Saturday, 16 August 2025
****భోగినీ దండకము ***
భూపాలగోపాలగోపాలికాకృష్ణగోపాలు గోపాలదేవోత్సవ క్రీడలో మేడలో నుండి జాలాంతరాళంబులన్ వారయోషాతనూజాత విద్యానయోపేత సౌందర్య చాతుర్య విఖ్యాత చంచద్గుణోపేత భృంగాంగనాలబ్ధ కేళీ మహాహస్తకంజాత సంకాశ తూణీనిరుద్ధ ప్రసూనేషు నీకాశయై యుండి దర్శించి తద్వైభవంబుల్ విమర్శించి సంతోష బాష్పాంబు పూరంబు వర్షించి హర్షించి కందర్పబాణాహతిం జెంది లోఁ గుంది మోహించి సంగంబు నూహించి యే వేళఁ దల్లిన్ బ్రమోషింతు? నేలీల భూపాలకున్ జేరి భాషింతు? నేరీతిఁ గామానలంబున్ నివారింతు? నేనాతితోడన్ విచారింతు? నే వెంట రాచూలి వంచింతు? నేవంకఁ గోర్కుల్ ప్రశంసింతు? మున్నేఁ బ్రశస్తార విందంబు నైనన్ మహీపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబునై యుందుఁబో రత్నహారంబునైనన్ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుఁబో! యేల యిట్లైతి? నెట్లో గదే! యంచు శంకించుచున్ నిత్యకల్యాణు లీలావతీ పంచబాణున్ మనోవీథి నంకించుచున్ ఘోషమాణాలికిన్ మందవాతూలికిన్ జంద్రమః కీలికిన్ గోకిలారావ దంభోళికిన్ జిత్తభూభల్లికిన్ దల్లికిన్ లోఁగి సంతాప ఘర్మాంబులన్ దోఁగి కామానలజ్వాలలన్ వేఁగి చింతా భరా క్రాంతయై క్రాఁగి చింతించు నింతిన్ బరీక్షించి బుద్ధిన్ విచక్షించి తన్మాతమాయాపరాభూత జామాత మిథ్యానయోపేత విజ్ఞాత నానావశీకార మంత్రౌషధవ్రాత లోకైక విఖ్యాత వారాంగనాధర్మ శిక్షాది సంభూత సమ్మోహితానేక రాజన్య సంఘాత వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచి కూఁతున్ బరీక్షించి నీతిన్ విచారించి బాలన్ గళత్కుంతల వ్రాతఫాలన్ గరాంభోజ రాజత్కపోలన్ సమందోష్ణ నిశ్శ్వాసజాలన్ విపర్యస్త సన్యస్తచేలన్ మహాందోళన ప్రేంఖిత స్వర్ణడోలన్ మృగేంద్రావలగ్నన్ దయావృష్టిమగ్నన్ మనోజాగ్నిభగ్నన్ నిరంధన్ బరిస్రస్త ధమ్మిల్ల బంధన్ సముద్విగ్న మోహాను బంధన్ నిరాలాప నాలాపనస్వీకృతానేక కేయూరహారన్ గలద్పాష్పధారన్ బరిత్యక్త లాస్యన్ బరాభూత లీలావయస్యన్ బదాలేఖనాలక్షిత క్షోణిభాగన్ బరిక్షీణరాగన్ విలోకించి బుద్ధిన్ విచారించి లోనం బరాయత్తయై చిత్తజాతాసిధారాచలచ్చిత్తయై విన్నయై ఖిన్నయై యున్న భావంబు భావించి నెయ్యంబు గావించి రావించి..
-భోగినీ దండకము

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment