Monday, 8 December 2025
చీమ-చిలుక-పాయసం
అనగా అనగా ఒక చీమా ఒక చిలకా ఉండే వారు. వాళ్లిద్దరికీ ఎంతో సావాసం. ఒకనాడు వాళ్ళి ద్దరికీ పాయసం వండుకు తినాలని బుద్ధిపుట్టింది. చీమ పోయి బియ్యపు సూకలూ, పంచదారా తెచ్చింది. చిలక పోయి కట్టెపుల్లలూ, చట్టీ, నిప్పూ తెచ్చింది. చీమ నిప్పు అంటించింది. చిలక పొయ్యిఊదింది. పాయసం తయారయింది.
అయితే చీమకి మహ తొందర. అది గబగబా చట్టిఎక్కి పాయసం తిన బోయి అందులోపడి చచ్చి
పోయింది. చిలకకూడా ఆత్రపడి పాయసంలో ముక్కుముంచింది. ఇంకేం ముక్కు చుర్రున కాలింది. అది మొర్రోమని ముకు విదిలించుకుంటూ రావిచెట్టుమీదికి కూచుంది.
రావిచెట్టు చిలకనుచూసి కొంచెం గేలిగా "చిలకా, చిలకా ఏం విచారంగా ఉన్నావు?" అని అడిగింది.
చిలకకు కొంచెం విసు గేసి "ఏమీలేదు. చీమా నేనూ పాయసం వండు కున్నాము. చీమపాయసం లోపడి చచ్చింది. నాకు ముకు కాలింది. ఇంత పోకిళ్లు పోతున్న నీ ఆకులు రాలిపోకూడదూ!" అంది.
ఆమాట అనగానే రావి చెట్టు ఆకులు జలజలా రాలిపోయాయి.
ఇంతలో ఒక ఏనిగ ఆ దారినిపోతూ చెట్టునుచూసి నవ్వువచ్చి “చెట్టూ, చెట్టూ! నీ ఆకులు రాలిపోయా యేం? ఎండాకాలం కాదుగా?" అన్నది."ఏమీ లేదు. చీమా చిలకా పాయసం వండు కున్నాయట. చీమ అం దులోపడి చచ్చిపోయింది; చిలకకి ముక్కు కాలింది: వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి. ఇంత నవ్వుగా ఉన్న నీకు తొండం ఊడిపోవాలి" అన్నది రావిచెట్టు.
ఏనుగు తొండం పోయింది. పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూచుంది. చెరువుకు తొండంలేని ఏనుగుని చూసి నవ్వాగలేదు.
"ఏం, ఏనుగా ఏనుగా ఇవ్వాళ నీళ్లు తాగటంలేదేం? తొండం ఎక్కడ పెట్టి వచ్చావు?" అంది.
"ఎక్కడా పెట్టలేదు. చీమా చిలకా పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలోపడి చచ్చి పోయింది; చిలకకి ముక్కు కాలింది; చిలకని వెక్కి రించిన రావిచెట్టుకు ఆకులు రాలాయి; అదిచూసినవ్విన నాకు తొండం ఊడింది. వన్ను చూపి వెటకారం చేస్తున్న నీ నీళ్లుకూడా ఎండి పోవాలీ అన్నది ఏనుగు.
అనగానే చెరువులోనీళ్లు ఎండిపోయాయి. ఇంతలో తోడికోడళ్లు ఇద్దరు చెరు వుకు నీళ్ళకు వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసే వరకు వాళ్ళకు వవ్వు
వచ్చింది. "ఏం, చెరువూ చెరువూ! ఇలా ఎండిపోయా వేం?" అని అడిగారు.
"ఏమీలేదు. చీమా చిలకా పాయసం వండు కున్నాయట. చీమ పాయ సంలోపడి చచ్చింది. చిల
కకీ ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అదిచూసి నవ్విన ఏనుగుకు తొండం వూడింది. ఏనుగుని చూసి వెటకారంచేసిననాకు నీళ్లెండి పోయాయి. నన్ను చూసి పగలబడుతున్న మీ బిందెలు అలాగే అంటుకోవాలి.పోతే ఎంత బాగుణ్ణు:'' అన్నది చెరువు.
అనగానే బిందెలు అం టుకు పోయాయి. ఇంతలో ఇంకొక మనిషి కావిడితో నీళ్ళకువచ్చి చెరువులో నీళ్లు లేకపోవటమూ, బిందెలు
"ఏమీ లేదు. చీమా
అంటుకు పోవటమూచూసి పాపం, అతను మంచిగానే "ఏమమ్మా! బిందెలు అట్లా అంటుకున్నా యెందుకూ?" తెలుసుకోవటానికి అని అడిగాడు.
చిలకా పాయసం వండు కున్నాయట. చీమ పాయ సంలోపడి చచ్చింది. చిల కకి ముక్కు కాలింది. చిల కని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. రావిచెట్టునుచూసి నవ్విన ఏనుగుకి తొండం వూడింది. ఏనుగు నిచూసి వెటకారం చేసిన చెరువుకు నీళ్లెండి పోయాయి. చెరువునిచూసి పగలబడ్డ మాకు బిందెలు అంటుకుపోయాయి. ఇక మమ్మల్ని వోదార్చటానికి వచ్చిన నీకు కావిడి అం టుకు పోవాలి" అన్నారు, వాళ్లు కడుపు మంట పట్టలేక.
అయితే ఈ మాట అనీ ఆమనిషి అనకముందే కావిడి కిందపారవేశాడు. కావిడి కిందపడటంతో టే వాళ్ల బుజాలమీది బిందెలు వూడిపోయినై, చెరువుకు నీళ్ళువచ్చినై. ఏనిగకు బాగయింది. తొండం వచ్చింది. చెట్టుకు ఆకులువచ్చినై. చిలక ముక్కు చీమ బతికింది.
అందరూ ఆనందంతో ఆరోజు పాయసం జుర్రుకొని జుర్రుకొని తిన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment