Sunday 13 November 2016

దీపావల్లి
నెలత నడకలు పాముమాత్రలు
నెమ్మదిగా కాలుతాయి
ముదిత మనసు మతాబువెలుగులు
రంగులు మారుతాయి
చెలువ చూపులు కాకర పువ్వులు
చురచురమంటాయి
వనిత వలపులు వెన్నముద్దలు
ముట్టిందో ఆరిందో తెలీదు
భామ బుద్ధులు భూచక్రాలు
గిరగిరా తిరుగుతాయి
మగువ మాటలు చిటపటరాళ్ళు
వేరేగా చెప్పక్కర్లేదు.
కోమలి కోపం సీమ టపాకాయ
గేప్ ఉండదు
తరుని తాపం తారాజువ్వ
ఉవ్వెత్తున లేస్తుంది

No comments:

Post a Comment