Friday 21 September 2012


మురళి// మధురానుభూతి//

నీ ఊసుల మరుమల్లెల విరి సోయగం
నా మనసును పరవశమున మరిపించెను

నీ జ్ఞాపకాల తోటలోని విరులను సారంగమై
నీ మధురానుభూతుల మధువులనే గ్రోలగా

నీ ఒడితలగడపై నాతలనిడి విసిరిన కురుల
వింజామరలే మలయ మారుతమై వీయగా

భానుతప్త రవికాంతశ్శిల వంటి నాఎదపై
నీ పెదవుల నీహార కందళ చుంబనం
నీరై కరిగి హుతాసన జ్వాలకు ఆవిరై పోగా

నీ కన్నుల వెన్నెలలు తాకిన నా వదనం
కొలనిలోని కలువ కన్నె యై వికసించగా

నీ నవనీతపు చెక్కిలిపై నా పెదవుల స్పర్శ
నామదిలో కలిగెను ఊపిరి సలపని అలజడులే

నీ అధరామృత మధుధారల సేవనలొ నాపెదవులు
చిరు దరహాసపు తొలకరులలో తడిచేనులే

చల్లని నా శ్వాస తాకి నీ పయోధరం వర్షించగ
మెల్లగ తుఫాను రేగెను నా ఎద పయోనిధిలో

నీ చిరునవ్వుల దరహాసపు చంద్రికలే
కురిపించెను మరుమల్లెల విరిజల్లులు
7.10 pm 21/9/12

No comments:

Post a Comment