Monday, 8 December 2025

అతిజాగ్రత్త బొద్దూరు గ్రామంలో సత్యం అనే అతిజాగ్రత్త మనిష ఉండేవాడు. గ్రామంలో అందరూ అతన్ని పిసినారి అంటూంటారు. అతడికి చిన్న తనంలోనే తల్లి. తండ్రి చనిపోగా, నాయనమ్మ పెంచి పెద్దచేసింది. కొద్దో గొప్పో ఆస్తితోపాటు, అతడికి మంచి ఉద్యోగం కూడా వున్నది. సత్యం పొరుగు గ్రామంలోవున్న విమల అనే అమ్మాయిని వివాహం ఆడాడు. అతడికి, ఆమె అంటే ప్రాణంతో సమానం. విమలకు కూడా భర్త అంటే ప్రాణమే కానీ, అతడు చూపే అతిజాగ్రత్త మాత్రం, తగని చిరాకు కలిగించేది. రాత్రివేళల్లో సత్యం, ఇంటికి లోపలి గడియలు, ఒకటికి పదిసార్లు వేస్తూండేవాడు. కూరలవాళ్ళకూ, అంగడి వాళ్ళకూ చిల్లర డబ్బులు, మరిమరీ లెక్క పెట్టి ఇవ్వడం లాంటి జాగ్రత్తలతో పాటు, అతడికి మరొక అలవాటు కూడా వుండేది. అదేమంటే- అతడి దృష్టిలో నిరుపయోగమైన వస్తువంటూ ఏదీలేదు. ఖాళీ అగ్గిపెట్టెలు, సబ్బుడెక్కులు, వెచ్చాల తాలూకు పొట్లాలదారాలు, కొబ్బరిపీచు, పాతకాగితాలు, మొదలైన వన్నీ సత్యం జాగ్రత్తగా దాస్తూంటాడు. ఎప్పటినుంచో అలా నిలవచేసిన అనవసర వస్తువులు, అతడి ఇంట్లో కుప్పలు తెప్పలుగా పడివుండేవి. కాపరానికి వస్తూనే, ఇంటి వైనం చూసి చిరాకుపడిన విమల, నడుం బిగించి చెత్తంతా పోగుచేసి, వీధిలో పారవేయ బోయింది. అయితే, అప్పుడే బజారు నుంచి వస్తున్న సత్యం కొంపలంటు కున్నట్టు కేకవేసి, "అవన్నీ ఇంట్లో ఒక పక్క పడివుంటాయి. వాటి జోలికి వెళ్ళకు. ఇంతకాలం నేను పనిమాలాదాస్తూ వచ్చింది. పారవేయడానిక్కాదు!" అన్నాడు. విమల ఆశ్చర్యంగా, "మరెందుకండీ, ఈ చెత్తంతా?" అన్నది. సత్యం, భార్యకేసి పిచ్చిదాన్ని చూసినట్టు చూసి. "ఎందుకేమిటి? ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు. ఈ పరమసత్యాన్ని, మా నాయనమ్మ నాకు నూరి పోసింది. ఆమె అఖరికి పూచికపుల్ల అయినా గాల్లో కొట్టుకు పోతూంటే చూసి విలవిల్లాడేది. ప్రతి వస్తువుకూ, దాని ప్రయోజనమంటూ ఒక కటుంటుంది. ఎప్పుడు దేని అవసరం కలుగు "తుందో చెప్పలేం గదా!" అన్నాడు. విమల భర్త కేసి కొరకొర చూస్తూ, ''ఈ చెత్తతో, మనకేం అవసరం కలుగు తుందో కాస్త చెప్పండి." అన్నది. "అలా అడుగు, బావున్నది. సరే. చెప్పేది జాగ్రత్తగా విను. మనం అంగట్లో సరుకులు కొన్నప్పుడు. యీ అట్టపెట్టె లకు, కాగితాలకు, డబ్బాలకు, దారాలకు కలిపే డబ్బు చెల్లిస్తూంటాం, తెలుసా? అలాంటప్పుడు, వీటిని పారేయడం అంటే. మన డబ్బుకు మనమే చిచ్చు పెట్టినట్టు!" అని సత్యం, భార్యకు ఏఏ సందర్భా లలో వాటిని ఉపయోగించుకోవచ్చో, ఒక అర్ధగంట సేపు వివరించాడు. అయితే, నెలలు గడుస్తున్నా. వాటిని ఉపయోగించుకునే సందర్భం. ఆ భార్యా భర్తలకు కలగలేదు. పైగా, రోజు రోజుకూ ఇంట్లో చెత్తాచెదారం విపరీతంగా పెరగ సాగింది. ఒకసారి విమల స్నేహితురాలు, విమల కొత్తకాపరం ఎలా వుందో చూడడానికి వచ్చింది. ఆమె ఇల్లంతా చూశాక, “పెళ్ళి కాకముందు. ఇంటి శుభ్రత గురించి గొప్పగా కబుర్లు చెప్పేదానివి. మరిప్పుడు ఇంటిని యిలా అడవిలా వుంచావేమిటి?" అని అడిగింది. విమలకు చాలా బాధ కలిగింది. అయినా, ఆమె భర్త చాదస్తం స్నేహితురాలిముందు బయట పెట్టుకోలేక, "రోజూ శుభ్రం చేయాలనుకుంటూనే బద్దకిస్తు న్నాను." అంటూ మాట దాటవేసింది. ఆ రోజు, ఆమె భర్తతో, ఈ విషయం గురించి పెద్దగా గొడవ పెట్టుకున్నది. సత్యం కూడా బాగా కోపం తెచ్చుకుని, "ఇంతకాలం బుద్ధిలేకనే, అవన్నీ దాచా ననుకుంటున్నావా? అసలు అవన్నీ ఒక పక్కన పడివుంటే, నీకొచ్చిన నష్ట మేమిటి? ఏదో ఒక రోజు, వాటి ఉప యోగం తప్పక వస్తుంది. చూస్తూండు!'' అన్నాడు. విమలకు, రా మే శమనే తమ్ము డున్నాడు.. అతడు ఒకసారి అక్కను చూడడానికి వచ్చాడు; చాలా తెలివైన వాడు. విమల, భర్త చాదస్తం గురించి తమ్ముడి తో చెప్పి. ఆయన్ని మార్చే ఉపాయమేదైనా ఆలోచించమన్నది. రామేశానిక్కూడా, విమల ఇంట్లో పనికివచ్చే సామానుకన్న పనికిరానివే ఎక్కువగా కనిపించినై. అతడు బాగా ఆలోచించి, విమలకు ఒక ఉపాయం చెప్పాడు. విమల మొదట సంశయించినా, తమ్ముడి తెలివితేటల మీద మంచి నమ్మకం వుండడం చేత, ఒప్పుకున్నది. ఆ రాత్రి భోజనాలయాక, విమల రామేశానికి బయట పక్క వేసింది. విమలా మామూలుగా నే ఇంట్లో పడుకున్నారు. సత్యం తన అలవాటు ప్రకారం, తలుపులకు గడియ లన్నీ. చివరిసారిగా తనిఖీ చేసి వచ్చి పడుకున్నాడు. సరిగా అర్ధరాత్రివేళ, వంటగది వైపు నుంచి, ఏవో ధ్వనులు వినిపించడంతో, ఉలిక్కిపడి లేచి, విమలను కూడా లేపాడు. ఇంతలో నల్లటిముసుగు ధరించిన వాడొకడు, వాళ్ళ ముందుకు దూకి, అక్కడ ఒక మూలగా పడివున్న ఖాళీ సీసాను తీసుకుని, దాన్ని గోడకు కొట్టి పగలకొట్టి. వాడిగా వున్న భాగాన్ని వాళ్ళకు గురి పెట్టాడు.ఛ్ఛో భయంతో వణుకుతూ, తీసుకుని తాపీగా పెట్టెలు తెరిచి, డబ్బూ, అరవబోయేంతలో, మునుగువాడు, నగలూ, విలువైన బట్టలూ ఒక మూట చేతిలో వున్న కట్టాడు. వంటగదిలోకి పోయి, పాత్ర సీసాతో పొడుస్తాను. మర్యాదగా, ఆ గుంజ సామగ్రినంతా ఒక గోతానికెత్తాడు. దగ్గిరకు నడవండి," అన్నాడు కర్కశంగా. యతిరాజూ, విమలా నిలుపుగుడ్లతో వాణ్ణి చూడసాగారు. "అరిచారంటే, మునుగువాడి గొంతు భయంకరంగా ధ్వనించింది. అప్పటికే నిలువునా వణికి పోతున్న సత్యం, కిక్కురుమనకుండా గుంజదగ్గిరకు నడిచాడు. అతడి వెనకగా విమల నడిచింది. ముసుగువాడు అక్కడ మూల పడివున్న దారాలనూ, పురితాళ్లనూ తెచ్చి, సత్యంనూ, విమలనూ వాటితో గుంజకు కట్టివేశాడు. తర్వాత, వాడు మరొకసారి వాళ్ళను అరవొద్దని హెచ్చరించి, తాళంచెవులు పని పూర్తికాగానే వాడు, సత్యం ముందుకువచ్చి. ఈ రోజు దొంగతనానికి అనుకోకుండా బయలుదేరాను. అందు వల్లే, వెంట కత్తి, తాళ్ళూ తెచ్చుకోలేదు. అయినా, మీ ఇంట్లో నా పని సులువుగా తెమిలిపోయింది. అందరూ మీలాగే ఇంటి నిండా, ఇలా మాకు పనికొచ్చే వస్తువులు పోగుచేసి తయారుగా వుంచితే, మాకు కత్తులూ, తాళ్ళూ గట్రా ఇంటింటికీమోసుకువెళ్ళే మోతపని తప్పుతుంది." అన్నాడు. తర్వాత మునుగువాడు, ఇంటి నాలుగు గదులూ తిరిగి వచ్చి, "నేను ఏ ఇంట్లో దొంగతనం చేసినా, వెళ్ళేటప్పుడు. ఆ ఇంటిని తగలబెట్టడం ఆచారం. ఇప్పుడా పని చేయబోతున్నాను." అన్నాడు. సత్యం అతి ప్రయత్నం మీద గొంతు పెగుల్చుకుని, "ఇంట్లో వున్న డబ్బూ, విలువైన వస్తువులూ- అన్నీ తీసుకున్నావు గదా ? ఇంకా ఇల్లు తగల బెట్టడం కూడా ఎందుకు. అంత ఘోరం చెయ్యకు !'' అని బ్రతిమాలాడు. "నా అచారాన్ని మంటగలపాలని చూస్తున్నావా?'' అంటూ మునుగువాడు, సత్యం మీద ఖస్సుమంటూ లేచి, మూలమూలల వున్న ఖాళీ అట్టపెట్టెలూ. కాగితాలూ, కొబ్బరిపీచూ, డొక్కులూ తెచ్చి, చావిట్లో కుప్పగా పోయసాగాడు. సత్యం, విమలా ఏడుపు బిగబట్టు కున్నారు. ముసుగువాడు మూటలు రెండూ తీసు కుని, తను పోగుచేసిన చెత్త మీద అగ్గిపుల్ల గీసి పడవేసి, బయటికి వెళ్ళాడు. వెంటనే సత్యం పెద్దగా కేక పెట్టాడు. ఆ మరు క్షణం, రామేశం రొప్పుతూ లోపలికి వచ్చాడు. అతడి చేతిలో దొంగ ఎత్తుకు పోయిన మూటలు రెండూ వున్నవి.. రామేశం మూటలను కింద పడవేసి, వంటగదిలోకి పోయి నీళ్ళబిందెలు తెచ్చి.అప్పుడే రాజుకుంటున్న మంటను ఆర్పి, "దొంగ సన్ను చూసి, మూటలతో పెరటి గోడ దూకలేక, వాటిని వదిలి పారి పోయాడు." అని, సత్యం, విమలల కట్లు విప్పాడు. విమల కోపంగా భర్త కేసి చూస్తూ, "ఈ గొడవంతా, మీ కారణంగానే జరి గింది. ఎప్పుడో పనికి వస్తవంటూ, అడ్డ మైన చెత్తనూ ఇంట్లో జాగ్రత్తగా దాచారు. చూడండి. ఆఖరుకు అవి ఎలా పనికి వచ్చాయో ! తమ్ముడు సమయానికి లేక పోతే, మీరు దాచిన చెత్తతోపాటు ఇల్లూ, మనం నిలువునా కాలిపోయేవాళ్ళం." అన్నది. సత్యం ఎంతో పశ్చాత్తాపపడుతూ, "ఆ దొంగ, నా కళ్ళు తెరిపించాడు." అన్నాడు. "జరిగిందేదో జరిగిపోయింది ఇక ముందయినా నీ అతిజాగ్రత్త కాస్త తగ్గించుకో, బావా !" అని రామేశం సలహా యిచ్చాడు. ఆ మాట వింటూనే సత్యం, హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా. "అవును, జాగ్రత్త అంటే గుర్తుకొచ్చింది. రాత్రి పడుకోబోయేముందు గడియలన్నీ సరిగానే వేశాగదా! మరి, దొంగ ఇంట్లో కెలా వచ్చాడంటావు. విమలా?" అని భార్య నడిగాడు. విమల వెంటనే, " పోయిన దీపావళి పండగ రోజున, కాకరపువ్వొత్తులు కాల్చాక. కడ్డీలు పారేయకుండా ఎందు కైనా పనికొస్తాయని చూరులో దాచారు. దొంగ ఆ కడ్డీలను తలుపు సందుల్లో దూర్చి. గడియ తీశాడు. చూడండి, ఇక్కడ కడ్డీలు తలుపు దగ్గిర పడి వున్నవి." అంటూ వాటిని తెచ్చి భర్తకు చూపింది. ఇది జరిగాక, సత్యంలో అతి జాగ్రత్త బాగా తగ్గిపోయింది. తమ్ముడి సాయంతో, భర్త చాదస్తానికి తగిన చికిత్స చేయగలిగినందుకు, విమల చాలా సంతో షించింది.

No comments:

Post a Comment