Tuesday, 9 December 2025

ముగ్గురు సుందరులు పేదరాశి పెద్దమ్మ కు ఏడుగురు కుమారులుండేవారు. పెద్దమ్మ వృద్ధురాలు ఐనందున వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది. అందు చేత వాళ్ళుపట్టణం వెళ్ళి పని చేసుకుందా మని బయలుదేర నిశ్చ యించు కున్నారు. పెద్దవా ళ్ళందరూ చిన్నోడిని తమవెంట రావద్దన్నారు. వాళ్ళు తమ మూటా ముల్లే సర్దుకుని ఒక రాజుగారి వద్దకు వెళ్ళారు. వాళ్ళు అక్కడికి చేరేసరికి చిన్నోడు కూడా అక్కడికి చేరనే చేరాడు. రాజుగారు వాళ్ళ మొర విని, "ప్రస్తు తానికి మీ కిచ్చేటందుకు పని ఏమీ లేదు. అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు గసక వంట ఇంటికి కావలిసిన నీరూ, వంటచెరుకూ చేర వేస్తూ ఉండండి.” అన్నాడు. వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు. కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవా ళ్ళిద్దరినీ పిలిచి,"మీ ఇద్దరి కన్నా చిన్నోడు రెట్టింపు నీరు తెస్తున్నాడుట, రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడుట, మీ రింత మంద కొడిగా ఉన్నారేం?" అని అడిగాడు. రాజుగారి భార్య కొద్ది కాలం కిందటనే పోయింది. ఆయన తిరిగి ఇంకా పెళ్ళాడ లేదు. అది పెద్దవా ళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళు చిన్నోడు పీడ వదిలించుకుందా మని రాజుగారితో, "మా చిన్నోడు చాలా సమర్హుడు. వాడు ఎన్నో సాహసకార్యాలు చేశాడు. వాణ్ణి పంపారంటే మీకు వారం లోపల జగదేకసుందరిని తెచ్చి భార్యగా చెయ్యగలడు." అన్నారు. సౌందర్యవతి అయిన భార్యను పెళ్ళాడాలని రాజు గారికి ఆశ పుట్టింది. ఆయన చిన్నోడు ను పిలిచి, "ఒరే, నీ శక్తి తెలియక నీ చేతనీళ్ళూ, కట్టెలూ మోయించాను. ఇక నువ్వా పని మాని, నేను పెళ్ళాడటానికి ఒక జగదేక సుందరిని తెచ్చి పెట్టు. నీకు వారం రోజులు గడు విస్తున్నాను," అన్నాడు. "అంత పని నా వల్ల అవుతుందా మహా రాజా ? నాకు శక్తి ఉందని నే నెప్పుడూ చెప్పుకో లేదే ?" అన్నాడు నాగులు. "వారం రోజుల్లో జగదేక సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోట గుమ్మానికి కట్టిస్తాను. ఏమనుకున్నావో!" అని రాజుగారు చిన్నోడు ని భయపెట్టాడు. ఇక చిన్నోడు కు బయలుదేరక తప్ప లేదు. రాజుగారి వంటలక్క చిన్నోడు కు మంచి మంచి ఆహారపదార్థాలు మూటగట్టి ఇచ్చింది. వాడు అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది. అందుచేత వాడు ఒక చెట్టు కింద కూర్చుని ఆహారం మూట విప్పసాగాడు. అంతలోనే ఒక ముసలిది వా డున్న చోటికి వచ్చి, "ఆ మూట లో ఏమిటి, నాయనా?" అని అడిగింది. "మా పెద్దమ్మ లా ఉన్నావు నువ్వు రా భోజనం, కావలిస్తే నువు కూడా ఇంత తిను," అన్నాడు చిన్నోడు . ఇద్దరూ కడుపునిండా తిన్నాక, ముసలిది చిన్నోడు తో, "నీ రుణం ఉంచుకోనులే, బాబూ. ఏం పని మీద పోతున్నావు? ఎక్కడ దాకా ప్రయాణం?" అని అన్నది. చిన్నోడు తాను బయలుదేరిన పని గురించి, రాజు గారి బెదిరింపు గురించి ముసలిదానికి చెప్పాడు. "నీకు జగదేకసుందరి కావాలం టే, ఈ దిక్కుగా పోతే మాయావు లుండే కోట వస్తుంది. అక్కడ జగదేక సుందరులు దొరుకుతారు. ఈ శంఖం ఊదావంటే నిన్ను మాయావు లేమీ చెయ్యరు సరేకదా, వాళ్ళు నువు చెప్పినట్టు వింటారు,” అని ముసలిది చిన్నోడు కొక శంఖం ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయింది.చాలా సేపు శ్రమపడిన మీదట చిన్నోడు కు ఆ శంఖాన్ని ఊదటం చాతనయింది. అది మోగిన మరుక్షణం అతని చుట్టూ భూతాలు ప్రత్యక్షమై "ఏం కావాలి, దొరా? ఏం సెలవు?" అని కేకలు పెట్టారు. " నా కొక జగదేకసుందరిని తెచ్చిపెట్ట గలరా?” అన్నాడు చిన్నోడు , లోలోపల వాళ్ళను చూసి భయపడుతూనే. "జగదేకసుందరులను తాకే శక్తి మాకు లేదు గాని, వాళ్ళుండే చోటికి నిన్ను చేర్చుతాం," అని భూతాలు చిన్నోడు ను ఒక కోట వద్దకు ఎత్తుకుపోయి దించారు. కోట నిర్జనంగా ఉన్నది. చిన్నోడు లోపలికి వెళ్ళేసరికి అక్కడ ముగ్గురు రాజకుమా ర్తెలు అతని కళ్ళ పడ్డారు. చిన్నోడు ను చూస్తూనే వాళ్ళు భయపడిపోయి, కంగా రుగా అటూ ఇటూ పరిగెత్తి, అంతలోనే అదృశ్యమైపోయారు. చిన్నోడు కోట అంతా తెగ వెతికాడు, కాని వాళ్ళ జాడ ఏమీ తెలియలేదు. వాళ్ళు అలా కంగారుపడి పరిగెత్తకపోయి నట్టయితే వారిలో ఏ ఒకతెనైనా బతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారి కిచ్చి, తన తలను రక్షించుకుని ఉండేవాడు. ఇక తాను వట్టి చేతులతో తిరిగిపోక తప్పదు, రాజుగారు తన తల తీయించటం అంతకన్నా తప్పదు.చిన్నోడు ఇలా అనుకుంటూండగా సుంద రులు కనిపించిన చోట ఒక గూట్లో వాడికి మూడు నిమ్మ పళ్ళు కనబడ్డాయి. ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చునని చిన్నోడు వాటిని తన సంచీలో వేసుకుని ఇంటిదారి పట్టాడు. కొంత దూరం వెళ్ళేసరికి చిన్నోడి కి అపరిమితమైన దాహం పట్టుకున్నది. ఎండ మండిపోతున్నది. కనుచూపు మేరలో ఎక్కడా తడినేల అన్నది కూడా లేదు. అందుచేత వాడు సంచీలో నుంచి ఒక నిమ్మ కాయ తీసి కోశాడు. అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించి, "దాహం ! చచ్చిపోతున్నాను!" అన్నది. ఆ సుందరిని ఎలాగైనా బతికించి రాజు గారికి ఇస్తే తన తల కాచుకోవచ్చు నను కుని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా చెడ వెతికాడు. ఎక్కడా ఒక్క చుక్క నీరు లేదు. వాడు వగర్చు కుంటూ తిరిగి వచ్చేసరికి, నిమ్మకాయలో దాగిన సుందరి చచ్చేపోయింది. చిన్నోడు పుట్టెడు విచారంతో ముందుకు సాగాడు. మరి కొంత దూరం వెళ్ళేసరికి వాడికి మళ్ళీ దుర్భరంగా దాహం వేసింది. వాడు సంచీలో నుంచి మరొక విమ్మ కాయ తీసి కోశాడు. అందులో ఇంకా అంద మైన సుందరి తల కనిపించి, "దాహం! చచ్చిపోతున్నాను,” అన్నది. చిన్నోడు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కులకూ చెడపరిగెత్తాడు. కాని వాడి శ్రమ ఫలించ లేదు. ఎక్కడా నీరు దొరకలేదు. నిమ్మ కాయలో కనిపించిన సుందరి ప్రాణాలు విడిచింది. చిన్నోడు కిప్పుడు ఒక ఆశ పుట్టింది. మూడో నిమ్మకాయలో మరొక జగదేక సుందరి ఉండి ఉంటుంది. ఆ నిమ్మ కాయను కొయ్యకుండా తాను రాజభవనంచేరే పక్షంలో ఆమె ప్రాణాలూ, తన తలా కూడా దక్కుతాయి. తాను అవివేకంగా నిమ్మ కాయలు కోసి ఇద్దరు సుందరులను చావనిచ్చాడు. ఈసారి అలాటి పొరపాటు చెయ్యగూడదు. కాని రాజభవనం చేరే లోపుగా చిన్నోడు కు దాహంతో నాలుక ఈడ్చుకుపో సాగింది. నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాలలో తన ప్రాణాలు పోయేటట్టు కని పించాయి. వాడు పళ్ళబిగువున నడిచి, రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుచూపు మేరలో ఉండే చోటికి చేరి, దాహం భరించలేక, మూడో నిమ్మకాయ చచ్చిపోతున్నాను!" అన్నది. తీసి కోశాడు, అందులో అందరి కన్న అంద మైన ముందరి తల కనిపించి, "దాహం! వెంటనే నాగులు లేని శక్తి తెచ్చుకుని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్ళి, కొలను చేరుకుని, సుందరి చేత నీరు తాగించి, తాను కూడా తాగాడు. కొలనులోని నీరు తాగుతూనే జగదేకసుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది. "అమ్మయ్య బతికాను ! నువ్వీ చెట్టు మీదికి ఎక్కి, ఆకు గుబురు మధ్య దాక్కో. నేను వెళ్ళి రాజుగారిని పిలుచుకువస్తాను,” అని చిన్నోడు రాజభవనానికి వెళ్ళాడు.ఇంతలోపల రాజుగారి వంటలక్క నీటి కోసం కొలనుకు వచ్చి, అందులో బిందె ముంచబోతూ, చెట్టు మీద ఉన్న జగదేక సుందరి ముఖం నీటిలో చూసి, "అమ్మ బాబోయ్ ! నే నింత అందంగా ఉన్నానా? అయితే నా కీ వంటలక్క పని చేసే కర్మే మిటి?" అని బిందె అక్కడే విసిరికొట్టి, వెనక్కు తిరిగేసరికి చెట్టు కొమ్మల మధ్య ఉన్న జగదేకసుందరి కనిపించింది. వంటలక్కకు ఆమెను చూడగానే మండిపోయింది. ఆమె జగదేక సుందరిని కిందికి ఈడ్చి, ఆమె దుస్తులు తాను ధరించి, జగదేక సుందరిని మడుగులోకి తోసేసి, తానే చెట్టుకొమ్మలలో ఎక్కి కూర్చున్నది. కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి చూచునుగదా, ఆ మనిషి జగదేకసుందరి కాకపోకా మామూలు సుందరి కూడా కాదు. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చి పెట్టించాడు. వంటలక్కనూ, చిన్నోడు నూ కూడా చెరలో ఇది జరిగిన మర్నాడే రాజుగారి నౌకర్లకు కొలనులో ఒక తెల్లని చేప దొరికింది. దాన్ని వంటణంటి దాసీలు కోసే సరికి ఒక చిన్న స్త్రీ బయటికి వచ్చి, వాళ్ళు చూస్తూండగానే మామూలు మనిషి అయింది. దాసీలు వెళ్ళి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు. రాజుగారు పరిగెత్తు కుంటూ వచ్చి, జగదేకసుందరిని చూసి అమితమైన ఆశ్చర్యమూ, ఆనందమూ పొంది, ఆమె ద్వారా జరిగినదంతా తెలుసు కున్నాడు. ఆయన వెంటనే చిన్నోడు ను చెర విడిపించి, వాడికి తన అంగరక్షకుడుగా ఉద్యోగమిచ్చి, జగదేక సుందరిని వైభవంగా పెళ్ళాడాడు. వంటలక్క తాను చేసిన నేరం ఒప్పుకున్నది. ఆమెను దేశం నుంచి తరిమే శాడు. చిన్నోడు అన్నలందరూ ఇంకా నీరూ, కట్టెలూ చేరవేస్తూనే ఉన్నారు.

No comments:

Post a Comment