Tuesday, 9 December 2025
రాజు మెదడు
ఒకప్పుడు దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆటవిక జీవితం గడు పుతూ నాగరికత అన్నది లేకుండా జీవిం చారు. అయితే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజు ఏర్పడి జీవితం క్రమబద్ద మవుతూ వచ్చింది.
ఆ కాలంలో దండాపథ మనే ప్రాంతంలో జీవితం అరాజకంగానే ఉంటూ వచ్చింది. బలవంతులు బలహీనులను యధేచ్ఛగా పీడిస్తూ వచ్చారు. ఆ కారణంగా సామాన్య ప్రజలు ఏ పనీ సక్రమంగా కొనసాగించలేక పోయారు. ఎందుకంటే శ్రమ ఫలితం వారికి దక్కిన దాకా నమ్మకం లేదు.
దండాపథంలో సుమిత్రు డనే ఒక బుద్ధి శాలి ఉండే వాడు. తన దేశపు ప్రజల జీవితం దుస్థితిలో ఉండటం అతన్ని ఎంతో బాధించింది. దేశంలోని దుర్మార్గులతో అతను ఎంతగానో చెప్పి చూశాడు, కాని
వారు వారి పద్ధతులను మార్చుకో లేదు. చివరకు సుమిత్రుడు ప్రాణం విసిగి అరణ్యానికి వెళ్ళి పోయాడు.
అరణ్యంలో సుమిత్రుడి కొక యోగి కనిపించాడు. ఆయన ఆరణ్యంలోనే ఆశ్రమం నిర్మించుకుని యోగం అభ్య సిస్తున్నాడు.
సుమిత్రుడా యోగి పరిచయం చేసు కుని, దేశంలో అరాజకం పోయి బాగుపడా లంటే ఎం చేయాలి అని ఆడిగాడు.
"ధైర్య బల పరాక్రమాలూ, వ్యక్తి త్వమూ గల వా ఎన్నుకుని రాజుగా ఏర్పాటు చేసుకుని, జ్ఞానమూ, వివేకమూ, ధర్మబుద్ధి గల మంత్రిని నియమించినట్ట యితే మీ దేశం బాగుపడుతుంది,” అని యోగి చెప్పాడు.
సుమిత్రుడు తన దేశానికి తిరిగి వెళ్ళి దేశంలోని బలాఢ్యు లందరిలోకి బలాఢ్యుడైన ధీరసింహు డనే వాణ్ణి కలుసుకుని, "నీవు రాజుగా ఉండి, సైనిక బలాన్నీ, ధనకోశాన్ని ఏర్పాటు చేసుకుని, దేశంలోని ప్రతి ఒక్కరినీ శాసిస్తూ పరిపాలన సాగించి నట్టయితే మన దేశం బాగుపడుతుంది," అని చెప్పాడు.
ధీరసింహు డిందుకు సంతోషంగా సమ్మ తించాడు. తమకు రక్షకుడుగా ఒక రాజు ఉంటాడని విని ప్రజలు కూడా సంతోషిం చారు. ధీరసింహుడికి రాజ్యాభిషేకం జరి గింది. తన ఆశ్రమం నుంచి యోగి వచ్చి స్వయంగానే రాజ్యాభిషేకం జరిపించాడు. ఆయన వెళ్ళిపోతూ, "బుద్ధిమంతుడైన
మంత్రిని ఏర్పాటు చేసుకుని, అతని సలహా ప్రకారం రాజ్యపాలన చెయ్యి,” అని ధీర సింహుడికి సలహా ఇచ్చాడు.
అయితే ధీరసింహు డా సలహాను లక్ష్య పెట్టలేదు. " నేను రాజు నైనప్పుడు నాకు మళ్ళీ ఒకరు సలహా ఇవ్వటమేమిటి? పరిపాలన విషయాల్లో మంత్రి చెప్పినట్టు వింటే రాజు మంత్రికి లోకువేగడా," అను కుని అతను మంత్రి లేకుండానే రాజ్య పాలన సాగించాడు.
పూర్వం విశృంఖలంగా తిరిగిన బలాఢ్యు లందరూ ఇప్పుడు రాజు వద్ద కొలువు చేస్తూ, వెనకటిలాగే చిత్తం వచ్చినట్టు ప్రజలను పీడిస్తూ, రాజును మాత్రం సంతోష పెట్టుతూ వచ్చారు. ప్రజలు రాజాజ్ఞకు కట్టుబడి కూడా ప్రయోజనం లేకపోయింది.
సుమిత్రు డీ పరిస్థితి చూసి మరొకసారి యోగి వద్దకు వెళ్ళి పరిస్థితి అంతా చెప్పాడు. అంతా విని యోగి, "మీ రాజును నేను బాగు చేస్తాను. ఒక వారం రోజులకు నేను స్వయంగా వచ్చి మీ రాజును కలుసు కుంటాను. ముందుగా మీరు ఈ పుష్పాన్ని తీసుకుపోయి, నా కానుకగా రాజు కివ్వండి. దీన్ని రాజు తప్ప మరెవరూ ఆఘ్రాణించ రాదు, అది అపచార మవుతుంది,” అంటూసుమిత్రుడి కొక పుష్పాన్ని ఆకులో మడిచి కట్టి ఇచ్చాడు. ఆకు మడతలో నుంచి కూడా దాని సువాసన తెలియవస్తున్నది.
సుమిత్రు డా పుష్పాన్ని తీసుకుపోయి రాజుకిస్తూ, దాన్ని యోగి కానుకగా పంపా డసీ, ఒక వారం గడిచాక ఆయన వచ్చి రాజ దర్శనం చేసుకుంటా డనీ చెప్పాడు. రాజు అలాటి పుష్పాన్ని ఎన్నడూ చూడ లేదు. దాని సువాసన కూడా కొత్తగానే ఉన్నది. అందుచేత అతను దాన్ని పదేపదే వాసన చూశాడు.
మర్నాటి కల్లా రాజుకు తల పోటు ప్రారంభమై, ఆరోజు కారోజు పెరిగి పోయింది. ఎన్ని చికిత్సలు చేసి కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది. రాజు మంచాన పడి యమయాతన అనుభ. వించసాగాడు.
అన్న ప్రకారం యోగి వారం రోజులకు వచ్చి రాజును చూశాడు. రాజుకు ఏర్పడిన తల నొప్పి గురించి విని ఆయన, "రాజా, నీకు తల పోటు వచ్చిందంటే రాకేం చేస్తుంది? రాజ్య పాలన అంటే మాటలా? ఈ తల పోటు ఇంకా ముందే వచ్చి ఉండ వలిసింది. నీ మెదడు బలమైనది కనక ఇంత కాలం రాలేదు. ఇకనైనా బుద్ధి
మంతుణ్ణి మంత్రిగా పెట్టుకుని, ఆలోచించే పని అతనికి పదిలేసి, అతని ఆలోచన ప్రకారం నీవు రాజ్యపాలన సాగించు,” అని సలహాయిచ్చాడు.
అంత బాధలోనూ ధీరసింహు డీ మాటకు ముఖం చిట్లించుకుని, "ఒకడి సలహాతో నేను రాజ్యం చెయ్యట మేమిటి? అలా జరగటానికి వీలులేదు,” అన్నాడు.
యోగి నవ్వి, " మరొకరి బుద్ధికి నిన్ను కట్టుపడి ఉండమని నేనంటానా? తెలివి తేటలు గల వాణ్ణిగా చూసి నీ బుద్ధినే అతడికి అరువిచ్చి, అందరి చేతా పని చేయించు కున్నట్టే అతని చేత కూడా పని చేయించుకో. అలా చేసినట్టయితే నీ కెన్నడూ ఇలాటి తల పోటు రాదు,” అన్నాడు.
"నా బుద్ధిని మరొకడికి అరువివ్వటం ఎలా సాధ్యం?" అని రాజు అడిగాడు.
"ఆ ప్రక్రియ నేను చేస్తాను. నీ దృష్టిలో బుద్ధిశాలి ఎవరో చెప్పినట్టయితే నీ మెదడు లోని ఆలోచనా శక్తి కొంత అతడికి పంపకం చేస్తాను,” అన్నాడు యోగి.
రాజు సుమిత్రుడి పేరు చెప్పాడు. రాజు గారి బుద్ధిని స్వీకరించి, ఆలోచనలు చెయ్య టానికి సుమిత్రుడు కూడా సమ్మతించాడు. యోగి తన శక్తి చేత రాజుకు యోగ నిద్ర కలిగించాడు. ఆయన సుమిత్రుడితో, "నే నిచ్చిన పుష్పం వాసన చూడటం చేతనే రాజు & శిరోవేదన కలిగింది. ఆయన ఈ నిద్ర నుంచి మేలుకునే సరికి అది పోతుంది. ఇకమీద నీవు మంత్రిగా ఉండి రాజు చేత ధర్మప్రకారం రాజ్యపాలన చేయించు,” అని చెప్పాడు.
రాజు నిద్ర నుంచి లేస్తూనే తన తల పోటు పోయిందని తెలుసుకున్నాడు.
"ఇప్పుడు నాకు చాలా సుఖంగా ఉన్నది,” అన్నాడాయన యోగితో.
" అవును. రాజ్య సంబంధమైన ఆలో చనలు చేసి చేసి నీ మెదడు వాచిపోయింది. అందులో కొంత భాగం సుమిత్రుడికి చెందే టట్టు చేశాను. ఇక నుంచి నీకు పరిపాలన గురించి ఆలోచించే శ్రమ ఏమివుండదు. ఆ బాధ అంతా సుమిత్రుడే పడతాడు,” అన్నాడు యోగి.
ధీరసింహుడు సుమిత్రుణ్ణి మంత్రిగా నియమించి, అతని సలహాల ననుసరించి రాజ్యపాలన సాగించాడు. బుద్ధిలో మంత్రి రాజుతో సమానుడు గనక రాజుగారి కొలువులో ఉండే అధికారు లందరికీ పైవా డయాడు. అందుచేత పదవులలో ఉన్న దుష్టు లందరి ఆటా కట్టింది. ప్రజలు సుఖ పడి పోయారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment