కాళిదాసు ఆశువుగా చెప్పిన శ్లోకం.
షడ్జామడ్జ ఖరాడ్జవీడ్జ వసుధారాడ్జాలాంశ్చ మడ్జ్గాఖరే
జడ్జట్కిట్కి ధరాడ్జరేడ్ఘణ ఘణఃఖడ్జోతవీడ్యద్భ్రమా
వీడ్యాలుడ్భ్రమ లుష్ట్రయట్రియపదా డడ్గ్రడడ్గ్రః
పాదౌ టేట్ప్రట టట్ప్ర టట్ప్రటరసత్
ప్రఖ్యాత సఖ్యోదయీ
తాత్పర్యము
ఈ పద్యములో కవి ఇద్దరి పాదాల గురించి వర్ణించారు. ఆ ఇద్దరూ సర్వ లోక రక్షకులైన హరి(విష్ణువు) హరుడు (శంకరుడు). ఆ పాదాలు భూమ్యాకాశాలను ఆక్రమించినవి అనగా వామనావతారంలో విష్ణువు పాదాలు లేదా నృత్యము చేయుచున్నవి అనగా శివుని తాండవ నృత్యము. ఆ సందర్భమున కుమార గణేశ, బ్రహ్మాది దేవతలు, భూమి యందు రాజుల నుండి బాలులు వరకూ అందరూ భయకంపితులైనారు. మేరు పర్వతము లేదా కైలాస పర్వతము ఆ సంభ్రమ సన్నివేశమున పెకలింపబడినట్లు ధ్వనులు చేయుచూ ఊగినవి. సూర్యుడు స్పష్టముగా కంపించెను. జ్ఞానాభిలాషులు భ్రమలు పోగొట్టే ఆ పాదములు మోక్షగాములకు ప్రియ స్థానములు. వాటిని చూచి రవ్యాది గ్రహములు దడదడలాడినవి. దేవతల ఆనంద ధ్వనులతో ఆ పాదములు నృత్య క్రీడలో స్నేహము చేసినవి. అనగా వాద్యములకు అనువుగా నాట్యము చేసినవి.
No comments:
Post a Comment