Monday, 8 December 2025

####కాంతం _ కనకయ్య#### కాంతం కనకయ్య భార్యా భర్తలు. కనకయ్య తిండి కోసం ఎంతయినా ఖర్చు పెడతాడు గాని, బట్టలకు ఖర్చు పెట్టడు. కాంతం ఇందుకు విరుద్ధం. వంటింట్లో ఏం తిన్నా నలుగురి ముందూ బాగా కనబడాలని ఆమె ఉద్దేశం. భర్త కొని పెట్టడు గనుక, ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి ఆరు చీరలు తెప్పించుకునేది. అనంతయ్య చిరిగిన బట్టలనే కుట్టుకుని వాడుకునేవాడు. కనకయ్య దగ్గిర ఉన్న బట్టలలో కెల్లా అతి పురాతనమైనది. ఒక గళ్ళ గావంచా. ఆ అభిమానం కొద్దీ, పేలికలైన ఆ గావంచాను వదులుకోలేదు అనం తయ్య. తన భర్త ఆ చిరుగుల గావంచా కట్టుకుని నలుగురి మధ్యా తిరుగుతూంటే కాంతం కు తల తీసేసినట్టుగా ఉండేది. రోజూ భార్యా భర్త లిద్దరూ ఆ గళ్ళ గావంచా గురించి తగవులాడుకునే వారు. ఒకనాడు కనకయ్య స్నానం చేసి, తన గావంచాను ఉతికి, గాలికి ఎగిరి పోతుందని దాన్ని ఇంట్లో ఆరవెయ్య టానికి తెచ్చాడు. అప్పుడే కాంతం వంటింట్లో నుంచి వచ్చి. మా అక్క వస్తానని కబురు చేసింది. నా పూసల సంచీ పూసలు కొన్ని ఊడిపోయాయి. పట్నం తీసుకుపోయి అల్లించుకురా. ఆ దిక్కుమాలిన గావంచా ఊరవతల పారెయ్యి. మా అక్క చూస్తే నవ్వు తుంది." అన్నది. కనకయ్య భార్య మాటలు వినిపిం చుకోకుండా గావంచాను దండెం మీద ఆరేస్తూ. "నీ పూసల సంచీ బాగుచేయిం చటమేనా నాకు పని ? ' అని అడిగాడు. కాంతం కు కోపం ముంచుకొచ్చి, గావంచాను లాక్కుని పెరట్లోకి విసిరివేసి,ఆ గావంచా ఇంట్లో ఆరవేస్తే ఇల్లంతా కుళ్ళు కంపు!'' అన్నది. కనకయ్య ఆ గావంచాను మళ్ళీ తడిపి, పిండి, వీధి కటకటాలలో ఆర వేశాడు. అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయటానికి వెళ్ళిపోయినాక, కాంతం ఆ గావంచాను తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది. ఎండవేళ దారివెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమెకు కనిపించాడు. ఆమె వాణ్ణి పిలిచి, ఆ గావంచా పట్టుకు పొమ్మన్నది. ఆ బిచ్చగాడు గావంచా కేసి చీదరించుకుంటూ చూసి, “ఈ కుళ్లుబట్ట నాకు దేనికి?'' అంటూ పోబోయాడు. బిచ్చగాడు ఒక రూపాయి పుచ్చుకుని ఆ గావంచా పట్టుకుపోయాడు. కనకయ్య ఆ సాయంత్రం ఇంటికి వస్తూండగా ఆ బిచ్చగాడు కనిపించాడు. వాడి భుజం మీద తన చిరుగుల గావంచా ఉన్నది. కనకయ్య ఆవేశంతో బిచ్చ గాడి పీకపట్టుకుని, దొంగపీనుగా! నిక్షేపంలాటి. నా గావంచా దొంగిలిస్తావా?" అన్నాడు. చాల్చాల్లేవయ్యా. ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది. " అని బిచ్చగాడు విసు రుగా తన దారినపోయాడు. కనకయ్య అంతకన్న విసురుగా తన ఇంటి కేసి నడిచాడు. గుడికి వెళుతూ కాంతం అతనికి దారిలోనే ఎదురయింది. " నా గావంచా బిచ్చగాడి కిచ్చావా?" అని కనకయ్య కాంతంను అడిగాడు. "బాబ్బాబు, ఒక రూపాయి ఇస్తాను గాని, దాన్ని పట్టుకుపో," అని కాంతం వాణ్ణి బతిమాలింది: ''అవును! అది విరగడ అయినందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను," అనేసి కాంతం వెళ్ళిపోయింది. కనకయ్య కోపంతో పళ్ళు పట పటకొరికాడు. ఎలాగైనా ఆ గావంచా తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకుని, కనకయ్య ఇంటికిపోయి, గోడకు తగిలించి ఉన్న పూసలసంచీ తీసుకుని, పొరుగింటి పుల్లమ్మతో, '' కాంతం వస్తే, పూసల సంచీ అల్లించటానికి పట్నం వెళ్ళానని చెప్పండి." అని చెప్పి బయలుదేరాడు. కనకయ్య న లుగురినీ వాకబు చెయ్యగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మర్రిచెట్టు కింద వుంటున్నాడని తెలిసింది. అతను అక్కడికి వెళ్ళేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు. వాడి గుడ్డిపెళ్ళాం చెట్టు మొదలుకు చేరగిలబడి కూర్చుని ఉన్నది. ఆమె పక్కన పాత అతుకుల సంచీ, దాని నిండా గుడ్డ పీలికలూ ఉన్నాయి. ఆమె చేతిలో ఒక చింత బరికె ఉన్నది. కనకయ్య దగ్గిరిగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలిమీద బరికెతో కొట్టి, " ఎవడివిరా నువ్వు ? గుడ్డి ముండను కదా అని ఏదన్నా పట్టుకు పోదామనుకున్నావా ?'' అన్నది. అనంతయ్య బాధతో మూలుగుతూ, "నీ మొగుడి కోసం వచ్చాను,” అన్నాడు. “అయితే చీకటి పడ్డాక రా ! '' అన్నది. గుడ్డిది. కనకయ్య వెళ్ళినట్టే వెళ్ళి, వెనక వైపుగా వచ్చి, అతి జాగ్రత్తగా మర్రిచెట్టు ఎక్కి కూర్చున్నాడు. చీకటిపడి బిచ్చగాడు వచ్చి, దరిద్రపు గావంచా దొరికిన వేళావిశేషం ఏమిటోగాని రోజూ దొరికే దానిలో ఈ పూట సగంకూడా దొరకలేదు." అంటూ వాడు కనకయ్య గావంచాని పేలికలున్న సంచీలో కుక్కేశాడు. కనకయ్య మనస్సు చివుక్కుమన్నది. తరవాత బిచ్చగాడు వంటచేసి, తానూ, తన భార్యా తిని, అర్థరాత్రి దాకా ఏవో పదాలు పాడుకుని, పడుకున్నారు. వాళ్లు మంచి నిద్రలో ఉన్నట్టు రూఢిచేసుకుని కనకయ్య చెట్టు దిగబోతూండగా, ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి, ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. "ఎక్కడదాద్దాం?” అన్నాడు ఒకడు, ఆ గుడ్డల సంచీలో దాద్దాం. చలి కాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్లు గుడ్డలు బయిటికి తీయరు,'' అన్నాడు రెండోవాడు. తరవాత దొంగలిద్దరూ చెట్టు కింది చీకట్లోకి వచ్చి, బిచ్చగాడి గుడ్డ పేలికల సంచీ తీసి, అందులో ఏదో దాచి, వెళ్ళి పోయారు. వాళ్ళు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి, " ఎవర్రా వాళ్ళూ ? '' అని అడిగి, సంచీని తడివి తీసుకుని తల కింద పెట్టుకుని, మళ్ళీ పడుకున్నది. దొంగలు భయపడినట్టు అటుగా ఎవరూ రాలేదు. బిచ్చగాళ్ళ సంచీలో తన గావంచాతో బాటు దొంగలు దాచినది కూడా ఉండటం చేత, కనకయ్యకు ఆ సంచీని తనది చేసుకోవాలనిపించింది.తెల్లవారగానే అతను చెట్టుదిగి, బిచ్చ గాడి దగ్గిరికి వచ్చి, "నీ దగ్గిర ఉన్న పాతబట్టల మూట ఇస్తావా? అలుకు గుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉన్నది." అన్నాడు. ఇయ్యను!" అన్నాడు బిచ్చగాడు కచ్చితంగా. "దానికి బదులుగా ఈ పూసలసంచి తీసుకో,'' అన్నాడు కనకయ్య. గుడ్డిది పూసలసంచీని తడిమి చూసి ముచ్చటపడి, “బట్టల మూట ఇచ్చెయ్యి, ఇచ్చెయ్యి!'' అన్నది మొగుడితో. గుడ్డివాడు ఇచ్చిన సంచీని చంకలో పెట్టుకుని కనకయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు. “రాత్రంతా ఎక్కడ ఉన్నావు? నా పూలసంచి ఏదీ ?" అని కాంతం కనకయ్యను చూడగానే అడిగింది. "నీ పూసలసంచి ఇచ్చి ఇది పుచ్చు కున్నాను," అంటూ కనకయ్య బిచ్చ గాళ్ళ సంచీ చూపాడు. "నీ మొహం తగలెయ్యా ! ఎంతపని చేశావు! చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచిలో వేశాను. అది కూడా అతుకు పెట్టించుకు రమ్మందా మనుకున్నాను. ఆ సంచీ ఇచ్చేసి మరిన్ని కుళ్ళు గుడ్డలు తెచ్చావా? '' అంటూ కాంతం మొగుడి చేతినుంచి సంచీని విసురుగా లాగేసి, వీధిలోకి గిరవాటు వేసింది. ఆ విసురుకు సంచిలో ఉన్న బట్టలన్నీ బయట పడ్డాయి. వాటితోపాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది, ఆ కత్తి మీద రక్తం మరకలున్నాయి. దొంగలు ఆ రాత్రే ఎవరినో హత్యచేసి, కత్తిని ఆ సంచీలో దాచి వెళ్ళిపోయారు. వీధిలో జనం పోగయారు. త్వరలోనే రక్షకభటులు వచ్చి, ఆ కత్తినీ, కనకయ్య ను పట్టుకుపోయి ఖైదులో పెట్టారు. కనకయ్య తాను నిర్దోషినని రుజువు చేసుకోవటానికి బోలెడంత డబ్బు ఖర్చు ఆయి, తలప్రాణం తోకకు వచ్చింది.

No comments:

Post a Comment