Monday, 8 December 2025

అద్భుత గ్రంధం వివేకవర్ధనుడు ఆపూర్వ మేధావి. మంత్ర తంత్రాలవల్ల అనేక ఘనకార్యాలను సాధించ గలిగినవాడు. ఏ చికిత్సకూ కుదరని ఎన్నో దీర్ఘ వ్యాధుల్ని అతడు తన ఆమోఘ శక్తివ్వారా యిట్టే కుదర్చగలిగేవాడు. శక్తినీ సామర్థ్యాన్ని ప్రజల మేలుకోసమే వినియోగించిన రాజులలో సర్వజ్ఞపాలుడే మొదటివాడు. ఆ అతనికీర్తి దేశదేశాలా వ్యాపించి, ఖండ ఖండాంతరాలకూ అల్లుకుపోయింది. కాలంనాటి వైద్య, వేదాంత, ఖగోళ శాస్త్రా లకు అంతుదొరకని ప్రతి చికుసమస్యకూ వివేకవర్ధనుడు కనురెప్పపాటులో పరిష్టార మార్గం చూపగలిగేవాడు. ఇంత గొప్ప విజ్ఞానాన్ని, కేవల మానవ మాత్రుడు పొందగలగడం సాధ్యమేనా? -ఈ అనుమానం యితర రాజులకూ, చిన్నా పెద్దా పండితులకూ కలిగింది. రాజు పట్టి తెలివితక్కువవాడనికూడా వాళ్లకు దురభిప్రాయం వుండేది. అందువల్లనే అంతా స్వయంగా పరీక్షించి తెలుసుకోవా లని వివేకవర్ధనుడి వద్దకు వచ్చారు. వివేకవర్ధనుడు అందరనూ ఉచితరీతిని సత్కరించాడు. దర్బారు ఏర్పాటు చేశాడు. ఆయాదేశపు రాజులూ, పండితులూ సభను అలంకరించారు. ఉచితానుచిత ప్రశ్నలలో వివేకవర్ధనుడు అగ్ని పరీక్షకు గురిచేశారు. ఏ కోపమూ తాపమూ లేకుండా వివేకవర్ధనుడు అందరనూ తగిన నిదర్శ నాలతో సంతృప్తిపరిచాడు. సభ నిశ్శబ్ధంగా వుంది. అంతా అను మానరహితులైనట్టే కనబడ్డారు. వివేకవర్ధనుడు సింహాసనంమీదినుంచిలేచి అందరి వంకా చిరునవ్వు నవ్వుతూ చూచాడు. సభలో ఒకమూల చిన్న అలికిడి పెద్ద కలకలంగా మారింది. 'నేనా - నువ్వా' అనుకుంటూ బారుగడ్డం పెరిగిన పండితుడూ, పొడుగాటిమీసం పెంచిన ఒకరాజూ లేచి నిలబడ్డారు. వివేకవర్ధనుడు వారిద్దరివంకా పరీక్షగా చూసి తల పంకించాడు. "ఏ జీవినైనా చంపి బ్రతికించగలరా" అన్నారు పండితుడూ, రాజూ, "ఓ!" అన్నాడు తొలుకకుండా వివేకవర్ధనుడు, తరవాత — ప్రశ్నించిన ఆ యిద్దరి వంకా చూస్తూ "మీలో ఎవరు ఆ పరీక్షకు సాధనంగా వస్తారు?" అని అడిగాడు. రాజూ పండితుడూ ఒకరి మొహాలు ఒకరు చూచుకొని, అందరివంకా చూసి, తెల్లబోయి, కుర్చీలలో కూలబడ్డారు. వివేకవర్ధనుడు నవ్వుకున్నాడు. "మాన వుల్లోనే కాక, పశు పక్ష్యాదుల్లోకూడా జీవం ఉన్నదనుకుంటాను!" అంటూ చిలిపిగా సభాసదులవంక చూశాడు... సభంతా ఏకకంఠంతో "అవును! అవును!" అన్నది. వివేకవర్ధనుడు వెనకి తిరిగిచూశాడు. "చిత్తు! ఏమి సెలవు!” అంటూ సేవకుడు ముందుకువచ్చాడు. "మన తోటలో పెరుగుతూవున్న కోడి పుంజులలో ఒకదానిని పట్టుకురా” అని అజ్ఞాపించాడు, వివేకవర్ధనుడు, ఐదునిమిషాలూ ఐదుయుగాల్లా తోచింది. సభలోని రాజాలకూ, పండితులకూ, " ఈ దెబ్బతో ఈయనగారి సరుకు బయట పడుతుంది!" అని ఒకరాజు పక్కన కూర్చున్న మరోరాజు చెవిలో వూదాడు. " ఈ పరీక్షతో వివేకవర్ధనుడ్ల్ వస తేలి పోతుందిలే!" అని నసిగాడు ఒక పండితుడు పక్కనవున్న మరొక పండితుడితో. కోడిపుంజుతో సేవకుడు దర్బారు ప్రవే శించాడు. వివేకవర్ధనుడు కత్తితీసుకుని పుంజుతలను పరపర కోశాడు. తరవాత ఒకచేత్తో తలనూ ఒకచేత్తో మొండాన్ని, పట్టుకుని అందరికి చూపుతూ " కోడిపుంజుమరణించినట్టేనా?" అని ప్రశ్నించాడు. "చచ్చినట్టే' అన్నారు రాజులు. "జీవ రహితమైనట్టే" అన్నారు పండితులు, రాజాజ్ఞప్రకారం సేవకుడు కోడిపుంజు మొండాన్ని తలనూ సభాస్థలానికి ఆవైపునా యీవైపునా పుంచాడు. వివేకవర్ధనుడు జీవంలేని ఆ కోడిపుంజు మొండాన్ని వుద్దే శించి " నువ్వు పోయి నీతలను ఎప్పటిలా తగిలించుకో" అన్నాడు. ఆశ్చర్యం! కోడిపుంజు మొండెం సభా స్థలికి అడ్డంగా నడుస్తూపోయి ఆ తలడగ్గిర మెడ వంచింది. తల మొండెంతో కలిసి పోయింది. మరు నిమిషానికి లేచినిలబడి, రెక్షలుకొట్టుకుంటూ 'కొక్షా రోకో' అని అరుస్తూ దర్బారునుంచి బయటకు పరిగెత్తింది. భయాశ్చర్యాలతో సభలోని రాజులూ, పండితులూ వుక్కిరిబిక్కిరయ్యారు. ఒక్కమారుగా లేచి, తలలువంచి వివేకవర్ధనుడి గొప్పతనానికి జేజేలు పలికారు. "అన్ని అద్భుత విద్యల్ని ఎలా నేర్చారు ప్రభూ?" అని అడిగారు అంతా. "తెలుసుకొంటారా?" అన్నాడు రాజు. " తెలుసుకోవడమే కాదు, సాధించితీరా అనికూడా వున్నది" అన్నారు కొందరు. "అయితే వినండి!” అంటూ ప్రారం భించాడు వివేకవర్ధనుడు : "నాకు చిన్ననాటనే అద్భుత కార్యాలు చేయాలనీ, అపరశక్తుల్ని పొందాలనీ బల మైన కోరిక వుండేది. అందుకు సాహసం అవసరమని గ్రహించాను. ఈ ప్రపంచంలో అసాధ్యమైన ప్రతిదానినీ, సుసాధ్యంచేసే మార్గాలన్నీ ఒక గ్రంధంలో రాయబడి ఉన్నవని ఒక వృద్ధుడు నాతో చెప్పాడు. ఆ గ్రంధం ఇంద్రజాలిక పర్వతాల్లోని ఒకా నొక గుహలో వున్నదనికూడా చెప్పాడు. అనేక కష్టాలకూ, ఎంతో శ్రమకు ఓర్చి ఒకనాడు ఆ గుహ చేరాను. గాలీ, వెలుగూలేని ఆ గుహలో గుండె చిక్కబట్టుకుని కొంతదూరం పోగా, హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు నాకంటబడింది. నాశ్రమ తీరిం దనీ, ఆశలు ఫలించినవనీ నాకెంతో వుత్సాహం కలిగింది. తడబడుతూ ఆ వెలు గును సమీపించాను. ఆ వెలుగు ఒక నలుచదరపు గాజుపెట్టె లోనుంచి వస్తున్నట్టు మొదట్లో నాకు తోచింది. కాని బాగా పరీక్షించి చూడగా దానికి కారణం, ఆ గాజుపెట్టె మధ్యన వున్న ఒక పెద్ద గ్రంధమని గ్రహించాను. ఆతృతతో ఆ పెట్టెపై చేయివేశాను. అదే సమయంలో నాకు ఎదురుగా కొంచెందూరంలో నల్లని వికృతాకారం కారుమేఘంలా కదలటం చూచాను. మరు క్షణంలో వికృతమైన ధ్వని వినిపించింది. " ఏయ్! ఎవడవు నువ్వు? బయటికి పో!" అన్న భయంకర శబ్దం నన్ను హడలకొట్టింది. నేను భయాన్ని అణిచిపెట్టి "ఈ గాజుపెట్టెలోని ఆ గ్రంధం తీసుకో కుండా బయటికి పోను" అన్నాను. " అలానా ! అహ్హహ్హహ్హ !!" అన్న భయం కర గర్జనతోపాటు ఉరుములూ, మెరు పులూ, కడవపోతగా వానా ప్రారంభమయినై. భయంతో నేను వణికిపోయాను. దుష్ట శక్తులనుంచి రక్షణ చేసుకునేందుకు, చిన్ననాడు ఒక సిద్ధుడిద్వారా తెలుసుకున్న మంత్రాన్ని పెద్దగా ఉచ్చరింపసాగాను. పదినిమిషాల్లో వాన వెలిసింది. ఉరు ములూ, మెరుపులూ తొలిగిపోయినై. ఆ క్షణంలో కలిగిన సాహసంతో, గాజు పెట్టెను బలంగా గ్రుద్దేసరికి పెట్టె ముక్కలై పోయింది. ఆ దివ్యగ్రంధాన్ని రెండు చేతుల తోనూ హృదయానికి హత్తుకుని, గుహవెలు పలికి పరుగు పెట్టాను. నన్ను వెన్నాడుతూ, ఆ వికృతాకారం భయంకరంగా శపించసాగింది. " నువ్వునానుంచి తప్పుకోలేవు. నీకు పగలు విశ్రాంతి, రాత్రి నిద్రా లేకుండా చేస్తా. జాగ్రత్త!" అన్నది. అలానే జరిగింది.. నాలుగు దీర్ఘవత్స రాలు ఆ గ్రంధం నేను పఠించాను. ఎన్నెన్నో అద్భుత శక్తులను దానిద్వారా పాండగలిగాను, కాని నేను అందుకుగాను చెల్లించిన మూల్యం అపారం, నా ఆరోగ్యం, మనశ్శాంతి నశి, చింది. పగలూ, రాత్రి కూడా భయంకరమైన సరకంగా తయా రైంది. ఆఖరికి ఆ అద్భుత గ్రంథాన్ని సొంతంగా పఠించకుండానే, ఆ గుహలో ఎప్పటిచోటున ఉంచేసివచ్చాను. అయినా నాకు మనశ్శాంతి కలగకుండా అ భూతాత్మ నన్ను వెన్నాడుతూనే వుంది. శపిస్తూనే వుంది. నాకేమీ దారితోచలేదు. ఒకనాడు అడిగాను : "నీ గ్రంధం నీ గుహలోనే వుంచానుగదా! ఇంకా ఎందుకు సన్నిలా బాధిస్తావూ?" అని. ఆ వికృతా కారం మరింత వికృతంగా మారి బొబ్బ రించింది: " ఆ గ్రంథం చదివి నువ్వు అనేకమైన ఆపూర్వశక్తులు పొందావు. వాటిద్వారా లోకానికి నీనుంచి కీడుకలగవచ్చు.” "పరుల మేలుకే ఆ శక్తిని వినియో గిస్తాను. ప్రమాణుపూర్తిగా చెబుతున్నాను. నమ్ము!" అన్నాను. " సరే! అమాట నువ్వు నిలుపుకొన్నంతవరకూ నీజోలికి రాను" అంటూ ఆ భయంకర రూపం నన్ను వదిలిపోయింది. ఇదీ కథ.” దర్బారంతా గుసగుసలు ఆవరించినై. 'పరుల మేలుకోసమని మనం కోరి కీడెందుకు తెచ్చుకోవాలి! మనకు ఆ గ్రంధం అవస రమే లే దనుకున్నారు పండితులు. 'పర రాజ్యాలని జయించేటందుకూ, ప్రజల్ని శిక్టురుమనకుండా అణచివుంచేందుకూ పనికిరాని ఈగ్రంధం మనకేమి ఉపయోగ' మనుకున్నారు రాజులు.

No comments:

Post a Comment