Tuesday, 9 December 2025
వృద్ధభిక్షుకుడు
పాపన్న ఉండే దేశంలో ఒకసారి యుద్ధ పరిస్థితి వచ్చింది. పొరుగు దేశపు రాజు ఈ దేశంలోని కొన్ని భాగాలు తన రాజ్యా నికే చెందాలని తగాదా తెచ్చి, ఆ తగాదాను అంతకంతకూ పెంచి, చివరకు ఈ దేశం పై దురాక్రమణకు పూనుకున్నాడు. ఆయన సేనలు ఈ దేశంలోకి చొరబడి, కొన్ని గ్రామాలనూ, నగరాలనూ ఆక్రమించు కుని, చివరకు ఒక కోట వద్ద నిలవరించ బడ్డాయి. అవి ఆ కోటను ముట్టడించి, నెలల తరబడి యుద్ధం సాగించి కూడా దాన్ని లోబరుచుకోలేక పోయాయి.
యుద్ధ కారణంగా దేశంలోని ప్రతి గ్రామం లోనూ గ్రామాధికారికి ప్రత్యేకమైన పనులు ఏర్పడ్డాయి. ఈ పనులు నిర్వర్తిం చటంలో పాపన్న తమ ఊరి గ్రామాధికారికి ఎంతో తోడ్పడ్డాడు. గ్రామాధికారి కొంత యుద్ధనిథి పోగుచేశాడు, సేనలో చేరటానికి
ఆ డబ్బునూ, యువకులనూ వెంటబెట్టు కుని పాపన్న రాజధానికి వెళ్ళాడు. కొందరు యువకులను సంపాదించాడు.
అక్కడి పని పూర్తిచేసుకుని పాపన్న తిరుగుముఖమై వస్తూ చీకటిపడే వేళకు ఒక గ్రామసావడి చేరుకున్నాడు. అక్కడ అతనికి అనేకమంది బిచ్చగాళ్ళ లాటి వాళ్ళు ఒక గుంపుగా చేరి కనబడ్డారు. అంతమంది బిచ్చగాళ్ళు అక్కడ పోగవటా నికి కారణ మేమిటని పాపన్న అడగగా, బిచ్చగాళ్ళనూ, గాలికి తిరిగేవాళ్ళనూ పట్టు కుని రాజధానికి పంపమని రాజాజ్ఞ అయి నట్టు తెలిసింది. శత్రువుల వేగులవాళ్ళూ, గూఢచారులూ మారువేషాలతో దేశమం తటా తిరుగుతున్నట్టు రాజధానికి తెలియ వచ్చిందట. ఈ బిచ్చగాళ్ళంతా ఆ ప్రాంతా లలో పట్టుబడినవాళ్ళు. వాళ్ళలో కొందరు పాపన్నను గుర్తించి, సంతోషం చెంది,"పాపన్నగారూ, మమ్మల్ని అకారణంగా భటులు పట్టుకున్నారు. మీరైనా కాస్త మమ్మల్ని విడిపించి పుణ్యం కట్టుకోండి.” అని వేడుకున్నారు.
"అంతలో మీకు వచ్చిన నష్టమేమిటి? రాజాజ్ఞ అమలు జరగనివ్వండి. మీకు కావలిసిన తిండి కేమీ లోపం రాదు. ఈ జరుగుతున్న యుద్ధం ముగిసేదాకా కాస్త ఓర్చుకోండి. ఆ తరవాత ఎప్పటిలాగే మీరు యథేచ్ఛగా తిరగవచ్చు," అన్నాడు పాపన్న ఆ బిచ్చగాళ్ళతో.
బిచ్చగాళ్ళలో ఒక వృద్ధుడు తెలిసిన వాళ్ళ నుంచి పాపన్న గురించి వివరాలు
తెలుసుకుని, సైగ చేసి పాపన్నను దగ్గిరికి పిలిచి, రహస్యంగా, " అయ్యా, నాకు తమ వల్ల ఒక ఉపకారం కావాలి. ఈ ఊరి కోట వెలుపల తూర్పున ఒక కాళికాలయం ఉన్నది. అక్కడ నా కొడుకు ఒంటికంటి వెంక డనేవాడు ఉన్నాడు. నే నిలా చిక్కు కున్నానని వాడితో చెప్పి, నే నిచ్చే పొట్లాన్ని వాడికి అందించాలి. నే నిక ఎక్కువ కాలం బతకను. ఈ పొట్లంలో నే నొక కొత్త మంత్రం రాసి ఉంచాను. దాన్ని వాడికి మీరు చేర్చగలిగితే నా పని తీరిపోతుంది. ఈ సహాయం చేయగలవాళ్ళు నా కిప్పు డెవరూ లేరు,” అన్నాడు.
" ఆ పొట్లాన్ని నా కిస్తే నేను నీ కొడుక్కు చేర్చుతాను," అన్నాడు పాపన్న.
ముసలి బిచ్చగాడు ఆ చీకట్లో పాపన్న చేతిలో ఒక పొట్లం ఉంచాడు. ఒక పాత గుడ్డలో కట్టిన ఆ పొట్లం అరిచేతి అంత వెడల్పుగాసూ, పలచగానూ ఉన్నది.
మర్నాడు పాపన్న కాళికాలయాన్ని వెతుక్కుంటూ వెళ్ళి, అక్కడ ఒక యువ కుణ్ణి చూశాడు. వాడు ఒంటికంటివాడు. పాపన్న వాణ్ణి, "నీ పేరేనా వెంకడు?" అని అడిగి, వా డవునన్న మీదట, "నీ తండ్రి దీన్ని నీ కివ్వమన్నాడు,” అంటూ పాట్లంవాడి చేతిలో పెట్టి, "నీ తండ్రిని అధికా రులు పట్టుకుపోయారు,” అని చెప్పి దేవి దర్శనం చేసుకునేటందుకు ఆలయం లోపలికి వెళ్ళాడు.
ఆ దేవాలయంలో నలుగురే ఉంటారు. ఒకడు అర్చకుడూ, రెండోవాడు దేవాలయం నౌకరూ, మూడోవాడు వెంకడూ, నాలుగో వాడు వెంకడి సహచరుడూనూ, వెంకడు పొట్లం విప్పి, తన సహచరుడు తెచ్చిన గుడ్డపీలికను నీటితో తడిపే సరికి సాంకేతిక లిపిలో రాసి ఉన్నది ఏదో బయట పడింది. అందులో కొన్ని గీత లేవో ఉన్నాయి. ఆది గాక కొంత రాత కూడా ఉన్నది. ఆ రాతలో పాపన్నకు సంబంధించిన విషయా లిలా ఉన్నాయి: "అది తెచ్చేవాడే పరోపకారి పాపన్న. రాజుకు స్నేహపాత్రుడు. ఇతన్ని చెరలో పెట్టించు.”
పాపన్న దేవాలయం నుంచి వెళ్ళిపో తున్నప్పుడు ఒంటికన్ను వెంకడు అతన్ని సమీపించి, " మీరు మా ఆతిథ్యం స్వీకరిం చాలి, పాపన్నగారూ, అమూల్యమైన సమా చారం తెచ్చినందుకు మీకు మా రాజుగారు గొప్ప బహుమానం ఇస్తారు. ఇవాళ రాత్రే మన ప్రయాణం,” అన్నాడు. అత నా మాట అంటూండగానే అతని సహచరుడూ,
అర్చకుడూ వచ్చి పాపన్న చెరొక రెక్కా పట్టుకున్నారు. "ఏమిటీ దౌర్జన్యం? నువ్వెవరు? ఆ బిచ్చగాడి కొడుకువు కావా?” అని పాపన్న అంటూండగా దేవాలయం నౌకరు పెద్ద తాడొకటి పట్టుకొచ్చాడు.
" అదంతా ఒక నాటకం. మీరు మాకు ఉపకారమే చేశారు గాని, మిమ్మల్ని బంధించక తప్పదు. మిమ్మల్ని విడిపించు కోవటానికి మీ రాజు మాకు అర్థరాజ్య మిస్తాడో, రాజ్యమంతా అస్తాడో చూడాలి,” అన్నాడు ఒంటి కన్నువాడు.
"అదా సంగతి? మీరు పూర్తిగా పొర బడ్డారు. నేను మీ రనుకున్నంత ముఖ్యుణ్ణికాను. నన్ను మీరు చంపినా మా రాజుగారు లెక్కచెయ్యరు. యుద్ధంలో చచ్చేవాళ్ళతో కాని అందువల్ల మీ కింత పాపం తప్ప బాటే నేనూనూ. కావలిస్తే నన్ను చంపండి. మరేమీ దక్కదు," అన్నాడు పాపన్న.
వాళ్ళు అతని చేతులు కలిపి కట్టి ఒక కొట్టులోకి నెట్టి తలుపులు మూసేశారు. గుడి ఉండే ప్రాంతం నిర్జనమైనది, తాను కేకలు పెట్టినా పలికే దిక్కుండదని పాపన్న గ్రహించాడు. గుడిలో వాళ్ళంతా శత్రు వులూ, శత్రువుల మనుషులూనూ, ముసలి బిచ్చగాడు కూడా గూఢచారే. వాడు రాజ ధానికి సంబంధించిన రహస్య మార్గాలు
మొదలైనవన్నీ చిత్రించి తన కొడుక్కు అందజేశాడు. ముసలివాడు పట్టుబడ్డాడు. గాని ఒంటి కన్ను వాడు స్వేచ్ఛగానే ఉన్నాడు. వాడా రహస్యాలను శత్రు రాజుకు చేర్చుతాడు.
పాపన్న అసాధారణ బలాఢ్యుడు. కావటం చేత తన చేతికి కట్టిన తాళ్ళు వదిలించుకుని జరగగల దాని కెదురు చూస్తూ కొట్టులో ఉన్నాడు. ఆ రాత్రి ఒంటి కన్నువాడు యోధుడి వేషంలో, తన అను చరుడితో సహా వచ్చి, కొట్టు తలుపు తెరి పించి, పాపన్నను బయటికి రమ్మని, "ఇక మనం మా రాజుగారి దగ్గిరికి బయలుదేరు తున్నాం. పెద్దమనిషిలా మా వెంటరావాలి. దారిలో నువ్వేదైనా కోతి పని చేశావో మా కత్తులు రుచి చూస్తావు? వాటి రుచి నీకు తెలుసా?" అన్నాడు.
" నాకు తెలీదు. అసలు మీ చేతిలో కత్తు లుండటమే తప్పు," అంటూ పాపన్న ఒంటి కంటి వాడి చేతి మీద బలంగా ఒక్కటి పెట్టాడు. ఆ దెబ్బతో వాడి చేతి కత్తి కింద పడింది, చెయ్యి నీలుక్కుపోయి చచ్చే బాధ పెట్టింది. అది చూసి వాడి అను చరుడు పాపన్న పైకి తన కత్తి ఎత్తాడు. పాపన్న వాడి చేతి మీద కూడా బలంగాకొట్టి, కత్తి కింద పడేయించాడు. తరవాత అతను రెండు కత్తులూ తీసి దూరంగా విసిరి పారేశాడు.
ఇంతలో అర్చకుడూ, నౌకరూ బలమైన తాళ్ళు తెచ్చారు. పాపన్న ఒంటికన్ను వాణ్ణి, వాడి అనుచరుణ్ణి చచ్చేటట్టు తన్ని, అర్చకుడు తెచ్చిన తాడు లాక్కుని, వాళ్ళిద్ద రినీ పెడరెక్కలు విరిచి కట్టి, భయంతో కంపించిపోతున్న అర్చకుణ్ణి, గుడి నౌక రునూ కూడా అలాగే కట్టి, నలుగురినీ గది లోకి తోసి, తలుపు బిగించాడు. తరవాత అతను గ్రామాధికారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి, తనకు నలుగురు గూఢచారులు చిక్కారనీ, వాళ్ళను పట్టుకుపోవటానికి భటులు కావాలనీ చెప్పాడు.
భటులు వచ్చి నలుగురినీ వశపరచు కున్నారు, ముసలి బిచ్చగాడు పంపిన సంకేత సందేశాన్నీ, ఇతర వస్తువులనూ స్వాధీనం చేసుకున్నారు. పాపన్న వాళ్ళ
వెంట రాజధానికి వెళ్ళి, రాజుగారికి జరిగిన దంతా సవిస్తరంగా చెప్పాడు.
రాజుగారు ఖైదీ బిచ్చగాళ్ళలో నుంచి ముసలి బిచ్చగాణ్ణి ఏరి, విచారించగా, వాడు శత్రురాజు పినతండ్రి అనీ, ఒంటి కన్ను వాడు ఆయన కొడుకే ననీ బయట పడింది. తరవాత రాజుగారు శత్రురాజుకు, "మీ పిన తండ్రీ, ఆయన కొడుకూ మాకు బందీలుగా చిక్కారు. మీ సేనలు వెంటనే మా రాజ్యం వదిలి పోవాలి. యుద్ధ నష్టం కింద మీరు లక్షవరహాలు చెల్లించాలి. లేని పక్షంలో మీ పినతండ్రి తలా, ఆయన కొడుకు తలా తీయించి, మీతో యుద్ధం కొనసాగిస్తాం," అని కబురు చేశాడు.
తన వాళ్ళను విడిపించుకో గలందులకు శత్రురాజు షరతు లన్నిటికీ ఒప్పుకున్నాడు. దేశానికి యుద్ధభయం తీరిపోయింది. ఇతర యోధులతో బాటు పాపన్నకు కూడా రాజు గారు మంచి సన్మానం చేశాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment