Monday, 8 December 2025

సింధునదీ తీరాన బ్రహ్మస్థలీ అనే గ్రామంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు నాలుగు వేదాలూ తెలుసును. ఈయన వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు. అతను వేదాధ్యయనంలో అంతులేని పరిశ్రమ చేసి దృఢధ్యముడు అనే పేరు సంపాదించుకున్నాడు. దృఢ ద్యముడి తిండికీ, బట్టకూ అయే ఖర్చులుభరించినవాడు తమోభేదకుడు అనే గృహస్థు. దృఢద్యముడు భిన్నతమసుడు అనే ఆయన ఇంట ఉంటూండేవాడు. ఈ విధంగా దృఢద్యముడు అమిత దీక్షతో అధ్యయనం చేసి, పదిఏళ్ళలో నాలుగు వేదాలూ అభ్యసించాడు. ఒకరోజు రాత్రి భిన్నతమసుడు దృఢ ద్యముడితో మాట్లాడుతూ, '' నాకు ఈ విశాలమైన ఇల్లేకాక, విస్తారమైన ఆవుల మందలూ, గేదెలమందలూ, పొలాలూ, బానిసలూ, స్త్రీజనమూ, రక్షకులూ కూడా ఉన్నారు. నేను ఏంతో పాండిత్యం సంపా దించిఉండి కూడా, జన్మతః కర్షకుణ్ణి కావటం చేత నా జ్ఞానాన్ని ఉపయోగపరచ లేక పోయాను. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చే సింది. మహర్షులు చెప్పినట్టు నా మిగతా జీవితాన్ని తీర్థయాత్రలలో గడపనిశ్చ యించాను. ముక్తి కోరినవాడు వారాణసి వద్ద అవిముక్తం సేవించాలి. నా కున్న దంతా నీ కిచ్చేస్తాను. తీసుకో." అన్నాడు దృఢద్యముడు అందుకు ఒప్పుకుని మర్నాడు తన గురువు వద్దా తమోభేద కుడి వద్దా సెలవు పుచ్చుకుని వచ్చి, అస్తిని దానంగా పుచ్చుకుంటానన్నాడు అయితే మర్నాడు భిన్నతమసుడు ఎంత సేపు ఎదురుచూసినా దృఢద్యముడు రాలేదు. మధ్యాన్నం కూడా అయేసరికి, భిన్నతమసుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్లి, అతను తమోభేదకుడి ఇంటి ముందు తారట్లాడుతూ ఉండటం చూశాడు. "నేనింకా తమోభేదకుడి వద్ద సెలవు పుచ్చుకో లేదు. ఇంట్లో అందరూ అ వుడిగా ఉన్నారు. కారణం తెలీదు.” అన్నాడు దృఢద్యముడు భిన్న తమసుడితో. భిన్నతముడు నవ్వి 'తమోభేదకుడి భార్య ప్రసవించ బోతున్నది. అందుకే అడావుడి. ఆమెకు ఆడపిల్ల పుట్టుతుంది. నువు ఆమెను పెళ్లాడతావు. ఆమె కులం చెడుతుంది." అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది విని దృఢధ్యముడికి కంగారు పుట్టింది. తమోభేదకుడికి నిజంగా ఆడపిల్లే పుట్టితే, భిన్నతమసుడు చెప్పిన మిగిలిన రెండు విషయాలుకూడా నిజ మవుతాయని అతనికి తోచింది. అతను ఇలా అను కుంటూండగానే తమోభేద కుడు, “ఛీ ! ప్రారబ్ధం ! '' అనుకుంటూ బయటికి వచ్చాడు. ఆయనకు ఆడపిల్లే పుట్టింది. భిన్నతమసుడు చెప్పిన విష యాలు అబద్ధం చేసి, తాను ఆ పాపిష్ఠి పిల్లను పెళ్ళాడ కుండా ఉండగలందు లకు, దృఢద్యముడు మర్నాడే బయలు దేరి, సింధూతీరాన్ని వదిలేసి. పదేళ్ళ పాటు నానాదేశాలు సంచారం చేసి చివరకు గంగాతీరానికి వచ్చాడు. ఒకనాడు అతను ఒక బ్రాహ్మణగ్రామం చేరి, ఒక ఇంటికి వెళ్ళి. అక్కడ కని పించిన వృద్ధురాలితో, '" అమ్మా, కాసిని మంచి నీరు ఇప్పించండి,'' అన్నాడు. ఆ వృద్ధురాలు, '' అమ్మా తమాలికా! ఒక పీటా, చెంబుతో నీళ్ళూ తీసుకురా, తల్లీ!" అని కేక పెట్టింది. లోపలి నుంచి ఒక పిల్ల వచ్చింది. ఆమె నల్ల దుస్తులు ధరించి, మెల్లకళ్ళతో ఒకేసారి అన్నిదిక్కులా చూస్తూ కుంటిగా నడుస్తూ, ఒక చేతిలో పీటా, ఇంకో చేతిలో నీళ్ళ చెంబూ పట్టుకుని వచ్చింది. “కూర్చో," అంటూ ఆమె పీట వెయ్య బోయి, చెంబును కింద వేసింది. ''అదేం పనే, అమ్మా? మళ్ళీ చెంబుతో నీరు పట్టుకురా." అన్నది వృద్ధురాలు. దృఢద్యముడు విశ్రాంతిగా కూర్చున్న మీదట ఆమె అతన్ని, ''ఏదేశం నుంచి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు? '' అని అడిగింది. "అన్ని దేశాల నుంచీ వస్తున్నానని చెప్పొచ్చు. ఏ బ్రాహ్మణ గ్రామంలో నన్నా స్థిరపడి, పిల్లలకు చదువు చెబుతూ జీవితం వెళ్ళబుచ్చుదా మనుకుం టున్నాను." అన్నాడు దృఢధ్యముడు. " అయితే నువు మరెక్కడికి పోనవ సరంలేదు. చదువులో పెట్టవలసిన వాళ్లు నా మనమలు ఇద్దరున్నారు. వాళ్ళకుబడింది. అందుచేత అతను తమాలికను పెళ్ళాడేశాడు. ఒక సంవత్సరం గడిచింది. ఒక రోజు తెల్లవారు ఝామున తమాలిక లేవటం చూసి దృఢ ద్య ముడు తమాలికను, ''మీ ఇంటి పెద్ద ఎవరు ? ఆ ముసలావిడ నీకు ఏమవుతుంది? నాదగ్గిర చదువు కునే కుర్రవాళ్ళెవరు?'' అని అడిగాడు. తమాలిక గట్టిగా నిట్టూర్చి, తన చరిత్ర ఇలా చెప్పింది : నువు కావాలి, నీకు వాళ్ళుకావాలి." అన్నది వృద్ధురాలు. దృఢద్యముడు సరేనని, ఆ గ్రామం లోనే ఉండిపోయి, రెండేళ్ళ పాటు ఆవిడ మనమలిద్దరికీ చదువు చెప్పాడు. ఇంతలో ముసలావిడకు ఒక ఆలోచన వచ్చింది. త మాలికకు పెళ్ళియాడు వచ్చింది; ఆమెను దృఢద్యముడికే ఇచ్చి చేస్తే సరిపోతుంది. దృఢద్యముడు కొంచెం ఆలోచించి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఎక్కడో పడమటి సముద్రతీరాన ఉన్న తమోభేద కుడి పాపిష్టి కూతురుతో పెళ్ళి తప్పించు. కోవటానికి ఇదే మంచి మార్గంగా కన "ఈ ముసలావిడ భర్త సంపన్నుడు, దానశీలుడు. వాళ్ళకు ఒక కూతు రుండేది. ఆమెను తండ్రి తన శిష్యుడికే ఇచ్చిచేశాడు. పెళ్ళికాక పూర్వం ఎంతో వినయంగా ఉండిన ఆ శిష్యుడు, అల్లు డయాక అత్తమామల పట్ల కర్కోట కుడుగా తయారయాడు. తరవాత అతను తన బావమరిదితో తగాదా పెట్టుకుని సింధుప్రాంతానికి వెళ్లిపోయాడు. అకడ అతను బ్రహ్మస్థలి అనే గ్రామంలో నివాసం ఏర్పాటుచేసుకుని వైదికకర్మలు జరిపిస్తూ వచ్చాడు. “కొంత కాలానికి అతనికి ఒక పాపిష్ఠి కూతురూ, యములవాళ్ళలాటి ఇద్దరు కవల కొడుకులూ పుట్టారు. నేనే ఆ కూతురును. నీ శిష్యులైన తొర్రిమూతి పిల్లలు నా తమ్ముళ్ళు. మాకు మా అమ్మా,నాన్నా బాగా తెలీదు. నదికి వరదలు వచ్చి సింధుదేశం జలమయమైనప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్న మమ్మల్ని మా అమ్మమ్మ దగ్గిరికి పంపేశారు.'” దృఢద్యముడి గుండెలో బాణం తగిలి నట్టయింది. భిన్నతమసుడి రెండో జోస్యం కూడా నిజమయింది. కనీసం మూడోదైనా అబద్ధం చేద్దామని, దృఢద్యముడు కాశీకి బయలుదేరాడు. పుణ్యతీర్ధాలు సేవించి, జీవితమంతా పుణ్యం సంపాధించటానికి అతను నిశ్చయించుకున్నాడు. పన్నెండేళ్ళ అనంతరం అతను కాశీ చేర వస్తూండగా ఒక మహాపాశుపతుడు పుర్రెలమాల ధరించి, తాగి తూలుతూ రావటం అతనికి కనిపించింది. అతని వెనకగా ఒక కాపాలిని తాను కూడా తప్ప తాగి, పాము లాగా మెలికలు తిరిగి నడుస్తున్నది. చింతనిప్పుల్లాగా ఉన్న ఆమె కళ్ళు మెల్ల కళ్ళు. "కాపాలి నీ. త్వ ర గా రా. అవి ముక్తంలో ధూపీకాలం మించిపోగూడదు. మహాశివుణ్ణి 'హం ! హం ! ' అని అర్చించి, మద్యం తాగాలి." అని పాశుపతుడు కాపాలినిని తొందర చేస్తున్నాడు. ఇంతలో ఆ స్త్రీ దృఢద్యముణ్ణి చూసి, తన భర్తగా గుర్తించి, కెవ్వున అరిచి, అతని కాళ్ళమీద పడిపోయింది. చుట్టూ జనం మూగారు. తమాలిక తన భర్తతో, "నీ వేదాధ్యయనం ఏమయింది? నిత్యాగ్నిహెూత్రం ఏమయింది ? పితృ తర్పణాలు ఏమయాయి? నన్ను విడిచి పెట్టేసి నేను చెడిపోవటానికి కారకుడి వయ్యావు ! '' అని నిందించింది. చుట్టూ చేరిన వారిలో బ్రాహ్మణులు దృఢద్యముణ్ణి ప్రశ్నించి, తమాలిక ఆరోపణలు నిజమని గ్రహించి, " నువు పాశుపతుడి వెంట ఉంటావా ? భర్త దగ్గిరికి వస్తావా?'' అని అడిగారు. ఆమె భర్త దగ్గిరికే పోతానన్నది. అప్పుడు బ్రాహ్మణులు దృఢద్య ముడితో, '' ఈమె పతనం కావటానికికారకుడివి నువే: ప్రాయశ్చిత్తాలు మేం చెబుతాం. నువు ఈమెను భార్యగా స్వీక రించవలసిందే,'' అన్నారు. దృఢద్యముడు అలాగేచేశాడు. బేతాళుడి కథ చెప్పి "రాజా, దృఢ ద్యముడికి కలిగిన అనుభవాలకు కారకు లెవరు ? విధినిర్ణయమా? దృఢద్యముడి ప్రవర్తనా? అతను భిన్నతమసుడి జోస్యం నమ్మినట్టా? నమ్మనట్టా ? ఈ సందేహా లకు సమాధానం తెలిసికూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది." అన్నాడు. దానికి విక్రమార్కుడు. " దృఢద్య ముడు భిన్నతమఇుడి జోస్యం నమ్మబట్టే అతను దానినుంచి తప్పించుకోవటానికి నానాయాతనలూ పడ్డాడు. నమ్మకం లేని వాడైతే ఆ జోస్యాన్ని నిర్లక్ష్యం చేసి తన మానాన తాను జీవించి ఉండేవాడే. భిన్నతమసుడి జోస్యం విధినిర్ణయాన్ని చెప్పినదే గనక, విధినిర్ణయం అమలు జరిగిందనాలి. అయితే, విధినిర్ణయం పూర్తిగా దృఢ ద్యము డి నిర్ణయాల ద్వారానే అమలు జరిగింది. తమాలికను తాను పెళ్ళి చేసుకోకుండా ఉండాలంటే అతను పారిపోవటానికి బదులు ఆమెకు సాధ్యమైనంత దగ్గిరలో ఉండాలి. ఆమెను పెళ్ళాడిన ఏడాదికి అతను ఆమె పుట్టు పూర్వోత్తరాలు కనుకోవటం కూడా అతని పొరపాటే. వాటిని అతను ముందుగానే తెలుసుకుని ఉండవచ్చు. తెలుసుకున్న తరువాత అతను పారిపోవటం తప్పని తమాలిక పదిమంది ఎదటా నిరూపిం చింది. భర్త విడిచిన స్త్రీ పతితురాలు కాకేం జేస్తుంది ? చివరకు కూడా ఆమె అతనితోనే ఉండగోరిందంటే ఆమె పతితు రాలు కావటానికి కారణం ఆమె దుర్బుద్ధి కాదని స్పష్టం అవుతున్నది. అందుచేత దృఢద్యముడిది పూర్తిగా స్వయంకృతా పరాధమే!" అన్నాడు.

No comments:

Post a Comment