Thursday, 20 August 2026

శ్రీ భాష్యం విజయసారథిగారి ‘ప్రహేళికలు’ సంకలనం నుండి… రరోరరే రరరురో రురూరూరు రురోరరే | రేరే రేరారారరరే రారేరారి రి రారిరా || పదవిభాగం – ర, రోః, అరేః, అర, రురోః, ఉః, ఊరూరుః, ఉరః, అరరే, ర, ఈరే, రీరారా, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా. అన్వయం – ర, రోః, అర, రురోః, అరేః, ర, ఈరే, ఉరః, అరరే, రీరారా, ఊరు + ఊరుః, ఉః, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా. ప్రతిపదార్థాలు – ర = రామశబ్దంలోని రేఫ (రకారం) వలన రోః = భయం కలవాడైన, అర = వేగంగా పరుగెత్తే రురోః = హరిణరూపంలో ఉన్న మారీచునికి అరేః = శత్రువైన శ్రీరాముని యొక్క ర = కౌస్తుభమణిని ఈరే = పొంది ఉన్న అరః + అరరే = కవాటంవంటి వక్షస్థలంలో రీరారా = లీల నాపాదించే (రలయో రభేదః) ఊరు + ఊరుః = తొడలచే గొప్పదైన ఉః = సీత భూమిక దాల్చిన లక్ష్మిని అరరర = తన నిలయానికి తీసికొని వెళ్ళిన ఇరార = సముద్రద్వీపాన్ని (లంకను) పొంది ఉన్న ఇరారి = భూమికి విరోధి అయిన రావణునకు రిః = నాశనాన్ని కల్గించిన దగుచు ఆరి = చెలికత్తెలను రా = పొందింది. శ్రీరామ పత్ని సీత లంకలో రావణ నాశనం సూచించే త్రిజట వంటి చెలికత్తెల్ని పొందిందని అర్థం.

No comments:

Post a Comment