Tuesday, 2 December 2025
#కథల పిచ్చోడు#
కాశ్మీరదేశంలో ప్రవర్ధన మహారాజుకు కొడు కులు లేరు. పద్మిని అని ఒక కుమార్తె ఉండేది. ఆయన కా కుమార్తె అంటే పంచ ప్రాణాలు. తండ్రి గారాబంగా పెంచటం చేత పద్మిని కాస్త ఆకతాయిగా పెరిగింది.
ఒకసారి ప్రవర్థనుడు తన సామంతు లతో సహా యవనులతో యుద్ధానికి బయలు దేరవలసి వచ్చింది. ఆయన తాను తిరిగి వచ్చేదాకా పద్మినిని వెయ్యికళ్ళతో కనిపెట్టి ఉండమని ఆమె చెలికత్తెలకు చెప్పి, యుద్ధానికి బయలుదేరాడు.
తండ్రి వెళ్ళిపొయ్యాక పద్మినికి మరింత స్వేచ్ఛ దొరికినట్టయింది. ఆమె రోజూ ఉద్యానవనంలో ఉండే కొలనులో జలక్రీడ లాడేది. చెలిక త్తెలు వద్దంటున్నా చెట్లెక్కేది.
ఇలా కొద్ది రోజులు గడిచాక పద్మినికి ఒక వెర్రిఆలోచన వచ్చింది. రాజభవనానికి కొంత దూరంలో ఒక పెద్ద మడుగున్నది.
ఆ మడుగూ, దాని చుట్టూ ఉండే చెట్లూ అడవీ ఒక గంధర్వుడిదని చెప్పుకునేవారు. అందులోకి ఎవరూ దిగి స్నానాలు చేసేవారు కారు. ఈ సంగతి పద్మినికి కూడా తెలుసు. పద్మినికి ఆ మడుగులో ఈతకొట్టా లనిపిం చింది. ఆ సంగతి ముందుగా తన చెలికత్తె లకు చెప్పక, వారిని అటుగా షికారు తీసుకు పోయి, వారు లబలబలాడుతున్నా విని పెంచుకోకుండా అందులోకి దిగి, మడుగు మధ్యకు ఈదుతూ పోసాగింది.
చెలికత్తెలకు ఏం చెయ్యాలో తోచలేదు.
"ఏమయితే అయింది? మనమందరమూ ఈదుకుంటూ పోయి రాజకుమార్తెను బల వంతాన బయటికి ఈడ్చుకొద్దాం,” అను కుని, చెలికత్తెలు కూడా మడుగులోకి ప్రవేశించి, మధ్య కేసి ఈదసాగారు.
వాళ్ళు నాలుగుబారలు వేశారో లేదో, పద్మిని కెవ్వున రెండు మూడుసార్లు అరిచి,డ్
నీటిలోకి ముణిగి పోయింది. చెలికత్తెలు గుండెలు దడదడలాడుతూ తిరిగి ఒడ్డుకు వచ్చేశారు. వాళ్ళు మడుగు ఒడ్డున చాలా సేపు నిలబడ్డారు. కాని పద్మిని జాడలేదు.
మర్నాడు ఉదయానికి పద్మిని తనం తట తానే తడిబట్టలతో ఇల్లు చేరుకున్నది. తన చెలికత్తెలు ఎంత గుచ్చి గుచ్చి అడిగినా ఆమె జరిగిన సంగతి చెప్పలేదు.
ఈ సంఘటన జరిగిన ఆరుమాసాలకు ప్రవర్ధన మహారాజు యుద్ధాల నుంచి తిరిగి వచ్చాడు. పద్మినీ, చెలికత్తెలూ ఆయనకు ఎదురు వెళ్ళారు. పద్మిని అప్పటికి ఆరు మాసాల గర్భిణి. అది చూసి తండ్రి,
"ఏం జరిగింది? నా వంశాని కెలా అపకీర్తి తెచ్చావు ?" అని కఠినంగా అడిగాడు.
పద్మిని తల వంచుకుని తండ్రికి జరిగిన సంగతి దాచకుండా చెప్పేసింది. తాను తన చెలికత్తెలను ధిక్కరించి, అరణ్యం మధ్య ఉండే గంధర్వుడి మడుగులోకి ఈతలు కొట్టబోయింది; అక్కడ తనను గంధర్వుడో, నాగుడో, యక్షుడో, మరెవడో పట్టుకుని, మడుగు దిగువన ఉండే తన భవనానికి తీసుకుపోయి, బలాత్కరించాడు; మర్నాడు ఉదయం వాడు విడిచిపెట్టితే ఆమె ఇంటికి తిరిగి వచ్చేసింది.
తన కుమార్తె బుద్ధిపూర్వకంగా తప్పు చెయ్యలేదని గ్రహించి, తండ్రి ఆమెను క్షమించాడు. సకాలంలో ఆమె ఒక మగ బిడ్డను కన్నది. వాడిలో ఏ అవలక్షణం గాని ఉన్నట్టు కనబడలేదు. ప్రవర్థనుడు వాడికి తానే తాతా, తండ్రీ అయి, వాణ్ణి ఎంతో ప్రేమగా పెంచసాగాడు. వాడికి ప్రగల్భుడు అని పేరు పెట్టారు.
ప్రగల్బుడికి పదిహేను, పదహారేళ్ళు వచ్చాయి. వాడి చదువు పూర్తి అయింది. ఒకనాడు ప్రవర్ధనుడు తన మనమడితో బాటు వనవిహారానికి వెళ్ళి, అలిసిపోయి చలపరాతి అరుగు మీద చతికిలబడ్డాడు.వెంటనే ప్రగల్భుడు, "తాతా, నేను చాలా కాలంగా చూస్తున్నాను. నువు ముసలి వాడిపోయావు. నీ కిరీటం నా నెత్తినా, రాజ్యభారం నా భుజాల మీదా పెట్టి, హాయిగా ఇంట్లో కాలిమీద కాలేసుకు కూర్చుని విశ్రాంతి తీసుకో,” అన్నాడు.
ప్రవర్ధన మహారాజు ఈ మాటను బాల్య చాపల్యం కింద జమకట్టి, "తొందరపడ తావేంరా? నా తరవాత రాజ్యం నీకు గాక ఇంకెవరికి పోతుంది? నువే నా వార సుడివి,” అన్నాడు ఓర్పుగా.
మరొకసారి కూడా ఇలాగే జరిగింది. చాలాసేపు ఉద్యానంలో నడిచిన మహా రాజు, కాళ్ళు నొచ్చి, ఒక అరుగు మీద కూర్చున్నాడు.
ప్రగల్ఫుడు చిరాకుపడుతూ, "నువు నడవను కూడా లేవు. నాకు పట్టం కట్టి విశ్రాంతి తీసుకో,” అన్నాడు.
"ఒరే, చిలిపి వెధవా! ఈ ఆలోచనలు నీ కెవరు చెబుతున్నారో గాని, వాళ్ళు నీ మంచి కోరినవాళ్ళు మాత్రం కారు. నేను బతికి ఉండగా నా సింహాసనం మీద మరొకడు కూర్చు నేమాట కల్ల. నా అనంతర మంటావా, ఆ సింహాసనం తప్పక నీదే అవుతుంది,” అన్నాడు ప్రవర్ధన మహారాజు.
"సింహాసనాన్ని నువు ఇష్టపడి అవ్వక పోతే బలవంతాన లాక్కోవలిసి వస్తుంది. అంతే!" అంటూ ప్రగల్ఫుడు కోపావేశంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి, "అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను,” అన్నాడు. తల్లి కారణమడిగితే, తాత తనకు పట్టం కట్టటం లేదన్నాడు. ఆమె కూడా వాడి మాటలను తెలిసీ తెలియని మాటల కిందనే జమకట్టింది.
కాని ప్రగల్భుడు నిజంగానే వెళ్ళి పోయాడు. అతను రెండు మూడు రోజులు ప్రయాణించి సుపర్ణుడనే చిన్న రాజు వద్దకు వెళ్ళి, ఉద్యోగం అడిగాడు."ఎవరునువు? ఏం ఉద్యోగం చేస్తావు? ్ ఎంత జీతం కావాలి?" అని సుపర్ణుడు ప్రగల్భణ్ణి అడిగాడు.
"నే నెవరైతేనేం? ఏ పని చెప్పినా చేస్తాను. జీతం సంగతి ఇప్పుడేమీ అడ 'గను. ఒక ఏడాది మీ దగ్గిర పని చేస్తాను. నా పని మీకు తృప్తిగా లేకపోతే ఏమీ ఇవ్వ వద్దు; తృప్తిగా ఉంటే నే నడిగినది ఇవ్వండి,” అన్నాడు ప్రగల్భుడు.
సుపర్ణుడు సరేనన్నాడు.
మనమడు కళ్ళఎదట లేకుండా పోయాక ప్రవర్థనుడిలో సంతాన వాంఛ తల ఎత్తింది. ఆయన తన నగరానికి సమీపంలోనే ఉన్న
ఒక కాపు కుమార్తెను, చంపకవతి అనే దాన్ని పెళ్ళాడాడు.
ఏడాది గడిచింది. సుపర్ణుడు ప్రగల్భుడి సేవతో పూర్తిగా తృప్తిపడ్డాడు.
ప్రగల్భుడు అతని వద్దకు వచ్చి, "నేను ఏడాదిపాటు మీ కింద పనిచేశాను. నా పని మీకు నచ్చినట్టయితే నా కోరిక చెల్లిం చండి," అన్నాడు.
"ఏం కోరతావు?" అని సుపర్లు డడిగాడు.
"మీరు వెంటనే మీ సేనలను తీసుకుని ప్రవర్ధన మహారాజు పైకి యుద్ధానికి బయలుదేరండి. మనకు జయం తప్పదు,” అన్నాడు ప్రగల్భుడు.
సుపర్ణుడు నిర్ఘాంతపోయి, "ఇదేం కోరిక? ఆయన నాకు చక్రవర్తి. నే నాయన కింద సామంతును!" అన్నాడు.
" నేనైనా పరాయివాణ్ణి కాదు. ఆ చక్ర వర్తికి నేనే వారసుణ్ణి. ఈ యుద్ధంలో ఆయన ఓడిపోతే నేనే చక్రవర్తిని. ఆయన గెలిస్తే నాకే నష్టం! ఆడితప్పవద్దు,” అన్నాడు ప్రగల్భుడు.
సుపర్ణుడు తన మాట నిలబెట్టుకోవటానికి సైన్యాన్ని ఆయత్తం చేసి ప్రవర్థనుడి పైకి యుద్ధానికి వెళ్ళాడు.ప్రవర్థనుడికి సైన్యాలను సమకూర్చు కునే వ్యవధి లేదు. అయినా ఆయన యుద్ధం చేసి వీరమరణం పాలు కావటానికి నిశ్చయించాడు గాని, తన మనమడికి సింహాసనం అప్పగించి అడవులపాలు కాదలచలేదు.
అప్పటికి చంపకవతికి నెలతప్పింది. ఆమెను మహారాజు తండ్రి ఇంటికి పంపుతూ, "ఈ యుద్ధం నుంచి నేను ప్రాణాలతో బయట పడకపోవచ్చు. నీకు గర్భం నిలి చిన మాట నిజమైన పక్షంలో నీకు కొడుకు పుట్టవచ్చు. ఏనాటికైనా వాడే నా సింహాస నానికి వారసుడు గనక, నా చిహ్నంగా వాడి మెడలో ఈ గొలుసు తగిలించు," అంటూ తన మెడలో ఉండే గొలుసు ఆమెకిచ్చాడు. చంపకవతి పుట్టింటికి వెళ్ళిపోయింది.
యుద్ధంలో ప్రవర్థనుడు మరణించాడు. ప్రగల్భుడు రాజ్యాభిషేకం చేసుకుని, రాజ భవనంలో మునుపు ఉండినవారి నందరినీ వెళ్ళగొట్టి, తన నౌకర్లనే ఏర్పాటు చేసు కున్నాడు. అతను చేసిన రాజ్యపాలన చాలా క్రూరంగా ఉండటం చేత ప్రజలకు అత సంటే త్వరలోనే రోత పుట్టింది.
చంపకవతి కాలక్రమాన ఒక మగబిడ్డను కన్నది. ఆ బిడ్డ ప్రగల్బుడికి దగ్గిరలో
ఉండటం మంచిది కాదని, చంపకవతి తండ్రి అయిన కాపు, ఆ పసిగుడ్డును తీసు కుని దూరదేశానికి వెళ్ళి, అక్కడ ఒకరి ఇంట పెంచటానికి ఏర్పాటు చేసి, తగినంత డబ్బు కూడా ఇచ్చాడు.
ప్రగల్ఫుడికి, నిజానికి, తన తాత మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడని గాని, ఆయన భార్య తన రాజ్యంలోనే ఉన్నదని గాని, తాను దుర్మార్గంగా ఆక్రమించిన సింహాసనానికి వారసు డొకడు పుట్టిపెరుగుతున్నాడని గాని కొంచెం కూడా తెలియదు.
పదహారు సంవత్సరాలు గడిచాయి. చంపకవతికి పుట్టిన కొడుకు ప్రద్యోతు డనేఝందర్...
పేరుతో పెరిగి పెద్దవాడై, కాపు ఇంటికి తిరిగి వచ్చాడు.
ప్రగల్భుడు సహజంగానే ప్రజాపీడకు డనీ, అతనంటే ప్రజలకు చాలా రోతగా ఉంటున్నదనీ, అతని పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నా రనీ ప్రద్యోతుడికి రూఢిగా తెలిసింది. అలాటి వాణ్ణి ఉపాయంతో తొలగించవచ్చు ననుకున్నాడు ప్రద్యోతుడు.
కొంతకాలంగా ప్రగల్ఫుడు రోజు కొక ఇంటికి తన దూతలను పంపి, ఆ అంటి మనిషి నెవరినైనా రాత్రి తన యింటికి పిలి పిస్తున్నాడు. అలా వచ్చిన వాణ్ణి తెల్లవారిన
దాకా కథలు చెప్పమంటాడు. ఆ కథలు తనకు నచ్చకపోతే తెల్లవారగానే తల తీయిస్తాడు. ఈ విధంగా చాలామంది తమ తలలను పోగొట్టుకున్నారు.
ప్రద్యోతుడు వచ్చిన కొద్ది రోజులకే కాపు ఇంటికి రాజదూతలు వచ్చి, "ఈ రాత్రికి మీ ఇంటి వారెవరైనా వచ్చి కథలు చెప్పా లని రాజుగారి ఆజ్ఞ,” అని చెప్పారు.
"వాళతో కాపు కుంగిపోయి, నా ఆయువు మూడింది. ఆ దుర్మార్గుడైన రాజుకు నచ్చే కథలు నే నెక్కడ చెప్ప గలను?" అన్నాడు.
"నీ కేం భయంలేదు, తాతా. ఆ రాజుకు కావలిసిన కథలు చెప్పటానికి నే నున్నాను గద!" అన్నాడు ప్రద్యోతుడు.
"నువు రాజు దగ్గిరికి వెళతావా? వద్దు, నా తండ్రీ!” అని చంపకపతి బావురు మని ఏడ్చింది.
"ముసలివాణ్ణి, ఇవాళ కాకపోతే రేపైనా నేను రాలిపొయ్యేవా. నన్నే పోనీ, బాబూ!” అన్నాడు కావు.
"నే నంత సులభంగా చస్తానను కున్నారా? మీకేమీ భయంవద్దు," అని ప్రద్యోతుడు చీకటి పడగానే రాజభవ నానికి వెళ్ళాడు.అతను వెళ్ళేసరికి రాజభవనంలోని వాళ్ళంతా భోజనాలు చేస్తున్నారు. ప్రద్యో తుడు వెళ్ళి ఆ పంక్తిలో కూర్చున్నాడు. వడ్డన చేసేవాడు ఆశ్చర్యపడి, " ఎవరు నువు?" అని అడిగాడు.
"ఈ రాత్రికి రాజుగారి అతిథిని. అలా చూస్తావేం? నే నీ రాత్రి రాజుగారికి కథలు చెబుతున్నాను. వడ్డించు," అన్నాడు. ప్రద్యోతుడు.
పంక్తిలో వాళ్ళంతా ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. రాజుగారికి కథలు చెప్పేవాళ్ళెవరూ విందులు కుడవ టానికి వచ్చిన బంధువులల్లే రారు, ప్రాణా లరచేత బట్టుకుని వచ్చి, తెల్లారే సరికల్లా వాటిని పోగొట్టుకుంటారు.
వడ్డనవాడు. మారు మాటాడక ప్రద్యో తుడికి వడ్డన చేశాడు. ప్రద్యోతుడు సుష్టుగా భోజనం చేసి, "ఇప్పుడు నన్నెవరన్నా రాజు గారి దగ్గిరికి తీసుకుపోండి,” అన్నాడు.
నౌకర్లు ప్రద్యోతుణ్ణి రాజుగారి పడక గదికి తీసుకుపోయారు. ఆ సమయంలో ప్రగల్భుడు తన శయ్య మీద గోడ కేసి తిరిగి పడుకుని ఉన్నాడు.
"ఈ రాత్రి తమకు కథలు చెప్పటానికి వచ్చాను,” అన్నాడు ప్రద్యోతుడు.
"చెప్పు,” అన్నాడు ప్రగల్భుడు, వచ్చిన వాణ్ణి చూడకుండానే. ప్రద్యోతుడు తాను విన్న కథలన్నీ వరసగా చెప్పుకుపోయాడు. తెల్లవారింది. ప్రగల్భడు మంచం మీద పొర్లి ప్రద్యోతుణ్ణి చూసి, "నువు కథలు బాగానే చెబుతావు,” అన్నాడు.
"నువు వాటిని వింటేగద! తెల్లవార్లూ హాయిగా నిద్రపోయావు," అన్నాడు ప్రద్యోతుడు.
ప్రగల్బుడు ఆ మాటధోరణికి ఉలిక్కి పడి, "ఆటే పేలకు! నేను ఏనాడూ నిద్ర పోయి ఎరగను. నా కసలు కన్ను మూత పడితేకద!” అన్నాడు."అదే నిజమైతే నువ్వేది పాము కడుపున పుట్ట ఉంటావు!" అన్నాడు ప్రద్యోతుడు. ప్రగల్ఫుడు ఆగ్రహావేశంతో కత్తి దూయబోయాడు.
"తొందరపడకు. కత్తి ఒకటి నాదగ్గిరా ఉన్నది. నువ్వెలా పుట్టావో మీ అమ్మ నడిగిరా!" అన్నాడు ప్రద్యోతుడు.
ప్రగల్భడు చివాలున లేచి వెళ్ళిపోయి, కొంచెం సేపటికి తిరిగి వచ్చి, "నువ్వన్నది నిజం ! నా తండ్రి మామూలు మనిషి కాడుట!” అన్నాడు.
"సరే, నీకు నిద్రపట్టే మార్గం నేను చెబుతాను విను. ఇక్కడికి కొంత దూరంలో గంధర్వుడి మడుగొకటి ఉన్నది. దానిలో స్నానం చేసి, ఈతలుకొట్టి రా. ఆ తరవాత నువు హాయిగా నిద్రపోగలుగుతావు,” అన్నాడు ప్రద్యోతుడు.
ఆ పూటే ప్రగల్బుడు గంధర్వుడి మడుగులో స్నానం చెయ్యటానికి సపరి
వారంగా వెళ్ళాడు. అతడు నీటిలో ముణ గటం అందరూ చూశారు, ఆ తరవాత అతని జాడలేదు. చీకటిపడిన దాకా మడుగు ఒడ్డున పడిగాపులు కాసి, పరివారం తిరిగి వచ్చేసింది.
రాజుగారు మాయమయినట్టు ఊరంతా పొక్కింది. చాలామంది పండగ చేసు కున్నారు. అయిదారురోజులు గడిచాక మంత్రులు ప్రగల్బుడికి ఉత్తరక్రియలు జరిపేశారు. సింహాసనానికి వారసుణ్ణి నిర్ణ యించటానికి పదమూ డోనాడు సభ జరిగింది.
ప్రద్యోతుడు ఆ సభకు వెళ్ళి, " నేను ప్రవర్ధన మహారాజు కొడుకును. ఇదుగో నా మెడలో మా తండ్రిగారి హారం!” అని చెప్పి, హారం చూపించాడు.
అందరూ ఆ హారాన్ని గుర్తించారు. ప్రద్యోతుడికి రాజ్యాభిషేకం వైభవంగా జరి గింది. కాపు సకుటుంబంగా వచ్చి రాజ భవనం చేరాడు. అంతా సుఖంగా ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment