Saturday 7 April 2018

నిర్వచన భారత గర్భ రామాయణము - 108


రావిపాటి లక్ష్మినారాయణ

చంపకమాల(...)లోకందద్వయము [...]లోతేటగీతి {...}లోఆటవెలది “...”లోఁ దెలుపబడి, యివి గర్భితమైన సీసము
సీ.        (అతి[కరుణాత్ముడా {పతి యనంతరసాన్వి
తప్రస్ఫుటాంగ}తా])త సుగుణకలి
([త తతబలా] ప్రభూ {పతితతారక సద్ధృ
తి ప్రాజ్ఞవీరసం)ధితరుచిర వి
(తత[వరదాయకా {యతుల నవ్యరమాయు
త ఖ్యాతియుక్తపా)]తకరహిత ల
([లితసుభగా] విభూ {కృతి సులేఖ సుధీవ
రశ్రేష్ఠబంధు}రా) రమ్యచరిత
గీ.         “నత[వరద రవిశశినయన పర పరమ
పురుష భక్తతోష భరితభువన” భా]స
హిత [సురమునిజనవినుత హతదితిరుహ
త్రిగుణమయ లసన్మతి వితతి శుభదా]త. (౧౨౫)
(సీసములో నాలుగుపాదముల యందును ౧౬వ అక్షరములగు తతిరలు సీసమునందు గురువులుతక్కిన కంద గీత చంపకమాలలందు లఘువులు. అనఁగా సీసమునందు అనంతరసాన్వితప్రస్ఫుటాంగసద్ధృతిప్రాజ్ఞ,నవ్యరమాయుతఖ్యాతియుక్తసుధీవరశ్రేష్ఠబంధు యని యొక్కొక్కదానిని సమాసముగఁ జదువవలెను. కందగీత,చంపకమాలలందు అనంతరసాన్వితప్రస్ఫుటాంగసద్ధృతిప్రాజ్ఞనవ్యరమాయుతఖ్యాతియుక్తసుధీవరశ్రేష్ఠబంధు యని వేఱువేఱుగా జదువవలెను.)
గర్భిత చంపకమాల-
అతికరుణాత్ముడా పతి యనంతరసాన్విత ప్రస్ఫుటాంగతా
త తతబలా ప్రభూ పతితతారక సద్ధృతి ప్రాజ్ఞవీర సం
తత వరదాయకా యతుల నవ్యరమాయుత ఖ్యాతియుక్త పా
లితసుభగా విభూ కృతి సులేఖ సుధీవరశ్రేష్ఠబంధురా!

గర్భిత కందద్వయము-
కరుణాత్ముడా పతి యనం
తరసాన్వితప్రస్ఫుటాంగతాత తతబలా
వరదాయకా యతుల న
వ్యరమాయుత ఖ్యాతియుక్త పాలితసుభగా.

వరద రవిశశినయన పర
పరమపురుష భక్తతోష భరితభువన భా
సురమునిజనవినుత హతది
తిరుహ త్రిగుణమయ లసన్మతి వితతి శుభదా.

గర్భిత తేటగీతి-
పతి యనంతరసాన్వితప్రస్ఫుటాంగ
పతితతారక సద్ధృతి ప్రాజ్ఞవీర
యతుల నవ్యరమాయుత ఖ్యాతియుక్త
కృతి సులేఖ సుధీవరశ్రేష్ఠబంధు.

గర్భిత ఆటవెలది-
నతవరద రవిశశినయన పర పరమ
పురుష భక్తతోష భరితభువన
హిత సురమునిజనవినుత హతదితిరుహ
త్రిగుణమయ లసన్మతి వితతి శుభ.

No comments:

Post a Comment