Monday, 8 December 2025
ఆనందం
ఒక ఊళ్ళో ఒక గృహస్థుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు. తండ్రి ఖజా నాలో రాతగాడుగా ఉండి. ఏ కొరతా లేకుండా కొడుకులను పోషిస్తూ వచ్చాడు. ఆయన పెద్దవాడయిపోయి, ఆరోగ్యం చెడిపోయినందున ఖజానా. ఉద్యోగం మానుకుని, ఇంటిలో విశ్రాంతి తీసుకో సాగాడు.
. తండ్రి బాగానే సంపాదించాడు గాని, కొడుకులు తిని తిరగటం తప్ప ఏ ఉద్యోగం లోనూ ప్రవేశించలేదు. అది చూసి తండ్రి, ముగ్గురు కొడుకులనూ పిలిచి, "ఇన్నాళ్లూ నేను మిమ్మల్ని పోషించాను. ఇప్పుడు నేను మూల పడ్డాను. మీకు వయసు వచ్చింది. ఇక మీరే నన్ను పోషించాలి. మీకు తలా ఒక నూరు రూపాయలూ ఇస్తాను. వాటిని తీసుకుని మీరు ఎటైనా వెళ్ళండి, ఏమైనా చెయ్యండి. ఒక సంవ
త్సరానికి మీరు నాకు సంతోషం కలిగించే పనులు చేసి, తిరిగి రండి." అన్నాడు.
ఐశ్వర్యం కన్న మనిషిని సంతోష పెట్టేది మరే ముంటుందనుకుని, పెద్ద వాడు నగరానికి వెళ్ళి. ఒక గొప్ప ధని కుడి వద్ద పనికి కుదిరి, విశ్రాంతి వేళల్లో బరువులు మొయ్యటం దగ్గిర నుంచి ఏ పని అయినా సంకోచించకుండా చేశాడు. సంవత్సరం పూర్తి అయేసరికి అతడి వద్ద పదివేలు పోగయాయి. అతను దానితో ఒక మంచి రత్నాన్నికొని, ఇంటికి తిరిగి వచ్చి, దాన్ని తన తండ్రికి ఇచ్చాడు.
"అయ్యో, నాయనా ! ధనమే ప్రధాన మని అడ్డమైన చాకిరీ చేసి ఎలా అయి పోయావు ! నిన్ను చూస్తే నాకు దుఃఖం కలుగుతున్నది రా." అన్నాడు తండ్రి.
రెండోవాడు ఒక సిద్ధవైద్యుడి దగ్గిర శిష్యుడుగా చేరి, ఆయనకు ఎంతో శ్రద్ధాసక్తులతో శుశ్రూషలు చేసి మెప్పించి, ముసలితనాన్నీ, ముసలితనంలో కలిగే జాడ్యాలనూ పోగొట్టే ఒక గొప్ప ఔష ధాన్ని సంపాదించి, ఇంటికి తిరిగి వచ్చి, ఆ ఔషధాన్ని ఎంతో సంతోషంగా తండ్రికి ఇచ్చాడు.
“నాకు ఈ ఔషధం ఎందుకు, నాయనా? నేను సమస్త సుఖాలూ అను భవించాను. కృత్రిమంగా తెచ్చిపెట్టు కునే యౌవనం నాకు సంతోషం కలిగిం చదు. ఇది చూసి నేను సంతోషిస్తానని నువు అనుకున్నందుకు నాకు విచారమే కలుగుతున్నది.'' అన్నాడు తండ్రి.
మూడోవాడు ఒక వృద్ధుడైన గురువు దగ్గిరికి పోయి, ''తండ్రి సంతోషించా లంటే కొడుకు ఏం చెయ్యాలి?" అని అడిగాడు.
“నీకు అభిమానం గల విద్య ఏమిటి?" అని గురువు ఎదురు అడిగాడు.
“నాకు సంగీత మంటే చాలా ఇష్టం." అన్నాడు కుర్రవాడు.
"అయితే సంగీతం నేర్చుకో. అందులో ప్రవీణుడివి అయావంటే నీ తండ్రి సంతో షిస్తాడు." అన్నాడు గురువు.
మూడోవాడు ఒక సంగీత విద్వాంసుడి దగ్గిరికి పోయి, తన దగ్గిర ఉన్న డబ్బంతా ఇచ్చేసి. ఆయన వద్ద సంగీతం నేర్చు కుంటూ అహెూరాత్రులు సాధన చేశాడు. ఒక్క ఏడాదిలో వాడు గొప్ప సంగీత విద్వాంసుడై, దేవాలయంలో పాడసా గాడు. అతని పాట విన్న రసికులు తన్మ యులై రాజుగారికి అతని సంగతి చెప్పారు.
రాజుగారు అతన్ని ఆహ్వానించి, ఆస్థానంలో పాడించి, మెచ్చుకుని, అతన్ని ఆస్థాన విద్వాంసుడుగా నియమించాడు.
తండ్రిని చూసి రావటానికి మూడో వాడు రాజుగారి అనుమతి పొంది, రాజు గారిచ్చిన కానుకలన్నీ తీసుకుని ఇంటికి వచ్చాడు. తండ్రి ఆ కొడుకును చూసి సంతోషించి, "ఇదే తండ్రికి నిజమైన సంతోషం. కొడుకు 'కీర్తిమంతుడు కావ టంతో తండ్రి ధన్యుడవుతాడు.'' అన్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment