Tuesday, 9 December 2025

కరువు కాటకాలు ఒకసారి పాపన్న నివసించే దేశంలో పెద్ద కరువు ఏర్పడింది. వానలు కురవలేదు. పంటలు పండలేదు. కరువు నివారణ కోసమై రాజుగారు బావులను మరింత లోతుగా తవ్వించాడు. అందువల్ల లాభం లేకపోయింది. బొక్కసంలో ధనం ఉన్న మేరకు దూరదేశాల నుంచి ఆహార ధాన్యాలు తెప్పించి ప్రజలకు పంచి పెట్టం చాడు. బొక్కసం కూడా ఖాళీ అయింది. ఈ సమయంలో ఒక నాటి తెల్లవారు జామున పాపన్న కొక చిత్రమైన కల వచ్చింది. అందులో పాపన్నకు రాజుగారు కనిపించి, తూర్పుగా కనబడే కొండలను చూపిస్తూ, ఆ కొండలలో ఎక్కడో ధన రాసులున్నాయని మా కులదేవత చెప్పింది. ఆ ధనం గురించి తెలుసుకు రమ్మని భటు లను పంపితే ఒక్కరూ తిరిగి రాలేదు. ప్రజలు మాడి చస్తూంటే ఏమీ చెయ్య లేకుండా చూస్తూ కూర్చోవటం బాధగా ఉన్నది. ఆ ధనం సంగతి తెలుసుకుని వచ్చే వారెవరూ కనిపించరు. కాస్త నీవా పని చేస్తావా?" అని అడిగాడు. "అంతకంటేనా, ప్రభూ. అప్పుడే బయలుదేరుతాను,” అని పాపన్న అంటుం డగా పాపన్నకు మెలకువ వచ్చింది. తనకు వచ్చిన కలను తలుచుకుని పాపన్న చాలా ఆశ్చర్యపడ్డాడు. అది ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉన్నది. పాపన్న రాజు వద్దకు వెళ్ళి స్వప్న వృత్తాంతం చెబుదా మనుకున్నాడు గాని, కల వాస్తవమో, కాదో ముందుగా తెల్చుకోవటం మంచిదని అత నికి అనిపించింది. అందుచేత పాపన్న ఎవరికీ చెప్పకుండా అంటి నుంచి బయలుదేరి తూర్పుగా ప్రయాణమయాడు. అతను తూర్పు కొండల ఇవతల అరణ్యప్రదేశం కుండా పోయేటప్పుడు అక్కడ గ్రామాలలో నివసించే వారు, ఆ కొండలలోకి ఎవరూ వెళ్ళరనీ, వెళ్ళిన వారెవరూ తిరిగిరారనీ, ఒకప్పుడు కొందరు రాజభటులు అటుగా వెళ్ళి మరి తిరిగి రాలేదనీ చెప్పారు. ఈ మాటలు విన్న మీదట పాపన్నకు తన కలలో కొంత నిజం ఉన్న తోచి, ముందుకు వెళ్ళాలనే నిశ్చయం మరింత దృఢమయింది. ముందుకు పోతున్న కొద్దీ అరణ్యం కీకా రణ్యమయింది. అటువంటి ప్రాంతంలో నడుస్తూండగా, హఠాత్తుగా ఒక మనిషి పాపన్న దారిలో అడ్డంగా ప్రత్యక్షమై, " మీరా, పాపన్నగారూ? ఇంకెవరో ఆను కున్నాను. ఏమిటిలా అరణ్యంలోకి వస్తు న్నారు ?" అని అడిగాడు. పాపన్న ఆ మనిషిని గుర్తు పట్టాడు. ఆ మనిషి ఒక దొంగ లోగడ పాపన్న ద్వారా చికిత్సపొంది, రక్షించబడిన వాడు. పాపన్న అతనితో తన కల గురించి చెప్పి, "జనం తిండికి అల్లాడిపోతున్నారు. కొండల్లో ఆ ధనం ఎక్కడ ఉన్నది వెతక టానికి నువు సహాయం చేస్తావా?" అని అడిగాడు. " అది సాధ్యమయే పని కాదే! ఇది భయంకరమైన ప్రదేశం. ఇక్కడి కెవరూ రాకూడదు. నా పైన దయ వుంచి మీరు తిరిగి వెళ్ళండి." అన్నాడా దొంగ. " ఒక వంక ప్రజలు తిండిలేక కటకట పడుతూంటే, ఇక్కడ ధనం ఉన్నదని తెలిసి ఎలా వెనక్కుపోను?" అని పాపన్న అడిగాడు. "బాబూ, అలాటి దయాదాక్షిణ్యాల కక్కడ చోటులేదు. మీరు దయచేసి వెళ్ళి పాండి," అన్నాడు దొంగ. ఇంతలో మరొక మనిషి ఎటునుంచో వచ్చి, " ఎవడు వీడు? అక్కడికేం పని మీద వచ్చాడు? చేతులూ, కాళ్ళూ కట్టి ఈడ్చుకుపోక నిలబడి వీడితో మాట్లాడుతున్నావేమిటి?" అని దొంగతో అన్నాడు. వాడు కూడా దొంగల ముఠాకు చెందినవాడే. వాడితో మొదటి దొంగ రహస్యంగా పాపన్న గురించి చెప్పి, "ఏం చేద్దాం?" అని సలహా అడిగాడు. "మన నాయకుడి దగ్గిరికి తీసుకు పోదాం,” అన్నాడు రెండో దొంగ. ఇద్దరూ కలిసి పాపన్నను దొంగల నాయ కుడి వద్దకు తీసుకుపోయారు. మొదటి దొంగ తమ నాయకుడి చెవిలో రహస్యంగా, పాపన్న ఒకప్పుడు తనకు చేసిన ఉపకారం గురించి చెప్పాడు. అంతా విని దొంగల నాయకుడు పాప న్నతో, "మా ప్రాంతానికి వచ్చినవాళ్ళను ప్రాణాలతో పోనిచ్చే అలవాటు మాకులేదు. అయినా నీవు మాకు ఉపకారం చేసి ఉన్న వాడివి కనక నిన్ను నిరపాయంగా తిరిగి వెళ్ళిపోనిస్తాను. సరేనా?” అన్నాడు. "మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కాని నాకు ఒక్క ఉపకారం చేయించండి. ఈ కొండలలో ఉండే ధనరానులు నాకు చూపించినట్టయితే నేను తిరిగివెళ్ళి వాటి వివరాలు రాజుగారితో చెప్పి, ఆ తరవాత జరగవలిసిన ఏర్పాట్లు చేయిస్తాను." అన్నాడు పాపన్న. "ఇంకా నయం! ఇంతవరకు నీవు చూసినది ఎవరికీ చెప్పనని మా కాళికామ్మ వారి ఎదట ప్రమాణం చేస్తేనే నిన్ను ప్రాణాలతో తిరిగిపోనిచ్చేది." అన్నాడు దొంగల నాయకుడు. " నాకు చూపటం ఇష్టంలేకపోతే ఇక్కడ ఉండే ధనాన్ని మీరే తిన్నగా రాజుగారి వద్దకు పంపండి,” అన్నాడు పాపన్న. దొంగల నాయకుడు మండిపడి, "మా కష్టార్జితాన్ని మేము ఎవరికీ ఇవ్వము. మా సంగతి ఎవరికీ చెప్పనని కాళిక ముందు ప్రమాణం చెయ్యకపోతే నిన్ను కాళికకు బలి ఇచ్చేస్తాము,” అన్నాడు." నే నలాటి ప్రమాణం చెయ్యలేను." అన్నాడు పాపన్న. మరుక్షణమే దొంగలు పాపన్నను చెరొక రెక్కా పట్టుకుని కాళికావిగ్రహం వద్దకు తీసుకుపోయారు. ఆది రెండు నిలువుల ఎత్తుగల భయంకరమైన విగ్రహం. "ఇప్పుడైనా కాళిక ముందు ప్రమాణం చెయ్యి, ప్రాణాలతో బయట పడతావు," అన్నాడు దొంగల నాయకుడు. "నే నిక్కడికి డబ్బుకోసం వచ్చాను, మీ రహస్యాన్ని కాపాడటానికి కాదు," అన్నాడు పాపన్న దృఢంగా, పాపన్న తల తెగయ్యటానికి దొంగల నాయకుడు కత్తి ఎత్తాడు. ఆ క్షణంలోనే కాళికావిగ్రహం, ఎవరో తోసెనట్టుగా, మొద లంటా విరుచుకుని, పక్కకు ఒరిగి, దొంగల నాయకుడి పైన పడింది. దొంగల నాయ కుడు దాని కిందపడి ఒక్క మూలుగుతో ప్రాణాలు వదిలాడు. " చూశారా ? నన్ను దేవే ఇలా పంపింది. మీ కింక మీ నాయకుడితో పనిలేదని చెప్ప టానికి అతణ్ణి బలి పుచ్చుకున్నది. ప్రజలు కరుపుబాధ నుండి బయటపడటానికి మీ ధనం అవసరం, ఈ మాట కలలో దేవి చెప్పిన మీదటనే నే నిలా వచ్చాను. నా వెంట రండి. రాజుగారు మిమ్మల్ని శిక్షించ కుండా నేను చూస్తాను.. మీరంతా మామూలు ప్రజలతో కలిసి జీవించటం ప్రారంభిస్తే దేవి సంతోషిస్తుంది,” అని పాపన్న దొంగలకు నచ్చ చెప్పాడు. పాపన్న ధైర్యం కళ్ళారా చూసిన దొంగ లకు అతని మాటలలో సులువుగా గురి కుదిరింది. వాళ్ళు తమ ధన మంతా మోను కుని రాజుగారి వద్దకు పాపన్న వెంట వెళ్ళారు. రాజుగారు దొంగలందరినీ క్షమించి, వాళ్ళకు జీవనోపాధులు ఏర్పాటు చేసి, వారి ధనంతో కరువు నివారణ యత్నాలు చేశాడు.

No comments:

Post a Comment