Thursday, 20 August 2026

శ్రీ వేదాంత దేశికుల ‘పాదుకాసహస్రం’ నుండి… యాయాయాయాయాయాయాయా యాయాయాయాయాయాయాయా | యాయాయాయాయాయాయాయా యాయాయాయాయాయాయాయా || పద విభాగం : యాయాయా, ఆయ, ఆయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, ఆయాయాయ, ఆయాయాయ, ఆయాయా, యా, యా, యా, యా, యా, యా, యా, యా. భావం: భగవంతునికి అలంకారమైన ఈ పాదుకలు మనకు అన్ని శుభాలను కలిగిస్తాయి. సర్వరోగాలను హరిస్తాయి. నిరంతరం అతని సన్నిధిలో ఉండాలనే మన కోరికను సఫలం చేసే జ్ఞానాన్ని చేకూర్చుతాయి. ఈ పాదుకల వలన మనం ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ చేరుకోవచ్చు. అటువంటి మహిమాన్వితమైన ప్రభుపాదుకలకు వందనం.

No comments:

Post a Comment