Monday, 8 December 2025

బ్రహ్మచారి నర్మదానదీ ప్రాంతాన గల ఎత్తయిన కొండలమధ్య లోతైన లోయ ఒకటి ఉండేది. ఆ లోయలో చిన్న ఊరు ఉండేవి. ఆ ఊరిలో నివసించేవారికి బయటి ప్రపంచంతో ఏమీ సంబంధంలేదు. బయట ప్రపంచానికి సూర్యోదయమయినాక మూడు గంటలదాకా ఈ లోయలో సూర్యకాంతి కనిపిం చేదికాదు. అలాగే సూర్యాస్తమయంకూడా రెండు మూడు గంటలు ముందుగానే జరిగిపోయేది. సెలయేళ్ళతోనూ, చక్కని పూలచెట్లతోనూ, పళ్లచెట్లతోనూ ఈ లోయ భూలోక స్వర్గంలాగా ఉండేది. వర్ధనుడు ఈ లోయలోనే పుట్టి పెరి గాడు. అతని తండ్రికి ఏలోటూ లేదు. ఆ తండ్రికి వర్ధనుడు ఒక్కడే కొడుకు. వాడు అయిదారేళ్ళ కుర్రవాడై ఉండగా ఒక నాడు తండ్రి వెంబడి లోయలోనుంచి ఒక కొండమీదికి ఎక్కాడు. వారు శిఖరాన్ని చేరు కున్నాక వర్ధనుడికి కొండ అవతల వేపున ఆకాశం తగిలేదాకా మైదానా లుండటం కనబడింది. వాడు ఆ మైదానా లను చూసి తన లోయకేసి చూస్తే ఎంతో చిన్నది అనిపించింది. " నాన్నా, ప్రపంచం ఇంత పెద్దదా?” అని వాడు తండ్రిని ఆశ్చ ర్యంగా అడిగాడు. తండ్రి నవ్వి, "నాయనా, ప్రపంచమంతా నీకు అప్పుడే కనబడిందనుకున్నావా? అది అంతులేనిది. అందులో మహానగరా లున్నాయి, మహానదులున్నాయి, మహా సముద్రాలున్నాయి!” అన్నాడు. వర్ధనుడు తండ్రినడిగి ఆనగరాలను గురించి, అక్కడి జీవింతం గురించి, సము ద్రం గురించీ, అందులో ప్రయాణించే నౌకలను గురించి వివరంగా తెలుసు కున్నాడు. వివరాలు తెలుసుకుంటున్నకొద్దీ వాడికి ఈ విశాల ప్రపంచమంతా తిరగాలని, వింతలన్నిటినీ చూసి ఆనందించాలనీ గాఢ మైన కోరిక కలిగింది. తండ్రి వర్ణించిన ప్రపంచపు వింతలను గురించి అస్తమా నమూ కలవరిస్తూ కాలం గడిపాడు. వర్ధనుడు. పదహారేళ్లవాడయాడు. ప్రపంచ పర్యటన చేయాలనే కోరిక వాడిలో ఎప్పటికన్నా ఇంకా తీవ్రంగా ఉన్నది. ఈ సమయంలో వాడుండే లోయలోకి ఒక పెద్దమనిషి వచ్చాడు. వర్ధనుడు ఆ పెద్ద మనిషితో స్నేహంచేసి, ఆయనద్వారా ప్రపం చపు వింతలు మళ్లీ తెలుసుకుని, పట్టరాని ఉద్రేకంతో, " నేను నా జీవితమంతా ఇక్కడే గడిపాను. ఇంత విశాల ప్రపం చాన్ని ఎప్పుడు చూద్దామా అని నా ప్రాణం కొట్టుకుపోతున్నది," అన్నాడు.. "ఈ మహాపట్టణాలన్నీ తిరిగి, సము ద్రాలు దాటితే నీకు ఎక్కువ ఆనందం కలుగుతుందనుకున్నావా? నీకు ప్రపం చంలో ఉండే వింతలే తెలిశాయిగాని అక్కడి బాధలను గురించి కొంచెంకూడా