Friday, 21 August 2026
### తెలివైన మూర్ఖుడు
ఒకప్పుడు **చింతలవరం** అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు—**సూరి, మాధవ్, చిన్ని**. మొదటి ఇద్దరూ తెలివైనవాళ్లు. చిన్ని మాత్రం అమాయకుడు. అతను ఏది చెప్పినా నిజమేనని నమ్మేవాడు.
రామయ్య చనిపోయిన తర్వాత పెద్ద కొడుకులు పొలం, ఇల్లు, పశువులు అన్నీ పంచుకున్నారు. చిన్ని మాత్రం తన వాటా అడిగాడు.
“నీకేం తెలుసు? నువ్వు ఏది ఇచ్చినా పోగొట్టుకుంటావు. నీకు ఆస్తి ఇచ్చినా ఉపయోగం లేదు,” అంటూ అన్నలు అతనికి ఒక **పాత బండి, బలహీనమైన గాడిద** మాత్రమే ఇచ్చారు.
చిన్ని మాత్రం చాలా సంతోషించాడు.
“అన్నలు నాకు బండి, గాడిద ఇచ్చారు. ఇదే నా అదృష్టం!” అన్నాడు.
కొన్ని రోజుల తర్వాత సమీపంలోని **మారేడు సంత**కు వెళ్లాలని అనుకున్నాడు. గాడిదను బండికి కట్టి బయలుదేరాడు.
దారిలో ఒక కొండ పక్కన పాత **రాతి బావి** కనిపించింది. బావిలో గాలి వీచినప్పుడల్లా “ఊఁ...ఊఁ...” అనే శబ్దం వస్తోంది.
చిన్ని ఆ శబ్దం విని ఆగిపోయాడు.
“ఎవరయ్యా అక్కడ? నా గాడిదను కొనాలనుకుంటున్నావా?” అని అడిగాడు.
బావి నుంచి మళ్లీ “ఊఁ...ఊఁ...” అనే శబ్దం వచ్చింది.
“అయితే బేరం కుదిరినట్టే! యాభై రూపాయలు ఇవ్వాలి,” అన్నాడు చిన్ని.
బావి మళ్లీ శబ్దం చేసింది.
“సరే. రేపు డబ్బు ఇస్తావన్నమాట. ఇదిగో గాడిదను ఇక్కడే కట్టేస్తాను,” అంటూ గాడిదను బావి పక్కనున్న చెట్టుకు కట్టి ఇంటికి వచ్చేశాడు.
అన్నలు అడిగారు.
“గాడిదను ఎంతకు అమ్మావు?”
“యాభై రూపాయలకు!” అని చిన్ని ఆనందంగా చెప్పాడు.
“డబ్బు ఎక్కడ?”
“రేపు ఇస్తానన్నాడు.”
అన్నలు నవ్వుకుంటూ, “నువ్వు నిజంగానే అమాయకుడివి!” అన్నారు.
మరుసటి రోజు చిన్ని బావి దగ్గరకు వెళ్లాడు. గాడిద అక్కడ లేదు. రాత్రి అడవి జంతువులు దాన్ని తీసుకెళ్లాయి.
చిన్ని బావిని చూసి,
“నా యాభై రూపాయలు ఇవ్వు,” అన్నాడు.
బావి నుంచి మళ్లీ “ఊఁ...ఊఁ...” అనే శబ్దం వచ్చింది.
“మళ్లీ రేపంటావా? సరే. కానీ రేపు తప్పకుండా ఇవ్వాలి!” అంటూ ఇంటికి వెళ్లాడు.
మూడో రోజు కోపంతో ఒక **ఇనుప కర్ర** తీసుకుని బావి దగ్గరకు వెళ్లాడు.
“నా డబ్బు ఎక్కడ?” అని గట్టిగా అడిగాడు.
బావి నుంచి మళ్లీ అదే శబ్దం వచ్చింది.
చిన్ని కోపంతో బావి పక్కనున్న పెద్ద రాయిని ఇనుప కర్రతో కొట్టాడు. రాయి పక్కకు జరగగానే ఒక చిన్న గుహ కనిపించింది.
ఆ గుహలో పాతకాలం నాటి **వెండి నాణేలు, బంగారు ఆభరణాలు** దాచబడి ఉన్నాయి. అవి ఒకప్పుడు దొంగల బృందం దాచిన సంపద.
చిన్ని ఆశ్చర్యపోయాడు.
“అయ్యో! నా యాభై రూపాయలకంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉంది!” అంటూ తనకు సాధ్యమైనంత సంపదను మూటకట్టి ఇంటికి తీసుకెళ్లాడు.
అన్నలు ఆ సంపద చూసి ఆశ్చర్యపోయారు.
“ఇది ఎక్కడ దొరికింది?” అని అడిగారు.
చిన్ని జరిగినదంతా చెప్పాడు.
అన్నల కళ్లలో ఆశ పుట్టింది.
“మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్లు,” అన్నారు.
ముగ్గురూ రాత్రి బావి దగ్గరకు వెళ్లి, గుహలో మిగిలిన సంపదను మూడు మూటలుగా కట్టుకున్నారు.
తిరుగు ప్రయాణంలో వారికి **అడవిని కాపాడే అధికారి** ఎదురయ్యాడు.
“ఆ మూటల్లో ఏముంది?” అని అడిగాడు.
పెద్ద అన్నలు వెంటనే,
“పాత ఇనుప సామాన్లు,” అన్నారు.
కానీ చిన్ని మాత్రం అమాయకంగా,
“ఇనుప సామాన్లు కావు! వెండి, బంగారం ఉన్నాయి. కావాలంటే చూడండి!” అన్నాడు.
అధికారి మూట విప్పి సంపదను చూసి ఆశపడ్డాడు.
“ఇంత సంపద మీకు ఎక్కడ దొరికింది?” అంటూ ఒక మూటను తనవైపు లాగుకున్నాడు.
పెద్ద అన్నలు భయపడ్డారు. చిన్ని మాత్రం అతని చేతిలోని మూటను లాగేసుకుని,
“అది మాది! మీరు తీసుకోకూడదు,” అన్నాడు.
అధికారి కోపంతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ముగ్గురూ అక్కడి నుంచి పరుగెత్తి గ్రామానికి చేరుకున్నారు.
తర్వాత అన్నలు చిన్ని చేసిన పొరపాటు వల్ల పెద్ద సమస్య వస్తుందని భయపడ్డారు. కానీ చిన్ని మాత్రం గ్రామ సభకు వెళ్లి జరిగిన విషయమంతా నిజాయితీగా చెప్పేశాడు.
గ్రామస్థులు బావి దగ్గరకు వెళ్లి పరిశీలించారు. అక్కడ దొరికిన సంపద నిజంగానే చాలా కాలం క్రితం దొంగలు దాచినదని తెలిసింది.
గ్రామ పెద్ద అన్నదమ్ములను పిలిచి,
“చిన్నిని మీరు వెర్రివాడని అనుకున్నారు. కానీ అతని అమాయకత్వం వల్ల దాచిన సంపద బయటపడింది. అయితే దొరికిన సంపదను మీరంతా స్వంతం చేసుకోలేరు. గ్రామ చట్టం ప్రకారం దీనిని అధికారులకు అప్పగించాలి,” అన్నాడు.
అన్నలు తలలు వంచుకున్నారు.
చిన్ని మాత్రం నవ్వుతూ,
“అన్నలూ! నేను తెలివైనవాడినో, వెర్రివాడినో నాకు తెలియదు. కానీ ఇక నుంచి ఎవరి మాటనైనా నమ్మేముందు ఒక్కసారి ఆలోచిస్తాను!” అన్నాడు.
అప్పుడు పెద్ద అన్నలు తమ తప్పును ఒప్పుకున్నారు.
“నిన్ను వెర్రివాడని తక్కువచేశాం. కానీ నిజమైన వెర్రితనం నీలో కాదు—**ఆలోచించకుండా ఇతరులను తక్కువగా చూడడంలో ఉంది**,” అన్నారు.
ఆ రోజు నుంచి ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి జీవించారు.
**నీతి:**
**ఎవరినీ రూపం, మాట, అమాయకత్వం చూసి తక్కువగా అంచనా వేయకూడదు. తెలివితో పాటు నిజాయితీ, ఆలోచన కూడా జీవితంలో ఎంతో ముఖ్యం.**
Thursday, 20 August 2026
డండడ డేడిడ డైడా
డండా డోడౌడ డాడడాడా డాడై
డండూడిడౌడడడడా
డండడడడ డండడండ డం! డడ!! డండమ్!!!
ప్రతిపదార్ధాలు –
డం = డమరుకము యొక్క,
డ = శివంకరమైన నాదమునందు;
డ = ప్రీతి గొన్న స్వామీ! పరమేశ్వరా!
డే = దాంపత్యధర్మమును అనుసరించి,
డి = గౌరీదేవిని,
డ = మేని సగభాగమున తాల్చిన దేవా!
డై = వృషభము,
డా = విజయధ్వజముగా కలవాఁడా!
డం = తృతీయనేత్రమందు,
డా = అగ్నిని తాల్చిన విభూ!
డో = దుష్టుల,
డౌ = సంహారమునందు,
డ = రక్తివహించిన ప్రభూ!
డా = శ్రీదేవిని,
డ = వామభాగమున నిలిపికొన్న శ్రీహరిచే,
డా = జయోక్తులతో,
డా = సన్నుతింపబడిన దేవా!
డా = వెన్నెల వంటి,
డై = నందికేశ్వరుని శరీరఛ్చాయ వంటి,
డం = పాల వంటి,
డూ = ఆదిశేషుని వంటి,
డి = గౌరీదేవి వంటి,
డౌ = కామధేనువు వంటి,
డ = శంఖము వంటి,
డ = చంద్రుని వంటి,
డ = అమృతము వంటి, డా=తెల్లని దరహాసము గల ఱేఁడా!
డం = గాయనుల యొక్క,
డ = స్తోత్రములచే,
డ = ప్రసన్నుఁడ వగు,
డ = సర్వేశ్వరుఁడవైన,
డ = పరమేశ్వరా!
డం = దుర్మతులకు,
డ = త్రాసమును కలిగించు,
డం = డమరువు యొక్క,
డ = భీషణమైన ధ్వని కలవాఁడా!
డం! డడ!! డండమ్!!! అని డమరుకోదితముతో శివునికి నాదనివేదనం. విస్తరభీతి వల్ల నిఘంటువులను చూపలేదు. ఈ అర్థాలన్నీ సప్రమాణాలే.
దాదదో దుద్దదుద్దాదీ
దాదదోదూదదీదదోః |
దుద్దాదం దదదే దుద్దే
దాదాదద దదోऽదదః ||
దాదదః =శ్రీ కృష్ణుడు,
దుద్దరుత=వరముల నన్నిటిని,
దాదీ=ఇచ్చువాడు,
దాదదః=పాపములను దహించు వాడు,
దదోః=దుష్టులను,
దూదదీ = శిక్షించువాడు
దుద్దాదం = మం చి వారిని,
దుద్దే = కాపాడుట యందు,
దదదే = దీక్ష గలవాడు
దదోదదః = ధర్మాధర్మములను,
దాదా = మిక్కిలిగా,
ద ద = ధరించువాడు అనగా ధర్మమును, అధర్మములోని ధర్మమును కాపాడు వాడు.
భావం: శ్రీకృష్ణుడు అన్ని వరాలను ఇచ్చేవాడు, పాపసంహారకుడు, పరిశుద్ధుడు, దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడేవాడు, ధర్మరక్షకుడు
శ్రీ వేదాంత దేశికుల ‘పాదుకాసహస్రం’ నుండి…
యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా |
యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా ||
పద విభాగం :
యాయాయా, ఆయ, ఆయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, ఆయాయాయ, ఆయాయాయ, ఆయాయా, యా, యా, యా, యా, యా, యా, యా, యా.
భావం:
భగవంతునికి అలంకారమైన ఈ పాదుకలు మనకు అన్ని శుభాలను కలిగిస్తాయి. సర్వరోగాలను హరిస్తాయి. నిరంతరం అతని సన్నిధిలో ఉండాలనే మన కోరికను సఫలం చేసే జ్ఞానాన్ని చేకూర్చుతాయి. ఈ పాదుకల వలన మనం ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ చేరుకోవచ్చు. అటువంటి మహిమాన్వితమైన ప్రభుపాదుకలకు వందనం.
శ్రీ భాష్యం విజయసారథిగారి ‘ప్రహేళికలు’ సంకలనం నుండి…
రరోరరే రరరురో
రురూరూరు రురోరరే |
రేరే రేరారారరరే
రారేరారి రి రారిరా ||
పదవిభాగం –
ర, రోః, అరేః, అర, రురోః, ఉః, ఊరూరుః, ఉరః, అరరే, ర, ఈరే, రీరారా, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా.
అన్వయం –
ర, రోః, అర, రురోః, అరేః, ర, ఈరే, ఉరః, అరరే, రీరారా, ఊరు + ఊరుః, ఉః, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా.
ప్రతిపదార్థాలు –
ర = రామశబ్దంలోని రేఫ (రకారం) వలన
రోః = భయం కలవాడైన,
అర = వేగంగా పరుగెత్తే
రురోః = హరిణరూపంలో ఉన్న మారీచునికి
అరేః = శత్రువైన శ్రీరాముని యొక్క
ర = కౌస్తుభమణిని
ఈరే = పొంది ఉన్న
అరః + అరరే = కవాటంవంటి వక్షస్థలంలో
రీరారా = లీల నాపాదించే (రలయో రభేదః)
ఊరు + ఊరుః = తొడలచే గొప్పదైన
ఉః = సీత భూమిక దాల్చిన లక్ష్మిని
అరరర = తన నిలయానికి తీసికొని వెళ్ళిన
ఇరార = సముద్రద్వీపాన్ని (లంకను) పొంది ఉన్న
ఇరారి = భూమికి విరోధి అయిన రావణునకు
రిః = నాశనాన్ని కల్గించిన దగుచు
ఆరి = చెలికత్తెలను
రా = పొందింది.
శ్రీరామ పత్ని సీత లంకలో రావణ నాశనం సూచించే త్రిజట వంటి చెలికత్తెల్ని పొందిందని అర్థం.
అల్లంరాజు రంగశాయిగారు మ గుణింతంతో ఓ అందమైన కంద పద్యాన్ని అందించారు
మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
ప్రతిపదార్థం :
మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖము గల
మామా = మా యొక్క
మా = మేథ
మిమ్ము, ఒమ్ము = అనుకూలించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము
మిమై = మీ శరీరము
మేము ఏమే = మేము మేమే
మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుము
ఇమ్ము+ఔము = అనుకూలమగుమా
భావం:
చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును. గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము. సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం.
క్రింది శ్లోకంలో అన్ని హల్లులూ వరుసక్రమంలో ఉన్నాయి.
కః ఖగౌఘాఙచిచ్ఛౌజా
ఝూఞ్ జ్ఞోటౌఠీడడంఢణాః |
తథోదధీన్ పఫర్బాభీ
ర్మయోऽరిల్వాశిషాం సహః ||
ఈ శ్లోకం ప్రతిపదార్థాలు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. తాత్పర్యం మాత్రం దొరికింది.
తాత్పర్యం
విహంగప్రేమికుడు, సంపూర్ణజ్ఞాని, పరబలాపహర్త, శత్రుసంహారకుడు, ఉత్తముడు, సుస్థిరుడు, నిర్భయుడు, సముద్రాలను నీటితో నింపినవాడు, మాయా స్వరూపుడు (అయిన పరబ్రహ్మ) దయ సర్వపాపాలను హరిస్తుంది.
ఒకే అక్షరాన్ని ఉపయోగించి ఛందోబద్ధంగా రచించిన పద్యాలను ఏకాక్షర పద్యాలుగా పిలుస్తారు. అటువంటి పద్య కుసుమాలను కొన్నింటిని ఈ శీర్షికలో చూద్దాం.
౧) శ్రీ ఏల్చూరి మురుళీధర రావు గారి పూరణ[1]
డండడ డేడిడ డైడా
డండా డోడౌడ డాడడాడా డాడై
డండూడిడౌడడడడా
డండడడడ డండడండ డం! డడ!! డండమ్!!!
ప్రతిపదార్ధాలు –
డం = డమరుకము యొక్క,
డ = శివంకరమైన నాదమునందు;
డ = ప్రీతి గొన్న స్వామీ! పరమేశ్వరా!
డే = దాంపత్యధర్మమును అనుసరించి,
డి = గౌరీదేవిని,
డ = మేని సగభాగమున తాల్చిన దేవా!
డై = వృషభము,
డా = విజయధ్వజముగా కలవాఁడా!
డం = తృతీయనేత్రమందు,
డా = అగ్నిని తాల్చిన విభూ!
డో = దుష్టుల,
డౌ = సంహారమునందు,
డ = రక్తివహించిన ప్రభూ!
డా = శ్రీదేవిని,
డ = వామభాగమున నిలిపికొన్న శ్రీహరిచే,
డా = జయోక్తులతో,
డా = సన్నుతింపబడిన దేవా!
డా = వెన్నెల వంటి,
డై = నందికేశ్వరుని శరీరఛ్చాయ వంటి,
డం = పాల వంటి,
డూ = ఆదిశేషుని వంటి,
డి = గౌరీదేవి వంటి,
డౌ = కామధేనువు వంటి,
డ = శంఖము వంటి,
డ = చంద్రుని వంటి,
డ = అమృతము వంటి, డా=తెల్లని దరహాసము గల ఱేఁడా!
డం = గాయనుల యొక్క,
డ = స్తోత్రములచే,
డ = ప్రసన్నుఁడ వగు,
డ = సర్వేశ్వరుఁడవైన,
డ = పరమేశ్వరా!
డం = దుర్మతులకు,
డ = త్రాసమును కలిగించు,
డం = డమరువు యొక్క,
డ = భీషణమైన ధ్వని కలవాఁడా!
డం! డడ!! డండమ్!!! అని డమరుకోదితముతో శివునికి నాదనివేదనం. విస్తరభీతి వల్ల నిఘంటువులను చూపలేదు. ఈ అర్థాలన్నీ సప్రమాణాలే.
మామకు మామ ఐనవాడు
ఉ.
మామను సంహరించి, యొక మామను గర్వ మడంచి, య న్నిశా
మామను రాజుఁ జేసి, యొక మామ తనూజున కాత్మబంధువై,
మామకుఁ గన్ను లిచ్చి, సుతు మన్మథు నింతికిఁ దానె మామయై,
మామకు మామయైన పరమాత్ముఁడు మీకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.
(చాటుపద్య రత్నాకరము)
భావం -
మామ అయిన కంసుని సంహరించి, వారధి కట్టడానికి ముందు తన మామ అయినసముద్రుని గర్వాన్ని అణచి, నిశామామ అయిన చంద్రునికి `రాజు` అనే పేరునిచ్చి,మామ కొడుకైన అర్జునునకు ఆప్తుడై, మామ అయినధృతరాష్ట్రునికి కన్నులిచ్చి, కొడుకైనమన్మథుని భార్య రతీదేవికి తానే మామ అయి, తనకు లక్ష్మి నిచ్చిన మామ సముద్రునికితన కూతురైన గంగనిచ్చి అతనికి మామ అయిన విష్ణుదేవుడు మీకు ప్రసన్నుడౌతాడు
Subscribe to:
Posts (Atom)