Tuesday, 2 December 2025

మందమతి ఒక ఏటి ఒడ్డున ఉండే గ్రామంలో రాయన్న అనే భూస్వామి ఉండేవాడు. ఆయన చాలా పెద్దమనిషి. గ్రామస్థులందరూ ఆయనను గౌరవించేవారు. గ్రామంలో ఏ తగాదా వచ్చినా ఆయనను తీర్పు కోరి, ఆయన చెప్పిన ప్రకారం తగాదా పరిష్కారం చేను కునేవారు. రాయన్న కూడా ఒకరి జోలికి పోకుండా, తన పరువు నిలబెట్టుకుంటూ, 'సుఖంగా జీవయాత్ర సాగించాడు. చాలా కాలంపాటు ఆయనకు ఒకటే కొరత ఉండేది. ఆయనకు బిడ్డలు లేరు. కొంత కాలమయాక ఆయనకు ఒక కొడుకు కలిగాడు. లేకలేక పుట్టిన ఆ కొడుక్కు వీరన్న అని పేరు పెట్టుకుని, అతిగారాబంగా పెంచసాగారు తల్లి దండ్రులు. ఈ గారాబం బాగా తల కెక్కి వీరన్న చిన్నతనం నుంచీ బొత్తిగా ఆకతాయి అయి పోయాడు. ఇంటి వద్ద వాడు ఎంత అల్లరి చేసినా తల్లీ, తండ్రి గట్టిగా కోప్పడేవారు కారు. మరీ పాడుపనులు చేస్తే, అలాటి పనులు చెయ్యవద్దని బతిమాలేవారు. లోక మంతా తనను అలాగే చూస్తుందను కున్నాడు వీరన్న. ఆ ఉద్దేశంతో వాడు ఊళ్ళో తన ఈడు పిల్లలందరి మీదా పెత్తనం చలాయించసాగాడు. ఎవరైనా వాడి పెత్త నాన్ని సహించకపోతే వాళ్ళను పట్టుకుని కొట్టేవాడు. రాయన్న మీది గౌరవం కొద్దీ ఊళ్ళో వాళ్ళు వీరన్న ఆగడాలు సహించే వాళ్ళు. ఆడవాళ్ళు మాత్రం వీరన్న తల్లి వద్దకు వచ్చి, "మీ వాడు మా పిల్లలను బతకనివ్వటం లేదు," అని ఫిర్యాదులు చేసేవాళ్ళు. "పిల్లలన్నాక ఒక క్షణం కొట్టుకుంటారు. మరో క్షణం మళ్ళీ ఏకమవుతారు. ఈ భాగ్యా వికి ఫిర్యాదులు చెయ్యాలా?" అనేది వీరన్న తల్లి.వీరన్నను బడిలో వేశారు, కాని వాడికి చదువు అంటలేదు. వాడి మకురుతనం మటుకు వృద్ధి అయింది. తినటమూ, తిరగ టమూ తప్ప వేరే పని లేకపోవటం చేత వాడు చిన్న ఆంబోతులాగా తయారయాడు. ఊళ్ళో అందరికీ వాడంటే భయం భయంగా ఉండేది. వాడు ఏటి కట్ట మీద అంత దూరాన కనిపిస్తే ఆడపిల్లలు నీరు తీసుకునే ప్రయత్నంకూడా మానేసి వెనక్కు తిరిగి వెళ్లేవాళ్ళు. రాయన్నకు తన కొడుకు నిజమైన స్వభావం తెలిసివచ్చిన కొద్ది విచారం కూడా ఎక్కువయింది. మొక్కగా వంగనిది మానై వంగదు. ఇర వై ఏళ్ళు పైబడ్డ వీరన్నను ఇప్పుడు సరి అయిన మార్గంలో పెట్టటం తేలిక కాదు. లేకలేక పుట్టిన ఒక్క కొడుకూ తన పరువు తీసేస్తూంటే, విచా రించటం తప్ప రాయన్న ఇంకేమీ చెయ్య లేకపోయాడు. అయితే తల్లీ తండ్రీ చెయ్యలేకపోయిన పనిని, ఆ గ్రామంలో ఉండే ఒక పేద రైతు కూతురు సాధించింది. ఆ పిల్లపేరు గౌరి. ఆమె ఎంత అందంగా ఉండేదో అంత తెలివిగలదీ, మాటకారి కూడానూ. ఆమె వీరన్నను చూసి ఎన్నడూ భయపడి ఎర గదు. ఆమె అందమూ ధైర్యమూ చూసి వీరన్నకు ఆ పిల్లను పెళ్ళాడాలని మన సయింది. ఆ సంగతి గౌరి తేలికగా పసి కట్టింది. వీరన్న తనను పెళ్ళాడతానని అన్న రోజున అతనికి మంచి గుణపాఠం నేర్పటానికి కూడా ఆమె ఒక ఉపాయం . ఆలోచించి పెట్టింది. ముందుగా వీరన్న వచ్చాడు. వీరన్నకు గౌరి పైన మనసుగా ఉన్నదని గౌరి స్నేహితురాళ్ళకు తెలుసు. వేసవి ఆరంభంలో ఒకనాడు ఇంటి ముందు ఆరుగు మీద గౌరీ, స్నేహితురాళ్ళూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, వాళ్ళింటివీరన్నకు వినపడేటట్టుగా ఒక స్నేహితు రాలు, "అయితే, గౌరీ, నీ పెళ్ళి ఎప్పుడే?” అని అడిగింది. " నా పెళ్ళి అంత తేలికగా అవుతుం దనుకున్నావా? నన్ను పెళ్ళాడేవాడు నేను పెట్టే పరీక్షలకు నిలబడాలి,” అన్నది గౌరి. ఈ మాటలు వింటూ ముందుకు సాగి పోయిన వీరన్నకు రోషం వచ్చింది. తాను గౌరిని పెళ్ళాడాలనే ఉద్దేశంతో ఉన్నాడు గనక ఆమె తననే సవాలు చేస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు. గౌరి ఏమి పరీక్షలు పెట్టుతుందో తెలుసుకునే దాకా అతని ప్రాణం గిలగిలా కొట్టుకోసాగింది. అందు చేత మరికొంత సేపయాక మళ్లీ గౌరి అంటి కేసి వచ్చాడు. "ఏం, వీరన్నా, ఇలా వచ్చావు? మా నాన్న ఇంట్లో లేడు,” అన్నది గౌరి. " నేను నీ కోసమే వచ్చాను. నిన్ను పెళ్ళి చేసుకునేవాడి కేవో పరీక్షలు పెడతా పటగా? ఏమిటా పరీక్షలు?” అని వీరన్న దర్పంగా అడిగాడు. "వాటితో నీకేం పని ? నేను పరీక్షలు పెట్టేది నన్ను పెళ్ళాడతానని వచ్చేవాడికి,” అన్నది గౌరి. "నిన్ను పెళ్ళాడదామనే అడుగుతున్నా ననుకోరాదా?” అన్నాడు వీరన్న. "పరీక్షల్లో నెగ్గకపోతే జన్మంతా నాకు పనిమనిషిగా ఉండాలిసుంటుంది. నీకా పరీక్షలు వద్దులే,” అన్నది గౌరి, "నీ పరీక్షల్లో నెగ్గటం నా వల్లే కాకపోతే, నన్ను మించిన మొనగా డున్నాడా?" అన్నాడు వీరన్న పౌరుషం వచ్చి. "అదీ నిజమే ననుకో. అయితే నేను చెప్పిన షరతు జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు బరువైన పనులేమీ చెప్పను,” అన్నది గౌరి. "ఆ పనులేవో చెప్పు,” అన్నాడు వీరన్న ధీమాగా."మొదటి పని చెబుతాను, నా వెంట రా," అంటూ గౌరి ఒక బిందే, చిన్న గిన్నే తీసుకుని ఏటికి దారి తీసింది. వీరన్న ఆమె వెంట వెళ్ళాడు. ఏటి ఇసుకలో ఒక చెలమ గుంట తీయ మన్నది గౌరి, వీరన్న తేలికగా గుంట తీశాడు. అందులోకి నీరు వచ్చింది. " ఈ నీరు బాగాలేదు. గిన్నెతో దీన్ని తీసేసి గుంట ఖాళీ చెయ్యి, తరవాత వచ్చే నీరు బిందెలో నింపుకుంటాను,” అన్నది గౌరి. వీరన్న చెలమలోని నీరు గిన్నెతో తోడెయ్యసాగాడు. ఎంత సేను నీరు తీసినా గుంటలోని నీరు తరగనేలేదు. ఒక గంట గడిచింది. వీరన్నకు చేతులు పడిపో తున్నాయి, ముచ్చెమటలు పట్టుతున్నాయి. " ఇంకా గుంట ఖాళీ కాలేదా?" అన్నది గౌరి విసుగ్గా. " ఇక నా వల్లకాదు," అంటూ వీరన్న గిన్నె అవతల పడేశాడు. "ఓడిపోయావు! మొదటి పరీక్షకే నిలవ లేకపోయావు ! ఏం చేసేటట్టు? పోనీ మిగి లిన పరీక్షల్లోనన్నా నెగ్గుతావేమో చూద్దాం," అంటూ గౌరి వీరన్నను తన ఇంటికి తీసుకు పోయింది. గౌరి స్నేహితురాళ్ళు వీరన్నను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. గౌరి ఇంట్లోకి పోయి ఒక పళ్ళెంలో నిప్పూ, ఒక డబ్బా, అంత సాంబ్రాణి తెచ్చి, "ఈ సాంబ్రాణిని నిప్పుల మీద వేసి పొగ చేసి, ఈ డబ్బాలో పట్టి ఉంచు. నే నిప్పుడే తలంటి నీళ్ళు పోసుకుని వచ్చి తలకు సాంబ్రాణి పొగ వేసుకుంటాను," అన్నది. మందమతి అయిన వీరన్న నిప్పుల మీద సాంబ్రాణి వేసి, దానిపైన డబ్బా బోర్లిం చాడు. గౌరి తడితలతో వచ్చి, "సాంబ్రాణి పొగ సిద్ధంచేశావా?" అని అడిగింది. వీరన్న "ఇదుగో!” అంటూ డబ్బా తిరగ దీశాడు. కాని అందులో ఏమీలేదు. పొగ అంతా అప్పుడే పోయింది."ఇంత చిన్నపని కూడా చెయ్యలేక, రెండోసారి కూడా ఓడిపోయావు. మూడో పని అయినా సరిగా చేస్తావేమో చూస్తాను,” అన్నది గౌరి. ఆమె స్నేహితురాళ్ళు కొంచెం గట్టిగానే నవ్వుతున్నారు. వీరన్నకు పరా భవంతో ప్రాణం చచ్చిపోతున్నది. 'గౌరి లోపలికి వెళ్ళి చెంబులో పాలు తెచ్చి, "ఇందులో సగానికి నగం నీరు కలిసింది. నాకు నీళ్ళపాలు సహించవు. కాస్త యీ పాలలోని నీరు తీసేసి చిక్కటి పాలు వేరుచెయ్యి,” అన్నది. వీరన్నకు ఏం చెయ్యాలో తెలియలేదు, అతనికిప్పుడు అవమానంతో బాటు దుఃఖం కూడా వచ్చేస్తున్నది. "ఈ పని నావల్ల కాదు," అంటూ వీరన్న వెళ్ళిపోవటానికి లేచాడు. "ఎక్కడికి పోతున్నావు? నేను పెట్టిన పరీక్ష లన్నిటా ఓడావు. నువ్విప్పుడు నా పనిమనిషి.వి. నాతో చెప్పకుండా ఏమీ తీరాలి,” అన్నది గౌరి. చెయ్యరాదు, నేను చెప్పిన పనులన్నీ చేసి గౌరి స్నేహితురాళ్ళు కసికొద్ది వీరన్నను నానామాటలూ అనటం మొదలు పెట్టారు " ఆవగింజంత ప్రపంచజ్ఞానం లేదు. అతి శయం మాత్రం చుక్క లంటుతుంది. చాతా వాతా కానివాడికి ఎంత పొగరు ! ఈ ముష్టి ప్రయోజకత్వంతో గౌరిని పెళ్ళాడతాడట! దున్నపోతులాగా కండలు పెంచగానే సరా? కాస్త బుద్ధికూడా ఉండవద్దూ?” ఆడపిల్లల కేకలకు అందరూ పోగ య్యారు. గౌరి వీరన్నకు తగినట్టు బుద్ధి చెప్పిందని ఊరంతా క్షణంలో పొక్కి పోయింది, అందరూ సంతోషించారు. అందరికన్నా ఎక్కువ సంతోషించినవాడు రాయన్న. ఎందుకంటే గౌరి నేర్పిన గుణ పాఠంతో వీరన్న పూర్తిగా మారిపోయాడు. ఆయన గౌరి తండ్రితో మాట్లాడి గౌరినే తన కోడలుగా చేసుకున్నాడు.

No comments:

Post a Comment