Monday, 8 December 2025
ప్రతిమలు
అయోధ్యానగరంలో దశరధ మహారాజు తన కొడుకైన రామచంద్రుడి పట్టాభిషేకా నికి ఉత్తరువిచ్చాడు. ప్రయత్నాలు చురు కుగా సాగుతున్నాయి. ఛత్ర చామరాలూ, సింహాసనమూ సిద్ధంచేయబడ్డాయి. బంగారు కలశాలలో నీరు నింపారు. దర్భలు సిద్ధం చేశారు. తంతు నడిపించటానికి పురోహితు డైన వశిష్టుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సంద ర్భంలో తగిన నాటకం ప్రదర్శించమని నర్త కులకు కబురు వెళ్లింది.
ఈ సమయంలో సీత చెలికత్తె, అవదా తిక అనేది, నారబట్ట దొంగిలించి తెచ్చింది. నటులకు వేషాలువేసే రేవాదేవి తనకు చిన్న అశోకచెట్టు మండ ఇమ్మంటే ఇవ్వలేదని కోపంవచ్చి ఆమె ఈపని చేసింది. ఆల్లరికి చేసిన దొంగతనమే అయినా అపదాతిక కంపించిపోతూ, నిజంగా దొంగలు ఎలా దొంగతనం చేస్తారో అనుకున్నది.
దాని కంగారు చూసి సీత అది చేసిన పని తెలుసుకుని, "దానిని వెంటనే ఆమె కిచ్చేసిరా,” అన్నది. కాని అంతలోనే తానా బట్ట ధరిస్తే ఎలాఉంటుందో అని ఆమెకు అనిపించింది. ఆమె ఆ నారబట్ట ధరించింది. అవడాతిక నీత ఎదట పట్టటానికి అద్దం తెస్తూ, "అమ్మా, పట్టాభిషేకమనే మాట వినిపిస్తున్నది. ఎవరో రాజు కాబోతున్నారు,” అన్నది. ఇంతలోనే మరొక దాసీ వచ్చి రాముడికి పట్టాభిషేకమని చెప్పింది. "మహా రాజుగారికి స్వస్థతగా లేదా?” అని సీత అదుర్దాగా అడిగింది; మహారాజు గారే స్వయంగా రాజ్యాభిషేకం చెయ్యబోతున్నా రని విని, "అయితే మంచిదే!” అన్నది.
ఇంతలో వారికి మంగళ తూర్యాలు విని పించి, అంతలోనే నిలిచిపోయాయి. కారణ మేమిటోనని రెండవ దాని ఆశ్చర్యపడింది. "ఒకవేళ పట్టాభిషేకం ప్రస్తుతానికి ఆగిపోశా
యిందేమో, ఆస్థానాలలో అనుకోనివి ఎన్నో జరుగుతాయి!'' అన్నది సీత. " రామ పట్టా భిషేకానంతరం మహారాజుగారు వనవాసం పోతారట," అన్నది దాసి. "అయితే అభి షేక జలం అశ్రువులు కడుగుకోవడానికే నన్నమాట!" అన్నది సీత.
రాముడు వచ్చాడు. "మంగళతూర్యాలు మోగాయి, పెద్దలు కనిపెట్టుకుని ఉన్నారు, నేను ఆసనంలో కూచుని ఉన్నాను, నా శిరస్సుపైన పవిత్రోదకం పొయ్యపోతున్నారు; ఇంతలో నాన్న గారు నన్ను పిలిచి, 'నాయనా, కొంచెం ఆగు,' అంటూ నన్ను పంపేశారు. రాజ్యభారం నెత్తిన పడలేదుగదా అని సంతోషించాను." అన్నాడతను. అతను సీతతో మంధర వచ్చి రాజుగారి చెవిలో ఏదో రహస్యంగా చెప్పిందనికూడా అన్నాడు. తర వాత అతను సీత కట్టిన నారబట్ట చూసి, తనకుకూడా అలాటిది కావాలని పట్టు బట్టాడు. మరొక నారబట్ట తెమ్మని సీత తన చెలికత్తెను రేవాడేవి వద్దకు పంపింది.
ఇంతలో, "అయ్యో, మహారాజుగారు!" అన్న ఆర్తనాదం వినిపించింది. కైకేయి మూలాన పట్టాభిషేకం ఆగిపోయిందనీ, ఆమె భరతుడి రాజ్యాభిషేకం కోరిందనీ, రాజుగారు మూర్ఛపోయారనీ దౌవారికుడు
తెలిపాడు. ఇంతలో లక్ష్మణుడు విలు బాణాలతో వచ్చి, " ఆ కైకేయిని ఇప్పుడే చంపేస్తాను!" అని ఆగ్రహంతో అన్నాడు.
" రాజ్యలోభంచేత హత్యలు చేస్తామా? ఎవరిని చంపుదాం— తండ్రిగారినా, తల్లి గారినా, ఏపాపమూ ఎరగని భరతుణ్ణా?” అని రాముడు అడిగాడు.
ల క్ష్మ ణుడు కంట తడి పెడుతూ, "రాజ్యం రాలేదని నేను ఆగ్రహించలేదు. ఆ కైకేయి నిన్ను పధ్నాలుగేళ్ళు అరణ్యా నికి పంపుతున్నది!” అన్నాడు.
"అందుకే మహారాజు మూర్ఛపోయి ఉంటారు!" అన్నాడు రాముడు. అతను
సీతను నారబట్ట అమ్మని అడిగాడు. సీత అరణ్యానికి తానుకూడా వస్తానన్నది. ఆమె ఎంత చెప్పినా వినకపోవటం చూసి రాముడు లక్ష్మణుడితో, "ఆమెకు నువు చెప్పిచూడు." అన్నాడు. "ఆమె అన్నదానిలో తప్పేమీ లేదు," అన్నాడు లక్ష్మణుడు.
ఇంతలో సీత చెలికత్తె రేవాదేవివద్ద నుంచి మరొక నారబట్ట తెచ్చింది. దానిని రాముడు తీసుకుని ధరించబోతూ ఉండటం చూసి లక్ష్మణుడు, " అన్నా, నీవద్ద ఏమి ఉన్నా నాకు సగం ఇస్తావే, ఆ నారబట్టను అంతా నీవే ధరించాలా. అంత స్వార్థం వద్దు, నాకు సగం ఇయ్యి!” అన్నాడు.
రాముడు సీతతో, "లక్ష్మణుడికి చెప్పి చూడు!" అన్నాడు. నీత చెప్పిచూసింది గాని, లక్ష్మణుడు తానుకూడా వనవాసం వచ్చి తీరాలని పట్టుబట్టి నారబట్ట ధరిం చాడు. ముగ్గురూ కలిసి రాజవీధిన పోతూంటే పౌరులు అటూ ఇటూ మూగారు. వారిని పక్కకు తొలగమంటూ లక్ష్మణుడు ముందు నడిచాడు. ఇంతలో దౌవారికుడు వచ్చి, "రాజకుమారా, మీరు వనవాసం వెళుతున్నారని విని మహారాజుగారు వస్తు న్నారు, కొంచెం ఆగండి.” అన్నాడు.
" వనవాసం వెళ్ళేవారు ఎవరికీ వీడ్కోలు చెప్పనవనరంలేదు," అని లక్ష్మణుడు రాముడితో అన్నాడు. అది నిజమేనంటూ రాముడు సీతా లక్ష్మణులతో ఆగకుండా వెళ్ళిపోయాడు.
సీతారామలక్ష్మణులు వెళ్ళిపోయాక దశ రథ మహారాజు చాలా మనోవేదన అనుభవించాడు. కౌసల్యా సుమిత్రలు ఆయనకు ఎన్నో ఉపచారాలు చేశారు. సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను రథంలో శృంగ బేరపురం వద్ద దించివచ్చి, దశరథుడితో వారు ఆరణ్యంలో ప్రవేశించిన సంగతి చెప్పాడు. ఆ సంగతి విని దశరధుడు సుమంత్రుడితో, " భరతుణ్ణి వెంటనే పిలిపించు," అన్నాడు. ఇంతలోనే ఆయనకు మృత్యువు ఆసన్నమయింది. ఆయన కళ్లకు దిలీపుడూ. రఘువూ, తన తండ్రి అయిన అజుడూ కనిపించారు. "రామ సీతా లక్ష్మణు లా రా! నేను పోతున్నాను!" అంటూ ఆయన ప్రాణాలు వదిలాడు.