తెలిసినట్టులేదు. నేను ప్రపంచం చాలా చూశాను. మీ లోయలాంటి సుఖమయమైన ప్రదేశం నాకెక్కడా కనిపించలేదు. మహా రాజుల ఇళ్లలోకూడా ఈ శాంతి సౌఖ్యాలు దొరకవు. అందుచేత నీకు కావలిసింది ఆనందమే అయితే నువ్వీలోయను విడిచి ఎక్కడికీ పోకు," అన్నాడు పెద్దమనిషి. " ఇంత విశాల ప్రపంచం ఉండి ఈ లోయలోనే జీవితమంతా గడపటం జీవిం చట మనిపించుకుంటుందా?” అన్నాడు వర్ధనుడు. "వెర్రివాడా, ప్రపంచమంతా నువు ఎలాగూ చుట్టిరాలేవు. ఒక్క ప్రపంచం ఇంకా విశాలమైనది. తల ఎత్తి ఆ నక్షత్రా గురించే ఎందుకు విచారిస్తున్నావు? సృష్టి లను చూడు. మన ప్రపంచంకంటె అనేక కోట్ల రెట్లు పెద్దవి అయిన బ్రహ్మాండాలు సృష్టిలో ఉన్నాయి. వాటిలో ఎన్ని వింత లున్నాయో, ఎవరికీ తెలియదు. ఆ బ్రహ్మాం డాలు మన కళ్ల ఎదుటే ఉన్నప్పటికీ వాటిని చేరుకోలేంగద!" అన్నాడు పెద్ద మనిషి. ఈ మాటలమూలంగా వర్ధనుడి అభిప్రాయం మారిపోయింది. అందుచేత తన తల్లిదండ్రులు చనిపోయినాకకూడా ఆ లోయ విడిచి ఎక్కడికీ పోక, ఇంటనే ఉండి తనకున్న ఆస్థిని చూసుకోసాగాడు.వర్ధనుడుని అందరూ ఎరుగుదురు, అతను అందరిని ఎరుగును. కాని అతను ఎవరితోనూ అంత కలుపుగోలుగా ఉండక, ఎప్పుడూ ఇంకొక ప్రపంచంలో ఉన్నవాడి కనబడటంచేత, వారంతా దూర దూరంగా ఉండేవాళ్లు. అతనికి వివాహ వయస్సు వచ్చింది. పెళ్ళాడాలంటే ఆ లోయలోనే కొందరు కన్యలున్నారు. కాని వారిలో ఒక్కరూ అతనికి నచ్చలేదు, అతను పెళ్లి తలపెట్టనూలేదు. ఇంతలో ఒక సంఘటన జరిగింది. లోయ చివర నివసించే ధనుంజయుడు అనే ఆయన తన ఇంటిని పడగొట్టించి ఇంకా పెద్ద ఇల్లు కట్టించ సంకల్పించి, ఒక నెలపాటు వర్ధనుడి ఆతిథ్యం కోరాడు. ఎందుకంటే వర్ధనుడి ఇల్లు విశాలమైనది. అందులో అతనూ, ఇద్దరు నౌకర్లూ మాత్రం వున్నారు. వర్ధనుడు ధనుంజయున్ని తన ఇంట ఉండమన్నాడు. ధనుంజయుడు తన కుమార్తె అయిన కాత్యాయిని తోసహా వర్ధనుడు ఇంటికి వచ్చేశాడు. వర్ధనుడు కాత్యాయినిని అంత బాగా ఎరగడు. ఆమె అందగత్తె అనీ, ఎంతోమంది. పెళ్లాడతానని వస్తే నిరాకరించిందనీ అతను విని ఉన్నాడు. ఇప్పుడామె తనకు సమీ పంగా వచ్చేసరికి ఆమెలో ఉన్న ఆకర్షణ వర్ధనుడికి పూర్తిగా తెలిసివచ్చింది. ఆమె అందమే గాక, మాటతీరూ, పనులు చేసే పద్ధతీ కూడా అతనికి ఇంపుగా కని పించాయి. ఇంతకాలానికి తాను పెళ్ళాడ దగిన కన్య కనపడిందిగదా అని అతను సంతోషించాడు. అయినా వర్ధనుడు తొందరపడక ఆమెపై తనకు కలిగిన సదభిప్రాయం కాలంతో పాటు మారిపోతుందేమోనని చూశాడు. రోజులు గడుస్తున్నకొద్దీ కాత్యాయిని అతన్ని మరింతగా ఆకర్షించిందేగాని, ఆమెలో ఆతనికి ఎలాట వెలితి కనిపించలేదు. అతను అనుమానాలన్నిటినీ కట్టిబెట్టి ధనుంజయుడితో ఒకనాడు, "అయ్యా, మీకూ, మీ అమ్మాయికీ సమ్మతమయే పక్షంలో నేనామెను వివాహమాడతాను,” అన్నాడు. ధనుంజయుడు కాత్యాయినితో ఈ సంగతి చెప్పేసరికి, ఆమె తనకు అభ్యం తరం లేదన్నది. ఇది జరిగిన కొద్దిరోజులకు ఒక సాయం కాలం వారిద్దరూ ఒక కొండదారి వెంబడి ఏదో మాట్లాడుకుంటూ నడుస్తూఉండగా ఒకచోట మంచి సువాసన పుష్పాలు కని పెంచాయి. మందాకిని వెంటనే వెళ్లి వాటిని కోసి కొన్ని తలలో పెట్టుకుని, మరికొన్ని చేత పట్టుకుని వర్ధనుడి వద్దకు వచ్చింది. "పూలు చెట్టున ఉండగా చూస్తుంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది, కాదూ?" అన్నాడు వర్ధనుడు. " నాకు అలాకాదు. చెట్టున అందమైన పూలు కనిపిస్తేచాలు నా ప్రాణం వాటికోసం కొట్టుకుపోతుంది. వాటిని కోసినదాకా నా ఆరాటం తగ్గదు," అన్నది కాత్యాయిని. మర్నాడు ఉదయం కాత్యాయిని కని పెంచగానే వర్ధనుడు, "నీతో ఒక్క విషయం చెప్పాలని నేను రాత్రి అను కున్నాను. మనమిద్దరమూ ఎంతో స్నేహంగా ఉంటున్నాం. ఈ స్నేహం మనకు ఆనందం కలిగిస్తున్నది. మనం పెళ్లాడినఁతమాత్రం చేత ఈ ఆనందం హెచ్చుతుందని నాకు తోచదు. నీ ఉద్దేశం ఏమిటి?” అని అడిగాడు. వెంటనే కాత్యాయిని అతని అభిప్రాయం మారినట్టు తెలుసుకుని, "నన్ను పెళ్ళాడ మని నేను మిమ్మల్ని ఒత్తిడిచెయ్యబోవటం లేదు. పెళ్ళి ప్రస్తావన ఎత్తినది మీరేగాని నేనుకాదు. అయినదేదో అయింది. ఇక ఈ విషయం ఎత్తకండి," అన్నది. ఆమెకు తనపై కోపం వచ్చిందని వర్ధనుడు తెలుసుకున్నాడు. కాని ఆ కోపం ఎలా పోగొట్టాలో అతనికి అర్ధంకాలేదు.కాత్యాయిని తన తండ్రితో, " నాన్నా, నేను బాగా ఆలోచించుకుని, వర్ధనుణ్ణి పెళ్లాడ రాదని నిశ్చయించుకున్నాను. నువుమా పెళ్లివిషయం ఇక తీసుకురాకు" అన్నది. తరవాత కొద్దిరోజులకే ధనుంజయుడి కొత్త ఇల్లు తయారయింది. తండ్రి కూతుళ్లు వెళ్లి పొయారు. కాలక్రమాన కాత్యాయిని ఎవరినో పెళ్లాడి వెళ్ళిపోయింది. వర్ధనుడు జీవి తాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాడు.

No comments:

Post a Comment