Sunday, 21 December 2025
#మతి మరుపు#
కాళీపట్టణపు రాజకుమారుడు చంద్ర భానుడు తన తండ్రితో గాని, అన్నలతో గాని చెప్పకుండా దేశయాత్రకు బయలు దేరాడు. అతను ఒక మహారణ్యం ప్రవే శించి, దానిలో నుంచి బయటికి వచ్చే మార్గం తెలియక, రోజల్లా ప్రయాణించి, చీకటిపడ్డాక ఒక ఇల్లు చేరుకున్నాడు. ఆ ఇంట ఒక ముసలిదీ, ఒక పడుచుపిల్లా మాత్రమే వున్నారు. మగదిక్కు లేకుండా ఆ నిర్జనవనంలో వాళ్ళిద్దరూ ఎలా ఉంటు న్నారో చంద్రభానుడికి అర్ధం కాలేదు.
"అందరికీ దిక్కు ఆ భగవంతుడే ఉన్నాడు. నేను కదలలేని స్థితిలో ఉన్నాను. నా కూతురు చంద్రిక నాకే లోటూ రాకుండా చూస్తున్నది,” అన్నది ముసలిది. చంద్రిక వంట చేసి అతనికి దివ్యమైన భోజనం పెట్టింది. ఆ భోజనం చూసి అతను ఆశ్చర్యపడ్డాడు. చంద్రికను చూస్తే అతనికి
మరింత ఆశ్చర్య మయింది. ఆ పిల్ల ఆ ముసలిదాని కూతురంటే నమ్మశక్యంగా లేదు. ఇద్దరికీ ఎలాంటి పోలికలూ లేవు. అంతేగాక చంద్రిక మసిపాతలో కట్టిన మాణిక్యం లాగున్నది.
ఆ రాత్రి అతను ముసలిదాని ఇంటనే పడుకున్నాడు. కాని అతనికి సరిగా నిద్ర పట్టలేదు. పట్టిన నిద్రలోనే అతని కొక పీడ కల వచ్చింది. ఆ కలలో తా నొక కుక్క అయినట్టూ, తనను ఒక చోట కట్టి ఉంచి నట్టూ, తాను మాట్లాడబోయి మూలిగినట్టూ అతను కలగన్నాడు. అంతలోనే అతనికి నిద్రాభంగ మయింది. అతను కళ్ళుతెరిచి చూసేసరికి తాను పడుకున్న చోట ఉండ టానికి బదులు గోడవార కూర్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా చంద్రిక నిలబడి ఉన్నది.
" వ్యవధి లేదు. తూర్పు తెల్లవారేసరి కల్లా ముసలిది మళ్ళీ తిరిగి వస్తుంది.ఈ లోపల నేను విన్ను అడివి దాటిస్తాను,” అన్నది చంద్రిక అతన్ని తొందర చేస్తూ.
చంద్రభానుడు ప్రశ్నలు వేసి కాల యాపన చెయ్యక, చంద్రిక వెంట బయలు దేరాడు. దారిలో చంద్రిక అతనికి ఆ ముసలిదాన్ని గురించిన రహస్యమంతా చెప్పేసింది.
ఆ ముసలిది ఒక మంత్రగత్తె. కేశవ పురం రాజుగారి దివాణంలో మంత్రసానిగా ప్రవేశించి, ఆ రాజుభార్య రెండవసారి ఆడపిల్లను కన్నప్పుడు ఆ బిడ్డను మార్చేసి, ఆ స్థానంలో తన బిడ్డను పెట్టేసింది. ఆ రాణి కన్నబిడ్డ చంద్రిక.
ముసలిది ప్రతి రాత్రీ ఎటో వెళ్లి, తెల్ల వారుతూండగా తిరిగి వస్తుంది, ఇంటికి కావలిసిన వస్తువులన్నీ తెస్తుంది. పగలు నిద్ర లేచినది మొదలు రాత్రి పడుకోబోయే దాకా ఇంటి చాకిరి 'అంతా చంద్రికే చెయ్యాలి. చంద్రికకు ముసలిది కొన్ని మంత్రాలూ, తంత్రాలూ నేర్పింది. కాని ముసలిదానికి తెలియకుండా చంద్రిక చాలా విషయాలు నేర్చుకున్నది.
"రాత్రి నువు నిద్రపోగానే ముసలిది నిన్ను కుక్కను చేసి కట్టేసి మరీ బయలు దేరింది. నిన్ను బహుశా కుక్కగానే ఉప -యోగించుకుందామని ఆవిడ ఉద్దేశమేమో. నేను నిన్ను మనిషిగా మార్చేశాను. ముస అది వచ్చి నిన్ను గురించి అడిగితే నా కేమీ తెలియదంటాను. నేను నిన్ను మనిషిని చెయ్యగలనని ఆవిడకు తెలీదు. కుక్కగానే తప్పించుకు పోయావనుకుంటుంది. ఈ అర ణ్యం దాటి బయటపడితే నీకు ముసలిదాని పీడ ఉండదు,” అని చంద్రిక చంద్రభాను డితో చెప్పింది. తాను కల అనుకున్నది వాస్త వంగానే జరిగినట్టు అతను తెలుసుకున్నాడు.
" నాతోపాటు నువు కూడా ముసలిదాని నుంచి తప్పించుకు పోరాదా?” అని అతను చంద్రికను అడిగాడు."తప్పించుకుని ఎక్కడికిపోను ? మాది దూరదేశం. నే నక్కడికి ఒంటరిగా పోలేను. వెళ్ళినా, నేనే తమ అసలు కూతురినవి నా తల్లిదండ్రులు నమ్మరు. నేను పుట్టిన మరుక్షణం నుంచి నాకి ముసలిదే తల్లిగా ఉంటున్నది. నన్ను బాగానే చూసుకుం టుంది. ఆలాటప్పుడు నే నావిడను వదిలి ఎక్కడికో పోవటంలో అర్థమేమిటి?” అని చంద్రిక అడిగింది.
"నీ యౌవనమూ, సౌందర్యమూ అడవి గాసిన వెన్నెల అయిపోవటం లేదా? ఈ జీవితం నీ కెలా సుఖంగా ఉంటుంది? మా దేశం వచ్చేసి, నన్ను పెళ్ళాడు. నీకు జీవితం హాయిగా గడిచిపోతుంది,” అన్నాడు. చంద్రభానుడు.
"అంతకాలం అరణ్యంలో బతికి ఇప్పుడు రాణివాసంలో ఉండగలనా? నన్ను పెళ్ళాడి నువు సుఖపడవేమో!" అన్నది చంద్రిక.
"నిన్ను పెళ్ళాడకపోతే నేను అసలు పెళ్ళే చేసుకొను," అని చంద్రభానుడు శపథం చేశాడు.
"సరే, అయితే నీవెంట వస్తాను. కాని నా భారమంతా నువే వహించాలి, గుర్తుంచుకో,” అన్నది చంద్రిక.
ఛీటృఆ
అందుకు చంద్రభానుడు ఒప్పుకున్నాడు. ఇంకా కొంత రాత్రి ఉండగానే ఇద్దరూ ఆరణ్యం దాటారు. వారు అనేక దేశాలు గడిచి, చాలారోజులు ప్రయాణంచేసి, కాళీ పట్టణం సమీపానికి చేరుకున్నారు. చంద్ర భానుడు చంద్రికను ఒక చెట్టు కింద ఉండ మని, "నా కాబోయే భార్య నగరంలోకి నడిచి రావటం నా కెంతమాత్రమూ ఇష్టం లేదు. నేను రాజభవనానికి వెళ్ళి నీ కోసం పల్లకీ, మంగళవాద్యాలూ, దాస దాసీలూ, కానుకలూ వెంటబెట్టుకుని వచ్చి, ఊరే గింపుతో మా ఇంటికి తీసుకు పోతాను," అని చెప్పాడు." నువు ఒక్కడివే ఇంటికి పోతే నన్ను మరిచిపోతావేమో. నాకు కాలినడకన రాజ భవనానికి రావటాని కేమీ అభ్యంతరం లేదు. ఊరేగింపూ అవీ కూడా దేనికి?” అన్నది చంద్రిక.
" భారమంతా నామీద వేశావు. నాయిష్ట ప్రకారం జరగనీ," అంటూ చంద్రభానుడు అతి వేగంగా రాజభవనానికి వెళ్ళాడు. అతన్ని ఆకస్మికంగా చూసి అందరూ ఆశ్చ ర్యపడ్డారు. వాళ్ళు వేసే ప్రశ్నలేవీ విని పెంచుకోకుండా, "అన్ని సంగతులూ తర వాత నింపాదిగా చెబుతాను, ముందు ఒక పల్లకీ, నౌకర్లూ, మంగళవాద్యాలూ, కాను
కలూ సిద్ధం చేయించండి,” అని ఆజ్ఞా పించాడు చంద్రభానుడు.
దైవికంగా ఆరోజే చంద్రభానుడి అన్నకు వివాహం జరుగుతున్నది. అందుచేత రాజ భవనం చాలా సందడిగా ఉన్నది. అంతః పురంలోవాళ్ళు అతనికి పెళ్ళికూతురినీ, ఆమె చెల్లెలినీ చూపారు. కాని అతని మన సంతా చెట్టు కింద వేచివున్న చంద్రిక పైనే ఉన్నది. అతనికి కాలు నిలవటంలేదు.
"వచ్చి క్షణం కాలేదు, మళ్ళీ ప్రయాణ సన్నాహంలో ఉన్నట్టున్నా వేమిటి? భోజనం సిద్ధంగా ఉన్నది, భోజనంచెయ్యి,” అని అతని తల్లి అన్నది.
"ఇప్పుడు వ్యవధిలేదు. మళ్ళీ వచ్చి చేస్తాను," అన్నాడు చంద్రభానుడు.
"భోజనం చెయ్యటానికి వ్యవధి లేకపోతే ఈ పండయినా తీసుకోండి," అంటూ పెళ్ళి కూతురి చెల్లెలు అతని చేతికొక పండిచ్చింది. దాన్ని తీసుకున్న మరుక్షణం చంద్రభాను డికి గతమంతా మరుపుకు వచ్చింది. అతను చంద్రికను పూర్తిగా మరిచిపోయి, తనకు పండిచ్చిన పిల్ల కేసి చూశాడు. ఆమె పేరు చంద్రకళ. తన అన్నను చేసుకోబోతున్న పిల్లకు చెల్లెలు. వాళ్ళు కేశవపురం రాజు గారి కుమార్తెలు.చంద్రకళ చంద్రభానుడి కళ్ళకు అద్భుత సౌందర్యవతిగా కనబడింది. తన అన్నతో బాటు తాను కూడా చంద్రకళను పెళ్ళాడితే బాగుండునని అతనికి తోచింది. అతను చంద్రకళను తదేకంగా చూస్తూ ఉండటం కనిపెట్టి, అతని తల్లి, "మీ ఇద్ద రికీ పెళ్ళయితే చాలా ముచ్చటగా వుంటుంది, బాబూ. అందుకే నిన్ను దేవుడు ఈ సమయానికి ఇంటికి పంపాడు!" అన్నది.
చంద్రభాను డీ మాటకు సంతోషంగా మందహాసం చేశాడు. చంద్రకళ సిగ్గుతో తలవంచుకున్నది.
ఇంతలో ఎవరో వచ్చి, "మహారాజా, మీరు కోరిన ప్రకారం పల్లకీ, భజంత్రీలూ, నౌకర్లూ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏం సెలవు?" అని అడిగారు.
"నేను కోరానా ? నాకు పల్లకీలూ, భజంత్రీలూ దేనికి? ఎవరో పొరపాటు పడ్డారు,” అన్నాడు చంద్రభానుడు.
అక్కడ చంద్రిక చంద్రభానుడి కోసం గంటలతరబడి ఎదురుచూసి, తాను భయపడినంతా అయిందనీ, అతను తనను మరిచాడనీ అనుకున్నది. ఆమె ఆక్కడి నుంచి బయలుదేరి రాజభవనం వేపు నడుస్తూ వెళ్ళింది. రాజభవనానికి సమీ
పంలో ఒక విశాలమైన మైదానం ఉన్నది. దాని చివర ఒకేఒక పూరిపాక ఉన్నది.
చంద్రిక ఆ పాకలోకి ప్రవేశించి, అక్కడ ఉండే ముసలిదానితో, " అవ్వా, నన్నిక్కడ కొంతకాలం ఉండనిస్తావా? నీకు కావలిసిన పనులన్నీ చేసిపెడతాను,” అన్నది.
అవ్వ సరే నన్నది.
" అవ్వా, ఈ ఇంటిని కొంచెం అందంగా చెయ్యనిస్తావా?" అని చంద్రిక అడిగింది.
" నా దగ్గిర చిల్లిగవ్వ లేదు. నీకు చాత నైతే చెయ్యి, తల్లీ," అన్నది అవ్వ. చంద్రిక బయటికి వెళ్ళి ఒక బుట్ట నిండా ఇసుక తెచ్చి ఇంటి లోపలా బయటా గోడలకుచల్లింది. వెంటనే ఆ పాకగోడలు బంగారు గోడల్లాగా అయిపోయాయి. అదే విధంగా చంద్రిక ఇంటి లోపలి నేల అంతా పాల గచ్చు లాగా చేసేసింది. పై కప్ప మీద గుండ్రని బంగారు గుమ్మటం వెలిసింది.
తన అల్లు అలా మారిపోవటం చూసి అవ్వకు దడ పుట్టుకొచ్చింది. చంద్రిక ఏ దయ్యమో, భూతమో అనుకుని, ఆమె ఇంటిని వదిలేసి ఎటో పారిపోయింది.
మర్నాడే రాజకుమారుల జంట వివా హాలు, పధూవరుల చేత ముందుగా దేవీ పూజ చేయించవలసి ఉండటం చేత, ఇద్దరు పెళ్ళికొడుకులనూ, ఇద్దరు పెళ్ళి
కూతుళ్ళనూ ఒక రధంలో కూర్చోబెట్టి, పురోహితుడు మొదలైనవారు నగరం వెలు పల ఉండే ఆలయానికి బయలుదేరారు. రథం చంద్రిక ఉండే ఇంటి ముందుకు వచ్చేసరికల్లా దాని ఇరుసు విరిగింది. వెంటనే కొత్తణరుసు తెప్పించారు. కాని అమర్చిన మరుక్షణం అది కూడా విరిగింది.
ఈ లోపల, పరివారంలో ఉన్నవా డొకడు పక్కనే ఉన్న బంగారపుటింటిని చూసి అది అంతకు ముందు అక్కడ లేకపోవటం తెలిసి, అందులో ఎవరున్నారో చూదామని లోపలికి వెళ్ళాడు.
చంద్రిక కనిపించి, "ఎవరు మీరు? వీధిలో ఏమిటాహడావుడి?" అని అడిగింది.
"రాజకుమారుళ్ళు తమ వధువులతో దేవీ పూజకు పోతూంటే దారిలో రథం ఇరుసు విరిగింది. కొత్తకారుసు వేస్తే అది కూడా విరిగింది. ఏం మాయో తెలియటం లేదు,” అన్నాడు పరివారకుడు.
"అంతేనా? ఈ అనపచువ్వ ఇరుసుగా అమర్చమను,” అంటూ చంద్రిక ఒక ఇనప చువ్వను అతని కిచ్చింది.
అతను క్షణంపాటు నిర్ఘాంతపోయి, ఆ చువ్వను తీసుకుపోయి రథం మరమ్మతు చేసేవాడి కిచ్చాడు. వాడు దాన్ని ఇరుసుగాఅమర్చాడు. అది విరగకుండా నిలిచింది. "ఇక బయలుదేరండి,” అని పురోహితుడు తొందర చేశాడు.
కాని ఆయన మాట పూర్తికాక ముందే, రథపు చట్రం పెళపెళా విరిగింది. అందరూ కంగారెత్తారు. ఇంకొక చట్రం తెప్పించి అమర్చారు. అది కూడా విరిగింది.
అనవచువ్వ తెచ్చిన పరివారకుడే మళ్ళీ చంద్రిక వద్దకు వెళ్ళి, " అమ్మా, మాకు మళ్ళీ చిక్కు వచ్చిపడింది. రథంచట్రం కాస్తా విరిగింది. కొత్తది వేసినా విరిగింది. దాని కేమన్నా ఉపాయం చెప్పగలవా?" అని అడిగాడు.
"దానికేముంది? ఇంటి తలుపొకటి ఇస్తాను: దాన్ని చట్రంగా అమర్చితే విర గదు," అన్నది చంద్రిక,
పరివారకుడు బంగారుతలుపు నొకదాన్ని తీసుకునివెళ్ళి రధానికి చట్రంగా అమర్చ మన్నాడు. అది విరగలేదు. ఇక ఫరవాలే దనుకుని సారధి రథం ఎక్కి కూర్చుని గుర్రాలను అదిలించాడు. కాని అవి కదల లేకపోయాయి. అప్పటికే రధానికి నాలుగు గుర్రా లున్నాయి. మరి నాలిగింటిని తెచ్చి రథానికి పూన్చారు. కాని ఎనిమిదిగుర్రాలూ లాగినా రథం కదలలేదు.
పరివారకుడు మళ్ళీ చంద్రిక వద్దకు వెళ్ళి ఉపాయం అడిగాడు.
"ఆ గుర్రాలను విప్పి, రథానికి మా దొడ్లో ఉన్న ఆవుదూడను కట్టండి, రథం కదులు తుంది," అన్నది చంద్రిక.
అప్పటికే వ్యవహారం అపహాస్యం కింద తయారయింది. రథానికి రథం రూపేలేదు. దానికి దూడను కట్టితే ఎలా ఉండాలో అలా ఉంటుంది. కాని పని జరగాలి గనక గుర్రాలను విప్పి, దూడను కట్టారు. వెంటనే రధం కదిలి, శరవేగంతో నడవసాగింది. ఆ దూడ సారధి చెప్పినట్టు నడవక దాని ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతూ ఊరంతాకలయ తిరగసాగింది. చిట్టచివరకు ఆ దూడ బంగారపు ఇంటి ముందే ఆగింది.
చంద్రభానుడికి చాలా కోపం వచ్చింది. అతను ఆ ఇంటో ఉన్న మనిషిని తీవ్రంగా దండించే ఉద్దేశంతో రథం దిగి చరచరా లోపలికి వచ్చాడు. కాని చంద్రిక కనిపించ గానే అతనికి గతమంతా జ్ఞాపకం వచ్చింది.
"మీకోసం చెట్టు కింద చాలాసేపు వేచాను. మీరు రారనుకుని, నిరాశ చేసు కుని, ఈ ఇంటో మకాం పెట్టుకున్నాను. మీ వివాహమని విన్నాను. దానికేవో అంత రాయాలు కలిగితే నా శక్తి కొద్దీ సహాయ పడ్డాను,” అన్నది చంద్రిక.
చంద్రభాను డామెకు క్షమాపణ చెప్పు కుని, "నేను నిన్నెలా మరిచిపోయినాను? ఏం జరిగి ఉంటుంది ?” అన్నాడు.
"మరేమీ లేదు. మీరు పెళ్ళాడబోయే పిల్ల ఆ మంత్రగత్తె కూతురే. దానికి కూడా తల్లి కున్న శక్తులు కొద్దిగా ఉన్నాయి.
అది మీ స్మృతిని చెడగొట్టి ఉంటుంది," అన్నది చంద్రిక.
"నేను నిన్నే పెళ్ళాడతాను. నా వెంట వచ్చెయ్యి,” అంటూ చంద్రభానుడు ఆమెను చెయ్యి పట్టుకుని బయటికి తీసు కొచ్చాడు. అతను చంద్రకళతో, "నువు పాపిష్టి దానివి. నీ మూలంగానే రధాని కిన్ని తిప్పలు వచ్చాయి. ఈ అపశకునం అయాక నేను నిన్ను పెళ్ళాడలేను," అని చెప్పాడు.
అతను మరొక రథం తెప్పించి, దానిలో చంద్రికతోబాటు ఎక్కి, తన అన్ననూ, అతని వధువునూ కూడా అందులో నే ఎక్కించుకుని, తిన్నగా దేవిఆలయానికి వెళ్ళాడు. దారిలో ఎలాటి విఘ్నాలూ జరగ లేదు. సంగతంతా విన్నాక చంద్రభానుడి తండ్రి చంద్రికను తన కోడలుగా ఆమో దించాడు. వారిద్దరికీ ఎంతో వైభవంగా పెళ్ళి జరిగిపోయింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment