Sunday 13 November 2016

[8/22, 9:38 PM] Valluru Murali( మురళీ): 🌴🌲🌳వృక్ష విలాపం🌳🌲🌴

నీ యాగం చేయాలని తలచి శాలకోసం,సమిధల కోసమని కలప తెద్దామని గొడ్డలి పట్టుకొని అడవికి వెళ్ళాను ప్రభూ!

ప్రభూ! పక్షుల కిలకిలా రావాలతో కాన కలకలలాడుతూ ఉంది.వనచరాలు చెంగుచెంగుమని చెట్లపైనుండి గంతులిడుతూ ఆనందపరవశమైయున్నవి ప్రభూ!

నేనొక చెట్టు మొదట నిల్చి అమాంతము గొడ్డలినెత్తి మొదలు నరకబోవ తరులన్నియు జాలిగ నోళ్ళువిప్పి మాప్రాముల్తీతువా యనుచు బావురు నన్నవి. కృంగిపోతి.
     నామానసమందెదో తళుకుమన్నది వృక్షవిలాప కావ్యమై......

అంతలో ఒక మామిడిచెట్టు మార్ధవ స్వరంతో యిలా అన్నది ప్రభూ!...

 తే.గీ. మండువేసంగి మద్యాహ్నయెండ వేళ
     సొమ్మసిల్లియు నానీడ సొలసినంత
     చల్లగాలితో మిమ్ముల సాంతపరచి
     కడుపు నిండుగ కమ్మని పండ్లనిత్తు.

తే.గీ.
రాళ్ళతో కొట్టిమమ్ముల రక్తమోడ్వ
పళ్ళనెన్నియో మీకును పంచినాము
కీడు చేసిన మీకు నేనాడు నైన
హాని చేయము మరి ఫలహారమిత్తు!

తే.గీ. మధుర ఫలము యన్న బిరుదముందిమాకు
భరత భూమిపై పుట్టిన భాగ్యమయ్యె!
ప్రాత్యదేశాల భూములపెరగబోము
పూర్వపుణ్య ఫలమునిట పుట్టినాము.

ఇంతలో ఆ చెంతనే ఉన్న చింతచెట్టు చింతిస్తూ యిలా అన్నది ప్రభూ!

ఆ.వె. విందులీయ పలుపసందులైనట్టియు
     భక్ష్య,లేహ్య,చోహ్య భోజ్యములును
     యెన్నియున్ననుగాని అన్నము కలుపగ
     రసములేని విందు రక్తిలేదు.

ఇంతలో ఆ దగ్గరలో ఉన్న తాళవృక్షం తాళలేక తన గోడు ఇలా వెళ్ళగక్కింది ప్రభూ!

ఆ.వె. డబ్బు కల్గు వాని డాబాల కన్నను
     పేదవాని పూరి పాక మేలు
     కమ్మ నేతయిల్లు కమ్మని సౌఖ్యంబు
     బయట యెండ యెంత మండుచున్న!!!


తే.గీ.  పూర్వ కవులు మమ్ము పొత్తముగాజేసి
     మధుర కావ్య కృతులు మలచినారు
     కల్పవృక్షమనుచు కవులెల్ల గీర్తింప
     కరిగి పోతి,మిపుడు కృంగిపోతి.
[8/23, 5:13 PM] Valluru Murali( మురళీ):
ఉ౹౹ విత్తనమేయలేదుగ!?నువెప్పుడు గుప్పెడు నీళ్ళనైననా
   కుత్తుక లోపలన్ యిడిన కార్యము సల్పిన పుణ్యమైన నో
   గత్తము వేయలేదు కడకేమియు సత్తువ సల్పినట్టుగా
   కత్తుల తోడవచ్చితివి యాయువు తీయగ నేమి సేతుమే!
[8/23, 5:13 PM] Valluru Murali( మురళీ): గాలిని గారవింతుము----- పేరడీ.....
ఉ౹౹ గాలిని చల్లబర్చెదము కానలవెంబడి పోయినట్టి మే
ఘాలకు వర్షమిచ్చు సహకారము చేసెదమోయి నమ్ముమా!
మేలును కల్గజేసెదము మీకును యిచ్చెద ప్రాణవాయువున్
తాలుము! చంపబోకుము! తల్లిగ మిమ్ముల సాకుదెన్నడున్
[8/23, 5:13 PM] Valluru Murali( మురళీ):
   పుష్పవిలాపం లోని
"ఊలు దారాలతో గొంతుకురిబిగించి" అన్న పద్యానికి పేరడీ----
వృక్షవిలాపం లో----
[8/23, 5:13 PM] Valluru Murali( మురళీ): తే.గీ.
తే.గీ.  పెద్ద యంత్రాలతో మమ్ము పెళ్ళగించి
     గుండెలోనుండి గొడ్డలి గ్రుచ్టి, దూర్చి
     నడుము నడ్డగ రంపాన నరికి చంపి
     మీరు చేర్తురు మమ్ముసా మిల్లు నందు
[8/23, 5:13 PM] Valluru Murali( మురళీ):
ఉ౹౹ విత్తనమేయలేదుగ!?నువెప్పుడు గుప్పెడు నీళ్ళనైననా
కుత్తుక లోపలన్ యిడిన కార్యము సల్పిన పుణ్యమైన నో
గత్తము వేయలేదు కడకేమియు సత్తువ సల్పినట్టుగా
కత్తుల తోడవచ్చితివి యాయువు తీయగ నేమి సేతుమే!
[8/23, 5:13 PM] Valluru Murali( మురళీ): గాలిని గారవింతుము----- పేరడీ.....
ఉ|| గాలిని చల్లబర్చెదము కానలవెంబడి పోయినట్టి మే
   ఘాలకు వర్షమిచ్చు సహకారము చేసెదమోయి నమ్ముమా!
   మేలును కల్గజేసెదము మీకును యిచ్చెద ప్రాణవాయువున్
   తాలుము! చంపబోకుము! తల్లిగ మిమ్ముల సాకుదెన్నడున్

No comments:

Post a Comment