వచ్చాడు. రాత్రే 'మా నాయనమ్మకు ఒంట్లో బాగా లేదని కబురు వచ్చింది. ఊరు దూరమే. అయినా - బయలుదేరక తప్పలేదు. “రా రా! నీకు నేనే కబురు చేద్దా మనుకుంటున్నాను. నువు కనబడిన ఇప్పుడు ఆమెకు కులాసాగానే ఉన్నది. తీరా వెళ్ళాంగదా అని, నా మొక్కు ఆ పూరి దేవాలయంలోనే తీర్చేసు కున్నాను." అన్నాడు వర్మ. రాముడి కల్యాణం మాట ఎలా ఉన్నా విష్ణుశర్మ పెళ్ళి బాగా కుదిరింది !

No comments:

Post a Comment