అయోధ్యకు కొద్ది దూరంలో ప్రతిమా శాల ఉన్నది. అందులో చనిపోయిన రాజుల ప్రతిమ లుంచుతారు. దశరధ మహారాజు చనిపోయాక ఆయన ప్రతిమనుకూడా అందులో ఉంచారు. ఆ రోజు మహారాణులు ప్రతిమాశాలను చూడవస్తున్నారని రాజ భవనంనుంచి కబురు రావటంపల్ల అంతా శుభ్రంచేసి అలంకరించి ఉంచారు.
ఆరోజునే భరతుడు మేనమామల ఇంటి నుంచి అయోధ్యకు వస్తున్నాడు. ఊరి వెల పలనే శత్రుఘ్నుడు పంపిన మనిషి అతని రథానికి ఎదురువచ్చి, భరతుడు కృత్తికా నక్షత్రం గడిచి రోహిణి ప్రవేశించేవరకూ ఆయోధ్యను ప్రవేశించరాదని పెద్దలు చెప్పి నట్టుగా విన్నవించాడు.
భరతుడు తన రథాన్ని ఉచితమైనచోట నిలిపించి చుట్టూ చూసేసరికి చెట్లనందుగా అతనికి ప్రతిమాశాల కనిపించింది. అతనికి
ఆ ప్రతిమాశాలను గురించి తెలియదు, తన తండ్రి మరణించిన సంగతికూడా తెలి యదు. అదేదో దేవాలయం అయి ఉంటుం దనుకుని అతను దానికేసి వచ్చాడు.
ప్రతిమాశాలలో ఎవరూ లేరు. నాలుగు విగ్రహాలు మాత్రం ఆలంకరించి ఉన్నాయి; అవి ఎవరో దేవుళ్ళవి అయి ఉంటాయని భరతుడనుకుని నమస్కరించాడు. ఇంతలో ప్రతిమాశాలను కనిపెట్టి ఉండే మనిషి వచ్చి, అవి దేవుళ్ల విగ్రహాలు కావనీ, గతించిన ఇక్ష్వాకు మహారాజులవనీ చెప్పాడు.
అవి తన పూర్వీకులవని తెలియగానే భర తుడు పరమానందం చెంది వారిని గురించివివరంగా చెప్పమని ఆ మనిషిని కోరాడు. ఆయన భరతుడికి దిలీప మహారాజునూ, రఘుమహారాజునూ, దశరధుడి తండ్రి అయిన అజమహారాజునూ చూపించి వారి ఖ్యాతిని వివరించాడు. వీరి పక్కన నాలుగో విగ్రహం ఉండటం చూసి భరతుడు కొంచెం కంగారుపడి దాన్ని గురించి ప్రశ్నిం చటానికి ధైర్యం చాలక మొదటి మూడు ప్రతిమలను గురించి మళ్ళీమళ్ళీ అడిగాడు. అలా మూడుసార్లు ముగ్గురినీ గురించి చెప్పించుకున్నాక భరతుడు ఆ మనిషితో, " అయ్యా, ఇక్కడ బతికున్నవారి విగ్రహాలు కూడా పెడతారా?” జని అడిగాడు. చచ్చిన
వారివే పెడతారని ఆ మనిషి చెప్పాడు. "అయితే, సెలవు!" అంటూ భరతుడు వెనక్కు తిరిగాడు.
"కొంచెం ఆగండి. భార్యకు కానుకగా ప్రాణాలు వదిలిన దశరధ మహారాజును గురించి తెలుసుకోకుండా పోతున్నారేం?” అన్నాడు ఆ మనిషి.
"హా, తండ్రీ!” అని భరతుడు మూర్ఛ పడిపోయాడు ఈ మాట వింటూనే. అప్ప టికి ఆ మనిషికి ఈ కుర్రవాడు భరతుడయి ఉంటాడని బోధపడింది. భరతుడు మూర్ఛ తెలిసి ఆ మనిషి చేత జరిగినదంతా చెవ్పించుకున్నాడు. సీతారామ లక్ష్మణులుఅరణ్యాలకు వెళ్ళిపోయారని తెలియగానే భరతుడు తిరిగి మూర్ఛపోయాడు.
ఆ సమయంలో మహారాణులు కౌసల్య, సుమిత్ర, కైకలు అక్కడికి వచ్చారు. సుమం త్రుడు వారివెంట ఉన్నాడు. అతను మూర్ఛలో ఉన్న యువకుణ్ణి చూసి, అక్కడి మనిషిద్వారా భరతుడని తెలుసుకున్నాడు.
తరవాత భరతుడు స్పృహ తెలిసి కౌస ల్యకూ, సుమిత్రకూ వందనాలు చేసి, తన తల్లి అయిన కైకేయిని నిందించాడు.
" నాయనా, నేనేం చేశాను?" అన్నది కైకేయి, భరతుడు తల్లిపైన వేయవలసిన నిందలన్నీ వేశాడు.
" నాయనా, నీకు రాజ్యాభిషేకం చెయ్య టానికి పశిష్ట వామదేవాదులు వస్తున్నారు." అని సుమంత్రుడు చెప్పేసరికి, భరతుడు, "అభిషేకం ఆ మహారాణికి చెయ్యండి. నేను ఆయోధ్యకు రాను, రాముడుండేచోటే నాకు అయోధ్య," అన్నాడు.
తరవాత కొద్దికాలానికే భరతుడు సుమం త్రుణ్ణి వెంటపెట్టుకుని రథంలో చిత్రకూటా నికి చేరుకున్నాడు. రాముడి పర్ణశాల ఉంటున్నది అక్కడే. భరతుడు సుమం త్రుడితో, "దురాశాపరురాలైన కైకేయి కొడుకు భరతుడు వచ్చాడని రాముడికి విన్నవించు!” అన్నాడు."పెద్దలను నిందించటం తప్పు, నాయనా,” అన్నాడు సుమంత్రుడు. భర తుడు తనను తానే ప్రకటించుకోదలచి బిగ్గరగా, "క్రూరుడూ, కృతఘ్నుడూ, అనా గరికుడూ, ధూర్తుడూ అయికూడా భక్తి శ్రద్ధలు గలవాడొకడు వచ్చాడు. వాడు లోనికి రావచ్చునా, లేక వచ్చినదారినే వెళ్లి పోవాలా?” అని కేక పెట్టాడు.
పర్ణశాలలో ఉన్న రాముడీ కేక విని, " గంభీరంగా, నాన్న గారి కంఠధ్వనిలా గున్నది. ఎవడో ఆప్తుడు వచ్చాడు,” అంటూ చూసిరమ్మని లక్ష్మణుణ్ణి పంపాడు. లక్ష్మణుడు బయటికి వచ్చి భరతుణ్ణి చూసి
రాముడికి ఈ సంగతి చెప్పాడు. భరతుణ లోపలికి తీసుకురావటానికి రాముడు సీతను పంపాడు. భరతుడు లోపలికి వచ్చి రాము గాఢాలింగనం చేసుకున్నాడు.
భరతుడు తానుకూడా రాముడితోపాటు అరణ్యంలో ఉండిపోతానన్నాడు, కాని రాముడు సమ్మతించలేదు; "నేను అహం కారంచేతగాని, భయంచేతగాని, మతి చెడి గాని అరణ్యానికి వచ్చాననుకున్నావా? నాయనగారి ఆజ్ఞ ననుసరించి వచ్చాను. నువుకూడా అలాగే ఆయన ఆజ్ఞప్రకారం రాజ్యపాలన చెయ్యి,” అన్నాడు.
భరతుడు. ఇందుకు ఎంతమాత్రమూ ఒప్పలేదు. చివరకు అతను రాముడి ఆంక్షను ధిక్కరించలేక, "నీ వనవాసా నంతరం నీ రాజ్యం నీవు తీసుకునేపక్షంలో నేను అంతదాకా రాజ్యపాలన చెయ్యటానికి ఒప్పుకుంటాను. రాజ్యాభిషేకం నేను చేసు కోను, నీ పాదుకలకే చేస్తాను,” అన్నాడు.
రాముడు ఇందుకు సమ్మతించి భరతు డికి తన పాదుకలనిచ్చి, ఆరోజే అయోధ్యకు పంపించేశాడు.
ఒకనాడు సీతారాములు పర్ణశాలలో కూచుని మరునాడు దశరథమహారాజుఆబ్దికం గురించి ఆలోచిస్తూ ఉండగా, రావ ణుడు తపస్వి వేషంలో అక్కడికి వచ్చి, " లోపల ఎవరు? నేను అభ్యాగతిని!” అని కేక పెట్టాడు. తన తమ్ముడైన ఖరుణ్ణి రాముడు చంపి ఉన్నందుకు ప్రతీకారంగా సీతను ఎత్తుకుపోయే ఉద్దేశంతో రావణుడు మాయారూపంలో వచ్చాడు.
రాముడు అతన్ని పర్ణశాలలోకి ఆహ్వా నించి కూచోబెట్టి, "మహర్షి, శ్రాద్ధానికి ప్రధానమైనవేవి?” అని అడిగాడు. దానికి రావణుడు, " గ్రాసాలలో దర్భా, విత్తులలో నువ్వులూ, పప్పులలో మినుమూ, చేపలలో రొయ్యా, జంతువులలో గోవుగాని, ఖడ్గ మృగంగాని, బంగాములేడిగాని ముఖ్యం. అయితే బంగారు లేళ్ళు ఇక్కడ దొరకపు; అవి హిమాలయాలలో గంగాజలం తాగుతూ నివసిస్తున్నాయి," అన్నాడు.
అంతలోనే రాముడికి దూరాన బంగారు లేడి కనిపించింది. దానిని పట్టటానికి లక్ష్మ ణుణ్ణి పంపుదామంటే సమయానికి అతను ఎవరో మునులను చూడబోయాడు. అందు చేత రాముడు దానిని పట్టి తేవటానికి బయలుదేరాడు. రావణుడు చూస్తూండగానే లేడి రాముడి బాణాలకు అందక పొదల దూరి అదృశ్యమయింది.
అప్పుడు రావణుడు తన నిజస్వరూ పంలో సీతకు కనబడి ఆమెను ఎత్తుకుని బయలుదేరాడు. సీత ఎలుగెత్తి కేకలు పెట్టింది. అది విని జటాయువు అనే పక్షి రావణుడితో తలపడింది. రావణుడు దాని రెక్కలను ఖండించి, వెళ్ళిపోయాడు.
అక్కడ అయోధ్యలో భరతుడికి సీతాప హరణం గురించి, రామ లక్ష్మణులు సుగ్రీ వుడితో సఖ్యంచేసి, వాలిని సంహరించటం గురించి తెలిసింది. సీతను రావణుడు అప హరించాడన్న వార్త భరతుడికి గొడ్డలిపెట్టు అయింది. అతను కోపంతో తన తల్లి అయినకైకేయివద్దకు వెళ్లి, "నీకొక శుభవార్త తెచ్చాను. నీ మూలాన రాముడు అడవి పాలు కాగా, మహాపతివ్రత సీత అపహరించ బడింది. నీకు తృప్తి అయిందా? నిన్ను కోడ లుగా తెచ్చుకున్న కారణంగా మా వంశం మరొక కోడలిని పోగొట్టుకున్నది,” అన్నాడు.
అతని సూటిపోటి మాటలు ఇక సహించ లేక కైకేయి భరతుడితో దశరధుడికి పుత్ర శోకం కలిగేలాగు శాపం ఉండటం గురించి చెప్పింది. "ఆ శాప ప్రభావంవల్ల నేను రాముడి వనవాసం కోరాను," అన్నదామె.
"నా వనవాసం కోరలేకపోయావా?” అన్నాడు భరతుడు.
"నీవు మొదటినుంచీ దూరంగానే ఉంటివిగదా !" అన్నది కైకేయి.
"పధ్నాలుగేళ్ళు ఎందుకు కోరావు?" అన్నాడు భరతుడు.
"పధ్నాలుగు రోజులనబోయి, నోరుజారి పధ్నాలుగేళ్ళు అన్నాను. నాయనా!"
అన్నది కైకేయి. ఈ విషయాలు అందరికీ తెలుసునని భరతుడు తెలుసుకున్నాడు. "అమ్మా, నీవల్ల తప్పులేదు. నీతో పరు షంగా మాట్లాడినందుకు క్షమించు," అన్నాడతను.
రాముడు రావణాసురుణ్ణి చంపి, సీతను చెర విడిపించి, లంకకు కొత్తగా రాజైన విభీ షణుడితో వస్తున్నట్టు జనస్థానంలో ఉండే ఆశ్రమవాసులకు తెలిసింది. వారు స్వాగత యత్నాలు చేశారు. ముని పత్నులు సీతను ఎంతో ఆదరించారు. భరతుడూ, మహా రాణులూ పెద్ద సేనతో సహా అక్కడికి చేరుకున్నారు.
రాముడి కష్టాలు గడిచిపోయి, అందరూ సంతోషంగా ఒకచోట చేరారు. అక్కడే రాముడికి మునులు రాజ్యాభిషేకం చేశారు. తరువాత అందరినీ అయోధ్యకు తీసుకు పోవటానికి పుష్పక విమానం వచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment