Valluru Murali
పేదరాశిపెద్దమ్మ కథలు,కవితలు
Monday, 12 January 2026
ఒక పాలకుడి కథ
మొదటి భాగం: వాగ్దానాల వెల్లువ
త్రిలింగ దేశం చాలా సువిశాలమైన దేశం. సహజ సంపదలతో, జీవనదులతో,సుదీర్ఘ సాగరతీరం, మత్యసంపద, ఖణిజ సంపద కలిగి సుభిక్షంగా ప్రజలు సుసంపన్నంగా జీవిస్తున్నారు. ఆ రాజ్యాన్ని గతంలో చాలామంది రాజులు పాలించారు. చివరగా జగన్నాధవర్మ ఆ దేశానికి రాజయ్యాడు. రాజ్యం లో ప్రజలకు ఏ లోటూ లేకుండా ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. కానీ ఆ రాజ్యం లో చంద్రపాలుడు అనే వ్యక్తి సంపన్నుల్లో,రైతుల్లో, వ్యాపారుల్లో, ప్రభుత్వ అధికారుల్లో,సైన్యం లో తిరుగుబాటు తీసుకు వచ్చాడు. సంపన్నులకు "ఈ దేశ సంపద అంతా పేదవారికి పంచి పెడుతున్నాడు ఈ రాజు ఇలా అయితే అందరూ సంపన్నులు అయిపోతే మీకు పనిచేసేవారు, బానిసలూ ఉండరు. అనీ, రైతులతో "ఈ రాజు మీభూములను సంపన్నులకు కట్టబెట్టాలని చూస్తున్నాడు అనీ, పేదలందరికీ మీరు కడుతున్న పన్నులు ద్వరా వచ్చిన సంపద అంతా ఉచితంగా పంచిపెడుతున్నాడు. దానివలన మీ పొలాల్లో పనిచేయడానికి కూలీలు మీకు దొరకరు" అనీ, వ్యాపారులతో పేదవారి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడానికి విద్యాలయాలు ఊరూరా నిర్మిస్తున్నాడు ఈ రాజు. దీని వలన పేదలందరిలో చైతన్యం వస్తే వారు మీ వ్యాపార మెలుకువలూ మోసాలు తెలుసుకొని మిమ్మల్ని నిలదీస్తారు. రైతులు సరైన గిట్టుబాటు ధరను మీనుండి రాబడతారు. మీకు నష్టాలు వస్తాయి చూసుకోండి" అనీ, ప్రభుత్వోద్యోగులతో "నన్ను మీరు రాజు గా ఎన్నుకుంటే నేను మీ జీతాలను రెట్టింపు చేస్తాను,పని భారం తగ్గిస్తాను. మీరు చేసే అవినీతిని ప్రశ్నించను. మీ దోపిడికి అడ్డు చెప్పను" అని వాగ్ధానం చేశాడు. సైనికులకు జీతాలు పెంచుతానని,రాయతీలు కల్పిస్తానని, రాజధాని నగరం లో ఇల్లు నిర్మిస్తాననీ,సెలవులు మంజూరు చేస్తాననీ వాగ్ధానం చేశాడు. కొంతమంది అనుచరులను ఊరూరా నియమించి చంద్రపాలుని గురించి గొప్పగా ప్రచారం చేయించాడు. ఏ నోట విన్నా చంద్రపాలుడు గురించే... తన రహశ్య ఏజెంట్ల ద్వారా జగన్నాధవర్మ పై దుష్ప్రచారాన్ని ప్రజలకు చేరవేశాడు. ప్రజల్లో గొప్ప తిరుగుబాటు వచ్చింది. జగన్నాధవర్మ ను గద్దె దించేశారు ప్రజలు. చంద్రపాలుని తన రాజుగా పట్టాభిషిక్తున్ని చేశారు. కొత్తగా వచ్చిన 'చంద్రపాలుడూ పట్టాభిషేకం ముందు ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించాడు. "నేను భగవంతుని ప్రతినిధిని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు నన్ను భూమి మీదికి పంపించాడు, నేనే ఈ నదులను శృష్టించాను, పంచభూతాలు నా అధీనం లోనే ఉన్నాయి, నా పాలనలో కరువు,కాటకాలు ఉండవు, ఈతిబాధలు అసలే ఉండవు, ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు,పొలం ఉండేటట్లు చూసుకుంటాను, పన్నులు తగ్గిస్తాను, రాజ్యాన్ని స్వర్గధామం చేస్తాను" అని ఊరూరా చాటింపు వేయించాడు. ప్రజలు ఆ మాటలు నమ్మి, అతనికి బ్రహ్మరథం పట్టారు. చంద్రపాలునికి కిరీటాన్ని అప్పగించారు.
పట్టాభిషేకం రోజున చంద్రపాలుడు వీధుల్లో తిరుగుతూ, "ఈ మట్టి మీది, ఈ రాజ్యం మీది" అని ప్రసంగించాడు. రైతులు తమ నాగలిని పక్కన పెట్టి అతనికి నీరాజనాలు పట్టారు. కానీ, కిరీటం తల మీదకు రాగానే విజయవర్మ ఆలోచనలు మారిపోయాయి. అతనికి రాజ్యం మీద ప్రేమ కంటే, తన ఖజానా నింపుకోవడం మీదే ధ్యాస మళ్లింది.
రెండూ భాగం: అభివృద్ధి పేరుతో దోపిడీ
కొద్ది కాలం గడిచాక, విజయవర్మ తన కొలువులో ఉన్న మంత్రులతో రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ మంత్రులంతా అతని బంధువులే. "మన ఖజానా పెరగాలి, మన వారు సంపన్నులు కావాలి. దీనికి 'అభివృద్ధి' అనే ముసుగు వేయాలి" అని పథకం రచించారు.
మరుసటి రోజు చాటింపు మొదలైంది: "రాజు గారు రాజధానిని విస్తరిస్తున్నారు! ప్రపంచం చూడని అద్భుతమైన మహలులు, దేవాలయాలు విలాసవంతమైన రధ మార్గాలు , విదేశీ వ్యాపారస్తుల కోసం విలాసవంతమైన అతిథి గృహాలు నిర్మిస్తారు. విదేశీ వ్యాపారుల కోశం గిడ్డంగులు నిర్మిస్తారు, వాటికి సరుకులు చేరవేసేందుకు విశాలమైన రహదారులు, సముద్ర నుండి నేరుగా రాజధానికి రావడం కోసం కాలువలు నిరిస్తున్నందున రైతుల నుండి భూములు సేకరిస్తున్నారు. గ్రామాలు ఖాలీ చేయాలి. వారికి తరువాత నగరం లో నివాసాలు ఏర్పాటు చేస్యారు. రాజధాని విస్తరణ కోసం భూములను సేకరిస్తున్నారు.దీని కోసం నగర సరిహద్దుల్లో ఉన్న భూములన్నీ ప్రభుత్వ పరం కావాలి." అని చాటింపు వేశారు.
రైతులు హడలిపోయారు. తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న మాగాణి భూములు, పచ్చని పంట పొలాలు పాలకుల కన్ను పడ్డాయి. "ప్రజా ప్రయోజనం కోసం భూమిని త్యాగం చేయండి" అని సైనికులు బలవంతంగా సంతకాలు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఒక రైతు ఎదురుతిరిగి, "అయ్యా, ఈ పొలం పోతే మా ఆకలి తీరేదెలా?" అని అడిగితే, "నీకు రాజధానిలో చిన్న గది ఇస్తాం, అక్కడ కూలి పని చేసుకో" అని వెటకారంగా జవాబిచ్చారు.
మూడవ భాగం: పన్నుల భారం - స్వార్థపు కోటలు
భూములు లాక్కున్నది చాలక, చంద్రపాలుడు సరికొత్త పన్నులు విధించాడు. నగరంలోకి వచ్చే ప్రతి వస్తువు మీద, కట్టెలు కొట్టుకునే వాడి మీద, చివరకు గాలి మీద కూడా పన్ను వేశారు. ప్రజల వద్ద ఎంత బంగారం ఉన్నదీ అని ఒక సర్వే చేపట్టాడు. ఆ బంగారం పై ఆస్తి పన్ను విధించాడు. పండిన పంట పై 50% పన్ను విధించాడు. చదువుకోవాలంటే "గురు దక్షిణ" అనె పన్నును ప్రభుత్వం వసూలు చేసింది. "రాజధానిని నిర్మిస్తున్నాం కదా, ఆ ఖర్చు మీరే భరించాలి" అని తీర్మానించారు. సామాన్యుడి నడ్డి విరిగింది. విదేశి ప్రయాణం కోసం పది విలాసవంతమైన విశాలమైన అతి భారీ నౌకలను ఈజిప్ట్ రోం నగరాలనుడి కొనుగోలు చేసి తెప్పించాడు.
పేదవాడు ఆకలితో అలమటిస్తుంటే, రాజు గారు మాత్రం తన రాజమందిరంలో భారీ విందులు ఏర్పాటు చేసుకున్నాడు.
ఆ విందులకు ఆహ్వానితులు కేవలం రాజు గారి బంధువులు, మిత్రులు మాత్రమే. భూములు లాక్కున్న చోట పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలు వెలిశాయి. అవి ఎవరివి? రాజు గారి బావమరిదివి. కొత్తగా నిర్మించిన 'అతిథి గృహాలు' ఎవరివి? రాజు గారి ఆప్తమిత్రుడివి. నాటి తాళపత్ర గ్రంథాలయాలు రాజు గారి సోదరుడి సొంతం. ప్రభుత్వ అధీనం లో ఉన్న విద్యా సంస్థ లను విదేశీ వ్యాపారులకు అమ్మివేశాడు. వారు "గురుదక్షిణ"ను భారీగా పెంచివేశారు. దానితో పేద, మధ్య తరగతి వారు చదువుకు దూరం అయ్యారు.
వైద్యం తన బినామీలకు ధారాదత్తం చేశాడు. దానితో ఉచితంగా అందాల్సిన వైద్యం అందని ద్రాక్ష అయింది. రాజధాని నగరం విలాశవంతుల నిలయం అయింది.పేదవారికి అక్కడ చోటు లేకుండా అయిపోయింది ఆ నగరం లో ప్రవేశించాలంటే రాజ ముద్రిక ఉండాలి అది సంపన్నులకు, తన బంధువులకు స్నేహితులకు మాత్రమే స్వంతం.
అభివృద్ధి అయితేజరిగింది.. కానీ అది ప్రజలది కాదు, పాలకులది. రాజధాని వెలుగుల్లో రైతన్న కన్నీరు ఎవరికీ కనిపించలేదు. ఒకప్పుడు రైతు తన భూమిని నమ్ముకొని స్వశక్తి పై ఆధారపడి తన బ్రతుకేదో తను బ్రతికే వాడు. ముందు ఉండే రాజులు రైతన్నకు ఏలోటూ లేకుండా చూసుకున్నారు.కానీ ఈ కొత్తరాజు వచ్చేక కష్టాలు కూడా తోడయ్యాయి.పంట పండే నేల మీద రాతి కట్టడాలు మొలిచాయి. అన్నం పెట్టే అన్నదాత, తన సొంత భూమిలో సంపన్నుల కోసం నిర్మిస్తున్న మహా సౌధాలకు రాళ్ళెత్తే కూలీలుగా మారవలసి వచ్చింది.
నాల్గవ భాగం: చరిత్ర పునరావృతం
ఒక రోజు ఒక వృద్ధ రైతు రాజసభకు వచ్చాడు. రాజు ఎదుట నిలబడి, "ప్రభూ! మీ అద్దాల మేడల్లో మా కన్నీళ్లు ప్రతిబింబించడం లేదా? విదేశీ వ్యాపారస్తుల కోసం మా పొలాలను బలి ఇచ్చారు. రేపు ఆకలి వేస్తే మా పిల్లలకు ఈ రాతి ముక్కలను తినిపించమంటారా? మమ్మల్ని ఓడించి రాజ్యాన్ని గెలవలేదు మీరు, మమ్మల్ని మోసం చేసి గెలిచారు" అని ఎలుగెత్తి చాటాడు.
రాజు వికటాట్టహాసం చేశాడు. అతనికి రాజ్యాధికారం తలకెక్కింది.కళ్ళు నెత్తికి ఎక్కాయి. మదోన్మత్తుడు అయ్యాడు. ఎప్పుడూ తన బంధువులు, స్నేహితులతో విదేశీ యాణం. పరిపాలన మంత్రుల చేతిలో పెట్టాడు. మంత్రులు వారికి దొరికింది ప్రజలనుడి పన్నుల రూపం లో దోచుకుంటున్నారు. ప్రజలు వారి బాధలు చెప్పుకొనే అవకాశమే లేదు. రాజ్యం అవినీతి మయం అయిపోయింది.
కానీ చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. పన్నుల భారంతో విసిగిపోయిన ప్రజలు, భూములు కోల్పోయిన రైతులు ఏకమయ్యారు. వాగ్దానాలు మరిచిన పాలకుడిని గద్దె దించడానికి సమయం ఆసన్నమైందని గ్రహించారు. యువకులు,రైతులూ ఏకం అయ్యారు. ఒక్కసారిగా నగరం పైకి దండెత్తారు. ఈ హఠాత్ సంఘటణను చంద్రసేనుడు ఊహించలేకపోయాడు. సైన్యం వెల్లువా వచ్చిన ప్రజావాహినిని ఏమీ చేయలేక పోయింది. ఎదురొచ్చిన సైనికులను మట్టుప్ర్ట్టారు ప్రజలు దానితో మిగిలిన సైకులు ప్రజలతో చేతులు కలిపారు రాజధానిలోని సంపన్నుల ఇళ్ళలోకి చొరబడి దొరికిన సొత్తును సామాన్యులు దోచుకున్నారు. నగరాన్ని తగలబెట్టారు. నగరం విడిచి పారిపోతున్న రాజును ఆ మంటల్లో వేసి కాల్చేశారు. రాజ బంధువులను బంధించారు.
జగన్నాధవర్మకు మళ్ళీ పట్టం కట్టారు. ఇప్పుడు ప్రజలు ఏ ఈతిబాధలు లేకుండా సుభిక్షంగా జీవిస్తున్నారు.
అభివృద్ధి ఎవరికోసం?(కవిత) (రైతన్న వేదన)
ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన పచ్చని పొలం..
నేడు కాంక్రీటు అడవికి బలైపోతుంటే,
గుండె చెరువై కన్నీరు మున్నీరవుతోంది!
చెమట చుక్కలతో తడిపిన మట్టిలో..
నేడు జెండాలు పాతి, సరిహద్దులు గీస్తుంటే
నా పేగు తెంచుకుని పోతున్నట్లుంది!
రాజధాని అంటారు.. విమానాశ్రయం అంటారు..
ఎత్తైన భవనాలు, ధగధగలాడే మాల్స్ అంటారు..
కానీ, బుక్కెడు మెతుకు పెట్టే నా పొలం లేకపోతే
ఈ హంగులు, ఆర్భాటాలు ఎవరి ఆకలి తీరుస్తాయి?
డేటా సెంటర్ల వెలుగులు.. నా కంటి నిప్పును ఆర్పగలవా?
విమానాల హోరు.. నా గుండె కోతను వినిపించనివ్వదా?
మాగాణిని మింగేసి మహానగరాలు కడతారా?
రక్తపు చుక్కలను తుడిచేసి రంగుల లోకం చూపుతారా?
తాత ముత్తాతల ఆస్తి.. నా పిల్లల భవిష్యత్తు..
అభివృద్ధి అనే రంగు పూసి అంగట్లో పెడతారా?
అరక పట్టిన చేతులకు సంకెళ్లు వేసి..
అన్నం పెట్టే రైతును అనాథను చేసి..
ఎవరి కోసం ఈ అభివృద్ధి? ఎవరి లాభం కోసం ఈ వినాశనం?
నేల తల్లిని కోల్పోయిన రైతు కన్నీరు..
రేపు మీ నాగరికత పునాదులను కదిలించక మానదు!
మురళి
Tuesday, 6 January 2026
Valluru Murali( మురళీ): 🌴🌲🌳వృక్ష విలాపం🌳🌲🌴
నీ యాగం చేయాలని తలచి శాలకోసం,సమిధల కోసమని కలప తెద్దామని గొడ్డలి పట్టుకొని అడవికి వెళ్ళాను ప్రభూ!
ప్రభూ! పక్షుల కిలకిలా రావాలతో కాన కలకలలాడుతూ ఉంది.వనచరాలు చెంగుచెంగుమని చెట్లపైనుండి గంతులిడుతూ ఆనందపరవశమైయున్నవి ప్రభూ!
నేనొక మావితోటకడ నిల్చి చివాలున గొడ్డలెత్తి యో
మానును కొట్టబోవ తరులన్నియు జాలిగ నోళ్ళువిప్పి మా
పానము తీతువా యనుచు బావురు మన్నవి కృంగిపోతి నా
మానసమందెదో తళుకుమన్నది వృక్షవిలాప కావ్యమై......
అంతలో ఒక మామిడిచెట్టు మార్ధవ స్వరంతో యిలా అన్నది ప్రభూ!...
తే.గీ. మండువేసంగి మద్యాహ్నయెండ వేళ
సొమ్మసిల్లియు నానీడ సొలసినంత
చల్లగాలితో మిమ్ముల సాంతపరచి
కడుపు నిండుగ కమ్మని పండ్లనిత్తు.
తే.గీ.
రాళ్ళతో కొట్టిమమ్ముల రక్తమోడ్వ
పళ్ళనెన్నియో మీకును పంచినాము
కీడు చేసిన మీకు నేనాడు నైన
హాని చేయము మరి ఫలహారమిత్తు!
తే.గీ. మధుర ఫలము యన్న బిరుదముందిమాకు
భరత భూమిపై పుట్టిన భాగ్యమయ్యె!
ప్రాత్యదేశాల భూములపెరగబోము
పూర్వపుణ్య ఫలమునిట పుట్టినాము.
ఇంతలో ఆ చెంతనే ఉన్న చింతచెట్టు చింతిస్తూ యిలా అన్నది ప్రభూ!
ఆ.వె. విందులీయ పలుపసందులైనట్టియు
భక్ష్య,లేహ్య,చోహ్య భోజ్యములును
యెన్నియున్ననుగాని అన్నము కలుపగ
రసములేని విందు రక్తిలేదు.
ఇంతలో ఆ దగ్గరలో ఉన్న తాళవృక్షం తాళలేక తన గోడు ఇలా వెళ్ళగక్కింది ప్రభూ!
ఆ.వె. డబ్బు కల్గు వాని డాబాల కన్నను
పేదవాని పూరి పాక మేలు
కమ్మ నేతయిల్లు కమ్మని సౌఖ్యంబు
బయట యెండ యెంత మండుచున్న!!!
తే.గీ. పూర్వ కవులు మమ్ము పొత్తముగాజేసి
మధుర కావ్య కృతులు మలచినారు
కల్పవృక్షమనుచు కవులెల్ల గీర్తింప
కరిగి పోతి,మిపుడు కృంగిపోతి.
ఉ౹౹ విత్తనమేయలేదుగ!?నువెప్పుడు గుప్పెడు నీళ్ళనైననా
కుత్తుక లోపలన్ యిడిన కార్యము సల్పిన పుణ్యమైన నో
గత్తము వేయలేదు కడకేమియు సత్తువ సల్పినట్టుగా
కత్తుల తోడవచ్చితివి యాయువు తీయగ నేమి సేతుమే!
గాలిని గారవింతుము----- పేరడీ.....
ఉ౹౹ గాలిని చల్లబర్చెదము కానలవెంబడి పోయినట్టి మే
ఘాలకు వర్షమిచ్చు సహకారము చేసెదమోయి నమ్ముమా!
మేలును కల్గజేసెదము మీకును యిచ్చెద ప్రాణవాయువున్
తాలుము! చంపబోకుము! తల్లిగ మిమ్ముల సాకుదెన్నడున్
పుష్పవిలాపం లోని
"ఊలు దారాలతో గొంతుకురిబిగించి" అన్న పద్యానికి పేరడీ----
వృక్షవిలాపం లో----
తే.గీ. పెద్ద యంత్రాలతో మమ్ము పెళ్ళగించి
గుండెలోనుండి గొడ్డలి గ్రుచ్టి, దూర్చి
నడుము నడ్డగ రంపాన నరికి చంపి
మీరు చేర్తురు మమ్ముసా మిల్లు నందు
ఉ౹౹ విత్తనమేయలేదుగ!?నువెప్పుడు గుప్పెడు నీళ్ళనైననా
కుత్తుక లోపలన్ యిడిన కార్యము సల్పిన పుణ్యమైన నో
గత్తము వేయలేదు కడకేమియు సత్తువ సల్పినట్టుగా
కత్తుల తోడవచ్చితివి యాయువు తీయగ నేమి సేతుమే!
గాలిని గారవింతుము----- పేరడీ.....
ఉ|| గాలిని చల్లబర్చెదము కానలవెంబడి పోయినట్టి మే
ఘాలకు వర్షమిచ్చు సహకారము చేసెదమోయి నమ్ముమా!
మేలును కల్గజేసెదము మీకును యిచ్చెద ప్రాణవాయువున్
తాలుము! చంపబోకుము! తల్లిగ మిమ్ముల సాకుదెన్నడున్
| శ్రీకామినీవక్షు జితహిరణ్యాక్షు - భువనపాలనదక్షుఁ బుండరీకాక్షు వివిధగీర్వాణాద్యు వేదాంతవేద్యుఁ - బరమతత్త్వాపాద్యు భవరోగవైద్యు శోభితగుణధాము సురసార్వభౌము - మౌనిమానసహంసు మథితోగ్రకంసు శేషాహివరతల్పు సిద్ధసంకల్పు - నీలోత్పలవ్యూహ నీలాంబువాహ నీలాద్రిసంకాశు నిబిడప్రకాశు - నిర్మలతరదేహు నిగమాంతగేహు గోపాంగనాకుంభకుచశాతకుంభ - కుంభకుంకుమ చారుగురుతరాకారు వేణునాదామోదు విహితప్రసాదు - నవ్యక్తు నతవేద్యునాద్యు నద్వంద్వు నధ్యాత్ము నచ్యుతు నాద్యంతరహితు - నిర్గుణు నిఖిలాండనిర్మాణనిపుణు నిర్వాణు నిర్మలు నిత్యు నిశ్చింతు - సర్వజ్ఞు సాకారు సచ్చిదానందు సర్వతోముఖరూపు సత్యస్వరూపు - నఖిలహిరణ్యగర్భాండనాయకుని వివిధలోకాధీశు వేంకటాద్రీశు - నధిక తేజోమూర్తి నలరెడువాని గంగానదీజన్మకారణం బనఁగ - బొగడొందు తనపదాంభోజముల్ సూపి యింపొంద వైకుంఠ మిదియ సుమ్మనుచు - సొంపొంద వలకేలఁ జూపెడువాని ఘనదైత్యగర్వాంధకారంబు లెల్ల - మానుప దేదీప్యమానమై వెలుఁగు చక్రగదాశంఖశార్గంబు లెపుడు - తలకొని యిరువంకఁ దాల్చినవాని నరకంట సిరితోడ నలిగి భూకాంతఁ - గలసి యిద్దఱలోనఁ గైలాటమిడుచు వలపునఁ గడకంట నలరెడువాని - నెండవెన్నెలతోడ నేకమై కూడి రెండుకన్నుల సంధి రెట్టింపుచున్న - గగనంబు దాఁకినకన్నులవాని ద్రవిళాంగనాఘనస్తనమండలాగ్ర - పరిరంభ జృంభిసంభ్రమవిలాసముల బెరసినకుంకుమపీతాంబరంబు - కడఁగి రింగులువాఱఁ గాసించువాని బ్రహ్మాండమైయుండి బ్రహ్మమైయుండి - పరమాణువైయుండి పరమమైయుండి సచరాత్ముఁడై చరియించువాని - నమరాద్రితో మాద్రియగు వేంకటాద్రి నున్నతోన్నతలీల నుండెడువాని -శృంగారవిఖ్యాతి చెలువంబురీతి నొయ్యారములబాగు నొసపరిలాగు - రాజసంబులసొంపు రసికతపెంపు సరసత్వములచెల్మి చతురతకల్మి - సకలజనానందసంస్తుతిచేత వినివిని యొక బాల వికచాంబుజాక్షి - చెలువ కోకిలవాణి చిగురాకుఁబోణి తలఁపులవిశ్రాంతి తలిరాకు బంతి - వలరాజు చిగురెల్లి వలపులవెల్లి కడివోనిపూముల్కి కన్నులకల్కి - చిత్తంబు చిగురించి స్వేదంబు వెంచి సిగ్గులు వో సురిఁగి చింత లోఁబెరిగి - కాంక్షలఁ గడుఁ బొదలి గర్వంబు వదలి కోరికి మదిఁ బేరి కోపంబు మీఱి - వినుకలి దలపోసి వెరవులఁ బాసి వెట్టల కెదురేఁగి వెతలను గ్రాగి - యున్నంతఁ జెలిభావ మువిదలు చూచి యీముద్దరాలికి నీవిలాసినికి - నీపూవుఁబోడికి నేలొకో నేఁడు వివరింపఁ దలఁపులు వింత లై తోఁచెఁ - బంచశరాసక్తి ప్రభవింపఁ బోలు నింతలో మరుఁడు దండెత్తకమున్న పచ్చనివిలు చేతఁ బట్టకమున్న చిగురంపగమి చికిలి సేయక మున్న - కోకిల మద మెత్తి గొణఁగకమున్న కీరంబు వాయెత్తి కెలయకమున్న - రాయంచ లెదిరించి రాయకమున్న సుదతి కారామంబు చూపి మరుపిచ్చి - మాటలమాటున మఱపింత మనుచు నారామఁ దోడ్కొని యారామమునకుఁ - జనుచోట నెదిరె వసంతోత్సవంబు పాంథులనునుసిగ్గు బయ లైనరీతి - కారాకు లెడలి వృక్షంబులు నిలిచె తగ విరహులకోర్కి తలిరించె ననఁగ - నవకమై చిగుళులు ననిచె భూజముల వలరాజురాకకు వనమహీజములు - కలయఁ గట్టినమేలుకట్లో యనంగ నిండారఁ దరువులనీడలు నిండెఁ - గోల తమాల తక్కోల కాకోల తాల హింతాలకోత్తాలకుద్దాల - సాలబాలరసాల జాలనేపాల తారజంబీరమందారఖర్జూర - గంధఫలీకుండఘనపిచుమంద తరువులు విరువులై తలిరించి మించెఁ - దీఁగలు సోగలై తెగమాఱి పాఱె వనలక్ష్మి పూర్ణయౌవనవీథియందుఁ - గడఁగిమాధవుఁడు వేడ్కలఁ గ్రొత్తగాఁగ నొత్తిననఖపంక్తు లున్నచందమునఁ - గింశుకంబులు గోరగించి మోదించె గురువింద లిగిరించె గుత్తులు నించె - మాకందతరు లేచె మల్లెలు పూచెఁ బొన్నలు వికసించెఁ బొగడలు నించెఁ - బనసలు నెరిసె సంపంగలు విరిసె మలయజంబు లెలర్చె మరువంబు పేర్చె - నేవంకఁ జూచిన నెల్ల భూజములు శాఖోపశాఖ లసంఖ్య మై నిగుఁడ - బూవుగుత్తులచేతఁ బూపలచేతఁ బరిపక్వరసపూర్ణఫలములచేత - గగనమండల మెల్లఁ గలయ నందంద కప్పిన నిబిడాంధకారంబు దోఁపఁ - దారనివిరు లెల్లఁ దారలు గాఁగఁ గురియుపూఁదేనెల క్రొమ్మంచుమించ - మలయఁబుప్పొళ్లదుమారంబు రేఁగఁ గేలీగృహాంగణాంకితఘననూత్న - వజ్రప్రకాశదివ్యప్రభావలుల వెలుఁగొంది దట్టంపు వెన్నెల గాయఁ - గుముదాకరంబులఁ గూటంబు మాని కుముదాకరంబులఁ గొమరు దీపించి - పద్మరాగప్రభాప్రౌఢిమ వంపఁ బద్మరాగప్రౌఢిమ దోఁప - జ్యోతిర్లతాక్రాంతశోభితశ్రీలు బాలార్కకిరణసౌభాగ్యంబు లొదవ - సకలవనాంత విశ్రాంత పాంథులకుఁ బగలు రేలై తోఁచుఁ బరికింప రేలు - పగళులై తోఁచి విభ్రాంతి పుట్టించు నత్యంతవేగవిహారమారుతము - సొరిది నవ్వనవీథి సొచ్చినంతటను గడఁగి గందపుఁగొండకందువ మఱచి - క్రమ్మఱ నొకవంకఁ గదలిపోలేక ఫణిరాజముఖులకుఁ బసలు పుట్టించు - ఫణిరాజగోత్రసౌభాగ్యంబు మరఁగి కదిసి యాకాశగంగాతరంగముల - నాడెడునవ్యదివ్యాంగనాశ్రేణి కుచకుంభలిప్త కుంకుమములతోడఁ - జల్లుఁ బోరాడు నిచ్చలు నొక్కవేళ మాధవీనవలతామందిరామంద - సౌధవీథీఘనస్థలములు మెట్టి తీఁగెయుయ్యల లూఁగు దిన మొక్కవేళ - శ్రీవేంకటేశు నూర్జితకృపావేశు నినకోటిరుచిమంతు నిందిరాకాంతుఁ - గనుఁగొనఁ గోరి వేడ్కలు దొంగలింప సకలదిగంతర స్థలములనుండి - చక్కని చిక్కని జవరాండ్రు నడవ నడపులయెడల నెన్నడుములు బడలఁ - గస్తూరిపూఁతలు గరఁగి లోజాఱ శిరసులజవ్వాది చెక్కిళ్లఁ గాఱ - నలసతఁ గనుఁగ్రేవ నలరు కామినుల పయ్యద లెడలించి పాలిండ్లుదూరి - కుటిలకుంతలములఁ గునిసియల్లార్చి చిగురాకుఁబోడుల సేదలు దీర్చి - గొబ్బునఁ దావి దిక్కులఁ జోడుముట్ట నుబ్బున విహరించు నొక్కొక్కవేళఁ - తలకొని వనవీథిఁ దలవరివోలెఁ గార్తవీర్యుఁడువోలెఁ గంతుఁడువోలె - నాగరికుఁడువోలె నానావిధముల మలయుచు విహరించు మందానిలుండు - అంత నాకామినుల లందఱుఁ గూడి చల్లనినెత్తావి చల్లెడుచోటఁ - దూఁగుటుయ్యలలఁ కందువల చెందొవల కొలఁకులఁ గెలఁకులఁ గురివిందపొదల - భామలో రతిరాజు పసనిసామ్రాజ్య సీమలో రసికుల చిత్తంబులోని - ప్రేమలో యనఁగ గంభీరంబు మెఱసి కళుకులో చిగురాకు కరవాలుఁగొనల - తళుకులో విటులడెందములఁగాపాడు ములుకులో యనఁగ నిమ్ముల నుల్లసిల్లి - బాలలో పుష్పాస్త్రు బంగారు నాట్య శాలలో పూవింట జడికొన్న యంప - కోలలో తలఁపులో గుదికొన్న తాల్మి చీలలో యనఁగ నచ్చెలు లెల్లఁ గూడి - యవయవశ్రీల నొయ్యారంబుదొరయ ఘనవయోగర్వాంధకారంబు మెఱయఁ - దోరంపుటినరశ్మి దూఱక నిగుడి మత్తిల్లునవలతామంటపవీథిఁ - దఱచుచీకట్లు బిత్తరములు చిమ్మఁ దమముఖచంద్రవిస్తారదీధితులు - వెలుఁగొంద నలుగడ విహరించువారు దట్టంపు లేమావి తరువుల క్రింద - సొంపైన పూఁదేనె సోనలఁ దడిసి పొదరిండ్లచాటునఁ బొదిగొని నిలువ - తమముఖాంబుజములతావులఁ దగిలి పైకొన్న యలికదంబముల సందడికిఁ - దప్పించుకొని తొలఁగ దాఁటెడువారు చెలులతోఁ బడి దప్పి చెదరినసఖులు - రమణీయశుకపికారావంబు వినుచుఁ జెలికత్తెలో యని చీరెడువారు - మదవతీజనులకమ్మఁదనంపుఁబూవు బంతులసరసంబు పైకొనియాడఁ - జెదరినపుప్పొళ్ళచేఁ దొప్పఁదోఁగి సిబ్బెంపుమేనులఁ జెలఁగెడువారు - కొలికిఁదామరకొలంకులదండ (మెండు) నిలిచి తమతమమేనినీడలపొలుఁపు - గనుఁగొని యానాగకన్నెలో యనుచు వేడుకఁ బలుమాఱు వెఱఁగందువారు - నై సఖీరత్నంబు లంతంత నిలిచి లేమా విలాసంబు లేమావి మంచి - లేమావిఁజేచాఁపలేమా యటంచుఁ దిలకంబు దీర్పక తిలకించిచూడు - తిలకంబు మానినీతిలకంబ యనుచు నడుగుకందువ గోరియడుగు నశోక - మడిగెడు బోఁటి నీ యడుగు లాననుచు గర్ణికారంబు లాకర్ణింపఁ బలుకు - గర్ణికారమణీయకాంతిగా ననుచుఁ గురవకావలికిఁ జేకుఱ వకావిరులు - కొమ్మకౌఁగిటఁ జేర్చుకొమ్మకాయనుచుఁ గేసరంబుల బోఁటి కేసరంబులుగ - వారుణిఁదోఁచు దైవాఱగా ననుచుఁ జతురభావంబుల సరసభాషణము - లాడుచు విహరించు నంతలోపలను వనపాలకాంతలు వనవిలాసినులు - పొదిగొన్న చక్కని పుష్పకోమలులు గర్వంపుఁజూపుల కమలలోచనులు - కైసేసి శృంగారగరిమలు వొదల నఖిలలోకేశుమోహనమూర్తిఁ గాంచి - ప్రణయపూర్వకముగాఁ బ్రస్తుతి చేసి యోదేవతారాధ్య యోభక్తసాధ్య - యోలోకమందార యోభవదూర యోవేంకటాద్రీశ యోకృపావేశ - శృంగారవనకేలిఁ జిత్తంబు గలిగి విచ్చేసి వేడ్కల విహరింపవలయుఁ - గోనేటిదరి నున్న కొదమసంపెంగ తరువులు వికసించెఁ దముఁ గానరావు - గుఱిలేనిపువ్వులు గురిసి క్రిక్కిఱిసి పరవనిచోట్లెల్లఁ బాన్పులై చూడఁ - బొగడల విశ్రాంతి పొగడ నచ్చెరువు పొదిగొన్న సేవంతిపొదరిండ్లక్రిందఁ - బలుమాఱుఁ గురిసినపన్నీటిసోన పలవల నునుజాలువాఱి దైవాఱి - యేఱులై యేప్రొద్దు నీఁతలఁ బాఱు గందంపుమ్రాఁకులకడ నున్నఫణులు - చందనగంధులసౌరభంబునకుఁ బైకొని మైగాలిఁ బసివట్టి తిరుగు - మెలఁగు మయూరగామినులౌట యెఱిఁగి తఱచైనఘనసార తరువులక్రిందఁ - బొర లూడి రాలుకర్పూరంపుసిరము తిన్నలై విహరింపఁ దిన్ననై యుండు - నని యని తరితీపు లతివలు వలుక నఖిలలోకారాధ్యుఁ డతికృపామూర్తి - మగువల వయసు లామనికొల్లకాఁడు భామల తలఁపులోపలి గారడీఁడు - వెలలేని వలపుల వేడుకకాఁడు కోనేటిరాయండు కుంభినీస్వామి - శ్రీవత్సధారుఁ డాశ్రితవత్సలుండు వెలఁదులమాటలు వేడ్క దీపింపఁ - జిత్తాబ్జమునఁ జేర్చి చిఱునవ్వు నవ్వి యత్యంతరూపమహామూర్తి గాన - నఖిలశృంగారాబ్ధి కధిపతి గాన సకలవైభవమహోజ్జ్వలతఁ బెంపొంది - గమనోన్ముఖుం డైనగదలు దానెఱిఁగి పాదారవిందసంస్పర్శంబు సేయఁ - గోరిక దలకూడఁ గుండలికర్త (భర్త?) పసిఁడిపాదుకల స్వభావమై నిలువఁ - గైకొని మెట్ట నక్కడిచోటు లెల్లఁ బ్రతిపదంబును మోక్షపదములై నిలువ - నింద్రాది దిక్పతులిరువంకఁ గొలువఁ గమలభవాదులు గదిసి తో నడవఁ - గిన్నర గంధర్వ ఖేచర యక్ష గరుడ విద్యాధర గాన మానములు - వీనుల కిం పొంద విందులు సేయ విరివైన యుద్యానవీథులు సొచ్చి - విశ్రాంత భూముల విహరించుచోట నేవేళ నేకాల మెక్కడఁ దలఁచె - నావేళ నాకాల మక్కడఁ గలిగి సకలపదార్థగోచరములై యుండి - చతురవిద్యాగోష్ఠిఁ జరియించునంత నఖిలాదినాథు మోహన మహామూర్తిఁ - బలుమాఱు మును విన్న భామాలలామ చెలులకు మన సీక చిత్తంబు రాక - పొలుపైనయలవోకఁ బ్రొద్దులు వోక సఖులతోఁ బుష్పాపచయకేలిఁ దగిలి - యున్నంతఁ జెలిభావ మువిదలు చూచి పువ్వులు జడిగొన్న పొదరిండ్లు దూఱి - కాంతల నొండొంటిఁ గడవంగఁ బాఱి తఱచైనవిరు లెల్లఁ దమ వని కోరి - చెదరిన లతలెల్లఁ జేరంగఁ దీసి యందనిక్రొవ్విరు లందంది కోసి - తావి వోవకయుండఁ దలిరులు మూసి రాలినపుప్పొళ్లు రాసులు చేసి - యనిలంబు కెదురు మహాఫణి వ్రాసి తుమ్మెదదాఁటులఁ దొలఁగఁ దూపొడిచి - పై కాపుగాఁగ సంపంగలు ముడిచి చేతులపన్నీరు చెలులపైఁ దుడిచి - పయ్యదఁబూఁదేనె పలుమాఱుఁ బిడిచి యారామవీథుల నతివలు మెలఁగి - యొఱపైన చోటుల నొయ్యనఁ తొలఁగి దట్టంపువిరు లెల్లఁ దమవని చెలఁగి - మరునమ్ములో యని మదిలోనఁ గలఁగి బింబంబు లని యోష్ఠబింబంబులకును - బైకొన్న చిలుకలఁ బట్టంగఁ దలఁచి వల నైనకరపల్లవంబులు చాఁపఁ - బల్లవంబులభ్రాంతిఁ బదరి కోయిలలు చేరినఁ బయ్యెదచెఱఁగులఁ జోఁపఁ - బయ్యదబయ లైన పాలిండ్లు చూచి జక్కవదోయిమచ్చరమున మొరయఁ - గరమూలరుచుల బంగారుతో బెరయ నుబ్బునఁ జనుఁగవ లొండొంటినొరయ - నొసలికస్తూరులునూఁగురుల్ బెరయ వలఁతులై పొలఁతులు వనవిహారములఁ - బొదలిక్రొవ్వులు మించఁబువ్వులుగోసి శంబరారాతిఁ బచ్చనివిలుకానిఁ - బచ్చపుల్గుల తేరిపైన బిత్తరిని బొదిగొన్న కమ్మఁదూపుల పోటువాని - దనరిన చంద్రకాంతపు వేదిమీఁదఁ దలఁపులోపలివానిఁ దగవారఁ పూఁచి - పొలుపొందఁ బువ్వులఁ బూజలు చేసి యొప్పైనపూఁదేనె నుపహారమిచ్చి - మ్రొక్కుచుఁ దాంబూలములు సమర్పించి సరససంగీత ప్రసంగ వాక్యములఁ - బ్రొద్దులు పుచ్చుచుఁ బొలఁతు లున్నంత వైభవంబుల వనవాటికలందు - విహరించుచున్న గోవిందు ముకుందు సత్యభామాకాంతు సకలవిశ్రాంతు - తిరువేంకటాద్రీశు దేవదేవేశు భానుకోటిస్ఫూర్తి భాసిల్లువాని - పంచాస్త్ర కోటి సౌభాగ్యంబువాని గోటానఁ గోటులై కొలఁదులు మీఱి - గుఱు తిడఁగా రానిగుణములవాని రాకకు వెఱఁగంది రాకేందు వదన - రాకవెన్నెలలఁ బరా కైనకాంత చెలులపై నలులపైఁ జిత్తంబు వదలి - కురులపై విరులపైఁ గోర్కులు సడలి పికముపై శుకముపైఁ బ్రేమంబుమఱచి - నతనురాకకునుగూర్చినతనురాకకును దొలఁగక పులకలు తోఁ ద్రోపులాడఁ - దలకొన్నకనుఁగ్రేవ తపములు వీడ నుడివోనినునుసిగ్గు లూడనిఁబాడ - నంతంత మరుబలం బచ్చన లాడ నిరువురచిత్తంబులెదుళులుచూడఁ - బరువులో మురువును భయములోవెరువుఁ జిత్తంబుతిమురును జెక్కులచెమరు - భావంబుకదలును బలుకులోఁ గొదలు మానంబు మఱపును మరుచేతివెఱపు - నలకలజాఱును నలసంబుతీరుఁ గ్రాఁగినమతి నొప్పి కనుఁగ్రేవ డప్పి - చెలికత్తెమూఁపుపైఁ జేర్చినచేయి యల్లార్చి ఱెప్ప వేయనికన్నుదోయి - తనమేయిఁ జెలి దండ దాఁచినబాగు నంతలో మైమఱ పైయున్నలాగు - కనుఁగొని చెలులెల్లఁ గడు వెఱఁగంది యలరినవేడ్కల నబ్జాక్షిఁ జూచెఁ - జూచినయంతన సూనాస్త్రగురుఁడు జూపులు తూఁపులై సోఁకె నొండొరులఁ - దనరాజ్యలక్షణోత్తర మైన తన్విఁ గప్పంబుగా నిచ్చెఁ గందర్పుఁ డనఁగ - గంభీరనాయకుఁ గాంచెనో యనఁగఁ దీపులవిలునారితిండి మోపెట్టి - పూవుఁదూపులయంపపొది వెంటఁగట్టి చిన్నారివిరిదమ్మిచిలుకుఁ జేఁబట్టి - యల్లన పొడచూపె నారతిరాజు ఈయింతితో విభుఁ డింపొందు ననుచుఁ - నేపునఁ గీరంబు లేచి పై రొప్పె నీకొమ్మ మదికోర్కులీడేఱు ననుచుఁ - జాలిచేరువఁదీర్చె జక్కవదోయి తరలాక్షి మదిలోన దరికొన్న విరహ - మాఱెడువీపుగా పనెడుచందమున నుబ్బునఁ బైవీఁచె నొయ్యనిగాలి - కమలామనోనాథు కరుణాకటాక్ష వీక్షణం బతివపై వెల్లిగొన్నట్లు - పరిపూర్ణచంద్రికాప్రభలు పైఁ బర్వఁ గడిమి నుద్దీపనకారణం బగుచు - లావుగా మరునిబలం బెల్ల నొదరఁ గడు నింపులై యుండఁ గారింపు లౌను - నెలమిఁ గారింపులేయింపులై యుండుఁ బ్రియములైనవియె యప్రియములైయుండు - నప్రియంబులె ప్రియంబై యుండుఁ జూడ నాలోనఁ జెలులెల్ల నాలోలనేత్రఁ - బరికించి విరహతాపస్ఫూర్తి దెలిసి యీరామపోరాము లేమిట మాను - నీకాంతవలవంత లేవంకఁ దీరుఁ జూడదు తలయెత్తి శ్రుతి దండెఁ గూర్చి - పాడదు చెలులెల్లఁ బైకొన్న సరస మాడదు చిలుకతో నందంపుమాట - లాడదు వెడమాఁట లాడెడిఁగాని కొంచదు ప్రాణంబు గుఱుతుగాఁజేసి - యెంచదు వీణె వాయించదు పరిణ మించదు మది సంభ్రమించదు చెలియ - కించుకేనియును సయించదు కాని కప్పదు చనుదోయి కనుఁ గ్రేవఱెప్ప - విప్పదు తనప్రాణవిభుమీఁదిమనసు త్రిప్పదు మదిలోన దీకొన్నప్రేమ - చెప్ప దెవ్వరితోడఁ జెప్పునోకాని పెట్టదు కస్తూరి పేర్కొని చేతఁ - బట్టదు సేవంతిబంతి నెత్తమ్మి ముట్టదు సిగ్గుల మొద లించుకైనఁ - బుట్టదు తలఁ పెందుఁ బుట్టునోకాని తాపంబు మేనఁ బ్రతాపింపఁ దొడఁగె - నూర్పులు మిగుల నిట్టూర్పులై నిగుడెఁ బగలెమృగాక్షికి వ(ఁబ?)గలుగాఁ జొచ్చె - రాత్రులింతికి శివరాత్రులై తోఁచె శిశిరోపచారవిశేషభావనలు - సేయంగవలె నని చెలులెల్లఁ గూడి పైకొని యేప్రొద్దుఁ బన్నీరువారిఁ - బూచిన గొజ్జంగపొదరింటిలోను బద్మాక్షిఁ జల్లనిపాన్పుననునిచి - యొడఁగూర్పఁదొడఁగిన నుపచారవిధులు పలుమాఱు విపరీతభావంబులైన - ముగ్ధలు తమలోన మోములు చూచి యంతంత నొకరొక రచనలు చేసి - యీవేళఁ దడ వేల హేలావిశాల శశికాంతమణికాంత సౌధాంతరములఁ - జలువలనెలవులఁ జంద్రాస్య నునిచి గుప్పుఁడు పుప్పొళ్లు కుచములమీఁదఁ - గప్పుఁడు చెంగావి కప్రంపుబడిమి త్రిప్పుఁడు చెలులెల్లఁ దిరిగిరానుండఁ - జెప్పుఁడు మనవులఁ జెప్పెడి దేమి చిలుకుఁడు పూఁదేనె చెలిమేన నిండ - నలుకుఁడు శ్రీగంధ మప్పటప్పటికిఁ గులుకుఁడు పన్నీరు కోమలితోడఁ - బలుకుఁడు పలుమాఱుఁ బలుకరింపుచును బాయుఁడు నునుగాలి పైకొననిండు - ద్రోయుఁడు సొబగైనతొలువిరులెల్ల వేయుఁడు కమ్మఁగ్రొవ్విరులు పైపైని - సేయుఁ డింతటిలోన శీతలక్రియలు అనుచు శైత్యోపచారాదులు సేయ - నల్లనల్లన తాప మగ్గలం బైన ధవళాక్షి యున్న చందము చూచి చెలులు - కంటికిఁ గలకంఠకంఠిభావంబు జ్ఞానమొక్కటియు నజ్ఞానంబు నూఱు - మాటాడు టొక్కటి మౌనంబువేయి తాలిమి లేశంబు తమకంబు లక్ష - కోరికమదిలోనఁ గోటానఁగోటి మణుఁగులైయున్నవి మగువకు నేఁడు - తనప్రాణవిభునిఁ గందర్పుని గురునిఁ దేకయుండిన నింతిఁ దేర్పంగరాదు - పోక మీరిపు డలవోక సేసినను రాకనేఁడతఁడు నిరాకరించినను - అదయుండుమరుఁడు తీవ్రాస్త్రకోవిదుఁడు ఒడ లెఱుంగకయుండు నొక్కొక్కవేళ - నెంతకు నలుగునో యీయింతిమీఁద నని యందులోఁ బ్రోడయగుమేటిబోటి - యుడివోనిభయమేలయోచెలులార కరుణాకటాక్షు లోకైకసంరక్షు - శరణాగతత్రాణు సకలపారీణు విశ్వలోకేశు శ్రీవేంకటాధీశుఁ - గనుఁగొని యీబాల గాసిల్లియున్న చందంబు విభుఁడు మెచ్చఁగ విన్నవించి - విచ్చేయునట్లు గావించి తేకున్న నెచ్చెలులార నానేర్పు లేమిటికి - నని చెలిఁ జెలులతో నప్పనచేసి కదలి మోహనమూర్తి కడకేగి యంత - సకలసురాసురసంఘంబులెల్ల నంతరాంతరముల నంతంత నుండి - యేకాంతసుఖగోష్ఠి నింపొందువాని గనుఁగొని పూగుత్తి కానుక యిచ్చి - మ్రొక్కి హస్తాంబుజంబులు మోడ్చిపలికె దేవ జగన్నాథ దేవతారాధ్య - యఖిలాండధౌరేయ యార్తవిధేయ యారామసీమావిహారాంతరముల - మారామ నీరూపు మహనీయమూర్తి గన్నులపండువుగాఁ గనుఁగొన్న - యంతనుండియును బుష్పాయుధుఁ డేయు తలిరంపగమి నొంప ధరియింపలేదు - ఎటువంటి మోహంబొ యెట్టితాపంబొ యేలాగుతమకంబొ యేమిభావంబొ - యేచందములచూపొ యేతరితీపొ తొలిచూపు నీరూపు తొలఁగుటలేదు - కన్నీరు మున్నీరు కడగానరాదు చెలియున్నవిధమును జెప్పకపోదు- తరళాక్షి దురవస్థ తలఁపగాఁ గాదు ఇంతట విచ్చేసి యింతి మన్నించి - కంతుసామ్రాజ్యసౌఖ్యముల నొందింపు మని విన్నవించిన యబ్జాక్షిఁ జూచి - తలఁపులు తలఁపులు తార్కొని యుండఁ జిత్తంబు చిగురొత్తఁ జిఱునవ్వు నవ్వి - భామకు మౌక్తికాభరణంబు లిచ్చి మది నుబ్బి పన్నీట మజ్జనం బాడి - రసికతఁ బీతాంబరము దిండు దీర్చి మృగమదపంకంబు మెయి నిండఁ బూసి - పారిజాతాదిపుష్పము లెల్ల ముడిచి సౌపర్ణవాహనోజ్జ్వలతఁ బెంపొంది - విద్యాధరాహ్లాదవీణానినాద గానామృతాంభోధికల్లోలములను - నుబ్బుచు నంతంత నోలలాడుచును జంద్రాస్య యున్నపూఁజవికె కేతెంచి - యల్లన దర్వీకరాంతకు డిగ్గి కొలిచి వచ్చినదేవకోటుల ననిచి - కామినిభావంబుఁ గనుఁగొనునంతఁ గుసుమాస్త్ర తాపసంకులత వహించి - యలరుఁ బానుపుమీఁద నందందపొరలఁ జెలిమేన నంటినచెంగల్వఱేకు - లెలమిఁ గాంతునిరాక కెదుళులు చూచు గతి నొప్ప నిలువెల్లఁ గన్నులై యమరఁ - గ్రాఁగినగందంబు క్రమ్మఁ బన్నీటఁ దోఁగినచెంగావి తొడరి శైత్యమునఁ - గ్రాఁగినహృదయంబు రతిరాజుచేత మ్రాఁగినమతియుఁ బ్రమాదంబువలన - నీఁగినవగలును నేత్రాంబుధార లాఁగినఱెప్పలు నైయున్నయింతిఁ - గనుఁగొని కరుణావికాసచంద్రికలు నీలోత్పలాక్షిపైఁ నిండంగఁ జల్లి - భామిని యున్నపూఁబానుపు చేరి చిట్టంటుచేఁతల సేదలు దీర్చి - చెదరినయలకలచిక్కెల్లఁ దీర్చి యెడలేనిపులకలయింపు పుట్టించి - కళలమర్మంబులకడ గానుపించి యాలింగనాదిసౌఖ్యముల నొందించి - కరఁగించి మరగించి కలికిఁ గావించి యుడివోనిసురతాబ్ధి నోల లాడించి - చిత్తజసామ్రాజ్యసింహాసనమున బాలికారత్నంబుఁ బట్టంబు గట్టి - యరవిరిసిగ్గులు నాత్మనిగ్గులును మితిలేనితావులు మెఱుఁగుమోవులును - గనుఁగ్రేవకెంపులుఁ గలికిసొంపులును ముద్దులేఁ జెమరును మోములకొమరుఁ - గలిగినశృంగారగరిమలతోడ వందిమాగధుల కైవారంబుతోడ - సిద్ధవిద్యాధరశ్రేణులతోడఁ దనతోడఁ గూడినతన్వంగితోడ - వృషభాద్రినాథుఁ డుర్వీసతిప్రియుఁడు వేడ్కతో నగరప్రవేశంబు చేసె - నని భక్తిఁ దిరువేంకటాద్రీశుపేరఁ గారుణ్యలక్ష్మీప్రకాశునిపేర - రాజితాఖిలలోకరక్షణుపేర లాలితబహుపుణ్యలక్షణుపేర - పృథులదానవసైన్యభీషణుపేర భూరికౌస్తుభరత్నభూషణుపేర - గురుభరద్వాజైక గోత్రపావనుఁడు నందాపురీవంశనాయకోత్తముఁడు - అనఘుఁడు తాళ్లపాకాన్నయార్యుండు మధురంపుశృంగారమంజరి చెప్పె - ధరమీఁద నాచంద్రతారకం బగుచుఁ గడిమిఁ బెంపొందు మంగళమహాశ్రీల శ్రీకృష్ణార్పణమస్తు - మంగళమహా శ్రీ శ్రీఁ జేయు\న్ |
| శ్రీమతే రామానుజాయ నమః తాళ్లపాక యన్నమాచార్యులు తిరువేంగళనాథ దేవునికి విన్నపము చేసిన శృంగార మంజరి. |

న్యాయ విజయం
1. నేపథ్యం: చంద్రగిరి వైభవం మరియు బలరాముని త్యాగం
చంద్రగిరి రాజ్యం ఒకప్పుడు ధర్మబద్ధమైన పాలనకు, సుభిక్షమైన పంటలకు నెలవు. ఆ రాజ్యానికి ప్రతాప వర్మ మహారాజు. ఆయన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు. ప్రతాప వర్మ వద్ద బలరాముడు అనే అజేయమైన సేనాధిపతి ఉండేవాడు. బలరాముడు యుద్ధతంత్రంలో నిష్ణాతుడు, కత్తిసాములో అతనికి సాటివచ్చే వారు ఆ రాజ్యంలోనే లేరు. పొరుగు దేశాలతో జరిగిన మహా సంగ్రామంలో బలరాముడు తన ప్రాణాలను పణంగా పెట్టి రాజ్యాన్ని రక్షించి, వీరమరణం పొందాడు.
బలరాముని మరణం రాజును తీవ్రంగా కలచివేసింది. ఆయనకు కృతజ్ఞతగా, బలరాముని కుటుంబానికి అపారమైన ప్రకృతి సంపద గల ఒక సారవంతమైన జాగీరును కానుకగా ఇచ్చాడు. బలరాముని కుమారుడు అజయ్. తండ్రి పోలికలతో, పదహారేళ్ల ప్రాయంలోనే దృఢమైన దేహదారుఢ్యం, చురుకైన కళ్ళతో ఉండేవాడు. తండ్రి మరణం తర్వాత అజయ్ తన పన్నెండవ ఏటనే జాగీరుకు వారసుడయ్యాడు. చిన్నవాడైనప్పటికీ, తన తండ్రి శిష్యుడైన వినయ్‌తో కలిసి యుద్ధ విద్యలను నిరంతరం సాధన చేసేవాడు.
2. కుట్ర: క్రూరసేనుని దురాశ
ప్రతాప వర్మ మేనల్లుడు క్రూరసేనుడు. అతడు పరమ ధూర్తుడు, అధికార కాంక్ష కలిగినవాడు. అజయ్ జాగీరు ఎంత సారవంతమైనదో, అక్కడ ఎంతటి బంగారం పండుతుందో విన్న క్రూరసేనుడు, ఆ భూమిని ఎలాగైనా తన వశం చేసుకోవాలని కుట్ర పన్నాడు. అజయ్ చిన్నపిల్లాడని, అతడిని దారిలోనే మట్టుబెడితే రాజుగారు ఆ జాగీరును వెనక్కి తీసుకుంటారని, అప్పుడు తన మేనమామను బ్రతిమాలి ఆ భూమిని తనే కాజేయవచ్చని పన్నాగం పన్నాడు.
అజయ్ తన జాగీరు పనుల నిమిత్తం, రాజుగారిని దర్శించుకోవడానికి రాజధానికి వస్తున్నాడని తెలుసుకున్న క్రూరసేనుడు, తన అనుచరులతో కలిసి నగరం వెలుపల ఉన్న దట్టమైన అరణ్యంలో మాటువేశాడు.
3. అరణ్యంలో పోరాటం: మలుపు తిరిగిన కథ
ఒక చల్లని ఉదయం, అజయ్ మరియు వినయ్ తమ గుర్రాల మీద అరణ్య మార్గంలో పయనిస్తున్నారు. పక్షుల కిలకిలరావాలు తప్ప మరే శబ్దం లేని ఆ ప్రదేశంలో ఉన్నట్టుండి కొందరు సాయుధులు దారికి అడ్డంగా నిలిచారు. క్రూరసేనుడు గుర్రంపై ముందుకు వచ్చి, "ఆగండి! ఈ దారిలో వెళ్లాలంటే సుంకం చెల్లించాలి" అని హుంకరించాడు.
అజయ్ వినయంగా, "మేము మహారాజు దర్శనానికి వెళ్తున్నాము, మమ్మల్ని ఆపకండి" అన్నాడు. కానీ క్రూరసేనుడు వెటకారంగా నవ్వి, అజయ్ మిత్రుడైన వినయ్‌పై ఒక్కసారిగా దాడి చేశాడు. వినయ్ గుర్రం మీది నుండి కింద పడిపోవడంతో అజయ్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
"నిరాయుధుడిపై దాడి చేయడం వీరలక్షణం కాదు!" అంటూ అజయ్ మెరుపు వేగంతో తన కత్తిని దూశాడు. క్రూరసేనుడు తన కత్తిని ఎత్తేలోపే, అజయ్ కత్తి గాలిలో ఒక మెరుపులా మెరిసి, క్రూరసేనుడి తలను శరీరం నుండి వేరు చేసింది. అది చూసి మిగిలిన భటులు భయంతో పారిపోయారు.
4. రాజదర్బారులో విచారణ
వార్త రాజధానికి పాకింది. ప్రతాప వర్మ తన మేనల్లుడి శవాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. అజయ్‌ను బంధించి దర్బారుకు తీసుకువచ్చారు. "నా మేనల్లుడిని చంపిన నీకు మరణశిక్షే సరైనది!" అని రాజు గర్జించాడు.
కానీ వృద్ధ మంత్రి మరియు వినయ్ ముందుకు వచ్చి, "మహారాజా, అజయ్ ఆత్మరక్షణ కోసమే ఆ పని చేశాడు. ముందుగా దాడి చేసింది క్రూరసేనుడే. విచారణ లేకుండా శిక్ష విధించడం ధర్మం కాదు" అని మొరపెట్టుకున్నారు. ప్రతాప వర్మ కోపంతో ఊగిపోతూ, "సరే, ఇతను నిరపరాధి అని నిరూపించుకోవాలంటే ఒక కఠిన పరీక్షను ఎదుర్కోవాలి. సింహపురి అనే ప్రాంతంలో ప్రజలను పీడిస్తున్న గండ భైరవ అనే రాక్షసుడిని చంపి, అక్కడి రాజు వద్ద ఉన్న పవిత్రమైన 'వజ్ర ఖడ్గాన్ని' తీసుకురావాలి. అది సాధ్యమైతేనే ఇతను ప్రాణాలతో మిగులుతాడు" అని అసాధ్యమైన షరతు విధించాడు.
5. సింహపురి సాహసం: గండ భైరవుని అంతం
అజయ్ వెనకడుగు వేయలేదు. ఒంటరిగా అడవులు, కొండలు దాటుకుంటూ సింహపురికి చేరుకున్నాడు. అక్కడ గండ భైరవుడు అనే రాక్షసుడు ఒక పెద్ద లోయలో నివసిస్తూ, ఆ ఊరి ప్రజలను భయపెడుతుండేవాడు. అజయ్ తన తెలివితేటలతో ఆ రాక్షసుడిని ఒక ఇరుకైన ప్రదేశానికి రప్పించి, తన కత్తి నైపుణ్యంతో ఆ రాక్షసుడి హృదయాన్ని చీల్చి వేశాడు. ఆ రాక్షసుడి మెడలోని రత్నాల మాలను విజయానికి గుర్తుగా తీసుకున్నాడు.
6. సింహపురి రాజభవనం మరియు చంద్రలేఖ వివాహం
అజయ్ సింహపురి రాజభవనానికి చేరుకున్నప్పుడు అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. సింహపురి రాజు తన కుమార్తె చంద్రలేఖకు వివాహం నిశ్చయించాడు. కానీ ఆ పెళ్లికొడుకు ఒక క్రూరమైన మాంత్రికుడని, అతడిని పెళ్లి చేసుకోవడం చంద్రలేఖకు ఇష్టం లేదని అజయ్ తెలుసుకున్నాడు. సరిగ్గా వివాహ సమయంలో అజయ్ సభలోకి ప్రవేశించి, ఆ మాంత్రికుడి నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ఆ మాంత్రికుడు దాడి చేయగా, అజయ్ అతడిని ఎదుర్కొని వీరోచితంగా పోరాడి అంతం చేశాడు.
మహారాజు అజయ్ పరాక్రమానికి ముగ్ధుడై, "నీవు నా కుమార్తె ప్రాణాలను, గౌరవాన్ని కాపాడావు. ఈ వజ్ర ఖడ్గం నీకు బహుమతిగా ఇస్తున్నాను. అంతేకాదు, నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను" అని ప్రకటించాడు.
7. చంద్రగిరి తిరుగు ప్రయాణం మరియు ముగింపు
వజ్ర ఖడ్గంతో, కొత్త ఉత్సాహంతో అజయ్ చంద్రగిరికి తిరిగి వచ్చాడు. అతడిని చూసి ప్రజలు జయజయధ్వానాలు చేశారు. ప్రతాప వర్మ అజయ్ సాహసానికి అవాక్కయ్యాడు. తన మేనల్లుడు చేసిన కుట్రను, అజయ్ యొక్క నిజాయితీని గ్రహించిన రాజు, సింహాసనం దిగి వచ్చి అజయ్‌ను కౌగిలించుకున్నాడు.
"అజయ్, నిన్ను పరీక్షించబోయి గొప్ప వీరుడిని కోల్పోయేవాడిని. నన్ను క్షమించు. నీ పరాక్రమమే నిన్ను రక్షించింది" అని ప్రతాప వర్మ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అజయ్ తన మిత్రుడు వినయ్‌ను రాజ్య రక్షక అధికారిగా నియమించి, చంద్రలేఖతో కలిసి చంద్రగిరి మరియు సింహపురి రాజ్యాలను ఏకం చేసి, ధర్మబద్ధమైన పాలనను అందించాడు. ఆ రాజ్యం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
నీతి: ధైర్యం, నిలకడ మరియు సత్యం ఉన్న చోట విజయం వెన్నంటే ఉంటుంది.
పరీక్షా ఫలితం
పూర్వం కేకయదేశంలో వితస్తానదీ తీరాన ప్రజ్ఞామతి అనే రాజొకడుండే వాడు. ఆయన వద్ద జాగీరులు పొందిన వారిలో ధర్మపాలు డనే మహావీరు ద్రొకడుండే వాడు. ధర్మపాలుడు అకాలమరణం పొందటం చేత అతని కొడుకైన శూర పాలుడు తన పన్నెండవ ఏటనే జాగీరుకు వారసుడయాడు. శూరపాలుడు చిన్నవాడు కావటం చేతనూ, అతని ఆస్థిని చూసే వారె వరూ లేకపోవటం చేతనూ అతని జాగీరు నుంచి కొన్ని సంవత్సరాల పాటు రాజు గారికి కప్పం వెళ్ళలేదు.
ఏడెనిమిదేళ్ళుగా ధర్మపాలుడి జాగీరు నుంచి కప్పం చెల్లుబడి కావటంలేదని తెలియగానే రాజు శూరపాలుడికి కబురు చేశాడు. ఒక నెల గడువులోగా శూర పాలుడు రాజుగారి దర్శనం చేసుకొని పక్షంలో జాగీరు మరొకరి పరమవుతుందని
వార్త రాగానే శూరపాలుడు తన స్నేహితు డైన క్షేమవర్మ అనే వాళ్ల, ఇరవైమంది పరివారాన్ని వెంటపెట్టుకుని రాజధానికి బయలుదేరాడు.
శూరపాలుడు అనుభవించే జాగీరు సుక్షేత్రం. అందులో బంగారం పండటమే గాక, సమస్తమైన ప్రకృతి సంపదలూ కలిగి నటువంటిది. ఈ సంగతి తెలిసి రాజుగారి చిన్నకొడుకు ఒక దుర్మార్గపు ఆలోచన చేశాడు. శూరపాలుణ్ణి ఎలాగైనా దారిలోనే కడతేర్చినట్టయితే అతను వచ్చి రాజ దర్శనం చేసుకోలేడు. అతను తన ఆజ్ఞను ఉల్లంఘించా డనుకుని రాజుగారు అతని జాగీరును లాగేసుకుంటాడు. అప్పుడు రాజ కుమారుడు తండ్రిని లాలించి దాన్ని తానే కాజేయవచ్చు.
ఈ దుర్మార్గపు ఆలోచనను తన మిత్రు డైన మంత్రి కొడుక్కు కూడా చెప్పిఒప్పించి, అతన్ని, కొందరు సైనికులనూ వెంటబెట్టుకుని, రాజధానికి ఒక ఆమడ దూరంలో, శూరపాలుడు వచ్చే దారిలో, అరణ్యం మధ్య మాటువేసి ఉన్నాడు. సైనికులను చెట్ల చాటున దాచి, రాజు కొడుకూ, మంత్రి కొడుకూ కత్తులు ధరించి, గుర్రాలెక్కి దారికి అడ్డంగా నిలబడ్డారు.
గుర్రాలనూ, యోధులనూ అంతదూరానే చూసి క్షేమవర్మ అందులో ఏదో మోసం ఉన్నట్టు శంకించి, శూరపాలుణ్ణి, పరివా రాన్నీ వెనకనే ఉండమని హెచ్చరించి, తాను ఒక్కడే గుర్రాన్ని నడిపించుకుంటూ ముందుకు వచ్చాడు.
అతనే శూరపాలుడై ఉంటాడనుకుని రాజుకొడుకు అతని దారిని అటకాయించి, "కాస్త గుర్రం కట్టెయ్యి,” అన్నాడు.
"దారి అయ్యి, నేను వెళ్ళా లి,” అంటూ క్షేమవర్మ రాజకుమారుణ్ణి తోను కుని ముందుకు పోవ యత్నించాడు.
" అంత మదమా?" అంటూ రాజ కుమారు డతన్ని గుర్రం మీది నుంచి కిందికి ఒక్క తోపు తోసేశాడు.
మరుక్షణమే శూరపాలుడు అతివేగంతో తన గుర్రాన్ని పరిగెత్తించు కుంటూ వచ్చి, "నిరాయుధుడి పై చెయ్యి చేసుకుం టావా? సిగ్గు లేదూ?" అని రాజకుమారుణ్ణి అడిగాడు.
"ముందు నీ గతి నువు చూసుకో,” అంటూ రాజకుమారుడు శూరపాలుడి పైన కత్తి ఎత్తాడు. శూరపాలుడి కత్తి మెరుపు లాగా పైకివచ్చి రాజకుమారుడి కంఠాన్ని రెప్పపాటులో నరికేసింది. శూరపాలుడు అసాధారణ యోధుడన్న విషయం రాజ కుమారుడికి తెలియదు.
ఈ సంఘటన చూసి మంత్రికొడుకు కొయ్యబారి పోయాడు. చెట్లచాటున దాగిన సైనికులు కుక్కిన పేలలాగా అక్కడే ఉండిపోయారు.శూరపాలుడు తన మిత్రుడైన క్షేమ వర్మను లేవదీసి గుర్రం మీద ఎక్కించి, తన పరివారాన్ని కేకవేసి, తిన్నగా రాజ ధానికి వెళ్ళాడు. అతను రాజదర్శనం చేసుకుని, " తమ రాజధానికి ఒక ఆమడ దూరంలో బందిపోటులు విశృంఖలంగా తిరుగుతున్నారు. ఒక ధూర్తుడు నన్ను చంప యత్నించాడు, నా మిత్రుణ్ణి ఆకార బంగా గుర్రం మీది నుంచి తోసేశాడు. నేను వాడి తల నరికేసి చక్కగా బుద్ధి చెప్పాను," అని రాజుతో అన్నాడు.
"మంచి పని చేశావు ! అలాటి వాళ్ళ కదే శిక్ష!” అన్నాడు రాజు.
కాని అంతలోనే మంత్రి కొడుకు రాజ కుమారుడి శవాన్ని తెచ్చి రాజు ముందు పడేసి, "మహారాజా, ఎంత దారుణం జరిగిందో చూడండి. ఈ నీచుడే అరణ్యంలో అబ్బాయిగారి పై అకారణంగా కత్తి దూసి, ఆత్మరక్షణకు కూడా అవకాశ మివ్వకుండా శిరశ్ఛేదం చేసేశాడు." అన్నాడు.
తీయటానికి సిద్ధపడ్డాడు. అయితే రాజుగారి కొలువులో ఉన్నవారంతా తొందరపాటు రాజుకు భరించరానంత దుఃఖమూ, కోపమూ కలిగాయి. చనిపోయిన కొడుకంటే రాజుగారికి చాలా ప్రేమ. అందుచేత ఆయన కత్తి దూసి ఆ క్షణంలోనే శూరపాలుడి తలతగదనీ, శూరపాలుడేం చెప్పుకుంటాడో అది వినటం కనీస ధర్మమనీ చెబుతూ రాజుగారికి అడ్డు తగిలారు.
" నాకై నేను కయ్యానికి కాలు దువ్వ లేదు. మొదట నా పైన మీ కుమారుడే చెయ్యి చేసుకున్నాడు. అత నెవరో కూడా నాకు తెలియదు. మీ మంత్రి కుమారుడు పచ్చి అబద్ధం చెబుతున్నాడు. మీ దర్శనం కోసం వస్తున్నవాణ్ణి దారిలో కొట్లాటలు పెట్టుకోవటం వల్ల నాకేం ప్రయోజనం ఉంటుంది ?" అని శూరపాలుడు చెప్పాడు.
కాని క్రోధంతో వూగిపోతున్న రాజు చెవికి ఈ మాట లేమీ ఎక్కలేదు.
"నువే అబద్ధమాడుతున్నావో, మంత్రి కొడుకే అబద్ధ మాడుతున్నాడో మా కెలా తెలుస్తుంది? ఇది దేవుడే తేల్చాలి. మీ ఇద్దరూ ద్వంద్వ యుద్ధం చెయ్యండి. ఎవరు జయిస్తే వారిది నిజమని ఒప్పుకుంటాను,” అన్నాడు రాజు.
శూరపాలుడు గట్టిగా అరవై ఏళ్ళు నిండని పసివాడు. మంత్రికొడుకు ముఫై ఏళ్ళవాడు, దృఢకాయుడు. అతని చేతిలో శూరపాలుడు నిశ్చయంగా చచ్చిపోతాడనీ, తన కొడుకు చావుకు ప్రతిక్రియ ఈవిధంగా జరిగిపోతుందనీ రాజు ఆశించాడు. అయితే శూరపాలుడి వేగంలో మంత్రి కొడుక్కు సగం కూడా లేదు. ఇద్దరూ కత్తులు దూసి కలియబడిన కొద్ది క్షణాలలో మంత్రికొడుకు కూడా రాజు కొడుకును చేరుకున్నాడు.
"మహారాజా, ఇంతటితోనైనా ఈ విష యాన్ని వదిలిపెట్టండి. మీ రన్న మాట ప్రకారం ఈ కుర్రవాడు నిరపరాధి అని తేలిపోయింది,” అన్నారు మంత్రులు.
కాని రాజుకు శూరపాలుడి పై కసి జాస్తి అయిందే గాని తగ్గలేదు. అతణ్ణి హత మార్చటానికి ఆయన మరొక ఎత్తు వేశాడు.
"నే నితన్ని క్షమిస్తాను. కాని ముందుగా అతను నేను చెప్పిన పని ఒకటిచేసుకురావాలి : ఇతను కుషాను చక్రవర్తి ఆస్థానానికి వెళ్ళి, అతని ఆస్థానంలో ముఖ్య అతిథిగా ఉన్న వ్యక్తిని చంపేసి, చక్రవర్తి కిరీటం తెచ్చి నా కివ్వాలి. ఈ పని చేసి నట్టయితే ఇతన్ని క్షమించటానికి నా కేమీ అభ్యంతరం లేదు," అన్నాడు రాజు, తన దురుద్దేశం అందరికీ తెలిసేలాగా.
మిగతా వారంతా నిర్ఘాంతపోయి చూస్తూం డగా శూరపాలుడు, " తమ సెలవైతే అలాగే చేస్తాను,” అంటూ సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు.
అతను క్షేమవర్మనూ, పరివారాన్నీ రాజ ధానిలోనే వదిలి, కుషాను రాజుండే నగ
రానికి ఒంటరిగా ప్రయాణమయాడు. అది చాలా దూర ప్రయాణమే గాక, దుర్ఘటమైన ప్రయాణం కూడానూ. చక్రవర్తి ఉండే నగరానికి పడమటగా ఉండే కొండలోయలో రాక్షసులున్నారు. శూరపాలుడు ఆ లోయల కుండా ప్రయాణం చేస్తూ రాక్షసుల రాజైన తామ్రాక్షుడనే వాడితో పోరాడి, తన లాఘ వంతో వాణి చంపి, వాడి చేతికి ఉన్న బంగారు దండకడియం తీసుకుని చక్రవర్తి నగరం చేరుకున్నాడు.
శూరపాలుడు వచ్చి చేరే సమయానికి కుషాన నగరం మహావైభవంగా ఉన్నది. ఎందుకంటే ఆ రోజే చక్రవర్తి కుమార్తెమండలి అనే దానికి పెళ్ళి చేస్తున్నారు. రాజసౌథంలో చక్రవర్తి బంధుమిత్ర పరి వారసమేతుడై కొలువు తీరి ఉన్నాడు. చక్ర వర్తికి ఒకపక్క ఆయన కుమార్తె, రెండవ పక్క ఆమెను పెళ్ళాడబోయే వాడూ కూర్చుని ఉన్నారు.
శూరపాలుడు తిన్నగా చక్రవర్తి ఎదటికి వెళ్ళి, వంగి నమస్కారం చేసి, " ఇది రాజాజ్ఞ," అంటూ చప్పున కత్తి దూసి, పెళ్ళి కొడుకు తల నరికేశాడు.
అతిథులు హాహాకారాలు చేశారు. చక్ర వర్తి నోట కొంత సేపు మాట రాలేదు. రాజ భవన మంతా గగ్గోలెత్తిపోయే ఆ క్షణంలో
మండలి ఒక్కతే మాత్రం తృప్తిగా ఒక్క నిట్టూర్పు విడిచింది. ఎందుకంటే ఆమెకు ఆ వరుణ్ణి పెళ్ళాడటం ఎంత మాత్రమూ ఇష్టం లేదు. వాడు పరమకిరాతకుడు, మాన వత్వం ఏ మాత్రమూ లేని కర్కోటకుడు.
"ఈ దుర్మార్గుణి పట్టుకోండి,” అని చక్రవర్తి చివరకు కేకపెట్టాడు.
"మహారాజా, మన్నించాలి. నేను మీకు కీడుకోరి వచ్చినవాణ్ణి కాను. మా రాజు గారి ఆజ్ఞ పాలిస్తున్నాను, అంతే! మీ కిరీటం కూడా ఇచ్చేశారంటే నేను వచ్చిన పని తీరిపోతుంది. నా దారిన నేను వెళ్ళి పోతాను. మీకు నా ముఖం మరి చూపిం చను," అన్నాడు శూరపాలుడు వినయంగా.
ఈ మాటలకు చక్రవర్తి శాంతించక పోగా మరింత మతిపోయిన వాడల్లే అయి పోయి, " ఈ వెర్రివాణ్ణి వెంటనే తీసుకు పోయి చీకటికొట్టులో వేసి, ఆకలిదప్పులతో చావ నివ్వండి!" అని రంకెలు పెట్టాడు.
"నన్ను సామాన్యుడి కింద కట్టెయ్య, కండి. నేను తామ్రాక్షుడనే రాక్షసరాజును చంపిన వాణ్ణి. అదుగో అతని శవం నుంచి నేను తీసుకొచ్చిన దండకడియం!" అన్నాడు శూరపాలుడు. అది కూడా చక్ర వర్తి వినిపించుకోలేదు.చక్రవర్తి అజ్ఞప్రకారం ఆయన భృత్యులు శూరపాలుణ్ణి చుట్టుముట్టి పట్టు కుని, తీసుకుపోయి చీకటికొట్టులో పడేసి తాళం పెట్టేశారు.
ఆ రోజూ, మర్నాడు పగలూ గడిచింది. శూరపాలుడు తిండీ, నీరూ కూడా లేకుండా గాఢాంధకారంలో కటిక నేలపై పడుకుని, "ఇక నాకు ఈ లోకంతో రుణం తీరిపోయి నట్టే. తన కొడుకును చంపినందుకు ప్రజ్ఞా మతి మహారాజు నా పైన బాగానే పగ తీర్చు కున్నాడు,” అనుకున్నాడు.
అయితే ఉన్నట్టుండి ఆ అంధకారంలో ఆశారేఖ లాగా వెలుగు ప్రవేశించింది. ఎవరో
దీపం పట్టుకుని అతనున్న చీకటికొట్టులోకి వచ్చారు. ఆ దీపం వెలుగులో శూర పాలుడు చక్రవర్తి కుమార్తెను, మండలిని గుర్తించాడు.
" నీకు భోజనమూ, నీరూ తెచ్చాను, తీసుకో. కారాగృహాధికారికి లంచం పెట్టి మన పక్షం చేసుకున్నాను. అతన్ని నమ్మ వచ్చు,” అన్నది మండలి శూరపాలుడితో.
అది మొదలు మండలి ప్రతిరాత్రీ అత నికి భోజనమూ, నీరూ తెచ్చి పెడుతూ వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకునే వారు. తనను ఒక కిరాతకుడికి భార్య కాకుండా కాపాడినందుకు చక్రవర్తి కూతురు కృత జ్ఞత తెలుపుకున్నది; చీకటికొట్టులో తిండికి, దప్పికీ మాడి చాపకుండా కాపాడు తున్నందుకు శూరపాలుడు కృతజ్ఞత తెలుపుకున్నాడు. కాని చీకటికొట్టులో నుంచి బయటికి పోయే మార్గమేదో అతనికీ తెలియ లేదు, ఆమెకూ తెలియలేదు.
ఒక నెల రోజులు గడవనిచ్చి కారా గృహాధికారి చక్రవర్తి వద్దకు వెళ్ళి, "మహా ప్రభూ, వెర్రివాడు మరణించాడు,” అని విన్నవించాడు.
"పీడ వదిలిపోయింది.” అన్నాడు చక్రవర్తి సంతోషంగా.ఇది జరిగిన కొద్దిరోజులకే చక్రవర్తికి పెద్ద ప్రమాదం వచ్చిపడింది. శూరపాలుడి చేతిలో చచ్చిన తామ్రాక్షుడి తమ్ముడు ధూమ్రాక్షుడనే రాక్షసుడు చక్రవర్తి పైకి వస్తున్నట్టు తెలిసింది.
చక్రపర్తి కంగారు పడిపోయాడు. రాక్షసులతో కయ్యం పెట్టుకుంటే అది ఎక్కడికి దారి తీసేదీ తెలియదు.
"తామ్రాక్షుణ్ణి చంపిన కుర్రవాడే ఉంటే ఈ ధూమ్రాక్షుడి సంగతి తేల్చును,” అన్నది మండలి తండ్రితో.
" నిజమే, కాని వాడు చీకటికొట్టులో తిండికి మాడి మాడి చచ్చాడు గద!" అన్నాడు చక్రవర్తి.
మండలి తండ్రి కాళ్ళపై పడి ముందు గానే క్షమాపణ చెప్పుకుని, " అతను చావ లేదు. నే నతనికి రోజూ భోజనం పంపు తూనే ఉన్నాను. అతన్ని చెర విడిపించి నట్టయితే ఈ ధూమ్రాక్షుడితో పోట్లాడు తాడు," అన్నది.
చక్రవర్తికి ప్రాణం లేచి వచ్చింది. రాక్ష సులు విచిత్రమైన వాళ్ళు. తమలో ఏ ఒక డైనా మరొకడితో పోరి చచ్చిపోతే వారు పట్టించుకోరు. ఒక్క రాక్షసుడి పైకి సేనను పంపి చంపినట్టయితే లోయలో ఉండే
రాక్షసులంతా వచ్చిపడి రాజ్యాన్నీ, రాజ ధానినీ మట్టుపెట్టేస్తారు.
చక్రవర్తి తక్షణమే కారాగృహానికి మని షిని పంపి, శూరసాలుణ్ణి పిలిపించి, "నీ చేత చచ్చిన రాక్షసుడి తమ్ముడు మన పైకి వస్తు న్నాడు. నీవు వెళ్ళి వాడితో యుద్ధం చేసి జయిస్తివా, నీకు నా కిరీటమే కాదు, నా కూతుర్ని ఇచ్చి వివాహం కూడా చేస్తాను,” అన్నాడు.
"అందుకు నేను సిద్ధమే," అన్నాడు. శూరపాలుడు.
అతను వెళ్ళి ధూమ్రాక్షుడితో పోరా డాడు. వాడు తన గద ఎత్తి నెత్తి మీదపెట్టేలోపల శూరపాలుడు వాడి గుండెను తన కత్తితో చీల్చేసి చంపేశాడు.
శూరపాలుడు చక్రవర్తి వద్దకు తిరిగి వచ్చి, "మీ పని పూర్తి చేశాను, మీ రిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోండి," అన్నాడు.
"సరే నిన్ను ప్రాణాలతో వదిలేస్తు న్నాను, వెళ్ళి పో!" అన్నాడు చక్రవర్తి, రాక్షస భయం తీరిపోయిన బింకంలో,
"నాకు మీ కిరీటం ఇస్తా నన్నారు. మీ అమ్మాయినిచ్చి పెళ్ళిచేస్తా నన్నారు." అన్నాడు శూరపాలుడు.
"తక్షణం వెళ్ళిపోకపోతే నిన్ను మళ్ళీ చీకటికొట్టుకు పంపగలను జాగ్రత్త! ఒళ్ళు తెలిసి మాట్లాడు!" అన్నాడు చక్రవర్తి.
శూరపాలుడికి పట్టరాని క్రోధం వచ్చింది. అతను మెరుపులాగా కత్తి దూసి చక్రవర్తి తల నరికేశాడు.
రాజోద్యోగులు శూరపాలుళ్లు శిక్షించా అనుకున్నారు. కాని చక్రవర్తి చావగానే
ఆయన స్థానంలో చక్రవర్తిని అయిన మండలి, " అతను నిరపరాధి. పైపెచ్చు నాకు కాబోయే భర్త. మీరందరూ ఇతనికి విధేయులై ఉండాలి,” అన్నది.
శూరపాలుడు మండలిని వివాహం చేసు కుని రాజ్యాభిషేకం కూడా జరిపించు కున్నాడు. ఆ సమయంలో అందరు రాజు లతో బాటు కేకయదేశంలోని ప్రజ్ఞామతి కూడా వచ్చి కొత్త చక్రవర్తికి జోహార్లు అర్పించుకున్నాడు.
" ఏం మహారాజా, మీరు చెప్పిన రెండు పనులూ చేశాను. చక్రవర్తి కిరీటం ఇప్పుడు నా నెత్తినే ఉన్నది. ఏమంటారు?" అని శూరపాలుడు ప్రజ్ఞామతిని అడిగాడు.
ప్రజ్ఞామతి వణికిపోతూ అతని కాళ్ళపైన పడి, క్షమించమని ప్రాధేయపడ్డాడు.
"ఈసారికి క్షమిస్తున్నాను. ఇంక ఎప్పుడూ ఎవరికీ అనాలోచనగా పరీక్షలు పెట్టకండి." అన్నాడు శూరపాలుడు.
నిజమైన భక్తి
ఒకప్పుడు రాఘవపురం అనే పట్టణంలో శ్రీమన్నారాయణుడి ఆలయానికి నారాయణమూర్తి అనే వ్యక్తి ప్రధాన అర్చకుడిగా ఉండేవాడు. భక్తులు సమర్పించే కానుకలు, పూజల ద్వారా అతని జీవితం చాలా విలాసవంతంగా గడిచిపోయేది. అయితే, రోజూ ఆలయానికి వచ్చే వినయ్ అనే యువకుడిని చూస్తే అతడికి చాలా చిరాకుగా ఉండేది.
వినయ్ రోజూ ఆలయానికి వస్తాడు, విష్ణుమూర్తికి నమస్కరిస్తాడు, కానీ ఒక్క పైసా కూడా దక్షిణగా గానీ, పండు కానీ, పువ్వు కానీ దేవుడికి సమర్పించడు. కానీ ఆలయం వెలుపల కూర్చున్న వృద్ధులు, పేదవారికి మాత్రం చిల్లర డబ్బులు ఇచ్చి, చిన్న తినుబండారాలు ఇచ్చి వెళ్ళిపోయేవాడు.
ఒక రోజు వినయ్ ఆలయానికి వచ్చేసరికి ఆలస్యం అయింది. అప్పటికే నారాయణమూర్తి గర్భగుడి తలుపులు మూసివేస్తున్నాడు. "అయ్యా, పూజారిగారూ! ఒక్క నిమిషం ఆగండి. స్వామికి దండం పెట్టుకుని వెళ్ళిపోతాను," అన్నాడు వినయ్.
నారాయణమూర్తి లోపల దాచుకున్న అసహనాన్ని బయటపెట్టి, "చాలు నీ భక్తి! దేవుడికి తృణమో పణమో సమర్పించకుండా, నిత్యం ఉత్తుత్తి దండాలు పెట్టడానికి ఎందుకొస్తావు?" అని హేళన చేశాడు.
వినయ్ ప్రశాంతంగా, "భగవంతుడే మనకు అన్నీ ఇచ్చేవాడు కదా. నేనాయనకు ఏదో ఇవ్వడం దేనికి?" అని అడిగాడు.
"ఓహో! చాలా గొప్ప వేదాంతం చెప్పావు! మరి భగవంతుడు సర్వాంతర్యామి అని నీకు తెలుసు కదా, ఇక్కడ ఈ ఆలయంలోనే ఎందుకు దండం పెట్టుకోవాలి?" అని వెటకారం చేశాడు నారాయణమూర్తి.
"అందుకు కారణం నా బాధ్యత మరియు నిజాయితీ," అన్నాడు వినయ్.
"దేవుడికి ఏమీ ఇవ్వకపోవడంలో నీ బాధ్యత, నిజాయితీ ఎలా వచ్చాయి? కాస్త వివరంగా చెప్పగలవా?" అని నారాయణమూర్తి ప్రశ్నించాడు.
"మా అమ్మగారు అనారోగ్యంతో ఉన్నారు, నాన్నగారు చాలా వృద్ధులు. వారికి దేవాలయాన్ని సందర్శించి స్వామికి నమస్కరించాలనే కోరిక. అందుకే నేను వారికి ప్రతినిధిగా ఇక్కడికి వస్తున్నాను. నాకు చేతినిండా పని ఉంటుంది. గుడికి వెళ్ళకుండా ఇంకేదైనా పని చూసుకోవచ్చు. కానీ వారికి 'వెళ్ళాను' అని అబద్ధం చెప్పడం ఇష్టం లేక, తప్పక ఇక్కడికి వచ్చి దండం పెట్టి వెళ్తున్నాను. ఇది నా నిజాయితీ," అని చెప్పాడు వినయ్.
"అయితే దేవుడికి దణ్ణం పెడితే సరిపోతుందా? కనీసం దక్షిణ ఇవ్వొద్దా?" అని పట్టుబట్టాడు నారాయణమూర్తి.
"మా తల్లిదండ్రులు నన్ను దక్షిణ ఇవ్వమని చెప్పలేదు. అందుకే ఇవ్వడం లేదు. పైగా, నా సంపాదన చాలా పరిమితం. ఆ పరిమితమైన డబ్బుతో నేను శిలా విగ్రహానికి ఇవ్వడం కంటే, ఆకలితో ఉన్న వారికి ఇవ్వడం మేలు అని నమ్ముతాను. అదే నా మానవ ధర్మం," అన్నాడు వినయ్.
"మరి నీకు ఆ పేదవారిలోనే దేవుడు కనిపిస్తే, వారి సేవ చేసి, వారికే దండం పెట్టుకోవచ్చు కదా, ఎందుకిక్కడ విగ్రహానికి నమస్కరించడం?" అని నారాయణమూర్తి ప్రశ్నించాడు.
"నేను వారిని దేవుళ్లుగా చూడను. వారి సేవనే దైవపూజగా భావిస్తాను. అందుకే వారికి దండం పెట్టను. ఎందుకంటే, సహాయం కోసం చేయి చాచిన ఎవరైనా దండానికి అర్హులు కారు, వారికి సహాయం అందించే బాధ్యత మాత్రమే మనకు ఉంది," అని వినయ్ వెంటనే సమాధానం ఇచ్చాడు.
వినయ్ మాటలకు నారాయణమూర్తి ఆశ్చర్యపోయాడు. దక్షిణ గురించి అడిగితే తన గురించే కూడా అలాగే అంటాడని భయపడి, వినయ్ను స్వామికి దండం పెట్టుకోనిచ్చి తలుపులు మూశాడు.
వినయ్ వెళ్ళిపోతూ ఉండగా, నారాయణమూర్తి, "వినయ్! నీకు ఆలయంలోని దేవుడి మీద నమ్మకం లేదు, తల్లిదండ్రుల కోరిక మేరకే ఇక్కడికి వస్తున్నావు. నీకు పేదవారిలోనే సేవ కనిపిస్తుంది, కానీ వారిని దేవుళ్లుగా చూడవు. అసలు నీ కంటికి కనిపించే దేవుడు ఎవరయ్యా?" అని అడిగాడు.
వినయ్ వెనక్కి తిరిగి, "సమస్త సృష్టికి జన్మనిచ్చాడని మనం కనిపించని దేవుడిని పూజిస్తున్నాం. అదేవిధంగా, నాకు జన్మనిచ్చిన, నాకు జీవితాన్ని ఇచ్చిన మా తల్లిదండ్రులే నా కంటికి కనిపించే దేవుళ్ళు," అన్నాడు.
" రేపు నీకు పెళ్లై, పిల్లలు పుడితే, నువ్వు కూడా తండ్రి అవుతావు. తల్లిదండ్రులు అంటే మనలాంటి మనుషులే కదా! వారు దేవుళ్లు ఎలా అవుతారు?" అని సందేహం వెలిబుచ్చాడు నారాయణమూర్తి.
వినయ్ నిట్టూర్చి, "నీకు అర్థం కాదని తెలుసు. కనిపించని దేవుడికి నిత్య పూజలు చేసే నువ్వు, కనిపించే దేవుళ్లు అయిన నీ సొంత తల్లిదండ్రులను వదిలేసి, వారిని వృద్ధాశ్రమంలో చేర్పించావంటే, నీకు దైవత్వం గురించి ఏమీ తెలియదనే కదా అర్థం? నా దారి నాది, నీ దారి నీది," అని ముందుకు కదిలాడు.
ఆ మాటలు విన్న నారాయణమూర్తికి గుండె తరుక్కుపోయింది. తను ఎంత పెద్ద పాపాత్ముడినో అర్థమైంది. అతడు పరుగెత్తుకెళ్లి వినయ్ కాళ్ళు పట్టుకుని, "వినయ్, నేను పూజారిని కాదు. నేను పాపాత్ముణ్ణి. తల్లిదండ్రులకు సేవ చేసుకుంటున్న నీవే నిజమైన పూజారివి. నీకు జ్ఞానం కలిగించాలని ఆ నారాయణుడే నిన్ను నా దగ్గరకు పంపి ఉంటాడు. పద, నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు! నా తల్లిదండ్రులను తిరిగి నా ఇంటికి తీసుకువెళ్లి, నీ అడుగు జాడల్లో నడుస్తాను," అన్నాడు.
ఆ రోజు నుంచి వినయ్, నారాయణమూర్తికి దక్షిణ వేయడం ప్రారంభించాడు. "ఇది దేనికి?" అని అడిగితే, వినయ్ నవ్వుతూ, "కనిపించే దేవుళ్లను సేవించుకునే వారికి అంతో ఇంతో సాయపడడమే అసలు సిసలు దైవభక్తి," అని అన్నాడు.
ధర్మపథం -
దట్టమైన అడవులు, గలగల పారే నదుల మధ్య వెలిసిన సువర్ణపురి అనే అద్భుతమైన రాజ్యాన్ని విక్రమ సేనుడు అనే రాజు పాలిస్తుండేవాడు. ఆ రాజ్యం ఒకప్పుడు పాడిపంటలతో, సిరిసంపదలతో తులతూగేది. విక్రమ సేనుడు స్వతహాగా గొప్ప వీరుడు, పరాక్రమవంతుడు. అయితే, కాలక్రమేణా అతడు తన బాధ్యతలను మరిచి విలాసాలకు, సుఖభోగాలకు బానిసయ్యాడు. అంతఃపుర వినోదాలకే పరిమితమై, ప్రజల ఆకలి కేకలను, రైతుల బాధలను పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు. రాజ్యంలో అవినీతి పెరిగిపోయింది, సామాన్యుడి బతుకు భారమైపోయింది.
అదే రాజ్యంలో, నగర శివార్లలో వశిష్ఠుడు అనే పరమ శాంతమూర్తి, గొప్ప శిల్పి నివసించేవాడు. వశిష్ఠుడి చేతుల్లో ప్రాణం పోసుకునే రాతి విగ్రహాలు చూస్తుంటే, అవి ఇప్పుడే మాట్లాడతాయేమో అన్నట్టుగా జీవం ఉట్టిపడేవి. ఆయన కళా నైపుణ్యం దేశదేశాలకూ పాకింది. ఆయనకు ఆదిత్య, వరుణ్ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. ఆదిత్య చిన్నప్పటి నుంచీ గంభీరమైన స్వభావం కలవాడు, అన్యాయం ఎక్కడ జరిగినా సహించలేకపోయేవాడు. తమ్ముడు వరుణ్ మాత్రం చాలా ప్రశాంతంగా, విజ్ఞతతో ఆలోచించేవాడు.
వీరిద్దరిని వశిష్ఠుడు వేదమిత్ర అనే గొప్ప గురువు వద్దకు పంపాడు. వేదమిత్రుడు కేవలం శాస్త్రాలే కాకుండా, యుద్ధ విద్యలు, లలిత కళలు, మరియు ధర్మశాస్త్రాలలో అపర ప్రజ్ఞాశాలి. ఆదిత్య గురువు వద్ద విలువిద్యలోనూ, కత్తి సాములోనూ అజేయుడిగా ఎదిగాడు. వరుణ్ సంగీతం, శిల్పకళతో పాటు రాజనీతి శాస్త్రంలో లోతైన జ్ఞానాన్ని సంపాదించాడు. రాజ్యంలోని పరిస్థితులు తండ్రిని బాధిస్తుంటే, వారు తమ విద్యలతో ప్రజలకు మేలు చేయాలని కలలు కనేవారు. కానీ విధి మరోలా తలచింది. విక్రమ సేనుడి విలాసాలకు ధనం కావాల్సి రావడంతో, పన్నుల భారం వశిష్ఠుడి ఇంటి గడపను కూడా తట్టింది. అది వారి జీవితాలను మలుపు తిప్పే ఒక పెను తుఫానుకు దారితీసింది.
సువర్ణపురి రాజ్యంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉన్నా చినుకు రాలడం లేదు. చెరువులు అడుగంటాయి, పొలాలు బీడువారాయి. ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడుతుంటే, విక్రమ సేనుడు తన విలాసాల కోసం పన్నుల వసూళ్లను ముమ్మరం చేశాడు. ఒక దురదృష్టకరమైన ఉదయం, రాజాజ్ఞ మేరకు కరుడుగట్టిన సేనాపతులు వశిష్ఠుడి ఇంటి ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఆదిత్య, వరుణ్ తమ గురువు ఆశ్రమంలో ఉన్నారు.
"వశిష్ఠా! ఈ సంవత్సరపు శిల్పకళా పన్ను, నివాస పన్ను, మరియు వృత్తి పన్ను కలిపి పది బంగారు నాణాలు వెంటనే చెల్లించు. లేదంటే ఈ ఇంటిని, నువ్వు ప్రాణప్రదంగా చెక్కిన శిల్పాలను రాజకోశాగారానికి తరలిస్తాం" అని గర్జించాడు సైన్యాధికారి. వశిష్ఠుడు తన వణుకుతున్న చేతులతో వారి కాళ్ళపై పడి వేడుకున్నాడు. "అయ్యా! తినడానికి గింజలు కూడా లేవు, ఈ కరువు కాలంలో అంతధనం నేనెక్కడి నుండి తీసుకురాగలను? దయచేసి కనికరించండి, వానలు పడగానే నేను అహోరాత్రులు శ్రమించి పన్ను చెల్లిస్తాను" అని మొరపెట్టుకున్నాడు.
కానీ ఆ క్రూరుల మనసు కరగలేదు. "రాజు ఆజ్ఞ అతిక్రమిస్తావా?" అంటూ అతడిని బలంగా నెట్టివేశారు. వశిష్ఠుడు పక్కనే ఉన్న ఒక రాతి విగ్రహం అంచుకు తల తగిలి కుప్పకూలిపోయాడు. రక్తం ధారలుగా కారుతుంటే, ఆ నిస్సహాయ స్థితిలో ఆయన ప్రాణాలు విడిచాడు. భటులు భయం భయంగా అక్కడి నుండి పారిపోయారు. విషయం తెలిసి పరుగు పరుగున వచ్చిన ఆదిత్య, వరుణ్ తన తండ్రి నిర్జీవ దేహాన్ని చూసి హతాశులయ్యారు.
ఆదిత్య కళ్ళలో దుఃఖం కాస్తా తీవ్రమైన కోపంగా మారింది. "ప్రజలను కన్నబిడ్డల్లా చూడాల్సిన రాజే మా తండ్రి మరణానికి కారకుడయ్యాడు. ఈ విక్రమ సేనుడి అహంకారాన్ని అణిచివేస్తాను. ఈ అన్యాయమైన పాలనను అంతం చేయడమే నా ధ్యేయం" అని ఆవేశంగా ప్రకటించాడు. తమ్ముడు వరుణ్ ఎంతో శాంతంగా అన్నను ఆపాలని చూశాడు. "అన్నయ్యా! ఆవేశం అనర్థదాయకం. ఆలోచనతో సమస్యను పరిష్కరించుకుందాం" అన్నాడు. కానీ ఆదిత్య వినలేదు. తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేసిన వెంటనే, పగ తీర్చుకోవడానికి కత్తి పట్టి అడవుల్లోకి వెళ్లిపోయాడు. వరుణ్ మాత్రం తన తండ్రి ఆశయమైన శాంతిని, ధర్మాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. విచలితుడవ్వకుండా తిరిగి ఆశ్రమానికి వెళ్లి, కఠినమైన శిక్షణతో సర్వ కళలలోనూ, రాజనీతిలోనూ అగ్రగణ్యుడిగా ఎదిగాడు. తన తండ్రి చావుకు కారణమైన వ్యవస్థను లోపలి నుండి మార్చాలని సంకల్పించాడు.
ఆరు మాసాల కఠిన శిక్షణ తర్వాత వరుణ్ సర్వవిద్యా పారంగతుడయ్యాడు. సరిగ్గా అదే సమయంలో విక్రమ సేనుడి కుమార్తె, అద్భుత సౌందర్యరాశి అయిన చంద్రలేఖ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆమెకు చిత్రలేఖనం, సంగీతం అంటే ప్రాణం. ఆమె ఇష్టాన్ని గౌరవిస్తూ రాజు రాజ్యంలో గొప్ప పోటీలు నిర్వహించాలని చాటింపు వేయించాడు. గెలిచిన వారికి రాజకుమారితో వివాహంతో పాటు రాజ్య గౌరవాలు లభిస్తాయని ప్రకటించాడు. వరుణ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాజును కలవాలని నిశ్చయించుకుని రాజధానికి బయలుదేరాడు.
ప్రయాణ మధ్యలో ఒక అర్ధరాత్రి వేళ, నగరం వెలుపల ఉన్న ఒక శిథిలమైన భవనంలో అతనికి కొన్ని రహస్య సంభాషణలు వినిపించాయి. వరుణ్ అప్రమత్తమై అటుగా వెళ్ళాడు. అక్కడ తన అన్న ఆదిత్య మరియు పొరుగు దేశమైన శత్రురాజ్య గూఢచారులు కుట్ర పన్నుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందాడు. శత్రు రాజు పంపిన ఒక అద్భుతమైన విగ్రహాన్ని ఆదిత్యకు అప్పగించారు. ఆ విగ్రహం కళ్ళలో అత్యంత ప్రమాదకరమైన విషపు బాణాలు అమర్చబడి ఉన్నాయి. పోటీల ముగింపులో ఆ విగ్రహాన్ని రాజుకు బహుమతిగా ఇస్తున్నట్లు నటించి, రహస్య మీటను నొక్కితే బాణాలు నేరుగా విక్రమ సేనుడి గుండెల్లోకి దూసుకువెళ్తాయి. రాజు మరణించిన వెంటనే శత్రు సైన్యం సువర్ణపురిపై దాడి చేసి ఆక్రమించుకుంటుందని, బదులుగా ఆదిత్యను ఆ రాజ్యానికి సామంతుడిగా నియమిస్తారని ఆ కుట్ర సారాంశం.
తన అన్న కేవలం ప్రతీకార వాంఛతో శత్రువులతో చేతులు కలపడం వరుణ్‌ను తీవ్రంగా కలచివేసింది. "ప్రతీకారం మనిషిని ఇంతగా అంధుడిని చేస్తుందా? అన్నను కాపాడాలి, అదే సమయంలో రాజ్యాన్ని రక్షించాలి" అని వరుణ్ దృఢంగా నిశ్యయించుకున్నాడు. అతడు వెంటనే గుట్టుచప్పుడు కాకుండా రాజభవనానికి చేరుకున్నాడు. రాజు విక్రమ సేనుడిని రహస్యంగా కలిసి, జరగబోయే ప్రమాదాన్ని వివరించాడు. రాజు మొదట ఆగ్రహించినా, వరుణ్ విజ్ఞతను చూసి అతడిపై నమ్మకం ఉంచాడు. అయితే వరుణ్ రాజు వద్ద ఒక వాగ్దానం తీసుకున్నాడు—తను చెప్పినట్లు జరిగితే, కుట్రదారులను శిక్షించే అధికారం తనకే ఇవ్వాలని కోరాడు. రాజ్యమంతటా భద్రత కట్టుదిట్టం చేయబడింది. కానీ బయటకు మాత్రం అంతా ప్రశాంతంగా ఉన్నట్లు వేడుకలు మొదలయ్యాయి. వరుణ్ తన అన్నను హంతకుడిగా కాకుండా, ఒక మంచి మనిషిగా మార్చడానికి తనదైన వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాడు.
సువర్ణపురి రాజధాని నగరం అలంకరణలతో మెరిసిపోతోంది. అసంఖ్యాకమైన ప్రజల మధ్య పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటిగా జరిగిన విలువిద్య పోటీలో వరుణ్ తన అమోఘమైన గురితో అందరినీ ఆశ్చర్యపరిచాడు. గాలిలో ఎగిరే పక్షి కాలికి ఉన్న ఉంగరాన్ని కూడా గురి తప్పకుండా పడగొట్టి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత చిత్రలేఖనం పోటీలో, వరుణ్ తన తండ్రి ఆశయాలకు ప్రతీకగా ఒక 'శాంతి విగ్రహం' చిత్రాన్ని గీశాడు. ఆ బొమ్మలోని జీవం చూసి రాజకుమారి చంద్రలేఖ మంత్రముగ్ధురాలైంది. ఆమె చూపులు వరుణ్‌పై నిలిచాయి.
చివరిగా, అత్యంత కీలకమైన సంగీత మరియు శిల్ప ప్రదర్శన పోటీ మొదలైంది. ఆదిత్య ముసుగు ధరించి వేదికపైకి వచ్చాడు. తనతో పాటు ఆ విషపు బాణాలు దాగున్న అద్భుతమైన విగ్రహాన్ని తీసుకువచ్చాడు. "మహారాజా! ఈ విగ్రహం మా తండ్రి ఆఖరి కోరికగా మీకు సమర్పిస్తున్నాను. దీని కళ్ళలోని రహస్య మీటను నొక్కితే ఇది మీకు అదృష్టాన్ని ఇస్తుంది" అని ప్రకటించాడు. ఆదిత్య మీటను నొక్కబోయే తరుణంలో, వరుణ్ వెంటనే తన వీణానాదంతో ఒక విలక్షణమైన తరంగాన్ని సృష్టించాడు. ఆ శబ్ద ప్రకంపనలకు విగ్రహంలోని అంతర్గత బాణాలు వేదికపైనే కిందకు పడిపోయాయి. రాజుకు ప్రమాదం తప్పింది. వెంటనే రాజభటులు ఆదిత్యను చుట్టుముట్టారు.
వరుణ్ వేదికపైకి వెళ్లి ఆదిత్య ముసుగును తొలగించాడు. అన్నను చూసి వరుణ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. "అన్నయ్యా! తండ్రిని కోల్పోయిన దుఃఖం నిన్ను హంతకుడిగా మార్చకూడదు. ఈ రాజు మారారు, ప్రజల కష్టాలను గుర్తించారు" అని హెచ్చరించాడు. విక్రమ సేనుడు మొదట ఆగ్రహంతో ఆదిత్యకు మరణశిక్ష విధించబోయాడు. కానీ వరుణ్ కల్పించుకుని, తను ముందే తీసుకున్న వాగ్దానాన్ని గుర్తుచేశాడు. వరుణ్ ప్రతిభకు, విజ్ఞతకు ముగ్ధుడైన రాజు, చంద్రలేఖతో అతడి వివాహం జరిపించి, తన కిరీటాన్ని వరుణ్ తలపై ఉంచి యువరాజుగా ప్రకటించాడు. వరుణ్ యువరాజుగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే, కారాగారంలో ఉన్న తన అన్న ఆదిత్యను విడుదల చేయించాడు. అతడికి రాజ్యపు 'ప్రధాన రక్షణ అధికారి'గా బాధ్యతలు అప్పగించి, అన్నను ధర్మమార్గంలోకి మలుపు తిప్పాడు.
వరుణ్ తీసుకున్న నిర్ణయం సభలోని వారందరినీ, ముఖ్యంగా విక్రమ సేనుడిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. రాజు సందేహంతో, "వరుణా! నన్ను చంపడానికి పన్నాగం పన్నిన వ్యక్తికి, అదీ రాజద్రోహానికి పాల్పడిన వాడికి రాజ్య రక్షణ బాధ్యతలా? ఇది మూర్ఖత్వం కాదా? నీకు అన్న అనే స్వార్థంతో ఇలా ఆలోచిస్తున్నావా?" అని ప్రశ్నించాడు. అప్పుడు వరుణ్ ప్రశాంతమైన చిరునవ్వుతో వినమ్రంగా ఇలా సమాధానమిచ్చాడు:
"మహారాజా! లోతుగా ఆలోచిస్తే ఇందులో స్వార్థం లేదు, కేవలం రాజనీతి మరియు మానవత్వం ఉన్నాయి. నా అన్న ఆదిత్య పుట్టుకతో దేశద్రోహి కాదు, అతడు ఒక బాధితుడు. మా తండ్రి మరణం అతడిని తీవ్రమైన ఆవేదనకు గురిచేసింది. ఆ సమయంలో పాలకులపై కలిగిన ద్వేషం అతడి విచక్షణను కప్పివేసింది. శత్రువులు ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని అతడిని తప్పుదారి పట్టించారు. కానీ అతడి వద్ద ఉన్న యుద్ధ నైపుణ్యం, ధైర్యం సామాన్యమైనవి కావు. అటువంటి అద్భుతమైన శక్తి కారాగారంలో మగ్గిపోవడం కంటే, దేశ రక్షణకు ఉపయోగపడటం శ్రేయస్కరం. ఇప్పుడు మీరు పాత పద్ధతులు విడిచి ప్రజల పక్షాన నిలిచారు. పాలకుడు మారినప్పుడు, అపార్థం చేసుకున్న ప్రజలు కూడా మారాలి. నా అన్నను శత్రువుగా చూస్తే అతడు మరింత క్రూరుడవుతాడు, అదే అతడిని విశ్వాసపాత్రుడిగా మార్చుకుంటే రాజ్యానికి ఒక బలమైన కవచం లభిస్తుంది. నా వ్యక్తిగత కోపం కంటే రాజ్య భద్రత, మా తండ్రి ఆశయమైన శాంతి నాకు ముఖ్యం. దయచేసి నా నిర్ణయాన్ని నమ్మండి." వరుణ్ మాటల్లోని సత్యాన్ని గ్రహించిన విక్రమ సేనుడు తల ఊపాడు.
వరుణ్ తన మేధస్సుతో అన్నను హంతకుడిగా కాకుండా కాపాడాడు, తండ్రి మరణానికి కారకుడైన రాజును శిక్షించకుండా మార్చాడు, మరియు రాజ్యాన్ని సుభిక్షం చేశాడు. ఇదే నిజమైన ధర్మపథం.
ఆత్మగౌరవం
ఒకప్పుడు దక్షిణ దేశంలో ఉన్న విజయపురి అనే నగరంలో మాధవయ్య అనే పెద్ద వర్తకుడు ఉండేవాడు. అతడు ఏ చిన్న విషయాన్నైనా 'పెట్టుబడి - లాభం' అనే కోణంలోనే చూసేవాడు. అతని బాల్య స్నేహితుడు రంగయ్య మాత్రం సాధారణ వర్తకం చేస్తూ, "డబ్బు సంపాదించడం గొప్ప కాదు మాధవా, మనుషుల నమ్మకాన్ని, ప్రేమను సంపాదించడం గొప్ప," అని చెప్పేవాడు.
వ్యాపారంలో మాధవయ్య రంగయ్య కంటే వేగంగా ధనవంతుడయ్యాడు. కానీ రంగయ్య ఎప్పుడూ తన జీవితంపై సంతృప్తిగానే ఉండేవాడు. "నాకు రోజుకు రెండు పూటలా సుఖంగా భోజనం దొరుకుతోంది, నా పిల్లలకు మంచి విద్య అందిస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలి?" అని తృప్తి పడేవాడు.
కొన్నేళ్లు గడిచాయి. మాధవయ్యకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు జయరామ్, మంచి రూపం, తెలివితేటలు కలవాడు. రెండోవాడు ధనపాల్, కాస్త పొట్టిగా, అంత ఆకర్షణీయంగా ఉండేవాడు కాదు. ధనపాల్కు మంచి సంబంధం దొరకదేమో అని మాధవయ్య బెంగ పెట్టుకున్నాడు.
రంగయ్యకు కూడా ఇద్దరు కుమారులు. పెద్దవాడు మహేష్, అందగాడు, ధైర్యవంతుడు. రెండోవాడు సురేష్, కాస్త బలహీనంగా, అంతగా అందం లేనివాడు.
మహేష్ కు త్వరగానే మంచి సంబంధం కుదిరి, పెళ్లి నిశ్చయం జరిగింది. ఈ విషయం తెలిసిన మాధవయ్య, వెంటనే తన కొడుకులకు కూడా పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. మాధవయ్య ఆస్తిపాస్తులు చూసి చాలామంది వారి ఆడపిల్లలను ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
మాధవయ్య తనకు నచ్చిన గొప్ప కుటుంబం వారిని, తన రెండో కొడుకు ధనపాల్ను చూసుకోవడానికి ఆహ్వానించాడు.
పెళ్లివారు వచ్చారు. మాధవయ్య గొప్పగా వారికి మర్యాదలు చేసి, ధనపాల్ను చూపించాడు. పెళ్లివారికి మాధవయ్య హోదా, డబ్బు బాగా నచ్చాయి, కానీ ధనపాల్ను చూసి అంతగా ఆకర్షితులు కాలేదు.
మధ్యవర్తి ద్వారా వారికి ఈ విషయం తెలిసినప్పుడు, మాధవయ్య వెంటనే అడ్డుతగిలి, "అయ్యో! నా పెద్ద కొడుకు జయరామ్కు ఇప్పటికే మంచి సంబంధం కుదిరిపోయింది. నా ఆశ ఏమిటంటే, ఈ ధనపాల్ పెళ్లి కూడా కుదిరితే, రెండు పెళ్లిళ్లను కలిపి ఘనంగా చేయాలనుకుంటున్నాను," అని అబద్ధం చెప్పాడు.
మాధవయ్య గొప్ప ఆస్తి చూసి, అతనితో వియ్యమందాలనే తపనతో, పెళ్లివారు ధనపాల్నే అంగీకరించి, పెళ్లి నిశ్చయం చేశారు.
________________________________________
తన చిన్న కొడుకు సురెష్ కు సంబంధం కుదరడం కష్టంగా ఉందని బాధపడుతున్న రంగయ్య, సుబ్బయ్యను కలిసి, "మా సురేష్ కు కూడా సంబంధం కుదిరే మార్గం ఏమైనా ఉంటే చెప్పవా?" అని అడిగాడు.
మాధవయ్య నవ్వుతూ, సుబ్బయ్య ఇలా చెప్పాడు: "రంగయ్యా!, నీకు వ్యాపార దృష్టి లేదు. ఇలాంటి విషయాల్లో మనం ఉన్నదంతా ప్రదర్శించాలి. 'చెల్లని సరుకును' (అంటే ధనపాల్ను) ముందు అంటగట్టాకే, 'మంచి సరుకు' (జయరామ్) కోసం ప్రయత్నించాలి. అందుకే, ధనపాల్ను చూడడానికి వచ్చిన వారికి జయరామ్ పెళ్లి కుదిరిపోయిందని అబద్ధం చెప్పాను. ఇప్పుడు జయరామ్కు ఒక్కరోజులో సంబంధం తేవచ్చు. నువ్వేమో మహేష్ పెళ్లిని ముందే అందరికీ తెలిసేలా చేశావు. ఇప్పుడు సురేష్ కోసం ఎవరు వస్తారు? నువ్వు మహేష్ గురించి చేసే ప్రచారం తగ్గించు. పెళ్లివారు వచ్చేదాకా ఏ కొడుకు కోసం చూస్తున్నారో తెలియనివ్వకు. ఆ తర్వాత మహేష్ ను చూపించి, మన వైభవాన్ని ప్రదర్శించు. కొంత ప్రయోజనం ఉంటుంది."
రంగయ్య తీవ్ర నిరాశతో తల అడ్డంగా ఊపి, "మాధవా!, కన్న తండ్రే తన కొడుకును 'చెల్లని సరుకు' అని అనుకుంటే, ఆ పిల్లవాడికి అత్తవారింట్లో ఏ విలువ ఉంటుంది? నా సురేష్ నా దృష్టిలో బంగారం. అతనిలోని మంచి మనసును, తెలివితేటలను గుర్తించే కుటుంబం దొరికే వరకు నేను వేచి ఉండగలను," అన్నాడు.
మాధవయ్య తన సలహాకు సిగ్గుపడ్డాడు.
రంగయ్య తన నిజాయితీని, కొడుకుపై ఉన్న నమ్మకాన్ని వదులుకోలేదు. కొన్ని రోజుల తర్వాత, ప్రసిద్ధ వర్తకుడు ఒకరు తన కూతురి కోసం సురేష్ ను చూశారు. వారు అందం కంటే మంచి మనస్సు, నిజాయితీ, వినయానికి విలువ ఇచ్చేవారు. సురేష్ వారికి నచ్చడంతో గొప్పగా పెళ్లి జరిగింది.
అత్తవారింట్లో ధనపాల్ (మాధవయ్య కొడుకు) కంటే సురేష్ (రంగయ్య కొడుకు) తన నిజాయితీ, సేవ గుణం వల్ల ఎక్కువ గౌరవాన్ని, సుఖాన్ని పొందాడు.
ముఖ్య నీతి: జీవితంలో అత్యంత విలువైన 'సరుకు' - మన డబ్బు కాదు, మన పిల్లల ఆత్మగౌరవం. ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకుండా, నిజాయితీతో పెళ్లి చేసినప్పుడు మాత్రమే జీవితంలో నిజమైన సుఖం లభిస్తుంది.
రాజు_ధర్మదేవత
రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు వుండే వాడు. అతడు సకల విద్యాపారంగతుడు తనకు వచ్చిన విద్యను ఉచితంగా అందరికీ నేర్పే వాడు. వివాహాది శుభకార్యాలకు శుభముహూర్తాలు నిర్ణ యించటంలోనూ కూడా అతడికి ఆఖండ ప్రజ్ఞ ఉన్నది.
కృష్ణశర్మ యింటిలో ఎప్పుడూ పది మంది విద్యార్థులు వేదాధ్యయనం చేస్తూ వుండే వారు. జనంలో అతడి ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూండేది.దేహీ అని ఎవరినీ యాచించక పోవటం వల్ల, కృష్ణశర్మ డబ్బుకు చాలా యిబ్బంది పడేవాడు. శిష్యులకు, తన యింటికి వచ్చిన వారికి కూడాఅతడు శక్తి కొలదీ ఆతిథి మర్యాదలు చేసే వాడు.సంపాదన లేదు సరిగదా ఖర్చులు పెరుగుతూండటం వల్ల కృష్ణశర్మకు తలిదండ్రులు ఇచ్చిన ఆస్తి కూడా హరించుకొని పోసాగింది.ఇప్పుడు అతడికి పెళ్ళీడుకి ఎదిగిన కూతురు వుంది. విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు మగపిల్లలు వున్నారు.
కృష్ణశర్మ భార్య గుణవతికి తన పిల్లల భవిష్యత్తు గురించి బెంగ పట్టు కుంది. అయినా భర్త మనసు నొప్పించ కూడదని ఆమె ఏమి అనేది కాదు.ఇలా ఉండగా, ఒక రోజున కృష్ణ శర్మ కూతురిని చూచుకునేందుకు పెళ్ళివారొచ్చారు. వారికి పిల్లనచ్చింది. అప్పటి కప్పుడు జాతకాలు పరిశీలిం చగా ఒక సంవత్సర కాలం వరకూ శుభముహూర్తం లేదని తేలింది. అప్పుడే పెళ్ళి జరిపించమని చెప్పి పెళ్ళివారు.వెళ్ళి పోయారు.వాళ్ళు వెళ్ళిపోయాక గుణవతి దిగు లుగా, “సంవత్సరం తర్వాత ఈ పెళ్ళి ఎలా చేస్తాం? పెళ్ళంటే చాలా ఖర్చవు తుంది కదా!" అంది.అందుకు కృష్ణశర్మ, "ఆ దిగులు ఆ భగ నాకూ ఉంది. అన్నింటికీ వంతుడే ఉన్నాడు,” అన్నాడు.
"హెూరు గాలిలో దీపం పెట్టి, దేవుడా నీదే భారమంటే ఏమి ప్రయో జనం? మీరు నోరు విడిచి ఎవరిని అడి గినా కనకవర్షం కురుస్తుంది.” అన్నది గుణవతి."నోరు విడిచి అడిగితే అది యాచన ఆవుతుంది. అడగకుండా యిచ్చినదే ప్రతిఫల మవుతుంది. మన పెరట్లో వృక్షాలు చూడు. చిన్నతనంలో వాటికి నీరు పోసి పెంచాము. ఇప్పుడవి అడ క్కుండానే రుచికరమయిన ఫలాల నిస్తున్నాయి." అన్నాడు కృష్ణశర్మ.“వాటవల్లనే మనకు రోజులు కాస్తగడుస్తున్నాయి. మీరు చెప్పినది నిజం. పెరట్లో ఖాళీ స్థలం వున్నది. మరి కాసిని ఫలవృక్షాలైనా నాటండి,” అన్నది గుణ పతి ఉక్రోషంగా.
ఆమె ఆ మాటలు ఉక్రోషంగా అన్నప్పటికీ, కృష్ణశర్మ నిజంగానే గునపం తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. ఒక చోట అతడు తవ్వేసరికి. అడుగు నేలలో ఖంగుమన్న శబ్దం అయింది. మరికాస్త తవ్వి చూడగా, పురాతనకాలపు రాగి బిందె ఒకటి అక్కడ వుంది దాని నిండుగా బంగారు నాణేలు వున్నవి.
గుణవతి పరుగున పెరట్లోకి వచ్చి, "ధర్మదేవత మనను కరుణించింది. మన కష్టాలు అన్నీ ఈనాటితో తీరి పోయాయి." అన్నది సంతోషంగా,అందుకు కృష్ణశర్మ నవ్వి, "ఇంత కాలం నేను నియమం తప్ప కుండా జీవించాను. నీతినే నమ్ముకుని బ్రతి కాను. భూమిలో ఉండే నిధి నిక్షేపాలు మనవి కావు రాజు చెందుతాయి. దీనిని రాజు కప్పగించటమే బాధ్యత,” అని భార్య ఎంత చెపుతున్నా వినక, ఆ బిందెను తీసుకుని వెళ్ళి, ఆ దేశపు రాజు శూరసేనుడికి ఇచ్చాడు.రాజు అతణ్ణి మెచ్చుకుని పంపే"కనీసం మీ న్యాయులున్దికి మెచ్చు తుని మంచి బహుమతినైనా యివ్వ లేదు ఆ రాజు" అంటూ తిరిగి వచ్చిన భర్తను మాచి బాధ పడింది. గుణవతమంచి పౌరుడిగా నా బాధ్యత నిర్వ హించాను. బాధ్యతకు ప్రతిఫలాన్నికాదు" అంటూ భార్యను మండలిం చాడు కృష్ణశర్మ-
మరుసటి ఉదయం ఒక మామిడి మొక్కను తాను తీసిన గోతిలో నాలా లని కృష్ణశర్మ అనుకుని వెళ్ళే సరికి. అతడికి అందులో చిత్రంగా మరో రాగి బిండె కనపడింది. అందులోనూ విండుగా బంగారు వాణేలు వున్నాయి.జరిగిన అద్భుతానికి ఆశ్చర్యపడి నప్పటికీ, కృష్ణశర్మ మళ్ళీ ఆ బిందెను కూడా రాజుకే తిసుకుని వెళ్ళఅలా ఒక మాడం రోజల పాటురోజూ తనతో రాగి దించాడు బంగారు కాసులు తెచ్చిస్తున్న కృష్ణశర్మ మీద రాజుకు ఆసక్తి కలిగింది. ఒకే యింటిపెరట్లో అన్ని బిందెలు దొరకటము విచిత్రంగా తోచి, అంత వరకూ కృష్ణ శర్మ తెచ్చిన బంగారు కాసులు ఎన్ని వున్నాయో లెక్క చూడమని కోశాధి పతికి చెప్పాడు రాజు.కోశాధిపతి వెళ్ళి చూచేది కొళా గారంలో ఎంత వెతికినా ఒక్క రాగి బించా కూడా లేదు- అతడు గుండెవిష బాదుకుంటూ వెళ్ళి రాజుకు యము చెప్పాడు. రాజు కూడా దీనికి ఎంతో ఆశ్చర్యపడి. అసలు విషయంపరిశోధించాలని అనుకున్నారు.కాసేపటికి ఎప్పటిలాగే, కృష్ణశర్మ బిందెను తిముకుని రాజును చూడఎచ్చాడు. స్వయంగా దాచటమే కాశం రాజు- వించెము తానే మీద తన పేరు కూడా వ్రాశాడు. కామిమర్నాటి కల్లా చించి మాయ మయింది. కృష్ణశర్మ ఎప్పటి లాగా మరునాడు మరో కుందె తీసుకుని వచ్చాడు.శూరపేముడా బిందెను పరిశీలించి చూడగా దానిపై స్వహస్తాలతో వ్రాసిన తన పేరు కనపడింది. అప్పుడు రాజుకుఅబెల్మ్కలిగిన ఆగ్రహం అంతా అంతా కాదు.తక్షణం కృష్ణశర్మపై చోర నేరం అభియోగించి, కారాగారంలో పడవే యించాడు.
రాజుకు తనపై ఆగ్రహం ఎందుకు కలిగిందో, తను చేసిన నేరమేమిలో కూడా తెలియని కృష్ణశర్మ విచారంగా కారాగారంలో ఉండగా. కాసేపటికి ఒక భటుడు అండి వద్దకు వచ్చి, "అయ్యా, జరిగిన పొరపాటుకు రాజు గాన ఎంతో విచారించారు తమరిని ఇంటికి వెళ్ళి పోవచ్చునని చెప్పారు."ఎఉతుర్ తలుపులు తెరిచాడు.రాజుల మనసులు చిత్రమైనవి. అని అనుకుంటూ కృష్ణశర్మ ఇంటికి వెళ్ళి పోయాడు. అయితే జరిగినదేమీ తన భార్యకు చెప్పలేదు.గుణవతి మాత్రం "ఇలా ఎంత కాలమని ప్రతి రోజూ రాజదర్శనానికి వెళతాము? నందువల్ల, మీ శిష్యులకు విద్యాదానం కూడా ఆగి పోయింది." అన్నది."అంతా అభగవంతుడి నిర్ణయం అని ఊరుకున్నాడు కృష్ణ కర్మ.
మర్నాడు అతడికి తన పెరటి గోతిలో మరో రాగి నందె కనబడింది. కృష్ణశర్మ తటపటాయించ కుండా దానిని కూడా తీసుకుని రాజదర్శనానికి వెళ్ళాడు.శూరసేనుడు కృష్ణశర్మను చూచి ఆశ్చర్యపడి, "నిన్న నిన్ను కాలా గారంలో పడవేటుంచాను కదా? ఈ వించా నీకు కారాగారంలో దొరికిందా?" అన్నాడు "ముందు తమరు నన్ను కాలా గారంలో పడవేయుంచారు. తర్వాత దయతో మనసు మార్చుకుని కన్ను విడిపించారు. చెప్పాడు కృష్ణశర్మ-జరిగినదిఅప్పుడు రాజుకు తన భటులు మీద అనుమానం వచ్చింది. రోజుకో బిందెడు బంగారు కాసులు రాజాకే మువ్వగల కృష్ణశర్మ భటులకు కూడా ఎంత బంగారమైనా కానుకగా యివ్వగలడు. అందుకు ఆశపడి ఏ భటుడో అతణ్ణి విడిపించి ఉంటారు."నిన్ను విడిపించిన భటుడిని గుర్తు వట్టి చెప్పగలవా?” అని అడిగాడు రాజా-కృష్ణశర్తకు వారిలో తనను విడి పెంచిన భటుడు కనపడలేదు. విషయం శూరసేనుడికి చెప్పాడు.
"నీవు నిజం చెప్పటం లేదు. వీరిలో నిన్ను విడిపించిన వారెవరో చెప్పు." అన్నాడు. శూరసేనుడు కోపంగా.కృష్ణశర్లు తాను నిజమే చెపుతున్నా దీని ఎంత మొత్తుకున్నా రాజు వినలేదు.
చివరిశీ రాజు. "నిజం చెప్పకపోతే నీకు శిరచ్ఛేదమే తగిన అన్నాడు.అయినప్పటికీ కృష్ణశర్మ తనకు ఏమి తెలియదనే అన్నాడు.రాజా అప్పటికి అప్పుడు ఇద్దరు భటులను రావించి, కృష్ణశర్మను అరణ్య మధ్యలోకి తీసుకుని వెళ్ళి శిరచ్ఛేదం కావించమని చెప్పాడు.శూరసేనుడి మంత్రి సుబుద్ధి చాలాకాలంగా ఈ వ్యవహారం కనిపెడుతూనే ఉన్నాడు.అతడు రాజుతో, "ప్రభూ, తమకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకుం టుంది. శిక్ష విషయంలో మరొక్క “సారి ఆలోచించండి." అన్నాడు.
"విద్య నేర్చిన వాడు బ్రాహ్మణుడు కావి, నేరస్థుడు బ్రాహ్మణుడు కాడు. నేరస్థులను శిక్షించటం రాజధర్మం. ఈ విషయంలో మీరు జోక్యం చేసు కొనవద్దు" అని మంత్రిని మండలిం"అంత వరకూ జరిగిన దాన్ని బట్టి చూడగా, ఈ బ్రాహ్మణుడు ఈ శిక్షను కూడా తప్పించు కొనగలడని వారు. తొస్తున్నది." అన్నాడు సుబుద్ధి."అది అసంభవం." అన్నాడు. శూర పేనుడు నమ్మకంగా,అయితే మరుసటి దినం కృష్ణ శర్మ యథా ప్రకారం మరో రాగి బిందెను మోసుకుని, రాజదర్శనానికివచ్చాడు. దానిపై శూరసేనుడు స్వహ పాలతో వ్రాసిన పేరున్నది.
"మళ్ళీ ఎలా వచ్చావు?" అన్నాడు. శూరసేనుడు ఆశ్చర్యంగా,"ప్రభూ, తమరు నన్ను పరిక్షిస్తు న్నారు. విన్న మేము సగం దారిలో ఉండగా, తమరు పలసిన దూత రాజు శావనంతో వచ్చి పన్ను విడిపించి వెళి పోయాడు." అన్నాడు కృష్ణశర్మ.హెవేరు. శూరసేనుడు. ఆ దూత?" అన్నాడు.గుర్తు పట్టలేక పోయాడు. కృష్ణశర్మ దూత ఎవరో చూచిరాజు కృష్ణశర్మను చంపటానికి నియోగించిన భటుల కోసం కబురంప భోగా, "ప్రభూ! వారం దినాలు సెలవు తీసుకోమని నిన్న తమరు వారిని రాజ శాసనం ద్వారా ఆదేశించారు. వారు شه తమ గ్రామాలకు వెళ్ళి పోయారు." అన్నాడు కృష్ణశర్మ.
శూరపేముడు కోపంగా, “నీవు ఒక మాయానివి. నిన్ను నేనే స్వయంగా హతమార్చగలను." అని కత్తి దూయ భోగా, మంత్రి సుబుద్ధి వారించి. "ప్రభూ, అతడిని ధర్మదేవత కాపాడు తుప్పదని నా అనుమానం. తమరు ఆవేశపడక, విషయాన్ని కూటంక వంగా చర్చించ వలని ఉన్నది." అన్నాడు.
కృష్ణశర్మ తిరిగి వస్తాడన్న విషయం ముందుగానే ఊహించిన సుబుద్ధి బుద్ధి చాతుర్యాన్ని గౌరవించి, కృష్ణశర్మను ఏకాంతానికి పిలిచి, సుబుద్ధి సమక్షంలో"విగ్రహంగా విషయాన్ని చర్చించాడు. శూరసేనుడు. అప్పుడు రాజుకు కృష్ణ శర్మ స్వీయ వృత్తాంతం తెలిసింది.
"నీపు చెపుతున్నది నమ్మ ఉగ్గదిగా లేదు." అన్నాడు రాజు.
"ప్రభూ, అతడి గురించి నేను ఆరా θώ అతడు నిజమే చెవు తున్నాడు." అన్నాడు. సుబుద్ధి,
"అతడి గురించి నీవు ఎందుకు ఆరా ఏశావు?" అన్నాడు శూరసేనుడు.
"ప్రభూ, తమరే విధానంగా ఆలోచిం చండి. ఒక పేద బ్రాహ్మణుడు ప్రతి దినం మీకు బంగారు కాసులు తెచ్చి యిస్తున్నాడు. మీరు తన మీద నేదా రోపణ చేసినా, అతడు చలించ లేదు. మీరు శిరచ్ఛేదం చేస్తానని బెదిరించినా. ఏదో ఒక భటుణ్ణి చూపించి. తన ప్రాణాలు రక్షించుకోవాలని తలచని నిజాయితీపరుడు. ఇతడిని ధర్మదేవతే కాపాడుతున్న దన్న నమ్మకం కలిగి నేను విషయం ఆరా తీశాను." అన్నాడు.
"అయితే. అతడు రోజూ నాకు బించి తెచ్చి ఇవ్వటం ఎందుకు? ఆవి మాయం కావట మెందుకు?" అన్నాడు. శూరసేనుడు.
"ప్రభూ, విధి నిక్షేపాలను రాజు ధవంగా భావించి, కృష్ణశర్మ మీకు తెచ్చిస్తున్నాడు. కాని, రాగి బిందెలోని బంగారు కానులు విధినిక్షేపం కాదు. ధర్మదేవత అతడికి ఇచ్చిన బహుమతి. అది గ్రహించిక, మీరు కాసులు తీసుకుంటుంటే. ధర్మదేవత తిరిగి అనితానే అతడికి చేరవేస్తున్నది. నిజానికి ఆ కాసులు కృష్ణశర్మవి. ఆ పొత్తును మీరు అతడికి దానంగా యవ్వండి. తిరిగి అతడికి తన అంటి పెరటి గోతిలో శాసుల బిందె కనపడదు." అన్నాడు."ధర్మదేవతే కృష్ణశర్మ కాబంచెను కానుకగా యిచ్చిందని నీవు ఎందుకు బావిస్తున్నావు?" అన్నాడు రాజు ఆశ్చర్యంగా.
"తమరు కృష్ణశర్మ విజాయితీని సత్కరించాలని ఎప్పడూ అనుకోలేదు. కాని, అతడిపై అనుమానం కలగానే అతడిని శిక్షించాలని అనుకున్నారు. ఏ దేశంలో రాజు తన ప్రజల యోగ క్షేమాలను స్వయంగా విదారించ లేకున్నాడో ఆ దేశ ప్రజలు ప్రతి ఫలా నిజ ధర్మదేవత పైనే ఆధారపడతారు. ధర్మదేవతిచ్చే ప్రతిఫలంలో రాజుకు హక్కు వుండదు," అన్నాడు సుబుద్ధి..తన పరిపాలనలో లోపమున్నడని, అందువల్ల కృష్ణశర్మవంటి ప్రతిభావం పన్నులు ఎందరో శష్టపడుతున్నారని గ్రహించిన రాజు, కృష్ణ శర్మణ రాగి వించెను దానంగా యిచ్చి, తర్వాత సబుద్ధి సహాయంతో తన లోపాలన్నీ దిద్దుకుని, చాలా ఏళ్ళు ప్రజా రంజకముగా పాలన చేశాడు.
అది విన్న మహారాణి- 'ప్రజలకు రాజే ధర్మదేవత, రాజు రాజులా మనట నప్పుడు ప్రజలు ధర్మదేవత పైనే తప్పక ఆధార పడాలి. నా భర్తను ప్రజలు ధర్మదేవత అని కొనియాడేలా
చేయటం మహారాణిగా నా బాధ్యత' అని అనుకుంటూ వెళ్ళి పోయింది.
Subscribe to:
Comments (Atom)